CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 216

అనుదినము మా భారము - భరించే దేవా

anudinamu maa bhaaramu - bharinche devaa

Psalms 68:19

More
Reference recording on YouTube ↗
పల్లవి:అనుదినము మా భారము - భరించే దేవా (1)అనిశము నీ మేళ్ళతో - నింపుచున్నావు (2)
1. సన్నుతించు మనిశము - నా ప్రాణమా యేసుని (2) పరిశుద్ధ నామమును - పొగడు మెప్పుడు (2) ఒంటె బరువు దీవెనలు - వీపున మోపె (2)
2. నా శరీరమున ముల్లు - బాధపరచుచుండగా వేదనతో వేడగా - ధైర్యమిచ్చితివి నా కృప నీ కెల్లప్పుడు - చాలునంటివి
3. అపరాధముతో మేము చిక్కుకొని యుండగా నీ రక్తముచే మమ్ము - విమోచించితివి నీదు కృపా మహదై-శ్వర్యంబును బట్టి
4. అన్నిటిలో నెప్పుడు - సకల సంపదలతోను సమృద్ధితో మమ్ములను - సాకుచుంటివి కృపా క్షేమములను మాపై - కుమ్మరించితివి
5. సర్వవేళల సంతృప్తిని - నేర్పినావు మాకిల సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి బలపరచుము నిన్ను బట్టి - బలుడగు దేవా

Back to Hebron Seeyonu Geethalu