పల్లవి:దేవునికే మహిమ (2) - యుగయుగములకు కలుగును గాక (2)దేవునికే మహిమ (2)
1. దేనికి దేవుడు శిల్పియు, నిర్మాణకుడో (2) దానికి మనలను వారసుల జేసెను (2)- వందనములను చెల్లింతము (2)
2. నిలవరమైనది మనకిల లేదని - వల్లభుడు స్థిరపరచెను పరమందు చెల్లించి స్తుతులను పూజింతుము
3. సీయోను పురమగు దేవుని నగరుకు సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే - స్తోత్రగీతములను పాడెదము
4. పరదేశులుగా మనలను చేయక - ప్రభుని యింటికి వారసులుగ జేసె పాడి పొగడెదము మన ప్రభుని
5. శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను ముదమారగను ప్రణుతింతుము