1. క్రొత్త గీతముచే నా యుల్లముప్పొంగ యేసుని కీర్తింతును (1) పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమింతును (2)
పల్లవి:హల్లెలూయా స్తుతి హల్లెలూయా - నా ప్రభు యేసుని గూర్చి పాడెదను (1)ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన - ప్రభుని కీర్తింతును (2)
2. గత కాలమంతయు కాపాడెన్ - కష్టబాధలు కలుగకుండ తన ఆశీర్వాదంబులు నాకొసగి సుఖభద్రతనిచ్చెన్ || హ||
3. కొన్ని వేళలు క్షణకాలము - తన ముఖమును కప్పుకొనెను ప్రభువే తన కోపము మాని తిరిగి నా యెడల కుమ్మరించును కృపను || హ||
4. కరువు లధికంబగు చుండినను - ప్రభు ఆశ్రయముగనుండు పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ ప్రభు మమ్ము కాపాడెన్ || హ||
5. ప్రభు త్వరగా వచ్చును సంతసముగ - మమ్ము జేర్చను పరమందు కనిపెట్టెద మనిశం నింగిని జూచుచు ఆశతో గాంచెదము || హ||