పల్లవి:స్తుతియించు ప్రియుడా సదా యేసుని - ఓ ప్రియుడా సదా యేసుని (2)
1. నరకము నుండి - నను రక్షించి - పరలోకములో చేర్చుకొన్నాడు (2)
అను పల్లవి:ఆనంద జలనిధి నానందించి - కొనియాడు సదా యేసుని (1) ||స్తుతి||
2. సార్వత్రికాధి - కారి యేసు - నా రక్షణకై - నిరు పేదయాయె ||ఆనంద|
3. పాపదండన - భయమునుబాపి - పరమానందము - మనకొసగెను ||ఆనంద||
4. మన ప్రియయేసు - వచ్చుచున్నాడు మహిమ శరీరము - మనకొసగును ||ఆనంద||