CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 154

దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం

devaa naa prabhuvaa ninu goorchi upponge naa hrudayam

Psalms 45:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం (2)
1. నీ నామమును నే ఘనపరచి - హెచ్చించి పూజింతున్ (2) శ్లాఘించి కొనియాడుటలో - నాకిచ్చిన నీ కృపకై (2)
2. ఎండిన భూమిలో లేత మొక్కవలె - పలుశ్రమలను పొందితివి వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది - నా శిక్షను పొందితివి
3. దవళవర్ణుడ రత్నవర్ణుడవు - నా ప్రియుడవు నీవే ప్రభూ పదివేలలో నిను గుర్తించెదను - నా పరమ పితా నిన్ను
4. గొర్రెపిల్ల పెండ్లి విందునందు - రారాజు రూపమును నిరతంబును చూచె నిరీక్షణతో - నింగిని నే జూచెదను

Back to Hebron Seeyonu Geethalu