పల్లవి:ఓ జగద్రక్షకా, విశ్వవిధాత - రక్షణ నొసగితివి (2)సర్వకృపలకు దాతవు నీవే (2)- బలియైతివి మాకై (2)
1. కృపద్వారా రక్షణ మాకొసగె (2)- విశ్వాసము ద్వారానే (2) అపాత్రులమైనట్టి మాకు (2)- యిది నీ వరమేగా (2)
2. పాపములో మేము మరణించినప్పుడు - వచ్చితివి యిలకు ప్రభువా మేము నీ చెంతనుండ - జీవము నిచ్చితివి
3. పాపభారముచే పడిచెడియున్న - మమ్మును గాంచితివి కృప ద్వారానే మమ్మును పిలిచి - శాంతిని వొసగితివి
4. రక్షణ సందేశమును ప్రభువా - ప్రచురము చేసితివి రయముగ విశ్వసించిన మాకు - ఆత్మను వొసగితివి
5. మరుగైన వాటిని అజ్ఞానులకు - బయలుపరచితివి మర్మములను గ్రహియించుటకు - జ్ఞానము నొసగితివి
6. సేవను మాకు నిచ్చితివయ్యా - యుగయుగముల వరకు శక్తిమంతులమై నిను స్తుతియింప - విజయము నొసగితివి