పల్లవి:స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ - నా ముక్తి దాతకేఆత్మసత్యముతో - ఆరాధించెదన్ - హృదయపూర్వక - కృతజ్ఞతలన్సదా సర్వదా చెల్లింతున్ - (2) స్తుతియూ
1. కొనియాడెదన్ నీదు కల్వరి ప్రేమను - వర్ణించలేను నీ అపార ప్రేమను (2) ఘోరవేదన - సంకట శ్రమలన్ - శపిత సిల్వపై క్రీస్తు సహించెను తండ్రి చిత్తము నూ నెరవేర్చెను - (2)
2. కీర్తించెదా నీదు అపారకరుణకై - పరమ పుత్రుండు వేదన నోర్చెను అవమాన నిందలు - మోముపై ఉమ్మియూ ప్రేమతో అన్నియూ సహించె మౌనమున్ అమూల్య ప్రాణమిచ్చె మానవాళికే (మనకొరకే)
3. కృతజ్ఞత చెల్లించెద నీ బలిదానమునకై - అంతులేని నీ గొప్ప ప్రేమకై అనంత జీవము మహిమ నిరీక్షణ - నా జీవితమునకే ఆధారమాయె క్రీస్తుకే పాడెదన్ హల్లెలూయ