పల్లవి:ఘనత మహిమ ప్రభుకే (2) -తర తరములలో తనకే చెల్లును గాక (1)ఘనత మహిమ ప్రభుకే (1)
1. నీతిమంతుడు మహానీయుడు (2) - స్తుతికీర్తనలతో సన్నుతించెదము (2) అద్భుతములను చేయు దేవుడు (2) - వినుతించెదము విమలాత్ముడని (2)
2. పావన ప్రభుయేసుండు - పరమ దీవెనలు మనకిచ్చెను తరతరములలో ఎరిగిన తండ్రిని - నిరంతరము స్తుతియించెదము
3. మనలను సిలువ రక్తముతో - కొని సమకూర్చెను సంఘముగాను తన శిరసత్వములో మనలుంచి - మనల నడుపు రారాజునకే
4. మాట తప్పని దేవుడేగ - మేటిగ నెరవేర్చె వాగ్దానము ధీటైన జనముగ మము జేసెనుగ - మెండుగ మమ్ము దీవించెనుగా
5. పరమప్రభువు మనకొరకు - అర్పించుకొనెను తన్ను తానే సర్వము మనకు యిచ్చిన ప్రభునే - సర్వద మనము సంస్తుతియించెదము