CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 19

వ్యసనపడకుము నీవు చెడ్డవారలను జూచినయపుడు

vyasanapadakumu neevu cheddavaaralanu joochinayapudu

Psalms 37:1-25

More
Reference recording on YouTube ↗
పల్లవి:వ్యసనపడకుము - నీవు - చెడ్డవారలను జూచినయపుడు (1)మత్సరపడకుము - నీవు - దుష్కార్యములు చేయువారిని జూచి (1)
1. వారు గడ్డివలె త్వరగా (1)- ఎండిపోదురు (2) పచ్చని కూరవలె వారు - వాడిపోవుదురు - ఆ (2) ... నీవు
2. యెహోవా యందు నమ్మికయుంచి - మేలు చేయుము దేశమందు నివసించి సత్యము - ననుసరించుము - ఆ ... నీవు
3. నీవు యెహోవా ప్రభునిచే - సంతసించుము అయన నీదు హృదయములో - ని వాంఛలను తీర్చును - ఆ ..నీవు
4. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము ఆయనను నమ్ముకొనుము నీదు - కార్యము నెరవేర్చును - ఆ .. నీవు
5. నీ నీతి నిర్ధోషత్వంబును - వెల్లడి పరచును మౌనముగా నుండి అయన కొరకు - కనిపెట్టుకొనుము - ఆ ... నీవు
6. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము నీ కది - కీడు కే కారణము - ఆ ... నీవు
7. భక్తిహీనులు నీతిమంతులమీద - పండ్లు కొరుకుదురు వారికాలము వచ్చి యుండుట ప్రభుజూచి నవ్వుచున్నాడు - ఆ ... నీవు
8. నీతిమంతునికి కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనము - కంటే శ్రేష్ఠము - ఆ ... నీవు
9. నీతిమంతులు ఆపత్కాలమందు - సిగ్గునొందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు - ఆ ... నీవు
10. ఒకని నడత యెహోవాయే - స్థిరము చేయును ఆయన వానిప్రవర్తనను జూచి - ఆనందించును - ఆ ... నీవు
11. యెహోవా అతని చేతిని - పట్టి యుండెను అతడు నేలను పడినను లేవ - లేక ఉండదు - ఆ...నీవు
12. నీతిమంతులు విడువబడుటగాని - వారి సంతానము భిక్షమెత్తుటగాని - నేను చూచి యుండ లేదు - ఆ ....నీవు

Back to Hebron Seeyonu Geethalu