పల్లవి:ప్రణుతింతుము మా యెహోవా - పరిపూర్ణ మహిమ ప్రభావా (1)ప్రబలెన్ నీ రక్షణ మా విభవా (2)
1. నేను నిదురబోయి మేలు కొందును (2) నాపైన పదివేలు మోహరించినను (2)- నేనెన్నడు వెరువబోను (2)
2. నా మీదికి లేచి భాధించువారు వానికి రక్షణ లేదనువారు - వేలాదిగా నిల్చినారు
3. యెలుగెత్తి యెహోవా సన్నిధియందు విలపించి వేడినయట్టి దినమందు - వింతగ రక్షించితివంచు
4. రక్షణనిచ్చుట మన యెహోవాది రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు - రంజిల్లు నీ ధరణియందు
5. నీ అందచందాల మోము మెరిసింది నీ మాటలమృత ధారలొలికింది - నిన్నే ప్రేమించి పూజింతున్