CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 164

నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించెను

needu vishvaasyata maa prabhu yesu antarikshamu nadhigaminchenu

Deuteronomy 7:9,Psalms 36:5, 1 Thessalonians 5:23,24, Ecclesiastes 3:23

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు - అంతరిక్షము నధిగమించెను (2)
1. నిను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి (2) నిబంధనను స్థిరముగ జేసి (2) నిరతము నలరారెడు మా ప్రభువా (2)
2. వేయి తరముల వరకు సరిగా - విలసిల్లేటి వెలలేని మా వింతల కృపాంబుధి యగుదేవా యెంతయో నిను స్తుతియింతుము కోరి
3. నీ సత్య సంధత్వ మహిమ - నిరతము నిలయం సంస్తుతులకు మెరసెను నా మదిలోన దేవా మరువగ లేమీ మధుర ప్రేమ
4. ఎంతైనను నమ్మదగిన - వింతైన నీ విశ్వాస్యత వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగ ప్రతి దినము యేసు ప్రభో
5. మన ఆత్మనుజీవము దేహమును - మన ప్రభుయేసు రాకడవరకు వొనరుగ కాపాడును పదిలముగా దిన దినమును నిందారహితముగ
6. తండ్రికుమార శుద్ధాత్మకును - తర తరములకు మహిమ ఘనత పరిపూర్ణముగా ప్రబలును గాక పరిపరి విధముల ప్రభు సంఘములో

Back to Hebron Seeyonu Geethalu