CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 198

నా మనోనేత్రము తెరచి

naa manonetramu terachi

Ephesians 1:17

More
Reference recording on YouTube ↗
పల్లవి:నా మనోనేత్రము తెరచి - నా కఠిన హృదయమును మార్చి (2)
అను పల్లవి:అంధకారములో నేనుండ (2) - వెదకి నన్ రక్షించితివి || నా ||
1. నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి (2) కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) - పొందినన్ విడిపించితివి (1)
2. వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేర సర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా
3. ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా! బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా
4. ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యా విరిగి నలిగిన హృదయముతో - అర్పింతు ఆత్మార్పణను
5. నీ సన్నిధిని నే కోరి - నీ సన్నిధిలో నేమారి స్తుతి పాత్రగ ఆరాధింతున్ - యుగ యుగములు సర్వయుగములు

Back to Hebron Seeyonu Geethalu