CHURCH AT EL-SHADDAI · OFFLINE SONGBOOK

Hebron Youth Songs — Telugu

188 songs in Telugu and Roman transliteration. This saved file works without an internet connection. Select a song to open its lyrics.

188 songs

1 ప్రభు నా దేవాprabhu naa devaa

కీర్తనలు 92 : 5 "యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి!"

పల్లవి:
నా ప్రాణమెంతో నిన్ను పాడును 
గొప్ప దేవా - గొప్ప దేవా
నా ప్రాణమెంతో నిన్ను పాడును 
గొప్ప దేవా - గొప్ప దే..... వా ! (1)

చరణం 1:
ప్రభు నా దేవా - నీ చేతి కార్యములను
ఆశ్యర్యముతో నే నెంచి చూడగన్ (1)
తారలజూచి గంభీర యురుముల వినగా
విశ్వమంత నీ శక్తిన్ - కనుపరచన్ (1)

చరణం 2:
అడవులందు నే సంచరించగను
పక్షుల మధుర సంగీతముల్ వినగా
పర్వతశోభ నే పరికించి చూడ
సెలయేరుల చల్లగాలి సోక            || నా ||

చరణం 3:
ప్రియసుతుని నా కొరకై చనిపోవ
పంపుట తలచి భరించ గలనా?
సిలువ పైని నా భారమంత మోసి
పాపము తీయ రక్తము కార్చెను      || నా ||

చరణం 4:
ఆర్భాటముతో క్రీస్తు ఈ భువికేతెంచి
పరగృహమునకు నను గొనిపోయెడి వేళ
ఆనందముతో పూజించి ప్రకటింతు
ఓ నాదేవా నీవే ఘనుడవంచు!        || నా ||
2 నోరారగ చేతును దైవారాధననుnoraaraga chetunu daivaaraadhananu

కీర్తనలు 63 : 5 "ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది”

పల్లవి:
నోరారగ చేతును దైవారాధనను (2)
ధారాళముగ పాడెదను స్తోత్ర గీతమును (2)

చరణం 1:
భరియించితివి  - నా పాపపు శిక్షన్
జరిగించితివి - నీ రక్షణ కార్యము నాలో (2)

చరణం 2:
విడిపించితివి - పాప శిక్ష నుండి
నడిపించితివి - జీవమార్గము నందు

చరణం 3:
దయచేసితివి - మోక్షభాగ్యము నాకు
క్రయమిచ్చితివి - నా విమోచనకై

చరణం 4:
వెలిగించితివి - నా మనో నేత్రములు
తొలగించితివి - నా పాప చీకటి బ్రతుకున్
3 ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయముo yesu nee prema ento mahaneeyamu

యోహాను 15:13 "తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు"

పల్లవి:
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము (1)
ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది (2)

చరణం 1:
అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి (2)
ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2)

చరణం 2:
సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీద అని నేను మొర పెట్టగా
వింటినంటివి నా మొరకు ముందె తోడనుందునంటివి

చరణం 3:
మరణాంధ కారంపు లోయ నే సంచరించిన
నిరంతర మేసు నాదు కాపరియై
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు

చరణం 4:
కొదువలెన్ని యున్న భయపడను నేనెపుడు
పచ్చికబయలులో పరుండజేయును
భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు

చరణం 5:
దేవుని గృహములో సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయ ఆమెన్
4 అసమానుండగు ఓ క్రీస్తు - అద్వితీయుండగు దేవాasamaanundagu o kreestu - adviteeyundagu devaa

కొలొస్స 1 : 18 "ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము"

పల్లవి:
అసమానుండగు ఓ క్రీస్తు - అద్వితీయుండగు దేవా (1)
అల్పాయు ఓ మేగ (2) నీవే ప్రభువా (2)

చరణం 1:
ఇహపరములలో నీ జన్మ - మహానందము కలిగించె (2)
అభయము నిచ్చి మాకు - భయభీతిని బాపితివి (2)
భయభీతిని బాపితివి (2)

చరణం 2:
నీ జీవిత వాక్కులన్ని - సజీవము జనులందరికి
పావనుడా ప్రభుయేసు - అవనికి మాదిరి నీవే

చరణం 3:
మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవే
సాతానున్ ఓడించి నీతిగా మము తీర్చితివి

చరణం 4:
పాపశాపముల బాపితివే - చూపితివే పరమదారి
శక్తిగల ఓ ప్రభువా - నీకే మా స్తోత్రములు

చరణం 5:
విశ్వమంతట ఓ దేవా - శాశ్వతమైనది నీ ప్రేమ
జ్ఞానమునకు మించినది - ఉన్నతమైన ప్రేమ

చరణం 6:
సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివి
సర్వ సంపూర్ణుండా - సర్వ మహిమ నీకే
5 స్తుతుంచుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారాstutunchudi yehovaa devuni sooryachandrulaaraa

కీర్తనలు - 148 "యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి"

పల్లవి:
స్తుతుంచుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నత స్థలములో యెహోవాను స్తుతించుడి - (2)

చరణం 1:
కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2)
 ఆకాశజలమా ఆవిరిహిమమా అగ్ని తుఫానూ (2)
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా (2)
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమతండ్రిని
యెహోవాను స్తుతించుడి (1)

చరణం 2:
రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవ్వన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమతండ్రిని
యెహోవాను స్తుతించుడి
6 యేసూ నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడుyesoo nan preminchitivi - aashrayamu lenappudu

లూకా 7:13 “ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడెను”

పల్లవి:
యేసూ నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు            
నీ శరణు వేడగానే - నా పాపభారము తొలగె (1)

చరణం 1:
నేను దూరమైతి నీకు - నశియించితి లోకమున (2)
నేను గ్రహించలేదు - నీ హృదయ ప్రేమను (1)

చరణం 2:
నేను తలచలేదెప్పుడు - నా అంత మేమవునని
నా పాపములచే నేను - నిన్ను విసిగించితిని

చరణం 3:
నిన్ను నేగాంచగానే - నా జీవితము మారెను
నేనెంతో గ్రుచ్చబడి - నిన్నంగీకరించితి

చరణం 4:
రక్షణ దొరికె నాకు - రక్తముతో నన్ను కడిగి
రయముగా నీ చెంతకు - రక్షకా తెచ్చితివి

చరణం 5:
పరిశుద్ధులలో చేర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చి
పూర్ణాధికారము నిచ్చి - పరలోకము తెరచితివి
7 స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యముstuti prashansa paaduchu keertintu nityamu

కీర్తనలు 66:16 "దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను"

పల్లవి:
స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము (1)
మహారక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను (2)

చరణం 1:
పాపలోక బంధమందు దాసత్వమందుండ (2)
నీ రక్త శక్తిచే ప్రభు విమోచించితివి (2)

చరణం 2:
పాప భారముచే నేను దుఃఖము పొందితి
నా ప్రభువే భరించెను నా దుఃఖబాధలు

చరణం 3:
హృదయాంధకారముచే నేను దారి తొలగితి
ప్రభువే జ్యోతి యాయెను సత్య మార్గము జూపె

చరణం 4:
పెంటకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి
దరిద్రుడనైన నన్ను రాజుగ జేసితివి
8 క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవుkreestu yesu dayaalu prabhu - neeve srushtikartavu

2 కొరింథీ. 8:9 "ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను"

పల్లవి:
క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు (1)
నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం (2)

చరణం 1:
పాపజగాన - జన్మించితివి - పేదగృహాన - పెరిగితివి
సంకట కష్టములనుభవించి మమ్ము
రక్షించితివి (2)  ప్రియ యేసు
మమ్ము రక్షించితివి - మమ్ము

చరణం 2:
జీవిత నావ - తుఫాను చేత - తల్లడిల్లగ - ఒక్కమాటతో
  ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి - ప్రియ యేసు
 దరికి జేర్చితివి - దరికి

చరణం 3:
ఎన్నో విధాల - పోనట్టినాదు - పాపరోగము - నీవస్త్రమును ముట్టి
  నంతనే - అద్భుతముగ - నివారణాయెను
  ప్రియ యేసు నివారణాయెను
9 హృదయ మర్పించెదము ప్రభునకుhrudaya marpinchedamu prabhunaku

రోమా 12:1 "మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి"

పల్లవి:
హృదయ మర్పించెదము ప్రభునకు
స్తుతి  ప్రశంసలతో పరిశుద్ధులము చేరి (2)

చరణం 1:
పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్ (2)
పాపుల పాపము తొలగించుటకు (2)
నిత్యజీవము నిచ్చెన్ (2)

చరణం 2:
సంకట క్లేశము భరించెన్ నమ్రతతో నానుడై
రక్షణ ద్వారము తెరచెను ప్రభువు
నిత్య నిరీక్షణ నిచ్చెన్

చరణం 3:
ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే
తిరిగి వెళ్ళకు పాపమునకు
నిలువకు పాపములో

చరణం 4:
అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
కాపాడు మా జీవితముల
ఇదియే మా వినతి
10 మేము భయపడము ఇక మేము భయపడముmemu bhayapadamu ika memu bhayapadamu

యోబు 5 : 19 , యెషయా 27 :3 "నీకు ఏకీడు తగులదు, “యెహోవా అను నేను ... దివారాత్రము దాని కాపాడుచున్నాను”

పల్లవి:
మేము భయపడము ఇక మేము భయపడము (1)
ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు (2)

చరణం 1:
దైవభ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించె (2)
దివారాత్రులు దేవుడే కాయును (1)

చరణం 2:
శత్రుకోటి మమ్ము జుట్టన్ పాతాళము మ్రింగజూడన్
నిత్యుడు యేసు నిత్యము కాయును

చరణం 3:
అగ్ని పరీక్షల యందు వాగ్దానమిచ్చె మాతోనుండ
యే ఘడియైనను విడువక కాయును

చరణం 4:
బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి
పలు విధములుగా కాపాడుమమ్ము

చరణం 5:
కునుకడు మన దేవుడు యెన్నడు నిద్రించడు
కనుపాపగ మమ్ము కాపాడునెప్పుడు

చరణం 6:
జీవిత కష్టనష్టములు ఆవరించి దుఃఖపరచ
దేవుడొసంగిన ఈవులు నెంచుచు

చరణం 7:
ఇహమందు మన శ్రమలన్ని మహిమకు మార్చెడు ప్రభున్మ
హిమపరచి మ్రొక్కెదమిలలో
11 కొనియాడి - పాడి కీర్తించిkoniyaadi - paadi keertinchi

పరమగీతము 5 : 10 “నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు"

పల్లవి:
కొనియాడి - పాడి కీర్తించి - వర్ణించెద నిను  - నా ప్రభువా

చరణం 1:
పరిశుద్ధుడవు - నీతిమంతుడవు (2)  - పాపపు వస్త్రము - మార్చినదేవ
ప్రాపుగరక్షణ - వస్త్రమిచ్చితివి
పొగడెద నిన్ను - ధవళ వర్ణుడా (2)

చరణం 2:
తూర్పు జ్ఞానులు -  నీ కర్పించిరి  -బంగారు సాంబ్రాణి బోళము
తెలుపబడెను - నీ ఘన విజయము
భజియించెద - నిన్ను రత్న వర్ణుడా

చరణం 3:
గుర్తించెద నిన్ను - ఘనముగ నేను  - ఘనుడా నాకు - ప్రభుడవు నీవే
పదివేలలో నా ప్రియుడగు ప్రభువా
పరికించి నిన్ను పాడి స్తుతించెద

చరణం 4:
ఆరాధించెద - ప్రభువా దేవా - ఆత్మతోను - సత్యముతోను
తిరిగిరానై యున్నా ప్రభువా
స్తుతియు ఘనత - మహిమయు నీకే
12 ఆరాధించెద నిను మది పొగడెదaaraadhincheda ninu madi pogadeda

యోహాను 12:3 “ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను”

పల్లవి:
ఆరాధించెద నిను మది పొగడెద - నిరతము నిను స్తుతియించెదను(2)
మార్గము నీవే సత్యము నీవే (2) - జీవము నీవే నా ప్రభువా (2)

చరణం 1:
విస్తారంబగు వ్యాపకములలో - విడిచితి నీ సహవాసమును (2)
సరిదిద్దితివి నా జీవితమును (2)
నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా (2)

చరణం 2:
నా జీవితమున నీ మాటలను - వినుటయే చాలని యెరిగితిని
నా కన్నీటితో నీ పాదములను
కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా

చరణం 3:
వ్యర్థపరచితిని నా సర్వమును - స్వార్థముతో జీవించితిని
గుర్తించితిని నీ త్యాగమును
వినయముతో నీ సన్నిధి చేరి

చరణం 4:
నీ రక్తముతో నన్ను కడిగితివి - పరిశుద్ధునిగా జేసితివి
నీ రక్షణకై స్తోత్రము చేయుచు
నిత్యము నిన్ను కొనియాడెదను

చరణం 5:
దుర్గంధముతో నిండిన నన్ను - దయతో నీవు పిలిచితివి
ప్రేమతో పరమ విందు నొసంగి
ఆనందింపగ జేసిన ప్రభువా

చరణం 6:
ప్రియముగ దాచిన అత్తరు భరణి - పగులగొట్టి నిన్ను పూజింతు
నీ ప్రేమను నేనెన్నగ తరమా
నా జీవితమున చాలిన ప్రభువా

చరణం 7:
పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు - నీ సన్నిధిలో నిలచినను
లెక్కింపగ జాలని జనమందున
నను గుర్తింతువు నా ప్రియప్రభువా
13 నీదు విశ్వాస్యత మా ప్రభు యేసుneedu vishvaasyata maa prabhu yesu

ద్వితీ. 7 :9 ; కీర్తనలు 36 :5 ; 1 థెస్స. 5 : 23, 24 ; విలాప . 3:23 "యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది."

పల్లవి:
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు
అంతరిక్షము నధిగమించెను (2)

చరణం 1:
నిను ప్రేమించి నీ ఆజ్ఞలను - అనుసరించు మనుజావళికి (2)
నిబంధనను స్థిరముగ జేసి (2)
నిరతము నలరారెడు మా ప్రభువా (2)

చరణం 2:
వేయితరముల వరకు సరిగా - విలసిల్లేటి వెలలేని మా
వింతల కృపాంబుధి యగు దేవా
యెంతయో నిను స్తుతియింతుము కోరిc

చరణం 3:
నీ సత్య సంధత్వ మహిమ - నిరతము
నిలయం సంస్తుతులకు
మెరసెను నా మదిలోన దేవా
మరువగ లేమీ మధురప్రేమ

చరణం 4:
ఎంతైనను నమ్మదగిన - వింతైన నీ విశ్వాస్యత
వాత్సల్యత వెలసెను మాపై
క్రొత్తగ ప్రతిదినము యేసుప్రభో

చరణం 5:
మన ఆత్మను జీవము దేహమును - మన ప్రభు యేసు రాకడవరకు
ఒనరుగ కాపాడును పదిలముగా
దినదినమును నిందారహితముగ

చరణం 6:
తండ్రి కుమార శుద్ధాత్మకును - తరతరములకు మహిమ ఘనత
పరిపూర్ణముగా ప్రబలును గాక
పరిపరి విధముల ప్రభు సంఘములో
14 దేవా నా హృదయము - నీ యందు స్థిరమాయెన్devaa naa hrudayamu - nee yandu sthiramaayen

కీర్తనలు 108: 1-5 "దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానము చేయును"

పల్లవి:
దేవా నా హృదయము - నీ యందు స్థిరమాయెన్ (1)
నే పాడుచు స్తుతింతున్   - నా యాత్మగానము చేయున్ (2)

చరణం 1:
స్వర మండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడ (2)
        వేకువనే నే లేచెదను (2) - స్తుతిగానము చేసెదను (4)

చరణం 2:
స్వర మండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడ (2)
        వేకువనే నే లేచెదను (2) - స్తుతిగానము చేసెదను (4)

చరణం 3:
ఆకాశమున కంటె నీ - కృప మహోన్నతమైనది
      నీదు సత్యము మేఘములకంటె - అత్యున్నతమైనది   ॥దేవ॥

చరణం 4:
దేవా నీవాకాశము కంటె - మహోన్నతుడవు కమ్ము
       నీదు మహిమ సర్వభూమి మీద వ్యాపించును గాక!
15 కల్వరినాథుడా - నన్ను జయించితిkalvarinaathudaa - nannu jayinchiti

గలతీ 2 : 20 "దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనెను"

పల్లవి:
కల్వరినాథుడా - నన్ను జయించితి
రక్షింప మృతుడైన - కల్వరి నాథుడా !

చరణం 1:
అత్యంత సుందరుండును - ఎల్లరి కాంక్షణీయుడు
దేవాది దేవుడైన మా - కాల్వరి యేసునాథుడు (1)

చరణం 2:
గాయపడి శ్రమలతో - పాపదుఃఖము మోసితివి
సిల్వలో మరణించితివి - దుఃఖ కల్వరినాథుడా!

చరణం 3:
శాంతి జీవము నీయను - ఖైదీల విమోచనమునకై
రక్తపు ఊట తెరచితివి - ప్రేమ కల్వరి నాథుడా!

చరణం 4:
తెచ్చిన ఈవులెల్లను - మేలుకొరకు మనకిచ్చి
ప్రేమనదిని పోసెను - దయా కల్వరినాథుడు

చరణం 5:
మహిమపూర్ణుడగు నిన్ను - కండ్లార చూతుమనుటయే
ఇచ్చట మా ఆదరణ - సాటిలేని కల్వరీ ప్రభూ

చరణం 6:
స్ఫటిక సముద్ర తీరమున - నీ ప్రేమయందు మున్గుచు
నీ వలె నుందు నిత్యము – మహిమ కల్వరినాథుడా !
16 కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతునుkrutajnyatan talavanchi - naadu jeevamu arpintunu

2 కొరింథీ 5 : 14 "క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది.”

పల్లవి:
కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును (1)
లేదే యిక నే యీవి యిల (1) - అర్పింతును నన్నే నీకు (2)

చరణం 1:
దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్ (2)
దూరముగ నిక వెళ్ళజాల - కూర్చుండెద నీ చెంతనే (2)

చరణం 2:
ఆకర్షించె లోకాశలన్ని - లోక మహిమ నడ్డగించు
కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును

చరణం 3:
తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము
నిరంతరము సేవించినను తీర్చలేను నీ ఋణము

చరణం 4:
లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును
నీ కర్పింపన్ నే వెనుదీయన్ ఈ కొద్ది నా జీవితము

చరణం 5:
చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి
కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై
18 స్తుతింతున్ ప్రభునే జై యంచుstutintun prabhune jai yanchu
పల్లవి:
స్తుతింతున్ ప్రభునే జై యంచు (2)

చరణం 1:
మరువజాల నా దృశ్యము ప్రభు యేసువా
కల్వరిలో నీవె సిల్వన్ - వ్రేలాడితివా (1)
కాళ్ళు చేతులు శరీరమంతా గాయపర్చబడితివా (2)
గ్రహించితి నివియన్నియు నా పాపము వలనే (2)

చరణం 2:
మరువజాలనే నో దేవా - నీదు ప్రేమను
ఓర్చె శిక్ష నీ పుత్రుడే - అతి ఘనంబుగా
నాదు పాప క్రయమునంత కల్వరిపై చెల్లించెను
నే గాంచితి నిన్నే సిల్వన్ - పొందితి రక్షణ
19 యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములోyehovaa maa prabhuvaa bhoomi aakaashamulo

"యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది"

పల్లవి:
యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో (2)
మహిమ గల నీ నామము గొప్పది

చరణం 1:
పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ - బాలుర స్తుతి స్తోత్రములతో (2)
స్థాపించితివి నీవొక దుర్గము - నేదాగునట్లు ఆశ్రయ దుర్గము (2)

చరణం 2:
నీ చేతి పనియైన ఆకాశమును - చంద్ర నక్షత్రములనే చూడగా
వాని దర్శించి జ్ఞాపకము చేయ - మానవుండు ఏ పాటివాడు

చరణం 3:
నీ కంటే మానవుని కొంచెముగా - తక్కువ వానిగా చేసితివి
మహిమ ప్రభావ కిరీటమును - వానికి ధరింపజేసితివి

చరణం 4:
అడవి మృగములు ఆకాశపక్షులు - సముద్ర మత్స్యములు పశువులు
వాని పాదముల క్రింద నుంచి - అధికారము వానికిచ్చితివి

చరణం 5:
నీ నామము మా ప్రభువా యెహోవా - ఎంతో ఘనత ప్రభావము గలది
ఆ నామమును బట్టి మాకిచ్చితివి - నీ రూపమును మాకు హల్లెలూయ
20 పరమ పవిత్ర స్వర్గపిత - జై ప్రభు జై ప్రభుparama pavitra svargapita - jai prabhu jai prabhu

1 పేతురు 1: 3 None

పల్లవి:
పరమ పవిత్ర స్వర్గపిత - జై ప్రభు జై ప్రభు - సర్వసదా (2)
యుగయుగములకు - రక్షకుడా (2) - మమ్ములను రక్షించితివి (2)
జీవుండ ప్రభు పాపుల రక్షకా - జై ప్రభు

చరణం 1:
ప్రేమరూపి నీవే - నన్ను ప్రేమించితివి (2) 
శ్రమలను పొందితివి - నీ ప్రేమ మూలమున (2)

చరణం 2:
ప్రాణమిడి సిలువన్ - నన్ను రక్షించితివి
పాపము తీసితివి - నీ కృప ఉన్నతము

చరణం 3:
శత్రు సైతానున్ - ఓడించితి వీవు 
నీ మరణము వలన విమోచించితివి

చరణం 4:
శక్తి గలవాడా - చావున్ గెల్చితివి
శక్తితో లేచితివి - తండ్రితో కలిపితివి

చరణం 5:
ప్రేమగల ప్రభువా - మరల వచ్చెదవు
శ్రమలను తొలగించి - నను చేర్చుకొందువు

చరణం 6:
ప్రవాహములోన - ప్రభు నేనుండినను
నిన్ను బట్టి నే - క్షేమముగా నుందున్

చరణం 7:
జైజైయని పాడుడి - యేసునకే మహిమ
జైజై హల్లెలూయా - జైజై హల్లెలూయా
21 నా ప్రాణ ప్రియుడా యేసురాజాnaa praana priyudaa yesuraajaa

యెషయా 9:6 "... ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త... అని అతనికి పేరు పెట్టబడును"

పల్లవి:
నా ప్రాణ ప్రియుడా యేసురాజా - అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను - హృదయపూర్వక ఆరాధనతో - సత్యముగా(1)

చరణం 1:
అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా (2)
బలవంతుడా బహుప్రియుడా
మనోహరుడా మహిమరాజా - స్తుతించెదన్ (2)

చరణం 2:
విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా

చరణం 3:
గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా
మరచిన గాని నీ వెన్నడు
మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా

చరణం 4:
రక్షణాలంకారములను - అక్షయమగు నీ ఆహారమున్ర
క్షకుడా నా కొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును

చరణం 5:
నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతుల తోడ
నీ ప్రేమను నే వివరింతును విమోచకా

చరణం 6:
వాగ్దానముల్ నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ
22 స్తుతులకు పాత్రుండవుstutulaku paatrundavu

నిర్గమ. 3 : 14 "నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను"

పల్లవి:
స్తుతులకు పాత్రుండవు (2)
సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు (2)

చరణం 1:
జీవపు రొట్టె వైతివి నీవే - తృప్తి పరచిన ప్రియుడవు నీవే (2) 
గొప్ప కార్యము చేయ (2) - మా సామర్ధ్యము నీవే (2)

చరణం 2:
లోకమునకు వెలుగు నీవేగా -  మా నేత్రముల తెరచితివిగా 
అద్భుతము చేసితివి - మా ప్రకాశమునీవే

చరణం 3:
ఏకైక ద్వారం మాకిల నీవే - ప్రవేశమిచ్చి రక్షించినావు
పూర్ణ క్రియ జేసితివి - సంపూర్ణ శాంతి నీవే

చరణం 4:
మంచి కాపరి మాకై నీవిల - ప్రాణంబు నిచ్చి రక్షించితివి
విడుదల జేసితివి - గొట్టెల నడిపెదవు

చరణం 5:
పునరుత్థాన జీవంబు నీవే - మరణము నుండి దాటించితివి
విజయంబు నిచ్చితివి - నూతన పరచితివి

చరణం 6:
మార్గసత్యము మాకిలనీవే - దుర్బోధ నుండి కాపాడినావు
చేసితివి ఆత్మకార్యం - ఉన్నత స్థలమందుంచి

చరణం 7:
నిజమైన ద్రాక్షపల్లివి నీవే - నీ యందు నిలిచే తీగెలు మేము
లోతైన క్రియ చేసి - ఆత్మ ఫలమిచ్చితివి
23 రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియుruchi choochi erigitini - yehovaa uttamudaniyu

కీర్తనలు 34 : 8 "యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి"

పల్లవి:
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2)

చరణం 1:
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే (2)

చరణం 2:
మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనస్సార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్

చరణం 3:
మంచి తనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో
ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు

చరణం 4:
నా జీవితమంతయును యెహోవాను స్తుతియించెదను
నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్

చరణం 5:
సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో
ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు

చరణం 6:
ప్రార్థింతును ఎడతెగక ప్రభుసన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని

చరణం 7:
కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను
క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను
24 నమ్మకమైన నా ప్రభుnammakamaina naa prabhu

1 కొరింథీ. 10:13 "దేవుడు నమ్మదగినవాడు"

పల్లవి:
నమ్మకమైన నా ప్రభు
నిన్ను నే స్తుతింతును - నిన్ను నే స్తుతింతును

చరణం 1:
కరుణతోడ - పిల్చియు - స్థిరపరచి కాపాడిన (2)
స్థిరపరచిన నా ప్రభున్ - పొగడి - నే స్తుతింతును (2)

చరణం 2:
ఎన్నోసార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభు 
మన్ననతోడ - నీదరిన్ చేర్చినన్ క్షమించితివి

చరణం 3:
కృంగియుండు వేళలో - పైకి లేవ నెత్తితివి
భంగ పర్చు - సైతానున్ - గెల్చి విజయమిచ్చితివి

చరణం 4:
నాకాశ్రయ శైలమై - కోటగా నీవుంటివి
ప్రాకారంపు యింటివై - నన్ను దాచి యుంచితివి

చరణం 5:
సత్యసాక్షివైయుండి - నమ్మదగినవాడవై 
నిత్యుడౌ మా దేవుడా - ఆమెనంచు పాడెద
25 రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవాrakshakudaa yesu prabho stotramu devaa

రోమా 8 : 35 "క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు?"

పల్లవి:
రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా (1)
స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2)

చరణం 1:
దేవుడే నా పక్షమైన విరోథెవ్వడు?   (2)
దూతలైనను - ప్రధానులైనను (2) 
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా? (2)

చరణం 2:
నరరూపమెత్తి ప్రభువు రక్తుడాయెను
కరువైనను - ఖడ్గమైనను
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?

చరణం 3:
సర్వలోక రక్షణకై - సిలువనెక్కెను
శ్రమయైనను - బాధయైనను
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?

చరణం 4:
ఎంచలేని యేసు నాకై - హింసపొందెనే
హింసయైనను - హీనతయైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?

చరణం 5:
మరణమున్ జయించి క్రీస్తు - తిరిగి లేచెను
మరణమైనను - జీవమైనను
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?

చరణం 6:
నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెను - ఎత్తైనను లోతైనను 
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?

చరణం 7:
ఎన్నడైన మారని మా యేసుడుండగా - ఉన్నవైనను - రానున్నవైనను 
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?
హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
26 జయమనిపాడు జయమనిపాడు ప్రభుయేసునకేjayamanipaadu jayamanipaadu prabhuyesunake

ఎఫెసీ 1 : 18 "పరిశుద్ధులలో ఆయన స్వాస్త్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిడో"

పల్లవి:
జయమనిపాడు జయమనిపాడు ప్రభుయేసునకే (1)
మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే (2)

చరణం 1:
ఆది అంతము అల్ఫా ఓమేగ ఆయనే ప్రభువు (2)
ఆయన యేగా రానున్నవాడు - శక్తిమంతుడు (2)

చరణం 2:
ప్రభు యేసునందు మమ్మును పిలిచి ఏర్పరచుకొనెను
ప్రేమతో మమ్ము పవిత్ర పరచి నిర్దోషులుగ తీర్చె

చరణం 3:
యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి
యెంతో కృపతో మమ్మును కడిగి - మన్నించి నావుగా

చరణం 4:
యేసులో మాకు యేశిక్షలేదు భయము బాసేగా
వాసిగ మరణ బలము తొలగించి పాపము బాపెగా

చరణం 5:
క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెను
కరుణించి మమ్ము అంగీకరించె ఎంతో అద్భుతము

చరణం 6:
మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మముద్రనిచ్చెను
మనోనేత్రములు వెలిగించి మాకు - గొప్ప నిరీక్షణ నిచ్చె

చరణం 7:
ప్రభు క్రీస్తులో వాడబారని స్వాస్థ్యముగ నైతిమి
పరిశుద్ధులలో మహిమైశ్వర్యంబు - యెంతో గొప్పది
27 దేవాది దేవా - ప్రభువుల ప్రభూdevaadi devaa - prabhuvula prabhoo

మత్తయి 14:27 ,యెషయా 43 :1 "భయపడకుడి." "నీవు నా సొత్తు"

పల్లవి:
దేవాది దేవా - ప్రభువుల ప్రభూ (1) - రాజుల రాజా హల్లెలూయ (2)

చరణం 1:
నీ రక్తముతో విమోచించి -  నీ రక్తముతో సంపాదించి (2)
పరలోకరాజ్య ప్రజలతో జేర్చి
పరలోకపాటన్ నాకొసగితివి (2)

చరణం 2:
జీవిత నావలో తుఫాను రేగ - భయపడకుడని అభయమునిచ్చి 
జయప్రదముగా నన్ను నడిపించి
జయజీవితము నాకొసగుచున్న

చరణం 3:
పేరు పెట్టినన్ ప్రేమతో పిలిచి - కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి
అరమర లేక నన్నాదరించి 
పరలోక దర్శనంబిచ్చితివి

చరణం 4:
మరణ పాత్రులం ఈ ధరణిలోన - దురిత ఋణముల స్మరణను మాన్పి
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము
నీ రాజ్యమందు రాజులన్ జేసి

చరణం 5:
శోధనగాధల కష్టములలో - నా దుఃఖములలో నే నేడ్వకుండ 
నీ దయ నాపై నిండారనింపి
ఓదార్చి నన్ను నీ దారినడువు

చరణం 6:
ప్రతి వత్సరము దయతోడ నింపున్ - ప్రభు జాడలు సారముజల్లున్
ప్రతి బీడునూ సారము చిలకన్ 
ప్రతి పర్వతము ఆనందించున్

చరణం 7:
పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట - సర్వశక్తి గల క్రీస్తుని యెదుట
పరలోక నూతన గీతము పాడ 
జేర్చితివి నన్ నీ జనము జనము నందు
28 ఆనందముగా యెహోవా నీ కృపలన్నిaanandamugaa yehovaa nee krupalanni

విలాపవాక్యములు 3 : 23 "నీవు ఎంతైన నమ్మదగినవాడవు"

పల్లవి:
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని 
 అన్ని కాలాంబులందు కీర్తించెదన్ (2)

చరణం 1:
చావు గోతి నుండి లేవనెత్తి నాకు - జీవమిచ్చిన జీవదాత (2) 
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున్ (2)

చరణం 2:
సింహపు పిల్లలు - ఆకలిగొనును యెహోవా సహాయుడందరికి 
ఇహమందున ఏ మేలు కొదువయుండదు 
ఆహా! ఏమందు నీ విశ్వాస్యతన్

చరణం 3:
ఎన్నెన్నో శోధన బాధలు రేగి - నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్నతండ్రీ నిన్ను కొనియాడెదన్

చరణం 4:
చావు చీకట్ల లోయలందున - జీవపు వెలుగై త్రోవ జూపి
దేవా తోడై నడిపించితివి నీ కృపన్
వివరించెదన్ నీ విశ్వాస్యతన్

చరణం 5:
నీతి న్యాయంబులు - ఆధారములై - నీ సింహాసనమున - నిలిచినవి 
నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్
నిరతంబు వెలసి నిలిచినవి

చరణం 6:
పర్వతంబులు - పారిపోయినను - ఉర్విలో మార్పు - కలిగినను 
తరుణములు విరోధముగ పై లేచిన 
స్మరియించెద నీ విశ్వాస్యతన్
29 స్తుతులు నీ కర్పింతుముstutulu nee karpintumu

కీర్తనలు 36 : 8 "నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు"

పల్లవి:
స్తుతులు నీ కర్పింతుము - సతతము మా ప్రభువా సన్నుతించెదం (2)

చరణం 1:
గడచినట్టి కాలము - కరుణతో నన్ గాంచితివి (2)
వెల లేనట్టి నీ కృప - చూపినట్టి మా ప్రభు (2)

చరణం 2:
నాదు దినములన్నిటిన్ - నీదు క్షేమ మేలును
నీదు జాడలన్నియున్ - సారంబు నిచ్చును

చరణం 3:
నీదు మందిరంబులో - మేలుచేత మమ్మును
తృప్తి పరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును

చరణం 4:
నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులను
నాథుడా నే పాడెద - నాదు ప్రియ ప్రభువా

చరణం 5:
సత్యరూపి నీవెగా - సకల సృష్టికర్తవు 
సతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం
30 నా పాపములను క్షమియించెన్naa paapamulanu kshamiyinchen

"నీవు నా పాప దోషమును పరిహరించి యున్నావు"

పల్లవి:
నా పాపములను క్షమియించెన్ - ప్రభు నా నేత్రములను వెలిగించెన్ (1)
ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ - ప్రాణమును నాకొరకొసగెన్ (1)

చరణం 1:
మలిన వస్త్రములతో నేను - చెడిన హృదయముతో నేను (2) 
కలువరి సిలువను చేరన్ (2)

చరణం 2:
మరణము నుండి నా ప్రాణమును - కన్నీటి నుండి నా కన్నులను
తప్పించెను నా తండ్రి

చరణం 3:
నా జీవిత కాలమంతయును - నే నాయనకు మొరపెట్టెదను 
నా ప్రభు నా మొర వినును

చరణం 4:
యెహోవా బహుదయాళుండు - నీతి న్యాయము గల దేవుండు 
సాధువులను గాపాడున్

చరణం 5:
మందిర ఆవరణములో నేను - యెరూషలేమా నీ మధ్యను
నా ప్రభునే స్తుతియింతున్

చరణం 6:
యెహోవా తన స్వాస్థ్యముగానన్ - బహుగా తన మహిమను 
జూపించన్ - బహుప్రియమున నను బిలచెన్
31 పొందితిని నేను ప్రభువా నీ నుండిponditini nenu prabhuvaa nee nundi

2 కొరింథీయులకు 9 : 15 “చెప్పకస్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.”

పల్లవి:
పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్ఠయీవిని ఈ భువియందు (2)

చరణం 1:
జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2)-ఇంతవరకు నాకు తోడై యుండి (2)
ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా (2)
నా రక్షణ కర్తవు నీవైతివి (2)

చరణం 2:
గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకార శక్తుల ప్రభావము నుండి
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా
నీవే ఆశ్రయ దుర్గంబైతివి

చరణం 3:
కష్టదుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే   
భయభీతి నిరాశలయందున ప్రభువా
బహుగా ధైర్యంబు నా కొసగితివి

చరణం 4:
నాదేహమందున ముల్లు నుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్
 వ్యాధి బాధలు బలహీనతలందు
నీ కృపను నాకు దయచేసితివి

చరణం 5:
నీ ప్రేమ చేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
కష్ట పరీక్షల యందున ప్రభువా
జయజీవితము నాకు నేర్పించితివి
32 ఆరాధనలకు యోగ్యుడవుaaraadhanalaku yogyudavu

ప్రకటన 5:12 "వారు -వధింపబడిన గొఱ్ఱెపిల్ల , శక్తియు... మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి"

పల్లవి:
ఆరాధనలకు యోగ్యుడవు (2) - స్తుతి గీతంబులకు పాత్రుడవు (2) 
 ప్రభుయేసు నిన్ను పూజింతును (2) - మనసార నిన్నే కీర్తింతును (2) 
ఆరాధనలకు - యోగ్యుడవు (2)

చరణం 1:
భరియించితివి నా రోగములన్ - భరియించితివి నా వ్యసనములన్ (2) 
అరిగితివి నాకై కలువరికి (2) - పరిహరించితివి పాప శిక్షన్ (2)

చరణం 2:
నా యతిక్రమములకై గాయపడి - నా దోషములకై కొట్టబడి 
చిందిన సిలువ రక్తములో - నా దారిద్య్రము  తొలగించితివి

చరణం 3:
నశియించిన నను వెదకితివి - నశియించిన నను లేపితివి
నా శాపమును చూపించితివి - నీ శాంతముతో క్షమించితివి
33 పూర్ణ హృదయ స్తోత్రముల్poorna hrudaya stotramul

ప్రకటన 7:10 "మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహా శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి"

పల్లవి:
పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెద ప్రభునకే (2)

చరణం 1:
ఎర్పరచుకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2)
పాపినైన నాకు ఆయనే రక్షణ నిచ్చెన్ (2)
పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్ (2)

చరణం 2:
నా హృదయ పాపములను తన రక్తములో కడిగెన్
మృతమైన నా ఆత్మను జీవింపజేసె ప్రభు
ఉచితంబుగానే పొందితి నిత్య జీవం

చరణం 3:
నే పాప బంధములో నుండ హృదయమ శాంతితో నిండె
నా పాపమొప్పుకొనగా కడిగెను రక్తములో
శాంతి ఆనందముతో నన్ను నింపెన్

చరణం 4:
వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్
"పాపిని నను ప్రేమించెన్ మరువలేనా ప్రేమను
ప్రశంసలను పాడెద ప్రభునకే

చరణం 5:
నిత్య రాజ్యము నన్ను చేర్చ నిత్య నిబంధన చేసె
సుఖదుఃఖములందైన ముగింతునాదు పరుగున్స్థి
రముగ నుందు పరమును చేరువరకు
34 ఘనమైన యేసునామం- ప్రతినోట నుండునుghanamaina yesunaamam- pratinota nundunu

ఫిలిప్పీ. 2:10 "ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును"

పల్లవి:
హల్లెలూయ, హల్లెలూయ - ప్రభునామం స్తుతియింతు
హల్లెలూయ, హల్లెలూయ - అనునిత్యము స్తుతియింతు

చరణం 1:
ఘనమైన యేసునామం - ప్రతినోట నుండును
దివ్యమగు ఆయన సన్నిధి - ప్రతిచోట నుండును.
యేసు ఘన నామము పేరు - ప్రతి మోకాలొంగును
ప్రభు యేసు రాకడ దినము - ప్రతి నేత్రము గనును

చరణం 2:
ప్రభువైన యేసు నామం మధురం - మధురం
ఆత్మీయ ఆకలి దప్పులు - తీర్చెడి ఘనమగునామం
ఇంపైన యేసునామం వీనులకు విందగునామం
అన్ని నామములకు పైగా - ఉన్నతమైన నామం       ॥హల్లెలూయ॥

చరణం 3:
బహుమూల్యమైన నామం - ఆదరణీయ యేసు నామం
భూలోక మంతటిలోన - ఆరాధన యోగ్య నామం
పది వేలలో శ్రేష్ఠ నామం - పూజార్హము యేసు నామం
ఈ లోకమంతటను - కొనియాడబడు నామం     ॥హల్లెలూయ॥

చరణం 4:
పాపక్షమాపణ నొసగు - సామర్థ్యమైన నామం
సాతాను నోడించుటకు - శక్తి గల నామం
మరణమును మరణము ద్వారా - ఓడించిన యేసునామం
లోకమునకు నిత్య జీవము - కల్గించిన ఘన నామం     ॥హల్లెలూయ॥
35 ఆనందముతో - స్తుతియించెదముaanandamuto - stutiyinchedamu

లూకా 17:16 "ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదముల యొద్దసాగిలపడెను"

పల్లవి:
ఆనందముతో - స్తుతియించెదము 
ప్రభుయేసు పాదముల - పూజింతుము

చరణం 1:
మరణాంధకార లోయలోన - సాతాను చెరలో నేనుండగ
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి - నీ ఘనత కొరకై యేర్పరచితివి

చరణం 2:
నరకాగ్ని పాలాయె నా ప్రాణము - తప్పించుకొను మార్గము లేకుండగా
నీ రక్తము కార్చి ప్రాణ త్యాగముతో - భరియించలేని బాధను యోర్చితివి

చరణం 3:
విలువైన ప్రేమ కనబరచితివి - నా ఘోర పాపములు క్షమియించితివి
ప్రభు క్రీస్తు సన్నిధినిత్యము నుండు - ఆశను నాకెంతో కలిగించితివి

చరణం 4:
గర్భమున నేను రూపింపక మునుపే - నా దేవ నీవు నన్నెన్నుకొని
ఈ లోక సంబంధ బంధము తెంచి - పరలోక ద్వారము తెరచితివి

చరణం 5:
అరణ్యమందు నడచిన గాని - యెండిన నేలను నిలచిన గాని
పరలోక తండ్రి మారని ప్రేమను
వర్ణించుచు గురి యొద్దకు పరుగెత్తుదును
37 యౌవ్వనులైన శిష్యులవలెyauvvanulaina shishyulavale

2 తిమోతి 2:22 "పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్ధన చేయువారితో కూడ నీతిని... సమాధానమును వెంటాడుము"

పల్లవి:
యౌవ్వనులైన శిష్యులవలె 
మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా (2)

చరణం 1:
ఓ పరలోకపు తండ్రీ ! యూదా గోత్రపు సింహమా ! (2)
పరిపూర్ణ శక్తి గల నిత్యుండగు తండ్రివి (2)
పరలోకములో పెద్దలు జీవులు ఆరాధించుచున్నారు (2)
ప్రార్థించను నేర్పించుమా (2)

చరణం 2:
ఓ పరలోకపు తండ్రీ ! దీవెనలొసగె దేవా !
మా ప్రతి అవసరములలో నమ్ముటకు కృపనిమ్ము
విశ్వాసముతో, ఉజ్జీవాత్మతో కొనసాగుటకు కృపనిమ్ము
ప్రార్ధించను నేర్పించుమా

చరణం 3:
ఓ పరలోకపు తండ్రీ ! విజయుండవగు దేవా !
మా చెడు తలంపులలో మాటలలో క్రియలలో
శుద్ధీకరించుము క్రీస్తు రక్తముతో రక్షణానందము నిమ్ము
ప్రార్ధించను నేర్పించుమా

చరణం 4:
ఓ పరలోకపు తండ్రీ ! ఏడు కన్నులు గల దేవా!
సాతాను క్రియలలో శోధనలో మమ్ములను 
విడిపించుము నడిపించుము కను పాపగ కాపాడుము
ప్రార్ధించను నేర్పించుమా
38 మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవుmelkommu o kaavali yesuni yodhudavu

యెషయా 21 : 11 "కావలివాడా, రాత్రి యెంత వేళైనది ”

పల్లవి:
మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు (1)
పోరాడవలె నీవే - ప్రభుశక్తితో పోవలెన్ (1)

చరణం 1:
శత్రువులెందరో నీ చుట్టు చేరియున్నారు (2)
తప్పించుకొందువెట్లు? ప్రభువాజ్ఞను పాలించు (1)

చరణం 2:
ఆయుధములు తీసుకో పొందుము ప్రభు శక్తిని
స్థిరుడవై నిలువవలె - శత్రువులందరి యెదుట

చరణం 3:
సిద్ధపడు మిప్పుడే ఆయుధము పట్టుకో
ఆత్మీయ యుద్ధం నీది - భయపడకెవ్వరికిన్

చరణం 4:
సత్యము నీ నడికట్టు తొలగు అబద్ధము నుండి
తొడుగుకో మైమరువును - ఆత్మరక్షణ పొందను

చరణం 5:
పాదరక్షలు ధరించు అందించు సువార్తను
విశ్వాసమను డాలుతో - దుష్టుని అగ్ని నార్పు

చరణం 6:
శిరస్త్రాణము ధరించు కనుపరచు నీ రక్షణ
ఆత్మఖడ్గము తీసుకో - వాక్యమే ఆ ఖడ్గము

చరణం 7:
ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్ఠయుధమదియే
గురి యెన్నడు తప్పవు - మెళకువగా నుండిన
39 నీ స్వరము వినిపించు ప్రభువాnee svaramu vinipinchu prabhuvaa

కీర్తనలు 119:17 "నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును"

పల్లవి:
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడచునట్లు నీతో (2)

చరణం 1:
ఉదయమునే లేచి నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము (2)
దినమంతటి కొరకు నను సిద్ధపరచు (1)
రక్షించు ఆపదల నుండి (2)

చరణం 2:
నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు
నేను సరిజేసికొందు
నీ మార్గములో నడచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడు

చరణం 3:
భయ భీతులలో తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా
ధైర్యపరచుము నన్ను

చరణం 4:
నాతో మాట్లాడు  స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో సరిజేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా

చరణం 5:
నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది
అది రెండంచులు గల ఖడ్గం
నీ వాక్యమేగా అద్భుత అద్దం
నిజ స్వరూపమును చూపించున్

చరణం 6:
నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో
నీ యందు నిలుచునట్లుగా

చరణం 7:
నా హృదయములోని చెడు తలంపులను 
ఛేదించునీ వాక్యము
నీ రూపమునకు మార్చును నన్ను
నీదు మహిమ కొరకేగా
40 నాథా! సమూయేలు రీతిnaathaa! samooyelu reeti

1. సమూ 3:10 "నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ నిమ్ము”

చరణం 1:
నాథా! సమూయేలు రీతి - నీయామోద శబ్దము 
సేవకుడనైన నన్ను - నిప్పుడాలకింపనీ 
నాతో నీవేమందువో - నేనాలించువాడనే

చరణం 2:
నాథా! నీ శబ్దమాలింప నన్ను సిద్ధపర్చుము 
నీదు మాట లక్ష్యపెట్టి - నిత్య సేవ జేయనీ 
నాతో నీవే మందువో - నేనాలించువాడనే

చరణం 3:
నేను స్వల్ప శిష్యుడను - నన్ నిరాకరింపకు 
నిన్నాలింప ఎంతయాశ - నీ వెరింగి యుందువు 
ఆత్మ యక్కరల్ తీర్చు - ధన్యుడన్ నే నౌదును

చరణం 4:
నీ మాట గ్రహించునట్లు - దాని దేటపర్చుము 
నిన్ను వెంబడించునట్లు - నిబ్బరింపజేయుము 
నేను నీదు గొఱ్ఱె ను - బండనీడల్ మేపుము
41 ఓ ప్రార్థనా సు ప్రార్థనాo praarthanaa su praarthanaa

1 థెస్స. 5: 16 "యెడతెగక ప్రార్థన చేయుడి”

చరణం 1:
ఓ ప్రార్థనా సు ప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా?
నా ప్రభువున్ ముఖాముఖిన్ - నే బ్రణుతింతు నీ ప్రభన్ 
నా ప్రాణమౌ సు ప్రార్థనా - నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు - నో ప్రార్థనా సు ప్రార్థనా -నీ

చరణం 2:
పిశాచి నన్ను యుక్తితో - వశంబు చేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే - నా శైలమైన ప్రార్థనా
నీ శక్తి నేను మరతునా - నా శైలమైన ప్రార్థనా
నా శోకమెల్ల దీర్చెడు - విశేషమైన ప్రార్థనా   -నా శోక

చరణం 3:
నీ దివ్యమైన రెక్కలే - నా దుఃఖభారమెల్లను
నా దేవుడేసు చెంతకు - మోదంబు గొంచుబోవును
సదా శుభంబులొందను - విధంబు జూప నీవెగ
నా ధైర్యమిచ్చు ప్రార్థనా - సుధాసుధార ప్రార్థనా -నా ధైర్య

చరణం 4:
అరణ్యమైన భూమిలో - నా రమ్యమౌ పిస్గా నగం
బురంగుగాను నెక్కి నా-  చిర గృహంబు జూతును
శరీరమున్ విదల్చి నే  - బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్ - బరేశు ధ్యాన ప్రార్థనా -కరంబు
42 ప్రీతిగల మన యేసుpreetigala mana yesu

యోహాను 15:15 "ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను”

చరణం 1:
ప్రీతిగల మన యేసు - ఎంతో గొప్ప మిత్రుడు
మితిలేని దయచేత - హత్తుచు బ్రేమించును 
క్రీస్తు నొద్ద మన భార - మంత నప్పగించినన్ 
శక్తిగల యేసు చేత - మోత లెల్ల వీడును

చరణం 2:
నీతిగల మన యేసు - ధృతిగల మిత్రుడు
మృతి బొంది కృపతో వి-శ్రాంతి కలిగించెను
భీతి నొందు బాపులైన - జింతాక్రాంతులైనను
క్రీస్తు యొక్క దీప్తి చేత - క్రొత్తగతి జూతురు

చరణం 3:
దయగల మన యేసు - ప్రియమైన మిత్రుడు
మాయ లోకమందు నిజా - శ్రయుడై కాపాడును
భయ దుఃఖ శ్రమలాది - మోయరాని బాధలన్
జయ మొప్పనోర్చి యేసు - స్థాయి వృద్ధి చేయును

చరణం 4:
ధరణిలో యేసుగాక - వేరె గొప్ప మిత్రుడా!
పరలోకమందు నింక - పరమ రక్షకుడా!
నరులను గావ వేగ - గ్రూరహింస బొందుచు
కరుణించి నిల్చి ప్రతి - ప్రార్థనాలకించును
43 ఇమ్మహి మీద - గ్రుమ్మరించుము - దేవాimmahi meeda - grummarinchumu - devaa

జెకర్యా 10:1 "కడవరి వానకాలమున వర్షము దయచేయుము”

పల్లవి:
ఇమ్మహి మీద - గ్రుమ్మరించుము - దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా

చరణం 1:
ఆశీర్వాదంబు ల్మామీద - వర్షింపజేయు మీశ
యాశతో నమ్మియున్నాము - నీ సత్య వాగ్ధత్తము

చరణం 2:
ఓ దేవా పంపించవయ్యా - నీ దీవెన ధారలన్మా
 దాహ మెల్లను బాపు - మాధుర్యమౌ వర్షమున్

చరణం 3:
మా మీద కురిపించు మీశ - ప్రేమ ప్రవాహంబులన్స
మస్త దేశంబు మీద - క్షామంబు పోవునట్లుగన్

చరణం 4:
ఈనాడె వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్నీ
 నామమందున వేడి - సన్నుతి బ్రార్థింతుము
44 కరుణించి తిరిగి – సమకూర్చు ప్రభువాkaruninchi tirigi – samakoorchu prabhuvaa

1 సమూ. 30:19 "దావీదు సమస్తమును సమకూర్చుకొనెను”

పల్లవి:
కరుణించి తిరిగి – సమకూర్చు ప్రభువా (2)
క్షమాపణ నిన్ను - వేడుచున్నాను (2)

చరణం 1:
దావీదు రాజు - దీనుడై వేడ (2)
అవనిలో బొందిన నష్టములన్నియు (2)
దేవా నీవు - సమకూర్చితివే (2)

చరణం 2:
శత్రు సమూహపు - కుతంత్రములతో -
బొత్తిగ నేను - నష్టపడితిని
మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రీ

చరణం 3:
పసరు గొంగళి - చీడపురుగులు నాశము చేసిన -పంటను కూర్చుమా
యేసుప్రభూ - నిన్ను వేడుచున్నాను

చరణం 4:
ప్రేమ సంతోషా - నందములను-ప్రధాన యాజకా - పోగొట్టుకొంటిని 
ప్రేమతో నీవు - సమకూర్చుమా

చరణం 5:
పాపపు విషముతో -నా పాత్ర నిండెను
ప్రభు యేసుండను - పిండిని కలుపుము
పాప మరణమును - తొలగించుమా

చరణం 6:
ఆత్మీయ సోమరి - తనములో నుండి
ఆత్మనష్టముల - నెన్నియో బొందితి
ఆత్మదేవా నీవు - సమకూర్చుమా

చరణం 7:
పాపము చేసి - పడియున్న చోటున్
ప్రాపుగ నీవు జూపుమో ప్రభువా
కోపగించక నాపై - కృప జూపుమా

చరణం 8:
చేసిన పాపము - కప్పుకొనక -విశ్వాసముతో - ఒప్పుకొందున్
సిలువరక్తముతో - శుద్ధిచేయుమా
45 ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ముo prabhuvaa ujjeevamu nimmu

కీర్తనలు 85:6 “నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రదికింపవా?”

పల్లవి:
ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము - విరిగిన మనస్సుతో నే వేడెదను (2)

చరణం 1:
కోల్పోయితిని మొదటి ప్రేమను - చల్లారిపోయె నీ ప్రేమ నాలో (2)
నాలో నిలుపుము నీదు ప్రేమ (2)

చరణం 2:
పడినవారి యాశ్రయమా - విడువ బడిన వారి సహాయుండా
గాయపు చేతితో లేపుమా

చరణం 3:
శత్రుని యురిలో చిక్కియున్నాను - నాదు బంధకమును తెంపుము నీవు
ఆనందము నిమ్ము మరల నాకు

చరణం 4:
దోషిని నేను నీకు సఖులకు - అడుగుచుంటిని మన్నన మిమ్ము
కడుగుము నీదు రక్తములోన

చరణం 5:
ఐక్యతయే నా యభిలాష - నాదు చేదును తొలగించుము
శత్రుని శక్తిని ఓడించుము

చరణం 6:
పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా - వడిగా నీదు ఉజ్జీవము నిమ్ము
బూడిద చేయుము నాలోని మష్టున్

చరణం 7:
ఆత్మ ఉజ్జీప జ్వాలలు జగమున - కదలింపగ వ్యాపింప జేయుము
హృదయమును ఫలియింప జేయుము
46 నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ముnee velugu nee satyamu bayalu deranimmu

దా. కీర్తన. 43 :3 - 5 "నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము"

పల్లవి:
నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము (2) 
దేవా .....    నా  ......   దేవా      (1)

చరణం 1:
నాకు త్రోవ చూపునూ - అది నీ నివాస స్థలముకు (2)
నన్ను తోడుకొని వచ్చును - దేవా నా దేవా (2)

చరణం 2:
అప్పుడు నీకు సితారతో - స్తుతి గీతము చెల్లింతును
ఓ... హాసన్నా..... హోసన్నా - దేవా నా దేవా

చరణం 3:
ఏలక్రుంగిపోతివి - భీతిన్ విడు నా ప్రాణమా
ప్రీతిన్ ప్రభుని గనుమా - దేవా నా దేవా
47 నీ వాత్మ యుద్ధములో జయ మొందుముnee vaatma yuddhamulo jaya mondumu

2 తిమోతి 2:3 “క్రీస్తు యొక్క మంచి రాణువ వానివలె నాతోకూడ శ్రమను అనుభవించుము”

పల్లవి:
నీ వాత్మ యుద్ధములో జయ మొందుము (2)
ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1)

చరణం 1:
స్వామి యేసు తన సిలువను మోసి - సైతాను రాజ్యము పూర్తిగా జయించె (2)
నీవును యేసుని వెంబడి వెళ్ళుమా (2)
ఓ నా సోదరా వెనుకంజ వేయకు (1)
ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1)

చరణం 2:
శిరమున ముండ్ల మకుటము ధరించి - సిపాయిచే తలపై కొట్టబడె
నీ శిరస్సు నట్లే సమర్పించు
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు

చరణం 3:
కల్వరిపైకి  - ఒంటరిగానే -  వెళ్ళెను యేసు - త్యాగ సహితుడై
నీవును ఆ దారినే వెళ్లుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు

చరణం 4:
లోకస్తులంతా - నిద్రించుచుండగా - మోకాళ్ళపై యేసు - కొండపై నుండె
నీవును ప్రార్థన శక్తి నొందుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు

చరణం 5:
సాహసమున నీ వాత్మ ఖడ్గమున - సైతాను బంధము - ఖండించివేసి
క్రీస్తుని సంఘమా - ముందంజ వేయుమా
ఓ నా సోదరా వెనుకంజ వేయకు
ఓ నా సోదరి వెనుకంజ వేయకు
48 ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకుprabhuyesu naa rakshakaa - nosagu kannulu naaku

హెబ్రీ 12:2 “యేసు వైపు చూచుచు . . . పందెములో ఓపికతో పరుగెత్తుదము”

పల్లవి:
ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ - అల్ఫయు నీవే - ఓమేగయు నీవే (2)

చరణం 1:
ప్రియుడైన యోహాను - పత్మాసులో - ప్రియమైన యేసూ - నీ స్వరూపము (2)
ప్రియమార జూచి - బహుధన్యుడయ్యె
ప్రియ ప్రభు - నిన్ను జూడనిమ్ము (2)

చరణం 2:
లెక్కలేని మార్లు - పడిపోతిని -దిక్కులేనివాడ- నే నైతిని
చక్కజేసి నా - నేత్రాలు దెరచి
గ్రక్కున - నిన్ను జూడనిమ్ము

చరణం 3:
ఎఱిగి యెఱిగి నే - చెడిపోతిని-యేసు నీ గాయము - రేపితిని
మోసపోతి నేను - దృష్టి దొలగితి
దాసుడ నన్ను - జూడనిమ్ము

చరణం 4:
ఎందరేసుని వైపు - చూచెదరో - పొందెదరు వెల్గు - ముఖమున
సందియంబు లేక - సంతోషించుచు
ముందుకు - పరుగెత్తెదరు

చరణం 5:
విశ్వాసకర్తా - ఓ యేసు ప్రభూ - కొనసాగించువాడా- యేసు ప్రభూ 
వినయముతో నేను - నీ వైపు జూచుచు
విసుగక - పరుగెత్త నేర్పు

చరణం 6:
కంటికి కనబడని - వెన్నియో-చెవికి వినబడని - వెన్నియో
హృదయ గోచరము - కాని వెన్నియో
సిద్ధపరచితివా - నాకై?

చరణం 7:
లోక భోగాలపై - నా నేత్రాలు - సోకకుండునట్లు - కృపజూపుము
నీ మహిమ దివ్య - స్వరూపమును
నిండార నను - జూడనిమ్ము
49 ఓ సర్వశక్తుడా - నా సత్యదేవుడాo sarvashaktudaa - naa satyadevudaa

యిర్మియా 33:3; ఎఫెసీ. 3:20; యెషయా 65:24 None

పల్లవి:
ఓ సర్వశక్తుడా - నా సత్యదేవుడా, సర్వదా నిను నే స్మరియింతును (2)

చరణం 1:
చెర నుండి నేను - మొరపెట్టగా (2)
పరము నుండి - ఉత్తరమిచ్చెను(2)

చరణం 2:
గాఢమైన - సంగతులన్
గ్రహించునట్లు - ప్రభుచేయును

చరణం 3:
అడుగువాటికన్న - ప్రభువు 
అత్యధికముగా - దయచేయును

చరణం 4:
ఊహకు మించిన - కార్యములన్ 
మహాప్రభు నడిగిన - నెరవేర్చును

చరణం 5:
వేడుకొనక - మునుపే ప్రభు 
వడిగా మాకు - త్తరమిచ్చును

చరణం 6:
మునుపటి కన్న - అధికముగా 
మేలుల మాకు - కలుగజేయున్

చరణం 7:
ప్రార్ధనకు - ప్రతిఫలముల్ 
ప్రియముగ నొసగును- హల్లెలూయ
50 నీతిమంతుల ప్రార్ధన దేవుడాలకించునుneetimantula praardhana devudaalakinchunu

కీర్తనలు 92 :12 "నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు"

పల్లవి:
నీతిమంతుల ప్రార్ధన దేవుడాలకించును (1) 
వారు తమాల వృక్షము వలె మొవ్వు వేయుదురు (2)

చరణం 1:
మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు 
మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్

చరణం 2:
గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి 
సతతము ఆనంద మొంద అడుగుడి దొరుకున్

చరణం 3:
యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము 
ఇహము నందు పక్షిరాజు వలె పై కెగురుదురు

చరణం 4:
ఊహించలేనిది శక్యము గాని వైనట్టి క్రియలను 
యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా

చరణం 5:
మిమ్ము విడువనెన్నడు నెడబాయననెగదా 
నమ్ముము నరమాత్రుండెవుడే హాని చేయడు

చరణం 6:
ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో 
మీ ప్రతి యవసరము తీర్చి కాచు నిరతమున్

చరణం 7:
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును 
నిశ్చయముగా వృద్ధి పొందితుననె నీ దేవుడు
51 ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించుprabhu kummarinchu prabhu kummarinchu

యెషయా 44:3 “నేను దప్పి గలవాని మీద నీళ్లను యెండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను.”

పల్లవి:
ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు (1)
దీవెనల వర్షము కుమ్మరించుము (1)

చరణం 1:
ఓ మా యేసు విను మా మనవి (2)-మా మధ్యకు ప్రభు రారమ్ము (2)
నీ ద్వారమున చేరి యున్నాము (2)
నింపుము ప్రభువా మమ్ములను (2)

చరణం 2:
దప్పిగొన్న వారికి జలము-యెండిన భూమికి జలధారల్  
నీ సంతతిపై ఆత్మను పంపు-నీ దీవెనలతో నింపుము

చరణం 3:
తండ్రి కుడి ప్రక్కన నిలుచున్న - యేసు ప్రభువును చూపుము
ఆ మహిమా నివాసములోని - సమృద్ధితో మమ్ము నింపుము

చరణం 4:
రెండు కెరూబుల మధ్య నుండి- మధుర స్వరము విననిమ్ము
యేసుని తప్ప యెవరిని వినక - ఆత్మలో తృప్తి పొందెదము

చరణం 5:
తెరువబడిన పరమును చూడ-దూతలు యెక్కుచు దిగుచుండ
నీ సంఘమును అభిషేకించి - ఘనకార్యములను జరిగించు
52 పరము జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండparamu jeevamu naakunivva - tirigi lechenu naatonunda

రోమా 5 : 6 "క్రీస్తు.........భక్తిహీనుల కొరకు చనిపోయెను"

పల్లవి:
యేసు చాలును యేసు చాలును యే సమయమైన
యే స్థితికైన నా జీవితములో - యేసు చాలును (1)

చరణం 1:
పరము జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ (2) 
నిరంతరము నడిపించును- మరల వచ్చి యేసు కొని పోవును (2)

చరణం 2:
సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను 
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను

చరణం 3:
పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును 
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును

చరణం 4:
నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కృళ్ళి కృశించినను 
     హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడిచినను
53 యెహోవా నీ కృపాతిశయమునుyehovaa nee krupaatishayamunu

కీర్తనలు 36:8 "నీ మందిరముయొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు"

పల్లవి:
యెహోవా నీ కృపాతిశయమును 
నిత్యము కీర్తింతున్ (2)

చరణం 1:
తరతరములకు నీ విశ్వాస్యత- తెలియపరచెదను (2)
కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి 
పాపము క్షమియించె (2)

చరణం 2:
ప్రతిశోధనపై నీవు నాకు  -  విజయము నిచ్చెదవు 
నన్ను విడిపించుటకు నీవు 
నమ్మ దగిన వాడవు

చరణం 3:
నీదు వాత్సల్యము నాపై -  నూతనముగ నుండున్ 
నీదు విశ్వాస్యత గొప్పదై 
మారనిదై యుండున్

చరణం 4:
నీదు రాకడ వరకు నన్ను -  నిందా రహితునిగా 
నమ్మకమై యున్న నా ప్రభువా
నన్ను కాచెదవు

చరణం 5:
మంచి పోరాటము పోరాడి - జయమును పొందెదను
మహిమ మకుటము నిచ్చెడు ప్రభునకు 
హల్లెలూయ పాడెదన్
54 యెహోవా నా కాపరి నాకు లేమి లేదుyehovaa naa kaapari naaku lemi ledu

కీర్తనలు 23 :1 - 6 "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు"

పల్లవి:
యెహోవా నా కాపరి నాకు లేమి లేదు 
పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ (2)

చరణం 1:
మరణపు చీకటిలో తిరుగుచుండినను 
ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్ (2)

చరణం 2:
పగవారి యెదుట ప్రేమతో నొక విందు 
ప్రభు సిద్ధము చేయున్ పరవశమొందెదను

చరణం 3:
నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది

చరణం 4:
చిరకాలము నేను ప్రభు మందిరములో 
వసియించెద నిరతం సంతసముగ నుందున్
55 ఓ ఇశ్రాయేలు - నీదు భాగ్యమెంతో గొప్పదిo ishraayelu - needu bhaagyamento goppadi

ద్వితీ. 33:29 ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు?

పల్లవి:
ఓ ఇశ్రాయేలు - నీదు భాగ్యమెంతో గొప్పది (1)
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు? (2)

చరణం 1:
భయపడకు నేను నీ కేడెమును బహుమానమున్ (2)
అత్యధికముగా చేతునని (2) - యెహోవా దేవుడే పల్కెన్ (2)

చరణం 2:
నా నిబంధనను నే - రద్దు పరచ ననెగదా
నా నోట నుండి వెళ్ళిన - మాటను మార్చననె గదా

చరణం 3:
సర్వోన్నతుని రాజ్యము - శాశ్వతంబు నిక్కము
తొలగిపోదు ఎన్నడు - లయము కాదు ఎన్నడు

చరణం 4:
నీ మందిర సమృద్ధిలో - వారికి తృప్తి కలదు
నీ ఆనంద ప్రవాహములో - నీవు త్రాగించుచున్నావు

చరణం 5:
నీవు భయపడకుము -బాదించువారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను - నీకు తోడై యున్నాను
56 సిలువయే నీ గురిగా- నడువు యౌవనుడాsiluvaye nee gurigaa- naduvu yauvanudaa

మత్తయి 14:28 "పేతురు - ప్రభువా, నీవే అయితే నీళ్ళమీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.”

పల్లవి:
సిలువయే నీ గురిగా- నడువు యౌవనుడా (1)
వెనుకంజ వేయకయే-నిలువు యేసు బండపై (2)

చరణం 1:
మునుగు చుండె నీ జీవ నావ దాటించు వారెవ్వరు? (2)
యేసు ప్రభుండె దాటించువాడు (2)
నీదు చుక్కాని యేసే (2)

చరణం 2:
వచ్చెను యేసు ఈ లోకమునకు తెచ్చె నీకు రక్షణ
అక్షయుడు తెరచె నిశ్చయముగ
 మోక్షద్వారము నీకే

చరణం 3:
సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను
విమోచించును విశ్వసించిన
ముక్తిని పొందెదవు

చరణం 4:
ప్రేమవార్త ప్రకటింపబడెను ప్రియులారా రండి నేడే
మీ ఉల్లములకుప్రియమైన యేసే
శాంతినిచ్చెడి రాజు
57 కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరుkannulanetti pairula choodu koyaga lerevvaru

కీర్తనలు 126 :5 “కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటకోసెదరు”

పల్లవి:
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (1)
ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2)

చరణం 1:
కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2)
ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2)

చరణం 2:
మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా?
వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై?

చరణం 3:
విశ్వాసప్రార్థనచే క్షీణతను తొలగింప
జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద

చరణం 4:
మందిరము పడియుండ మందుడవై నీ వుండి
సరంబీ గృహములలో సంతోష సమయమిదా?

చరణం 5:
మహిమ ఆర్భాటముతో క్రీస్తురాజు వేంచేయ 
నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా
58 యువతి యువక - ప్రభున్ జేరుమాyuvati yuvaka - prabhun jerumaa

ప్రసంగి 12 : 2 “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”

పల్లవి:
యువతి యువక - ప్రభున్ జేరుమా 
దుర్దినములు -రాకముందే . (2 సార్లు)

చరణం 1:
లేత వయస్సు - నడి ప్రాయము - గతియించి పోవున్ - గుర్తుంచుకో (2) 
గతియించని - క్రీస్తున్ చేరు (2) 
దుర్దినములు - రాకముందే

చరణం 2:
నీ ఎదుట సరిగా - కనబడు మార్గం 
ఆ మార్గమే మరణమునకు - నిను చేర్చును 
జీవమార్గం - కోరుకొనుమా 
దుర్దినములు - రాకముందే

చరణం 3:
శరీర క్రియలను - విడిచి పెట్టి - క్రీస్తు ప్రభువును - ఆశ్రయించు 
ఆత్మ ఫలముల్ - ఫలియించుమా 
దుర్దినములు - రాకముందే
59 మందలో చేరని గొఱ్ఱె లెన్నోmandalo cherani gorre lenno

యోహాను 10:16 “ఈ దొడ్డివి కాని వేరే గొజ్జెలును నాకు కలవు”

పల్లవి:
మందలో చేరని గొట్టెలెన్నో - కోట్ల కొలదిగా కలవు యిల (1)
ఆత్మలకొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ సంఘమా (1)
మందలో చేరని గొఱ్ఱెలెన్నో(1)
రమ్మనె యేసు - ప్రార్థించుము - నడిపించును (2)

చరణం 1:
అడవులలో పలు స్థలములలో -నా ప్రజలెందుకు చావవలెన్ (2) 
వారి నిమిత్తమే శ్రమపడితిన్ 
మరి వారిని వెదకెడి వారెవరు (2)

చరణం 2:
ప్రకటించని స్థలములు కలవు - నన్ను చాటించువారు కలరిచట 
పిలువబడిన వారందరును 
మన ప్రభువాజ్ఞకు లోబడి రండి

చరణం 3:
నాకై పలికెడి నాలుకలు -నావలె నడిచెడి పాదములు 
నను ప్రేమించెడి హృదయములు 
కావలె నాకవి నీవిచ్చెదవా?
60 నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమాnaa yesu maargamanduna vella naayattamaa

హెబ్రీ. 11:26 “క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని...”

పల్లవి:
సిలువను వీడను - సిలువను వీడను 
సిలువను వీడను సిలువను వీడను -సిలువను  వీడను 
సిలువను  వీడను

చరణం 1:
నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా? (1)
గొల్గొతా కొండ బాధలో - పాలు పొందెదవా?  (2)

చరణం 2:
బంధుమిత్రుల మధ్యను - శ్రమ సహింతువా?
మూర్ఖకోపిష్టుల మధ్య - దిట్టముగ నుందువా?

చరణం 3:
ఆకలి దాహ బాధలో - ధైర్యంబుగ నిల్తువా?
అవమానము వచ్చినను - సిలువను మోతువా

చరణం 4:
పాపాత్ములు గుణపడన్ - దత్తము చేతువా?
      భయస్థులు ధైర్యపడన్ - యుద్ధము చేతువా?

చరణం 5:
లోకులు నాశ మైరిగా - వీరులు లేకయే
విమోచకుడు సిలువలో - వ్రేలాడి మృతి పొందెను

చరణం 6:
జీవాంతరము వరకు - నిల్చి పోరుసల్పి
దైవ కృపచే గెల్చినే - మోక్షము చేరుదున్
61 నీ యౌవ్వనమును ఓ యౌవ్వనుడాnee yauvvanamunu o yauvvanudaa

1 తిమోతికి 4:11 "నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము"

పల్లవి:
నీ యౌవ్వనమును ఓ యౌవ్వనుడా
చేయకు వ్యర్థము చేయకుము (2)

చరణం 1:
దైవభక్తి యుండుటే జ్ఞానమునకు మూలము (2) 
దేవుని గూర్చిన తెలివి వివేచన కాధారము (2)
జ్ఞానియైన యెడల నీకే లాభమగును (2)

చరణం 2:
తృణీకరింపనియ్యకు నీ యౌవ్వనమును
మాటలు ప్రవర్తన ప్రేమ పవిత్రతలో 
మాదిరిగ నుండుము విశ్వాసులకు

చరణం 3:
సిలువయే నీ శక్తి గురిగా నుంచుము
ప్రభు వాక్యము నీలో నివసింపనీయుము
సాతానును జయించి బలము నొందుము

చరణం 4:
నీ యౌవ్వనములో జ్ఞాపకముంచుకో
ప్రభువు చూచి వినుచున్నాడని 
నీ సృష్టికర్తను స్మరియించుము

చరణం 5:
ప్రభుని సేవకై అర్పించుకొనుము
ఆత్మల రక్షణకై చాటించు సువార్తను
నీ సేవ ద్వారా ప్రభు తృప్తి నొందును
62 మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసేmanaku jeevamaiyunna rakshakudu prabhuyese

కొలొస్స 3 : 4 "మనకు జీవమైయున్న క్రీస్తు"

పల్లవి:
మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే (2)

చరణం 1:
దేవుని దీవెనలు పొంద (2)
యౌవనులారా యేసుని సన్నిధికి రారండి (2) 
దైవ కుమారుడు పావన క్రీస్తుని
జీవము పొంది నడుపుడి (2)

చరణం 2:
యేసు నంగీకరించెడి వారి
పేరులు జీవ గ్రంథము నందు వ్రాయబడున్
నమ్మకమైయున్న పావన క్రీస్తుని 
జీవము పొంది నడువుడి

చరణం 3:
దేవుని స్వరూపము కల్గిన
యేసు ప్రభు మనుజరూపంబున జన్మించెను
చావును గెల్చిన పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి

చరణం 4:
యేసు రక్తములో కడుగబడిన 
తెల్లని వస్త్రముల్ ధరియించి రారండి
గొప్ప కృపానిధి పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి

చరణం 5:
క్రీస్తుయేసుని యౌవన జనమా 
ఆయనకు ప్రాణము లర్పించను నిలువుడి
సత్యరూపియగు పావన క్రీస్తుని 
జీవము పొంది నడువుడి

చరణం 6:
రాజులరాజు ప్రభుల ప్రభువు 
 అనుపేరు ఆయన వస్త్రముపై వ్రాయబడెన్
సర్వశక్తి గల పావన క్రీస్తుని
జీవము పొంది నడువుడి

చరణం 7:
ప్రభుని పిలుపు పొందియున్న
యౌవనులార విశ్వసించి విజయము పొందుడి 
శత్రువు నోడించి యేసు నామమున
హల్లెలూయ పాట పాడుడి
63 క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఓమేగkreeste sarvaadhikaari - kreeste alphaa omega

ప్రకటన 1:8 "అల్ఫాయు ఓమెగయు నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు"

పల్లవి:
క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఓమేగ 
అది యంతము క్రీస్తే- యుగయుగములు క్రీస్తే (1)

చరణం 1:
మనల రక్షించంచి - సిలువలో ప్రాణమిచ్చె (2) 
తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె (2)

చరణం 2:
నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండె
నేడే రక్షణ దినము - అంగీకరించుమిపుడే

చరణం 3:
ఆయన ప్రత్యక్షత - ప్రేమించువారి కొరకు
ప్రభు తిరిగి వచ్చుచుండె పరలోక మహిమతోడ

చరణం 4:
ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరిశుద్ధపరచబడెనో 
వారే ప్రభురాక యందు సంతోషించెదరు మిగుల

చరణం 5:
ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఃఖబాధల్ 
బహుమానములుగ మారి కాంతి కిరీటమౌను

చరణం 6:
ఆనంద బాష్పములతో - హల్లెలూయ పాటలు
పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ
64 సీయోను పాటలు సంతోషముగseeyonu paatalu santoshamuga

హెబ్రీ. 13 : 14 "నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు"

పల్లవి:
సీయోను పాటలు సంతోషముగ
పాడుచు సీయోను వెళ్ళుదుము (2)

చరణం 1:
లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు (2) 
పొందవలె నీ లోకము నందు - కొంతకాలమెన్నో శ్రమలు (2)

చరణం 2:
ఐగుప్తును విడిచినట్టి మీరు - అరణ్యవాసులె యీ ధరలో
నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు - కానానుపై నిలుపుడి

చరణం 3:
మారానుపోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి 
నీ రక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాటనమ్ము

చరణం 4:
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి 
పాడైన కోరహు పాపంబు మాని - విధేయులై విరాజిల్లుడి

చరణం 5:
ఆనందమయ పరలోకంబు మనది - అక్కడ నుండి వచ్చు నేసు
సీయోను గీతము సొంపుగ కలిసి - పాడెదము ప్రభుయేసుకు జై
65 అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారాamoolya raktamu dvaaraa rakshana pondina janulaaraa

ఎఫెసీ. 2:13 "అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై యున్నారు”

పల్లవి:
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము (1)

చరణం 1:
మన యౌవ్వన జీవితముల్ - శరీరాశకు లోబరచి (2) 
చెడుమాటలను పలుకుచు - శాంతి లేక యుంటిమిగా (2)

చరణం 2:
చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము 
నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి

చరణం 3:
నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక 
స్వంత నీతి తోడనే - దేవుని రాజ్యము కోరితిమి

చరణం 4:
కనికరము గల దేవుడు - మానవ రూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిజేసి -  మనల విమోచించెను

చరణం 5:
తన రక్తధారలలో - మన పాపములను కడిగి 
మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో

చరణం 6:
పాపులమైన మన మీద - తన యాశ్చర్య ఘనప్రేమ 
కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము

చరణం 7:
మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా 
మన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములన్
66 క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినపుడుkreestuni svaramu vindunu prabhuve palikinapudu

కీర్తనలు 29 “యెహోవా స్వరము"

పల్లవి:
క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినపుడు (1)
మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది (2)

చరణం 1:
యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2)
మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించెను (2)

చరణం 2:
నీ మధుర స్వరము నీ వాక్యమున విందున్
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు

చరణం 3:
నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను

చరణం 4:
నీ మధుర స్వరము నీ మార్గము జూపును
కుడియెడమల తిరిగిన నీ స్వరమే వినబడును

చరణం 5:
తుఫానులు కలిగి భయభీతులలో నుండ
భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము

చరణం 6:
మరణాంధకార లోయలో నేనుండ 
నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్

చరణం 7:
ప్రభువా సెలవిమ్ము నీ దాసు డాలించున్ 
దీనుడనై నీ మాట అంగీకరించెదను
67 తలుపులు తెరచియుండగనేtalupulu terachiyundagane

యోహాను 9 : 14 "రాత్రి వచ్చుచున్నది. అప్పుడెవడును పనిచేయలేదు"

పల్లవి:
తలుపులు తెరచియుండగనే 
విరిగిన మనస్సుతో సాగెదవా? (2) కాలమపాయముగా నుండె 
సమయము సద్వినియోగించు (2)

చరణం 1:
చీకటి కాలము వచ్చుచుండె- కృపకాలము నుపయోగించు (2) 
తలుపులు తెరచియుండగనే -విరిగిన మనస్సుతో సాగెదవా? (2)

చరణం 2:
భీడు భూము లధికముగా- చూచిన నీవు సాగిరా
యేసుని వారికి చూపించు- ప్రేమావార్తను చాటించు      || తలుపు ||

చరణం 3:
ఎన్నో రాజ్యము లీనాడు- దేవుని పనికి మూయబడే
తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు       || తలుపు ||

చరణం 4:
విశ్వాసుల సహవాసమున- ప్రేమా ఐక్యత గలదు 
అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను     || తలుపు ||

చరణం 5:
రానైయున్న బాధ్యతలు -మనకధికము ప్రియులారా
మనకు జయము కలుగటకై-వినయమున పోరాడెదము      || తలుపు ||

చరణం 6:
మాదు హృదయముల నింపు- నీదు ప్రేమతో మా ప్రభువా 
హిందూ దేశపు వీధులలో- నాథా నిన్నే చాటెదము     || తలుపు ||
68 నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకైnaa sarvamaina prabhoo - arpinchukondu neekai

రోమ 12:1 "సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి"

పల్లవి:
నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై (1) 
అంగీకరించు నేడే  - నీ సేవ చేయుటకై (2)

చరణం 1:
ఆత్మప్రాణ దేహము - తలంపులు క్రియలు (2) 
అన్నియు నీ కొరకే - గైకొనుము ఓ యేసువా (2)
జీవించగోరితి నీ కొరకే- నీకే మహిమ ఘనత (2)

చరణం 2:
వెలిగించు నా జీవము- నింపుము నీ ప్రేమతో
నీ కృపతో నడిచెదను - మెండైన నీ శక్తితో
ఘనపరచ గోరితిని నీ నామమును - నీకే మహిమ ఘనత

చరణం 3:
నా కాళ్ళు చేతులెల్ల - నీ సేవ కర్పింతును
నా నాలుక నిత్యము - నిన్ను స్తుతింపనిమ్ము
మనస్సార ప్రేమింతు నిను ప్రభువా- నీకే మహిమ ఘనత
69 క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చిkreestesu prabhuvu tana raktamichi

అపొ . కార్య . 2 : 42 "వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును రొట్టె విరుచుటయందును, ప్రార్ధన చేయుట యందును ఎడతెగక యుండిరి”

పల్లవి:
క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున (1)
ఎవరు చేరెదరో వారె ధన్యులు పరలోకమే వారిది (2)

చరణం 1:
అపొస్తలుల బోధను నవ్మి స్థిరపరచబడిన  వారె  (2)
అత్మ శక్తితో వారు యెల్లప్పుడు  సంఘములో నిలిచెదరు (2)

చరణం 2:
పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో 
వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువునందు

చరణం 3:
ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారె తనయందు నిలచెదరు 
ప్రకటించెదరు ఆయన మరణ పునరుత్థానమును వారు

చరణం 4:
పట్టువదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్ధించెదరో
ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు బంధించెదరు వారె

చరణం 5:
క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో 
నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వ లోకమునందు
70 యేసు క్రీస్తు ప్రభువాయనేyesu kreestu prabhuvaayane

1 తిమొతి 1:15 "పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను"

పల్లవి:
యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు (1) 
పశువుల పాకన్ పరుండెను తానే దేవుడై యుండి (2)

చరణం 1:
నరులన్ గావన్ శ్రమలన్ బొందెన్ క్రీస్తు ప్రభువు (2) 
తిరిగెన్ భువిన్ సుఖమున్ విడిచి శిష్యులు వెంట నుండన్ (2)

చరణం 2:
నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది
నిత్యుండేసు మనకు నివ్వ మృత్యువున్ గెల్చెను

చరణం 3:
భీతిన్ గొలుపు అలలు పైకి లేచినంతనే
భీతిన్ విడిచి యేసు వైపు చూడు నిమ్మళించును

చరణం 4:
మరణమేలు లోయలందు సంచరించెడు 
తరుణములు కలిగినను క్రీస్తు మీ చెంతనుండున్

చరణం 5:
మన జీవము క్రీస్తే గదా క్రీస్తున్ తేరి చూచి
తనయులమై యుద్ధమందు జయము నొందెదము
71 మీరు బహుగా ఫలించినచోmeeru bahugaa phalinchinacho

యోహాను 15 : 8 "మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు"

పల్లవి:
మీరు బహుగా ఫలించినచో -  మహిమ కలుగును తండ్రికి (1)
ఈ రీతిగా ఫలించినచో శిష్యులై యుండెదరు (2)

చరణం 1:
నీరు కట్టిన తోటవలె- నీటి వూటవలె నుండెదరు (2)
క్షామములో తృప్తినిచ్చి - క్షేమముగా మిమ్ము నడిపించును (2) 
బలపరచును మీ యెముకలను (2) 
అధికముగా ఫలించుడి (2)

చరణం 2:
చెట్లు లేని మెట్టలలో  - నదుల ప్రవహింపజేయు ప్రభువు 
ఎండియున్న నేలనెల్ల - నీటి బుగ్గలుగా జేయువాడు
మన ప్రభువైన యేసునందు 
అధికముగా ఫలించుడి

చరణం 3:
వడిగా ప్రవహించు నదిని బోలి -  విస్తరింపజేయు తన శాంతిని
ఐశ్వర్యముతో నింపు మిమ్ము -  ముదిమి వరకు మిమ్ము మోయువాడు 
మన ప్రభువైన యేసునందు 
అధికముగా ఫలించుడి

చరణం 4:
పాడెదరు మూగవారు -  గంతులు వేసెదరు కుంటివారు 
పొగడెదరు ప్రజలెల్లరు - ప్రభుని ఆశ్చర్యకార్యములను 
మహిమ ఘనత చెల్లించుచు 
హల్లెలూయ పాడెదరు
72 మనకు జీవము యేసు ప్రభువుmanaku jeevamu yesu prabhuvu

కొలాన్స 3:4 “మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు"

పల్లవి:
మనకు జీవము యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు 
ప్రత్యక్షమౌదుము ఆయన మహిమలో (2)

చరణం 1:
ఆదియంతము ప్రభుయేసే  - అదృశ్య దేవుని స్వరూపుడు (2) 
అన్నింటిని నిర్వహించెదు -  అద్భుత యేసుకే స్తోత్రములు (1)

చరణం 2:
ప్రభుయేసు మరణించెను- విభుడు సర్వలోకముకై 
ప్రభవిల్లను జీవమిచ్చెను- అభయునకే స్తుతి పాడెదము

చరణం 3:
లోకముకై జీవించక - లోకేశునకై జీవించుచు
సాతానుపై జయమొందుచు  - వీకతో నేగెదము స్తుతితో

చరణం 4:
దైవత్వము గలయేసు - అవనిలో నుండుటే గొప్ప మర్మము
సంపూర్ణత గలవారమై - సత్యుండేసుని స్తుతించెదము

చరణం 5:
పరలోక పౌరులుగా - పరిశుద్ధ ప్రజలముగా 
సర్వములో క్రీస్తేనని - సర్వేశుని సన్నుతించెదము
73 నాకై చీల్చబడ్డయోnaakai cheelchabaddayo

Rock of ages,cleft for me “యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము" - యెషయా 26:4

చరణం 1:
నాకై చీల్చబడ్డయో -  నా యనంత నగమా
నీలో దాగియుందును - జెన్ను మీర బారెడు 
రక్తజలధారలా - శక్తి గ్రోలగా నిమ్ము

చరణం 2:
నేను నాదుశక్తిచే - నిన్ను గొల్వజాలను 
కాలమెల్ల నేడ్చినన్ - వేలకృతుల్ చేసినన్ 
నేను చేయు పాపము -  నేనే బాపజాలను

చరణం 3:
వట్టిచేయి చాచుచున్ - ముట్టి సిల్వ జేరెదన్ 
దిక్కులేని పాపిని - బ్రక్కజేర్చి బ్రోవుము
నా కళంక మెల్లను - నాథా నీవె బాపుము

చరణం 4:
ఈ ధరిత్రియందున - నేఱుదాటునప్పుడు 
నాదరించి నీకడన్ - నాకై చీల్చబడ్డయో
నా యనంత శైలమా - నన్ను చేరదీయుమా
74 ఉన్నట్టు నేను వచ్చెదన్unnattu nenu vachedan

Just as I am "దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము" - కీర్తనలు 51:1

చరణం 1:
ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపినైన నన్ పిల్వగన్
నీ నెత్రుచేత గడుగుమా -  యో  గొఱ్ఱెపిల్ల దేవుడా

చరణం 2:
ఉన్నట్టు నేను వచ్చెదన్ - నే నొప్పుకొందు దప్పులన్
నీ మాటలతో హరించుమా -  యో గొఱ్ఱెపిల్ల దేవుడా

చరణం 3:
ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధపర్చగన్
పాపంబు బాయ నీ యొద్ద  - యో  గొఱ్ఱెపిల్ల దేవుడా

చరణం 4:
ఉన్నట్టు నేను వచ్చెదన్ - కబోధినై నేనుండగన్ 
ఆత్మీయ దృష్టి నీయుమా - యో  గొఱ్ఱెపిల్ల దేవుడా

చరణం 5:
ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టినన్ 
మన్నించి చేర్చుకొమ్మయా -  యో  గొఱ్ఱెపిల్ల దేవుడా

చరణం 6:
ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను బిల్వగన్ 
నీ వాడనౌదు సర్వదా - యో  గొఱ్ఱెపిల్ల దేవుడా
75 మహా వై ద్యుండు వచ్చెను - బ్రజాళిబ్రోచు యేసుmahaa vai dyundu vachenu - brajaalibrochu yesu

The Great Physician "నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే" - నిర్గమ 18:26

పల్లవి:
మాధుర్యంపు నామము  - మోధమిచ్చు గానము 
వేదవాక్య సారము - యేసు దివ్యయేసు

చరణం 1:
మహా వై ద్యుండు వచ్చెను - బ్రజాళిబ్రోచు యేసు 
సహాయ మియ్యవచ్చెను - సంధింపరండి యేసున్

చరణం 2:
మీ పాపమెల్ల బోయెను - మేలొందు డేసు పేరన్ 
గృపా సంపూర్ణ మొందుడి - యపార శాంతుడేసు  ॥మాధు||

చరణం 3:
వినుండి గొఱ్ఱెపిల్లను - విశ్వాసముంచి యేసున్ 
ఘనంబుగన్ స్తుతించుడి మనంబుప్పొంగయేసున్    ॥మాధు||

చరణం 4:
ఆ రమ్యమైన నామము - అణంచు నెల్లభీతిన్ 
శరణ్యులైనవారి నా -  ధరించు నెంత ప్రీతిన్    ॥మాధు||

చరణం 5:
ఓ యన్నలారా పాడుడీ - యౌదార్యతన్ సర్వేశున్ 
ఓ యమ్మలారా మ్రొక్కుడీ - ప్రియాతి ప్రియుడేసున్    ॥మాధు॥

చరణం 6:
ఓ పిల్లలారా కొల్వుడీ - యౌన్నత్యరాజు నేసున్
ధపించువారి దాతయా - దయామయున్ శ్రీ యేసు   ॥మాధు॥

చరణం 7:
శ్రీయేసుకై యర్పించుడీ - మీ యావజ్జీవమును 
ప్రియంపు దాసులౌచును - రయంబు గొల్వుడేసున్   ॥మాధు||
76 డాగునేది మాపును - వేగయేసు రక్తధారెdaagunedi maapunu - vegayesu raktadhaare

What can wash away my stain "దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును ” - 1 యోహాను 1: 7

పల్లవి:
హా! దివ్యరక్తము - ఎంతో యమూల్యము
నన్ శుద్ధిచేయున్ - యేసు యొక్క రక్తధారె

చరణం 1:
డాగునేది మాపును - వేగయేసు రక్తధారె 
రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారె

చరణం 2:
పాప పరిహారము - ప్రాపు యేసు రక్తధారె 
శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారె  ||హా||

చరణం 3:
ఇదే నా సుపానము - యేసు యొక్క రక్తధారె 
నాదు క్షమాపణము - యేసు యొక్క రక్తధారె      ||హా||

చరణం 4:
నాకు సమాధానము - యేసు యొక్క రక్తధారె
నాకు జయ గానము - యేసు యొక్క రక్తధారె      ||హా||
77 సీయోనురాజు వచ్చును మదిన్seeyonuraaju vachunu madin

జెకర్యా 9 : 9 "సీయోను ... నీ రాజు ..... గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు"

పల్లవి:
సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు (2)
మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజు కొఱకే (2)

చరణం 1:
లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు యెవరని (2)
తన శక్తిని విన్నవారు చూడ నాశింతురుగా (2)
క్రీస్తే మన రారాజని ఉత్సహించెదము (2)

చరణం 2:
వాహనములు ఎన్ని యున్న గార్దభమును యెక్కెను 
తానెవరియింట నుండునో వారిని యుద్ధరించును 
పరీక్షించ ఆయనను చేర్చుకో నీ యందు

చరణం 3:
యేసుని స్వీకరించెడు వారేగుదు రాయనతో 
తృణీకరించువారలు నశింతురు నిక్కంబుగ
ప్రాముఖ్యమౌ ప్రశ్న యిది యోచించి చూచుకో

చరణం 4:
రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే 
న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు 
సదా రాజ్యంబాయనదే ఆనంద మొందుడి
78 సోదరులారా లెండి - రాకడsodarulaaraa lendi - raakada

మత్తయి 26:6 "ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొవరండి"

పల్లవి:
సోదరులారా లెండి - రాకడ గుర్తులు చూడండి (1)
దివిటీల నూనెతో నింపి - సిద్ధపడండి (2)

చరణం 1:
అర్ధరాత్రి వేళలో - ప్రభురాకడ ధ్వనిమ్రోగెను (2) 
సోమరితనము విడచి – (2 సార్లు) 
నడుమున దట్టి గట్టి - ప్రభుని కెదురు చూడుము (2)

చరణం 2:
సర్వత్ర యుద్ధాలు భూకం -పములును ఘోరవ్యాధులు 
ఘోరముగ ప్రబలెను - (2)
యేసుని రాకడ సమీపం - బాయెనో సోదరా

చరణం 3:
రాజ్యాలు అధికారాలన్ని - కదలిపోవుచున్నవి 
కలవరమధికంబాయె (2) 
కన్నులు తెరిచి చూడుమా ప్రభు వచ్చె వేళాయె

చరణం 4:
చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే యొక సూచన 
క్రీస్తు యుగ మారంభము (2 సార్లు) 
రానైయున్న వేళిదే - కని పెట్టుము సోదరా

చరణం 5:
తలుపు వేయబడిన లోన - ప్రవేశించనేరవు 
పశ్చాత్తాప పడుము (2) 
యేసుపై నాధారపడి సంసిద్ధపడుమా
79 రాజాధిరాజా రావే - రాజుraajaadhiraajaa raave - raaju

ప్రకటన 22 : 20 "అమెన్ ; ప్రభువైన యేసూ, రమ్ము "

పల్లవి:
రాజాధిరాజా రావే - రాజు యేసు రాజ్యమేల రావే (1) 
రాజులకు రాజువై రావే - రవికోటి తేజ యేసు రావే (2)
ఓ......... మేఘ వాహనంబు మీద వేగమే
ఓ........ మించు వైభవంబుతోడ వేగమే (2)

చరణం 1:
ఓ...... భూజనంబులెల్ల తేరి చూడగా 
ఓ....... నీ జనంబు స్వాగతంబు నీయగా (2) 
నీ రాజ్య స్థాపనంబు చేయ-భూరాజులెల్ల గూలిపోవ (1)
భూమియాకాసంబు మారిపోవ- నీ మహా ప్రభావమున వేగ (2)

చరణం 2:
ఆ....... ఆకసమున దూతలార్భటింపగా
ఆ....... అది భక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్యవీధిలోన - ఏకమై మహాసభచేయ 
లోకనాథ ! నీదు మహిమలోన మాకదే-  మహానందమౌగా

చరణం 3:
ఓ....... పరమ యెరూషలేము పుణ్య సంఘమా! 
ఓ.........గొఱ్ఱెపిల్ల  క్రీస్తు పుణ్య సంఘమా ! 
పరమదూతలారా! భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా! 
గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్త గీతమెత్తి పాడరారా
80 ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడిprabhuni raakada ee diname parugulidi

ఆమోసు 4: 12 "మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి"

పల్లవి:
ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే (2)

చరణం 1:
సిద్ధులగువారిన్ - మనయేసు - శుద్ధిజేయునిలన్ - పరమునకై (2) 
బుద్ధిహీనులను శ్రమల చేత (1)- బద్ధులుగ జేయున్ - వేదనతో 
బాధ కలిగించున్ - సాతాను (2)

చరణం 2:
స్వరముతో వచ్చున్  - అధికారి  - మహిమతో మరలున్
తనదూత - సూర్యచంద్రునిలన్ తారలతో జీకటుల్ క్రమ్మున్ 
ప్రభురాక - పగలు రాత్రియగున్ - త్వరపడుము

చరణం 3:
మొదట లేతురు సజీవులై - ప్రభుని యందుండు - ఆ మృతులు 
మరల అందరము ఆ ధ్వనితో  -  పరము జేరుదుము ధర నుండి
ధన్యులగుడుము   -  పరికించు

చరణం 4:
వెయ్యియేండ్లు పా - లించెదరు ప్రియుని రాజ్యమున 
ఆ ప్రియులు, సాయంసమయమున - చేరి - నెమలి కోకిలలు 
ఆ రాజున్ - పాడి స్తుతించును ఆ దినము

చరణం 5:
గొఱ్ఱెమేకలును - ఆ చిఱుత సింహజాతులును ఒకచోటన్
  భేదము లేక బరుండి గరిక మేయును -  ఆ వేళ
  కలసి మెలగును  - భయపడక

చరణం 6:
న్యాయనీతులన్ - మన ప్రభువు ఖాయముగ దెల్పున్ 
ఆనాడు - సాక్షులుగ నిలుతుం అందరము - స్వామియేసునకు 
ధ్వజమెత్తి చాటి యేసునకు - ఓ ప్రియుడా
81 బూర శబ్దంబు నింగిన్ ధ్వనింపboora shabdambu ningin dhvanimpa

1 థెస్సలోనీ. 4:17 "దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును"

పల్లవి:
ప్రాణప్రియుడా - ప్రాణప్రియుడా
 రమ్ము మా యేసు - పాడెదము (1)
 హల్లెలూయ - ఎంతో సంతోషం (1)
 ఎగిరి పోయెదం - పాటలతో (2)

చరణం 1:
బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప - గాంచెదమేసున్ మా ఎదుట (1)
ఓర్పుతో మేము వేచియుంటిమి (1)-నిద్రించే వారు నిలతురిలన్ (2)

చరణం 2:
భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరు
దూతలు నింగిన్ ఏకమై కూడి - పాటతో బూర ధ్వనింతురు  ||ప్రాణ||

చరణం 3:
వేకువ చుక్క కాంతిని బోలి - సౌందర్యమైన మాధుర్యుడు
పరలోకమందు హెచ్చయినవాడు - నా కొరకై శ్రమసహించెను  ||ప్రాణ||

చరణం 4:
రెప్పపాటుతో శుద్ధులు లేచి - మరుగైపోదు రాయనతోనుండన్
మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మేసు నచ్చట  ||ప్రాణ||

చరణం 5:
పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద - దూతలు కాచి నిల్బుదినం
సంఘ వధువు ధవళ వస్త్రంబు ధరించి ఘనతనొందె దినం  ||ప్రాణ||

చరణం 6:
హల్లెలూయ ఆనందించెదం - హల్లెలూయ ఆర్భటింతుం
హల్లెలూయా ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్  ||ప్రాణ||
82 ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగాidigo nenu vachuchunnaanu - tvaragaa

ప్రకటన 22:12 "ఇదిగో త్వరగా వచ్చుచున్నాను”

పల్లవి:
ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగా వచ్చుచున్నాను
ఎవని క్రియల ఫలితము వానికియ్య వచ్చుచున్నాను

చరణం 1:
మేఘారూఢుడనై నిక్కముగా - తిరిగి వచ్చుచున్నాను (2)
ప్రతి నేత్రము వీక్షించును - పరిశుద్ధులై యుండుడి (2)

చరణం 2:
నేను త్వరగా వచ్చుచున్నాను - ఎవడు నీ కిరీటమును
అపహరింపకుండునట్లు - జాగ్రత్తగా చూచుకో

చరణం 3:
యేసు ప్రభువే సర్వమును - నూతన పరచుచున్నాడు
క్రీస్తుని రాకడను ప్రేమించి - కాయువారే ధన్యులు

చరణం 4:
వేవేగారా మా ప్రభు యేసు - వేచియున్నాము నీ కొరకే 
నీ దూతలతో వినుతించుచు - హల్లెలూయ పాడెదము
83 ప్రభువుకు తగినట్టు - పృథివిలో ప్రియుడాprabhuvuku taginattu - pruthivilo priyudaa

కొలొస్స. 1:12 “ప్రభువునకు తగినట్టుగా నడువుము”

పల్లవి:
ప్రభువుకు తగినట్టు - పృథివిలో ప్రియుడా
పదిలముగా జీవించవా? (2)

చరణం 1:
ఆదామవ్వలవలె నీవు సహ - కేవలము దిగంబరివై యుండ (2)
ఆ దేవగొర్రెపిల్ల చావొంది సిలువలో
పావన వస్త్రముల నిచ్చెన్ (2)

చరణం 2:
శ్రేష్ఠబలి నిచ్చి హేబెలు - సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందె
అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా
హతసాక్షిగా నీ వుండెదవా?

చరణం 3:
ప్రభు యడుగుజాడలను పరికించి
ప్రభుకనుకూలంబుగా నడచినచో
హనోకువలె ఆ రెండవ మరణము
నొందక ప్రభుతో నుండెదవు

చరణం 4:
పరిశుద్ధమైన ప్రవర్తనతో - ప్రభు సర్వాంగ కవచమున్ కల్గి
నీతిన్ ప్రకటించిన నోవహున్ బోలి
ఖ్యాతి సువార్తన్ చాటు మిలన్

చరణం 5:
మృతులను సహలేపు మహాత్ముడని
తన సుతునర్పించే నబ్రాహాము
మృతికి లోనగు నీ శరీరంబును
అతనికె బలిగానర్పించు

చరణం 6:
తన తండ్రి ఖడ్గమునకు ఇస్సాకు 
మౌనమున్ జూపి మరణము గోరె
కడు శ్రమకాలములో ఖండించే ఖడ్గము
ముంగిట నీవట్లుండెదవా?

చరణం 7:
యెహోవా భయము నొంది యోసేపు
ఎంత వైభవ మనుభవించెనోగాంచు
నీ జీవితంబులో దైవభయము నొంది
అక్షయ కిరీటమున్ బొందు
84 యౌవన జనమా జయమొందుమాyauvana janamaa jayamondumaa

1 యోహాను 2:14 “యౌవనస్థులారా, ... దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు”

పల్లవి:
యౌవన జనమా జయమొందుమా - విజయుండు క్రీస్తేసుని పొంది (1)
పరుగిడుము - పందెము నందు (2)

చరణం 1:
పాపభారముతో - ప్రయాస పడుచు
గురి లేక నీవు - తిరిగితివా? (2)
పరుగిడుచు రారమ్ము - ప్రభుచెంతకు పొందెదవు
ఆత్మశాంతిన్ పొందెదవు - ఆత్మశాంతిన్ (1)

చరణం 2:
ప్రార్ధన యందు - నిలకడ కలిగి
వాక్యము నందు - కదలక నిలచి
మంచి పోరాటము - పోరాడుము-జయమొందు - సాతాను పై
జయమొందు - సాతాను పై

చరణం 3:
యౌవనేచ్ఛల నుండి - పారిపొమ్ము
ప్రభు సేవ చేయ - కోరి రమ్ము
ఆత్మలను చేర్చు - ప్రభు చెంతకు -పొందెదవు బహుమానమున్ 
పొందెదవు బహుమానమున్

చరణం 4:
సంఘము నందు - అంగముగ నిలచి
సహవాసమందు - స్థిరముగ
నుండి వేచియుండుము - ప్రభు రాకకై- హల్లెలూయ గీతములతో
హల్లెలూయ - గీతములతో
85 దేవుడు మీకు ఎల్లప్పుడు - దేవుడు మనకు ఎల్లప్పుడుdevudu meeku ellappudu - devudu manaku ellappudu

జెకర్యా 8:23 "దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది"

పల్లవి:
దేవుడు మీకు ఎల్లప్పుడు - దేవుడు మనకు ఎల్లప్పుడు
తోడుగ నున్నాడు    ..........3 సార్లు

చరణం 1:
ఏదేనులో ఆదాముతో నుండెన్ - హానోకు తోడనేగేను
దీర్ఘదర్శకులతో నుండెన్  (2)
ధన్యులు దేవుని గలవారు (2) – తోడుగనున్నాడు (1)

చరణం 2:
దైవాజ్ఞను శిరసావహించి - దివ్యముగ నాబ్రాహాము
కన్న కొమరుని ఖండించుటకు 
ఖడ్గము నెత్తిన యపుడు –తోడుగనున్నాడు

చరణం 3:
యోసేపు ద్వేషించ బడినపుడు - గోతిలో త్రోయబడినపుడు
శోధనలో చెఱసాలయందు 
సింహాసనమెక్కినయపుడు –తోడుగనున్నాడు

చరణం 4:
ఎర్రసముద్రపు తీరము నందు - ఫరోతరిమిన దినమందు
యోర్దాను దాటిన దినమందు 
యెరికో కూలిన దినమందు -తోడుగనున్నాడు

చరణం 5:
దావీదు సింహము నెదిరించి - ధైర్యాన చీల్చినయపుడు
గొల్యాతును హతమార్చినయపుడు
సౌలుచే తరుమబడినపుడు –తోడుగనున్నాడు

చరణం 6:
సింహపు బోనులో దానియేలు - షద్రకు మేషా కబేద్నెగో
అగ్ని గుండములో వేయబడెన్
నల్గురిగా కనబడినపుడు –తోడుగనున్నాడు

చరణం 7:
పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు
అపొస్తలులు విశ్వాసులు
హింసించబడినయపుడు-తోడుగనున్నాడు
86 ఆనందించెదము - ప్రభు యేసులోaanandinchedamu - prabhu yesulo

1 సమూ. 30:19 "దావీదు సమస్తమును రక్షించెను"

పల్లవి:
నష్టము నంతటిని మరల- మా యేసునిలో ఆర్జించితిమి (1)
ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయ పాడెదము

చరణం 1:
ఆనందించెదము - ప్రభు యేసులో - అంతయు మరలా  ఆర్జించుకొంటిమి
ఆదాము నుండి పోయిన దెల్లయు - అనుభవించు చున్నామిప్పుడు

చరణం 2:
దావీదు వలె అంత నష్టపడితిమి - దుఃఖపడి బహుగా ఏడ్చితిమి
దావీదువలె ప్రభుని వెదకగ - తిరిగి ఆర్జించుకొంటిమి            || నష్టము ||

చరణం 3:
పూర్వము నైక్యము లేకపోయెను - పేదలమైయుంటిమి అప్పుడు
మనలను ఖాళీ చేసికొనగా - మరల నొందితిమి పూర్ణత       || నష్టము ||

చరణం 4:
మొదటి ప్రేమనుకోల్పోతిమిల  - వ్యర్థమైనట్టిప్రేమనొందితిమి
పొందితిమి యేసుప్రభువులో - నిండుగను  దైవప్రేమను       || నష్టము ||

చరణం 5:
దేవునికల్గియుండకుంటిమి - దైవసమాధాన మొందకుంటిమి
పాపములలో మరణించియుంటిమి - పరమజీవ మొందితిమి       || నష్టము ||

చరణం 6:
నిరీక్షణయేమిలేక యుంటిమి - నరకమున కర్హులమైయుంటిమి
ఘనుడగు యేసునంగీకరింపగా - నన్నును విమోచించెను      || నష్టము ||

చరణం 7:
పాపము వలనెంతో నష్టపోతిమి - ప్రభులో సకలము సంపాదించితిమి
శాపము నందు చుట్టబడతిమి - సర్వమొందెదము మరల      || నష్టము ||
87 జీవించుచున్నాడు యేసు ప్రభుjeevinchuchunnaadu yesu prabhu

గలతీ. 2:20 https://hebronworld.com/songs/lyrics/11/1891/86/aanandinchedamu-prabhu-yesulo

పల్లవి:
జీవించుచున్నాడు యేసు ప్రభు -నా హృదయములో నున్నాడు
కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును

చరణం 1:
మాటచే సాగరము పాయలైపోయె - కోటగోడలు కూలి మట్టమైనవి 
గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభుమాటచే
కుష్ఠురోగి శుద్ధుడాయె ప్రభుముట్టగా

చరణం 2:
నన్ను వదలక పట్టుకొనుము - నిన్ను విడువక వెంబడింతును
మరణించువేళ పరలోకపు – ఇంటికి నడుపు విమోచకుడా
88 పాపుల రక్షకుడు యేసు - గొప్ప దేవాది దేవుడు యేసుpaapula rakshakudu yesu - goppa devaadi devudu yesu

కొలొస్స 3 : 11 “క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు”

పల్లవి:
సర్వంబులో నాకు సర్వమేసు - సర్వశక్తి గల యేసు (1)
హల్లెలూయా - ఆమెన్ (2)

చరణం 1:
పాపుల రక్షకుడు యేసు - గొప్ప దేవాది దేవుడు యేసు (1)
కృపతో కౌగలించె నన్ను యేసు - ఉపకారి నన్ను చేర్చె యేసు (1)

చరణం 2:
గొఱ్ఱెలకు గొప్ప కాపరి యేసు - దొరుకు తన్ను వెదకు వారి కేసు
ఆరాధికులకు పరిశుద్ధు డేసు - నిరాశగల వారి మిత్రుడేసు

చరణం 3:
నాదు మార్గంబునకు వెలుగు యేసు
నాదు పాదంబులకు దీపము యేసు
నాదు దాహంబునకు పానము యేసు
నాదు యజ్ఞానంబుకు జ్ఞానము యేసు

చరణం 4:
నాదు రోగంబులకు వైద్యుడు యేసు
నాదు బాధ్యతల వహించు నేసు
నాకు ఏకాంతములో తోడు యేసు
నాకు తేనెకంటే బహు తీపి యేసు

చరణం 5:
నాకు రక్షకుడు రక్షణ యేసు
నాకు విమోచకుడు విమోచ నేసు
నాకు జీవంబును దేవుడు యేసు
నాకు నీతి నాదు వెలుగు యేసు

చరణం 6:
నాదు హృదయంబున యున్నవాడు యేసు
నాదు వృద్ధికికారకుండు యేసు
నాదు కృంగుదలలో తోడనుండు యేసు
నాదు సర్వమందు నిల సర్వమేసు
90 బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింపbalavantudesu mahima - paadi veelagune vivarimpa

యెషయా 12 : 3 "రక్షణ బావులు"

పల్లవి:
హా! రక్షణంపు బావులెల్లను అంతులేని లోతుగలవి (1) 
ఎండిపోవు ఎన్నడైనను చేదికొందు మెన్నడందున (2)

చరణం 1:
బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింప (1) 
కల్వరి రక్షణ విలువ ఎల్లరికిని దొరుకును (1)

చరణం 2:
నీళ్ళు లేని శ్రమ యెంతయో - దీని నాలోచించరే యెవ్వరు
విలువైన ప్రభుని మాటలన్ ఆలకించి యంగీకరించు   ॥ హా! ॥

చరణం 3:
ఉప్పు నీళ్ళ బావులున్నను - ఇక ఉపయోగమే యుండదు
తప్పులన్ని త్రోసివేయుము - అప్పుడే యానందమబ్బును   ॥ హా! ॥

చరణం 4:
కలహముల మానివేతుము - మంచి జలముల త్రాగి యానందింతుము
ఎల్లర మేకమౌదము - తొలగద్రోసి యడ్డులన్నియు   ॥ హా! ॥

చరణం 5:
జీవజలముల త్రాగినవారు - మీరు దేవుని సాక్షులై యుండుడి
భువి నెందరో దప్పిగొన్నారు - త్రోవ జూపుడి వారికి   ॥ హా! ॥
91 భక్తుల సంఘమే - ప్రభుని శరీరముbhaktula sanghame - prabhuni shareeramu

ఎఫెసీ 1 : 23 "(ఆ సంఘము) ఆయన శరీరము, అది సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటినినింపుచున్న వానితో నింపబడినదై యున్నది”

పల్లవి:
భక్తుల సంఘమే - ప్రభుని శరీరము (1)
అందాయన తన - పూర్ణత నింపును  (2)

చరణం 1:
ఒక్క శరీరమునకు - శిరస్సు నొకటేగా (2)  
సంగమునకు ప్రభు - వే శిరస్సుగా (2)

చరణం 2:
శిరస్సు నుండే యోచనలు వెలువడును
శరీరము నందు - ప్రకటింపబడున్

చరణం 3:
యూదులని హెల్లే - నీయులనియు లేదు
దాసులనియు స్వతం - త్రులనియు లేదు

చరణం 4:
కలవు శరీరములో - అనేకావయవముల్
కలసి ఏకముగా - నివసించుచుండున్

చరణం 5:
కరములు కాళ్లతో - కలహించలేవు
కలయకనే కార్య-మును - చేయలేవు

చరణం 6:
ఆత్మైక్యత నను - యవములు కలిగిన
క్షేమాభివృద్ధిని - దేహము బొందున్

చరణం 7:
శిరస్సాధీనములో - సర్వాంగములుండిన
సేవలో ప్రభు పరి-పూర్ణత యుండును
92 సంఘమే - పరిశుద్ధ సంఘమేsanghame - parishuddha sanghame

1 కొరింధీ 12:24, 25: రోమా 12:5 "ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము."

పల్లవి:
సంఘమే - పరిశుద్ధ సంఘమే - సార్వత్రిక - సంపూర్ణ సంఘమే (2)

చరణం 1:
దేవుడే - మన తండ్రి - క్రీస్తు ప్రభువే - మన శిరస్సు (2) తన రక్తములో - కడుగబడిన
సంఘములో - అంగము నీవు, నేనే (2)

చరణం 2:
కాళ్ళు, చేతుల - పని వేరు -  కళ్లు, నోటి - పని వేరు 
అయిననూ - ఒకే శరీరము -  అందరు సమము-అమూల్యము

చరణం 3:
అపొస్తలులు - పెద్దలు - సువార్తికులు- పరిచారకులు 
సంఘక్షేమాభి - వృద్ధికై - మన ప్రభువే  - నియమించెను

చరణం 4:
మోషే - దేవుని సేవకుడు- దానియేల్ -  ప్రియ సేవకుడు
దేవుడే - కనుగొనెను - నిజదాసుని కిచ్చును బహుమానము

చరణం 5:
కొంచెములో - నమ్మకముగా నుంటివని -దేవుడే నిన్ను - పొగడును 
భళా ! మంచి - నమ్మకమైన - దాసుడంచు - కిరీటమిచ్చున్
93 క్రీస్తు యేసు ప్రభుని - శరీరమే సంఘంkreestu yesu prabhuni - shareerame sangham
పల్లవి:
క్రీస్తు యేసు ప్రభుని - శరీరమే సంఘం (1) 
మీరు దానిలో వేరు వేరు -  అంగములై యున్నారు (2)

చరణం 1:
చీకటిలో నున్న మిమ్ములను తన  - ఆశ్చర్యమైన వెలుగులోనికి (2) 
మిమ్మును పిలిచిన యేసుప్రభుని 
గుణాతిశయములు ప్రచురించుడి (1)

చరణం 2:
రాజులైన యాజక సమూహమును-దేవుని సొత్తైన ప్రజలైయున్నారు 
ఆత్మకు విరోధమై యుండె  - శరీరాశలను విసర్జించుడి

చరణం 3:
దేవునికి అనుకూలముగా- ఆత్మీయ బలులర్పించుటకై 
పరిశుద్ధ యాజకులుగా యుండునట్లు 
సజీవ రాళ్ళమై యున్నాము

చరణం 4:
దేవుడు పరిశుద్ధుడు గనుక - మీరు పరిశుద్ధులై యుండుడి
వ్యర్థ ప్రవర్తనను విడనాడి- నిందా రహితులై జీవించుడి

చరణం 5:
ఏకముగను కలిసి వసించును - శరీరములోని అంగములు
శిరస్సైన ప్రభునకు లోబడియుండి 
కలిసి యుండుడి ప్రేమలో
94 నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమాnee devuni sannidhini - kanabadanu neevu siddhapadumaa

అమోసు 4: 12 "మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి"

పల్లవి:
నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా (1)

చరణం 1:
నీ యౌవనములో - నీ హృదయమును - సంతృప్తిగా - నుండనిమ్ము  (2)
ఆయితే వీటిని బట్టి దేవుడు 
తీర్పులోనికి - తెచ్చు నిన్ను (2)

చరణం 2:
దుర్దినంబులు రాకముందే - వాటిలో సంతోషము లేదని
చెప్పుసమయము రాకమునుపే
సృష్టికర్తను స్మరియించుమా

చరణం 3:
నీ యౌవన జీవితమును బట్టి - తృణీకారము నొందకుమా
ప్రభువును బోలి నడచుకొనుమా
మాదిరి కరముగా జీవించుమా

చరణం 4:
వినయ విధేయత కలిగి యుండి - ఒకరి నొకరు యోగ్యులుగా
మన్నన చేయుచు పరుల కార్యముల
స్వకార్యముల వలె భావించుమా

చరణం 5:
ప్రేమ సంతోష - సమాధానము దీర్ఘ శాంత దయాళుత్వము 
మంచితనము సాత్వీక విశ్వాసము
కలిగి యుండి జీవించుమా

చరణం 6:
మేలు చేయుట యందు నీవు - విసుగక యుండుము యెల్లప్పుడు
సహనముతో ప్రభు సేవ చేసిన
ఫలము ననుభవించెదవు

చరణం 7:
హల్లెలూయ పాటలు పాడుచు - ఎల్లప్పుడు ప్రభు రాకడకై
ఉల్లము నందు సంతసించుచు
పాడుము ప్రభునకు హల్లెలూయ
95 నే యేసుని వెలుగులో నడిచెదనుne yesuni velugulo nadichedanu

యోహాను 8:12 “నేను లోకమునకు వెలుగునై యున్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగి యుండును”

పల్లవి:
నడిచెద నే ప్రభు యేసునితో - నడిచెద నే ప్రభు హస్తముతో
కాంతిలో నుండగ జయంగాంతును- యేసునే నే వెంబడింతును (1)

చరణం 1:
నే యేసుని వెలుగులో నడిచెదను-రాత్రింబగలాయనతో నడిచెదను
వెల్గున్  నడిచెదను-  వెంబడించెదను యేసుడే నా రక్షకుడు (1)

చరణం 2:
నే యేసుని వెలుగులో నడిచెదను-గాఢంబగు చీకటిలో భయపడను
ఆత్మతో పాడుచు సాగిపోవుదును యేసుడే నా ప్రియుండు  ॥ నడిచెద ॥

చరణం 3:
నే యేసుని వెలుగులో నడిచెదను
వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును
సర్వమిచ్చెదను చెంతనుండెదను యేసుడే ప్రేమామయుడు (1) ॥ నడిచెద ॥

చరణం 4:
నే యేసుని వెలుగులో నడిచెదను-దిన సహాయము నే పొందెదను
సుఖ దుఃఖమైన మరణంబైన
యేసుడే నా యండనుండును   ॥ నడిచెద ॥

చరణం 5:
నే యేసుని వెలుగులో నడిచెదను-నా దృష్టిని ప్రభుపై నుంచెదను
సిల్వధ్వజమునే బట్టి వెళ్లెదను యేసుడే నా చెంత నుండును    ॥ నడిచెద ॥
96 యెహోవా నా బలమాyehovaa naa balamaa

కీర్తనలు 18 : 1 "యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను"

పల్లవి:
యెహోవా నా బలమా - యథార్థమైనది నీ మార్గం 
పరిపూర్ణమైనది నీ మార్గం (1)

చరణం 1:
నా శత్రువులు - నను చుట్టినను -  నరకపు
పాశము లరికట్టినను (2)
వరదవలె భక్తిహీనులు-పొర్లిన (2) విడువక నను యెడబాయని దేవా (2)

చరణం 2:
మరణపుటురులలో - మరువక మొరలిడ-  ఉన్నత దుర్గమై -  రక్షణ శృంగమై
తన ఆలయములో -  నా మొర వినెను 
అదిరెను ధరణి భయకంపముచే

చరణం 3:
పౌరుషము గల - ప్రభు కోపింపగా - పర్వతముల పునాదులు వణీకెను 
తన నోట నుండి - వచ్చిన యగ్ని 
దహించివేసెను వైరుల నెల్లన్

చరణం 4:
మేఘములపై- ఆయన వచ్చును-మేఘములను తన మాటుగ జేయును
ఉరుముల మెరుపుల-మెండుగ జేసి 
అపజయ మిచ్చును అపవాదికిని

చరణం 5:
దయగల వారిపై-దయ జూపించును-కఠినుల యెడల వికటము జూపును
గర్విష్టుల యొక్క-గర్వము నణచును 
సర్వము నెరిగిన సర్వాధికారి

చరణం 6:
నా దీపమును - వెలిగించువాడు  - నా చీకటిని వెలుగుగా జేయును
జలరాసుల నుండి-బలమైన చేతితో
వెలుపల జేర్చిన బలమైన దేవుడు

చరణం 7:
నా కాళ్లను లేడి - కాళ్లగ జేసి - ఎత్తయిన స్థలముల శక్తితో నిలిపి 
రక్షణ కేడెము-నా కందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన

చరణం 8:
యెహోవా జీవము గల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ వీవు
అన్య జనులలో-ధన్యత జూపుచు 
హల్లెలూయా స్తుతిగానము జేసెద
97 తన రెక్కల క్రింద ఆశ్రయముtana rekkala krinda aashrayamu

కీర్తనలు 91 : 1 "మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు"

పల్లవి:
తన రెక్కల క్రింద ఆశ్రయము  - తన రెక్కలతో కప్పును (2)

చరణం 1:
సర్వోన్నతుని చాటున - నివసించెడి వాడె (1)
సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే (2)

చరణం 2:
ఆయనే నా ఆశ్రయము -  నా కోటయు దుర్గమును 
ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు  || తన||

చరణం 3:
పగటి బాణముకైనా రాత్రి భయమునకైనా
చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను   || తన||

చరణం 4:
వేయి వదివేలు -  కుడి ప్రక్కను కూలినను 
దయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు   || తన||

చరణం 5:
నీ ప్రభునాశ్రయమే యెహోవా నివాసం 
అపాయము తెగులు -  నీ గుడారము సమీపించవు  || తన||

చరణం 6:
నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్
పాదములకు రాయి తగలకుండ నిన్నెత్తుకొందురు   || తన||

చరణం 7:
కొదమ సింహముల -నాగు పాముల నణచెదవు 
అతడు నా నామము నెరిగెను అతని తప్పించెదను  || తన||

చరణం 8:
అతడు నను ప్రేమించెన్ - నామమున మొరపెట్టెన్
అతని విడిపించి ఘనపరతున్ అతని కుత్తరమిత్తున్  || తన||
98 యేసు ప్రభు నీ ముఖyesu prabhu nee mukha

యోహాను 6 : 35 “జీవాహారము నేనే... నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.”

పల్లవి:
యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే (1)  
నా ప్రతి యాశను తీర్చుకొందును (2)

చరణం 1:
నీవే నాకు జీవాహారము (2) - నిన్ను సమీపించువారే మాత్రము (2)  
ఆకలి గొనరిల ఆదర్శుడవు (2)

చరణం 2:
నీ మందిర సమృద్ధి వలన నా - మది నెప్పుడు తృప్తిపొందితిని  
ఆనంద జలమును త్రాగించుచున్నావు

చరణం 3:
నీవే నాకు జీవపు మార్గము - నీ సన్నిధిని పూర్ణానందము  
కలదని నిన్ను ఘనపరచెదను

చరణం 4:
ఆశతో నిండిన నా ప్రాణమును - ఆకలిగొనిన నాదు ఆత్మను  
మేలుతో నీవు తృప్తిపరచితివి

చరణం 5:
నీ సంతోషము నా కొసగితివి -నా సంతోషము పరిపూర్ణముగా  
కావలయునని కోరిన ప్రభువా

చరణం 6:
నా జీవిత కాలమంతయును - నీ ఆలయములో నివసించుచు  
హల్లెలూయ పాటను పాడెద ప్రభువా
99 ధన్య ధన్య ధన్య ప్రభుకు- తానే రక్షణ మన కొసగేdhanya dhanya dhanya prabhuku- taane rakshana mana kosage

లూకా 24 : 15 "యేసు... వారితో కూడ నడిచెను.”

పల్లవి:
ధన్య ధన్య ధన్య ప్రభుకు- తానే రక్షణ మన కొసగే
నీ సన్నిధికి నడిపి - ప్రభువా-  రాత్రింబవళ్ళు గాచితివి

చరణం 1:
పగటిలో మేఘ స్తంభముగా- రాత్రిలో యగ్నిస్తంభముగా
రక్షకుడవుగా నుండి - ప్రభువా-  సుఖశాంతితో గాచితివి

చరణం 2:
వాక్యమన్నాతో పోషించి- బండ నీళ్ళను త్రాగించితివి
ఆత్మకు తృప్తినిచ్చి - ప్రభువా- శాంతిని నాకిచ్చితివి    ||ధన్య||

చరణం 3:
ఆత్మీయ సుందర హృదయములో- ఆత్మ ప్రాణ శరీరములో
ఆత్మీయ జీవ మొసగి - ప్రభువా- ఆత్మను మేల్కొలిపితివి    ||ధన్య||

చరణం 4:
కానునులోనికి తెచ్చితివి- పరిశుద్ధులతో జేర్చితివి
ప్రణుతించెదను నిన్ను - ప్రభువా- సాగిలపడి పూజింతున్     ||ధన్య||
100 ఓ యువకులారా మనమందరముo yuvakulaaraa manamandaramu

హెబ్రీ 7 : 25; హెబ్రీ 2 : 18; యదా 24 "తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు"

పల్లవి:
ఓ యువకులారా మనమందరము
నిత్యము యేసుని స్తుతించెదము (2)

చరణం 1:
గత కాలమున మన ప్రభుయేసు
నూతన దీవెనలను (2) - ఖ్యాతిగా నొసగె- మనకు (2)
స్తుతియించెదమేసుని (2)
నూతన అనుభవములతో - ఖ్యాతిగా సర్వశక్తుని (2)

చరణం 2:
శక్తిమంతుడు మన ప్రభు యేసు
నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే
సంపూర్ణముగా కాయున్
సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు

చరణం 3:
ఎన్ని  శోధనలు భువినున్న
తానె మనలను విడిపించును - శోధింపబడెను యేసు
తన సహాయము నొసగున్
కనుపాపవలె ప్రభు కాయున్ - నిత్యము నిలుచు మనతో

చరణం 4:
శక్తిమంతుడు మన ప్రభు యేసు
తొట్రిల్లకుండ కాపాడును - నిర్దోషులనుగా - ప్రభువు 
నిలుపును తన మహిమతో
తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల

చరణం 5:
కృంగిన యువకులారా మీరు
భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము
జయము జయమని ప్రభుకే
యుగయుగములు మన ప్రభుకే హల్లెలూయ గీతములతో
101 మేము భయపడము ఇక మేము భయపడముmemu bhayapadamu ika memu bhayapadamu

యోబు 5 : 19 , యెషయా 27 :3 "నీకు ఏకీడు తగులదు, “యెహోవా అను నేను ... దివారాత్రము దాని కాపాడుచున్నాను”

పల్లవి:
మేము భయపడము ఇక మేము భయపడము (1)
ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు (2) ॥మేము॥

చరణం 1:
దైవభ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించె (2)
దివారాత్రులు దేవుడే కాయును (1)

చరణం 2:
శత్రుకోటి మమ్ము జుట్టన్ పాతాళము మ్రింగజూడన్
నిత్యుడు యేసు నిత్యము కాయును

చరణం 3:
అగ్ని పరీక్షల యందు వాగ్దానమిచ్చె మాతోనుండ
యే ఘడియైనను విడువక కాయును

చరణం 4:
బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి
పలు విధములుగా కాపాడుమమ్ము

చరణం 5:
కునుకడు మన దేవుడు యెన్నడు నిద్రించడు
కనుపాపగ మమ్ము కాపాడునెప్పుడు

చరణం 6:
జీవిత కష్టనష్టములు ఆవరించి దుఃఖపరచ
దేవుడొసంగిన ఈవులు నెంచుచు

చరణం 7:
ఇహమందు మన శ్రమలన్ని మహిమకు మార్చెడు ప్రభున్మ
హిమపరచి మ్రొక్కెదమిలలో
102 నీ రక్తమే – నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్nee raktame – nee raktame - nan shuddheekarinchun

1 యోహాను 1: 7 "ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును".

పల్లవి:
నీ రక్తమే – నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్ (1)
నీ రక్తమే నా బలము (1)

చరణం 1:
నీ రక్తధారలే యిల   - పాపికాశ్రయంబిచ్చును (2)
పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచుము (2)

చరణం 2:
నశించువారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది
రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియై యున్నది

చరణం 3:
నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే
పాపవిముక్తి జేసితివి - పరిశుద్ధ దేవ తనయుడ

చరణం 4:
పందివలె పొర్లిన నన్ను - కుక్కవలె తిరిగిన నన్ను
ప్రేమతో జేర్చుకొంటివి - ప్రభువా నీకే స్తోత్రము

చరణం 5:
నన్ను వెంబడించు సైతానున్ - నన్ను బెదరించు సైతానున్
దునుమాడేది నీ రక్తమే - దహించేది  నీ రక్తమే

చరణం 6:
స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకును
స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడ నీకే తగును
103 విడువవు నన్నిక ఎన్నడైనను - పడిపోకుండా కాయురక్షకాviduvavu nannika ennadainanu - padipokundaa kaayurakshakaa

కీర్తనలు 145 : 14 "యెహోవా పడిపోవు వారినందరిని ఉద్ధరించి లేవనెత్తువాడు"

పల్లవి:
విడువవు నన్నిక ఎన్నడైనను - పడిపోకుండా కాయురక్షకా (2)
పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభూ (2)

చరణం 1:
ప్రభువా నీకవిధేయుడనై - పలుమారులు పడు సమయములో (2)
ప్రేమతో జాలి దీన స్వరముతో - ప్రియుడా నను పైకెత్తితివి (2)

చరణం 2:
ఆదాము హవ్వలు ఏదేనులో - ఆశతో ఆజ్ఞమీరినను
సిలువకు ఛాయగ బలి నర్పించి - ప్రియముగా విమోచించితివి

చరణం 3:
మోషేకు నీ దర్శనమిచ్చి - నీ ప్రజలను నడిపించుటకై
సాకులు చెప్పిన విడువక తననే - నాయకునిగ నియమించితివి

చరణం 4:
స్వంత తలంపున దావీదు - మందసమును తెచ్చునపుడు
ఉజ్జా మరణముచే దావీదు - హృదయమును కదిలించితిని

చరణం 5:
నీ మాటలు వినక యోనా - తర్షీషుకు  తరలినపుడు
సముద్రములో ముసుగుచుండగ - చేపద్వారా దరిచేర్చితిని

చరణం 6:
నిన్నెన్నడు యెడబాయనని - నిక్కముగ పేతురు పలికె
ముమ్మారు బొంకినను విడువక - ప్రేమతోను రక్షింతిని

చరణం 7:
మా  శక్తియు మా భక్తియు కాదు  - ఇలలో జీవించుట ప్రభువా
కొల్లగ నీ ఆత్మను నొసగితిని - హల్లెలూయ పాడెదను
104 మనమే ప్రభుని పరలోక గృహముmaname prabhuni paraloka gruhamu

ఎఫెసీ 2:19 "కాబట్టి మీరిక మీదట.... దేవుని యింటివారునై యున్నారు."

పల్లవి:
Maname prabhuni paraloka gruhamu - tane nasinchunu daniyandu (2)

చరణం 1:
ఎంత సుందరమో ప్రభునిగృహము (2) - నలుదిక్కులనుండి కూర్చెనుగా (2)
ఏక శరీరము రక్తబంధముచే (2)
వేలాది భాషల నుండినను (1)

చరణం 2:
ఒక నూతన వ్యక్తిగా మము జేసే - పరమ గృహమునకు చెందితిమి
ఐక్యతతో స్థిరముగ నమర్చబడిదేవుని గుడారముగా నైతిమి

చరణం 3:
నల్లని తెల్లని వారని లేదు - ధనికులు దరిద్రులనియు లేదు
పామరులని జ్ఞానులనియు లేదు
యేసు ప్రభువే సర్వముగా

చరణం 4:
ప్రభుని గృహమున కలహము లేదు - ఈర్ష్య కపట భేదము లేదు
శాంతి ఆనందము నిజ ప్రేమయుండును
నేర్పుతో నడుపును మన ప్రభువే

చరణం 5:
ప్రభుని గృహము యిద్దరయందున్నది - తన దాసుల కధికారమిచ్చె
ప్రతివానికి వాని పని నియమించె
కావలి యుండుము మెలకువతో

చరణం 6:
దృఢ విశ్వాసము మదినందుంచి  - విజయులై యాత్రలో సాగెదము
ఆదర్శులమై ఈ జగమందున
పూర్తిగా శత్రువు నోడింతుము

చరణం 7:
ప్రియుని దినము సమీపించుచున్నది - చెప్పెను మేల్కొని యుండుమని
విశ్వాస యోగ్యులముగ జీవించి
వేచియుండెదము
105 ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను అ.. అ..idigo nenoka nootana kriyanu cheyuchunnaanu a.. a..

యెషయా 43:19 “ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను”

పల్లవి:
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను అ.. అ.. (2)

చరణం 1:
అడవిలో త్రోవను జేసి - ఎడారిలో నదులను నేను
ఎల్లప్పుడు సమృద్ధిగా - ప్రవహింప జేసెదను

చరణం 2:
నాదు ప్రజలు త్రాగుటకు - నేనరణ్యములో నదులు
సమృద్ధిగా పారునట్లు - సృష్టించెదను నేను

చరణం 3:
అరణ్యములో జంతువులు - క్రూరపక్షులు సర్పములు
ఘనపరచును స్తుతియించును - దీని నాలోచించుడి

చరణం 4:
నూతన సృష్టి గ నినుజేసి - నీ శాంతిని నదివలెజేసి
ననుజూచి మహిమపరచి - స్తుతిబాడ జేసెదను

చరణం 5:
నేనే దేవుడనని దెలసి - నా కార్యములను నెరవేర్చి
ముందున్న వాటికన్న - ఘనకార్యములను జేతున్

చరణం 6:
మరుగైన మన్నానిచ్చి - మరితెల్లని రాతినిచ్చి
చెక్కెదనా రాతిమీద - నొక క్రొత్త నామమును

చరణం 7:
పరలోక భాగ్యంబులు - నరలోకములో మనకొసగెన్
కరుణా సంపన్నుడగు - మన ప్రభునకు హల్లెలూయ
106 ఆనంద మహానందంaananda mahaanandam

యోహాను 15 : 11 “మీయందు నా సంతోషము.....పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.”

పల్లవి:
ఆనంద మహానందం ప్రభువే మనకానందం  (1)
మనయందు నిలిచి యుండును పరలోకపు ఆనందం  (2)

చరణం 1:
దూతలు తెచ్చిరి శుభవార్త యెంతో గొప్పానందము  (2)
కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే  (2)

చరణం 2:
ఆనందించుడనె ప్రభువే పరమందున మీ పేరుల్
గొఱ్ఱె పిల్ల జీవగ్రంథమందు వ్రాయబడియున్నవని

చరణం 3:
నీ సన్నిధియందే కలవు నిత్య సంతోషములు
నీ చిత్తము నెరవేర్చువారెల్లరు ఆనందించెదరు సదా

చరణం 4:
ఇదివరకును మీరేమియును అడుగ లేదు నన్ను
మీ సంతోషము పూర్ణమగునట్లు అడిగి పొందుమనెను

చరణం 5:
యెహోవా విమోచించిన వారె పాటలు పాడి
శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు

చరణం 6:
ఆయన కొరకవమానమును మరినిందకు పాత్రులము
తన వాక్యమెవ్వరి మదియందుండునో సంతోషింతురు మిగుల

చరణం 7:
ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు
సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయ పాడెదరు
107 నేనే భయపడ వలదని పలికెనుnene bhayapada valadani palikenu

2 పేతురు 1 : 3 "మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక."

పల్లవి:
నేనే భయపడ వలదని పలికెను", 
           "మన రక్షకుడు యేసు ప్రభూ (2)

చరణం 1:
తన సమాధానము నీకిచ్చి -  కృపల నెన్నో చూపెనుగా (2)
 తనివితీరస్తుతి  చెల్లించుము -  తనదు ప్రేమా దయకొరకు (2)

చరణం 2:
శాశ్వతంబగు జాలిజూపి - శాశ్వతరక్షణ నొసగి
విశ్వాసముతో నిలిచిన యెడల - శాశ్వత రాజ్యంబొసగు

చరణం 3:
నరుడు కాడు దేవుడతడు - నరుడు ఆయెను నీ కొరకు
కరుణతో నిను రక్షించుటకు  - సర్వమిచ్చెను శ్రీ యేసు

చరణం 4:
మరణించెను ప్రభు నీ కొరకే  - తిరిగి లేచెను కాపాడన్
త్వరగా వచ్చును కనిపెట్టుము - నిరతమాయన తోనుండ

చరణం 5:
ఎంత పాపివైన నిలలో  - చింత లేదిక నమ్మినచో
వింత రక్షకుడేసు ప్రభువు - స్వంత ప్రాణమునర్పించె

చరణం 6:
నీ యాత్రలో బలమిచ్చుటకు - తనదు దేహ రక్తమును
ముదముతో అర్పించిన ప్రభుకే  - హల్లెలూయా పాడుము
108 యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదనుyesoo naa siluvan mosi ninu ne vembadinchedanu

లూకా 9 : 5 7 “నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదను”

పల్లవి:
యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను (1)
నీదు దాసుడనై నిన్నే నిన్నే నిన్నే వెంబడించెదను (2)

చరణం 1:
యేసు నన్ను రక్షించి - నా కొరకు రానైయుండ (2)
నేనికను నీదు వెంటనే వెంటనే వెంబడించెదను (2)

చరణం 2:
నీ ప్రాణము నాకిచ్చితివి - నేనికను నీ దాసుడనే
ద్రోహంబు చేయక చక్కగ చక్కగ వెంబడించెదను

చరణం 3:
మరణంబు గెల్చిలేచెన్  - మృత్యుంజయండై యేసు
నే నీ నిరీక్షణ  గలిగి నిను నే వెంబడించెదను

చరణం 4:
నే నేసు స్వామికి సాక్షిన్ - నా సాక్ష్యమిట్లుండగను
నీదు రాకడకై  నిరీక్షించి వెంబడించెదను

చరణం 5:
యేసు నా జీవాదాతా - నా రక్షకా నా ప్రభువా
నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను
109 ప్రభుని దర్శనంprabhuni darshanam

సామెతలు 29 : 18 "దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు"

పల్లవి:
ప్రభుని దర్శనం యేసుని దర్శన
మొంది సేవ - చేయుము దేవునికి (2

చరణం 1:
ఇండియ దేశము రక్షణకై ని - న్నిదిగో రమ్మనెను (2)
పాప సముద్ర - పాప సముద్ర
అగాధములో ఆత్మలు మునిగెను (2)

చరణం 2:
సిలువపై తన ప్రాణమునిచ్చెను - కలుషాత్ములకై
తన హృదయములో - తన హృదయములో
ఇండియ దేశమునకు - స్థలమిచ్చెను

చరణం 3:
యౌవన జీవితము నంతటిని - వ్యర్థము చేసితివి
రక్షకుడేసుని - రక్షకుడేసుని
తక్షణమే లేచి సేవించుమా

చరణం 4:
ఆత్మల రక్షణకై సోదరుడా - ఆశతో లేచి రా
విస్తారముగా - విస్తారముగా
కోత యున్నది - నూతన బలమున రా
110 ఈ లోక యాత్రలో నే సాగుచుండee loka yaatralo ne saaguchunda

ఫిలిప్పీ. 3 : 14 "గురి యొద్దకే పరుగెత్తుచున్నాను"

పల్లవి:
ఈ లోక యాత్రలో నే సాగుచుండ  (2)
ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు (2)
అయినను క్రీస్తేసు నాతోడ నుండు  (2)

చరణం 1:
జీవితయాత్ర యెంతో కఠినము (2)  ఘోరాంధకార తుఫాను లున్నవి (2)
అభ్యంతరములు యెన్నెన్నో వుండు (2) , కాయువారెవరు రక్షించేదెవరు  (2)

చరణం 2:
హృదయము శుద్ధి పరచుకొన్నాను - నా చేతులెంతో పరిశుద్ధ పరచ
అనుకొనని రీతి అపవాది వచ్చి - నా జీవితమును నిరాశపరచె

చరణం 3:
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా - అనుదినము నన్ను ఆదరించెదవు
నీతో వున్నాను విడువలేదనెడు - నీ ప్రేమ మధుర స్వరము విన్నాను

చరణం 4:
ఈ అనుభవముతో నేనడచుకొందు - ప్రియయేసువైపు నేను చూచుచు
గతమునంత నేను మరచిపోయెదను
కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు

చరణం 5:
తోడైయుండెదవు అంతము వరకు - నీవు విడువవు అందరు విడచినను
నూతన బలమును నా కొసగెదవు
నే స్థిరముగ  నుండ నీ కోరిక యిదియే
111 నిశ్చయముగ నిన్నుnishchayamuga ninnu

ఆది. 12 : 2,3 "నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును... సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడుదురు."

పల్లవి:
నిశ్చయముగ నిన్ను దీవించెదను (2)",
          "నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2)

చరణం 1:
ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు - సర్వశక్తి గల యెహోవాను నేను (2)
నా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన (2) - నీతో నిబంధన నియమింతును (2)

చరణం 2:
నీ సంతానమును దీవించి - నిన్ను ఫలియింప జేసెదను
నీలో నుండి జనములు వచ్చును - నీతో నిబంధన స్థిరపరతున

చరణం 3:
యుగ యుగములు నీకు దేవుడను - కనాను దేశము నీ కొసగెదను
నిత్య స్వాస్థ్యమును నీ కొసగెదను నీలో మహిమ నే పొందెదను

చరణం 4:
గొప్ప జనముగా జేసెద నిన్ను - నిశ్చయముగా ఆశీర్వదింతున్
నీ నామమును గొప్ప జెసెదను -  ఆశీర్వాదముగ  జేసెదను

చరణం 5:
నిన్నాశీర్వదించు వారిని - నేను ఆశీర్వదించెదను
దూషించువారిని నే శపించెదను - నీ ద్వారా దీవింపబడెదరు
112 ఆనందించెదము యెహోవాలోaanandinchedamu yehovaalo

యెషయా 61 : 10 "ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు"

పల్లవి:
ఆనందించెదము యెహోవాలో -  అతిశయించును మాదు ఆత్మ
రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము - నీతి వస్త్రమున్ ధరింపజేసె

చరణం 1:
పరదేశులు మమ్ము ప్రభువా దేవా - నీదు యాజక సేవకులనెదరు
జగమున జనముల భాగ్యంబిచ్చి
ప్రభవింతురంటివి ప్రభావముతో

చరణం 2:
అన్యులు చేసిన అవమానమునకు - ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను
నిందకు ప్రతిగా పొందిన భాగము
అనుభవించుచు హర్షింతురంటివి

చరణం 3:
వారు తమదు దేశము నందు - రెట్టింపు భాగమునకు కర్తలౌదురు
నిత్యానందము వారికి కలుగును
ఎన్నడు వారిని విడువనంటివి

చరణం 4:
న్యాయము చేయుట నాకెంతో ప్రీతి - అన్యాయపు సొత్తు నా కసహ్యము
సత్యము బట్టి ప్రతిఫలమిచ్చుచు
నిత్య నిబంధన చేసెదనంటివి

చరణం 5:
జనములకు వారి సంతతి తెలియును - జనముల మధ్యను ప్రసిద్ధి నొందును
యెహోవా ఆశీర్వదించిన జనమని
ఒప్పుకొందురు చూచినవారు

చరణం 6:
భూమి మొలకను మొలిపించినట్లుగా - తోటలో మొలిచిన విత్తనము వలె
జనముల యెదుట ప్రభు యెహోవా
నీతి స్తోత్రములను ఉజ్జీవింపజేయును

చరణం 7:
క్రీస్తు నందు మాకిచ్చినయట్టి - ఆత్మబంధిత ప్రతి ఆశీస్సులకై
సర్వోన్నతుడా సన్నుతించుచు
హల్లెలూయ స్తోత్రముల్ ఆరోపింతుము
113 యెహోవా నా ఆశ్రయ దుర్గమాyehovaa naa aashraya durgamaa

కీర్తనలు 19 : 7 “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది”

పల్లవి:
యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా నా రక్షకుడా
నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము, నీ దివ్య వాక్యమే ఆహారము

చరణం 1:
యెహోవా నియమించెను ధర్మశాస్త్రము, అది ఎంతో యధార్థమై యున్నది
అది ప్రాణమును తెప్పరిల్లజేయును
బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించున్

చరణం 2:
యెహోవా నీ ఉపదేశంబులు - నిర్దోషములు అయి యున్నవి
నీ ధర్మమెంతో నిర్మలమైనది - అది కన్నులకెంతో వెలుగిచ్చును

చరణం 3:
నీ న్యాయవిధులు సత్యమైనవి - అవి ఎంతో నీతి న్యాయంబులు
నీ యందు భయమెంతో పవిత్రము
అది నిత్యముగాను నిలుచునది

చరణం 4:
నీ న్యాయవిధులు సత్యమైనవి - అవి ఎంతో నీతి న్యాయంబులు
నీ యందు భయమెంతో పవిత్రము
అది నిత్యముగాను నిలుచునది
114 యేసు నీ స్వరూపమునుyesu nee svaroopamunu

1 యోహాను 3 : 2 “ఆయన ప్రత్యక్షమైనప్పుడు..... ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము”

పల్లవి:
యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2)
నీ పోలికగా నేను మారెదన్  (2)

చరణం 1:
యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి
దాసుని రూపము ధరించి - దీనుడవైతివి (2) 
నేను దీనుడను గాను - గర్వముతో నిండియున్నాను
నీ వినయముతో నింపుము

చరణం 2:
ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి (2)
ఈ ప్రేమ చూపలేను - కఠినుడనై యున్నాను
నీ ప్రేమతో నింపుము (2)

చరణం 3:
ప్రభువా నీవందరి యెడల - శాంతము వహించితివి
ఎవరును నశింపక యుండవలెనని (2)
నేను సహింపలేను - సహనమునే కోల్పోయాను
నీ శాంతముతో నింపుము (2)

చరణం 4:
నమ్మకమైన ప్రభువా - నీ కార్యము అద్భుతము
నీ సత్యము మేఘములనంటుచున్నది
నేనయోగ్య దాసుడను - నిన్ను దుఃఖపెట్టియున్నాను
నీ యథార్థతతో నింపుము (2)

చరణం 5:
యేసుని స్వరూపము కల్గి - ఆయనవలె మారెదన్
ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ (2) 
ఆ అద్భుత దినము కొరకు - నను సిద్ధపరచుము
నీ పవిత్రతతో నింపుము (2)
115 నేను నిన్ను ఎన్నడు విడువనుnenu ninnu ennadu viduvanu

హెబ్రీ 13 : 5 "నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా"

పల్లవి:
నేను నిన్ను ఎన్నడు విడువను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను (2)

చరణం 1:
తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మరచునా? (2)
వారైన పిల్లలను మరతురు గాని
నేను నిన్ను ఎన్నడు మరువను (2)

చరణం 2:
నీ దుఃఖములో నేను దుఃఖించుచు వాటిని భరింతున్
నీ ఆనందములలో నేను ఆనందించుచు
నీతో కలసి ఉల్లసింతును

చరణం 3:
యుగసమాప్తి వరకు మీతో కూడ ఉండి ఆత్మతోడ నడిపింతున్
కనుపాపవలె నిన్ను సురక్షితుని చేసి
దుష్టత్వము నుండి కాపాడెదన్

చరణం 4:
నీవు నన్ను ఘనపరచి భయముతోడ నడచి యధార్ధత చూపితివి
కావున దీవెనల ఊట నీపై కుమ్మరించి
నా దక్షిణ హస్తముతో ఆదుకొందును
116 ఈశు ఫిర్ సే ఆ రహాహైeeshu phir se aa rahaahai

యోహాను 14 : 2,3 "మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను... మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును"

పల్లవి:
ఈశు ఫిర్ సే  ఆ రహాహై; (1)
అపనే లోగోంకో స్వర్గ్ లే జానే - ఈశుశీఘ్ర్ ఆ రహాహై (2)

చరణం 1:
ఈశూనే చేలోంసే కహాఁభీ థా - ఆఊంగా ఫిర్సే జరూర్ (2)
ఈశూకే సాథ్ జోచలే - సంసార్ సే అలగ్ జో రహే (2)
జాగ్ తే జో జీతే - విశ్వాస్ యోగ్య్ రహతే
ఉన్ కో లేనే ఆయేంగే (2)

చరణం 2:
మేరే లియే జగా తయా ర్  కర్ కే - ఆయేగా ఏక్ దిన్ జరూర్
ప్రియ ఈశుసే మిల్ నే కో - తైయార్ హమ్ హోతే హుయే
ఆవో హమ్ మిల్ క ర్ - ఆత్మాసే భర్ కర్
ఏక్ తా సే సేవా కరే

చరణం 3:
ప్రతిజ్ఞా పూరా సబ్ కర్ నే ఈశు - ఆయేగా కిసీ దిన్ జరూర్
అద్భుత్ ప్రేమీ ఈశూకో - లల్ కార్ సే ఆతే హుయే
హమ్ సబ్ మిలేంగే - ఆనందిత్ హోంగే
ప్రభూకో హమ్ పాయేంగే

చరణం 4:
బాదల్  కీ సవారీ కర్ కే ఈశు - ఆయేగా అచానాక్ జరూర్
ప్యారే ప్రభు ఈశుకో - మహిమా మే ఆతే హుయే
హమ్ సబ్ దేఖేంగే - బదల్ జాయేంగే
ప్రభుకే సాథ్ రహేంగే
117 పాపిని నేను తప్పితిpaapini nenu tappiti

మత్తయి 14 : 31 “ప్రభువా నన్ను రక్షింపుము”

పల్లవి:
పాపిని నేను తప్పితి భువిలో - రక్షించెడి వారెవరు (1)
ఓ ప్రభు యేసు నిరీక్షణతో - నీ దరికి జేరితిని (2)

చరణం 1:
ప్రభువా పాపిని రక్షించుటకు - ఈ భువి కరుదెంచితివి
దౌర్భాగ్యుడను వేడితి శరణం - వేరేమి చేయలేను

చరణం 2:
జీవము నివ్వ వచ్చితివి - చచ్చి యుంటి నేను
బంధింపబడితిని మరణ బంధముతో - విడిపించెడి వారెవరు

చరణం 3:
జన్మముతోనే అపవిత్రుడను - నా స్వభావమే పాపం
క్రియలలోను మాటలయందు - నీకు విరోధినైతిని

చరణం 4:
స్వంత నీతితో నిండిన పనులు - మరి పుణ్య కార్యములు
ఆచారములతో చిక్కుకొన్నాను - తప్పించెడి వారెవరు

చరణం 5:
భరియించితివి పాపపు శిక్ష - ప్రాణమిచ్చితివి నాకై
రక్తము కార్చి సర్వమిచ్చితివి - నన్ను రక్షించుటకై

చరణం 6:
ఓ ప్రభు యేసు దయాళుడ వీవు - కృంగివచ్చు చున్నాను
నా పాపములు క్షమియించు ప్రభువా - గొప్ప రక్షణకర్తవీవె
118 దీవెనలొందెదవు ఓ యౌవనుడా!deevenalondedavu o yauvanudaa!

లూకా 15 : 17-22 “అయితే బుద్ధి వచ్చినప్పుడు... లేచి తండ్రియొద్దకు వచ్చెను”

పల్లవి:
దీవెనలొందెదవు ఓ యౌవనుడా!
యేసు చెంతకు వచ్చిన (1)
కావున రమ్ము జాగు చేయక
బ్రోచును నిన్ను తన కృపతో (2)

చరణం 1:
రక్తము కార్చెను యేసు సిలువలో నీకై తన కృపచే (2)
కూర్చుటకై  నిన్ను తన సంఘములో ఒక్క అంగముగా (2)

చరణం 2:
ఒప్పుకొనిన నీ పాపమును విప్పును నీ పాపపు కట్లను
కప్పును రక్షణ వస్త్రముతో నిన్ను నిశ్చయంబుగా

చరణం 3:
తృప్తి నొందెదదవు నీవు మందిర సమృద్ధిలో నుండి
ఆనంద ప్రవాహ జలమును నీవు పానము చేతువు

చరణం 4:
ఆత్మబలుల నర్పించుచు సజీవ రాయివలె నీవు
కట్టబడుదువు గట్టి పునాదిపై ఆత్మ మందిరముగా

చరణం 5:
సత్య విశ్వాసమునందు చక్కగ నీవు వృద్ధి పొందను
సత్య వాక్యము నందు సరిగను వర్థిల్ల శక్తిని ప్రభువొసగున్

చరణం 6:
స్థిర పరచును అంతము వరకు నిరపరాధిగా ప్రభు ఎదుట
అంగీకరించుము యేసు  ప్రభుని సొంత రక్షకునిగా
119 నీ జీవితములో గమ్యంబుయేదోnee jeevitamulo gamyambuyedo

మత్తయి 16 : 26 “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము”

పల్లవి:
నీ జీవితములో గమ్యంబుయేదో - ఒకసారి యోచించవా?  (1)
ఈనాడే నీవు ప్రభుయేసు కొరకు - నీ హృదయమర్పింపవా (2)

చరణం 1:
నీ తల్లి గర్భమున నుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు (2)
యోచించినావా ఏ రీతి నిన్ను - నిర్మించె  తన చేతులు (2)

చరణం 2:
నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చే జాచెను
హృదయంపు తలుపు తెరువంగలేవా - యేసు ప్రవేశింపను

చరణం 3:
తన చేతులందు రుధిరంపు ధారల్ - స్రవియించే నీ కోసమే
భరియించె శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా?

చరణం 4:
ప్రభు యేసు నిన్ను సంధించినట్టి - సమయంబు ఈనాడేగా
ఈ చోట నుండి ప్రభు యేసు లేక - పోబోకుమో సోదరా!
120 చూడుము నీవుchoodumu neevu

మత్తయి 25 : 6 “ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు”

పల్లవి:
చూడుము   నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు
అంధకార రాజ్యమునకా రాజు మహిమతో వచ్చును

చరణం 1:
హృదయ ద్వారమును తెరువు - యేసు తట్టుచున్నాడు
నేడే నిన్ను పిలుచుచుండె - ఆలస్యము చేయకుము

చరణం 2:
నేడే వినుము సువార్తను - పొందు గొప్ప రక్షణ
రాదు తరుణము లేదు మరల - మరణము నిన్ను కొనిపోవున్

చరణం 3:
విడువుము అంధకార త్రోవ - విడువుము నీ చెడు జీవితము
నేడే యేసును విశ్వసించి - నడువ నాయత్తపడుము

చరణం 4:
పాపడాగులనేకములు - అపాయ మతి నీచములు
పాపములేని యేసు రక్తము - పాపములన్ని కడుగును

చరణం 5:
కాల్వరి సిలువపై చూడుమా - జీవమైన రక్షకుని
నీవు పొందుము నిత్యజీవము - లేచిపాడుము హల్లెలూయ
121 పరుగిడరా సోదరుడాparugidaraa sodarudaa

యెషయా 55 : 6 “యెహోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి...”

పల్లవి:
పరుగిడరా సోదరుడా (1 )  - ప్రభు సన్నిధి నీవు జేరుటకై (2)

చరణం 1:
యుగసమాప్తికి ఆగమనమునకు - సూచన లెన్నో చూడుమురా (2)
వేదన లెన్నో మీదికి వచ్చురా (2)
కలవర మొందక కనిపెట్టుమురా(2)

చరణం 2:
ఇండ్లను గట్టుచు పెండ్లికి యిచ్చుచు - నారును నాటుచు త్రాగుచు తినుచు
జగములో జనులు దిగులు లేనప్పుడు
దొంగవలె యిల దొరయై వచ్చురా

చరణం 3:
ఆ దినమైనను ఆ గడియైనను - పరమున దూతలు ధరణిలో మనుజులు
ఎవరును గాని ఎరుగనె ఎరుగరు
మెలకువతో యేసు పిలుపును వినుచు

చరణం 4:
ఆ దినముల శ్రమ అంతము కాగ - సూర్యుని చంద్రుని చీకటి కమ్ము
ఆకసమందలి శక్తులు కదలును
మహిమతో యేసు యిమ్మహి దిగురా

చరణం 5:
ఆర్భాటముతో ఆశ్చర్యముతో - దేవుని బూరతో మనప్రభు దిగురా
క్రీస్తునందున్న మృతులగువారు - ఏకముగ ప్రభు యేసుని జేర

చరణం 6:
ఎటుచూచిన నీకటు   కనిపించును -   కొండల బండల నుండినను
కొదమ సింహమై కోసాగ్నియై  - ఎదురుగ వచ్చిన కదలగ లేవురా

చరణం 7:
ఎత్తబడుట కాయత్తమా నీవు - తరుణము యిదియే తడవు చేయకురా
రక్షణలో నిరీక్షణ కలిగి   - రక్షకు డేసుని రాజ్యము చేర
122 పాపుల కొరకు ప్రభుయేసు - సిలువలో బలియాయెpaapula koraku prabhuyesu - siluvalo baliyaaye

ఎఫెసీ. 1 : 7 “ఆయన రక్తము వలన ........ మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది"

పల్లవి:
పాపుల కొరకు ప్రభుయేసు - సిలువలో బలియాయె (1)
పాపికి రక్షణనిచ్చెను - పావన రక్తము కార్చి (2)

చరణం 1:
దుష్ట జగమున  యేల తిరిగెదవు ప్రియుడా?
మునిగెదవేల ఎన్నడు పాపములో ? (2)
దాచిన నీవు నీ పాపమును ప్రియుడా
నిత్యజీవమును ఎలాగు పొందెదవు? (2)

చరణం 2:
పాపభారము క్రింద పడియున్న ప్రియుడా
ప్రభునికడకు రమ్ము విశ్రాంతికై
నెమ్మది నిచ్చును దీనులకు ప్రియుడా
యిదియే యేసుని వాగ్దానము నమ్ము

చరణం 3:
నరక మార్గము విశాలము ప్రియుడా
జీవమునకు పోవు మార్గము ఇరుకు
ప్రభుయేసువే నిజమార్గము ప్రియుడా
పరము చేరుదువు యేసుని ద్వారానే

చరణం 4:
ఇహలోక నీ బ్రతుకు నీడయే ప్రియుడా",
            "పాప దుఃఖముతో నిండియున్నది
దీనుడవై నీవు శుద్ధిని కోరుము ప్రియుడా
దొరుకును రక్షణ యీ క్షణమే
123 కృపకాలములో - ప్రభుయేసునిkrupakaalamulo - prabhuyesuni

2 కొరింథీ 6 : 2 "ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము”

పల్లవి:
కృపకాలములో - ప్రభుయేసుని
అంగీకరించుము  - ఓ ప్రియుడా

చరణం 1:
సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన (2)
మిత్రుడా నీకేమి లాభముండును (2) ఈలాటి జీవముతో
యేసుని ప్రేమస్వరము విని తెరువు నీ హృదయము (1) 
ప్రభు యేసుని చరణముల్ చేరి అనంత ముక్తి పొందు (2)

చరణం 2:
ధర్మకర్మ సంస్కారము వలన పరిశుద్ధుడవు కానేరవు\
భక్తి వేషాలు ధరించుకొన్న (2)  పరలోకము చేరవు
కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసు నొద్ద
మహా ప్రభుని చరణముల్ చేరి అర్పించుకో నిన్నే

చరణం 3:
ప్రభుయేసు క్రీస్తే నిత్యరక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో
పాపమార్గం వదలి పశ్చాత్తాపముతో (2) ప్రభుశరణము చేరి
నీ పాపములను ప్రభు రక్తమందు కడిగి శుద్ధి చేసుకో
పరలోక ఆశీర్వాదములు నిత్యజీవము పొందు

చరణం 4:
క్రీస్తులో పూర్ణ నిత్యజీవం పరలోక ఆశీర్వాదములు
ఓ మరణమా నీ ముల్లెక్కడ (2)  క్రీస్తునందు విజయమే
శిక్ష దండన తొలగింపబడె ప్రభుయేసు క్రీస్తునందే
ప్రభుశక్తిచే పాతాళ ద్వారం సదా ఓడింపబడె
124 సాటి లేనిది యేసునిsaati lenidi yesuni

1 యోహాను 1 : 7 “ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి” మనలను పవిత్రులనుగా చేయును”

పల్లవి:
సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును
ప్రియుడా పాపమును కడుగును

చరణం 1:
చూడుము సోదరా దేవుడు ఎంతో ప్రేమించె యీ జగతిన్
ప్రియుడా ప్రేమించె యీ జగతిన్
సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు
యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను

చరణం 2:
లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చె
ప్రియుడా ప్రాణము బలిగానిచ్చె
లోకపాపమెల్ల సిలువలో మోసి
తొలగించె శాపమున్ ప్రియుడా తొలగించె శాపమున్

చరణం 3:
వినుము సోదరా ప్రభుయేసు క్రీస్తుని పరలోక వార్తను
ప్రియుడా పరలోక వార్తను
ఉన్నతమైన పరలోక ప్రేమను
చాటించు చుంటిమి ప్రియుడా చాటించు చుంటిమి

చరణం 4:
యేసుని నీవు క్షమించుమని వేడు విరిగిన హృదయముతో
ప్రియుడా విరిగిన హృదయముతో
యేసుని అమూల్య రక్తధారలే
కడుగును పాపమెల్ల ప్రియుడా కడుగును పాపమెల్ల

చరణం 5:
పాపభారమును మోసికొని నీవు ప్రయాస మొందెదవా?
ప్రియుడా ప్రయాస మొందెదవా?
పాపమొప్పుకొని యేసు పాదముల
చెంతకు జేరుము ప్రియుడా చెంతకు జేరుము

చరణం 6:
గతించుచున్నది స్వల్ప జీవితం శీఘ్రముగా రమ్ము
ప్రియుడా శీఘ్రముగా రమ్ము
కర్త యేసునందు విశ్వాసముంచి
రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము

చరణం 7:
కృపాయానందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము
ప్రియుడా భాగము పొందుము
పాప సాగరమును దాటించగలడు
యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకు
125 సోదరుడా పాపక్షమకైsodarudaa paapakshamakai

మార్కు 1 : 15 "మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి"

పల్లవి:
సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని (2)

చరణం 1:
యేసుని రాజ్యము - సమయము వచ్చెను (2)
రక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన (2)

చరణం 2:
మనుజరూపము ధరించి - స్వర్గము దిగి వచ్చెను
తనదు రక్తము ద్వారానే - పాపబంధము త్రుంచెను

చరణం 3:
కలువరిలోని సిలువలో - ప్రాణము నర్పించెను
ఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను

చరణం 4:
సమయము లేదు సోదరా - త్వరపడి రమ్ము వేగమే
సువార్తను విశ్వసించి - రక్షణను పొందుము

చరణం 5:
పాప సాగరమునందు ఎంతకాలముందువు?
పాపసాగరము నుండి - యేసుప్రభు విడిపించును
126 శ్రమలను పొందె శ్రీయేసుడుshramalanu ponde shreeyesudu

యోహాను 19 : 17 "ఆయన తన సిలువ మోసికొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను”

పల్లవి:
శ్రమలను పొందె శ్రీయేసుడు నీ కొరకై సిలువలో (2)

చరణం 1:
సదయుడు ప్రేమించె - శత్రువైన నిన్ను
దూరస్థుడవైన నీ యెడల - దయచూపించె (2)
వహించె నీ శాపం భరించె నీ పాపం (2)
నీ మనస్సు మార్చుకొనిన - సంతసించును ప్రభుయేసు (2)

చరణం 2:
దొంగవై నీవున్నా - దురితంబులెన్నున్నా
దోషంబుల క్షమియించు - తన సిలువ రక్తముతో
తెరచెనుగా నీ కొరకు - పరలోక ద్వారము
నెమ్మది నిచ్చును నీకు - యేసుని విశ్వసించిన

చరణం 3:
ఎవరేసు రక్తములో - కడుగబడెదరో
వారే చేరెదరు - తన సంఘము నందు
అంగీకరించుము - యేసును నీవు
కలిగించు నీకు తృప్తిని - నేడే నీ వాయనను వేడు

చరణం 4:
సిలువపై యేసు - సర్వ మర్పించె
నీ రక్షణ కొరకు - క్రయము చెల్లించె
యేసునకు నీవు - ఏమియ్యగలవు?
తెరువు నీ హృదయ ద్వారమును - నేడే ప్రవేశించును తాను
127 రక్షింపనేరక యుండునట్లుrakshimpaneraka yundunatlu

యెషయా 65 : 2 "లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను"

పల్లవి:
రక్షింపనేరక యుండునట్లు
ప్రభుహస్తములు నీ కొరకై కురచ కాలేదు
దినమెల్ల చాచి యుంచె తనదు
గాయపడిన హస్తములు నీ కొరకే (2)

చరణం 1:
నీ పాప దోషములచె నీవు దోషివై నీవుండగ (2)
దయగల యేసు దయ చూపి నీపై
నీ పాపము భరియించెను సిలువపై మరణించెను (2)

చరణం 2:
తరుణములు ఇచ్చుచు తాను
నీ హృదయ ద్వారము తట్టుచుండె
తడవేల ఇంక తెరువు నీ హృదయము
క్రీస్తు ప్రవేశింపను నీ యందు వసియింపను

చరణం 3:
మెల్లనైన స్వరము చేత తానె నిన్ను పిలచుచుండె
పెడచెవిని నీవు పెట్టెద వేల
ప్రభు పిలుపు ఆలకించు
యేసయ్యను స్వీకరించు
128 యేసు ప్రభు - పిలుచుచుండెyesu prabhu - piluchuchunde

లూకా 19 : 5,6 "జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసి యున్నదని చెప్పగా.... సంతోషముతో ఆయనను చేర్చుకొనెను"

పల్లవి:
యేసు ప్రభు - పిలుచుచుండె - నూతన జీవము - నీ కిచ్చుటకు",  
          "ప్రేమతో నిన్ను - పిలుచుచుండె - దొరుకుముక్తి - ప్రభు చెంతనే (1)",  
         "రండి రండి - సర్వజనమా వెళ్ళెదము మనమందరము (2)

చరణం 1:
అందరిలో ఉన్నతుడు - ఆయనన్ నీవు చేర్చుకొను (2)
రక్షణ నీవు పొందు నేడే (2)

చరణం 2:
నీ జీవము ఏ పాటిది ఒక నాడిది విడువవలెన్
వ్యర్ధం వ్యర్ధం ఈ లోక మాయ

చరణం 3:
నీ కొరకేతెంచెనిల - ముక్తినిచ్చే యేసు ప్రభు
ఒప్పుకొను తప్పిదములన్
129 ఇదియే సమయంబుidiye samayambu

2 కొరింథీ. 6 : 2 "...ఇదే రక్షణ దినము”

పల్లవి:
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి (1)
ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి (2)

చరణం 1:
పావులనందరిని తన దాపున జేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా (2)
మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా (2)

చరణం 2:
రాజులకు రాజైన యేసు రానైయున్నాడు
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
తరుణముండగానే - మీరు తయ్యారవ్వండి

చరణం 3:
బుద్ధిలేని కన్యకలవలె మొద్దులు గానుంటే
సిద్దెలలోని నూనెపోసి సిద్ధపడకపోతె
తలుపును తట్టినను మీకు తెరువడు సుమ్మండి

చరణం 4:
వెలుపట నుంటేనూ మీరు వేదన నొందెదరు
ప్రభువా ప్రభువనుచు - యెలుగెత్తి పిలచినను
మిమ్మును ఎరుగనూ మీరెవరో పొమ్మనును

చరణం 5:
నమ్మిన వారికి క్రీస్తు నెమ్మది నిచ్చునుగా
నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా
నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి

చరణం 6:
సందియపడకండి మీరు సాకులు చెప్పకను
సత్యవాక్యమును మీరు సరిగా చూడండి
మరణ దినమును మన మెరుగము సుమ్మండి

చరణం 7:
జాలము చేయకను మీరు హేలన చేయకను
కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను
తరుణముండగానే మీరు త్వరపడి రారండి
130 జీవిత మేమెవ్వరికి, నీ జీవిత మెవ్వరికిjeevita memevvariki, nee jeevita mevvariki

లూకా 12 : 20 "నీవు సిద్ధపరచినవి యెవనివగునని అతనితో చెప్పనూ"

పల్లవి:
జీవిత మేమెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి ?
ఈ లోకములో జీవించు జీవితమంత
జీవితమెవ్వరిది, నీ జీవితమెవ్వరికి? (1)

చరణం 1:
శరీరేచ్ఛల పై  ఆశలుండు (1) -  ఈ ధరణియందు (2)
సుఖభోగులుగా జీవింతురు (1) - ఈ ధరణియందు (2)
వారి యూహలు దినమెల్ల చెడియున్నవి (2)
వారి పాప జీవితమంత శాపమెగ (2)

చరణం 2:
ధనాపేక్షకులెందరో గలరు - ఈ ధరణియందు
ధనముపై మనస్సు నిల్పెదరు - ఈ ధరణియందు
వారి కలవరమంత ధనము ధనమే
వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే

చరణం 3:
స్వంత బోధలకై బ్రతికెదరు - ఈ ధరణియందు
గర్వమునకు అమ్మబడి యుందురు - ఈ ధరణియందు
వారి మనసులు సంకుచితములై యుండు
వారి జీవిత ప్రయాసము - పతనమేగా

చరణం 4:
విరిగిన హృదయులు కలరెందరో - ఈ ధరణియందు
కరిగెడు ఉప్పుగ నుండెదరు - ఈ ధరణియందు
వారు ప్రభుకై దాగియే నిలచెదరు
దైవ వాక్కుగ దినమెల్ల సేవింతురు
131 ఓ పాపీ - సంధించితివాo paapee - sandhinchitivaa

మత్తయి 11 : 28 "నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగుజేతును"

పల్లవి:
ఓ పాపీ - సంధించితివా! - నీ పాప - విమోచకుని
నీ పాపముల్ - క్షమించి - నీ ప్రాణమునకు శాంతి నొసగున్

చరణం 1:
బంధింపబడె - ప్రభువైన యేసు - విడుదలజేయనిన్ను (2)
నిందను పొందెను - పొంద నీ వానందము (2)

చరణం 2:
క్రీస్తు యేసు నీ కొఱకేడ్చె - గెత్సేమనే - వనములో
వాత్సల్యముతో - నిన్నానందింపజేయ

చరణం 3:
రక్షకుడు - తీర్పు కై నిలచె - అక్షయ జీవమీయ
శిక్షను బొందె - నిన్నానందింపజేయ

చరణం 4:
ప్రభువైన యేసు - తట్టుచున్నాడు - నీ హృదయ ద్వారమున్
అబ్బును శాంతి - తెరచిన హృదయమున్

చరణం 5:
జీవజలమిచ్చు - ప్రభువైన యేసు - దప్పిగొనియున్న నీకు
జీవితాంతము వరకు - దప్పిగొనవేమాత్రము

చరణం 6:
రక్షణ దుర్గమున నిన్నుంచి - శత్రువును - అణచివేసి
దక్షిణ హస్తముతో - కప్పును - నిన్నెప్పుడు

చరణం 7:
దేవుని స్వరము - వినుడి నేడే  - దైవపుత్రులౌదురు
సేవించుడి క్రీస్తుని - జీవతములర్పించి
132 మనకై యేసు మరణించె మనmanakai yesu maraninche mana

యెషయా 53 None

పల్లవి:
మనకై యేసు మరణించె మన పాపముల కొరకై (1)
నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె (2)

చరణం 1:
తృణీకరింపబడె - విసర్జింపబడెను (2)
దుఃఖా క్రాంతుడాయె (2) - వ్యసనములు భరించెను (2

చరణం 2:
మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే - మన ముఖములద్రిప్పితిమి

చరణం 3:
మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు
మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగెన్

చరణం 4:
గొర్రెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్
అరుదెంచె  కాపరియై - అర్పించి ప్రాణమును

చరణం 5:
దౌర్జన్యము నొందెను - బాధింపబడెను
తన నోరు తెరువలేదు - మనకై క్రయధనమీయన్

చరణం 6:
ఎదిరింపలే దెవరిన్ - లేదే కపటము నోట
యెహోవ నలుగ గొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్

చరణం 7:
సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ
133 యేసు చావొందె సిలువపై నీ కొరకేyesu chaavonde siluvapai nee korake

1 పేతురు 2 : 24 "ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను"

పల్లవి:
యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే (1)
ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే (2)

చరణం 1:
నదివలె యేసు రక్తము- సిలువలోనుండి ప్రవహించె (2)
పాపము కడిగే మలినంబు తుడిచె (2) ఆ ప్రశస్త రక్తమే (1)

చరణం 2:
నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకో
నీ ఆత్మతనువుల శుద్ధిపరచుకో - క్రీస్తు యేసు రక్తములో

చరణం 3:
పాపశిక్ష పొందతగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడువబడెనీకై - అంగీకరించు యేసుని
134 ప్రేమామృత ధారల చిందిన మనpremaamruta dhaarala chindina mana

1 యోహాను 4 : 8 "దేవుడు ప్రేమా స్వరూపి"

పల్లవి:
ప్రేమామృత ధారల చిందిన మన - యేసుకు సమమెవరు?   (2)
ప్రేమయె తానై నిలిచి - ప్రేమోక్తులనె పల్కి (1)
ప్రేమతో ప్రాణము బెట్టి (2) - ప్రేమనగరికి చనియె (2) ||ప్రేమా||

చరణం 1:
నిశ్చలమైన ప్రేమ జీవికి - ఇలలో తావేది
ప్రేమద్రోహులే గాని - ప్రియమున జేరరు వాని
చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా

చరణం 2:
ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించును రారా
పాపభారముతో రారా -  పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు

చరణం 3:
ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెదవేల
రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము
135 న్యాయపీఠము నీ ముందు వున్నదిnyaayapeethamu nee mundu vunnadi

2 కొరింథీ 5 : 10 "మనమందరము క్రీస్తు న్యాయపీఠము యెదుట ప్రత్యక్షము కావలయును"

పల్లవి:
న్యాయపీఠము నీ ముందు వున్నది
ధ్యానించి చూడు కూర్చున్నదెవరో

చరణం 1:
నీవు నశించుట కోరడు ప్రభువు
ఓపికతో ఆయనే వేచి యున్నాడు
పశ్చాత్తాప పడుమిప్పుడైనా
నిశ్చయమెరుగు నరకము తప్పదు

చరణం 2:
పరీక్షించుకొనుము నీ మరణమెప్పుడో
రక్తము ద్వారా ముక్తి పొందితివా
కఠినత్వముతో తృణీకరించిన
న్యాయత్రాసు ఉన్నది రారాజు చేతిలో

చరణం 3:
దాగియున్న పాపము ప్రభుయేసు చూచెను
అంధకార పాపము తన కంటపడెను
తన దృష్టినుండి తప్పించుకొందువా
తీర్పు కొడవలి తనచేత నుండగ

చరణం 4:
అందరి కొరకై గ్రంథముల్ తెరువగ
వారి విషయమై వ్రాసిన రీతిన్
దేవ గొఱ్ఱె పిల్ల న్యాయము తీర్చును
తన చేతున్నది తీర్పుకై చేట

చరణం 5:
క్రీస్తు యేసు నందు శిక్షా విధి లేదు
దీవెనల నొందుచు ఘనత నొందెదరు
ఎల్లప్పుడాయనతోనే - యుండెదరు
ప్రభువే నిచ్చును జీవకిరీటము
136 ప్రేమతో యేసు - పిలుచుచున్నాడు రమ్ముpremato yesu - piluchuchunnaadu rammu

యోహాను 11 : 28 "బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడు"

పల్లవి:
ప్రేమతో యేసు - పిలుచుచున్నాడు రమ్ము (2)
రక్షణను పొంది - లక్షణముగా వెళ్ళుము (2)

చరణం 1:
పాపమెరుగని ప్రభు నీ కొరకు - పాపముగను చేయబడెను (2)
శాపగ్రాహియాయె సిలువలో (2) పరుగిడి రమ్ము (2)

చరణం 2:
ముండ్ల కిరీటమును ధరించి - ముఖముపై నుమ్మి వేయబడె
ప్రాణమిడె నేసు సిలువలో - పరుగిడిరమ్ము

చరణం 3:
సిలువలో నీకై దప్పిగొని - కలుష నీక్షమకై ప్రార్థించి
సహించి ప్రాణమిదె నీ కొరకు - పరుగిడి రమ్ము

చరణం 4:
తప్పిన గొర్రెను రక్షింప - తనదు రక్తమును చిందించె
కాపరి స్వరము ధ్వనించె - పరుగిడి రమ్ము

చరణం 5:
తామసించ తగదిక ప్రియుడా - త్వరపడుము నీ రక్షణ కొరకు
నేడే నీ రక్షణ దినము - పరుగిడి రమ్ము

చరణం 6:
తానే కడుగును తన రక్తముతో - తండ్రివలె నీ పాపమునంత
తనయుడవై పోదు విపుడే - పరుగిడి రమ్ము

చరణం 7:
ప్రేమవార్త ప్రకటించబడె - ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము
కృపా కాలమిదే జాగేల - పరుగిడి రమ్ము
137 చూడుము ఈ క్షణమేchoodumu ee kshaname

లూకా 23 : 33 "వారు కల్వరీ అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు"

పల్లవి:
చూడుము ఈ క్షణమే కల్వరిని - ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను (1)
గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు (1) - సిలువలో వ్రేలాడుచున్నాడుగా (2)

చరణం 1:
మానవులెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక (2)
ఎరుగరు మరణము నిక్కమని
నరకమున్నదని వారెరుగరు (2)

చరణం 2:
ఇహమందు నీకు కలవన్నియు - చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను నీవు లేచెదవు
తీర్పున్నదని ఎరుగు ఒక దినమున

చరణం 3:
మనలను ధనవంతులుగా చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై
అంగీకరించుము శ్రీ యేసుని

చరణం 4:
సిలువపై చూడుము ఆ ప్రియుని - ఆ ప్రేమకై నీవు యేమిత్తువు
అర్పించుకో నీదు జీవితము
ఆయన కొరకై జీవించుము
138 యెరూషలేము గుమ్మములారాyerooshalemu gummamulaaraa

మత్తయి 21 : 10 "ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు ..."

పల్లవి:
యెరూషలేము గుమ్మములారా! రాజును లోనికి రానిమ్ము (1)
చిరునవ్వులతో ప్రభుయేసుని నేదే ఆహ్వానించుము (2)

చరణం 1:
విజయుడై వచ్చుచున్నాడు శత్రు సాతానును ఓడించి (2)
ఖర్జూరమట్టలు వస్త్రములెందుకు
మీ హృదయములను పరువుడి (2)

చరణం 2:
అభ్యంతరపరచకుము పిల్లలు, వృద్ధులు, యౌవ్వనులన్
ప్రభుని విజయము నందు వారిని
స్తుతిస్తోత్రములు పాడనిమ్ము

చరణం 3:
నీ దుష్టక్రియలను బట్టి ప్రభుని దయను త్రోసెదవా
పరమ రాజును హృదయ మందిరమున
నేడే రానిమ్ము స్నేహితుడా

చరణం 4:
నిన్ను దర్శించుటకే ప్రభు నీ చెంతకు వచ్చెనుగా
గాయపడిన హస్తమును చాచి
నీ మదిలో చోటిమ్మనెను

చరణం 5:
పశ్చాత్తాపము నొందుము నేడే నీ పాపము లొప్పుకొనుము
జీవము రక్షణ శాంతి నొసగును
ఆయనే ప్రభువు శ్లాఘించుము
139 నా మాట వినుమని ప్రభువనెనుnaa maata vinumani prabhuvanenu

హెబ్రీ 3 : 8 "నేడు మీరాయన శబ్దమును వినిన యెడల . . ."

పల్లవి:
నా మాట వినుమని ప్రభువనెను -  నిను రక్షింపను పిలుచుచుండె (2)

చరణం 1:
పాపుల రక్షకుడు యేసు ప్రభుండు (2) - నీతిమంతుల కాదు పాపుల పిలిచెన్ (2)
నిను హృదయంబార ప్రేమించును (2) - ప్రేమించును (1)

చరణం 2:
తప్పిన వారిని వెదకవచ్చెన్ - తానే వెదకె నిన్ పరికించుము
దాపున నిలిచెను రక్షింపను - రక్షింపను

చరణం 3:
జీవనదాతగా ప్రభు యేసు వచ్చెన్ - నిత్య జీవము నీకు కలిగించును
కావున ప్రభు నీ దరిజేరెను - దరిజేరెను

చరణం 4:
జీవనజ్యోతిగా జగమునకొచ్చెన్ - నీ వెరిగితివా నీ స్థితిని
నీ చీకటిని పోగొట్టును - పోగొట్టును

చరణం 5:
పాత వాటిని పారద్రోలన్ - నూతన పరచును సర్వమును
పరికించుము నీ స్థితిగతిని - స్థితిగతిని
140 ప్రభువా నన్ను కరుణించుముprabhuvaa nannu karuninchumu

లూకా 18 : 13 "దేవా పాపినైన నన్ను కరుణించుము”

పల్లవి:
ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని (2)
 పాపిని,పాపిని నే ఘోర పాపిని (2)

చరణం 1:
లోకాశకు లొంగిపోయి - పడిపోయిన పాపిని (2)
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని (2) - నే ఘోరపాపిని (1)

చరణం 2:
అన్యజనుల ఆచారముల - నభ్యసించి చెడిపోతిని
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని - నే ఘోరపాపిని

చరణం 3:
నీ వాక్యమును త్రోసివేసి - దుష్కార్యములు చేసితిని
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని - నే ఘోరపాపిని

చరణం 4:
శరీరాశ, నేత్రాశను - పాపేచ్ఛను గల్గియుంటి
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని - నే ఘోరపాపిని

చరణం 5:
నా రక్షకుడా యేసు నాథా - నన్ను నీవు రక్షించితివి",
            "నిన్నే నిత్యము పూజింతును సేవింతు నిరతము - సేవింతు నిరతము
సేవింతున్ పూజింతున్ - నిరతము సేవింతున్
141 నేడు నే నా రక్షకునిnedu ne naa rakshakuni

(కీర్తనలు 32 : 1 "తన అతిక్రమములకు . . . తన పాపమునకు ప్రాయశ్చిత్త నొందినవాడు ధన్యుడు"

పల్లవి:
నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకొన్నాను (2)
సమాధాన సంతోషము (2) -  అనుభవించితి నేను (2)

చరణం 1:
ప్రభు వాక్యము నా పాపము చూపె (2) - హృదయము విరిచే ఆయన ఆత్మ (2)
గ్రుచ్చబడి నేను ఒప్పుకొంటిని (2) - కోరితి రక్తము మదిలో (2)

చరణం 2:
ప్రభు నా పాపము చూపించగానే- ఒప్పుకొంటిని కప్పుకొనక
విశ్వాసముతో కన్నీటితో - ఒప్పుకొనగ క్షమియించె

చరణం 3:
పడమటికి తూర్పెంత దూరమో - నా పాపము నంత దూరపరచితివి
సముద్ర అగాధములలోన - నా పాపము పడవేసె

చరణం 4:
మిక్కిలి శ్రమలో నెమ్మది కలిగె - నాశన గోతిలో నుండి లేపి
నీ వీపు వెనుక నా పాపములు - పార వేసితి వీవు

చరణం 5:
తుడిచితిననె ప్రభు నా పాపములు - జ్ఞాపకముంచుకొననని చెప్పె
మంచు విడచిపోయిన రీతి -  నా పాపము తొలగించే
142 సిలువ చెంతకు రాsiluva chentaku raa
పల్లవి:
సిలువ చెంతకురా - సిలువ చెంతకురా
సహోదరా - సిలువ చెంతకురా, సహోదరీ - సిలువ చెంతకురా (1)
ఎచ్చటలేని నెమ్మది ఉంది -  ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది (2)

చరణం 1:
యౌవ్వనకాల పాపములో  -  మరణ మార్గాన వెళ్లెదవా? (2)
యేసుని పొందని బ్రతుకులో - పాపములో మరణించెదవా? (2

చరణం 2:
సమస్తము నష్టపరచుకొని - హృదయము బ్రద్దలై ఏడ్చెదవా?
యేసుని పొందని బ్రతుకులో- పాపములో మరణించెదవా?

చరణం 3:
పాము జీవించు బిలములో - పక్షి జీవించ వీలగునా?
దుఃఖముతో నిండిన హృదయములో - నెమ్మది చూడవీలగునా

చరణం 4:
సిలువలో వ్రేలాడు యేసుని - నీవు వీక్షించిన చాలును
రక్షకుడు చిందించిన రక్తములో - నీ పాపములన్ని కడుగబడున్
145 తన దేవునెరుగువారుtana devuneruguvaaru

దాని, 11 : 32 "అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు."

పల్లవి:
తమ  దేవునెరుగువారు చేసెదరు - శక్తితో గొప్ప కార్యములు (2)

చరణం 1:
ఇచ్ఛకపు మాటల వలన (2) - అక్షయుని విడువరు (1) (2)
తప్పు బోధల నెప్పుడు తృణీకరించెదరు (2)

చరణం 2:
సత్యమును విడువరు - ఉత్తములుగ నడిచెదరు
అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు

చరణం 3:
మనుజ భయము జెందరు - మాన్యులై యుండెదరు
మంచి సాక్ష్యమును విడువరు ఏకాంతులు కారు

చరణం 4:
ద్వేషించెదరు విగ్రహముల్ - శిరములు ఖండించినను
పర్వతము వలె కదలక వారు స్థిరముగ నుండెదరు

చరణం 5:
అగ్నిలో వేయబడినను - విఘ్నంబులు కలిగినను
సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు

చరణం 6:
శోధనలను జయించెదరు - బాధలను సహించెదరు
నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు

చరణం 7:
అధిక జ్ఞానమును పొంది - తగ్గించుకొనెదరు తామే
యేసుప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు
146 యేసు ప్రభూ కావరి నాకు -వాసిగా స్తుతించెదన్yesu prabhoo kaavari naaku -vaasigaa stutinchedan
పల్లవి:
యేసు ప్రభూ కాపరి  నాకు - వాసిగా స్తుతించెదన్
యేసు   గొఱ్రె పిల్లను - పోయెదను తన వెంట (2)

చరణం 1:
పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్
స్వచ్ఛ జలముచెంత - నిచ్చును విశ్రాంతి (2)
ముందు ముందు వెళ్ళుచు - పొందుగా రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును (2)

చరణం 2:
మరణలోయ ద్వారా - సరిగా నడిపించును
అడవి భయములెల్ల - ఎడబాప్ రక్షించున్
హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును
వింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును

చరణం 3:
శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయును
నా గిన్నె నిండించి - పొర్లి పారజేసి
కడిగి కడిగి శుద్దిజేసి - ఆత్మదానమిచ్చెను
వడిగా ఆయన సాయమున - జయమున వెళ్ళెదను
147 మన జీవిత మంతయు - అనుక్షణము యుద్ధమేmana jeevita mantayu - anukshanamu yuddhame

గలతీ 6 : 14 "ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక"

పల్లవి:
మన జీవిత మంతయు - అనుక్షణము యుద్ధమే (1)
ఇదియే సిలువ మార్గము - మహిమ రాజ్యమొందను (2)

చరణం 1:
ఈ యాత్రలో ముందుకు - సాగిన తోడ్పడి (2)
యేసుడే నడుపును మనలను (2) - తన మార్గమునందున (2)

చరణం 2:
ఆ సిలువ మార్గము - ఎంతో యిరుకైనది
క్రీస్తునేగురిగా నుంచిన - విజయము నిశ్చయము

చరణం 3:
ఇహమందు శ్రమలు - రానున్న మహిమలో
ఎన్నదగినవి కావుగా - క్రీస్తే దుఃఖము బాపును

చరణం 4:
ఈ జగతిలో కష్టముల్ - బాధలు కలిగిన
ధైర్యము విడువక యుందుము - జయించె ప్రభువు ఇహమును
148 ఎటువంటి యాగంబు జేసితివి యేసుetuvanti yaagambu jesitivi yesu

ఫిలిప్పీ 2:8 "సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనేను"

పల్లవి:
ఎటువంటి యాగంబు జేసితివి యేసు
నీ వలె నేనుండ నా కొరకై (2)

చరణం 1:
పరమ తండ్రి సన్నిధిన్ బరలోక ప్రణుతింపు విడచితివి (2)
పశువుల తొట్టిలో పరుండియు- (2) - పరమ ప్రేమన్ జూపెను (1)

చరణం 2:
జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చు వరకు
మాకై సిలువ బాధ నొందితివి - మమ్మును విమోచించన్

చరణం 3:
తల వాల్చుటకైనను స్థలమిలలో లేనే లేకుండె నీకు
నీ యడుగుజాడలలో నేనుండన్ - నా ముందు వెళ్ళితివి

చరణం 4:
తమ తల్లి దండ్రులను తమ స్వంతవాటిని విడచిపెట్టి
నీ సిలువ మోయు వారెల్లరును - నీ మహిమఁజూచెదరు

చరణం 5:
నీ శ్రమలు బాధలేగా నీ మహిమ లోనికి దెచ్చె నిన్ను
నీకై నా జీవమెల్ల నియ్యను - నీ శ్రమలే నే కోరెదన్

చరణం 6:
నా యానంద మీవేగా నా ప్రభువా నాకిలలో వేరే వలదు
నీ వెంట వెళ్ళను నే వెరువను - నీ ప్రేమ నాలో నుండ
149 మా ప్రభుయేసు నీవే మా సర్వముmaa prabhuyesu neeve maa sarvamu

కీర్తనలు 36 :8 "నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు"

పల్లవి:
మా ప్రభుయేసు నీవే మా సర్వము-మహిన్ మాకెపుడు నీతోనే  స్నేహము (2)

చరణం 1:
సంతృప్తి నీ మందిరమున గలదు (2) - అందానంద ప్రవాహంబు మెరిసింది (2)
వింతైన జీవపు యూటందు గలదు (2)
యెంతైన మా పూజార్హుండ నీవె (2)

చరణం 2:
ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు - మొదటి ప్రేమనెంతో విడచి పెట్టితిని
సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా
సతతంబు మా పూజార్హుండ వీవె

చరణం 3:
మా తలపు మాటల్లో మా చూపు నడకలో
మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన
మక్కువతో మా ప్రభున్ మెప్పించెదము
యెక్కడైనా మా యేసు సన్నిధిలో

చరణం 4:
పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము - పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము
పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి
పాలించుము ప్రభుయేసు రారాజ

చరణం 5:
సోదర ప్రేమ సమాధానంబులతో - సాత్వీక సంతోష భక్తి వినయాలతో
వింతైన మాదు స్తుతి పరిమళాలతో
వినయంబున పూజింతుము నిన్ను
150 అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివిadbhuta deevenalu - prabhuvaa kummarinchitivi

ద్వితీ. 11:27 "నేను మీ కాజ్ఞాపించు . . . . వినిన యెడల దీవెన"

పల్లవి:
అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి (1)
నీదు ప్రేమ అపారము - ప్రభువా మా పై జూపితివి (2)

చరణం 1:
మానవుని చేసినావు - నీ స్వంత రూపమునకు (2)
నీ కిష్టులముగా బ్రతికి (2)- దీవెనలెన్నో పొందెదము (1)

చరణం 2:
నూతన జన్మవలన - ఆశీర్వాదములు దొరికె
శాపమును దూరపరచి - సర్వంబు క్రొత్త జేసె

చరణం 3:
లోకమునుండి వేరై - సిలువను మోయవలెను
అప్పుడే ప్రభు దీవించు - స్వాస్థ్యమును గాంతుమెంతో

చరణం 4:
తన సుతులుగాను మెలిగి - తన చిత్తమందు నిలిచి
జీవజలమును పొంది దీవెనలెన్నో పొందెదము

చరణం 5:
ఆత్మీయముగ నడిచి - శరీర క్రియలను విడిచి
ఆయన స్వరము వినుచు - దీవెనలెన్నో పొందెదము

చరణం 6:
ఆశీర్వాదముల కొరకు- పిలువబడియున్న మనము
ఆజ్ఞలను నెరవేర్చినచో - దీవెనలెన్నో పొందెదము
156 యౌవనులారా - దేవుని శక్తిని బట్టిyauvanulaaraa - devuni shaktini batti
పల్లవి:
యౌవనులారా - దేవుని శక్తిని బట్టి
క్రీస్తులో మీరు -  బలమునొందుడి (2)

చరణం 1:
సాతాను తంత్రములన్ - ఎదుర్కొనుటకును
సర్వాంగ కవచమును - ధరించుకొనుటకును (2)
నిత్యము ఆయనలో -  నిలిచియుండుడి (2)

చరణం 2:
రక్షణ శిరస్త్రాణమున్ - ధరించుకొనుటకును
దేవుని వాక్యముతో - అన్నిటిన్ జయించుటకు
నిత్యము సహవాసములో -  నిలిచియుండుడి

చరణం 3:
సమయము పోనియ్యక -  సత్యమును కలిగి
సర్వకాలము ప్రభుతో సహవాసమును కలిగి
నిత్యము మీ తీర్మానములో -  నిలిచియుండుడి
157 ప్రార్ధన సమయంబులో - దేవా చెవియొగ్గుముpraardhana samayambulo - devaa cheviyoggumu
పల్లవి:
(మాదు) ప్రార్ధన సమయంబులో - దేవా చెవియొగ్గుము (2)
మాదు కోటయు, మాదు దుర్గం నీవే - నిన్నే మేము ఆశ్రయింతుమ్ (2)

చరణం 1:
యెడతెగక ప్రార్థింప - ప్రార్ధనాత్మ వరము నిమ్ము
ఆటంకం తొలగించుము - దయకోరి నిన్ను చేరితిమి (2)

చరణం 2:
యెడతెగక ధ్యానింప -  నీ కృప ననుగ్రహించుమా
నీ వాక్యం వెదకుచుండ- దయతోడ మాకు సెలవిమ్ము

చరణం 3:
యెడతెగక నిలుచుండ - పరిశుద్ధుల సహవాసములో
నీ యొక్క రాకడ కొరకై -  దయతోడ మమ్ము సిద్ధపరచు
158 యౌవనులారా - క్రీస్తు యోధులారాyauvanulaaraa - kreestu yodhulaaraa
పల్లవి:
యౌవనులారా - క్రీస్తు యోధులారా 
మన రక్షకుడగు - ప్రభు యేసు (2)
కృప యందును - జ్ఞానమందును
దిన దినము - వృద్ధి పొందుడి (2)

చరణం 1:
దైవ వాక్యమగు - ధర్మ శాస్త్రముల్
అను దినము - ధ్యానించుము (2)
మంచి నేలలో - నాటబడిన
ఫలమిచ్చు - చెట్టువలె నుండెదవు (2)

చరణం 2:
దైవోపదేశములను - వినుచు
విసుగక నిత్యము - పాటించిన
బండమీద యింటిని - కట్టుకొనిన
బుద్ధిగల వానివలె - నుండెదవు

చరణం 3:
వినయ విధేయత - విశ్వాసము
తనయందె - పొందెదవు
క్రీస్తేసు జ్ఞానము - కలిగియును
కదలక స్థిరముగ - నుండెదవు
159 దేవా! నీ అవరణం - మా కెంతో శ్రేయస్కరంdevaa! nee avaranam - maa kento shreyaskaram
పల్లవి:
దేవా! నీ అవరణం - మా కెంతో శ్రేయస్కరం (2)
ఒక దినము ఇచట గడుపుట మేలు - వెయ్యిదినముల కంటెను (2)

చరణం 1:
అద్భుత కార్యములు... ఆ... ఆ... జరిగించు దేవుడవు ఆ... ఆ... (2)
అనవతరం నీ మహిమలు పొగడ మమ్ము నీలో నిలుపుమయ (1)
ఆత్మతో సత్యముతో ఆరాధించగా మనస్సుతో (2)
అల్ఫా ఓమేగయు ఆత్మరూపుడవు ఆనందించగా నీ ఒడిలో (2)

చరణం 2:
అత్యంత పరిశుద్ధమా ఆ... ఆ... ఆ... నీదు గుడారమున ఆ.. ఆ ఆ
నివసించుటకు యోగ్యతలోసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్
జుంటి ధారలకన్నను తేనె మధురిమలకన్నను
శ్రేష్ఠమౌ నీదు వాక్కులచేత మము తృప్తి పరచుమయ్యా

చరణం 3:
పరిశుద్ధ సన్నిధిలో ఆ... ఆ... ఆ... పరిశుద్ధాత్ముని నీడలో ఆ ఆ..ఆ..
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభుని ప్రస్తుతించెదము
మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం
ప్రాణప్రియుడవు పాదముల చేరి ప్రాణార్పనము చేతుము
160 సీయోను తిరిగి చెరలో నుండి విడిపించిseeyonu tirigi cheralo nundi vidipinchi
పల్లవి:
సీయోను తిరిగి చెరలో నుండి విడిపించి (1)
యెహోవా రప్పించినప్పుడు ఆ.. ఆ.. (2)
మనము కలకన్న వారివలె నుంటిమి
నోటినిండ నవ్వుండెను ఆ.. ఆ.. (2)

చరణం 1:
యెహోవా వీరికొరకు గొప్ప కార్యములు చేసెనని
అన్యజనులు చెప్పుకొనిరి (2)
సంతోషభరితులమైతిమి ఆ.. ఆ.. (2)

చరణం 2:
దక్షిణ దేశమునందు ప్రవాహములు పారునట్లు
యెహోవా చెరపట్టబడిన
మావారిని రప్పించుము ఆ.. ఆ.. (2)

చరణం 3:
కన్నీటితో పిడికెడు - విత్తనములు విత్తువారు
సంతోషగానముతో పంటను
యుక్తకాలమున కోసెదరు ఆ.. ఆ.. (2)
161 క్రీస్తేసు వారసులం- దేవుని వారసులంkreestesu vaarasulam- devuni vaarasulam
పల్లవి:
క్రీస్తేసు వారసులం- దేవుని వారసులం (2)

చరణం 1:
దేవా! నీ రాజ్యమే రానిమ్ము మా ప్రభువా (2)
ఎవరెవ్వరి పాపంబులు - క్షమియింపబడి యున్నవో (2)
వారే దానిని చూతురు

చరణం 2:
దేవా! నీ రాజ్యమే - పరలోక రాజ్యము
ప్రభువా! ప్రభువా యనుచు  - పిలుచు ప్రతివాడున్
అందెన్నడు చేరడు

చరణం 3:
దేవా! నీ రాజ్యమే -  నీతితో నిండియున్నది
పరలోక తండ్రి చిత్తము - చేయు ప్రతివాడున్
వారే యందుండెదరు

చరణం 4:
దేవా! నీ రాజ్యమే - శాశ్వతంబైనది
ఈ లోక రాజ్యము లన్నియు - ఆయన క్రీస్తువగున్
దేవుని రాజ్యమగున్

చరణం 5:
దేవా! నీ రాజ్యమే యుగంబులుండునది
పొందువారికే గాని -  మరెవ్వరికి చెందదు
వారెంతో ధన్యులు

చరణం 6:
దేవా! నీ రాజ్యమే నిశ్చలమై యున్నది
దేవా! దహించు అగ్నిని నీ కృపను బొందెదము
ప్రీతితో సేవింతుము

చరణం 7:
దేవా! నీ రాజ్యమే మహిమతో నిండియున్నది
(భూ)లోక రాజులెల్లరు నీ మహిమ చూచెదరు
రాజుల రాజువు
162 యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతోyesuni nammedivaaru aayana uchita krupato

కీర్తన. 92:12 "నీతిమంతులు ఖర్జూర వృక్షమువలె మొవ్వు వేయుదురు"

పల్లవి:
యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో
 నీతిమంతులయ్యెదరు - యేసుని నమ్మెడివారు (1)

చరణం 1:
ఖర్జూరపు చెట్టువలె - మొవ్వు వేయుచుండెదరు (2)
ఖర్జూరపు మట్టలతో - రక్షణకై స్తుతించెదరు (2)

చరణం 2:
లెబానోను దేవదారు -  చెట్టువలె ఎదుగుదురు
ప్రభు కృపజ్ఞానములో - ఎదుగుచు నుందురు వారు

చరణం 3:
యెహోవా మందిరములో  - నాటబడి యుండెదరు
సహనముతో నిలిచెదరు - కదలక స్థిరులై యుండెదరు

చరణం 4:
దేవుని యావరణములో - వర్థిల్లుచు నుండెదరు
సేవింతురు తమ ప్రభుని  - ఘనపరతురు నిరతంబు

చరణం 5:
వారు ముసలితనంబున  - చిగురుపెట్టి ఫలింతురు
ప్రసిద్ధి చేతురు ప్రభుని - యథార్థవంతుడనుచు

చరణం 6:
నీటి కాలువ  యోరను - నాటబడిన వారలై
మేటిసారము కలిగి - పచ్చగ నుందురు వారు

చరణం 7:
హల్లెలూయ పాటపాడి -  వల్లభుని స్తుతింతురు
చల్లని ప్రభురాకడకై - మెల్లగా వేచియుండెదరు
163 సహింతుము శ్రమలన్నియుsahintumu shramalanniyu

2 తిమోతి 2:12 "సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము"

పల్లవి:
సహింతుము శ్రమలన్నియు - యేసుకై సంతోషముతో (2)

చరణం 1:
యేసు కొరకై ఈ లోకములో -  నిందలు హింసలు పొందగా (2)
యేసు కూడ మన తోడుగా (2)
సహించి ఓదార్చి ప్రేమ జూపును

చరణం 2:
నీతి కొరకై ఆకలి దప్పి -  కల్గి మన మెల్ల వేచియుండ
నీతి సూర్యుడు మన తోడై
నీతిని నెరవేర్చి కృప జూపును

చరణం 3:
సువార్త కొరకై చెరనుండినా- కొరడాల దెబ్బల సహించగా
దివారాత్రము గాయు ప్రభునేత్రము
కృపజూపి ప్రేమతో ఆదరించును

చరణం 4:
లోకమందు పలు శ్రమలు -  లోకస్తుల ద్వేషము వలన కలుగు
లోకాధికారి లోకమును
జయించిన ప్రభువే మనల గాయును

చరణం 5:
క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత - ముందు ఈ శ్రమలెన్నదగినవి కావు
క్రీస్తుతో వారసులౌటకు
అర్హత మనము జూపు సహనమే
164 ఆహా ఆనందమే - పరమానందమేaahaa aanandame - paramaanandame

అపొ.కా.3:8 "నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడ దేవాలయములోనికి వెళ్లెను"

పల్లవి:
ఆహా ఆనందమే -  పరమానందమే - ప్రియ యేసు - నొసగె నాకు
కొలతలేనిది - బుద్ధికందనిది -  ప్రేమన్ వివరింప  - వీలగునా? (2)

చరణం 1:
నీచ ద్రోహినైన నన్ - ప్రేమతో చేర్చుకొని (2)
పాప ఊబి నుండి నన్ - పైకి లేవనెత్తెను (2)

చరణం 2:
నిత్యనాశన పురముకు  - నే పరుగిడి వెళ్ళుచుండ
నిత్య జీవమార్గములో - నన్ను నడిపితివి

చరణం 3:
నిలిగిన రెల్లువలే -  నేను విరిగెడు సమయములో
నాకై విజ్ఞాపన చేసి - స్థిరపరచితివి ప్రేమతో

చరణం 4:
హెచ్చరిక స్వరమును - త్రోసి వేసిన నన్ను
ప్రేమ కొరడా దెబ్బతో - ఆదరించి చేర్చుకొంటివి

చరణం 5:
కారు చీకటివేళలో - కలత చెందిన నన్ను
కాచి ఓదార్చితివే - బలమైన నీ ఆత్మతో

చరణం 6:
నాదు ప్రాణనాథుడా -  నిన్నెప్పుడు గాంతునో
ఆత్మప్రియుడా నిన్ను - చూడ ఆశ నాలో కలిగెను

చరణం 7:
నీ ప్రేమ స్వరమున్ విని - నేను మేలుకొంటిని
ప్రియుని రొమ్మును చేరను  - నాలో వాంఛ ఉప్పొంగుచుండె

చరణం 8:
మధ్యాకాశమునందున - ప్రభుని చేరెడు వేళలో
ఆనందమానందమే - ఎల్లప్పుడానందమే
165 విలువైన నీ దేహము - పరిశుద్ధాత్మకు ఆలయంviluvaina nee dehamu - parishuddhaatmaku aalayam
పల్లవి:
విలువైన నీ దేహము - పరిశుద్ధాత్మకు ఆలయం
విలువైన ఈ దేహముతో - దేవుని మహిమపరచు  - (2)

చరణం 1:
యౌవన కాలమున- ప్రభుకాడిని మోయుము (2)
విశ్వసమందు యోధుడవై - దేవుని మహిమపరచు (2)

చరణం 2:
మంచి పోరాటమును  - పోరాడుము యేసుకై
విజయ జీవితము జీవించుచు - దేవుని మహిమపరచు

చరణం 3:
లోకమును ప్రేమింపకు -  గతియించు ఈ ఆశలు
దైవ చిత్తమును జరిగించి నిరతం- దేవుని మహిమపరచు

చరణం 4:
క్రీస్తులో నిలచి యుండి- అధికముగా ఫలియించుము
పవిత్రమైన హృదయము కలిగి - దేవుని మహిమపరచు

చరణం 5:
ఆత్మ ప్రాణ దేహము - అర్పించుకో క్రీస్తుకై
పవిత్రమైన హృదయము కలిగి - దేవుని మహిమపరచు
166 నీ దేహము బహు విలువైనదిnee dehamu bahu viluvainadi
పల్లవి:
నీ దేహము బహు విలువైనది - పరిశుద్ధాత్మకు నిలయమైనది (2)
ప్రాణాత్మ దేహములతో దేవుని (2)- మహిమపరచుము (2)

చరణం 1:
విలువ పెట్టి కొనబడినావు - విలువైన సొత్తుగ యున్నావు (2)
నీవు నీ యొక్క సొత్తుకాదు (2)
పరిశుద్ధ జనాంగముగా యున్నావు (2)

చరణం 2:
ఈ లోక మర్యాదను అనుసరింపక - దేవుని చిత్తమును ఎరిగి
మనస్సు మారి నూతనమగుట వలన
రూపాంతరమును పొందుడి

చరణం 3:
చావైనా బ్రతుకైన భరియించెదము - మృత్యుంజయుడైన యేసుకొరకే
సజీవయాగముగా జీవితము
ప్రభు మహిమార్ధమై అర్పింతము
167 నా ప్రాణ ప్రియుడా - నిన్నే స్తుతింతున్naa praana priyudaa - ninne stutintun
పల్లవి:
నా ప్రాణ ప్రియుడా - నిన్నే స్తుతింతున్ (1)",  
            "నా హృదియార - నిన్నే ఘనపరతున్ (1)",  
             "నా నిరీక్షణకు ఆధారం నీవే (2)",  
              "ఎల్లకాలం నిన్నే అందింతున్ (2)

చరణం 1:
పాప పాశములు నను చుట్టిముట్టి - నిత్యనాశనముకు చేరువకాగా (2)
పావనుడేసు నా కట్లు త్రెంచ (2) సిలువలో బలియాయె (2)
గొప్ప రక్షణను నాకిచ్చెనని (2) - కొనియాడెదన్ (2)

చరణం 2:
నాదు జీవిత యాత్రలో నాకు - జీవపు వెలుగు నీవైతివి
నాదు కష్ట సమయంబులలో - ఆశ్రయదుర్గమైతివి
నాదు కాపరివై జీవమార్గములో - నడిపితివే

చరణం 3:
అలలు నన్ను ముంచజూచినను - బలుడేసు భయపడవద్దనెను
తల్లడిల్ల కుండ స్థిరపరచెనన్ను - తన సాక్షిగా నిలిపే
సజీవ యాగముగా నన్నే నీకు - అర్పించెదన్

చరణం 4:
తల్లిదండ్రులు నన్ను విడిచినను - కన్నీళ్ళు నా కంట రాలినను
కలవరపడకు అంటివి ప్రభువా - కరుణను జూపితివే
కరములు జోడించి పూచించెద నిన్ను - నా ప్రభువా

చరణం 5:
నిన్ను విడువను ఎడబాయనంటివి - నీ అరచేతిలో చెక్కిన ప్రభువా
అందరు మరిచిన మరువని దేవా - పొగడక ఎట్లుందున్
పరిశుద్ధులందరితో హల్లెలూయ పాడుచు - కీర్తింతున్
171 ప్రేమించుచున్నావా ప్రభు యేసునిpreminchuchunnaavaa prabhu yesuni
పల్లవి:
ప్రేమించుచున్నావా ప్రభు యేసుని (2)

చరణం 1:
మనము పాపులమై బలహీనులమై శత్రువులమై యుండ (2)
చచ్చిన పాపిపై కుమ్మరించెన్ - తన గొప్ప ప్రేమను (2)
ఎన్నతరమా ప్రభుప్రేమన్ (2) రుచించినావా నిస్వార్థ ప్రేమన్?(2)

చరణం 2:
శిక్షకు పాత్రులమై యుండగ సత్యుండు యేసు బదులుగ వచ్చె",
            "అతిహీనుడుగ కఠిన సిలువపై - ప్రేమను ఋజువు పరచె
అత్యున్నతమైన ప్రభు ప్రేమన్ - అనుభవించిన నీవు మరచెదవా

చరణం 3:
శిష్యుడైన పేతురువలె వ్యసనపడి బహు దూరమై యుండగా
విడువని తన ప్రేమ ముమ్మారు  - వెంబడించుట నేర్పించెన్
వర్ణింపగలవా ప్రభు ప్రేమన్- విశ్వసించి సాక్షిగా నుండెదవా

చరణం 4:
ఆయనను ప్రేమించినచో దైవాజ్ఞలను పాటించుచు",
            "ఆత్మలను తెచ్చుచు సంఘముగ- సమకూర్చుచు పోషించుము
ఆత్మ ఫలములను ఫలియించి - నిరతము ప్రభుని ప్రేమించుమా?
172 యౌవనుడా క్రీస్తేసు యోధుడాyauvanudaa kreestesu yodhudaa
పల్లవి:
యౌవనుడా క్రీస్తేసు యోధుడా
యౌవనమున కాడిని మోయు వాడ (2)
ఓర్చు సామర్థ్యములు గలిగి
నేర్పుతో జీవించ నేర్వుము (1)

చరణం 1:
రారాజు క్రీస్తుకు సైనికుడవై -సాతాను సేనల నెదిరించువాడవై (2)
పోరాడు మత్యంతమగు సహనముతో (2)
జయమొందగ ఆనంద భరితుడవై (2)

చరణం 2:
శ్రమించి సేద్యము జేయువాడవై
ప్రథమ ఫలముల భాగస్వామివై
శ్రమఫలిత పంటల బహుగ కోయుచు
సంతోషముతో జీవించు వాడవై

చరణం 3:
బంధకములలో ప్రార్థించు వాడవై
హింస దుఃఖము బాధ నోర్చెడి వాడవై
అంధకారమన్న భయమేమిలేక
హత సాక్ష్యమునకు సిద్ధపడు వాడవై

చరణం 4:
క్రీస్తువలె ప్రేమించు వాడవై
యేసు వలె సహించెడి వాడవై
క్రీస్తును బోలి విజ్ఞాపన చేయుచు
యేసువలె క్షమించెడి వాడవై

చరణం 5:
ఎర్పర్చబడినవారు - నిత్య మహిమకై
క్రీస్తేసు నందలి రక్షణ పొందుటకై
ఓర్పు సహనము కలబరచువా-రు
నిత్యము ఏలుదు-రు ప్రభు ప్రజలై
173 నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభుnishchalamainadi ellappudu prabhu
పల్లవి:
నిశ్చలమైనది ఎల్లప్పుడూ ప్రభు యేసు రాజ్యము (2)
ఆహా! ఆహా! అది ఎంత రమ్యము
ఆ రాజ్యములో అంత పరిపూర్ణము (1)
ఆహా! ఆహా! అది ఎంత భాగ్యము
ఆ రాజ్యములో వింత ఐశ్వర్యము (1)
ఆ నిశ్చల రాజ్యముకు చేరుము -నిత్యములో నీకు బహు ధన్యము (2)

చరణం 1:
యేసే సత్యజీవమార్గము-నిశ్చల రాజ్యముకేసే ద్వారము (2)
నమ్మిన వారికే ప్రవేశము-మహిమ రాజ్యములోన మోక్షము  (2)

చరణం 2:
విలువైనది యేసుని అర్పణము
నీ రక్షణ కర్పించే తన ప్రాణము
ఈ క్షణము నీ పాపము ఒప్పుకొనుము
రక్షణ వస్త్రము నీవు ధరించుము

చరణం 3:
సిలువలో పలికెన్ యేసు ఆహ్వానము
నా నిశ్చల రాజ్యముకు చేరుము
నేడే యేసుని అంగీకరించుము
పొందుము జీవకిరీటము

చరణం 4:
ఆ రాజ్యములో లేదు కలహము
క్రీస్తేసు ద్వారానే సమాధానము
క్రీస్తుని ప్రేమయే శాశ్వతము
నిశ్చల రాజ్యములోనే శాంతము

చరణం 5:
నీ యాత్రకు యేసే గమ్యము
నిశ్చల రాజ్యములోనే విశ్రమము
ఆయనలో నుంచు నీ నమ్మకము
చేయుము యేసు నీ స్వంతము
175 విశ్వాస సహితముగనుvishvaasa sahitamuganu

2తిమోతి 2:3 "క్రీస్తుయేసు యొక్క మంచి రాణువవాడు"

పల్లవి:
విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని (2)

చరణం 1:
నిత్యజీవము చేపట్టి - సత్యవేదము చేబూని (2)
పవిత్ర హృదయములతో - పోరాడుడి విజయముతో (2)

చరణం 2:
నీతిని భక్తిని గోరి - నిజమైన విశ్వాసులుగా
ఓర్పును ప్రేమను కల్గి - పోరాడుడి విజయముతో

చరణం 3:
ఆకాశమున నుండి - కలిగిన దర్శనమునకు
అవిధేయత చూపకను - పోరాదుడి విజయముతో

చరణం 4:
క్రీస్తేసు మనసు కలిగి - సత్క్రియలను  జరిగించి
యోధులుగా నిలుచుండి - పోరాడుడి విజయముతో

చరణం 5:
దీన మనసు కలిగి - ప్రియులారా లోబడియు
మహిమ కిరీటముకై - పోరాడుడి విజయముతో

చరణం 6:
ఆత్మల రక్షణ కొరకై - అర్పించుడి జీవితముల్
అంతము వరకు నిలచి - పోరాడుడి విజయముతో

చరణం 7:
యేసుని జీవము కలిగి - ఇలలో శ్రమనోర్చుచు
విజయోత్సాహముతోడ - హల్లెలూయ పాడెదము
176 రండి రండి యెహోవా యొద్దకుrandi randi yehovaa yoddaku

1 యెహోను 2:14 "యౌవనస్థులారా, మీరు బలవంతులు... మీరు దుష్టుని జయించి యున్నారు"

పల్లవి:
రండి రండి యెహోవా యొద్దకు - ఆయన జ్ఞానమును పొందను (2)
ప్రభు యేసును అనుసరించను (2)

చరణం 1:
ఎడతెగక ప్రార్థించుము - మెలకువగా నుండి (2)
జయించెదవు శోధనలు - యేసు ప్రభుని శక్తితో (2)

చరణం 2:
సాత్వికుడు దీనుండేసు - ఆయనను పోలినడువుడి
జీవించెదవు యేసు వలెనే - తండ్రి చిత్తము చేయుచు

చరణం 3:
ప్రేమింపకుడి లోకమున్ - లోకములో ఉన్నవాటిని
తండ్రి ప్రేమ ఉండదు - అట్టివాని యందున

చరణం 4:
యౌవనస్థులారా మీరు - బలవంతులు దేవునియందు
జయించితిరి లోకమును - మరియు సాతానును
177 ప్రభు క్రీస్తు వారసులముగాprabhu kreestu vaarasulamugaa

రోమా 8:37 "అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము"

పల్లవి:
ప్రభు క్రీస్తు వారసులముగా - ఈ లోకమునందున మనము
ప్రతి విషయము నందత్యధిక - విజయమును పొందుచున్నాము (1)

చరణం 1:
తండ్రి మన పక్షము నుండ - యెదిరించు విరోధి యెవడు? (2)
తనయుని యర్పించిన వాడు (2) - సకలము మన కెందు  కొసగడు? (2)

చరణం 2:
ప్రభు వేర్పరచుకొను వారిపై - నేరము మోపువాడెవడు?
ప్రభువైన దేవుడు గాక - నీతిగ తీర్చెడి వాడెవడు?

చరణం 3:
రుణించు యేసు గాక - శిక్షించుట కర్హుడు  యెవడు?
నిరతము విజ్ఞాపన జేయ- మృతిని గెలిచిన వాడెవడు?

చరణం 4:
ప్రభు ప్రేమ నుండి మనల - యెడ బాప తలచు వాడెవడు?
ఖడ్గమున ద్వేషము చేత - యెడబాప  గల వాడెవడు?
180 ఎంత జాలి యేసువాenta jaali yesuvaa

కీర్తన 103:13 "తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును"

పల్లవి:
ఎంత జాలి యేసువా
యింతయని యూహించలేను (1) ||ఎంత॥

చరణం 1:
రక్షకుండా   నాకు బదులు - శిక్షన నుభవించినావు (2)
సిలువయందు సొమ్మసిల్లి (2) - చావొందితివి నాకై (1)

చరణం 2:
ఏమి నీ కర్పించగలను - ఏమి లేని వాడనయ్యా
రక్షణంపు పాత్రనెత్తి - స్తోత్రమంచు పాడెద

చరణం 3:
నీదు నామమునకు యిలలో - భయపడెడు వారికొరకై
నాథుడా నీ విచ్చు మేలు - ఎంత గొప్పదేసువా

చరణం 4:
నేను బ్రతుకు దినములన్ని - క్షేమమెల్ల వేళలందు
నిశ్చయముగ నీవు నాకు - ఇచ్చువాడా ప్రభువా

చరణం 5:
నాదు ప్రాణమునకు ప్రభువా - సేద దీర్చువాడ వీవు
నాదు కాపరివి నీవు - నాకు లేమి లేదుగా

చరణం 6:
అందరిలో అతి శ్రేష్ఠుండా - అద్వితీయుడగు యేసయ్యా
హల్లెలూయ స్తోత్రములను - హర్షముతో పాడెదా
181 యేసు నామం మనోహరంyesu naamam manoharam

ప్రకటన 15:4 "ప్రభువా... నీ నామమును మహిమపరచనివాడెవడు? "

పల్లవి:
యేసు నామం మనోహరం - ఎంతో అతి మధురం (1)
పరము నందైన ఇహమునందైన వేరే నామమే లేదు (2)

చరణం 1:
అమూల్య ప్రాణమిచ్చెన్ - పాపులను రక్షించుటకై
దాసుని రూపమొంది - ఇహముకు దిగివచ్చెను (2)
కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం (2)
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్మునాశీర్వదింప (2)

చరణం 2:
కల్వరిగిరిలోన ఇనుపమేకులతో
ప్రభువా నీ దేహమును - సిలువపై నెక్కించిరి
కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీనామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వదింప

చరణం 3:
పూర్ణ స్వస్థత మాకు - ప్రేమతో నొసగితివి
శాంతి ఆనందములు - నీ నామమున దొరుకున్
కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వదింప
182 జీవిత సాగరమున - ననుjeevita saagaramuna - nanu

కీర్తన. 139:24 "నిత్య మార్గమున నన్ను నడిపింపుము "

పల్లవి:
నా  జీవిత సాగరమున - నను నడిపించుమా ప్రభువా (1)", 
           "కుడియెడమకు తొలగకుండ - నను చక్కగ నడిపించు (2)

చరణం 1:
అంధకార లోకములో - అంధుడనై నేనుండగా (2)
పందెరంగములో నేను గెలువ - నా ముందుగ నడుపుము (2)

చరణం 2:
లోకములో మాయలకు - లోకుల మోమాటముకు
లోకువ నేను కాకుండునట్లు - మెళకువ నొసగుము ప్రభువా

చరణం 3:
ఆత్మీయ యుద్ధములో - శత్రువును ఓడింపన్
సత్యవాక్య విశ్వాసములు - నిత్యము నొసగుము ప్రభువా
183 నా హృదయము వింతగ మారెనుnaa hrudayamu vintaga maarenu

యోహాను 9:25 "నేను గ్రుడ్డివాడనై యుండి యిప్పుడు చూచుచున్నాను"

పల్లవి:
సంతోషమే సమాధానమే (3)
చెప్పనశక్యమైన సంతోషం (2) ॥సంతోషమే॥

చరణం 1:
నా హృదయము వింతగ మారెను (3)
నాలో యేసు వచ్చినందున (2)

చరణం 2:
తెరువబడెను నా మనోనేత్రము
యేసు నన్ను ముట్టినందున ॥సంతోషమే॥

చరణం 3:
ఈ సంతోషము నీకు కావలెనా?
నేడే యేసు నొద్దకు రమ్ము ॥సంతోషమే॥

చరణం 4:
సత్య సమాధానం నీకు కావలెనా?
నేడే యేసు నొద్దకు రమ్ము  ||సంతోషమే||

చరణం 5:
నిత్య జీవము నీకు కావలెనా?
నేడే యేసు నొద్దకు రమ్ము  ॥సంతోషమే॥

చరణం 6:
మోక్ష భాగ్యము నీకు కావలెనా?
నేడే యేసు నొద్దకు రమ్ము ॥సంతోషమే॥

చరణం 7:
యేసు క్రీస్తును నేడే చేర్చుకో
ప్రవేశించు నీ యుల్లమందు ॥సంతోషమే॥
184 ఉన్నత స్థలములపై నెక్కించి చూపించుunnata sthalamulapai nekkinchi choopinchu

ద్వితీ. కాం 32:7-17 "భూమి యొక్క ఉన్నతస్థలముల మీద వాని నెక్కించెను”

పల్లవి:
ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు (1)
ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందర మొందు సదా (2)

చరణం 1:
మరణము మ్రింగబడే - ఘన విజయము ప్రాప్తమాయె (2)
మరణము ముల్లును విరచి జయంబును
యేసు అనుగ్రహించెన్ (2)

చరణం 2:
ఎవరి మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో
దైవశాంతి నొంది క్రీస్తుతో నిలిచి సంతస మొందెదరు

చరణం 3:
ఆశ్చర్యకరుడాయెనే - ఆలోచన కర్తయును
నిశ్చయముగా బహుబుద్దిధ వివేకము లిచ్చి నపుడు సదా

చరణం 4:
చంచల హృదయములను -  ముష్కరులగు పాపులను
వంచన లేక వాక్యమునకు తలవంచి విదేయులౌదురు

చరణం 5:
కుడికి తిరిగినను -  మరి యెడమకు తిరిగినను
నడువుడి త్రోవయిదేయను శబ్దము చెవులకు వినబడును

చరణం 6:
పక్షిరాజు తనదు - పిల్లల కాచెడురీతి
రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా

చరణం 7:
సుందరమగు రాజున్ -  నీ కనులతో చూచెదవు
అందమైన యా పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు
185 రాజులకు రాజైన యేసు ప్రభువుraajulaku raajaina yesu prabhuvu

మత్తయి 25:10 "సిద్ధపడియున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి"

పల్లవి:
రాజులకు రాజైన యేసు ప్రభువు రానై యున్నాడు (2)
ఎత్తబడెదవా లేక విడువబడెదవా? (2)

చరణం 1:
తెలిసి కొంటివా నీవెంత ఘోరపాపివో
సిలువపై తీర్చెగా నీ పాపఋణమున్ (2)
ఒప్పుకొనిన పాపమున్ క్షమించును యేసు
లేనియెడల విడువబడెదవు సిద్ధపడుమా (2)

చరణం 2:
బుద్ధిలేని కన్యలవలె మోసపోతివా
చేయలేవు ప్రభు సేవ నీశక్తితో
నూనెలేక భ్రమతో బ్రతికెదవా
లేనియెడల విడువబడెదవు సిద్ధపడుమా

చరణం 3:
వాక్యముకై జీవితం అప్పగింపక
దాచితివా తలాంతులను లెక్కచేయక
మొదటి ప్రేమను తిరిగి పొందుమా
లేని యెడల నష్టపోదువు సిద్ధపడుమా

చరణం 4:
ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో
కృపను బట్టి నడిపితివి నాదు యాత్రలో
ముగియువరకు సిద్ధపరచు నీ రాకకై
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
186 జయించు వారిని కొనిపోవ ప్రభుjayinchu vaarini konipova prabhu

1థెస్స . 4:13 - 18 "సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు"

పల్లవి:
జయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును (2)
స్వతంత్రించు కొనెదరుగ వారే సమస్తమున్ (2)

చరణం 1:
ఎవరు యెదురుచూతురో సంసిద్ధులౌదురు (2)
ప్రభు రాక నెవరాశింతురో కొనిపోవ క్రీస్తు వచ్చును (2)

చరణం 2:
యేసు శిష్యులతో పల్కె తిరిగి వత్తునని
సిద్ధపరతు స్థలమును నేనున్న చోట మీరుండ

చరణం 3:
ఎవరేసునితో నడతురో ప్రత్యేకమవుదురు
మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును

చరణం 4:
క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము
మమ్మును సిద్ధపరచిన శ్రీయేసును సంధింతుము

చరణం 5:
తన సన్నిధిలో మనల నిలుపు నిర్దోషులనుగా
బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక యిదే

చరణం 6:
సదా ప్రభుని తోడ నుండి స్తుతి చెల్లింతుము
అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా
187 ప్రేమగల యేసు - నిన్ను ప్రేమింపగాpremagala yesu - ninnu premimpagaa

1 కొరింథీ. 13:2 "ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను"

పల్లవి:
ప్రేమగల యేసు - నిన్ను ప్రేమింపగా
నీ సోదరు నెల -  ప్రేమింపకుందువు (2)

చరణం 1:
దేవదూత భాషలతో మాట్లాడినను  ప్రవచింపగల - వరము లుండినను   (2)
ప్రేమలేని వాడనైన - సర్వము వ్యర్థము ప్రభు దృష్టిలో (2)

చరణం 2:
పర్వతములను - పెకలించగల - పూర్ణవిశ్వాసము - గలవాడనైన (2)
ప్రేమలేనివాడనైన - సర్వము వ్యర్థము ప్రభు దృష్టిలో (2)

చరణం 3:
పరమ ప్రభువు - ప్రేమ స్వరూపి నిను ప్రేమించి - బలియాయె సిలువలో (2)
నిజమగు ప్రేమ - నీ యందుండున్  నీ మదియందు ఆ ప్రభువున్న (2)
188 ఓ సంఘమా - క్రీస్తు దేహమాo sanghamaa - kreestu dehamaa
పల్లవి:
ఓ సంఘమా - క్రీస్తు దేహమా - ఓ సంఘమా - క్రీస్తు దేహమా (2)
అంగములై యున్న - మీరందరు - క్రీస్తు శరీరమై - యున్నారు (2)

చరణం 1:
శిరస్సైయున్న - క్రీస్తు దేహము నందు - ఏలాంటి అంగమై - నీవున్నావు (2)
క్రీస్తును శిరస్సుగా - కలిగియుండి - కలసి కార్యములు - చేయుదము (2)

చరణం 2:
వివాదములు లేక - ఐక్యత కలిగి -  యేకముగా ప్రభు సేవ - చేయుదము
కరములు కాళ్ళచే కలహించిన - కలుగునా క్రీస్తుకు - మహిమ ఘనత?

చరణం 3:
లోక రక్షణ కొరకై - క్రీస్తు ప్రభువు - క్రయమును చెల్లించె - సిలువలో
నేడే ప్రభుక్రీస్తును - అంగీకరించి - అంగముగ చేరుము - క్రీస్తు శరీరములో
189 వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యాvintimayyaa nee svaramu kantimayyaa

మత్తయి 17:8 "యేసు తప్ప మరి యెవరును వారికి కనబడలేదు"

పల్లవి:
వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును (1)
ప్రియ ప్రభూ నిన్నుగాక వేరెవరిని చూడము వినము (2)

చరణం 1:
భక్తి మర్మము గొప్పది యెంతో శరీరుడుగా మారిన దేవా (2)
దూతలకు కనబడితివి (2) లోకమందు నమ్మబడియున్న దేవా (2)

చరణం 2:
భయపడవలదని దూతలు తెల్పె -  మహా సంతోషకరమైన వార్త
రక్షకుడు పుట్టెనని పరమందు మహిమ భువికి శాంతియనిది

చరణం 3:
నరరూప ధారివి యైతివి ప్రభువా -  అద్భుతములు చేసియున్నావు
వేరెవ్వరు చేయలేరు – అద్భుతకరుడ ఘనత కలుగును గాక

చరణం 4:
మూగవారికి మాటలిచ్చితివి -  గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి
మృతులను లేపితివి- పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా

చరణం 5:
ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి  - అధికారముతో తిరిగి లేచితివి
మరణపు ముల్లు విరచితివి  - సమాధి నిన్ను గెలువక పోయెను

చరణం 6:
ఇహము నుండి పరమున కేగి- మా కొరకు నీవు రానై యున్నావు
ఆనందముతో కనిపెట్టెదము - మదియందే నిరీక్షణ కలిగి స్తుతింతుమ్
190 ప్రభువా, గురి యొద్దకేprabhuvaa, guri yoddake

ఫిలిప్పీ 3:7 "ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని"

పల్లవి:
ప్రభువా, గురి యొద్దకే  - పరుగెత్తుచున్నాను నేను (2)
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని (2)

చరణం 1:
ఏవేవి లాభకరములై యుండెనో - వాటిని క్రీస్తు నిమిత్తం
నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను

చరణం 2:
క్రీస్తును సంపాదించుకొని - తన పునరుత్థాన బలమును
ఎరిగి ఆయన శ్రమలలో పాలి వాడనగుదున్

చరణం 3:
క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన - జ్ఞానము నిమిత్తము
సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను

చరణం 4:
వెనుక నున్నవి మరచి - ముందున్న వాటి కొరకై
వేగిర పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను
191 దేఖో దేఖో ఈశుకో జో హమారే విశ్వాస్ కా కర్తా హైdekho dekho eeshuko jo hamaare vishvaas kaa kartaa hai

లూకా 23:31,32 “సీమోనూ,.... నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను”

పల్లవి:
దేఖో దేఖో ఈశుకో జో హమారే విశ్వాస్ కా కర్తా హై (2)
ఔర్ సిద్ధ్ కర్ నే వాలా హై (2)

చరణం 1:
జబ్ తక్ థీ నజర్ ఈశుకీ తరఫ్ - పత్రస్ భీ చలా పానీకే ఊపర్ (2)
పర్ హవా కో దేఖ్ కర్ ఆయా డర్-డూబ్ నే ఓ లగా పానీకే అందర్ (2)
చిల్లాకర్ కహా హే ప్రభు ఈశు - ముజె బచా డూబ్ రహా హు మై (2)
ధ్రిష్టి రఖే ఈశుకీ తరఫ్ విశ్వాస్ కా పరఖ్ జబ్ కభీ ఆయె  (2)

చరణం 2:
లే చలే ఈశుకో లోగ్ జబ్ మిల్ కర్  - పత్రస్ భీ చలా దూరీ రఖ్ కర్జ
బ్ లోగ్ నే కహా ఏహై శిష్య్ ఉస్ కా డర్ గయా  ఔర్ తీన్ బార్ ఓ నకార్ కర్ దియా
ధ్రిష్టి జబ్ పడీ ఈశుకీ ఉస్పర్ పూఠ్ పూఠ్ కర్ రోయా దుఃఖిత్ హోకర్
ఓ దయాకీ దృష్టి హమ్ పర్ హై పశ్చాత్తాపీ హోకర్ హమే ఆనాహై

చరణం 3:
ఈశూనె కహా సీమోన్ హె సీమోన్ - దేఖ్ శైతాన్ నే తుజ్ కో మాంగ్ లియాహై
తాకీ గేహూకీ నాయీ తుమ్ కోఫర్ కె - ఔర్ చునే హువోకో హో సఖీ భర్ మాయ్
పరంతూ మైనే తేరేలియే బిన్ తీ  హై - తేరా విశ్వాస్ కబీభీ జాతా న రహే
జబ్ తూ ఫిరే భాయియో కో స్థిర్ కరె క్యోంకీ ఐస్ లియే  మైనే తుజె చునాహై

చరణం 4:
ఈశూనే సీమోన్ పత్రస్ సె  కహా క్యా తూ - ఇన్ సె బడ్ కర్ ముఝే ప్రేమ్ కర్తా హై?
పతరస్ నే కహా ప్రభు జాన్ తూ హై - ఈశూనే కహా మేరే మేమ్ నే కో చరా
దూస్ రీ బార్ ప్రభునే కహా ఉస్ నే – తీస్ రే బార్ బీ ప్రభు దబావ్ సే కహా
ఏ సవాల్ ఈశూ హమే  కర్ తాహై, బదలే మే జవాబ్ హమారా క్యా హై?
192 యేసుప్రభువే - నీకు రక్షణనిచ్చునుyesuprabhuve - neeku rakshananichunu

హెబ్రీ. 2:3 "ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?"

పల్లవి:
యేసుప్రభువే - నీకు రక్షణనిచ్చును
ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు

చరణం 1:
మృతియే పాపపు జీతము - ప్రభుని వరము జీవము (2)
క్రీస్తు నoగీకరించిన - నిత్యజీవ మిచ్చును (2)
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా (2)
మరతువా యేసుని ప్రేమను - మరువకు (2)

చరణం 2:
కంటికి కనబడనివెన్నో - చెవికి వినబడనివెన్నో
గ్రహింప శక్యము కానివి - నీకై సిద్ధపరచెను
ప్రాణమున్ ఆ సిలువ పైని - బలిగా నిడి నిన్ కొనెగదా
పెడచెవిన్ బెట్టకు యేసుని - మాటను

చరణం 3:
మరణబలము గలవానిన్ - నాశంబు చేసెను
మరణభయములో నున్న - వారిని విడిపించెను
ప్రాణమున్ ఆ సిలువ పైని - బలిగా నిడి నిన్ కొనెగదా
హృదయమున్ తెరువుము యేసును - చేర్చుకో

చరణం 4:
సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారిని
మధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితో
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడినిన్ కొనెగదా
సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే

చరణం 5:
దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందు
పరలోకపు పిలుపులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడినిన్ కొనెగదా
సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే

చరణం 6:
దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలో
క్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిది నిన్ కొనెగదా
త్వరపడు నీదు భాగమును - పొందను

చరణం 7:
పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్
ధరించుకొను సమూహము - ఖర్జూరమట్టలు చేబూని
దేవునికిని గొర్రెపిల్లకును - స్తోత్రములు చేయుచుండ
నీవు నీ రక్షణకై పాడుము - హల్లెలూ
193 దైవకుమారుడు - ప్రభుక్రీస్తేdaivakumaarudu - prabhukreeste

మత్తయి 16:16 "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు"

పల్లవి:
దైవకుమారుడు - ప్రభుక్రీస్తే (2)
ఏమనుకొనుచున్నారు మీరతనిని
ఎవరను కొనుచున్నారు మీరతనిని (1) ||దైవ||

చరణం 1:
ధన ఘనములను - నీకిచ్చుటకు
నీ దారిద్య్రము  పొందెను వినుమా (2)
కనుగొనుమా ధనవంతుడు యేసుని (1)

చరణం 2:
నానా విధమగు జ్ఞానము దేవుడు
సంఘము ద్వారా బయలు పరచెను
క్రీస్తేసుని మహదైశ్వర్యమును

చరణం 3:
సంఘములో ఒక అంగమై యుండిన
భంగము రాదు నీ - జీవితమునకు
సంఘమునకు క్రీస్తే సే శిరస్సు

చరణం 4:
పాపక్షమాపణ పొందుము నీవు
దేవుని వాక్యము - చదువుము నీవు
నిన్నతడు అతి శుద్ధి పరచును
194 హల్లెలూయ పాడెద... ప్రభుhallelooya paadeda... prabhu

ఎఫెసీ. 5:19, 20 "మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు... తండ్రియైన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు"

పల్లవి:
హల్లెలూయ పాడెద... ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)

చరణం 1:
వాగ్దానముల నిచ్చి - నెరవేర్చువాడవు నీవే (2)
నమ్మకమైన దేవా - నన్ను కాపాడువాడవు నీవే (2)
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్ (1)

చరణం 2:
నాదు శత్రువులను - పడద్రోయు వాడవు నీవే
మహా సామర్థ్యండవు - నా రక్షణ శృంగము నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

చరణం 3:
ఎందరు నిన్ను చూచిరో - వారికి వెలుగు కల్గెన్
ప్రభువా నే వెలుగొందితిన్ - నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

చరణం 4:
భయమును పారద్రోలి - అభయము నిచ్చితివి
ఎబినేజరు నీవై ప్రభు - నన్ను సంరక్షించుచుంటివి
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

చరణం 5:
కష్టములన్నింటిని - ప్రియముగా భరియింతును
నీ కొఱకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

చరణం 6:
ఈ జీవిత యాత్రలో - ఏమి సంభవించిన
మహిమ నీకే ఓ ప్రభూ- ఇదియే నా దీన ప్రార్ధన
ప్రభువా - నిన్ను నే కొనియాడెద
195 పూర్ణ్ హృదయ్ సే ధన్యవాద్ చఢాతా హూ మై ప్రభు కోpoorn hruday se dhanyavaad chadhaataa hoo mai prabhu ko
పల్లవి:
పూర్ణ్ హృదయ్ సే ధన్యవాద్ చఢాతా హూ మై ప్రభు కో

చరణం 1:
మైనే న చునా ప్రభు కో, ప్రభూజీ నే చునా ముఝే
ముఝె జైసే పాపీ కో, ఉద్ధార్ దియా ప్రభు నె
స్వర్గీయ్ రాజ్య్ మె, భాగీథార్ కియా

చరణం 2:
మేరే హృదయ్ కె పాప్ కో, అప్ నే లహూసే ధోయా
మృతక్ మేరే ఆత్మా కో, ప్రభూజీ నే జిలాయా
అనంత్ జీవన్ కా ధాన్ ముఝే ధిఝే

చరణం 3:
పాప్ కే బంధన్ మే మై థా, హృదయ్ మే శాంతి నహీ థీ
పాప్ మైనే మాన్ లియా, నిర్దోష్ లహూ సే ధోయా
శాంతి ఆనంద్ సే ముఝే భర్ దియా

చరణం 4:
కైసా మహాన్ ప్రేమ్ ప్రభు కా, వర్ణన్ సే బాహర్ వహ్ హై
కైసే భూలూం, ఉస్ కె ప్రేమ్ కో, దిఖాయా ముఝె పాపీ పర్
ఇస్ లియే గావూంగా మై, ప్రసంశా ఉస్ కీ

చరణం 5:
స్వర్గీయ దేశ్ మె పహుంచానే, ప్రతిగ్య ఉస్ నే కీ హై
దుఃఖ్ హోయా సుఖ్ హా తాభీ, దౌడ్ పూరీ కరూంగా మై
స్థిర్ రహూంగా తబ్ తక్, పహుచూ ఉస్ దేష్ మే
197 పందెమందు అందరు పరిగెత్తిననుpandemandu andaru parigettinanu
పల్లవి:
పందెమందు అందరు పరిగెత్తినను- బహుమానము పొందువాడు ఒక్కడే కదా (2)
పరుగిడెదం బహుమానము పొంద
ప్రభుయేసు నందే కలుగు విజయము
హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... (2)

చరణం 1:
క్రీస్తేసు సువార్తను చాటించుచు - సాక్ష్యమిచ్చుచు పరుగెత్తుదము (2)
ప్రభువైన యేసు వలన- తుదముట్టింతుము పరిచర్యను (2)

చరణం 2:
విశ్వాసము ద్వారా సాతానునోడించి - పందెమందు ఓపికతో పరుగెత్తుదము
వాగ్ధాన ఫలములను - క్రీస్తు యేసులో అనుభవింతుము...

చరణం 3:
పౌలువలే పరుగును కొనసాగించుచు - శ్రమలేన్ని ఎదురైన పోరాడెదము
యేసువైపే దృష్టినిలిపి - జీవించెదము అంతమువరకు
198 యవ్వనులారా మీరు బలవంతులుyavvanulaaraa meeru balavantulu
పల్లవి:
యవ్వనులారా మీరు బలవంతులు
దైవ వాక్యము మీలో నిలచియున్నది - (2)
దుష్టుని మీరు జయించియున్నారు-
దేవుడే మీ పక్షముగా యుద్ధమాడెను - (2)

చరణం 1:
దేవుని మూలముగా జన్మించిన పుత్రులుగా
అపవాది నుండి మిమ్మును తప్పించును
నడిపించును ఆత్మీయ ప్రజలనుగా -(2)
అంతము వరకు మిమ్మును క్షేమముగా - (2)

చరణం 2:
దైవశక్తిచే స్థిరులుగ నిలవబడి
శత్రు సాతానుని మీరు యెదురించుడి
దేవుడిచ్చు సర్వాంగ కవచమును
ధరించి మీరు ధీరులై పోరాడుడి

చరణం 3:
సజీవుడైన యేసుడే మీతో నుండున్
సాతానుని జయించే శక్తిని ఇచ్చున్
పూర్ణబలముతో మిమ్మును బలపరచున్
విజయశాలియై మీకు విజయమిచ్చున్

చరణం 4:
ప్రభుయేసు క్రీస్తు మీ పక్షముగా
ఉండగా మీకు విరోధి ఎవ్వడు
ఆయన ద్వారానే అత్యధిక విజయము
పొందుచు మీరు చేరుడి నిత్యరాజ్య

చరణం 5:
మంచి పోరాటము పోరాడుచు
విశ్వాసమందు మీరు నిలచియుండుడి
అంతము వరకు స్థిరులుగా నిలచుండిన
నిత్యమందు బహుమానమును పొందెదరు
199 దేవా దేవా! నేను జన్మపాపినిdevaa devaa! nenu janmapaapini
పల్లవి:
దేవా దేవా! నేను జన్మపాపిని - ప్రభు ప్రభో! నేను ఘోరపాపిని
నీదు దయతో క్షమించి నన్ను చేర్చుకో- నీదు కృపతో రక్షించి నన్ను ఆదుకో (2)

చరణం 1:
నాదు పాపమెల్లప్పుడు - నా యెదుటనే యున్నది (2)
నీకు విరోధముగా - పాపము చేసియుంటిని (2)

చరణం 2:
నీదు దృష్టియెదుటను - చెడుతనము చేసితిని
నీదు ఆజ్ఞలన్నిటికి - అవిధేయుడనైతిని

చరణం 3:
నాదు దోషములన్నియు - నీ రక్తముతో కడుగుమా
నాదు అంతరంగమందు - హృదయశుద్ధి కలుగజేయుమా

చరణం 4:
నీ పరిశుద్ధాత్మను - నానుండి తీసివేయకు
నీ రక్షణానందము - నాకు మరల పుట్టించుము

చరణం 5:
నాకై ప్రాణాత్మదేహమున్ - సిలువలో అర్పించితివి
నీకై కొద్ది జీవితమున్ - సేవకై సమర్పింతును
200 నా యేసుని మార్గములో నేనుnaa yesuni maargamulo nenu
పల్లవి:
నా యేసుని మార్గములో నేను నడిచెదను నడిచెదను (2)
యే సమయమందున యే కాలమందునా (2)
నా జీవితాంతము వరకు (2)

చరణం 1:
నన్ను ప్రేమించిన నాకై ప్రాణమిచ్చిన (2)
నన్ను విమోచించి రక్షించిన (2)

చరణం 2:
కరువు సంభవించిన - వ్యాధులు బాధించిన
నా యేసే నన్ను కాపాడును

చరణం 3:
శోధనలు ఎన్నో - నన్ను కృంగదీసిన
ఆదరించి యేసే జయమిచ్చును

చరణం 4:
కష్ట నష్ట శ్రమలలో - అందరు విడిచినను
నా యేసే నాకు తోడై యుండును

చరణం 5:
లోకం శరీరం సాతాను - నన్ను పడవేసిన
నా యేసే లేపి నడిపించెను

చరణం 6:
కాపాడుకొందును - నా పరుగు విశ్వాసమును
నా యేసే ఇచ్చును నీతి కిరీటం
201 వేద పుస్తకమాveda pustakamaa
పల్లవి:
వేద పుస్తకమా (3) - వెలలేని నిధి నీవే

చరణం 1:
మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2)
మార్గం చూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ

చరణం 2:
నేనెవరో తెలిపి - నాడు జీవితమే మార్చి
స్వర్గాదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు

చరణం 3:
కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా
నిన్ను నమ్మిన వారికి - అంతం కూడా ఆనందమయము

చరణం 4:
అన్ని వేళలందును - అందించేవు జ్ఞానము
నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే
202 మహాదేవుండుmahaadevundu
పల్లవి:
మహాదేవుండు - పరిశుద్ధుడగు తనయుని (2)
అర్పించెను నీపై మక్కువతో వందన మర్పించుము (2)

చరణం 1:
పై నున్న వాటినే వెంటాడుచు - ఇహలోక సంగతులు గమనించక (2)
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై (2)
పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము (2)

చరణం 2:
నీ జీవము క్రీస్తుతో కూడను - దేవునిలో దాచబడియున్నది
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
పైనున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము

చరణం 3:
లోకాన నరభేదము పాటింపక - పరలోక దేవుని సేవించుము
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
పైనున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము

చరణం 4:
సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు - హల్లెలూయ స్తుతులర్పించుము
సమస్తమాయన పేరట చేయుచు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు - వందనమర్పించుము
203 ప్రభు రాకడలో కనబడుటకుprabhu raakadalo kanabadutaku
పల్లవి:
ప్రభు రాకడలో కనబడుటకు - నీవు సిద్ధమా
ప్రభు యేసును ఎదుర్కొనుటకు నీవు సంసిద్ధమా

చరణం 1:
ప్రభుచే విమోచించబడిన నీవు - ప్రభు పనిని చేయుము
ప్రభువే ఇచ్చును బహుమానములను - పరిశుద్ధుల యెదుట

చరణం 2:
నీదు క్రియలు దేవుని యెదుట - సంపూర్ణమైనవిగా
చేసిన యెడల పొందెదవు నీవు - తెల్లని వస్త్రములన్

చరణం 3:
నిరీక్షణ కలిగిన వాడవై నీవు - ప్రకటించు సువార్తను
నిత్యరాజ్యంలో పొందెదవు నీవు - అక్షయ కిరీటము

చరణం 4:
అపోస్తలుల బోధయు - సహవాసము నందున
రొట్టె విరుచుట ప్రార్ధన యందున - ఎడతెగకయుండి
204 తరుణముండగ త్వరపడుముtarunamundaga tvarapadumu
పల్లవి:
తరుణముండగ త్వరపడుము - ప్రభు రాకడ సమీపమాయె
ఏ జామో మరి ఏ క్షణమో - జాగు చేయక సిద్ధపడుము

చరణం 1:
బుద్ధిమాలిన కన్యకలు- నిర్లక్షించి విడువబడిరి
బుద్ధికలిగి కునుకు మాని - నిరీక్షించు ప్రభు రాకడకై

చరణం 2:
లోతు భార్య లోకము కొరకై - వెనుదిరిగి ఉప్పు స్తంభమాయె
లోకాశలకు లోబడక - సాగివెళ్ళుము ప్రభు క్రీస్తుతో

చరణం 3:
సత్యమనే నడికట్టుచే - నీ నడుమును కట్టుకొనుము
ప్రకాశమైన క్రీస్తు వెలుగువలె- నీ దీపమున్ వెలుగనివ్వుము

చరణం 4:
ఆత్మదీపమున్ ఆర్పకుము - అంతము వరకు వెలుగనిమ్ము
అన్నిటి అంతము సమీపమాయె మెలకువ కలిగి ప్రార్థించుము
205 యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా?yesu tirigiraagaa sandhimpa siddhamaa?
చరణం 1:
యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా? (1)
నీవు నిక్కముగా తిరిగి జన్మించితివా? (1)
నీ వస్త్రమేసు రక్తములో శుద్ధియాయెనా? (1)
యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా? (1)

చరణం 2:
ఇరువురు తిరుగలి విసురుచుండగా
ఇరువురొకచోట నిద్రించుచుండగా
ఒకరెత్తబడి ఒకరు విడువబడుదురు
యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా?

చరణం 3:
అవును యేసు రాగా నే సంధించెదను
నేను నిక్కముగా తిరిగి జన్మించితిని
నా వస్త్ర మేసు రక్తములో కడుగుకొంటిని!
అవును యేసురాగా సంధింప సిద్ధమే