పల్లవి:యేసు నీకే జయం జయము (2) - నీవె లోక పాల - కుడవు (2)సర్వ సృష్టికి సృష్టి - కర్తవు - సర్వలోక రక్ష - కుడవు (2)జై జై అనుచు నీ - కే పాడెదం (2)
1. జన్మించె జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై - తానె బలియాయె (2) పాపియైన మానవుని రక్షింప - శిలువ నెక్కి తన ప్రాణము నిచ్చెన్ 2" హల్లెలూయా భువిపైన (2)
2. మరణము ద్వారా - అంతమాయె బలులు - తన సమాధి, సర్వం కప్పెన్ తిరిగి లేచుటచే, సర్వం నూతనమాయె సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి హల్లెలూయా భువిపైన
3. స్వర్గం వెళ్ళి, గొప్ప స్వాగతమొందెన్ తండ్రి కుడిప్రక్కన, ఆయన కూర్చుండెన్ రాజుల రాజై, ప్రభువుల ప్రభువై - పొందె అధికారము పరలోకముపై హల్లెలూయా భువిపైన
4. తన రూపమునకు మార్పు, నిష్టమాయె సృష్టికంటె ముందు తానే సంకల్పించె లోక దుఃఖము నుండి - మనం తప్పించుకొని తన రూపము నొంది - తనతో నుండెదం హల్లెలూయా భువిపైన