పల్లవి:పొందితిని నేను ప్రభువా నీ నుండి - ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు (2)
1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని (2) ఇంతవరకు నాకుతోడై యుండి (2) ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా (2) నా రక్షణ కర్తవు నీవైతివి (2)
2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకారశక్తుల ప్రభావమునుండి నీ రెక్కల చాటున నను దాచితివయ్యా - నీవే ఆశ్రయ దుర్గం బైతివి
3. కష్టదుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే భయభీతి నిరాశలయందున ప్రభువా బహుగా దైర్యంబు నా కొసగితివి
4. నా దేహమందున ముల్లు నుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్ వ్యాధి బాధలు బలహీనతలందు - నీ కృపను నాకు దయచేసితివి
5. నీ ప్రేమచేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్టపరీక్షల యందున ప్రభువా - జయజీవితము నాకు నేర్పించితివి