CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 15

యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతియించెద

yehovaa naa devaa nityamu nenu ninnu stutiyincheda

Psalms 30:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవా నా దేవా నిత్యము - నేను నిన్ను స్తుతియించెద (2)హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ (2)
1. యెహోవా నా శత్రువులను - నా పై సంతోషింపనీయక (2) నీవు నన్నుద్ధరించినందుకై నేను - నిన్ను కొనియాడుచున్నాను (2)
2. నేను నీకు మొరపెట్టగా - నీవు నన్ స్వస్థపరచితివి పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి - భక్తులారా ప్రభున్ కీర్తించుడు
3. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి నేను సమాధిలోకి దిగకుండగ - నీవు నన్ను బ్రతికించితివి
4. ఆయన కోపము నిమిషమే - దయ ఆయుష్కాలముండును ఏడ్పు వచ్చి రాత్రియుండిన ఉదయ - మున సంతోషము కలుగును
5. నే నెన్నడు కదలనని నా - క్షేమ కాలమున తలచితి యెహోవా దయ కలిగి నీవే నా - పర్వతము స్థిరపరచితివి
6. నీ ముఖము నీవు దాచిన - యపుడు నేను క్షోభిల్లితి యెహోవా నీకే మొర పెట్టితిని - నా ప్రభువును బ్రతిమాలు కొంటిని
7. నేను సమాధిలోకి దిగిన - నా ప్రాణము వలన లాభమా మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా
8. నా అంగలార్పును నీవేగా - నాట్యముగా మార్చియుంటివి నా గోనెపట్ట విడిపించి సంతోష - వస్త్రము ధరింప జేసితివి

Back to Hebron Seeyonu Geethalu