పల్లవి:కృపగల దేవుని కొనియాడెదము - కృపచాలు నీకనే ప్రభుయేసు (2)
1. పాపములెన్నియో చేసినవారము (2) - నెపములెంచక తన ప్రాణమిడె (2) కృపద్వారానే రక్షించె మనల (2)
2. కృపయు సత్యమును యేసు ద్వారనే - కృపగల దేవుడు ఈ భువికి వచ్చె కృపతోడనే గాచును మనల
3. సర్వకృపానిధియగు మన దేవుడు - పరిపూర్ణత నిచ్చి బలపరచును స్థిరపరచి కాయున్ దుష్టుని నుండి
4. సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్ - సర్వకాలము ప్రభుతో నిలుచుందుము సర్వము మీవని బోధించె
5. శ్రమయైనను సిలువ బాధైనను - శ్రమనొందిన క్రీస్తు ప్రభువుతో క్రమముగా కృపచే సాగెదము
6. ఇక జీవించువాడను నేను కాను - ఇక జీవించుట నా ప్రభు కొరకే సకలంబు ప్రభున కర్పింతున్
7. నేనేమై యుంటినో అది ప్రభు కృపయే నన్ను నడిపించును ప్రభువు సదా - పెన్నుగా నేర్పును హల్లెలూయ