CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 138

ఆద్యంత రహిత ప్రభువా

aadyanta rahita prabhuvaa

Genesis 17:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఆద్యంత రహిత ప్రభువా - రాజులకు రాజా ప్రభు యేసూ నీవే సదా (2)
1. ఆది జనకుడు ఏదేను తోటలో - శోధనలో పడి వేధించినపుడు (2) ఆశలన్ని అడియాశలుగా జేసె (1) అధములను నీవు ఆదరింతువు - అమృతమూర్తి నీవే ప్రభూ! సాటి నీకెవరు? (2)
2. స్థానము విడచి తన మహిమ విడచి - అనుదినము నిను దూషించు వైరి ప్రధానత్వమును పాడుచేసికొని నీ ప్రభుత్వమున్ నిరాకరించిన - నీచున్ ప్రేమించితివి ప్రభూ! సాటి నీకెవరు?
3. పిలిచితివి ఇశ్రాయేలు సంతతిని - వేలకొలది వాగ్దానములతో కలిమియందున కలతలందున తొలగిపోయిన తల్లడిల్లిన - చల్లగ కాచితివి ప్రభూ! సాటి నీకెవరు?
4. రాజ్యమేలిరి రారాజు లెందరో - రాజనగరుల రత్నాల సిరులతో రాజ్యకాంక్షతో రణములు సలిపిరి రథములను చూచి సదయున్ మరచిన - నిత్య సాత్వీకుడవు ప్రభూ! సాటి నీకెవరు?
5. పరమ జనకుని పలు వాక్కు లెన్నియో - ధరను ప్రజలకు ప్రవచించు కొరకై నిర్ణయించితివి దైవజనులను పేరాశ కలిగి పెడత్రోవ నడచిన - కరుణించితివి వారిన్ ప్రభూ! సాటి నీకెవరు?
6. పాడెదన్ ప్రభూ నీ ప్రేమ గీతమ్ - పడిచెడిన నన్ను ప్రేమించితివివని కడిగితివి ప్రభు - కలుషము నెల్ల విడచిన నేను నీ జాడలన్నియు - నడిపించె నావికుడ ప్రభూ! సాటి నీకెవరు?

Back to Hebron Seeyonu Geethalu