CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 226

స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు

stutinchu stutinchu prabhu yesu ne stutinchu

Jeremiah 31:3

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తుతించు - స్తుతించు - ప్రభు యేసు నే స్తుతించు (2)నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే (2)జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే (2)
1. ప్రేమించెను నిన్ను ఆయనే - శాశ్వత ప్రేమచే ఏర్పరచు కొనె నిన్ను - భూమి పుట్టకమునుపే (2) దేవుడే నరరూపియాయె - ఆయన పేరు యేసు ప్రభు (2) ఆయన పేరు యేసు ప్రభు
2. యాకోబును సృజియించే - ఇశ్రాయేలుకు రూపునిచ్చె నీకు తోడైయుందున్ - భయపడకుమని పలికె పేరు పెట్టి పిలిచి - నా సొత్తు నీవనెను - నా సొత్తు నీవనెను
3. ప్రేమించి నన్ను రక్షించె - స్తుతి చెల్లించి పూజింతున్ తన రూపము నాకు నిచ్చె - ఆరాధించి ఘనపరతున్ పరలోక పౌరినిగా చేసెన్ - హృదయార్పణ నర్పింతున్ హృదయార్పణ నర్పింతున్
4. సహవాసములో నిలిచి - ప్రత్యక్షత యందుండి ఏమి సంభవించినను - ప్రభు పక్షము నుండవలెన్ అంతమందు బహుమానమిత్తున్ - అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా

Back to Hebron Seeyonu Geethalu