CHURCH AT EL-SHADDAI · OFFLINE SONGBOOK

Hebron Seeyonu Geethalu

864 songs in Telugu and Roman transliteration. This saved file works without an internet connection. Select a song to open its lyrics.

864 songs

1 దుష్టుల ఆలోచన చొప్పున నడువకdushtula aalochana choppuna naduvaka

Psalms 1:1

1. దుష్టుల ఆలోచన చొప్పున నడువక (2)
   పాపుల మార్గములయందు నిలిచియుండక (2)

2. అపహాసించునట్టి ప్రజలు కూర్చుండెడు
   ఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు

3. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు
   యెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు

4. కాలువ నీటియోర నతడు నాటబడి తన
   కాలమున ఫలించు చెట్టువలె యుండును

5. ఆకు వాడని చెట్టువలె నాతడుండును
   ఆయన చేయునదియెల్ల సఫలమగును

6. దుష్టజనులు ఆ విధముగా నుండక
   పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు

7. న్యాయ విమర్శ సభలయందు దుష్టజనులు
   నీతిమంతుల సభలో పాపులును నిలువరు

8. నీతి మంతుల మార్గము యెహోవా ఎరుగును
   నడుపును దుష్టుల దారి నాశనమునకు
2 అన్యజనులేల లేచి గల్లత్తు చేయుచున్నారుanyajanulela lechi gallattu cheyuchunnaaru

Psalms 2:1-10

పల్లవి:
అన్యజనులేల - లేచి - గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల  (1)

అను పల్లవి:
జనములేల - వ్యర్థమైన - దాని తలంచుచున్నవి (2) || అ ||

1. భూలోక రాజులు - లేచి - వారేకముగా - ఆలోచించి - భూలోక రాజులు (1)
   వారి పాశములను తెంపి - పారవేయుద మనుచున్నారు (2)

2. ఆకాశ వాసుండు - వారిని - అపహసించుచున్నాడు - నవ్వి - ఆకాశ వాసుండు
   వారలతో పల్కి కోపముతో - వారిని తల్లడిల్ల చేయును

3. పరిశుద్ధమైన - నాదు - పర్వతమగు సీయోను మీద - పరిశుద్ధమైన
   నారాజునాసీనునిగా జేసి - యున్నానని సెలవిచ్చెను

4. కట్టడ వివరింతు - నాకు - యిట్లు చెప్పెను యెహోవాయందు - కట్టడ వివరింతు
   నీవు నా కుమారుండవు - నిన్ను నేను కనియున్నాను

5. నన్ను అడుగుము - నీకు - జనముల భూమిని స్వాస్థ్యముగా - నన్ను అడుగుము
   దిగంతముల వరకు స్వాస్థ్యముగా నొసంగెదను నీకు

6. ఇనుప దండముతో - నీవు - వారిని నలుగగొట్టెదవు - ఇనుప దండముతో
   కుండను పగులగొట్టునట్లు - వారిని పగులగొట్టెదవు

7. ఓ రాజులారా - మీరు - జ్ఞానవంతులై యుండుడి - ఓ రాజులారా
   ఓ భూపతులారా - మీరు - నాభోద నొందుడి నేడే
3 యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములోyehovaa maa prabhuvaa bhoomi aakaashamulo

Psalms 8:1

పల్లవి:
యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో  (2)
మహిమగల నీ నామము గొప్పది  (2)

1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ (2)- బాలుర స్తుతి స్తోత్రములతో (2)
   స్థాపించితివి నీవొక దుర్గము - నేదాగునట్లు ఆశ్రయ దుర్గము (2)

2. నీ చేతి పనియైన ఆకాశమును - చంద్ర నక్షత్రములనే చూడగా
   వాని దర్శించి జ్ఞాపకము చేయ - మానవుండు ఏపాటి వాడు

3. నీకంటె మానవుని కొంచెముగా - తక్కువ వానిగా చేసితివి
   మహిమ ప్రభావ కిరీటమును - వానికి ధరింపజేసితివి

4. అడవి మృగములు ఆకాశపక్షులు - సముద్ర మత్స్యములు పశువులు
   వాని పాదముల క్రిందనుంచి - అధికారము వానికిచ్చితివి

5. నీ నామము మా ప్రభువా యెహోవా - ఎంతో ఘనత ప్రభావము గలది
   ఆ నామమును బట్టి మాకిచ్చితివి - నీ రూపమును మాకు హల్లెలూయ
4 స్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన కర్తయగు దేవునిstutintun stutintun naakaalochana kartayagu devuni

Psalms 16:3-11

పల్లవి:
స్తుతింతున్ -  స్తుతింతున్  (1) -  నాకాలోచన కర్తయగు దేవుని  (2)
రాత్రివేలలో - నా -  అంతరింద్రియములు నాకు నేర్పున్  (1)

1. నాదు స్వాస్థ్య పానీయ భాగము - నా యెహోవా నీవే కాపాడెదవు (2)
   మనోహర స్థలములలో పాలుకల్గెను - స్తుతింతున్ (1)

2. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను - సదా కాలము యెహోవాయందు నా
   గురిని నిల్పుచున్నాను గాన నేను - స్తుతింతున్

3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడు - గాన కదల్చబడలేను ఎన్నడు
   అందుచే నా హృదయ మానందించును - స్తుతింతున్

4. నా శరీరము సురక్షితంబుగా - నివసించుచున్నది ఏలననగా
   నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు - స్తుతింతున్

5. జీవముగల నీ మార్గమును - నీవు నాకిల తెలియ జేసెదవు
   నీవే నా క్షేమాధారమని నిన్ను - స్తుతింతున్

6. సర్వోన్నతుడా నీ సన్నిధిలో - సంపూర్ణ సంతోష మెంతో గలదు
   నీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు - స్తుతింతున్
5 యెహోవా నా బలమాyehovaa naa balamaa

Psalms 18:1

పల్లవి:
యెహోవా  నా బలమా -  యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం - యెహావా

1. నా శత్రువులు నను చుట్టినను -
   నరకపు పాశముల రికట్టినను (2)
   వరదవలె భక్తిహీనులు పొర్లిన -
   విడువక నను యెడబాయని దేవా (2)

2. మరణపుటురులలో మరువక మొరలిడ -
   ఉన్నత దుర్గమై రక్షణశృంగమై
   తన ఆలయములో నా మొర వినెను -
   అదిరెను ధరణి భయకంపముచే

3. పౌరుషముగల ప్రభు కోపింపగా -
   పర్వతముల పునాదులు వణికెను
   తననోటనుండి వచ్చిన యగ్ని -
   దహించి వేసెను వైరులనెల్ల

4. మేఘములపై ఆయన వచ్చును -
   మేఘములను తన మాటుగ జేయును
   ఉరుముల మెరుపుల మెండుగ జేసి -
   అపజయ మిచ్చును అపవాదికిని

5. దయగల వారిపై దయ చూపించును -
   కఠినుల యెడల వికటము జూపును
   గర్విష్టుల యొక్క గర్వము నణచును -
   సర్వము నెరిగిన సర్వాధికారి

6. నా దీపమును వెలిగించు వాడు -
   నా చీకటిని వెలుగుగా జేయును
   జలరాసుల నుండి బలమైన చేతితో -
   వెలుపల జేర్చిన బలమైన దేవుడు

7. నా కాళ్ళను లేడి కాళ్ళగా జేసి -
   ఎత్తయిన స్థలముల శక్తితో నిలిపి
   రక్షణ కేడెము నా కందించి -
   అక్షయముగ తన పక్షము జేర్చిన

8. యెహోవా జీ...వము గల దేవా -
   బహుగా స్తుతులకు అర్హుడ వీవు
   అన్యజనులలో ధన్యత జూపుచు -
   హల్లెలూయ స్తుతిగానము జేసెద
6 యాకోబు దేవుడాపద కాలంబుల యందుyaakobu devudaapada kaalambula yandu

Psalms 20

పల్లవి:
యాకోబు దేవుడాపద కాలంబుల యందు (1)
నిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక! (2)

1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చును (2)
   సీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును (2)

2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచు
   నీ దహన బలులను అంగీకరించును గాక

3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచన
   యంతటిని సఫలము చేసి నిన్ను గాచును

4. నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుము
   మా దేవుని నామమున ధ్యజము నెత్తెదము

5. నీ ప్రార్థనలన్ని యెహోవా సఫలపరచును
   యెహోవా తన అబిషిక్తుని రక్షించును గాక

6. రక్షించి దక్షిణ హస్తబలమును చూపును
   యుత్తరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి

7. అతిశయ పడుదురు రథ గుఱ్ఱములతో
   యెహోవా నామములో మనము అతిశయింతుము

8. వారు కృంగి నేలమీదపడి లేవకున్నారు
   మనము లేచి చక్కగా నిలుచుచున్నాము
7 నాదు దేవా నాదు దేవా - నన్నేల విడనాడితివయ్యాnaadu devaa naadu devaa - nannela vidanaaditivayyaa

Psalms 22:1-10

పల్లవి:
నాదు దేవా నాదు దేవా - నన్నేల విడనాడితివయ్యా

అను పల్లవి:
నన్ను రక్షింపక ఆర్తధ్వని (2) - వినక నీవేల దూరమున్నావు? (2) || నాదు ||

1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా - ఏల నుత్తరమీయకున్నావు (2)
   ఇశ్రే లు స్తోత్రముపై కూర్చున్న (2)- పరిశుద్ధ దేవుడవై యున్నావు (2)

2. మా పితరులు నీయందు - విశ్వసించగా రక్షించితివి
   మొఱలిడి నిన్ను నమ్మిరి - విడుదలొంది సిగ్గునొందలేదు

3. నరుడను కాను పురుగును - నరులచే నిందింపబడితి
   నరులచే తృణీకారము - పొందియున్న వాడనైతిని

4. నన్ను జూచు వారెల్లరు - తమ పెదవులను విరిచి
   తలల నాడించుచున్నారు - నన్నపహసించుచున్నారు

5. యెహోవాపై భారముంచుము - తాను నిన్ను విడిపించునేమో
   వాడాయన కిష్టుడు కాడా - వాని తప్పించునేమో యందురు

6. గర్భమునుండి నన్ దీసిన వాడా - నా తల్లి యొద్ద స్తన్యపానము
   చేయుచుండగా నీవే కాదా - నాకు నమ్మిక పుట్టించితివి

7. గర్భవాసినైనది మొదలు - నుండి నా కాధారము నీవే
   నన్ను దల్లి కనిన నాటి - నుండి నా దేవుడవు నీవే
8 యెహోవా నా కాపరి లేమి కలుగదుyehovaa naa kaapari lemi kalugadu

Psalms 23:1

పల్లవి:
యెహోవా నా కాపరి - లేమి కలుగదు
పచ్చికలపై పరుండజేయుచున్నాడు (2)

1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల - చెంత నన్నడిపించుచున్నాడు (2)

2. సర్వదా నాదు ప్రాణంబునకు -సేద దీర్చుచున్నాడు యెహోవా

3. తన నామమును బట్టి నీతి మార్గములో - నన్ను చక్కగా నడుపుచున్నాడు

4. చీకటి లోయలో నే తిరిగినను - ఎట్టి అపాయమునకు భయపడను

5. నీ దుడ్డుకర్ర నీ దండముతో న - న్నాదరించి తోడై యుందువు

6. నా శత్రువుల యెదుట నీవు నాకు - భోజనము సిద్ధపరచుదువు

7. నూనెతో నా తల నంటియున్నావు - నా గిన్నె నిండి పొర్లుచున్నది

8. నన్ను వెంటాడు సదా కృప క్షేమము -
   నిత్యమెహోవా మందిరములో నుండెద
9 నీవే యెహోవా నా కాపరివిneeve yehovaa naa kaaparivi

Psalms 23:1-6

పల్లవి:
నీవే యెహోవా నా కాపరివి (2)-  నాకేమి కొదువ  -  లేదిలలోన (2)

1. పచ్చికగలచోట్ల - నన్ను జేర్చి - స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి (2)
   నా ప్రాణమునకు - సేదను దీర్చి (2)- నన్ను నడుపుము నీతిమార్గమున (2)

2. గాఢాంధకార లోయలయందు - పడియుండి నేను సంచరించినను
   తోడైయుందువు నీ దుడ్డుకర్ర - దండముతో నీ వాదరించెదవు

3. శత్రువుల యెదుట నీవు నాకు - నిత్యమగు విందు సిద్ధపరచి
   నాతల నూనెతో నంటియున్నావు - నా గిన్నె నిండి పొర్లుచున్నది

4. నిశ్చయముగా - కృపా క్షేమములే - వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్
   చిరకాలము యెహోవా మందిరమున - స్థిరముగా నే నివసించెదను
10 యెహోవా నా కాపరి నాకు లేమి లేదుyehovaa naa kaapari naaku lemi ledu

Psalms 23:1-6

పల్లవి:
యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్ (2)

1. మరణపు చీకటిలో - తిరుగుచుండినను
   ప్రభుయేసు నన్ను - కరుణతో ఆదరించున్ (2)

2. పగవారి యెదుట - ప్రేమతో నొక విందు
   ప్రభు సిద్ధము చేయున్ - పరవశ మొందెదము

3. నూనెతో నా తలను - అభిషేకము చేయున్
   నా హృదయము నిండి - పొర్లుచున్నది

4. చిరకాలము నేను - ప్రభు మందిరములో
   వసియించెద నిరతం - సంతసముగా నుందున్
11 యేసు ప్రభూ కాపరి నాకు - వాసిగా స్తుతించెదన్yesu prabhoo kaapari naaku - vaasigaa stutinchedan

Psalms 23:1

పల్లవి:
యేసు ప్రభూ కాపరి నాకు - వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱెపిల్లను - పోయెదను తన వెంట (2)

1. పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్ (2)
   స్వచ్ఛ జలముచెంత - నిచ్చును విశ్రాంతి (2)
   ముందు ముందు వెళ్లుచు - పొందుగా రక్షించు నన్ను
   తన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును (2)

2. మరణపులోయ ద్వారా - సరిగా నడిపించును
   అడవి భయములెల్ల - ఎడబాపి రక్షించున్
   హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును
   వింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును

3. శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయును
   నా గిన్నె నిండించి - పొర్లి పారజేసి
   కడిగి కడిగి శుద్ధిచేసి - ఆత్మదానమిచ్చెను
   వడిగా ఆయన సాయమున - జయమున వెళ్ళెదను
12 భూమియు దాని సంపూర్ణత లోకము - దాని నివాసు లెహోవావేbhoomiyu daani sampoornata lokamu - daani nivaasu lehovaave

Psalms 24:1-10

పల్లవి:
భూమియు దాని సంపూర్ణత లోకము  - దాని నివాసు లెహోవావే (2)

1. ఆయన సముద్రముల మీద దానికి - పునాది వేసెను (2)
   ప్రవాహజలముల మీద దానిని - స్థిరపరచెను (2)

2. యెహోవా పర్వతమునకు నెక్క-దగిన వాడెవ్వడు
   యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువ-దగినవాడెవ్వడు

3. వ్యర్థమైన దానియందు-మనస్సు పెట్టకయు
   నిర్దోషచేతులు - శుద్ధ హృదయము - కలిగినవాడే

4. నిన్నాశ్రయించి నీ సన్నిధిని - వెదకెడివాడు
   వాడాశీర్వాదము నీతి - మత్వము నొందును

5. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతన తలుపులారా
   మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి

6. మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే
   యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే

7. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతన తలుపులారా
   మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి

8. మహిమగల యీ రాజెవడు సైన్యముల యెహోవాయే
   ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్
13 దేవా నీ ముఖమును నాకుdevaa nee mukhamunu naaku

Psalms 27:9-14

పల్లవి:
దేవా నీ ముఖమును నాకు - దాచకుము నా ప్రభువా (2)
నీ సేవకుని కోపముచే - త్రోసివేయకు యెహోవా (2)

1. దేవా నా రక్షణకర్త - నీవే నాసహాయుడవు (2)
   నన్ను దిగనాడవలదు (2)- నన్ను విడువకుము (1)

2. నాదు తలిదండ్రులు - నన్ను విడచినను
   నా దేవుండగు యెహోవా - నన్ను చేరదీయును

3. నాకై పొంచియున్నట్టి - వారిని చూచి నన్ను
   సరళ దారిని నడుపు - మంచి మార్గము భోధించు

4. నాపై లేచియున్నారు - అబద్ధ సాక్షులు క్రూరుల్
   నన్నప్పగించకు దేవా - నాదు విరోధులకు

5. యెహోవా దయ పొందెదను - సజీవుల దేశమున
   ఇట్టి నమ్మకము లేని - యెడల నే నేమగుదును

6. ధైర్యము తెచ్చుకొని - నిబ్బర హృదయము గల్గి
   యెహోవా దేవుని కొరకు - కనిపెట్టుకొని యుండుము
14 ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువాudaya saayantramula nellavelala prabhuvaa

Psalms 27:1

పల్లవి:
ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా -  నే ధ్యానించి పాడెదన్ (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధునిదని దూతలు - పాడుట వినబడుచుంచున్ (2)

1. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు- నేనెవరికి వెరతును (2)
   యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె - శత్రువులు తొట్రిల్లిరి (2)

2. యుద్ధము చేయుటకు దండు దిగినను - నా హృదయము భయపడదు
   యుద్ధము రేగినను దీనియందు నే - ధైర్యము విడువకుందున్

3. యెహోవా యొద్ద వరమొక్కటడిగితిని - దానిని వెదకు చున్నాను
   యెహోవా ప్రసన్నత జూచి ఆలయమున - ధ్యానించుటయే నా ఆశ

4. తన పర్ణశాలలో నను జేర్చి కాచును - నా ఆపత్కాలమునందు
   తన గుడారములోన నను దాచియుంచును - దుర్గముపై నెక్కించున్

5. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని - నీవు పల్కితివి గాన
   నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదను - నీ సముఖమును దాచకు

6. నా తల్లిదండ్రులు నన్ను విడచినను - యెహోవాయే చేరదీయున్
   నే ధైర్యము కలిగి నిబ్బరముగ నుండెద - నీ కొరకు కనిపెట్టెదన్

7. యెహోవా నాకై యుద్దేశించినది - ఆయనయే నెరవేర్చును
   మహోన్నతుని మాటకు భయపడెడి పరిశుద్ధుల - కోరికలు నెరవేర్చును
15 యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతియించెదyehovaa naa devaa nityamu nenu ninnu stutiyincheda

Psalms 30:1

పల్లవి:
యెహోవా నా దేవా నిత్యము  - నేను నిన్ను స్తుతియించెద (2)
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ (2)

1. యెహోవా నా శత్రువులను - నా పై సంతోషింపనీయక (2)
   నీవు నన్నుద్ధరించినందుకై నేను - నిన్ను కొనియాడుచున్నాను (2)

2. నేను నీకు మొరపెట్టగా - నీవు నన్ స్వస్థపరచితివి
   పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి - భక్తులారా ప్రభున్ కీర్తించుడు

3. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి
   నేను సమాధిలోకి దిగకుండగ - నీవు నన్ను బ్రతికించితివి

4. ఆయన కోపము నిమిషమే - దయ ఆయుష్కాలముండును
   ఏడ్పు వచ్చి రాత్రియుండిన ఉదయ - మున సంతోషము కలుగును

5. నే నెన్నడు కదలనని నా - క్షేమ కాలమున తలచితి
   యెహోవా దయ కలిగి నీవే నా - పర్వతము స్థిరపరచితివి

6. నీ ముఖము నీవు దాచిన - యపుడు నేను క్షోభిల్లితి
   యెహోవా నీకే మొర పెట్టితిని - నా ప్రభువును బ్రతిమాలు కొంటిని

7. నేను సమాధిలోకి దిగిన - నా ప్రాణము వలన లాభమా
   మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా

8. నా అంగలార్పును నీవేగా - నాట్యముగా మార్చియుంటివి
   నా గోనెపట్ట విడిపించి సంతోష - వస్త్రము ధరింప జేసితివి

16 ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనోevvani atikramamulu mannimpabadeno

Psalms 32:1-8

పల్లవి:
ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో (1)
పాప పరిహార మెవడోందెనో వాడే ధన్యుడు (2)

1. యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు (2)
   ఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు (2)

2. మౌనినై యుండిన దినమెల్ల నే జేసినట్టి
   ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను

3. దివారాత్రుల్ నీ చేయి నా పై బరువై యుండ
   నా సారము వేసవిలో ఎండినట్లాయె

4. నేను నా దోషమును కప్పుకొనక
   నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని

5. నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా
   నీవు నా దోషమును మన్నించితివిగా

6. కావున నీ దర్శన కాలమందు
   భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు

7. విస్తార జలప్రవాహములు పొర్లినను
   నిశ్చయముగా నవి వారి మీదికి రావు

8. నాకు దాగుచోటు నీవే శ్రమలో నుండి
   నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా

9. విమోచన గానములతో నీవు నన్ను
   ఆవరించి నా కుపదేశము చేసెదవు
17 సన్నుతింతు నెప్పుడెహోవానుsannutintu neppudehovaanu

Psalms 34:1-10

పల్లవి:
సన్నుతింతు నెప్పుడెహోవాను (1) - తన కీర్తి నా నోట నుండును (2)

1. అతిశయింతు నెహోవానుబట్టి (2)- సంతోషింతురు దీనులు విని (2)

2. ఘనపరచుడి దేవుని పేరు - గొప్ప చేయుదము ఏకముగా

3. తనయొద్ద నే విచారించగా - తప్పించె నన్ను భయముల నుండి

4. తనను చూడగ వెల్గు కలిగెను - తమ ముఖములు లజ్జింపకుండె

5. యెహోవా భక్తులందరి చుట్టు - దూత కావలి యుండి రక్షించు

6. దేవుడుత్తముడని రుచిచూడు - ధన్యుడు తన్నాశ్రయించువాడు

7. ఆకలెత్తు సింహపు పిల్లలకు - ఆశ్రితుల కేమి కొదువలేదు
18 పిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదనుpillalaaraa naa maata vinudi yehovaa yandu bhakti nerpedanu

Psalms 34:11-18

పల్లవి:
పిల్లలారా నా మాట వినుడి (1)-  యెహోవా యందు భక్తి నేర్పెదను (2)

1. బ్రతుక గోరువాడెవడైన కలడా (2)
   మేలునొందుచు చాలా దినములు (2)

2. కపటమైన చెడుమాటలాడక - కాచుకొనుము నీదు పెదవులను

3. కీడు మాని మేలునే చేయుము - సమాధానము వెదకి వెంటాడు

4. యెహోవా దృష్టి నీతిమంతులపై - కలదు వారి మొఱల వినును

5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి - కొట్టివేయు తన సన్నిధి నుండి

6. నీతిమంతులు మొఱ పెట్టగా - విని శ్రమల నుండి తప్పించును

7. విరిగినట్టి హృదయములకు - యెహోవా ఆసన్నుడై యున్నాడు

8. నలిగియున్న వారల నెల్ల - ఆయనే రక్షించు ప్రేమగల్గి
19 వ్యసనపడకుము నీవు చెడ్డవారలను జూచినయపుడుvyasanapadakumu neevu cheddavaaralanu joochinayapudu

Psalms 37:1-25

పల్లవి:
వ్యసనపడకుము  - నీవు - చెడ్డవారలను జూచినయపుడు (1)
మత్సరపడకుము -  నీవు - దుష్కార్యములు చేయువారిని జూచి (1)

1. వారు గడ్డివలె త్వరగా (1)- ఎండిపోదురు (2)
   పచ్చని కూరవలె వారు - వాడిపోవుదురు - ఆ (2) ... నీవు

2. యెహోవా యందు నమ్మికయుంచి - మేలు చేయుము
   దేశమందు నివసించి సత్యము - ననుసరించుము - ఆ ... నీవు

3. నీవు యెహోవా ప్రభునిచే - సంతసించుము
   అయన నీదు హృదయములో - ని వాంఛలను తీర్చును - ఆ ..నీవు

4. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము
   ఆయనను నమ్ముకొనుము నీదు - కార్యము నెరవేర్చును - ఆ .. నీవు

5. నీ నీతి నిర్ధోషత్వంబును - వెల్లడి పరచును
   మౌనముగా నుండి అయన కొరకు - కనిపెట్టుకొనుము - ఆ ... నీవు

6. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము
   వ్యసనపడకుము నీ కది - కీడు కే కారణము - ఆ ... నీవు

7. భక్తిహీనులు నీతిమంతులమీద - పండ్లు కొరుకుదురు
   వారికాలము వచ్చి యుండుట ప్రభుజూచి నవ్వుచున్నాడు - ఆ ... నీవు

8. నీతిమంతునికి కలిగిన కొంచెమైనను
   బహుమంది భక్తిహీనులకున్న ధనము - కంటే శ్రేష్ఠము - ఆ ... నీవు

9. నీతిమంతులు ఆపత్కాలమందు - సిగ్గునొందరు
   కరువు దినములలో వారు తృప్తి పొందుదురు - ఆ ... నీవు

10. ఒకని నడత యెహోవాయే - స్థిరము చేయును
   ఆయన వానిప్రవర్తనను జూచి - ఆనందించును - ఆ ... నీవు

11. యెహోవా అతని చేతిని - పట్టి యుండెను
   అతడు నేలను పడినను లేవ - లేక ఉండదు - ఆ...నీవు

12. నీతిమంతులు విడువబడుటగాని - వారి సంతానము
   భిక్షమెత్తుటగాని - నేను చూచి యుండ లేదు - ఆ ....నీవు
20 యెహోవా నీ కోపము చేత గద్దింపకుముyehovaa nee kopamu cheta gaddimpakumu

Psalms 38:1-10 ;18-22

1. యెహోవా నీ కోపము చేత - గద్దింపకుము - ఆ (2)
   నీదు యుగ్రతచే నన్ను - శిక్షింపకుము (1)

2. నాలో గట్టిగా నీ బాణములు - నాటి యున్నవి - ఆ
   నా మీద నీ చెయ్యి భార - ముగా నున్నది

3. నీ కోపముచే నా యారోగ్యము - విడిచిపోయెను - ఆ
   పాపముచే నా యెముకలలో - స్వస్థత లేదు

4. నా దోషములు నా తలమీద - పొర్లిపోయినవి - ఆ
   నాపై మోయలేని బరువు - వలె నున్నవి

5. మూర్ఖతచే నా గాయములు - దుర్వాసనబట్టే - ఆ
   దుఃఖా క్రాంతుడనై - దినమెల్ల తిరుగుచున్నాను

6. నా నడుము తాపముచే నిండి - ఆరోగ్యములేదు - ఆ
   నేను సొమ్మసిల్లి బహుగా - నలిగియున్నాను

7. మనోవేదన బట్టి కేకలు - వేయుచున్నాను - ఆ
   కనబడుచున్నది నీకు నా యభి - లాషయంతయు

8. నా నిట్టూర్పులు నీకు దాచ - బడియుండలేదు - ఆ
   నా గుండె కొట్టుకొని బలము - విడచిపోయెను

9. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను - ఆ
   నా పాపమును గూర్చి విచారపడుచున్నాను

10. నా శత్రువులు చురుకై బలము - కలిగిన వారు - ఆ
   నన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు

11. మేలుకు ప్రతిగా వారు - కీడు - చేయుచున్నారు - ఆ
   మేలు చేసినందుకు వారు - విరోధులైరి

12. దేవా నాకు దూరముగా - నుండకుము ప్రభో - ఆ
   రక్షకా నా సహాయమునకు - వేగమే రమ్ము
21 యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్yehovaa koraku sahanamuto kanipettan

Psalms 40:1-10

పల్లవి:
యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్
నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్
నాశనమగు గుంటలో నుండియు
జిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను (2)

1. నా పాదములను బండపై నిలిపి - నా యడుగులు దానిపై స్థిరపచి (2)
   క్రొత్త గీతమును నా నోట నుంచెను
   కోట్ల కొలది యెహోవాను నమ్మెదరు (2)

2. గర్విష్టుల నబద్ధికులను లక్ష్యపెట్టక -ఘనుడెహోవాను నమ్మువాడే ధన్యుండు
   దయామయా మా యెడల నీకున్న
   తలంపులు బహు విస్తారములు

3. వాటిని వివరింప లేనిల నీకు - సాటియైన వాడెవడైనను లేడు
   నైవేద్య బలులను కోరలేదు
   నాకు చెవులను నీవు నిర్మించినావు

4. పాపపరిహార బలులను దహన -బలులను నీవు తెమ్మన లేదు
   నన్ను గూర్చి గ్రంథములో వ్రాసి
   యున్నట్లుగా నేను వచ్చియున్నాను

5. నీ చిత్తముచేయ నాకు సంతోషము - నా ఆంతర్యములో నీ శాసనములున్నవి
   ప్రజా సంఘములో నీ నీతి సువార్త
   ప్రకటించియున్నానని నేనంటిని

6. నీ నీతిని నా మదిలో దాల్చి - నీతి నిలయ నే నూరకుండ లేదు
   సంఘములో నీ రక్షణ కృపను
   సత్యమును నే దాచలేదు
22 నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లుneeti vaagula koraku duppi aashapadunatlu

Psalms 42:1-5

పల్లవి:
నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు (1)
దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది (2)

1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది (2)
   దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను (2)

2. నీ దైవమేమాయెనని నిత్యము నాతో ననగా
   రాత్రింబగళ్ళు కన్నీరే నా అన్న పానములాయ

3. ఉత్సాహ స్తుతులతో సమాజమును పండుగకు
   దేవుని మందిరమునకు నడిపించితిని

4. ఇది తలంచగా నా ప్రాణము కరుగుచున్నది
   నాదు ప్రాణమా యేల కృంగి తొందర పడుచున్నావు

5. రక్షకుడగు దేవునిపైన నిరీక్షణ యుంచుము
   ఆయన రక్షకుడని నేనింక స్తుతించెదను
23 నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ముnee velugu nee satyamu bayalu deranimmu

Psalms 43:3-5

పల్లవి:
నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము (2)
దేవా ... నా ... దేవా (1)

1. నాకు త్రోవచూపునూ - అది నీ నివాస స్థలముకు (2)
   నన్ను తోడుకొని వచ్చును (2) - దేవా నా దేవా (1)

2. అప్పుడు నీకు సితారతో - స్తుతి గీతము చెల్లింతును
   ఓ ... హోసన్నా ... హోసన్నా - దేవా నా దేవా

3. ఏల క్రుంగిపోతివి - భీతిన్ విడు నా ప్రాణమా
   ప్రీతిన్ ప్రభుని గనుమా - దేవా నా దేవా
24 కుమారి ఆలకించు - నీ వాలోచించి - కుమారి చెవియొగ్గుము 2kumaari aalakinchu - nee vaalochinchi - kumaari cheviyoggumu 2

Psalms 45:10-17

పల్లవి:
కుమారి ఆలకించు - నీ వాలోచించి - కుమారి చెవియొగ్గుము (2)

అను పల్లవి:
మరువుము నీదు స్వంత జనమును (2)
మరువుము నీదు తండ్రి యింటిని (2) || కుమారి ||

1. ఈ రాజు నీ ప్రభువు (1)- నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువు (2)
   ఈ రాజు నీదు సౌందర్యమును గోరె (2)
   ఈ రాజునకు నమస్కరించుము (2)

2. తూరు దేశ కుమార్తె - నైవేద్యములను తీసికొని వచ్చును
   ప్రజలలో ఇశ్వర్యవంతులు - కుమారి నీ దయను వెదకెదరు

3. అంతఃపురములో నుండు రాజకుమార్తె - ఎంతో మహిమ గలది
   శృంగారమైనట్టి ఆమె వస్త్రములు - బంగారుబుట్టా పనిచేసినవి

4. విచిత్ర పనిగల వస్త్రముల ధరించి - విచిత్ర పనిగల
   రాజు నొద్ధకు కన్యకల వలన - రమ్యముగా కొని రాబడుచున్నది

5. ఉత్సాహ సంతోషముతో - వారు వచ్చు చున్నారు - ఉత్సాహ సంతోషముతో
   రాజనగరిలో ప్రవేశించు చున్నారు - రాబడు చున్నారు కన్యలందరు

6. నీ తండ్రులకు ప్రతిగా - నీ కుమారులుందురు - నీ తండ్రులకు ప్రతిగా
   ఈ ధరణి యందంతట నీవు వారిని - అధికారులనుగా నియమించెదవు

7. తరము లన్నిటను నీ - పేరు జ్ఞాపకముండు - కరణి నొనర్చెదవు
   కాన జనములు సర్వకాలము - కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లింతురు
25 దేవుడే మనకాశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపదలోdevude manakaashrayamunu durgamunai yunnaadu aapadalo

Psalms 46

పల్లవి:
దేవుడే మనకాశ్రయమును - దుర్గమునై యున్నాడు - ఆపదలో

అను పల్లవి:
కావున భూమి - మార్పు నొందినను - కొండలు మున్గినను (2)- ఆపదలో

1. సముద్ర జలములు - ఘోషంచుచు - నురుగు కట్టినను (2) - ఆ పొంగుకు
   పర్వతములు - కదలినను - మనము భయపడము ఆ పొంగుకు
   పర్వతములు - కదలినను - మనము భయపడము - ఆపదలో (1)

2. ఒక నది కలదు - దాని కాలువలు - దేవుని పట్టణమును - సర్వోన్నతుని
   మందిర పరిశుద్ధ స్థలమును - సంతోషపర్చు చున్నవి - సర్వోన్నతుని
   మందిర పరిశుద్ధ స్థలమును - సంతోషపర్చు చున్నవి - ఆపదలో

3. దేవుడా పట్టణములో - నున్నాడు దానికి - చలనము లేదు - అరుణో
   దయమున దానికి సహాయము చేయుచున్నాడు - అరుణో
   దయమున దానికి సహాయము చేయుచున్నాడు - ఆపదలో

4. జనములు ఘోషించు - చున్నవి రాజ్యములు కదలు చున్నవి - ఆయన
   కంఠధ్వని వినిపించగా - భూమి కరిగి పోవుచున్నది - ఆయన
   కంఠధ్వని వినిపించగా - భూమి కరిగి పోవుచున్నది - ఆపదలో

5. సైన్యము లధిపతి - యెహోవా మనకు తోడైయున్నాడు - యాకోబు
   దేవుడు - మనకు ఆశ్రయమునై యున్నాడు - యాకోబు
   దేవుడు - మనకు ఆశ్రయమునై యున్నాడు - ఆపదలో

6. యెహోవా చేసిన - కార్యములను వచ్చి చూడండి - అగ్నిలో
   యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే - అగ్నిలో
   యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే - ఆపదలో

7. ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి - అగుదును
   అన్యజనులలో నేను మహోన్నతుండను - అగుదును
   అన్యజనులలో నేను మహోన్నతుండను - ఆపదలో
26 సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడిsarvajanulaaraa chappatlu kotti paadudi

Psalms 47:1-10

1. సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి (2)
   జయార్భాటము యెహోవాను గూర్చి చేయుడి (2)

2. యెహోవా మహోన్నతమైన భయంకరుడు
   మహారాజై యున్నాడు సకల జగమునకు

3. జనముల నెహోవా మనకు లోపర్చును
   జనుల మన కాళ్ళ క్రింద అణగ ద్రొక్కును

4. తన ప్రియ యాకోబుకు మహాతిశయముగ
   మనకు స్వాస్థ్యమును ఏర్పాటు చేసెను

5. దేవుడార్భాటముతో నారోహణమాయెను
   బూరధ్వనితో యెహోవారోహణమాయెను

6. మన దేవుని కీర్తించుడి కీర్తించుడి
   మన రాజును కీర్తించుడి కీర్తించుడి

7. రాజై యున్నాడు యెహోవా యీ సర్వభూమికి
   రమ్యముగా సంకీర్తనలు మీరు పాడుడి

8. దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు
   పరిశుద్ధ సింహాసనాసీనుడై యున్నాడు

9. జనుల ప్రధాను లబ్రాహాము దేవునికి
   జనులై యేకముగా కూడుకొనియున్నారు

10. మహోన్నతుడు ఆయెను యెహోవా దేవుడు
   మనము వేసికొను కేడెములు తనవి
27 మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందుmana devuni pattanamandaayana parishuddha parvatamandu

Psalms 48:1-9,14

పల్లవి:
మన దేవుని పట్టణమందాయన - పరిశుద్ధ పర్వతమందు (1)
యెహోవా గొప్పవాడును - బహు కీర్తనీయుడై యున్నాడు (2)

1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన - సీయోను పర్వతము (2)
   ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది (2)

2. దాని నగరులలో దేవుడాశ్రయముగా - ప్రత్యక్షంబగుచున్నాడు
   రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి - భ్రమపడి త్వరగా వెళ్ళిరి

3. అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ - వేదన పట్టెను
   తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల - పగులగొట్టుచున్నావు

4. సైన్యము లధిపతి యెహోవా దేవుని - పట్టణమునందు
   మనము వినినట్టి రీతిగా జరుగుట - మనము చూచితిమి

5. మన దేవుడు నిత్యముగా దానిని స్థిర - పరచియున్నాడు
   దేవా నీ ఆలయ మందున నీ కృప - ను ధ్యానించితిమి

6. దేవా నీ నామము ఎంత గొప్పదో - నీ సత్కీర్తియును
   భూదిగంతముల వరకు అంత - గొప్పదై యున్నది

7. ఈ దేవుడు సదాకాలము మనకు - దేవుడై యున్నాడు
   మనల నడిపించును మరణపర్యంతము - హల్లెలూయా - ఆమెన్
28 సర్వజనులారా వినుడి - మీరేకంబుగా వినుడిsarvajanulaaraa vinudi - meerekambugaa vinudi

Psalms 49:1-9

పల్లవి:
సర్వజనులారా వినుడి - మీరేకంబుగా వినుడి (2)

1. లోక నివాసులారా సామాన్యులు ఘనులేమి (2)
   దరిద్రులు ధనికులేమి సర్వజనులారా వినుడి (2)

2. నా హృదయ ధ్యానము పూర్ణ - వివేకమును గూర్చినది
   నే పల్కెద జ్ఞానాంశముల - సర్వ జనులారా వినుడి

3. గూడార్థాంశము వినెద - చేతబట్టి సితార
   మర్మము దెల్పెద నేను - సర్వ జనులారా వినుడి

4. నాకై పొంచిన దోషుల - క్రియలు నన్ను చుట్టన్
   ఆపదలో భయపడనేల - సర్వ జనులారా వినుడి

5. తమ ధన సంపదనుబట్టి - పొగడుకొనెడు వారికి
   నేనేల భయపడవలెను - సర్వ జనులారా వినుడి

6. ఎవడేరీతినైన నిత్యము బ్రతుకునట్లు
   సోదరుని రక్షించలేడు - సర్వ జనులారా వినుడి

7. వాని నిమిత్తము దైవ - సన్నిధి ప్రాయశ్చిత్తము
   చేయువాడెవ్వడు లేడు - సర్వ జనులారా వినుడి

8. ప్రాణ విమోచన ధనము - బహు గొప్ప దెన్నటికిని
   తీరక యుండవలసినదే - సర్వ జనులారా వినుడి
29 దేవా నీ కృపచొప్పున నన్ను కరుణింపుముdevaa nee krupachoppuna nannu karunimpumu

Psalms 51:1-9

1. దేవా నీ కృపచొప్పున - నన్ను కరుణింపుము (2)
   కృప చొప్పున నా అతిక్రమ - ములను తుడిచివేయుము (2)

పల్లవి:
యెహోవా నా దేవా (1)

2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
   నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము

3. నీకు విరోధముగానే - పాపము చేసియున్నాను
   నీ దృష్టి యెడల చెడు - తనము నే చేసియున్నాను

4. ఆజ్ఞ యిచ్చునపుడు - నీతిమంతుడవుగను
   తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు

5. పాపములోనే పుట్టిన - వాడను పాపములోనే
   నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను

6. వంతరంగమున - సత్యము కోరుచున్నావు
   ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు

7. హిస్సోపుతో శుద్ధీకరించు - పవిత్రుడనగుదును
   హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము

8. ఉత్సాహ సంతోషములు - నాకు వినిపింపుము
   అప్పుడు నీవు విరిచిన - యెముకలు హర్షించును

9. నాదు పాపములకు - విముఖుడవు కమ్ము (2)
   నాదు దోషములన్నింటిని – తుడిచి వేయుము (2)
30 దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదునుdevaa naa devudavu neeve vekuvane ninnu vedakudunu

Psalms 63:1-11

పల్లవి:
దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును (2)

1. నీ ప్రభావ బలమును చూడ - నీ పరిశుద్ధాలయమందు (2)
   నే నెంతో ఆశ తోడ - నీ వైపు కాచియున్నాను (2)

2. నీళ్లు లేక యెండిన చోట - నా ప్రాణము నీ కొరకు
   దాహము గొని యున్నది - నీ మీద ఆశచేత

3. నిను చూడ నా శరీరం - కృశించి పోవుచున్నది
   నీ కృప జీవముకంటె శ్రేష్ఠం - నా పెదవులు నిన్ను స్తుతించున్

4. నా పడక మీద నిను దలచి - రాత్రి జాములో ధ్యానించునపుడు
   క్రొవ్వు మెదడు దొరకినట్లు - నా ప్రాణము తృప్తి నొందుచున్నది

5. ఉత్సాహముతో నా నోరు - నిన్నుగూర్చి పాడుచున్నది
   నా జీవిత కాలమంత - ఈలాగు నిన్ను స్తుతియించెదన్

6. నా సహాయుడా నీ పేరు - బట్టి నా చేతు లెత్తెదను
   నీ చాటున శరణు జొచ్చి - ఉత్సాహధ్వని చేసెదను

7. నను చంప వెదకెడి వారు - పాతాళమునకు పోయెదరు
   ఖడ్గంబునకు గురియై - మరి నక్కలపాలగుదురు

8. దేవుని బట్టి రాజానందించున్ - తన తోడు ప్రమాణము చేయు
   ప్రతివాడు అతిశయించును - మూయబడు నబద్ధికుల నోరు
31 సర్వలోక నివాసులారా ఆనందించు డెల్లరుsarvaloka nivaasulaaraa aanandinchu dellaru

Psalms 66:1-7

పల్లవి:
సర్వలోక నివాసులారా - ఆనందించు డెల్లరు (1)
దేవుని గురించి కీర్త నలు  పాడుచుండుడి (2)

1. ఆయన నామ ప్రభావమును - కీర్తించి స్తోత్రించుడి (1)
   ఆయనకు ప్రభావము - ఆరోపించి స్తుతించుడి (2)

2. నీదు కార్యములు ఎంతో - భీకరమైనట్టివి
   నీ బలాతిశయమును బట్టి - శత్రువులు లొంగెదరు

3. సర్వలోకమును నీకు - నమస్కరించి పాడును
   నీదు నామమును బట్టి - నిన్ను కీర్తించును

4. చూడరండి దేవుని - ఆశ్చర్య కార్యములన్
   నరుల యెడల చేయు పనుల - వలన భీకరుండహా

5. సాగరమును ఎండినట్టి - భూమిగను మార్చెను
   జనులు కాలినడక చేత - దాటిరి సముద్రమున్

6. ఆయనలో హర్షంచితిమి - నిత్యమేలుచున్నాడు
   అన్యజనుల మీద తన - దృష్టి యుంచి యున్నాడు
32 నీ మార్గము దేవా భూమి మీద కనబడునట్లుnee maargamu devaa bhoomi meeda kanabadunatlu

Psalms 67:1-7

1. నీ మార్గము దేవా భూమి - మీద కనబడునట్లు (2)
   నీ రక్షణ అన్యులలో - తెలియబడు గాక (2)

2. దేవుడు మమ్ము కరుణించి - దీవించును గాక
   ప్రకాశింపజేయుము నీ - ముఖకాంతిని మాపై

3. స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను
   స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను

4. యెహోవా నీతితో నీవు - న్యాయము తీర్చెదువు
   ఏలెదవు భూమిమీద - నున్న జనులను

5. జనులానంద యుత్సాహ - ధ్వని చేయుదురు గాక
   జనులు దేవా నిన్ను - స్తుతియించెదరు గాక

6. భూమి ఫలియించును యెహో - వా మమ్ము దీవించును
   భూలోకులందరు దైవ - భక్తి కల్గియుందురు
33 క్రీస్తుని నామము నిత్యము నిల్చున్kreestuni naamamu nityamu nilchun

Psalms 72:17-19

1. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్ (2)-సూర్యుడున్నంత కాలము చిగుర్చున్ (2)

2. అతనినిబట్టి మానవులెల్లరు - తథ్యముగానే దీవించబడెదరు

3. అన్యజనులందరును అతని - ధన్యుడని చెప్పుకొను చుందురు

4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా - దేవుడు స్తుతింపబడును గాక

5. ఆయనే బహు ఆశ్చర్యకార్యములు - చేయువాడు గాన స్తోత్రార్హుండు

6. ఆయన మహిమగల నామము - నిత్యమును స్తుతింపబడును గాక

7. సర్వభూమి ఆయన మహిమచే - నిండియుండును గాక ఆమెన్‌ ఆమెన్
34 యూదాలో దేవుడు ప్రసిద్ధుడుyoodaalo devudu prasiddhudu

Psalms 76:1-12

పల్లవి:
యూదాలో దేవుడు ప్రసిద్ధుడు  (1)- ఇశ్రాయేలులో తన నామము గొప్పది (2)

అను పల్లవి:
షాలేములో తన గుడారమున్నది - సీయోనులో తన ఆలయమున్నది (2)

1. అక్కడ వింటి అగ్ని బాణములను - తాను అక్కడ కేడెముల కత్తులను (1)
   అక్కడ యుద్ధ ఆయుధములను - తాను అక్కడి వాటిని విరుగగొట్టెను (1)
   దుష్ట మృగముల - పర్వతముల యందము (2)
   కన్నను నీవెంతో తేజోమయుడవు

2. కఠినహృదయులు దోచుకొనబడి - వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు
   పరాక్రమశాలు లందరిని - వారి - బాహు బలమును హరించెను
   యాకోబు దేవా నీదు గద్దింపునకు
   రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను

3. నీవు భయంకరుడవు దేవా - నీవు - కోపపడు వేళ నిల్చువాడెవడు?
   ఆకాశము నుండి తీర్పు వినబడెను - నీవు దేశంబులో శ్రమనొందు వారిని
   రక్షించి న్యాయపు తీర్చను లేచునాడు
   భూమి భయమునొంది ఊరకయుండును

4. నరుల కోపము నిన్ను స్తుతించును - వారి ఆగ్రహ శేషమును ధరించుకొందువు
   మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి - తన చుట్టు కానుకలు అర్పించవలెను
   అధికారుల గర్వమణచి వేయువాడు
   భూరాజులకు ఆయన భీకరుడు
35 దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తిdevuniki morrapettudunu elugetti

Psalms 77:1-14

1. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి (2)
   చెవి యొగ్గు వరకు మనవి చేయుచుందును (2)

2. ప్రభుని ఆపదల యందు వెదకువాడను
   ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును

3. దేవుని దలచి నిట్టూర్పు విడుచుచున్నాను
   ధ్యానించు నపుడు ఆత్మ కృంగిపోవుచున్నది

4. మూత పడనియ్యవు నీవు నాదు కన్నులు
   మాటాడజాలనైతి నేను కలవరపడి

5. పూర్వ సంవత్సరములను తలచుకొందును
   పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును

6. హృదయమున నిన్ను ధ్యానించుకొందురు
   శ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది

7. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా
   ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా

8. తన కటాక్ష మెన్నటికిని మానిపోయెనా
   తరములకు తన మాట తప్పి పోయెనా

9. దేవుడు నన్ను కనికరింపక మానివేసెనా
   దేవుడు కోపముతో కృప చూపకుండునా?

10. మహోన్నతుని దక్షిణ హస్తము మారెను
   అనుకొనుటకు నా శ్రమలే కారణము

11. దేవా నీ పూర్వపు ఆశ్చర్యకార్యములను
   తలంచు కొందు నాదు మనస్సులో నిప్పుడు

12. నీ కార్యమంతటిని ధ్యానించుకొందును
   నీ క్రియలను ధ్యానము నే జేసికొందును

13. మహా పరిశుద్ధమైనది నీదు మార్గము
   మహా దేవా నీ వంటివాడు ఎక్కడున్నాడు?

14. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే
   జనములలో ప్రభావమును చూపియున్నావు
36 మన బలమైన యాకోబు దేవునికిmana balamaina yaakobu devuniki

Psalms 81:1-14

పల్లవి:
మన బలమైన యాకోబు దేవునికి (2) -  గానము సంతోషముగా పాడుడీ (2)

అను పల్లవి:
పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి - సితార స్వరమండలము వాయించుడి (2)

1. అమావాస్య పున్నమ పండుగ దినములందు (2)
   కొమ్మునూదుడి యుత్సాహముతోడ (2)
   యాకోబు దేవుడు నిర్ణయించిన - ఇశ్రాయేలీయుల కది కట్టడ (2)

2. తానైగుప్తులో తిరిగినప్పుడు - యోసేపు సంతతికి సాక్షముగ
   నిర్ణయించెను దేవుడు అచ్చట - నే నెరుగని భాషను నే వింటిని

3. తమభుజము నుండి బరువు దింపగ - మోతగంపల భారము దప్పెను
   నీవాపదయందు మొఱపెట్టగా - విడిపించిన యెహోవాను నేనే

4. ఉరుము దాగుచోటులో నుండినే - ఉత్తరమిచ్చి నిన్ను శోధించితిని
   మెరీబా జలముల యొద్ద నిన్ను - నా ప్రజలారా నా మాట వినుడి

5. ఇగుప్తు దేశములో నుండి నిన్ను - రప్పించిన యెహోవా దేవుడను
   నీవు నీ నోరు బాగుగా తెరువుము - నేను నింపెదను మంచి వాటితో

6. అతి శ్రేష్ఠమైన గోధుమలను - అనుగ్రహించి పోషించెద నిన్ను
   కొండ తేనెనిచ్చి కడు ప్రేమతో - తృప్తి పరచెదను నిత్యముగా

7. అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట - వినిన పక్షాన ఎంత మేలగు
   అన్యదేవతల నెవ్వరికిని - నీవు ఎన్నడు పూజ చేయరాదు
37 సైన్యముల కధిపతివగు యెహోవాsainyamula kadhipativagu yehovaa

Psalms 84:1-7

1. సైన్యముల కధిపతివగు యెహోవా (2)
   నీ నివాసములు - ఎంతో రమ్యములు (2)

పల్లవి:
సైన్యముల యెహోవా (1)

2. యెహోవా మందిరము - చూడవలెనని
   నా ప్రాణమెంతో - ఆశతో సొమ్మసిల్లెను

3. జీవముగల దేవుని - దర్శించ నా హృదయము
   నా శరీర మానంద - కేక వేయుచున్నది

4. సైన్యముల యెహోవా - నా రాజా నీ బలి
   పీఠమునొద్దనే - పిచ్చుకలకు గూళ్ళు దొరికెను

5. పిల్లలు పెట్టుటకు - వానకోవెలకు
   గూటి స్థలము దొరికెను - నా దేవా

6. నీ మందిరములో నుండువారు ధన్యులు
   వారు నిత్యము నిన్ను సన్నుతించెదరు

7. నీవలన బలము నొందు వారు ధన్యులు
   యాత్ర మార్గము లతి ప్రియములు వారికి

8. వారు బాకా లోయలోబడి వెళ్లుచు
   దానిని జలమయముగా చేయుదురు

9. తొలకరి వాన దాని దీవెనలతో కప్పును
   వారు బలాభివృద్ధి నొందుచు వెళ్ళుదురు

10. వారిలో ప్రతివాడు సీయోనులోని
   దేవుని సన్నిధిలో కనబడును
38 ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతునుprabhuvu selavichudaani naalakintunu

Psalms 85:8-13

1. ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును (2)
   విభుని ప్రజలు శుద్ధులకు సమాధానము (2)

2. వారు మరల బుద్ధిహీనులు గాక యుందురు
   గురునికి వారలు జనులుగా నుండెదరు

3. మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా
   తన భక్తులకు రక్షణ సమీప మాయెను

4. కృపాసత్యములు ఒకటి నొకటి కలిసికొనినవి
   నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనినవి

5. భూలోకము లోనుండి సత్యము మొలుచు
   నాకాశములోనుండి నీతి పారజూచును

6. దేవుడుత్తమమైనదాని ననుగ్రహించును
   ఈ వసుధర దాని ఫలము లధికమిచ్చును

7. ఆయన ముందు నీతి నడచు చుండునట్లుగా
   ఆయన అడుగు జాడలలో మేము నడతుము
39 ప్రభువా తరతరముల నుండిprabhuvaa tarataramula nundi

Psalms 90:1-7

1. ప్రభువా తరతరముల నుండి - మాకు నివాసస్థలము నీవే (1)
   యుగ యుగములకు నీవే మా - దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు (2)

2. పర్వతములు పుట్టకమునుపు - భూమిని లోకమును నీవు
   పుట్టింపక మునుపే నీవు - వున్నావు, వున్నావు, వున్నావు, వున్నావు

3. నరపుత్రుల మంటికి మార్చి - తిరిగి రండని సెలవిచ్చెదవు
   వేయి సంవత్సరములు నీకు - జామువలె, జామువలె, జామువలె, జామువలె

4. నీదు దుష్టికి వేయి ఏండ్లు - గతించిన నిన్నటి వలె నున్నవి
   రాత్రి యందొక జాముకు సమముగ - నున్నవి, వున్నవి, వున్నవి, వున్నవి

5. నీవు వారిని పారగొట్టగ - వరద చేతనైన రీతి
   గడ్డివలె చిగిరించి వాడి - పోయెదరు, పోయెదరు, పోయెదరు, పోయెదరు

6. ప్రొద్దుట మొలిచి చిగిరించును - సాయంతరమున కోయబడును
   వాడబారును నీ కోపముచే - క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్

7. నీదు కోపము వలన మేము - క్షీణించు చున్నాము దేవా
   నీ యుగ్రతను బట్టి దిగులు - పొందెదము, పొందెదము, పొందెదము, పొందెదము
40 దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవేdevaa tarataramulaku maani-vaasa sthalamu neeve

Psalms 90:8-12

పల్లవి:
దేవా తరతరములకు మాని - వాస స్థలము నీవే (2)

1. మా దోషములను నీవు నీ యెదుట - నుంచుకొని యున్నావు (2)
   నీ ముఖకాంతిలో మా - రహస్య పా - పములు కనబడుచున్నవి (2)

2. మా దినములన్ని గడిపితిమి - నీ యుగ్రత భరించుచు
   నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము

3. డెబ్బది సంవత్సరములేగా - మాదు ఆయుష్కాలము
   అధిక బలమున్న యెడల యెనుబది - సంవత్సరములగును

4. అయినను వాటి వైభవమంత - ఆయాసమే దుఃఖమే
   అది త్వరగా గతించును మే-మెగిరి పోయెదము

5. నీకే జెందవలసినట్టి భయము - కొలది పుట్టినట్టి
   నీదు ఆగ్రహ క్రోధ బలము - ఎవ్వరికి తెలియున్

6. మాకు నీ జ్ఞాన హృదయమును - కలుగునట్లు చేయుము
   మా దినములు లెక్కించుటకు - మాకు నివే నేర్పుము
41 మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండుmahonnatuni chaatuna vasiyinchuvaade dhanyundu

Psalms 91:1-16

పల్లవి:
మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు (1)
సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు (2)

1. ఆయనే నా కోట - ఆశ్రయము నే - నమ్ముకొను దేవుడు (2)
   రక్షించు వేటకాని ఉరి నుండి - పాడు తెగులు నుండి (2)

2. తన రెక్కలతో నిను కప్పును నీకు - ఆశ్రయంబగును
   ఆయన సత్యంబు నీ కేడెమును - డాలునై యున్నది

3. రే భయమునకైనా పగటిలో నెగురు - బాణమునకైనా
   చీకటిలో తిరుగు తెగులునకైనా - నీవు భయపడవు

4. మధ్యాహ్నములో పాడుచేయు - రోగమునకు భయపడవు
   నీ ప్రక్కను వేయి మంది పడినను - నీవు భయపడవు

5. నీ కుడిప్రక్కను పదివేల మంది - కూలిపోయినను
   అపాయము నీ దాపున కేమాత్రము - రాదు భయపడవు

6. భక్తిహీనులకు కల్గు ప్రతిఫలము - నీవు చూచెదవు
   మహోన్నతునే ఆశ్రయముగా చేసి - వసించు చున్నావు

7. నీ గుడారమున కపాయము తెగులు - సమీపించదు
   నీ మార్గంబులలో నిను కాపాడను - దూతలకు చెప్పున్

8. నీ పాదములకు రాయి తగుల నీక - నిన్నెత్తు కొందురు
   సింహములను నాగుల భుజంగములను - అణగ ద్రొక్కెదవు

9. నన్నెరిగి ప్రేమించె గాన నేను - వాని ఘనపరతున్
   నా నామమున మొఱ్ఱపెట్టగా నేను - ఉత్తరమిచ్చెదను

10. శ్రమలో తోడై విడిపించి వాని - గొప్ప చేసెదను
   దీర్ఘాయువుతో తృప్తిపరచి నా - రక్షణ చూపెదను
42 సర్వోన్నతుని చాటున నివసించెడి వాడేsarvonnatuni chaatuna nivasinchedi vaade

Psalms 91

1. సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే (1)
   సర్వశక్తుని నీడను విశ్రమించును - పరమ ధన్యత యిదియే (2)

పల్లవి:
తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును (2)

2. ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును
   ఆయన సత్యము నా కేడెమును - నేనమ్ముకొను దేవుడు

3. పగటి బాణమున కైనా - రాత్రి భయమున కైనా
   చీకటిలో తిరిగు తెగులుకైనా - నేనేమి భయపడను

4. వేయి పదివేలు - కుడిప్రక్కను కూలినను
   దయచూపు దేవుడు నీకుండ - అపాయము రాదు

5. నీ ప్రభువాశ్రయమే - యెహోవా నివాసం
   అపాయము తెగులు - నీ గుడారము సమీపించవు

6. నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్
   పాదములకు రాయి తగులకుండ - నిన్నెత్తికొందురు

7. కొదమ సింహముల - నాగుపాముల నణచెదవు
   అతడు నా నామము నెరిగెను - అతని తప్పించెదను

8. అతడు నను ప్రేమించెన్ - నామమున - మొఱ్ఱపెట్టెన్
   అతని విడిపించి ఘనపరతున్ - అతని కుత్తరమిత్తున్
43 యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడాyehovaanu stutinchuta manchidi mahonnatudaa

Psalms 92

పల్లవి:
యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా (1)
నీ నామమును సంకీర్తనము చేయుట మంచిది (2)

1. ఉదయము నందు నీదు కృపను
   ప్రతిరాత్రిలో నీ - విశ్వాస్యతను (2)
   యెహోవా నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది (2)

2. పదితంతులు గల - స్వరమండలమున్
   గంభీర ధ్వనిగల - సితారలను
   వాయించి నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది

3. ఎందుకనగా యెహోవా - నీ కార్యము చేత
   నీవు నన్ను సంతోష-పరచు చున్నావు
   నీ చేతిపనులను బట్టి - నేనుత్సహించుచున్నాను

4. యెహోవా నీ కార్యము - లెంత మంచివి
   నీ యాలోచన లతి - గంభీరములు
   పశుప్రాయులు అవి-వేకులు వివేచింపరు

5. నిత్యనాశనము - నొందుటకే గదా
   భక్తిహీనులు గడ్డి - వలె చిగుర్చుదురు
   చెడు కార్యములను - చేయువారు - పుష్పింతురు

6. మహోన్నతుడవుగా - నిత్యముండు యెహోవా
   నీ శత్రువు లెహోవా - నశియించెదరు
   చెడు పనులను చేయు - వారందరు - చెడిపోదురు

7. నీతిమంతులు తమా-ల వృక్షమువలె
   నాటబడినవారై - యెహోవా మందిరములో
   ఎదుగుచు మొవ్వు వేసి - వర్థిల్లుచు నుండెదరు

8. నాకు ఆశ్రయమైన - యెహోవా యథార్థుడు
   చెడుగు లేనివాడని - ప్రసిద్ధి చేయుటకు
   సారము కలిగి - పచ్చగ నుందురు వృద్ధులు
44 రండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదముrandi yehovaanugoorchi santosha gaanamu cheyudamu

Psalms 95:1-8

పల్లవి:
రండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము

1. మన రక్షణ దుర్గము బట్టి (2) - ఉత్సాహ ధ్వని చేయుదము (2)
   కృతజ్ఞతాస్తుతుల తోడ (1)

2. మహా దేవుడు యెహోవా - దేవతలందరి పైన
   మహాత్మ్యము గల మహారాజు

3. భూమ్యగాధ స్థలములు - ఆయన చేతిలో నున్నవి
   పర్వత శిఖరము లాయనవే

4. సముద్రమును భూమిని - తనదు చేతులు చేసెను
   తన ప్రజలము గొఱ్ఱెలము మనము

5. యెహోవా సన్నిధియందు - మనము సాగిలపడుదము
   మనల సృజించిన దేవునికి

6. నేడు మీరు ఆయన మాట - అంగీకరించిన యెడల
   ఎంత మేలు మనోహరము
45 యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడిyehovaa meeda krotta keertana paadudi

Psalm 96:1-8

1. యెహోవా మీద - క్రొత్త కీర్తన పాడుడి (2)
   సర్వ భూజనులారా - పాడుడి మీరు (2)

పల్లవి:
యెహోవాకు పాడుడి (1)

2. యెహోవాకు పాడి - నామమును స్తుతించుడి
   అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి

3. అతి మహాత్మ్యము గల - వాడు యెహోవా
   అధికస్తోత్రము నొంద - తగినవాడు ఆయనే

4. సమస్త దేవతలకన్న - పూజనీయుడు
   అన్య జనులలో తన మహిమను ప్రకటించుడి

5. సకల జనములలో - నాయన ఆశ్చర్య
   కార్యముల ప్రచురించి పూజింప రండి

6. జనముల దేవత - లందరు విగ్రహములే
   యెహోవా నాకాశ విశా-లములను సృజించె

7. ఘనతాప్రభావము - లాయన సన్నిధి నున్నవి
   బల సౌందర్యము లాయన పరిశుద్ధ స్థలమందున్నవి
46 సమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడిsamasta deshamulaaraa andaru paadudi andaru paadudi

Psalms 100:1-5

పల్లవి:
సమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడి (2)

అను పల్లవి:
అందరు యెహోవాకు ఉత్సాహ-ధ్వని చేయుడి (2)

1. సంతోషముగను యెహోవాను సేవించుడి (2)
   ఉత్సాహగానము చేయుచు సన్నిధికి రండి (2)

2. యెహోవాయే మీ దేవుడని తెలిసికొనుడి
   ఆయనే మనలను కలుగ జేసిన వాడు

3. మనమెల్లర మాయనకు ప్రజలమైతిమి
   ఆయన మేపు గొఱ్ఱెలమై యున్నవారము

4. కృతజ్ఞతార్పణలతోను గుమ్మములలో
   ఆవరణములలో కీర్తనలతో ప్రవేశించుడి

5. ఆయనను స్తుతించుడి ఆయనను స్తుతించుడి
   ఆయన నామమునకు స్తుతులు చెల్లించుడి

6. దయామయుండగు యెహోవా కృప నిత్యము
   ఆయన సత్యము తరతరములుండును
47 సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడిsamasta janulaaraa meeru yehovaaku stutigaanamu paadi

Psalms 100

పల్లవి:
సమస్త జనులారా మీరు  - యెహోవాకు స్తుతిగీతము పాడి (1)
సంతోషముతో సన్నిధిలో  - ఉత్సాహించుడి జయమనుచు (2)

1. తానె యొనర్చె మహకార్యములన్ - పాపిని రక్షింప బలియాయెన్ (2)
   శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరియించుడి మీరందరును (2)
   ఆయనను స్తుతియించుడి (1)

2. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు - విడిపించె నైగుప్తునుండి
   నలువది వత్సరములు నడిపించె - కానానుకు మిమ్ము చేర్చుటకు
   ఆయనను స్తుతియించుడి

3. మోషేకు తన సేవను నొసగె - యెహోషువా జయమును పొందె
   శత్రుని గెల్చి రాజ్యము పొందె ఘనకార్యములను స్మరియించి
   ఆయనను స్తుతియించుడి

4. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా - కొనె మిమ్ము తన రక్తముతో
   ఆత్మల చేర్చి సంఘము కట్టె ఆ రీతిని కని స్మరియించు
   ఆయనను స్తుతియించుడి

5. పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము - నేడే వినుమాయన స్వరము
   అర్పించుడి మీ జీవితములను - సాగిలపడి ఆయన యెదుట
   ఆయనను స్తుతియించుడి
48 స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవుstutiyinchu prabhun stutiyinchu neevu

Psalms 103:1-22

పల్లవి:
స్తుతియించు ప్రభున్ స్తుతియించు -నీవు
స్తుతియించు - ప్రభున్ స్తుతియించు (1)  నా ప్రాణమా  - నా సమస్తమా (2)

1. ఆయన చేసిన ఉపకారములలో (2)
   నా ప్రాణమా నీవు మరువకుమా (1)- దేనిన్ - నా ప్రాణమా నీవు మరువకుమా (1)
   నీ దేవుని నీవు మరువకుమా (2)

2. నీ దోషములను మన్నించి వేసి
   నీ రోగముల నన్నింటిని - ప్రభు - నీ రోగముల నన్నింటిని
   కుదుర్చి వేయుచున్నాడు

3. నా ప్రాణమును సమాధి నుండి
   విమోచించిన వాడని - ప్రభు - విమోచించిన వాడని
   కరుణా కిరీటము నియ్యన్

4. పక్షిరాజు యౌవనము వలె
   నూతన యౌవన ముండునట్లు - నీకు - నూతన యౌవన ముండునట్లు
   మేలుతో తృప్తిపరచును

5. దీర్ఘశాంతుడు దయగల దేవుడు
   యెల్లప్పుడు వ్యాజ్యమాడడు - నీతో - ఎల్లప్పుడు వ్యాజ్యమాడడు
   ప్రతీకారము చేయడు

6. భూమికంటె ఎంత ఆకాశమెత్తో
   భక్తుల యెడల కృపనంత - తన - భక్తుల యెడల కృపనంత
   అధికముగా చేసియున్నాడు

7. పడమటికి తూర్పెంత యెడమో
   పాపములకును మనకంత - మన - పాపములకును మనకంత
   యెడము గలుగ జేసెను

8. తండ్రి తన కుమారుని యెడల
   జాలిపడునట్లు యెహోవా - బహు - జాలిపడునట్లు యెహోవా
   భక్తులపై జాలిపడును

9. మంటివాడవని ఆయన యెరుగున్
   నిర్మింపబడిన విధమెరుగున్ - నీవు - నిర్మింపబడిన విధమెరుగున్
   నీ దేవుడు నిన్ను నెరుగును

10. దేవదూతలారా దైవభక్తులారా
   యెహోవా మహాసైన్యములారా - ఓ - యెహోవా మహాసైన్యములారా
   హల్లెలూయ పాట పాడుడి
49 వారాయనను జన సమాజములో ఘనపరచుదురు గాకvaaraayananu jana samaajamulo ghanaparachuduru gaaka

Psalms 107:32-43

పల్లవి:
వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక (1)
వారాయనను పెద్దల సమాజములో కీర్తింతురు గాక (1)

1. దేశనివాసుల చెడుగును బట్టి - నదుల నడవిగ జేసెను (2)
   నీటి బుగ్గల నెండిన - నేలగాను మార్చెను (2)

2. అడవిని నీటిమడుగుగా - మార్చివేసె నెహోవా
   ఎండిన నేలను నీటి - ఊటగాను మార్చెను

3. పురములు నివాసమునకై - వారేర్పరచుకొనునట్లు
   పొలములలో విత్తనములు చల్లి - ద్రాక్షాతోటలు నాటిరి

4. సస్య ఫల సమృద్ధి పొందు - నట్లు వాటివలన
   ఆయన ఆకలిగొనిన వారిని - అచ్చట కాపురముంచెను

5. మరియు ఆయన వాని నధికము - గా నాశీర్వదించగా
   వారి సంతానాభివృద్ధి - అధికముగా వర్ధిల్లెను

6. వారు విచార బాధ వలన - తగ్గిపోయినపుడు
   రాజులను తృణీకరించి - ఎడారిలో తిరుగజేసె

7. అట్టి దరిద్రుల బాధను బాపి - వారిని లేవనెత్తెను
   అట్టివారి వంశము మంద - వలె వృద్ధిచేసెను

8. యధార్థవంతులు దాని - చూచి సంతోషింతురు
   మోసము చేయువారందరు - మౌనముగా నుందురు

9. బుద్ధిమంతులు యీ విషయ-ముల నాలోచించును
   యెహోవ కృపాతిశయముల - దలంచెదరు గాక
50 దేవా నా హృదయము - నీయందు స్థిరమాయెన్devaa naa hrudayamu - neeyandu sthiramaayen

Psalms 108:1-5

పల్లవి:
దేవా నా హృదయము - నీయందు స్థిరమాయెన్ (1)
నే పాడుచు స్తుతింతున్ - నా యాత్మ గానము చేయున్ (2)

1. స్వరమండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడా - మేల్కొనుడి మీరు కూడా (2)
   వేకువనే నే లేచెదను (2) - స్తుతిగానము చేసెదను (4)

2. దేవా నీ జనముల మధ్య - కృతజ్ఞతా స్తుతులను - కృతజ్ఞతా స్తుతులను
   చెల్లించి ప్రజలలోన - స్తుతిగానము చేసెదను

3. ఆకాశమున కంటె నీ - కృప మహోన్నతమైనది - కృప మహోన్నతమైనది
   నీదు సత్యము మేఘములకంటె - అత్యున్నతమైనది

4. దేవా నీ వాకాశముకంటె - మహోన్నతుడవు కమ్ము - మహోన్నతుడవు కమ్ము
   నీదు మహిమ సర్వభూమి - మీద వ్యాపించును గాక
51 స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయstutintun devuni sabhalo stutintun hallelooya

Psalms 111:1

పల్లవి:
స్తుతింతున్ దేవుని సభలో (2) స్తుతింతున్ హల్లెలూయ (1)

1. యథార్థవంతుల సంఘములో (2) హృదయపూర్తిగా స్తుతింతున్ (2)
   స్తుతింతున్ హల్లెలూయ (1)

2. నీ క్రియలను దేవా ఆశించువారు - నీ యొద్ద విచారించెదరు
   స్తుతింతున్ హల్లెలూయ

3. దేవా నీ పనులు - ప్రభాము గలవి - నీ నీతి సదా నిలుచును
   స్తుతింతున్ హల్లెలూయ

4. యెహోవా అద్భుత కార్యములకు - జ్ఞాపక సూచన నుంచెను
   స్తుతింతున్ హల్లెలూయ

5. దయతో నిండిన దేవుడెహోవా - దాక్షిణ్య పూర్ణుడెహోవా
   స్తుతింతున్ హల్లెలూయ

6. భక్తి తనయందు గల్గిన వారికి - భోజనము నిచ్చి యున్నాడు
   స్తుతింతున్ హల్లెలూయ

7. యెహోవా చేసిన నిబంధనను - యెప్పుడు జ్ఞప్తి నుంచుకొనును
   స్తుతింతున్ హల్లెలూయ
52 యెహోవా నీ యొక్క మాట చొప్పునyehovaa nee yokka maata choppuna

Psalms 119:65

పల్లవి:
యెహోవా నీ యొక్క మాట చొప్పున (2)
నీ దాసునికి మేలు చేసియున్నావు (2)

1. మంచి వివేచన మంచి జ్ఞానము (2) - కర్త నీవే నాకు బోధ చేయుము (2)
   నీ యాజ్ఞలందు నమ్మిక నుంచితిని (2)

2. నాకు శ్రమ కలుగక మునుపు - నా దేవా నేను త్రోవ వీడితిని
   నేడు నీ మాట నెరవేర్చు చున్నాను

3. దేవా నీవు దయగలవాడవు - దేవా నీవు మేలు చేయుచున్నావునీ కట్టడల నాకు బోధించుము

4. గర్విష్ఠులు నాకు విరోధముగా - కల్పించుదురెన్నో అబద్ధములు
   నీ యుపదేశము లనుసరింతును

5. వారి హృదయములు క్రొవ్వువలె - చాల మందముగానై యున్నవి
   ఆజ్ఞలలో ఆనందించుచున్నాను

6. దేవా నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లు శ్రమల నొంది
   యుండుట నాకు యెంతో మేలాయెను

7. వేలాది వెండి నాణెముల కంటె - వేలాది బంగారు నాణెముల కంటె
   నీ విచ్చిన ఆజ్ఞలు నాకు మేలు
53 నా శ్రమలో యెహోవాకు మొఱలిడితినిnaa shramalo yehovaaku moraliditini

1 Cor 13:13

పల్లవి:
నా శ్రమలో యెహోవాకు మొఱలిడితిని (1)

1. ఆయన నాకుత్తరమిచ్చెన్ (2) - యెహోవా అబద్ధమాడు (2)
   పెదవులనుండి నా ప్రాణమును విడిపింపుము (2)

2. మోసకరమగు నాలుకా - ఆయన నీకేమి చేయును?
   తంగేడు నిప్పుల బాణముల నీపై వేయును

3. అయ్యో నేను మెషెకులో - పరదేశినై యున్నాను
   కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను

4. కలహప్రియుని యొద్ద - చిరకాలము నివసించితిని
   నేను కోరునది సమాధానమే

5. అయినను మాట నానోట - వచ్చిన తోడనే వారు
   యుద్ధమునకు సిద్ధము అయ్యెదరు
54 కొండలతట్టు కన్ను లెత్తుచున్నానుkondalatattu kannu lettuchunnaanu

Psalms 121

పల్లవి:
కొండలతట్టు కన్నులెత్తుచున్నాను (1)
నాకు సాయమెచ్చట నుండి వచ్చును (2)

1. భూమి యాకాశముల సృజించిన (2) యెహోవా వలన సాయము కల్గున్ (1)

2. నీ పాదము తొట్రిల్ల నీయడు - నిన్ను కాపాడువాడు కునుకడు

3. ఇశ్రాయేలును కాచు దేవుడు - కునుకడు నిద్రపోడు ఎన్నడు

4. యెహోవాయే నిన్ను కాపాడును - కుడిప్రక్క నీడగా నుండును

5. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ - నీకు తగులకుండ కాపాడును

6. ఎట్టి అపాయమైన రాకుండ - ఆయన నీ ప్రాణము కాపాడున్

7. ఇది మొదలుకొని నిత్యము నీ - రాకపోకలందు నిను కాపాడున్
55 యెహోవా మందిరమునకు వెళ్లుదమనిyehovaa mandiramunaku velludamani

Psalms 122:1-9

1. యెహోవా మందిరమునకు వెళ్లుదమని (2)
   జనులు అనినప్పుడు సంతోషించితిని (2)

పల్లవి:
యెహోవా మందిరమునకు నడిచెదము (2)

2. యెరూషలేము నగరు నీ గుమ్మములలో
   మా పాదములు బాగుగా నిలుచుచున్నవి

3. యెరూషలేమా బాగుగా కట్టబడిన
   పట్టణమువలె కట్టబడియున్నావు

4. అక్కడ ఇశ్రాయేలుకు సాక్షముగా
   దేవుని జనము స్తుతించ వెళ్ళును

5. జనముల యొక్క గోత్రములు
   యెహోవా నామమును స్తుతింప వెళ్ళును

6. అక్కడ దావీదు వంశీయుల యొక్క
   నీతి సింహాసనము స్థాపించబడెను

7. యెరూషలేము క్షేమము కొరకు
   యెడతెగక ప్రార్థన చేయుడి

8. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు
   యెన్నడును వర్ధిల్లెదరు గాక

9. నీ ప్రాకారములలో నెమ్మది
   నీ నగరులలో క్షేమముండును గాక

10. నా సహోదర సహవాసుల నిమిత్తము
   క్షేమము కలుగునని నేనందును

11. దేవుడైన యెహోవా మందిరమును బట్టి
   నీకు మేలుచేయ ప్రయత్నించెదను
56 యెహోవా ఇల్లు కట్టించని యెడలyehovaa illu kattinchani yedala

Psalms 127 , 128

పల్లవి:
యెహోవా ఇల్లు కట్టించని యెడల -  దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే
యెహోవా పట్టణమును కాపాడని యెడల
దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే

1. మీరు వేకువనే లేచి రాత్రియైన
   తర్వాత పండు కొనుచు మీరు - తర్వాత పండు కొనుచు (1)
   ఆర్జితమైన ఆహారమును (2)
   మీరు తినుచుండుట - వ్యర్థమే - మీరు తినుచుండుట

2. తన ప్రియులు నిద్రించుచుండగా
   తానే యిచ్చు చున్నాడు - వారికి - తానేయిచ్చుచున్నాడు
   తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము
   కనెడి గర్భఫలము - బహుమానమే - కనెడి గర్భఫలము

3. యౌవన కాలమున పుట్టిన కుమారులు
   బలవంతుని చేతిలోని - బాణములు - బలవంతుని చేతిలోని
   తన అంబుల పొదిని నింపుకొనువాడు
   ధన్యుడు అట్టివాడు - బహుగా - ధన్యుడు అట్టివాడు

4. యెహోవా యందు భయభక్తులు కలిగి
   నడచు వారందరును - ధన్యులు - నడచు వారందరును
   మహా మేలు నీకు కలుగును
   నిశ్చయముగా నీవు - ధన్యుడవు - నిశ్చయముగా నీవు

5. నీవు ధన్యుడవు లోగిట నీ భార్య
   ఫలించు ద్రాక్షావల్లి - వలె నుండు - ఫలించు ద్రాక్షావల్లి
   భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు
   ఒలీవ మొక్కల వలె - నుందురు -ఒలీవ మొక్కల వలె

6. యెహోవా యందు భయభక్తి గలవాడు
   ఆశీర్వదింపబడును నిజముగా - ఆశీర్వదింపబడును
   యెహోవా నిన్ను సీయోను నుండి
   ఆశీర్వదించును - బహుగా - ఆశీర్వదించును

7. నీ జీవితమంతా యెరూషలేముకు
   క్షేమము కలుగుటయే - జూతువు - క్షేమము కలుగుటయే
   నీ పిల్లల పిల్లలను చూతువు నీవు
   ఇశ్రాయేలు మీద - నిత్యము - సమాధానముండును
57 యెహోవా అగాధ స్థలములలో నుండిyehovaa agaadha sthalamulalo nundi

Psalms 130

పల్లవి:
యెహోవా అగాధ స్థలములలో నుండి - నీకు మొర పెట్టుచున్నాను (1)
ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్త  ధ్వని  వినుము (2)

1. యెహోవా నీవు దోషములు - కనిపెట్టి చూచిన యెడల (2)
   ప్రభువా ఎవడు నిలువగలడు (1)

2. అయినను జనులు నీ యందు - భయభక్తులు నిలుపునట్లు
   నీ యొద్ద కృప దొరుకును

3. యెహోవా కొరకు నేను - కనిపెట్టుకొనుచున్నాను
   ఆశ పెట్టుకొనుచున్నాను

4. కావలి వారు ఉదయము కొరకు - కనిపెట్టుకొనుటకంటె
   నా ప్రాణము కనిపెట్టుచున్నది

5. ఇశ్రాయేలు యెహోవా - మీద ఆశపెట్టుకో
   యెహోవా యొద్ద కృప దొరుకున్

6. ఇశ్రాయేలు దోషము నుండి - ఆయనే విమోచించును
   విమోచన దొరుకును
58 సహోదరులు ఐక్యత కల్గి వసించుటsahodarulu aikyata kalgi vasinchuta

Psalms 133

పల్లవి:
సహోదరులు ఐక్యత కల్గి  వసించుట (1)
ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును (2)

1. అది అహరోను - తలపై - పోయబడియు - పోయబడియు (1)
   క్రిందికి గడ్డము పై కారి - నట్టులుండును (2)

2. అంగీల అంచు వరకును - దిగజారిన
   పరిమళ తైలము వలె - నదియుండును

3. సీయోను కొండ మీదికి - దిగివచ్చునట్టి
   హెర్మోను మంచువలె - నైక్యత యుండును

4. ఆశీర్వాదమును - శాశ్వత జీవము నచ్చట
   యుండవలెనని యెహోవా - సెలవిచ్చెను
59 యెహోవా సేవకులారా స్తుతించుడిyehovaa sevakulaaraa stutinchudi

Psalms 135:1-14

పల్లవి:
యెహోవా సేవకులారా స్తుతించుడి -  ఆయన నామమును స్తుతించుడి (1)

అను పల్లవి:
యెహోవా మందిర ఆవరణములలో (2)
నిలుచుండు వారలారా మీరు (1)

1. యెహోవా దయాళుడు ఆయన నామమును - కీర్తించుడి అది మనోహరము (1)
   యాకోబును తనకొర కేర్పరచుకొని (2)
   ఇశ్రాయేలును స్వకీయ ధనముగా కొనెన్ (1)

2. యెహోవా సకల దేవతల కంటెను - గొప్పవాడని నేనెరుంగుదున్
   భూమ్యాకాశములు మహా
   సముద్రము - లందాయన కిష్టమైనవి చేసెను

3. భూమి దిగంతముల నుండి ఆవిరి - లేవజేసి వాన కురియునట్లు
   మెరుపును పుట్టించి తన నిధులలో నుండి
   గాలిని బయలు వెళ్ళఁజేయు వాడాయనే

4. ఐగుప్తు జనుల తొలిచూలులను - పశువుల తొలిచూలుల జంపెను
   ఫరో యెదుట వాని ఉద్యోగుల యెదుట
   సూచనల మహాత్కార్యముల జేసె

5. అన్యులనేకులను శక్తిగల - రాజులనేకులను చంపెను
   అమోరీయుల రాజైన సీహోనును
   బాషాను రాజగు ఓగును చంపెను

6. కనాను రాజ్యముల పాడుచేసియు - నిశ్రాయేలేయుల కప్పగించెను
   యెహోవా నీ నామము నిత్యముండున్
   నీ జ్ఞాపకార్థము తర తరములకును

7. యెహోవా తనదగు ప్రజలకు తానే - న్యాయము తీర్చును హల్లెలూయ
   తన వారగు తన సేవకులను బట్టి
   సంతాపము నొందు నాయనల్లేలూయ
60 యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడుyehovaanu stutinchudi aayana dayaaludu

Psalms 136:1-9

1. యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు
   ఆయన కృప నిరంతరముండును (2)

పల్లవి:
ఆయన కృప నిరంతరముండును - ఆయన కృప నిరంతరముండును

2. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి
   ఆయన కృప నిరంతరముండును

3. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి
   ఆయన కృప నిరంతరముండును

4. ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి
   ఆయన కృప నిరంతరముండును

5. ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి
   ఆయన కృప నిరంతరముండును

6. నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి
   ఆయన కృప నిరంతరముండును

7. గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి
   ఆయన కృప నిరంతరముండును

8. పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి
   ఆయన కృప నిరంతరముండును

9. రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి
   ఆయన కృప నిరంతరముండును
61 యెహోవా - నీవు నన్నుపరిశీలించి తెలిసికొంటివిyehovaa - neevu nannuparisheelinchi telisikontivi

Psalms 139:1-10

పల్లవి:
యెహోవా - నీవు నన్నుపరిశీలించి, తెలిసికొంటివి (2)
నే కూర్చుం- డుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు (2)

1. పరిశీలించియున్నావు నీవు నా నడక పడకలను (2)
   నా చర్యలన్నిటిని బాగుగా నీవు యెరిగియున్నావు (2)

2. యెహోవా మాట నా నాలుకకు రాక - మునుపే యెరుగుదువు
   ముందు వెనుకల నన్నావరించి నీ చేతిని నా పై నుంచితివి

3. నాకు బహుమించియున్నదిట్టి తెలివి - నా కగోచరము
   నీ యాత్మను నీ సన్నిధిని విడిచి యెచ్చటికి-పారిపోవుదును

4. నే నాకాశమున కెక్కినప్పటికిని నీ - వచ్చట నున్నావు
   పాతాళమందు పండుకొనినను - నీవు అచ్చట నున్నావు

5. సముద్ర దిగంతములలో నేను వేకువ - రెక్కలు కట్టుకొని
   వసించిన నీదు హస్తము పట్టుకొని - నన్నునడిపించున్
62 యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడుyehovaye dayaadaakshinyamulu kaliginavaadu

Psalms 145:8-16

1. యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు
   దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు

పల్లవి:
యెహోవా అందరికిని మహోపకారుండు
ఆయన కనికరమాయన పనులపై నున్నది

2. కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు
   నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక || యెహో ||

3. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు
   నీ శౌర్యమును గూర్చి నీ భక్తులు పల్కెదరు || యెహో ||

4. నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరు
   నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును || యెహో ||

5. యెహోవా పడినవారినెల్ల నుద్ధరించును
   కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును || యెహో ||

6. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి
   తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు || యెహో ||

7. యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పి
   ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు || యెహో ||
63 ఓ నాదు యేసురాజా నిన్ను నే నుతించెదనుo naadu yesuraajaa ninnu ne nutinchedanu

Psalms 145

పల్లవి:
ఓ నాదు యేసురాజా -నిన్ను నే నుతించెదను (2)

అను పల్లవి:
నీనామమును సదా - నే సన్నుతించుచుందును (2)

1. అనుదినము నిను స్తుతియించెదను (2)
   ఘనంబు చేయుచుందును నేను (2)

2. వర్ణించెద నే నీ క్రియలను - స్మరియించెద నీ మంచితనంబున్

3. రక్షణ గీతము నే పాడెదను - నిశ్చయ జయధ్వని నే చేసెదను

4. విజయ గీతము వినిపించెదను - భజియించెద జీవితమంతయును

5. నిరీక్షణ పూర్ణతగలిగి - పరికించెద నా ప్రభు రాకడను
64 హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించుhallelooya naa praanamaa yehovaanu stutinchu

Psalms 146

పల్లవి:
హల్లెలూయ నా ప్రాణమా - యెహోవాను స్తుతించు (2)

1. నా జీవితకాలమంతయు నే నెహోవాను స్తుతించెదను (2)
   నా బ్రతుకు కాలమంతయు - నా దేవుని కీర్తింతును (1)

2. రాజుల చేతనైనను - మరి నరుల చేతనైనను
   రక్షణ్య భాగ్యము కల్గదు వారిని - నమ్ముకొనకండి

3. వారి ప్రాణము నశియించును - వారు మంటిలో గలసెదరు
   వారి సంకల్పములన్నియు నీ దినమే - నాశనము నొందున్

4. యాకోబు దేవుండు - ఎవ్వనికి సాయంబగునో
   యెవడెహోవా మీద ఆశపెట్టునో - వాడే ధన్యుడు

5. ఆకాశ భూమి సముద్రం - దానిలోని దంత సృజించెన్
   ఆ తండ్రి యెన్నండైన తన మా- - టలు తప్పనివాడు

6. బాధ నొందినవారికి - అతడే న్యాయము తీర్చున్
   ఆకలిగొనినట్టి వారికి ఆ - హారము దయచేయున్

7. బంధింపబడిన వారికి బంధములాయన ద్రుంచున్
   పుట్టంధుల కన్నులను యెహోవా - తెరవజేసెడివాడు

8. క్రుంగినట్టి జనుల - నింగికెత్తెడు వాడాయనే
   నీతిమంతుల నెల్లరిని - యెహోవా ప్రేమించున్

9. పరదేశ వాసులను - కాపాడు వాడాయనే
   వేరుదిక్కులేని వారిని విధవల నాదరించును

10. భక్తిహీనుల దారిని - వంకరగా జేయును
   యెహోవాయే తరతరములు పరిపా - లించుచుండును

11. సీయోను నీ దేవుడు - తరతరములు రాజ్య మేలును
   యెహోవాను స్తుతించుడి - హల్లెలూయా ఆమెన్
65 దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదిdevuniki stotramu gaanamu cheyutaye manchidi

Psalms 147:1-20

పల్లవి:
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది (2)

1. యెరూషలేము నెహోవాయే - కట్టుచున్న వాడని (2)
   ఇశ్రాయేలీయులను - పోగుచేయువాడని (2)

2. గుండె చెదరిన వారిని - బాగుచేయు వాడని
   వారి గాయములన్నియు - కట్టుచున్న వాడని

3. నక్షత్రముల సంఖ్యను - ఆయన నియమించెను
   వాటి కన్నియు పేరులు - పెట్టుచున్న వాడని

4. ప్రభువు గొప్పవాడును - అధికశక్తి సంపన్నుడు
   జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని

5. దీనులకు అండాయనే - భక్తిహీనుల గూల్చును
   సితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి

6. ఆయన ఆకాశము - మేఘములతో కప్పుచు
   భూమి కొరకు వర్షము - సిద్ధపరచు వాడని

7. పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపుంచును
   అరచు పిల్ల కాకులకును - ఆహారము తానీయును

8. గుర్రముల నరులందరి - బలము నానందించడు
   కృపకు వేడువారిలో - సంతసించు వాడని

9. యెరూషలేమా యెహోవాను - సీయోను నీ దేవుని
   కీర్తించుము కొనియాడుము - ఆనందించు వాడని

10. పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్
   మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగ నుంచును

11. భూమికి తన యాజ్ఞను - యిచ్చువాడు ఆయనే
   వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును

12. వాక్యమును యాకోబుకు - తెలియజేసిన వాడని
   ఏ జనము కీలాగున - చేసియుండ లేదని
66 స్తుతియించుడాయన నాకాశ వాసులారాstutiyinchudaayana naakaasha vaasulaaraa

Psalms 148

1. స్తుతియించుడాయన నాకాశ వాసులారా
   స్తుతియించుడి ఉన్నత స్థలములలో (1)

పల్లవి:
స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి  (2)

2. స్తుతియించుడి దూతలారా మీరందరు
   స్స్తుతియించుడాయనన్ సైన్యములారా

3. స్తుతియించుడి సూర్యచంద్రులారా మీరు
   కాంతిగల నక్షత్రములారా

4. స్తుతియించుడి పరమాకాశములారా
   స్తుతియించుడి ఆకాశ జలములారా

5. స్తుతియించుడి సమస్త మకరములారా
   స్తుతియించుడి అగాధ జలములారా

6. స్తుతియించుడగ్నియు వడగండ్లార
   స్తుతియించుడాయన నావిరి హిమమా

7. స్తుతియించు డాజ్ఞకు లోబడు తుఫాను
   స్తుతియించుడి పర్వతములు గుట్టలారా

8. స్తుతియించుడి సమస్త ఫల వృక్షములారా
   స్తుతియించుడి దేవదారు వృక్షములారా

9. స్తుతియించుడి మీరు కౄర మృగములారా
   స్తుతియించుడి మీరు సాధు జంతువులారా

10. స్తుతియించుడి నేల ప్రాకు జీవులారా
   స్తుతియించుడి మీ రాకాశ పక్షులారా

11. స్తుతియించుడాయనన్ భూరాజులారా
   స్తుతియించుడి సమస్త జనంబులారా
67 స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారాstutinchudi yehovaa devuni sooryachandrulaaraa

Psalms 148

పల్లవి:
స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా - పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యె - హో - వాను స్తుతించుడి (2)

1. కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2)
   ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను (2)
   మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా (2)
   ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని - యె - హో -వాను స్తుతించుడి (1)

2. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
   బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
   ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
   ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
   యె - హో = వాను స్తుతించుడి
68 యెహోవాకు స్తుతులు పాడండి - మీరుyehovaaku stutulu paadandi - meeru

Psalms 149

పల్లవి:
యెహోవాకు స్తుతులు పాడండి - మీరు (2)
సమాజములో ప్రభు ప్రశంస పాడి (2)   సభలో పాడండి మీరు
యెహోవాకు  స్తుతులు పాడండి1

1. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను - సీయోను వాసులు తమ రాజును2
   స్మరియించుకొని సంతోషింతురు (2)
   నాట్యమాడి తన స్తుతి పాడండి (2) - మీరు

2. తంబురతోను సితారాతోను - తనను గూర్చి గానము చేసి
   దేవుని ప్రేమరసమును గ్రోలి
   పావనాలంకారమును బొంది - మీరు

3. భక్తులు ఘనులై హర్షింతురు - ఉత్సాహమున ఉప్పొంగెదరు
   పడకల మీద ప్రభువును కోరి
   పాడి పాడి ప్రభువును దలచెదరు - మీరు

4. అన్యజనులను శిక్షించుటకు - రాజులఁ గొలుసుతో బంధించుటకు
   రెండంచుల ఖడ్గమును ధరించిరి
   దైవ భక్తులకు ఘనత యునిదే - మీరు
69 యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి యెహోవాను స్తుతించుడిyehovaaku krotta keertana paadudi yehovaanu stutinchudi

Psalms 149

పల్లవి:
యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి - యెహోవాను స్తుతించుడి (1)

అను పల్లవి:
భక్తులు కూడుకొను సమాజములో - స్తోత్ర గీతము పాడుడి (2)

1. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను - బట్టి సంతోషించెదరు గాక (1)
   సీయోను జనులు తమ రాజును బట్టి -
   ఆనందించుచు నుందురు గాక (2)

2. నాట్యముతో వారు తన నామమును - శ్రేష్ఠముగా స్తుతింతురు గాక
   తంబురతోను సితారాతోను -
   తనివి తీర పాడుదురు గాక

3. యెహోవా ఆయన ప్రజల యందు - మహా ప్రేమ కలిగినవాడు
   ఆయన బీదలను రక్షణతో -
   అందముగ అలంకరించును

4. భక్తులందరును ఘనతనొంది - నిత్యము ప్రహర్షింతురు గాక
   సంతోషభరితులై పడకల మీద -
   వింత గానము చేతురు గాక
70 దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడిdevuni stutiyinchudi ellappudu devuni stutiyinchudi

Psalms 150

పల్లవి:
దేవుని స్తుతియించుడి ! ఎల్లప్పుడు  - దేవుని స్తుతియించుడి - ఆ ఆ (2)

1. ఆయన పరిశుద్ధ ఆలయమందు (1) - ఆయన సన్నిధిలో - ఆ ఆ (2)

2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు -ఆకాశ విశాలమందు

3. ఆయన పరాక్రమ కార్యముల బట్టి - ఆయన ప్రభావమును

4. బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి - స్వర మండలములతో

5. సన్న తంతుల సితారతోను - చక్కని స్వరములతో

6. తంబురతోను నాట్యముతోను - తంతి వాద్యములతో

7. పిల్లనగ్రోవుల చల్లగనూది - ఎల్లప్రజలు జేరి

8. మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి - గంభీర తాళముతో

9. సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి - హల్లెలూయా ఆమెన్
71 హల్లెలూయ యేసు ప్రభున్ యెల్లరు స్తుతియించుడిhallelooya yesu prabhun yellaru stutiyinchudi

Psalms 148, 150

1. హల్లెలూయ యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి (1)
   వల్లభుని చర్యలను - తిలకించి స్తుతియించుడి (1)
   బలమైన పనిచేయు - బలవంతున్ స్తుతియించుడి (1)
   ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి (1)

పల్లవి:
రాజుల రాజైన యేసు రాజు - భూజనులనేలున్ (1)
హల్లెలూయ హల్లెలూయ - దేవుని స్తుతియించుడి (1)

2. తంబురతోను వీణతోను - ప్రభువును స్తుతియించుడి
   పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి
   బూరతోను తాళములన్ - మ్రోగించి స్తుతియించుడి
   నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి

3. సూర్య చంద్రులారా ఇల - దేవుని స్తుతియించుడి
   హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి
   అగ్ని వడగండ్లారా మీరు - కర్తను స్తుతియించుడి
   హృదయమును ఒప్పించిన - నాథుని స్తుతియించుడి

4. యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి
   జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి
   పెద్దలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి
   ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి

5. అగాధమైన జలములారా - దేవుని స్తుతియించుడి
   అలల వలె సేవకులు - లేచిరి స్తుతియించుడి
   దూతలారా పూర్వ భక్తులారా - దేవుని స్తుతియించుడి
   పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి
72 స్తుతించుడి మీరు స్తుతించుడిstutinchudi meeru stutinchudi

Psalms 148

పల్లవి:
స్తుతించుడి మీరు స్తుతించుడి (2)
యెహోవా దేవుని స్తుతించుడి (2) -స్తుతించుడి

1. ఓ దూతలారా పరమ సైన్యమా (2)
   సూర్యచంద్రులారా తారాగణమా (2) ప్రభునే స్తుతించుడి (2)

2. పరమాకాశమా పైనున్న జలమా
   సృష్టికర్తను స్తుతించుడి - నాథుని స్తుతించుడి

3. మకరములారా అగాధ జలమా
   అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా - కర్తను స్తుతించుడి

4. పర్వత శిఖర వృక్షములారా
   మృగ పక్షి ప్రాకు పురుగులారా - కాపరిని స్తుతించుడి

5. భూరాజులారా సర్వ ప్రజలారా
   అధిపతులు యౌవనులు కన్యకలు - రారాజుని స్తుతించుడి

6. మహోన్నతుండు ఇహ పరములలో
   ఐశ్వర్యవంతుని స్తుతించుడి - దేవుని స్తుతించుడి

7. ప్రజలెల్లరికి రక్షణ శృంగము
   ఇశ్రాయేలీయులకు భక్తులకును - తండ్రిని స్తుతించుడి
73 సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడుseeyonuku tirigi prabhuvu vaarini rappinchinapudu

Psalms 126

పల్లవి:
సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు (1)
మనము కలలను కనిన వారివలె నుంటిమిగా (2)

1. అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకు (2)
   అందుకే మన నాలుక ఆనంద గానముతో నిండె (2)

2. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు జేసె
   అన్య జనులెల్లరు చెప్పుకొనుచుండిరిగా

3. ఘనకార్యంబులను యెన్నో యెహోవా చేసె మనకు
   మన మందరము యెంతో ఆనందభరితులమైతిమి

4. దక్షిణ దేశములో నదులు పారునట్లుగా
   దయతో చెరలో నున్న మా జనులను రక్షించుము ప్రభువా

5. పిడికెడు విత్తనములు పట్టుకొని పోవువాడు
   పంటను కోయును ముదముగ కన్నీటితో విత్తువాడు

6. ఎన్నో ప్రయాసములతో సమకూర్చును పంటంతటిని
   సంతోష గానము చేయుచు పనల మోసికొని వచ్చును
74 యెహోవా నా స్తుతి కాదారుడా మౌనముండకుము మౌనముండకుముyehovaa naa stuti kaadaarudaa maunamundakumu maunamundakumu

Psalms 109

పల్లవి:
యెహోవా నా స్తుతికాధారుడా - మౌనముండకుము - మౌనముండకుము
దుష్టులు కపటులు - తమ నోరు తెరిచి -
అబద్ధములతో - నా ఫై లీచిరి

1. ద్వేషపు మాటలచే నా చుత్తుచేరి -
   నిర్నిమిత్తముగా పౌరదుచున్నారు (2)
   ప్రేమకు ప్రీతిగా పగబూనిరి నా ఫై -
   మానక నేను ప్రార్థించున్నాను (2)

2. అపవాది వనికుడి - ప్రక్యబుబడునుగాక
   వాని ప్రార్థన - పాపమగును గాక
   వాని దినములు - కొద్దివగునుగాక -
   ఆస్తియంతయుధోచు - కొనబడును గాక

3. విధపయై వాని భార్య దిగులొందునుగాక -
   దేశాధిమ్యరులై - పిల్లలుందురు గాక
   తల్లిపాపము తుడుప - బడకుండునుగాక -
   సంతతి యంతయు - నాశమగుగాక

4. పితరుల దోషములు - ఎన్న టెన్నటికిని -
   జ్యపకముంచు కొనమో దేవా
   రాబోవు తరములలో వాని పేరు -
   మరుబవడి మాసిపోవునుగాక

5. కృపజూపుటయే మరచునవారై -
   శ్రమగలవానిని - చంపెనాశించిరి
   నలిగిన హృదయుల - తరిమెడువానికి -
   శాపమేగాని - ధీవెన యెట్టిది

6. పై వస్త్రమువలె - శాపమునందెనుగా -
   నడికత్తువలె వాని - వదల కుండునుగాక
   నా శత్రువులకు - ఓ నా యేహోవా -
   నీ ప్రతీకారము - ఇదియగుగాక

7. దివింతువు నన్ను - వారు శపింపగా -
   నీ దాసుడానందింప సిగ్గగువారికి
   జనముల మధ్యను - నిను స్తుతియుంతును -
   కృతఙయతలతో - ఓ నా ప్రభువా
75 నీ రెక్కల చాటున శరనొందెదన్nee rekkala chaatuna sharanondedan

Psalms 63:7

పల్లవి:
నీ రెక్కల చాటున శరనొందెదన్ (2) - నా విశ్రమ గృహమైన ప్రభువా (2)
మొఱ్ఱ పెట్టెదను ఉత్సహించెదను (2) - మిగిలిన జీవిత కాలమంతయును (2)

1. అలసితిని నే నావిధేయతతో (2) - కృంగితి నేను పాపము చేతన్ (2)
   లేపితివినన్నుహత్తుకొంటివి - నీవు మోహన కాడి - నాకు విశ్రాంతి

2. గువ్వను పోలి ఎగిరి పొదును - నెమ్మది నొందెదనని తలచితిని
   లేదు లేదు విశ్రాంతేచ్చట - నీ విశ్రాంతిలో తిరిగి నే చేరితిన్

3. చేసితివి మాతో వాగ్దానమును - నీ విశ్రాంతిలో ప్రవేశింపచేయన్
   మానెదము మా ప్రయాశమును - పొందెదము క్రీస్తులో తిరిగి నే చేరితిన్

4. సిలువపై శ్రమలొందితివి - కార్చితివి నీ రక్తము మాకై
   లేచితివి నీవు మరణము గెల్చి - కూర్చుతివి నీ సంఘముగా మమ్ము

5. భంగపరచితి నీ విశ్రాంతిని - యోకోబుపంటి నా నడవడితో
   మార్పు నొందితి బేతేలు నందు - ఇక విశ్రమించుము నాలో ప్రభువా
76 ఆద్యంతరహితుడవగు మాజ్యోతిaadyantarahitudavagu maajyoti

Isaiah 9:6

1. ఆద్యంతరహితుడవగు మా జ్యోతి - మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము (2)
   మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము
   నా దీన కాపరి నీతి కృపానిధి - శుధ్ధ దివ్యగత్రుడా ఆ.. ఆ.. ఆ.. (2)

2. మనోహరమగు నీ కృప పొందను - మానవు లెల్లరము చేరితిమి
   మానవు లెల్లరము చేరితిమి
   ఆత్మరూపా కృపామయా నీ కరుణా - వరముల మాకీయుమా ఆ.. ఆ.. ఆ.

3. పాలచే కడుగబడిన - ధవళాక్షుడా - వళ్లి పూలయందు తిరుగువాడా
   వళ్లి పూలయందు తిరుగువాడా
   షాలేము రాజా షారోను రోజా - శాంత భూపతివి నీవే ఆ.. ఆ.. ఆ..

4. లక్షల దూతల స్తుతుల నందువాడా - అక్షయ హేమమకుట ధారుడా
   అక్షయ హేమమకుట ధారుడా
   హేమ కిరీటధారులమై స్వర్గంబు - చేర కడవరి వర్షమీ ఆ.. ఆ.. ఆ..

5. క్రొత్త యెరూషలేం నగర రాజా - రత్నాల పునాది వేసితివి
   రత్నాల పునాది వేసితివి
   ధీరతతో నీ సాక్ష్యము చాటను - స్థిరమగునాత్మ నిమ్ము ఆ.. ఆ.. ఆ..

6. శ్రేష్ఠురాలా పావురమా నిరుపమాన - ఇష్టంపురూప లావణ్యవతీ
   ఇష్టంపురూప లావణ్యవతీ
   అట్లంచు పిల్చు దివ్య ధ్వనికి మమ్ము - పాత్రులుగా చేయుమా ఆ.. ఆ.. ఆ..
77 స్తుతించుడి స్తుతించుడి ఆయన మందిరపు ఆవరణములోstutinchudi stutinchudi aayana mandirapu aavaranamulo

Psalms 135:2

పల్లవి:
స్తుతించుడి స్తుతించుడి - ఆయన మందిరపు ఆవరణములో (1)
యెహోవా దేవుని స్తుతించుడి  -  స్తుతించుడి, స్తుతించుడి (1)
భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి (2)
రాజా - రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి (2)

1. సర్వాధికారుడంచు - సర్వశక్తి మంతుడంచు (2)
   సంపూర్ణ ప్రేమరూపి - సాధుల శ్రీమంతుడంచు (2)
   సృష్టి నిన్ స్మరణ చేసెనో - ఓ ... స్తుతించుడి (1)

2. ఫెళఫెళ మ్రోగెడు ఉరుములలోన - రాజా - రాజా (1)
   తళతళ మెరిసెడు మెరుపులలోన - రాజా - రాజా (1)
   చననము గలిగిన జీవులలోన - రాజా - రాజా (1)
   పలుకులు లేని ప్రకృతిలోన - రాజా రాజా (1)
   ?రాజాధి రాజుల రాజా - ఓ ... స్తుతించుడి (1)
78 ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవాaadiyantamu lenivaadaa sampoornudagu maa devaa

Psalms 102:27

పల్లవి:
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా (2)
నీతిజ్ఞానము కలవాడా (2) జ్యోతికి నిలయము నీవే (2)

1. అబ్రాహామును పిలిచితివి - ఆ వంశమున బుట్టితివి (2)
   అనాధులకు దిక్కు నీవే (2) - అనాధుడవై వచ్చితివి (2)

2. ఇస్సాకును విడిపించి - యేసయ్యా బలియైనావా
   యూదాచే నమ్మబడితివి - పాపులకై మరణించితివి

3. యోనావలె మూడు దినముల్ - భూగర్భమున నీవుండి
   మానవులను రక్షింప - మహిమతోడ లేచితివి

4. పండ్రెండు గోత్రముల - జెంది - పండ్రెండు శిష్యుల జనకా
   కన్యపుత్రుడవై సీయోను - కన్యను వరించితివి

5. దావీదు కుమారుడవు - దావీదుకు దేవుడవు
   కాపాడుచు నున్నావు - పాపిని నన్ను ప్రేమించి
79 కల్వరిలోని శ్రేష్టుడా - కరుణా భరిత సింహమాkalvariloni shreshtudaa - karunaa bharita sinhamaa

1Cor 2:2

పల్లవి:
కల్వరిలోని శ్రేష్టుడా - కరుణా భరిత సింహమా (1)
కన్ను భ్రమించు ప్రభువా - సిలువలోని మిత్రుడా (1)

1. స్తుతికి పాత్రుండగువాడా - దూతలతో వేంచేయువాడా (1)
   సుదతి మరియ పుత్రుడా - సిలువలోని మిత్రుడా (1)

2. పాపులకై వచ్చినవాడా - ప్రేమ గల్గిన రక్షకుడా
   పాదములపై బడితిమి - సిలువలోని మిత్రుడా

3. దీవెనలు నిచ్చుటకై - వసుధ కేతెంచినవాడా
   నీవే సుంకరు లాప్తుడవు - సిలువలోని మిత్రుడా

4. అయిదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదు వేల
   జనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా

5. నీళ్ళను రసముగ మార్చితివి - నీళ్ళమీద నడచితివి
   మేళ్ళ నొసగు మా దాతా - సిలువలోని మిత్రుడా

6. రోగుల బాగుచేయువాడా - గ్రుడ్డికి నేత్రము లిచ్చితివి
   అనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా

7. హల్లెలూయా కర్హుడా - యెల్లరు కొనియాడువాడా
   బలముతో వచ్చువాడా - సిలువలోని మిత్రుడా
80 నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవుnaa priya yesu neeve naa shreyampu raajavu

Psalms 66:16

1. నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు (2)
   దయచే ప్రాయశ్చిత్తమైతివి నాదు రోజవు (2)

2. సాతానుకు నే దాసుదనై నాశమొందగా
   నాతాను ద్వారా తెలిపితివి నాదు ప్రియుడా

3. వ్యాధిగ్రస్తుండనై హృదయక్షీణ మొందితిన్
   బాధల నొంది తప్పియుంటి నాదు ప్రియుడా

4. తప్పిన రూక, పిల్లవాడు, గొఱ్ఱెవలెనే
   తప్పిన నన్ను వెదకి రక్షించితివి ప్రియుడా

5. తలిదండ్రులు విడిచినను నీవు విడువవు
   చల్లగ ప్రక్కజేర్చి బ్రోతువీవు ప్రియుడా

6. నావాడవైతివి నేను నీదు వాడను
   నాయాపదయందున్న ప్రభువు నాదు ప్రియుడా

7. ప్రభావముతో సాక్ష్యమీయ రాజ్యమేలుచు
   ఆ భాగ్యమును చూడనిమ్ము నాదు ప్రియుడా

8. రక్షించితివి హల్లెలూయ పాడునట్లుగా
   ఈ క్షితిలో నెల్లరకు చాట నాదు ప్రియుడా
81 పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువాparishuddha parishuddha parishuddha prabhuvaa

Isaiah 6:3

1. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా - వరదూతలైన నిన్ వర్ణింప గలరా

2. పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా - నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా

3. పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా - నరులను రక్షించు కరుణా నముద్రా

4. పరిశుద్ధమగు నాత్మ వరములిడు నాత్మ - పరమానంద ప్రేమ భక్తుల కిడుమా

5. జనక కుమారాత్మలను నేక దేవ - ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా
82 మంగళమే యేసునకు మనుజావతారునకుmangalame yesunaku manujaavataarunaku

Matthew 21:9

పల్లవి:
మంగళమే యేసునకు (1)  - మనుజావతారునకు (3)
శృంగార ప్రభువునకు (2) -  క్షేమాధిపతికి (2)

1. పరమ పవిత్రునకు (1) - వరదివ్య తేజునకు (3)
   నిరుప మానందునకు (2) - నిపుణ వేద్యునకు (2)

2. దురిత సంహారునకు - వరసుగుణోద్ధారునకు
   కరుణా సంపన్నునకు - జ్ఞానదీప్తునకు

3. సత్య ప్రవర్తునకు- సద్ధర్మశీలునకు
   నిత్యా స్వయంజీవునకు - నిర్మలాత్మునకు

4. యుక్తస్తోత్రార్హునకు - భక్త రక్షామణికి
   సత్య పరంజ్యోతియగు - సార్వభౌమునకు

5. పరమపురి వాసునకు - నరదైవ రూపునకు
   పరమేశ్వర తనయునకు - బ్రణుతింతుము నీకు
83 సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవాsundara rakshakudaa maadu svatantramaina devaa

John 20:28

పల్లవి:
సుందర రక్షకుడా ..ఆ ..ఆ 2మాదు స్వతంత్రమైన దేవా (1)

అను పల్లవి:
ఎల్లపుడు మేము నిన్నే స్తోత్రించుచుండు (2)
స్తుతి యిదియే .... సుందర రక్షకుడా (1)

1. రాజాధిరాజా నీవే ..ఆ ..ఆ (2) మా - షారోను రోజ నీవే ..ఆ ..ఆ (1)
   త్వరగా వత్తుననిన గొప్ప దేవా (2)
   నరుల మమ్ము జూడుమా ..ఆ ..ఆ (1)

2. వ్యాధిగ్రస్తుల వైద్యుడా - యూద - గోత్రమున బుట్టితి
   నార్తురాలైన నాయీను విధవ - కుమారుని లేపితివి

3. రత్నవర్ణ వదనుడా - యూద - కన్య మరియ కాత్మజా
   మన్నించి పరమున జేర్చువాడా - మమ్ము బ్రేమజూడు మా

4. నాకము పట్టలేని - వాడా - లోకమునకు వచ్చితీ
   జీవప్రాణమిచ్చి దాహము తీర్చితివి - హీనునిలో నుండుమా

5. మార్గం సత్యం జీవమై - మమ్ము కున్కక కాపాడుచు
   అరచేతిలో మమ్ము చెక్కియున్నవాడా - మంచిగొల్ల బోయుడా

6. ఆశ్చర్యకరుడ నీవే - మంచి - ఆలోచన కర్తయు
   బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభువు

7. హల్లెలూయా పాడను - మహా - సత్యాత్మ వరమీయను
   న్యాయము తీర్చుట కేతెంచువాడా - నిల్వక రారమ్మయా
84 స్తోత్రింతుము నిను మాదు తండ్రిstotrintumu ninu maadu tandri

John 4:24

పల్లవి:
స్తోత్రింతుము నిను మాదు తండ్రి - సత్యముతో, ఆత్మతో నెపుడు (2)

అను పల్లవి:
పరిశుద్ధాలంకారములతో - దర్శించెదము శరణం శరణం (2) || స్తో ||

1. శ్రేష్ఠ యీవుల యూట నీవే - శ్రేష్ఠ కుమారుని యిచ్చినందున (2)
త్రిత్వమై యేకత్వమైన - త్రిలోక నాథా శరణం శరణం (2)

2. పాపి మిత్రుడ పాప నాశక - పరమవాసా ప్రేమపూర్ణా
   వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం

3. ధవళవర్ణుడ రత్నవర్ణుడ - సత్యరూపి యనబడువాడా
   నను రక్షించిన రక్షకుండవు - నాథ నీవే శరణం శరణం

4. బంగారు వెంట్రుకలు తలపై - ఉంగరములుగ కనబడినవి
   వేలలో నతి కాంక్షణీయుడా - వేలకొలది శరణం శరణం

5. గువ్వల వంటి కన్నులు - పువ్వుల వంటి చెక్కిళ్ళు
   మంచి రూపము కలిగినందున - మాకు నీవే శరణం శరణం

6. చేతులు బంగారుమయము - చెక్కిన రత్నముల వంటివి
   కాళ్ళు రాతిస్తంభములవలె - కన్పడుచున్నందున శరణం

7. సంఘమునకు శిరస్సు నీవే - రాజా నీకే - నమస్కారములు
   ముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది శరణం శరణం

8. నీదు సేవకుల పునాది - జ్ఞానమునకు మించిన తెలివి
   అందముగను కూడుకొనుచు - వేడుకొందము శరణం శరణం

9. రాజ నీకే స్తుతి స్తోత్రములు - గీతములు మంగళ ధ్వనులు
   శుభము శుభము శుభము నిత్యం - హల్లెలూయా ఆమేన్ ఆమేన్
85 క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవుkreestu yesu dayaalu prabhu neeve srushtikartavu

2 Cor 8:9

పల్లవి:
క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు (1)
నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం (2)

1. పాప జగాన - జన్మించితివి - పేద గృహాన - పెరిగితివి -
   సంకట కష్టములనుభవించి మమ్ము రక్షించితివి (2)
   ప్రియ యేసు మమ్ము రక్షించితివి (2) - మమ్ము రక్షించితివి (4)

2. జీవిత నావా - తుఫాను చేత - తల్లడిల్లగ - ఒక్క మాటతో -
   ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి
   ప్రియ యేసు దరికి జేర్చితివి - దరికి జేర్చితివి

3. ఎన్నో విధాల - పోనట్టి నాదు - పాప రోగము - నీ వస్త్రమును -
   ముట్టినంతనే - అద్భుతముగ - నివారణాయెను
   ప్రియ యేసు నివారణాయెను - నివారణాయెను
86 యేసు పరిశుద్ధ నామమునకు యెప్పుడు అధిక స్తోత్రమేyesu parishuddha naamamunaku yeppudu adhika stotrame

Nehemiah 9:5

పల్లవి:
యేసు పరిశుద్ధ నామమునకు - యెప్పుడు అధిక స్తోత్రమే (2)

1. ఇహపరమున - మేలైన నామము - శక్తి గల్గినట్టి - నామమిది (2)-
   పరిశుధ్ధులు స్తుతించు నామమిది (2)- పరి

2. సైతానున్ పాతాళ - మును జయించిన వీరత్వము గల నామమిది
   జయ మొందెదము యీ నామమున

3. నశించు పాపుల రక్షించ లోక - మునకేతెంచిన - నామమిది
   పరలోకమున జేర్చు నామమిది - పర

4. ఉత్తమ భక్తులు - పొగడి స్తుతించు - ఉన్నత దేవుని - నామమిది
   లోకమంత ప్రకాశించె - నామమిది - లోక

5. శోధన గాధల - కష్టసమయాన - ఓదార్చి నడుపు - నామమిది
   ఆటంకము తీసివేయు నామమిది - ఆటం
87 యేసు సమసిన సిల్వ చెంతyesu samasina silva chenta

Revelation 4:9

1. యేసు సమసిన సిల్వ చెంత - నే ప్రార్ధించిన స్థలమందు (1)
   రక్తము ద్వారా మన్నింపొందితిన్ - యేసుకు మహిమ (1)

పల్లవి:
యేసుకు మహిమ మహిమ (2)
నా యెద యిప్పుడు మారెను - యేసుకు మహిమ (1)

2. ఆశ్చర్యముగా హృదయము మారె - యేసుకు ఆలయమాయెను
   సిల్వ యొద్ద నటులాయెను - యేసుకు మహిమ || యేసు ||

3. పాపము తీర్చు ప్రభావమది - నన్ను స్వస్థ పరచినది
   యేసుచే నీ స్థితి కల్గెను - యేసుకు మహిమ || యేసు ||

4. ఈ జీవపు ఊట యొద్దకురా - హృదయము నిమ్ము యేసునకు
   మున్గిన నీ పాపము పోవున్ - యేసుకు మహిమ || యేసు ||
88 సంస్తుతింతుము నిన్నే సౌలును విడచితివిsanstutintumu ninne saulunu vidachitivi

1 Samuel 16:12

1. సంస్తుతింతుము నిన్నే - సౌలును విడచితివి (2)
   దావీదును కోరుకొని - దీవించిన యెహోవా (2)

2. యెష్షయి పుత్రులలో ఎర్రని వాడతడు
   నేత్రాలు చక్కనివి నేర్పరి మాటలలోన

3. రత్నవర్ణుడు యేసు - మాటలు దయగలవి
   గువ్వలవలె వెలయు - కన్నులు గలవాడేసు

4. బెత్లెహేమునందు ఖ్యాతిగా వాయించి
   సొంపగు పాటలు పాడే సుగుణాల సుందరుడు

5. పరమగీతము పాడే పావనుడు మన యేసు
   నేర్పరి మాటలలోన నజరేతు నివాసి

6. వీరుడగు యౌవనుడు శూరుడు యుద్ధమున
   తల్లిని మించి యెహోవా తనతోడై యున్నాడు

7. నేను కోరిన దితడే వాని అన్నలముందు
   అభిషేక తైలముతో అభిషేకించుము వాని

8. సంఘవరుడగు క్రీస్తు సత్యముగ మన శిరస్సు
   ఆత్మాభిషిక్తుండై అలరారుచున్నాడు
89 యెహోవాను గానము చేసెదము యేకముగాyehovaanu gaanamu chesedamu yekamugaa

Exodus 15:21

పల్లవి:
యెహోవాను గానము చేసెదము యేకముగా (1)
మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము (1)
ఆయనను వర్ణించెదము - ఆయనే దేవుడు మనకు (1)

1. యుద్ధశూరుడెహోవా - నా బలము నా గానము (2)
   నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా (2)

2. ఫరోరథముల సేనలను - తన శ్రేష్ఠాధిపతులను
   ఎర్ర సముద్రములోన - ముంచివేసె నెహోవా

3. నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి
   చెత్తవలె దహించెదవు - నేపై లేచువారిని

4. దోపుడు సొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందును
   నా కత్తి దూసెదను - అని శత్రువనుకొనెను

5. వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్ధ మహానీయుడా
   అద్భుతమైన పూజ్యుడా - నీవంటి వాడెవడు

6. ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా
   సముద్రము మధ్యను - ఆరిన నేలను నడచిరి
90 ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందుaanandamaananda maayenu naadu priyakumaaruni yandu

Matthew 17:5

పల్లవి:
ఆనందమానంద మాయెను - నాదు ప్రియకుమారుని యందు
మహాదానంద మానంద మాయెను -  నాదు ప్రియకుమారుని యందు

అను పల్లవి:
నా తనయుని మాట వినండని శబ్దమొక్కటి యా మేఘములో (2)
ఉద్భవించె నద్భుతముగ (2) || మహాదానంద||

1. ప్రేమించుచున్నావు నీతిని - దుర్నీతిని ద్వేషించినావు - నీవు (1)
   నీవు - ప్రేమించుచున్నావు నీతిని - దుర్నీతిని ద్వేషించినావు (1)
   అందుచే నీతోటి వారికంటె (2) - ఆనంద తైలముతో తండ్రి నిన్ను2
   అధికంబుగ నభిషేకించెను (2)

2. అంత్య దినముల యందున - ఆ - వింత కుమారుని ద్వారా
   ఈ - అంత్య దినముల యందున - ఆ - వింత కుమారుని ద్వారా
   మానవులతోడ మాట్లాడెను - సర్వంబునకు తండ్రి తనయుని
   వారసునిగా నియమించెను

3. తనయుండె ఆ తండ్రి మహిమ - ఆ తత్వంపు రూపంబు తానే
   తనయుండె ఆ తండ్రి మహిమ - ఆ తత్వంపు రూపంబు తానే
   మహాత్మ్యమైనట్టి మాటచేత - నమస్తమును నిర్వహించుచు
   అందరిలో అతి శ్రేష్ఠుడాయె

4. నీవు నాదు కుమారుడవు -నిన్ను ప్రేమించి కన్నాను నేను
   నేడు నీవు నాదు కుమారుడవు -నిన్ను ప్రేమించి కన్నాను నేను
   దండిగ తనయుని ముద్దాడుడి - నిండుగాయన నాశ్రయించుడి
   రండి రండి ధన్యులు కండి

5. విజ్ఞాన సంపద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను
   ఆ - విజ్ఞాన సంపద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను
   సంతోషమును పరిశుద్ధత - నమాధానము నీతి శక్తియు
   విమోచన మాయెను యేసు

6. అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై - యున్నావు
   నీవు అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై - యున్నావు
   నీ పెదవులమీద పోయబడి - నిండి యున్నది దయారసము
   నిన్నాశీర్వదించెను తండ్రి

7. దివ్య రారాజై కుమారుడు - ఒక వెయ్యి వర్షాలు పాలించును
   మహా దివ్య రారాజై కుమారుడు - ఒక వెయ్యి వర్షాలు పాలించును
   అంతము లేని రాజ్యమేలును - ఎందరు జయంబు నొందుదురో
   అందరును పాలించెదరు
91 సాగిలపడి మ్రొక్కెదము సత్యముతోsaagilapadi mrokkedamu satyamuto

Hebrews 1:4

పల్లవి:
సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో (1)
ఆత్మలో మన ప్రభుయేసుని   - ఆ....ఆ....ఆ... - సాగిలపడి మ్రొక్కెదము  (1)

1. మోషే కంటె శ్రేష్ఠుడు - అన్ని - మోసములనుండి - విడిపించున్ (2)
   వేషధారులను - ద్వేషించున్ - ఆశతో - మ్రొక్కెదము (2)

2. అహరోను కంటె శ్రేష్ఠుడు - మన ఆరాధనకు పాత్రుండు
   ఆయనే ప్రధాన యాజకుడు - అందరము - మ్రొక్కెదము

3. ఆలయముకన్న శ్రేష్ఠుడు - నిజ - ఆలయముగా తానే యుండెన్
   ఆలయము మీరే యనెను - ఎల్లకాలము మ్రొక్కెదము

4. యోనా కంటె శ్రేష్ఠుడు - ప్రాణ - దానముగా తన్ను అర్పించెన్
   మానవులను విమోచించెన్ - ఘనపరచి మ్రొక్కెదము

5. సొలొమోను కన్న శ్రేష్ఠుడు - సర్వ - జ్ఞానమునకు ఆధారుండు
   పదివేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము

6. రాజుల కంటె శ్రేష్ఠుడు - యాజకులనుగా మనలను చేసెన్
   రారాజుగ త్వరలో వచ్చున్ రయముగను మ్రొక్కెదము

7. అందరిలో అతి శ్రేష్ఠుడు - మనకందరికీ తానే ప్రభువు
   హల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రొక్కెదము
92 యెహోవా మహోన్నతుడా మహిమయు నీదేyehovaa mahonnatudaa mahimayu neede

Psalms 150:6

పల్లవి:
యెహోవా మహోన్నతుడా - మహిమయు నీదే (2)
ఇహమందు రక్షకా - మహి మంచి దాతవు (2)

1. పాలకుడవు పరమందు - ఏలికవు యెల్లరికి (2)
   చాలినట్టి ప్రధానుండా - సకల యధికారులకును (2)
   రాజులరాజు - ప్రభువుల ప్రభువు (2)
   ధరపర లోకములకు - దేవుడ వీవే (2)
   ధన్యుండ నీకే - ఘనమైన మహిమ (2)

2. పరమును విడచితివి - ధర కేతెంచితివి
   ప్రాణమీవు బలిగానిచ్చి - మమ్మును రక్షించితివి
   తిరిగి లేచి మాకు - కరుణ జీవమిచ్చితివి
   విరివగు నీ ప్రేమ - నరులపై చూపితివి
   ధర నీదే ఘనతయని - చరణముల పడుదుము

3. సంఘమందు మహిమ నీకే - సకల యుగములకు
   యుగమందు ప్రతి జీవి - యెహోవా యనియనున్
   జగమంతటికి నీవు - నిజమైన ప్రభుడవు
   ఆదియంతమై నీవు - అలరారుచున్నావు
   యుగయుగములకు - ఘనమహిమ కలుగును
93 ఆశించుము ప్రభు యేసు పాదములనుaashinchumu prabhu yesu paadamulanu

Matthew 2:11

పల్లవి:
ఆశించుము ప్రభు - యేసు పాదములను (2)
వాసిగ పాపుల - కాశ్రయములవి (1)

1. యేసుని కీర్తిని - కొనియాడెదము (2)- యేసుని ప్రేమ - చాటించెదము (1)
   యేసుని కీర్తిని - కొనియాడెదము (2)- యేసుని ప్రేమ - చాటించెదము (1)
   యేసుని నామంబే - మన జయము (2)

2. యేసే ప్రేమ - యేసే రక్షణ - యేసే జ్యోతి - యేసే జీవం
   యేసు ప్రభువునకే - స్తుతియు మహిమ

3. సుజనుండేసుని - భజనలు చేసి - నిరతం బాయన - స్మరణము జేసి
   ధన్యుండేసే యని పాడుమా

4. సార్వత్రికము - తన సృష్టియే - తన వారికి - కృపానిధియే
   తన ప్రేమను - మరువగ బోకు

5. యేసు పాదముల - చేరి స్తుతించు - ఆత్మ ప్రాణ శరీ - రము నర్పించు
   యేసుని నీదు - ప్రభువుగా నెంచి
94 ప్రియయేసు ప్రియయేసు అతి ప్రియుడేసు పదివేలలోpriyayesu priyayesu ati priyudesu padivelalo

Songs of Solomon 5:10

పల్లవి:
ప్రియయేసు ప్రియయేసు - అతి ప్రియుడేసు పదివేలలో (1)
ఆయనే నా దిక్కుగా కెవ్వరు? (2)

1. ఇహమందు వేరేది - పేరే లేదు - ఆయనే నా కొసగె - ఆత్మానందం (2)
   నన్ను విమోచించి - నా కొసగె విడుదల
   ఆహా నా కందించె - నిత్య ముక్తి (2)

2. దైవపుత్రుండే - నా ప్రియుడు యేసు - ప్రాయశ్చిత్తుడైన - గొర్రెపిల్ల
   యిహమున కరిగెను - తన రక్తమిచ్చెను
   కల్వరిపై - ప్రాణమర్పించెను

3. సిలువలో వ్రేలాడి బలిగా నాయెన్ - విలువైన ప్రాణము - అప్పగించెన్
   నలుగగొట్టబడి - గాయముల నొంది
   తిరిగి లేచెను - నా ప్రియుడు యేసు
95 ఇదిగో నీ రాజు వచ్చుచుండెidigo nee raaju vachuchunde

Zechariah 9:9

పల్లవి:
ఇదిగో నీ రాజు వచ్చుచుండె - సీయోను కుమారి సంతోషించు (1)
యేరూషలేం కుమారి ఉల్లసించు (1)

1. నీదు రాజు నీతితో (2) - దోషమేమియు లేకయే (2)
   నీదు రాజు నీతితో (2) - దోషమేమియు లేకయే (2)

2. రక్షణ గలవాడుగా - అక్షయుండగు యేసుడు
   దీక్షతోడ యెరూషలేం - వచ్చుచుండె

3. సాత్వీకుండు యీ భువిన్ - అత్యంతమగు ప్రేమతో
   నిత్యరాజు నరులకై - వచ్చుచుండె

4. దీనపరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
   ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె

5. ఇలను గాడిద నెక్కియే - బాలుర స్తోత్రములతో
   బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె

6. దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
   జయ గీతములతో - వచ్చుచుండె

7. యేసుని ప్రేమించుచు - హోసన్నా పాడెదము
   యేసు డిల వచ్చుచుండె - హల్లెలూయా
96 శరణం, శరణం, శరణందేవాsharanam, sharanam, sharanandevaa

Songs of Solomon 5:16

పల్లవి:
శరణం, శరణం, శరణందేవా - కరుణనాథుడా (2)
కరుణనాథుడా - ఈ తరుణమే ప్రభో (2)

1. పాపరహిత దేవకుమారా - శాపవాహకా (2)
   శాపవాహకా - నిత్య కోప రహితుడా (2)

2. పరిపూర్ణ దేవుడా - నరావతారుడా
   నరావతారుడా - మాయేసునాథుడా

3. దయామయుండ క్రీస్తు యేసు - దాక్షిణ్య ప్రభువా
   దాక్షిణ్య ప్రభువా - బాహుళ్య దేవుడా

4. నమ్మదగిన లోక రక్షకా - సర్వోపకారుడా
   సర్వోపకారుడా - సర్వశక్తిమంతుడా

5. సాత్వికుండా - సర్వజనుల కాంక్షణీయుదా
   కాంక్షణీయుడా - వాత్సల్య దేవుడా

6. రిక్తుడై తగ్గించుకొనిన - వినయపూర్ణుడా
   వినయపూర్ణుడా - మముగాచు దేవుడా

7. సత్యవంతుడవు - మాదు నిత్యదేవుడా
   నిత్యదేవుడా -_ మా మంచి బోధకుడా

8. సర్వలోక సృష్టికర్త - సత్యదేవుడా
   సత్యదేవుడా - మా నిత్యజీవమా

9. ఎల్లరిలో శ్రేష్టుడా - మా వల్లభుండవు
   వల్లభుండవు హల్లెలూయ పాదెదం
97 సాగిలపడి ఆరాధించెదముsaagilapadi aaraadhinchedamu

Matthew 2:1

పల్లవి:
సాగిలపడి ఆరాధించెదము  -సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ (2)

1. దూతలు కనబడి గానము చేసిరి (2) - సతతము మహిమ సర్వోన్నతునికి (2)
   శాంతియు భువిలో పరిశుద్ధులకు (2) - పావనుడేసుని పూజించెదము (1)

2. గొల్లలు గాంచిరి ఘనకాపరిని - ఉల్లములెల్లను రంజిల్లగను
   ఎల్లరకు చాటిరి వల్లభుని - ఉల్లాసముతో కొనియాడెదము

3. జ్ఞానులు గనిరి ఘనమగు తారన్ - పూనికతో పయనము గావించి
   కానుకలిడి పూజించిరి రాజున్ - తనివి తీరగ ఘనపరచెదము

4. మరియ ప్రభుదయ విరివిగ బొంది - ప్రణుతించెను ప్రభు దర్శనమొంది
   పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు - మురియుచు మదిలో మ్రొక్కెద మిపుడే

5. సుమెయోను స్తుతియించె దేవుని - గమనించె ఘన రక్షణ నరులకు
   నిర్మల వెలుగు నిర్మల మహిమ - విమలుని మరి మరి స్తుతియించెదము

6. వివరించెనన్న విమోచకుని - విశ్వాసులకు పరిశుద్ధులకు
   దేవుని స్తుతియించుచు నీ భువిలో - పవిత్రుని బహు పూజించెదము

7. పూజనీయుడు ప్రభు యేసుక్రీస్తు - రాజులరాజు ప్రభువుల ప్రభువు
   రాజ్యము నిచ్చెన్ రాజుల జేసెను - విజయుడు యేసుని పూజించెదము
98 యేసు తృప్తి పరచితివిyesu trupti parachitivi

Psalms 107:9

పల్లవి:
యేసు తృప్తి పరచితివి - ఆశతో నీ చరణము చేర (2)
ఆశతో నీ చరణము చేర (4)

1. క్రీస్తు నీ ద్వారము చేరి - విస్తార దీవెన లొందితిని (2)
   నీదు అపార కృపచేత - నాదు హృదయము కడిగితివి (2)

2. నా జీవము విడిపించితివి - నీ జీవము సిలువ నిడితివి
   సైతానును ఓడించితివి - నా యెదలో వసియించితివి

3. నీ లక్షణములు ఆశ్చర్యం - అక్షయ మహిమను గాంచితిని
   రక్షణానందము నొంది - వీక్షించితిని నిను నిశ్చయమే

4. నీదు పాదము చేరిన నాడే - నాదు పాపము బాపితివే
   మది నుపకారాత్మను బొంది - పదిలముగా ప్రణుతించెద

5. నిన్ను నమ్మిన నీదు దాసుని - పెన్నుగ తన యురితెంపితివే
   ధన్య ధన్య అమరనివాసి - దర్శనమిచ్చి గాచితివే
99 పరమ పవిత్ర స్వర్గపితparama pavitra svargapita

1 Peter 1:3

పల్లవి:
పరమ పవిత్ర స్వర్గపిత (2)- జై ప్రభు జై ప్రభు - సర్వ సదా (2)
యుగయుగములకు - రక్షకుడా (2)
మమ్ములను రక్షించితివి (2) - జీవుండ ప్రభు పాపుల రక్షకా - జై ప్రభు (2)

1. ప్రేమరూపి నీవే - నన్ను ప్రేమించితివి (2)
   శ్రమలను పొందితివి - నీ ప్రేమ మూలమున (2)

2. ప్రాణమిడి సిలువన్ - నన్ను రక్షించితివి
   పాపము తీసితివి - నీ కృప ఉన్నతము

3. శత్రు సైతానున్ - ఓడించితివీవు
   నీ మరణము వలన - విమోచించితివి

4. శక్తిగలవాడా - చావున్ గెల్చితివి
   శక్తితో లేచితివి - తండ్రితో కలిపితివి

5. ప్రేమగల ప్రభువా - మరల వచ్చెదవు
   శ్రమలను తొలగించి - నను చేర్చుకొందువు

6. ప్రవాహములోన - ప్రభు నేనుండినను
   నిన్ను బట్టి నే - క్షేమముగా నుందున్

7. జై జై యని పాడుడి - యేసునకే మహిమ
   జై జై హల్లెలూయా - జై జై హల్లెలూయా
100 యేసు మధుర నామము పాడుడి ప్రభుyesu madhura naamamu paadudi prabhu

Songs of Solomon 1:3

పల్లవి:
యేసు మధుర నామము పాడుడి - ప్రభు
యేసు మధుర నామము పాడుడి

1. పరమును విడచి - ఇహమున కరిగెను (2)
   పాపుల కొరకై - రక్తము కార్చెను (2)
   పునరుత్థానుడై - రక్షణ నిచ్చె - పూర్ణముగా - ముగించె (1)

2. దుఃఖము నుండి మము - విడిపించెను
   శోకము రోగము లన్నియు - బాపెను
   ఆదరించెను నాదు - హృదయ వేదనలలో - అద్భుతమున్ - జరిగించె

3. లోక పాపములను - మోసెను ప్రభువు
   లోకము కొరకై గాయము లొందెను
   అధర్మ కార్యములకై - నలిగెను ప్రభువు - అర్పించు కొనెను

4. ప్రియులారా రండి - కలిసి పాడెదము
   ప్రియుడగు ప్రభువున్ - ఆరాధించెదము
   చరణములపై బడి - ఘనపరచెదము - చేరి భయభక్తితో
101 సర్వోన్నతుండగు దేవునిsarvonnatundagu devuni

Revelation 22:1-2 , Psalms 88:16, Isaiah 41:19

పల్లవి : సర్వోన్నత స్థలంబులో - దేవునికే మహిమ
సర్వాధికారి యేసుని సిలువచే కలిగెను

అనుపల్లవి : సర్వోన్నతుండగు దేవుని - సేవకులై యుండియు
సర్వోన్నతుని చిత్తంబున - సర్వదా స్తుతియించెదము
1. పరలోక యెరూషలేమున - పరిశుద్ధుల సంఘంబు
మురియుచు భర్త యేసుకై - అరుదెంచుచుండెను
పరిశుద్ధ పట్టణమందున - ప్రభు యేసు క్రీస్తుండు
ప్రకాశమానదీపమై - ప్రజ్వలించుచు నుండె
|| సర్వోన్నత ||

2. దేవుని సింహాసనమున - దేవుని మహిమలో
సువర్ణ కిరీటంబుల ధరించిన పెద్దల
జీవుల మధ్యనుండెను - దేవుని గొర్రెపిల్ల
ఘనత మహిమ ప్రభావము - యుగయుగములు ఆయనకే
|| సర్వోన్నత ||

3. స్ఫటికంబు బోలినట్టి మెరయు - జీవ జలనది
పట్టణపు వీధులలో - ప్రవహించుచుండెను
స్ఫటికంపు నది కిరుప్రక్కల - జీవ ఫలవృక్షంబు
స్వస్థత కలిగించును - వృక్షంపు యాకులు
|| సర్వోన్నత ||

4. బండలో నుండి నీటికాల్వల నిండుగ రప్పించెన్
మెండైన నదుల నీళ్ళను - దండిగ పారించెన్
బండైన క్రీస్తును చీల్చెను - ప్రభుదేవుండే మనకు
నిండార నింపు నాత్మను - తండ్రి విధేయులన్
|| సర్వోన్నత ||

5. మెట్టల స్థలమందున - నదుల పారజేతున్
ఊటల నెన్నో లోయల - నుబుకంగ జేతును
నీటిమడుగులుగా మార్చెద - నరణ్యము నంతటిని
నీటి బుగ్గలుగా చేతును - ఎండిన నేలను
|| సర్వోన్నత ||

6. దావీదు పట్టణమందున - దావీదు సంతతిలో
దేవుని సర్వశక్తితో - జన్మించె యేసుండు
దావీదు తాళము కలిగి - తన సింహాసనమందు
తావిచ్చి చేర్చుకొనును - జయించువారిని
|| సర్వోన్నత ||

7. సిల్వలో మరణించెను శ్రీ యేసు నా కొరకు
విలువైన రక్తము కార్చెను - మలినంబు బోగొట్టన్
బలుడైన ఆత్మ శక్తితో - గెలిచె సమాధిని
బలమిచ్చును పరిశుద్ధులకు - హల్లెలూయా పాడెదము
|| సర్వోన్నత ||
102 ప్రభుని స్మరించు ప్రభుని స్మరించుprabhuni smarinchu prabhuni smarinchu

Ephesians 2:4-7

పల్లవి:
ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు - ఓ మనసా! నా మనసా!

1. నీ ప్రేమ ధాటికి - సాటియే లేదు (2)- నీ మహిమే మేటి (3)

2. ప్రభూ నీ శరణాగతులగువారు - విడుదల నొందెదరు

3. పాపుల కొరకై - సిలువను మోసి - ప్రాణంబిడె నిలలో

4. మా ప్రభువా మా మొరనాలించి - నీ జ్ఞానంబిమ్ము
103 హర్షింతును - హర్షింతునుharshintunu - harshintunu

Habakkuk 3:17-19

పల్లవి:
హర్షింతును - హర్షింతును - నా రక్షణకర్త - నా దేవుని యందు (2)

1. అంజూరపు చెట్లు - పూయకుండినను - ద్రాక్ష చెట్లు - ఫలింపకున్నను (2)

2. ఒలీవ చెట్లు - కాపు లేకున్నను - చేనిలోని పైరు - పండకున్నను

3. దొడ్డిలో - గొర్రెలు లేకపోయినను - సాలలో పశువులు లేకపోయినను

4. లేడి కాళ్ళవలె నా కాళ్ళను జేసి - ఉన్నత స్థలముల - మీద నడుపున్

5. నా కోట నా బలము - నా యెహోవా
   నీ యందు నిత్యం - నే హర్షింతున్
104 నా ప్రాణ ప్రియుడా యేసురాజాnaa praana priyudaa yesuraajaa

Isaiah 9:6

పల్లవి:
నా ప్రాణ ప్రియుడా యేసురాజా- అర్పింతును నా హృదయార్పణ (1)
విరిగి నలిగిన ఆత్మతోను - హృదయపూర్వక ఆరాధనతో - సత్యముగా (1)

1. అధ్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా (2)
   బలవంతుడా బహు ప్రియుడా
   మనోహరుడా మహిమరాజా – స్తుతించెదన్(1)

2. విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో
   నమస్కరించి ఆరాధింతున్
   హర్షింతును నే పాడెదను నా ప్రభువా

3. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా
   మరచిన గాని నీవెన్నడు
   మరువవు విడివవు ఎడబాయవు - కరుణారాజా

4. రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహారమున్
   రక్షకుడా నా కొసగితివి
   దీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును

5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును
   కృతజ్ఞతా స్తుతుల తోడ
   నీ ప్రేమను నే వివరింతును - విమోచకుడా

6. వాగ్దానముల్ నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే
   పాడెదను ప్రహర్షింతును
   హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ
105 దేవదేవుని కొనియాడెదముdevadevuni koniyaadedamu

Psalms 136:2

పల్లవి:
దేవదేవుని కొనియాడెదము - అవిరత త్రియేకుని స్తోత్రింతుము (1)

అను పల్లవి:
ఏపుగా దయాళుని పొగడెదము - పాప పరిహారుని పాడెదము (1) || దేవ ||

1. దూతలు స్తుతించు మహోన్నతుడు - కన్య మరియ యందు జన్మించెను (1)
   మహియందు చీకటి పోగొట్టి - ఇహపర సుఖముల దయచేసెను (1)

2. పాపశాపమును తీర్చను - పాట్లు పడెను దేవ గొఱ్ఱె పిల్ల
   హా! మంచి గొఱ్ఱెల బోయడే - ప్రాణము నిచ్చెను మనకై

3. పాపముల కడిగి రక్షించెను - కృపనిచ్చె వేచియుండుటకై
   వైరిని జయింపను శక్తినిచ్చెను - నరులకు భాగ్యము నందించెను

4. ఆకాశము నుండి దిగి వచ్చును - లోకమున్ న్యాయము తీర్చుట
   ఆయత్తముగ కాచియుండెదము - పాయక వివేక కన్యల వలె

5. తన స్వరూపము నే దాల్చను - ఆయనే నా రూపము దాల్చెన్
   దాసుడనగు నన్ను రక్షింపన్ - యేసు నరరూపము దాల్చెన్

6. పాతాళ లోకము కూల్చవచ్చెన్ - జాతి యడ్డుగోడ పడగొట్టెను
   నిత్య జీవంబు నియ్యను వచ్చెను - నీతి సూర్యుడు ప్రభు యేసువే

7. హల్లెలూయ పాడి ఆర్భటింతుము - హర్షముతో యేసున్ చాటెదము
   బలుడైన తండ్రిని కీర్తింతుము - విలువ శుద్ధాత్మను శ్లాఘింతుము
106 మధుర మధురము యేసు నామంmadhura madhuramu yesu naamam

Songs of Solomon 1:2

పల్లవి:
మధుర మధురము యేసు నామం (2)
స్తుతికి యోగ్యము ప్రభుని నామం    (2)
మధుర మధురము యేసు నామం - మధుర మేసుని నామం

1. స్వర్గము వీడి - జగమున కరిగి - సిలువలో రక్తము – చిందించెను (2)

2. సిలువపై సైతానును ఓడించి - తొలగించెను నరక శిక్షను

3. పాపులకు విమోచన మొసగి - నేర్పుగ తండ్రితో నైక్యము చేసెన్

4. రక్తముచే మమ్ము శుద్ధుల జేసెన్ - దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్

5. ఆత్మలో వారసులుగ మమ్ము జేసెన్ - దేవుని మందిరముగ నిర్మించెన్
107 పరిశుద్ధ ప్రభు యేసుparishuddha prabhu yesu

John 20:28

పల్లవి:
పరిశుద్ధ ప్రభు యేసు - స్తుతి స్తోత్రం (1)
నన్ను రక్షించినట్టి - నా ప్రభువా  (1)

1. గొప్ప దేవుడవని - నే నెరిగితిని (2)
   తప్పకుండ నీ నామము – స్మరియింతును (2)

2. తండ్రి వైతివి నీవు – పరమునందు - దండి ప్రియుడవు నీవు - నా రక్షకా

3. బహు విశ్వాస హీనుడ - నగు నాకు - మహా ప్రభువై నన్నున్ - మోసెదవా!

4. సజీవుడవైన – విమోచకుడా - ఉజ్జీవము నొసగి – లేపితివే

5. మంచి కాపరి నీవే - మా యేసు ప్రభూ - కొంచెమైనను కొదువ – లేదికన

6. పరలోక ప్రధాన – యాజకుడా - ఏ రీతిగా నిను నే పూజింతును?

7. పరలోకములో నుండి – వరుడేసు - అరుదెంచు నాకై – హల్లెలూయ
108 జై జై జై జై రాజుల రాజాjai jai jai jai raajula raajaa

2 Cor 8:9

పల్లవి:
జై జై జై జై రాజుల రాజా (2)
పాత్రుడ వీవే మా ప్రభు వీవే (2)   -  జై జై జై జై రాజుల రాజా (2)

1. అన్ని కాలములలో నీ నామము - మహోన్నతము మహోన్నతుడా (2)
   వాగ్దానము నెరవేర్చిన దేవా (2) - మాట తప్పని మహోపకారి (1)

2. దూతల మాదిరి గీతముల్ పాడుచు - సతతము నిన్నే స్తోత్రించెదము
   గొల్లలు గాంచిన ఘన కాపరి - మా ఉల్లము నందు ఉల్లసించెదము

3. తూర్పున తారను గాంచిన జ్ఞానులు - రాజుల రాజ నీవే యనుచు
   బంగారము సాంబ్రాణి బోళమును - అర్పించి ఆరాధించిరిగా

4. ధనవంతుడవగు ఓ మా ప్రభువా - ధనహీనునిగా నైతివి మాకై
   మా దారిద్ర్యము తీసివేయ - నరరూపమున జన్మించితివి

5. యేసు ప్రభుండా రక్తము కార్చి - ఎంచి మమ్ము విమోచించితివి
   ఎంచలేను నీ మేలుల నెపుడు - ఎన్నదగిన మా దేవుడ నీవే

6. మాకై సిలువలో మరణించితివి - మరణపు ముల్లును విరచిన ప్రభువా
   యుగయుగములకు నీకే మహిమ - నిరతము స్తోత్రము హల్లెలూయ
109 యెహోవాకు పాడుడి పాటన్yehovaaku paadudi paatan

Isaiah 12:5

పల్లవి:
యెహోవాకు పాడుడి పాటన్
అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని (2)
చేసిన వాడని - శ్రేష్ఠ కార్యములను (1)
చేసిన వాడని (2)

1. భూమియందంతట ప్రచురము చేయుడి (2)
   ఆటంకము లేక దీని ప్రకటించుడి (2) - దీని ప్రకటించుడి (2)

2. సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు
   అతి ఘనుండై నీ మధ్య - వసియించు చున్నాడు - వసియించు చున్నాడు

3. యెహొవా మన నీతి ఋజువు చేసెనని
   సీయోనులో క్రియలను వివరించెదము రండి - వివరించెదము రండి

4. శూన్య పట్టణములు నిండినందువలన
   యెహోవా నేనేయని వారు గ్రహించెదరు - వారు గ్రహించెదరు

5. యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలె
   నింపెద మనుజులతో వారి పట్టణములను -వారి పట్టణములను

6. మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరు
   నీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు - దప్పి తీర్చుకొందురు
110 యేసునాథా త్రిలోకనాథాyesunaathaa trilokanaathaa

Psalms 34:1

1. యేసునాథా త్రిలోకనాథా - లోకోద్ధారక క్రీస్తు దేవా (2)
   చక్కగ దాసుల బ్రోచి రక్షించుము (2)

2. అబ్దిమీద నడచిన దేవా - ఐదు రొట్టెల నైదువేలకు
   నతిశయముగను పంచిన దేవా

3. కానా లోని వివాహ విందున - నీళ్ళను ద్రాక్షరసముగ మార్చిన
   కరుణానిథీ నను ప్రేమించు నిత్యము

4. నాథా నాదు గతియు నీవే - పాదారవింద శరణమిమ్ము
   ఆధారమీవే దీనోపకారా

5. కృపాసముద్ర దయామయుండా - తలను ముండ్ల మకుటధారివై
   సిలువయందు మరణించితివి

6. నీదు రాజ్యము వచ్చునుగాక - సాధుగ మోక్షసౌఖ్యము చేర
   నీదు దాసుల నాశీర్వదించుము
111 సర్వశక్తుడు నాకు సర్వమాయనేsarvashaktudu naaku sarvamaayane

Colossians 3:11

పల్లవి:
సర్వశక్తుడు నాకు – సర్వమాయనే (2)
సర్వమాయనే - నాకు సమస్తమాయనే   (2)

1. మార్గ సత్యజీవంబు - యేసునాథుడే (2)
   మార్గమాయనే - ఏకమార్గమాయనే (2)

2. జీవాహారము జీవపానమునాయనే
   జలము నాయనే - శాంతజలమాయనే

3. ఆదియంతము అల్ఫా ఓమేగాయనే
   ఓమేగాయనే - ఏకసుతుడాయనే

4. రక్షణ పరిశుద్ధత నీతియాయనే
   నీతియాయనే - దేవ నీతి యాయనే

5. పునరుత్థానము నిత్య జీవమాయనే
   జీవమాయనే - నిత్య జీవమాయనే

6. హల్లెలూయకు సర్వపాత్రుడాయనే
   పాత్రుడాయనే - ఆశ్రయ దుర్గమాయనే
112 ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాముprabho needu mahimanu paadi ninu stutinchuchunnaamu

Psalms 95:2

పల్లవి:
ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము (2)

1. మాదు హృదయ కానుకలను (2) - సమర్పించుచున్నాము (2)

2. యేసు సుందర శీలము గల్గి - నీ సన్నిధి కేతెంచితిమి

3. నీ దివ్య వాక్య బలముచే - నూతన జీవము నొందితిమి

4. నీ వాక్యము నే చాటించుటకు - నొసగుము సోదర ప్రేమను
113 ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయముo yesu nee prema ento mahaaneeyamu

John 15:13

పల్లవి:
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము (1)
ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది  - ఓ యేసు నీ ప్రేమ...

1. అగమ్య ఆనందమే - హృదయము నిండెను
   ప్రభుని కార్యములు గంభీరమైనవి (2)
   ప్రతిఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2) - స్తుతికి...

2. సంకట సమయములో - సాగలేకున్నాము
   దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా
   వింటినంటివి నా మొరకు ముందే తోడనుందు నంటివి - తోడ...

3. మరణాంధ కారంపు లోయ నే సంచరించిన
   నిరంతరమేసు నాదు కాపరియై
   కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు -కరుణ....

4. కొదువ లెన్నియున్న భయపడను నే నెపుడు
   పచ్చిక బయలులో పరుండ జేయును
   భోజన జలములతో తృప్తిపరచుచు - నాతో నుండు నేసు - నాతో.....

5. దేవుని గృహములో సదా స్తుతించెదను
   నంపూర్ణ హృదయముతో సదా భజించెదను
   స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయ ఆమెన్ - హల్లె...
114 ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ముo premagala yesu preminchinaavu mammu

Revelation 1:6

పల్లవి:
ఓ ప్రేమగల యేసు - ప్రేమించినావు మమ్ము
స్మరించుచు స్తుతింతున్ - రక్షణ నిచ్చినావు (2)

1. అద్భుత యాగమందు - అందరికై బలియై (2)
   అందరి పాపములకు - ప్రాయశ్చిత్తమైతివి (2)

2. దాసులమై మేముండ - మోషేను పంపితివి
   చేసితివి స్వతంత్రులుగా - నీ బాహుబలము తోడ

3. క్షమాపణానందముతో - సాగింపచేసి మమ్ము
   యాత్రలో మాకు తోడై - విజయము నిచ్చితివి

4. ఎడారి అడవిలోన ఊటల నదులు నడిపి
   ఎండిన నేలనంత - పచ్చిక బయలు చేసెన్

5. బాబెలు నుండి మమ్ము - విడిపించితివి నీవు
   బంధకముల తెంచి - తప్పు బోధ బాపినావు

6. సహవాసమిచ్చి సంఘ - అంగముల జేసినావు
   సాక్షులను చేసి మమ్ము - శత్రువుల సిగ్గుపరచె

7. మహా ప్రేమ గల యేసు - మాకై చేసితివన్ని
   ఘనపరతు హల్లెలూయ - ఈ గొప్ప రక్షణ కొరకు
115 హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడిhallelooya paadudi - hallelooya paadudi

Revelation 19:1

పల్లవి:
హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి  (1)
హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి (1)
హల్లెలూయ  హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి  (1)

1. క్రీస్తు మనకు రక్షణ నొసగెన్ విడిపించె మనల తనదు రక్తముతో (2)
   గొప్పదైన నిజమైన అద్భుత రక్షణ యిదే (1)
   అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి (1)

2. మహిమ దర్శన మనుగ్రహించె పరమ వైభవమును చూపించె
   మహిమ ఘనత స్తుతి ప్రభావములన్నియు ఆయనవే
   అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి

3. ఘనపరచుడి సజీవ క్రీస్తున్ జీవితములో జూపుడాయనన్
   ధనికులుగ మనలను ప్రేమతో తానే జేసెన్
   అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి

4. నిత్యమగు తన శక్తితో కాయున్ ప్రభు శరణు జొచ్చిన వారిన్
   అధిక జయం సాహసమున్ అన్నియు మనవాయెన్
   అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి

5. ఏమి వచ్చినన్ జీవితయాత్రలో - ఆమెన్ యనుచు సహించెదము
   శ్రమలలోనే శాంతి యుండున్ - అద్భుత యానందము
   అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి

6. దేవునికి భయపడు వారలారా చిన్నలైన మీరు పెద్దలైనను
   ఆయనకే యుగములందు స్తుతి చెల్లును గాకని
   మీరందరు పాడుడి - హల్లెలూయ పాడుడి
116 నేనే ఉన్నవాడననినnene unnavaadananina

Revelation 1:13

పల్లవి : నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు (2)

1. అల్ఫాయు ఓమేగ వర్తమాన - భూత భవిష్యత్తులో నున్నవాడా
నా సర్వము నిర్వహించువాడా - సర్వాధికారి నిన్నే స్తుతించి
అర్పింతు నీకే నా ఆరాధన
|| నేనే ||

2. ఏడు సువర్ణ దీపస్తంభముల - మధ్య సంచరించుచున్నవాడా
శుద్దీకరించితివి నన్ను - మేలిమిగ మార్చి సంఘమున
చేర్చితివి నిన్నే ఆరాధింతు
|| నేనే ||

3. తెల్లని ఉన్నిని పోలియున్న - వెంట్రుకలు కలిగి యున్నవాడా
ఆలోచనకర్త నీవే నాకు - జ్ఞానమైతివి అసమానుండ
అర్పింతు నీకే నా ఆరాధన
|| నేనే ||

4. సూర్యుని వంటి ముఖము కలిగి - అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగి
దృష్టించితివి నా హృదయమున్ - దహించితివి దుష్టత్వము
ప్రేమగల ప్రభూ నిన్నారాధింతు
|| నేనే ||

5. అపరంజిని పోలిన పాదములు - కలవాడా తీర్పు తీర్చితివి
పాపము లోకములనిల - దుష్ట సాతానున్ సిలువలో గెలిచి
విజయ మిచ్చినందుల కారాధింతున్
|| నేనే ||

6. నీ నోటినుండి బయలువెడలె - రెండంచులు గల వాడి ఖడ్గము
అదియే పాత ఆదామును చంపె - నశింప చేసె నా శత్రుబలమున్
అర్పింతు నీకే నా ఆరాధన
|| నేనే ||

7. ఏడు నక్షత్రములు పట్టుకొనిన - మొదటివాడా కడపటివాడా
సర్వ సంపూర్ణత నాకిచ్చితివి - అపాయములలో ఆదుకొనుచున్న
ఆమేన్ అనువాడా హల్లెలూయ
|| నేనే ||
117 వందనమో వందన మేసయ్యాvandanamo vandana mesayyaa

Jude 1:25

పల్లవి:
వందనమో వందన మేసయ్యా (2)
అందుకొనుము మా దేవా -  మాదు - వందన మందుకొనుమయా (1)

1. ధరకేతించి ధరియించితివా - నరరూపమును నరలోకములో (2)
   మరణము నొంది మరిలేచిన మా (2)
   మారని మహిమ రాజా - నీకిదే వందన మందుకొనుమయా

2. పాపిని జూచి ప్రేమను జూపి - కరుణా కరముచే కల్వరి కడకు
   నడిపించి కడు ప్రేమతో కడిగి
   కన్నీటిని తుడిచిన నీ - ప్రేమకు సాటియే లేదిలలోన

3. ఉదయించితివా నన్నుద్ధరింప - ధరియించితివా దారుణ మరణము
   దయతలచి దరిద్రుని పిలిచి
   దారిని చూపిన దాతా - దేవా హృదయార్పణ నర్పింతు

4. అనాధుండను నా నాథుండా - అండవై నాకు బండగ నుండు
   అంధుడ నేను నా డెందమున
   నుండి నడిపించు - క్రీస్తుండా స్తుతిపాత్రుండ - స్తుతించు

5. జగమును వీడి పరమున కరిగి - పరిశుద్ధాత్మను వరమును విరివిగ
   నరులపై వరదా ధరలో పోసి
   దురిత దూరుడ రావా - రాజా నీకిదే నా స్తుతియాగం

6. పరమునుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో
   ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు
   అక్షయ దేహము తక్షణమిచ్చు - క్షితినిన్ చేరి స్తుతింతు

7. స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడ - వర్ణనాతీతుడా ధవళవర్ణుడా
   రత్నవర్ణుడ రిక్తుడవైతివి
   ముక్తినిచ్చిన దాతా - నీకిదే వందనమందుకొనుమయా
118 అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకైarpintu stutul nee siluvalona joopina nee premakai

Isaiah 53:4

పల్లవి:
అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై (1)
మరణమొంది సమాధి నుండి మరల లేచితివి (2)

1. తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడి (2)
   బలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా (2)

2. నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటం
   నీ మరణమే నా జీవమాయె నీ ప్రేమ గొప్పదెంతో

3. నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదు
   ఆనంద బాష్పములతోనే స్తుతింతు - ఈ ధనము నా కొరకే

4. నీ సిలువలో తొలగె నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్
   నీ సింహాసనము నాలోన యుంచుము నిన్ను నే స్తుతింతును
119 సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్santoshame santoshame santoshamuto stutinchedan

Luke 12:32

పల్లవి:
సంతోషమే సంతోషమే - సంతోషముతో స్తుతించెదన్
క్రీస్తు యేసు రక్షించినన్ - చేర్చెను తన మందలో (1)

1. ఘోర దుర్మార్గుడనై - దారితప్పి యుండగా (2)
   భూరి దయతో కాపరి యేసు - దారికి నడిపెను (2)

2. అక్షయమైనదియు - నిర్మలమైనదియు
   రక్షకుడేసు వాడబారని స్వాస్థ్యము నా కిచ్చును

3. భయమేమి లేదికను - ప్రభు చిన్న మందకు
   దయ కృపతో రాజ్యమివ్వ - తండ్రికిష్టమాయెన్

4. మంటి పురుగునకు - మింట రాజ్యమివ్వ
   మింటనుండి మంటి కేతెంచి - మరణ మొందె నేసు

5. దేవా నీ తలంపులు - నాకు ప్రియమైనవి
   శోధింప నెంతో అశక్యములు - అగమ్యములు

6. నిజకుమారుడేసున్ - మన కనుగ్రహించెను
   రాజ్యముతో బాటు సమస్తము నివ్వ - వెనుదీయునా?

7. మహిమ రాజ్యమునకు - మిమ్మును పిలుచుచున్న
   మహిమ రాజుకు తగినట్టుగా మీరు - నడుచుకొనుడి

8. రాజాధిరాజు యేసే - ప్రభుల ప్రభు యేసే
   పరమందు దూతలు - యిహమందు నరులు హల్లెలూయ పాడుడి
120 రాత్రింబవళ్లు పాడెదనుRaatrimbavallu paadedanu

Luke 12:32

పల్లవి:
రాత్రింబవళ్లు పాడెదను  - యేసు నామం - క్రీస్తు నామం  (2)

1. పురుగు వంటి నరుడ నాకు - ప్రభువు రాజ్య మియ్యదలచి (2)
   పరమునుండి ధరకేతెంచి (2) - ప్రాణమున్ బలిగా నిచ్చె (2)

2. ఎన్నిక లేని చిన్నమంద -భయపడకు నీవిలన్
   ఘనమైన పరమతండ్రి - రాజ్యమివ్వ నిష్టపడెన్

3. పాప కూపమునందు నేను - పడి చెడి యుండ
   గొప్ప రక్షణ నిచ్చి పరమ - రాజ్యమందు చేర్చెను

4. నీతి హీనుడనైన నాకు - నీతి రాజ్యమివ్వదలచి
   నీతి రక్షణ వస్త్రములను - ప్రీతి తోడ తొడిగెను

5. పేరుపెట్టి పిలచినన్ను - పరమ రాజ్యమును తండ్రి"
   వారసునిగా నన్ను జేసి - వైరినిల సిగ్గుపరచెన్

6. పరమునందు దూతలు - వింత పొందునట్లుగా
   ఏర్పరచుకొంటివి నరుని - నరుడు ఏపాటి వాడు?

7. దానియేలు షద్రక్ మేషాక్ - అబెద్నెగో యనువారలన్
   చిన్నమందగాను జేసి - రాజ్యమేల జేసెన్

8. ఎన్ని శ్రమలు వచ్చినను - సన్నుతింతు నా ప్రభున్
   ఘనత మహిమ కర్హుడని - హల్లెలూయ పాడెదన్
121 శాంతిదాయక యేసు ప్రభూshaantidaayaka yesu prabhoo

Songs of Solomon 5:10

పల్లవి:
శాంతిదాయక యేసు ప్రభూ - శాంతిదాయక యేసు శాంతిదాయక

1. ధవళవర్ణుడ రత్న వర్ణుడ - మహిమపూర్ణుడ మనోహరుడా (2)
   నిత్య రాజ్య మహిమకు పిల్చిన (2) సత్యముగ నిన్ను పూజించెదము (2)

2. పరజనులను పరదేశులను - పరిశుద్ధులతో నైక్యపరచి
   పరలోక పౌరులుగా మార్చి - పరలోక పిలుపుకు లోబర్చిన

3. సువార్తతో మమ్ము పిలిచితివి - సువార్తికులుగ చేసితివి
   రిక్తులకు మహదైశ్వర్య మిచ్చి - శక్తితో వారసులుగ చేసిన

4. ఆదియం దేర్పరచు కొంటివి - ఏవి నీచమో ఏవి ఘనమో
   గురుతుపట్టి ఎరుగ మంటివి - నోరుగ జేతునను వాగ్దానము

5. స్వర్ణమయుడా కాంక్షణీయుడా - పదివేలలో గుర్తింప యోగ్యుడా"
   బోధింప నేర్పు శుద్ధాత్ముని - శోధింపలేని ఐశ్వర్యము నిచ్చె

6. అక్షయ జీవమిచ్చిన రక్షక - పరీక్షలో నిల్చు నిరీక్షణలో
   అక్షయ దేహ మిచ్చెదవని - ప్రత్యక్షతకై వేచియుండెదము

7. సర్వ కృపానిధి సర్వేశ్వరా - సర్వము స్వతంత్రించుకొన
   ఉర్వియందు విజయములే యని - సర్వోన్నతుడు నుడివెను

8. పరలోకానంద పరిపూర్ణుడా - సకలాశీర్వాద సంయుతుడా
   మహిమ ఘనత ప్రభావంబులు - నీవే యని ప్రహర్షించెదము
122 హృదయ మర్పించెదము ప్రభునకుhrudaya marpinchedamu prabhunaku

Romans 12:1

పల్లవి:
హృదయ మర్పించెదము ప్రభునకు - స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి (2)

1. పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్ (2)
   పాపుల పాపము తొలగించుటకు (2)- నిత్యజీవము నిచ్చెన్ (1)

2. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై
   రక్షణ ద్వారము తెరచెను ప్రభువు - నిత్య నిరీక్షణ నిచ్చెన్

3. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే
   తిరిగి వెళ్ళకు పాపమునకు - నిలువకు పాపములో

4. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
   కాపాడు మా జీవితముల - ఇదియే మా వినతి
123 ఆనంద మానంద మానందమే ఆనంద మానందమేaananda maananda maanandame aananda maanandame

Acts 3:8

పల్లవి:
ఆనంద మానంద మానందమే - ఆనంద మానందమే

1. నా ప్రియ యేసు - గొప్ప రక్షణనివ్వ సిలువలో బలియాయెన్ (2)

2. నా ప్రియ యేసు - పాప పడకనుండి నన్ను పైకి లేపెను

3. నా ప్రియ యేసు - తన రక్తములో ప్రేమతో నను కడిగెను

4. నా ప్రియ యేసు - బాప్తిస్మమున నన్నైక్యపరచెను

5. నా ప్రియ యేసు - నీతి వస్త్రము నాకు ప్రీతితో తొడిగెను

6. నా ప్రియ యేసు - గొప్ప రక్షణను నిర్లక్షించెదనా?

7. నా ప్రియ యేసు - స్తుతిపాత్రుండని హల్లెలూయా పాడెదను
124 జై ప్రభు యేసు జై ఘన దేవాjai prabhu yesu jai ghana devaa

1 Cor 15:54

పల్లవి:
జై ప్రభు యేసు - జై ఘన దేవా -
జై ప్రభు జై జై రాజా - జై ప్రభు జై జై రాజా (2)

1. పాపకూపములో - పడి చెడి యుండగా - గొప్ప రక్షణ నిచ్చి - దరి చేర్చిన (2)

2. విలువైన రక్తము - సిలువలో కార్చి - కలుషాత్ముని - నీవు - కడిగితివే

3. నా శైలమై యేసు - నన్నావరింపగా - యే శోధనైన గెల్చునా?

4. కడు భీకరమగు - తుఫానులలో - విడువక జయముగా - నడుపుచున్న

5. పసితనము నుండి - ముదిమి వరకు - విసుగక ఎత్తు - కొను రక్షకా

6. సమృద్ధుడు యేసు - సహాయుడాయే - ఓ మృత్యువా! నీ ముల్లెక్కడ

7. సమాధి గెలిచిన విజయుడుండగ - సమాధి! నీకు జయమగునా?
125 ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యముprabhuvaa nee goppatanamu stutiki yogyamu

Psalms 145:3

పల్లవి : ప్రభువా నీ గొప్పతనము - స్తుతికి యోగ్యము
అశక్యమైనది - వర్ణించలేమిల
1. సృష్టి గొప్పది అద్భుతమేగా - సంకల్పమెంతో వుత్తమము
మానవజాతి కొరకై ప్రభూ - సిద్దపరచె సమస్తము
నీదు పనులు నీ సామర్ధ్యము వర్ణించలేమిల
|| ప్రభువా ||

2. నీ రూపమున నరుని సృజించి - అధికారము నిచ్చితివి
క్రీస్తునందు నిర్దోషినిగా - నిలువబెట్ట గోరితివి
నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిల
|| ప్రభువా ||

3. సృష్టిని చేసిన శక్తికంటె - పాపికి రక్షణ గొప్పది
నీ యొద్ద నున్న సర్వమిచ్చి - విలువగు ముత్యము కొన్నావు
నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిల
|| ప్రభువా ||

4. నీకు మానవుడమూల్యము - నీవు ప్రేమించుచున్నావు
అందుకే నీ ప్రాణమర్పించి - రక్తము కార్చి రక్షించితివి
నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిల
|| ప్రభువా ||

5. అద్భుతమైన నూతన సృష్టి - మానవునికి నిచ్చితివి
రాజులనుగ యాజకులుగ వారసులుగను చేసితివి
నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిల
|| ప్రభువా ||

6. ఉల్లాసముతో సృష్టి మైమరచే - అద్భుత కార్యములను చూచి
సంతోషించి ఆరాధించిరి - నీవే సర్వమని చెప్పిరి
నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిల
|| ప్రభువా ||
126 వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడుvandanamu nimmu prabhu yesunaku jai jai yanipaadu

Revelation 4:11

పల్లవి:
వందనము నిమ్ము (2) - ప్రభు యేసునకు (2)
జై జై యనిపాడు (2) - వందనము నిమ్ము (1)

1. నా జీవితపు ప్రముఖుడు ప్రభువే (2)- నన్నేలెడు ప్రభు నా రాజాయనే (2)
   యుగుయుగ మహిమ ప్రభువునకే (2)
   పాడుచుండెదను - భజియించెదను జయధ్వనుల జేతున్ (2)

2. నా ఆదర్శము మహిమయు తానే - తన యధికారము సర్వము నేలును
   తన నామము బహు అద్భుతము

3. యెహోవా బహుస్తుతికి యోగ్యుడు - భక్తుల స్మరణ నీతియు నాయనే
   మహాప్రభావము గలవాడు

4. బుద్దియు బలము జ్ఞానము ప్రభువే - తన నీతి బహు ఉన్నతమైనది
   సైన్యముల కధిపతి నా తోడు
127 ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకేo naa hrudayamaa paadumaa krotta geetam prabhunake

Psalms 30:11

పల్లవి:
ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే (1)
యెంతో ఆనందం వర్ణింపజాల (2) -  యెంతో ప్రభువు ప్రేమ (1)
హృదయమా పాడుమా (1)

1. క్రీస్తునందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమది (2)
   భూమి పునాది వేయక మునుపే - ఏర్పరచుకొనెను (1)
   హృదయమా పాడుమా (1)

2. క్రీస్తునందు నన్ను క్షమించి - రక్తము కార్చి కడిగెను నన్ను
   విడిపించి నన్ను నీతిగా తీర్చి - పవిత్ర పరచెను
   హృదయమా పాడుమా

3. క్రీస్తులో నన్ను దరికి పిల్చి - చేర్చి క్రొత్త వ్యక్తిగ జేయ
   కూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ - కోరి చేరియుండెను
   హృదయమా పాడుమా

4. క్రీస్తులోయున్న యే శిక్షలేదు - స్వాతంత్ర్యము క్రీస్తునందే
   క్రీస్తే పరమున కూర్చుండబెట్టి - క్రొత్త సృష్టిగ జేసె
   హృదయమా పాడుమా

5. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం - శాంతి ఆనందం దొరికెను మనకు
   క్రీస్తు మహిమ జయమునకై పిలిచె - హల్లెలూయ పాటను
   హృదయమా పాడుమా
128 దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడdevaa nee talampulu amoolyamainavi naa yeda

Psalms 139:17

పల్లవి:
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ (1)
నా యెడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది (1) -  దేవా నీ తలంపులు (1)

1. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే - స్తుతి పాడెద హృదయముతో (2)
   స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2)- నీవే నా రక్షకుడవని (1)

2. మొదట నిన్ను యెరుగనైతిని - మొదటే నన్ను యెరిగితివి
   వెదుకలేదు ప్రభువా నేను - వెదకితివి యీ పాపిని

3. మరణమగు వూబిలో నుంటిని - కరుణ నిలిచె నన్ను రక్షింప
   మరణము నుండి రక్షింప నన్ - నా ప్రభు బలియాయెను

4. పాపలోకములో మునిగి యుంటిని - పాప శిక్షకు పాత్రుడను
   యేసు ప్రభు సిలువ సహించెను - నాకు నూతన జీవ మొసగ

5. అద్భుతమైనది సిలువ దృశ్యం - ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి
   ప్రభును వర్ణింప నశక్యము - ప్రభువే సహించె దుఃఖము

6. యెట్లు మౌనముగా నుందు ప్రభూ - చెల్లింపక స్తోత్ర గీతము
   కాలమంతా పాడుచుండెద - నీ ప్రేమ అపారమైనది
129 స్తుతులకు పాత్రుండవుstutulaku paatrundavu

Exodus 3:4

పల్లవి:
స్తుతులకు పాత్రుండవు (2) - సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు (2)

1. జీవపు రొట్టె వైతివి నీవే - తృప్తిపరచిన ప్రియుడవు నీవే (2)
   గొప్ప కార్యము చేయ (2)- మా సామర్ధ్యము నీవే ..ఆ ...ఆ ..ఆ (2)

2. లోకమునకు వెలుగు నీవేగా - మా నేత్రముల తెరచితివిగా
   అద్భుతము చేసితివి - మా ప్రకాశము నీవే

3. ఏకైక ద్వారం మాకిల నీవే - ప్రవేశమిచ్చి రక్షించినావు
   పూర్ణ క్రియ చేసితివి - సంపూర్ణ శాంతి నీవే

4. మంచికాపరి మాకై నీవిల - ప్రాణంబు నిచ్చి రక్షించితివి
   విడుదల చేసితివి - గొఱ్ఱెల నడిపెదవు

5. పునరుత్థాన జీవంబు నీవే - మరణము నుండి దాటించితివి
   విజయంబు నిచ్చితివి - నూతన పరచితివి

6. మార్గ సత్యము మాకిల నీవే - దుర్బోధ నుండి కాపాడినావు
   చేసితివి ఆత్మకార్యం - ఉన్నత స్థలమందుంచి

7. నిజమైన ద్రాక్షవల్లివి నీవే - నీ యందు నిలిచే తీగెలు మేము
   లోతైన క్రియ చేసి - ఆత్మ ఫలమిచ్చితివి
130 యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువుyesu kreestu prabhuvaayane andariki prabhuvu

1 Timothy 1:15

పల్లవి:
యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు (1)
పశువుల పాకన్ పరుండెను తానే దేవుడై యుండి (2)

1. నరులన్ గావన్ శ్రమల బొందెన్ క్రీస్తు ప్రభువు (2)
   తిరిగెన్ భువిన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటనుండన్ (2)

2. నిత్యజీవం నిత్య శాంతి నిండు నెమ్మది
   నిత్యుండేసు మనకు నివ్వ మృత్యువున్ గెల్చెను

3. భీతిన్ గొలుపు అలలు పైకి లేచినంతనే
   భీతిన్ విడచి యేసు వైపు చూడు నిమ్మళించును

4. మరణమేలు లోయలందు సంచరించెడు
   తరుణములు కలిగినను క్రీస్తు మీ చెంతనుండున్

5. మన జీవము క్రీస్తే గదా క్రీస్తున్ తేరి చూచి
   తనయులమై యుద్ధమందు జయము నొందెదము
131 హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెదhallelooya stuti prashansa paadeda

Psalms 135:3

పల్లవి:
హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద (2)

1. సిలువలో నాకై రక్తము కార్చి (2) - నన్ను రక్షించిన ఓ ప్రభువా (2)

2. నిర్దోషమైన యేసుని రక్తము - నా పాపదోషమంత కడిగె

3. నీవు గావించిన బలియాగముకై - సాగిలపడి పూజించెదను

4. నా యడుగులను బండపై నిలిపి - స్థిరపరచి కాచితివి

5. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై - నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా

6. యెట్లుండగలను నీ పాట పాడక - పొంది యున్నట్టి మేలులకై

7. సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో - ఆరాధించెద నిన్ను ప్రభువా
132 స్తోత్ర గీతములను పాడుచుstotra geetamulanu paaduchu

Songs of Solomon 2:4

పల్లవి:
స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి
హల్లెలూయ  - హల్లెలూయ - హల్లెలూయ (2)
స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి

1. రారండి సంతసించుచు - రారాజును కీర్తించను
   రాజులకు రాజని - ప్రభువులకు ప్రభువని
   రమ్యమైన రాజును స్తుతించెదం

2. సిలువలో బలియాయెను - విలువైన రక్తము కార్చెను
   ఎంత శ్రమనొందెను - ఎంత బాధ నోర్చెను -
   తన రక్తముతో మనల కొనెగదా

3. విందు శాలకు తెచ్చెను - ప్రేమ ధ్వజము పైకెత్తెను
   వింత సుందరుడని - వేలలో శ్రేష్ఠుడని -
   ఎంతైన జేయు సామర్థ్యుడని

4. మన ఆత్మ ప్రాణ - దేహముల్ - సజీవముగ నర్పింతుము
   అత్తరును పూసిన - మరియ వలె మనమును -
   పరిమళంబులన్ వ్యాపింప జేయుదం

5. ప్రశంసించె ప్రభువు మరియను - మంచి కార్యము చేసెనని
   ప్రభువు కొరకు చేయుము -
   ప్రాణము నర్పించుము - ప్రభువే సర్వము మనకు

6. మరణమున్ తానే గెల్చెను - సైతానును ఓడించెను
   మరణమున్ మ్రింగెను - మరణముల్లు విరిచెను
   జయము జయమటంచు ఆర్భటించెదం

7. ఆర్భాటముగా ప్రభువు - మేఘారూఢుడై వచ్చును
   నిశ్చయముగా మనలను కొనిపోవు వేగమే
   మహిమ దేహములను పొంది యుందుము
133 సర్వ కృపానిధియగు ప్రభువాsarva krupaanidhiyagu prabhuvaa

Revelation 14:3

1. సర్వ కృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా (1)
   స్తొత్రముచేసి స్తుతించెదము - సంతసముగ నిను పొగడెదము (1)

పల్లవి:
హల్లెలూయా హల్లెలూయా (2) - హల్లెలూయా యని పాడెదను (1)
ఆనందముతో సాగెదను  (2)

2. ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి (2)
   పరిశుద్దముగా జీవించుటకై - పాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా||

3. అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృప నిచ్చితివి
   నాథుని అడుగుజాడలలో - నడచుటకు నను పిలచితివి ||హల్లెలూయా||

4. మరణ శరీరము మార్పునొంది - మహిమ శరీరము పొందుటకై
   మహిమాత్మతో నను నింపితివి మరణ భయములను తీర్చీతివి ||హల్లెలూయా||

5. భువినుండి శ్రేష్ఠ ఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా
   భూజనములలో నుండినను - ప్రేమించి క్రయధన మిచ్చితివి ||హల్లెలూయా||

6. ఎవరు పాడని గీతమును - యేసుని గూర్చి పాడుటకై
   హేతువు లేకయే ప్రేమించెను - యేసుకు నేనేమివ్వగలను ||హల్లెలూయా||
134 మహాఘనుడు, మహోన్నతుడుmahaaghanudu, mahonnatudu

Isaiah 57:15

పల్లవి:
మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి (2)
మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణనిధి (2)

1. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు (2)
   అయినను - నలిగిన వినయంపు దీనమనస్సులో నివసించును జీవించును (2)

2. దినమెల్ల ప్రభుకై వధియింపబడి యున్నట్టి గొఱ్ఱెలము
   అయినను - ప్రేమించినవాని ప్రేమను బట్టియే పొందితిమి విజయమును

3. మోసము, శిక్షయు, దుఃఖమును, దరిద్రత కలిగియున్నాము
   అయినను - సత్యము, జీవము, సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి

4. పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా
   అయినను - తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ

5. మన క్రీస్తును బట్టి యెల్లప్పుడు నిందకు పాత్రులమైతిమి
   అయినను - ఎల్లప్పుడు వూరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు
135 క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ యేసుని కీర్తింతునుkrotta geetamuche naa yullamu pponga yesuni keertintunu

Psalms 40:3

1. క్రొత్త గీతముచే నా యుల్లముప్పొంగ యేసుని కీర్తింతును (1)
   పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమింతును (2)

పల్లవి:
హల్లెలూయా స్తుతి హల్లెలూయా - నా ప్రభు యేసుని గూర్చి పాడెదను (1)
ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన - ప్రభుని కీర్తింతును (2)

2. గత కాలమంతయు కాపాడెన్ - కష్టబాధలు కలుగకుండ
   తన ఆశీర్వాదంబులు నాకొసగి సుఖభద్రతనిచ్చెన్ || హ||

3. కొన్ని వేళలు క్షణకాలము - తన ముఖమును కప్పుకొనెను ప్రభువే
   తన కోపము మాని తిరిగి నా యెడల కుమ్మరించును కృపను || హ||

4. కరువు లధికంబగు చుండినను - ప్రభు ఆశ్రయముగనుండు
   పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ ప్రభు మమ్ము కాపాడెన్ || హ||

5. ప్రభు త్వరగా వచ్చును సంతసముగ - మమ్ము జేర్చను పరమందు
   కనిపెట్టెద మనిశం నింగిని జూచుచు ఆశతో గాంచెదము || హ||
136 కొనియాడి పాడి కీర్తించిkoniyaadi paadi keertinchi

Songs of Solomon 5:10

పల్లవి:
కొనియాడి  - పాడి కీర్తించి - వర్ణించెద నిను - నా ప్రభువా (2)

1. పరిశుద్ధుడవు - నీతిమంతుడవు (2) - పాపపు వస్త్రము - మార్చిన దేవా (2)
   ప్రాపుగ రక్షణ - వస్త్రమిచ్చితివి (1) - పొగడెద నిన్ను ధవళవర్ణుడా (2)

2. తూర్పు జ్ఞానులు - నీ కర్పించిరి - బంగారు సాంబ్రాణి బోళము
   తెలుపబడెను నీ ఘనవిజయము - భజియించెద నిన్ను రత్నవర్ణుడా

3. గుర్తించెద నిన్ను ఘనముగా నేను - ఘనుడా నాకు ప్రభుడవు నీవే
   పదివేలలో నా ప్రియుడగు ప్రభువా - పరికించి నిన్ను పాడి స్తుతించెద

4. ఆరాధించెద ప్రభువా దేవా - ఆత్మతోను సత్యముతోను
   తిరిగి రానై యున్న ప్రభువా - స్తుతియు ఘనత మహిమయు నీకే
137 దేవా నాయందు నీకుdevaa naayandu neeku

Jeremiah 31:3

పల్లవి:
దేవా నాయందు నీకు - ఎంతో ప్రేమ -  నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను  (1)
హల్లెలూయా   హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా

1. దిన దినము నీదు ప్రేమ - రుచి చూచుచున్నాను (2)
   దయగల జీవాహారముతో - పోషించుచున్నావు (2)
   దేవా! నీ జీవ జలము - నాకిచ్చితివే
   నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను (2)

2. నా పాదములను నీవు - బండపై నిలిపితివి
   నా యడుగుల నెల్ల నీవు - స్థిరపరచిన దేవుడవు
   దేవా! నా కాశ్రయుడవు - నీవే కదా
   నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

3. సిలువలో నీ రక్తము కార్చి - నన్ను రక్షించితివి
   సార్వత్రిక సంఘములోన - నన్నైక్య పరచితివి
   దేవా! నీ దయ నా యెడల - అత్యున్నతము -
   నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

4. వాగ్దానములను నాలో - నెరవేర్చిన ఓ ప్రభువా
   విడువక నా యెడల నీదు - కృప జూపుచున్నావు
   దేవా! నీ మారని ప్రేమ - సంపూర్ణము -
   నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను

5. మృతిని గెల్చి మాకొరకై - తిరిగి లేచిన ప్రభువా
   మా కొరకై త్వరలో రానై - యున్న మహిమ రాజా
   దేవా! నీ సన్నిధి నాకు - ఎంతో ప్రియము -
   నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
138 ఆద్యంత రహిత ప్రభువాaadyanta rahita prabhuvaa

Genesis 17:1

పల్లవి:
ఆద్యంత రహిత ప్రభువా  - రాజులకు రాజా ప్రభు యేసూ నీవే సదా (2)

1. ఆది జనకుడు ఏదేను తోటలో - శోధనలో పడి వేధించినపుడు (2)
   ఆశలన్ని అడియాశలుగా జేసె (1)
   అధములను నీవు ఆదరింతువు - అమృతమూర్తి నీవే
   ప్రభూ! సాటి నీకెవరు? (2)

2. స్థానము విడచి తన మహిమ విడచి - అనుదినము నిను దూషించు వైరి
   ప్రధానత్వమును పాడుచేసికొని
   నీ ప్రభుత్వమున్ నిరాకరించిన - నీచున్ ప్రేమించితివి
   ప్రభూ! సాటి నీకెవరు?

3. పిలిచితివి ఇశ్రాయేలు సంతతిని - వేలకొలది వాగ్దానములతో
   కలిమియందున కలతలందున
   తొలగిపోయిన తల్లడిల్లిన - చల్లగ కాచితివి
   ప్రభూ! సాటి నీకెవరు?

4. రాజ్యమేలిరి రారాజు లెందరో - రాజనగరుల రత్నాల సిరులతో
   రాజ్యకాంక్షతో రణములు సలిపిరి
   రథములను చూచి సదయున్ మరచిన - నిత్య సాత్వీకుడవు
   ప్రభూ! సాటి నీకెవరు?

5. పరమ జనకుని పలు వాక్కు లెన్నియో - ధరను ప్రజలకు ప్రవచించు కొరకై
   నిర్ణయించితివి దైవజనులను
   పేరాశ కలిగి పెడత్రోవ నడచిన - కరుణించితివి వారిన్
   ప్రభూ! సాటి నీకెవరు?

6. పాడెదన్ ప్రభూ నీ ప్రేమ గీతమ్ - పడిచెడిన నన్ను ప్రేమించితివివని
   కడిగితివి ప్రభు - కలుషము నెల్ల
   విడచిన నేను నీ జాడలన్నియు - నడిపించె నావికుడ
   ప్రభూ! సాటి నీకెవరు?
139 నృపా విమోచకా ప్రభూnrupaa vimochakaa prabhoo

Isaiah 6:3

1. నృపా విమోచకా ప్రభూ - వేలాది నోళ్ల నీ
   గృపా జయప్రభావముల్ - నుతింతు నెంతయున్

2. కృపాధికార దేవ నీ సాయంబు జేయుమా
   భవత్ప్రభావ కీర్తులన్ - జాటంగ నెల్లడన్

3. భయంబు చింతబాపును - హర్షంబు పాపికి
   సౌఖ్యంబు జీవశాంతులు - నీనామ మిచ్చును

4. విముక్తి జేయు ఖైదిని - పాపంబు బావున
పాపాత్ము శుద్ధిచేయును శ్రీ యేసు రక్తము

5. జనాళి పాపు లెల్లరు - శ్రీ యేసున్ నమ్ముడి
   కృపా విముక్తులందరు - సంపూర్ణ భక్తితో

6. అర్పించె యేసు ప్రాణమున్ - నరాళిగావను
   యజ్ఞంబు దేవ గొఱ్ఱెపై - నఘంబు వేయుడి

7. సత్కీర్తి స్తోత్ర ప్రేమల - నభావ భూమిని
   సర్వత్ర దేవుడొందుగా - సద్భక్తవాళిచే
140 శ్రీ రక్షకుని నామముshree rakshakuni naamamu

Matthew 21:9

1. శ్రీ రక్షకుని నామము - కీర్తించి కొల్వుడి (1)
   కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! (1)

2. శ్రీ యేసుని హత సాక్షులారా - మీ రాజు యీయనే
   కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

3. నరులారా మీ కొరకు - మరణంబు నొందెను
   కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

4. సర్వ జనాంగములారా - శరణ్యు డీయనే
   కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

5. పరంబునందు యేసుకు గిరీటముంచుచు
   హర్షంబుతో గీర్తింతుము - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
141 రక్షకుని విచిత్ర ప్రేమన్rakshakuni vichitra preman

Hebrews 2:12

1. రక్షకుని విచిత్ర ప్రేమన్ - పాడుచుందు నెప్పుడున్ (1)
   క్రూర సిల్వమీద మృతి నొంది నన్ విమోచించెన్ (1)

పల్లవి:
పాడుడి రక్షకుని గూర్చి రక్తముతో కొనియె నన్ (1)
సిల్వపై రక్షణ ముద్రించి పాప అప్పును తీర్చెను (1)

2. తెల్పుదున్ విచిత్ర కథన్ - పాడైన నా స్థితిని
   కాచి కృపా ప్రేమతోడ - నన్ను విమోచించెను ||పాడు||

3. ప్రియ రక్షకుని పాడి - జయశక్తి తెల్పుదున్
   పాపమృతి పాతాళము - పై విజయమిచ్చెను ||పాడు||

4. నా రక్షకుని పరమ పాడి - ప్రేమగూర్చి పాడుదున్
   చావు నుండి జీవమునకు - తెచ్చె దైవసుతుడు ||పాడు||
142 యేసుని నామ శబ్దముyesuni naama shabdamu

Songs of Solomon 5:16

1. యేసుని నామ శబ్దము - విశ్వాసి చెవికి (1)
   దివ్యమై యాదరించు - భీతిని ద్రోలును (1)

2. గాయపడిన ఆత్మను - క్లేశహృదయము
   నాకలి బాధ నార్పును - విశ్రాంతి నిచ్చును

3. ఇంపైన పేరు బండయు - డాలు నాశ్రయము
   ధననిధీ కృపలతో - నన్నింపుచుండును

4. యేసూ నా ప్రియ కాపరి - ప్రవక్త నా రాజు
   ప్రభూ జీవమార్గ సత్యం - మా స్తుతి వినుము

5. నా హృదయము దౌర్బల్యము - తలంపు వ్యర్థము
   నిన్ను నే జూచినపుడు - సరిగా పూజింతును

6. శ్వాసించునపుడెల్లను - నీ ప్రేమ జాటుదున్
   నీ నామ మధురమే నా - మృతిన్ ఆదరించున్
143 కంటిని గొప్ప ముత్యముkantini goppa mutyamu

Luke 2:16

1. కంటిని గొప్ప ముత్యము - పొందితి హర్షము (1)
   తింటిని జీవాహారము - గ్రోలితి స్నేహము (1)

2. మాత పితృడు యేసుడ - ద్భుత రాజాయనే
   గుడ్డలు చుట్టబడెను - మందల కాపరి

3. ఆదియంత రహితుడు - జ్యోతిర్మయ ప్రభు
   నార్తులకు నాయకుడు - జాతిగోత్రరహితుడు

4. యూదా గోత్రంపు సింహమా - పితృల దైవమా
   నాథా నా హేమ మకుటమా - పాదముల బడితిమి

5. కర్తాదికర్త యేసువా - రాజాధిరాజవు
   షారోను రోజా పుష్పమా - మరలవత్తువు

6. మార్గం సత్యం జీవమా - రోషంపు దేవుడా
   కున్కని యాజకుండవు - ప్రకాశమయుడా

7. హల్లెలూయాకు పాత్రుడా - ఎల్లరి రక్షకా
   రాతి గుండె కరిగింతువు - నీవే సమస్తము
144 భక్తులారా దుఃఖక్రాంతుడుbhaktulaaraa duhakhakraantudu

Songs of Solomon 3:11

1. భక్తులారా దుఃఖక్రాంతుడు - వచ్చె మహిమతోడ
   విజయుడుగాన మోక - రించుటకు పూజ్యుడు
   మకుటము తలనుంచి - అభిషిక్తున్ జేయుడు - మకుటము

2. పరలోక మార్భటింప - దూతలారా కొల్వుడి
   సింహాసనమునందు రాజు - నభిషక్తున్ చేయుడి
   మకుటము తలనుంచి - రాజరికమీయుడి - మకుటము

3. పాపుల్ ముండ్ల మకుట మీయ - గరక్షితు లెల్లరు
   చుట్టు నిల్చి స్తుతిపాడి - యేసు పేరుపొందుడి
   మకుటము తలనుంచి - జయము ప్రకటించుడి - మకుటము

4. యేసు మహోన్నతు డాయెన్ - హా! మహాసంతోషము
   ఆర్భటించు పాట న్విని - గొప్పగా స్తుతించుడి
   మకుటము తలనుంచు - డీ రాజాధిరాజుకు - మకుటము
145 రాజాధి రాజుపై కిరీటముంచుడిraajaadhi raajupai kireetamunchudi

Revelation 19:16

1. రాజాధి రాజుపై కిరీటముంచుడి
   పైలోకానంద సునాదంబుల నాలించుడి
   లే లెమ్ము డెందమా! నా కై చావొందిన
   రారాజుపై కిరీటముంచి రాజున్ జేయుడి

2. ఈ ప్రేమ రాజుపై - కిరీటముంచుడి
   ప్రకాశించు, ప్రక్కచేతి - గాయంబుల్ చూడుడి
   ఏదూత చూచును - భరింప గల్గును
   నా వైపు వంగి చూచుచు - న్న - రాజున్ గొల్వుడి

3. ఈ జీవ రాజుపై - కిరీటముంచుడి
   చావున్ జయించినన్ - రక్షించిన సజీవియై
   చావున్ జయించెను - జీవంబుదెచ్చెను
   హా! చావున్ గెల్చి - జీవకి - రీటంబు దెచ్చెను

4. ఈ మోక్షరాజుపై కిరీటముంచుడి - నిత్యుండై 
తండ్రితోన్ - శుద్ధాత్మతోడ నైక్యుండు
   రవంబు చేయుడి నిరంతరంబును - ఓ రాజా, నీకే 
నిత్యఘ - నత ఖ్యాతి గల్గును
146 సర్వము పై యేసు రాజ్యమేలున్sarvamu pai yesu raajyamelun

Ephesians 1:22

1. సర్వము పై యేసు రాజ్యమేలున్ - పాపిమిత్రుడు గొఱ్ఱెపిల్లకు (1)
   మన మొరవిన కిరీటము - నిచ్చి హెచ్చించె దేవుడాయనన్ (1)

పల్లవి:
సర్వము పై సర్వము పై - సిల్వవేయబడినట్టివాడే (1)
పాదములబడి  - పూజింతుము - సర్వముపై హెచ్చించె దేవుడు (1)

2. తుఫాను భయంకరాలచే కొట్టునపుడు మొఱ పెట్టగా
   యేసును వేడగా నా చేతితో- పట్టి శిలలపై నడ్పించును || సర్వము ||

3. పట్టణము లతిగొప్పవైనన్ - అడ్డములు బలమైనపుడున్
   నిర్భయముగ సాగుచుందుము - సర్వముపై నున్న వాని ద్వారా || సర్వము ||

4. ధృవమునుండి ధృవం వరకు - యుగములనుండి శాశ్వతముగ
   సర్వముపై ననుభవింతుము - వీరులై యేసు వెంటసాగుచు || సర్వము ||
147 యేసు ప్రభూ గద్దెపైనున్న నీకుyesu prabhoo gaddepainunna neeku

Revelation 4:10

1. యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు - మా స్తుతులను చెల్లించెదము (1)
   నీ సన్నిధియందు నిన్నారాధించి - పాత్రుండ వీవంచు కీర్తింతుము (1)

పల్లవి:
పాత్రుండవీవే పాత్రుండవీవే  - పాత్రుండవీవే మా ప్రభునీవే  (1)
నీ సన్నిధియందు నిన్నారాధించి - పాత్రుండవీవంచు కీర్తింతుము (1)

2. దేవుడవ్ నీవు నరరూపమెత్తి - దూతలకన్న తగ్గింపబడి
   స్త్రీ సంతానమౌ నీవు మరణించి - సర్పము తల నణగ ద్రొక్కితివి || పాత్రు ||

3. నీ సృష్టియే సిల్వయొద్దకు నిన్ను - నడ్పి సిల్వన్ మేకులతో కొట్టిరి
   దైవ మానవులచే వీడబడి - శాప నష్ట మనుభవించితివి || పాత్రు ||

4. మహిమతో మరణమును గెల్చి - గొప్ప విజయము పొందితివి
   చావు సమాధులపై విజయుండా - నిన్ను స్తుతింపక నెట్టులుందును || పాత్రు ||
148 అత్యంత సుందరుండును ఎల్లరి కాంక్షణీయుడుatyanta sundarundunu ellari kaankshaneeyudu

Galatians 2:20

1. అత్యంత సుందరుండును - ఎల్లరి కాంక్షణీయుడు (1)
   దేవాది దేవుడైన మా - కల్వరి యేసునాథుడు (1)

పల్లవి:
కల్వరి నాథుడా - నన్ను జయించితి - 
రక్షింప మృతుడైన - కల్వరినాథుడా (1)

2. గాయపడి శ్రమలతో - పాపదుఃఖము మోసితివి
   సిల్వలో మరణించితివి - దుఃఖ కల్వరినాథుడా ||కల్వ||

3. శాంతి జీవము నీయను - ఖైదీల విమోచనమునకై
   రక్తపు ఊట తెరచితివి - ప్రేమ కల్వరి నాథుడా ||కల్వ||

4. తెచ్చిన ఈవులెల్లను - మేలుకొరకు మనకిచ్చి
   ప్రేమనదిని పోసెను - దయా కల్వరినాథుడు ||కల్వ||

5. మహిమ పూర్ణుడగు నిన్ను - కండ్లార చూతుమనుటయే
   ఇచ్చట మా ఆదరణ - సాటిలేని కల్వరి ప్రభూ ||కల్వ||

6. స్పటిక సముద్ర తీరమున - నీ ప్రేమయందు మున్గుచు
   నీ వలె నుందు నిత్యము - మహిమ కల్వరినాథుడా ||కల్వ||
149 ఆ ముండ్ల కిరీటం బోయెను ఘనంబుకల్గెనుaa mundla kireetam boyenu ghanambukalgenu

Revelation 19:16

1. ఆ ముండ్ల కిరీటం బోయెను - ఘనంబుకల్గెను
   విజయరాజుపై - జయకిరీటంబుంచుడి

2. ప్రభువులకు ప్రభువా - రాజులకు రాజా!
   పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి

3. పై దూతల యానందము - జనాళి మోదము
   నీ గొప్ప ప్రేమ జూతుము - నిన్ వెంబడింతుము

4. తా జచ్చిన యా సిలువ - మాకాయె క్షేమము
   నిరీక్షణ సౌభాగ్యము - మా నిత్య జీవము
150 నమస్కరింప రండి - దావీదు పుత్రునిnamaskarimpa randi - daaveedu putruni

Psalms 95:7

1. నమస్కరింప రండి - దావీదు పుత్రుని
   శ్రీ యేసు రక్షకుండు - ఏతెంచె నేలను
   న్యాయంబు లోకమందు - స్థాపించి నిత్యము
   అన్యాయ మంతదాను - పోగొట్ట వచ్చెను

2. వర్షంబు పడునట్లు - శుష్కించు నేలను
   దుఃఖించు వారికెల్ల - హర్షంబు నిచ్చును
   శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరు
   ఖర్జూర వృక్షరీతిన్ వర్థిల్లు చుందురు

3. దిగంత వాసులైన - భూరాజులందరు
   శ్రీ యేసు చరణంబుల్ - నమస్కరింతురు
   భూలోకవాసులైన - జనంబులందరు
   క్రీస్తే స్వాధీనమందు జీవింతు రెప్పుడు

4. విరోధులైన వారిన్ - జయింప నెన్నడున్
   సింహాసనంబు మీద - నాసీనుడగును
   అత్యంత ప్రేమమూర్తి - శ్రీ యేసు ప్రభువు
   ఆ దివ్యనామ కీర్తి - వ్యాపించు నీ భువిన్
151 శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు!shuddhi, shuddhi, shuddhi! sarvashakti prabhu!

Isaiah 6:3

1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు! - ప్రాతఃకాల స్తుతి నీకే చెల్లింతుము! (1)
   శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా - ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా! (1)

2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందు - పరవాసులెల్ల నిన్నే శ్లాఘింతురు
   సెరాపుల్ కెరూబులు సాష్టాంగపడి - నిత్యుడవైన నిన్ స్తుతింతురు

3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ - పాపి కన్ను చూడలేని మేఘవాసివి
   అద్వితీయ ప్రభు, నీవు మాత్రమేను - కరుణ, శక్తి, ప్రేమ రూపివి

4. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు - సృష్టి జాలమంత నీకీర్తి బాడును
   శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! - ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా!
152 నీ జల్దరు వృక్షపు నీడలలోnee jaldaru vrukshapu needalalo

Songs of Solomon 2:3

పల్లవి:
నీ జల్దరు వృక్షపు నీడలలో - నే నానంద భరితుడనైతిని (2)
బలురక్కసి వృక్షపుగాయములు (2)
ప్రేమాహస్తములతో తాకు ప్రభు (2)

1. నా హృదయపు వాకిలి తీయుమని - పలు దినములు మంచులో నిలచితివి (2)
   నీ శిరము వానకు తడిసినను (2)- నను రక్షించుటకు వేచితివి (2)

2. ఓ ప్రియుడా నా అతిసుందరుడా - దవళ వర్ణుడా నాకతి ప్రియుడా
   వ్యసనా క్రాంతుడుగా మార్చబడి - నీ సొగసును నాకు నొసగితివి

3. నీ పరిమళ పుష్ప సుగంధములు - నా రోత హృదయమును నింపినవి
   ద్రాక్షారస ధారలకన్న మరి - నీ ప్రేమే ఎంతో అతిమధురం

4. ఉన్నత శిఖరములుదాటుచును - ఇదిగో అతడొచ్చు చున్నాడు
   నా హృదయపు తలుపులు తెరచుకొని - నా ప్రియుని కొరకు కనిపెట్టెదను

5. నీ విందుశాలకు నడిపించి - రాజులు యాజకులతో జేర్చితివి
   జీవాహారము నా కందించి - పరమా గీతములను నేర్పితివి
153 యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతినిyesu nangeekarinchiti daivaputruda naitini

John 1:12

1. యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతిని (2)
   పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి (2)

పల్లవి:
వందన మర్పింతు కృపనొందితి
తన రాజ్యమందున చేరితిని (2)

2. తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగె
   చేతికుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగె || వందన ||

3. దోషముల్ క్షమింపబడె నా పాపము కప్పబడె
   నా ఋణపత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చె || వందన ||

4. పాపపు శిక్ష తొలగెన్ నే నూతన సృష్టినైతిని
   రాజుగజేసె యాజకునిగను పాడెద హల్లెలూయ || వందన ||

5. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును
   ఆ దినమునకై ప్రీతితోనేను కనిపెట్టుచున్నాను || వందన ||
154 దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయంdevaa naa prabhuvaa ninu goorchi upponge naa hrudayam

Psalms 45:1

పల్లవి:
దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం (2)

1. నీ నామమును నే ఘనపరచి - హెచ్చించి పూజింతున్ (2)
   శ్లాఘించి కొనియాడుటలో - నాకిచ్చిన నీ కృపకై (2)

2. ఎండిన భూమిలో లేత మొక్కవలె - పలుశ్రమలను పొందితివి
   వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది - నా శిక్షను పొందితివి

3. దవళవర్ణుడ రత్నవర్ణుడవు - నా ప్రియుడవు నీవే ప్రభూ
   పదివేలలో నిను గుర్తించెదను - నా పరమ పితా నిన్ను

4. గొర్రెపిల్ల పెండ్లి విందునందు - రారాజు రూపమును
   నిరతంబును చూచె నిరీక్షణతో - నింగిని నే జూచెదను
155 ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివిprabhuyesu naakai nee sarvamu nichitivi

Galatians 2:20

పల్లవి:
ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి (2)
ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై (2)

1. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై - స్వామి నా పాపముల కొరకే (2)
   సహింపజాలని వేదన బహుగా (1) - సహించితివి ప్రేమతోడ (2)

2. కన్నుల నిచ్చితివి కన్నీరు కార్చ - కరుణించి నా స్థితిని జూచి
   కరిగె నీ హృదయం దుఃఖంబుతోడ - కడు వేదనతో యేడ్చితివి

3. కొరడా దెబ్బలచే నీ దేహమంత - చారలుగ దున్నబడెను
   శరీరమంత రక్తమయమాయెను - వరదా! గాయము లొందితివా

4. కాళ్ళు చేతులలో మేకులు గొట్టిరి - బల్లెముతో ప్రక్కన్ బొడిచిరి
   యేలాగు వివరింతు నీ బాధ నేను - ఓర్చితివా మౌనము వహించి

5. ప్రాయశ్చిత్తంబై పోతివా నాకై - పాపము నుండి విడిపించుటకు
   పొందితి నెంతో గొప్ప రక్షణను - పశ్చాత్తాపము ద్వారా నేను

6. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ - ఎందు కింతగా ప్రేమించితివి
   వందన మర్పింతు నీ పాదములకే - పొందుగ నీ వాడనైతి

7. నా యెడల నీదు సంకల్పమేగా - నీ స్వాస్థ్య మనుభవించుటకు
   నీతోడ నిరతం నేనుండునట్లు - నీ యధికారం బిచ్చితివి
156 పావనుడా మా ప్రభువాpaavanudaa maa prabhuvaa

Isaiah 6:1

పల్లవి:
పావనుడా మా ప్రభువా (1)   నీ రక్షణకై  స్తోత్రములు (2)

1. అత్యున్నతమైన దేవా - సింహాసనాసీనుడవు (2)
   ఎంతో గొప్పది నీ మహిమ - వర్ణింపజాలను నేను (2)

2. పాపపు కుష్ఠుతో పడి చెడిన - ఈపాపిని కరుణించితివి
   నా పాపపు డాగులు కడిగి - పరిశుద్ధుని చేసిన విభుడా

3. అపవిత్రమగు పెదవులతో - కపటముగా జీవించితిని
   అపరాధి నోటిని తెరచి - స్తుతి గీతము నొసగిన ప్రభువా

4. నీ క్రయధన మధికము ఎంతో - నా కర్త నిను ప్రణుతింతు
   నా కందరి కంటె ఘనుడా - ఓ కల్వరి నాథా యేసు

5. మహిమ పరతును ప్రభు యేసు - మహదానందముతో నిరతం
   మహోన్నతుడా ప్రభు నిన్ను - మహిమలో ఆరాధించెదను

6. నా కనులతో నిను చూచెదను - ఆకసమున దూతల మధ్య
   రక్షక త్వరగా రారమ్ము - అక్షయుడా నీకే స్తుతులు
157 యేసూ నన్ ప్రేమించితివిyesoo nan preminchitivi

Luke 7:13

పల్లవి:
యేసూ నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు (1)
నీ శరణు వేడగానే - నా పాపభారము తొలగె (1)

1. నే దూరమైతి నీకు - నశియించితి లోకమున (2)
   నేను గ్రహించలేదు - నీ హృదయ ప్రేమను (1)

2. నే తలచలే దెప్పుడు - నా అంత మేమవునని
   నా పాపములచే నేను - నిన్ను విసిగించితిని

3. నిన్ను నేగాంచగానే - నా జీవితము మారెను
   నేనెంతో గ్రుచ్చబడి - నిన్నంగీకరించితి

4. రక్షణ దొరికె నాకు రక్తముతో నన్ను కడిగి
   రయముగా నీ చెంతకు - రక్షకా తెచ్చితివి

5. పరిశుద్ధులలో చేర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చి
   పూర్ణాధికారము నిచ్చి - పరలోకము తెరచితివి
158 ప్రభువా నీదు ఘననామమున్prabhuvaa needu ghananaamamun

Philippians 2:10

పల్లవి:
ప్రభువా నీదు ఘననామమున్  మేము
పొగడిపాడ హృదయ ముప్పొంగెనేయేసు (2)
ప్రియుడా నీ పాద సన్నిధి చేర  నాలో నీదు ప్రేమ అధికంబాయనే (2)

1. ఇహ పరము పొగడునట్టి ఘననామమే
   ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే (2)
   శ్రమలన్ని బాపునట్టి ఘననామమే (2)
   భక్తులెల్ల వేళ పొగడిపాడు ఘననామమే (2)

2. కీడునంత తొలగించు ఘననామమే
   వెదకువారికెల్ల ఔషధమా ఘననామమే
   సకల మేళ్ళనిచ్చునట్టి ఘననామమే
   ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే

3. అపవాదిని తరిమినట్టి ఘననామమే
   మమ్ము ప్రేమతోడ కౌగలించే ఘననామమే
   పరిశుద్దులు పొగడునట్టి ఘననామమే
   పరిశుద్దుల పరమున జేర్చు ఘననామమే
159 ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రిprema nammakamugala paraloka tandri

John 3:16

పల్లవి:
ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి
తన కుమారుని పంపెను రక్తము చిందించి
మా పాపము కడుగ సిలువపై అర్పించెను
సిలువపై అర్పించెను (1)

1. త్యాగసహిత ప్రేమజూపి, నెరవేర్చె తన నిబంధనను (2)
   మనలను తానే నిర్మించె గనుక, మనలను ప్రేమించెను (2)
   మనలను ప్రేమించెను (1)

2. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై ఋజువు గావించెను
   తన రక్తముతో పాపులనెల్ల, శుద్ధుల జేసెనుగా
   శుద్ధుల జేసెనుగా

3. తండ్రివలెనే ప్రేమజూపి, నీచులనెల్ల ప్రేమించెను
   ఎవరు పాపము నొప్పుకొందురో, వారిని క్షమించును
   వారిని క్షమించును

4. మా జీవితముల మార్చివేసి, తన సంతతిలో చేర్చెనుగా
   తన మహా ప్రేమ జూపించి మాకు, స్వాస్థ్యము దయచేసెను
   స్వాస్థ్యము దయచేసెను

5. ఆత్మ శరీర ప్రాణములన్, అర్పించి ప్రభును స్తుతింతము
   హల్లెలూయ స్తుతి మహిమ ఘనత, ఎల్లప్పుడు ప్రభుకే
   ఎల్లప్పుడు ప్రభుకే
160 ఓ ప్రభువా యిది నీ కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగెo prabhuvaa yidi nee krupaye goppa krayamu dvaaraa kalige

Ephesians 1:7

పల్లవి:
ఓ ప్రభువా యిది నీ కృపయే - గొప్ప క్రయము ద్వారా కలిగె (2)

1. కృపద్వారానే పాపక్షమాపణ - రక్తము ద్వారానే కలిగె (2)
   అపరాధముల నుండి విమోచన (2) - యేసులో మనకు ప్రాప్తించె (2)

2. కృపద్వారానే కలిగిన రక్షణ - మానవులొసగ జాలరిల
   క్రియలద్వారా కలుగలేదు - యేసు ప్రభుని వరమిదియే

3. కృపతో మనల పిలిచెను ప్రభువు - పరిశుద్ద పిలుపుద్వారా
   అపరిమిత సంకల్పమువలన - మనమెరిగితిమి ఈ ధరలో

4. కృపద్వారానే నీతి మంతులుగా - తీర్చెను మనల ఉచితముగ
   అపాత్రులమైయున్న మనకు - ప్రాయశ్చిత్తము కలిగెనుగ

5. కృపయే మనకు బయలు పడెను - సమస్తమును భోధించును
   అపవిత్ర క్రియలన్నియు విడచి - భయభక్తులతో బ్రతికెదము

6. కృపద్వారానే బలవంతులమై - ఎదురుకొనెదము యుద్ధమును
   ప్రభువునందు అంత మువరకు - స్థిరముగ ముందుకుసాగెదము

7. కృపద్వారానే సమీపించితిమి - దానియందే నిలిచితిమి
   క్రీస్తు మహిమ నిరీక్షణకై - ఆయనకే స్తుతి పాడెదము
161 ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయాpremagala maa prabhuvaa premayai yunnaavayaa

1 John 4:8

పల్లవి:
ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా

1. నీదు ప్రేమ నిత్యమైనది - కరుణతో నాకర్షించె (2)
   నిక్కముగ ఋజువాయెను - ప్రాణమిచ్చుట ద్వారనే (2)

2. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను
   అద్భుత ప్రేమయిదే పాపములను కప్పెను

3. బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను
   వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను

4. తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు
   తండ్రి ప్రేమ మారదు - మార్పుచెందని ప్రేమయే

5. మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా
   వరదలార్ప జాలవు విజయుడా నీ ప్రేమను
162 ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదనుaaraadhincheda ninu madi pogadeda niratamu ninu stutiyinchedanu

John 12:3

పల్లవి:
ఆరాధించెద నిను మది పొగడెద - నిరతము నిను స్తుతియించెదను (2)
మార్గము నీవే సత్యము నీవే - జీవము నీవే నా ప్రభువా (2)

1. విస్తారంబగు - వ్యాపకములలో - విడచితి నీ సహవాసమును (2)
   సరిదిద్దితివి నా జీవితము (2) - నిను సేవింపగా నేర్పిన ప్రభువా (2)

2. నా జీవితమున నీ మాటలను - వినుటయే చాలని యెరిగితిని
   నా కన్నీటితో నీ పాదములను - కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా

3. వ్యర్థపరచితిని నా సర్వమును - స్వార్థముతో జీవించితిని
   గుర్తించితిని నీ త్యాగమును - వినయముతో నీ సన్నిధిచేరి

4. నీరక్తముతో నన్ను కడిగితివి - పరిశుద్ధునిగా జేసితివి
   నీరక్షణకై స్తోత్రము చేయుచు - నిత్యమునిన్ను కొనియాడెదను

5. దుర్గంధముతో నిండిన నన్ను - దయతో నీవు పిలిచితివి
   ప్రేమతో పరమ విందు నొసంగి - ఆనందింపగ జేసిన ప్రభువా

6. ప్రియముగ దాచిన అత్తరు భరణి - పగులగొట్టి నిన్ను పూజింతు
   నీ ప్రేమను నే నెన్నగ తరమా - నా జీవితమున చాలిన ప్రభువా

7. పెద్దలు పరిశుద్దులు ఘనదూతలు - నీ సన్నిధిలో నిలచినను
   లెక్కింపగ జాలని జనమందున - నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా
163 రుచిచూచి ఎరిగితినిruchichoochi erigitini

Psalms 34:8

పల్లవి:
రుచిచూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2)

1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ వీవే (2)
   తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే (2)

2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
   మనస్సార పొగడదను నీ ఆశ్చర్య కార్యములన్

3. మంచి తనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో
   ముదమార పాడెదనిన్ను అతి సుందరుడవనియు

4. నా జీవితమంతయును యెహోవాను స్తుతియించెదను
   నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్

5. సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో
   ఎంతో నెమ్మదినిచ్చునా రక్షకుడు యేసు

6. ప్రార్థింతును ఎడతెగక ప్రభుసన్నిధిలో చేరి
   సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని

7. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దానికొరకు నేను
   క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను
164 నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించెనుneedu vishvaasyata maa prabhu yesu antarikshamu nadhigaminchenu

Deuteronomy 7:9,Psalms 36:5, 1 Thessalonians 5:23,24, Ecclesiastes 3:23

పల్లవి:
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు - అంతరిక్షము నధిగమించెను (2)

1. నిను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి (2)
   నిబంధనను స్థిరముగ జేసి (2)
   నిరతము నలరారెడు మా ప్రభువా (2)

2. వేయి తరముల వరకు సరిగా - విలసిల్లేటి వెలలేని మా
   వింతల కృపాంబుధి యగుదేవా
   యెంతయో నిను స్తుతియింతుము కోరి

3. నీ సత్య సంధత్వ మహిమ - నిరతము నిలయం సంస్తుతులకు
   మెరసెను నా మదిలోన దేవా
   మరువగ లేమీ మధుర ప్రేమ

4. ఎంతైనను నమ్మదగిన - వింతైన నీ విశ్వాస్యత
   వాత్సల్యత వెలసెను మాపై
   క్రొత్తగ ప్రతి దినము యేసు ప్రభో

5. మన ఆత్మనుజీవము దేహమును - మన ప్రభుయేసు రాకడవరకు
   వొనరుగ కాపాడును పదిలముగా
   దిన దినమును నిందారహితముగ

6. తండ్రికుమార శుద్ధాత్మకును - తర తరములకు మహిమ ఘనత
   పరిపూర్ణముగా ప్రబలును గాక
   పరిపరి విధముల ప్రభు సంఘములో
165 సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నానోటనుండుsannutinchedanu ellappudu nityamu aayana keerti naanotanundu

Psalms 34:1

పల్లవి:
సన్నుతించెదను ఎల్లప్పుడు (2) - నిత్యము ఆయన కీర్తి నానోటనుండు (2)

1. యోహోవాకు ప్రార్ధించగా - నా భయమంత తొలగించెను (2)
   శ్రమలన్నిటిలో నాతో నుండి - (2)
   చేరదీసి నన్ను ఆదరించె - ఆరాధించెద నెల్లప్పుడు (1)

2. జీవితమంతా పాడుచుందును - నీ మేలులకు ఓ ప్రభువా
   నా ఆయుష్కాల మంతయును
   నీ విశ్వాస్యత కొరకెప్పుడు - నిరతము నిన్ను స్తోత్రింతు

3. మహోన్నతమైనది నీదు మహిమ - ఘనత ప్రభావముగల ప్రభువా
   తనివి తీరగ నిను పూజింతు
   తరగని నీ కార్యములకై - తప్పక నిన్ను స్తుతియింతు

4. నీ సంకల్పమును నెరవేర్చి - నడిపించితివి ఘనముగను
   నాకు ప్రభుడవై నా కాపరివై
   నా జీవితములో ఉన్నావు - నిజముగ నిన్ను పొగడెదను
166 దేవునికే మహిమ యుగయుగములకు కలుగును గాకdevunike mahima yugayugamulaku kalugunu gaaka

Revelation 21:18

పల్లవి:
దేవునికే మహిమ (2) - యుగయుగములకు కలుగును గాక (2)
దేవునికే మహిమ (2)

1. దేనికి దేవుడు శిల్పియు, నిర్మాణకుడో (2)
   దానికి మనలను వారసుల జేసెను (2)- వందనములను చెల్లింతము (2)

2. నిలవరమైనది మనకిల లేదని - వల్లభుడు స్థిరపరచెను పరమందు
   చెల్లించి స్తుతులను పూజింతుము

3. సీయోను పురమగు దేవుని నగరుకు
   సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే - స్తోత్రగీతములను పాడెదము

4. పరదేశులుగా మనలను చేయక - ప్రభుని యింటికి వారసులుగ జేసె
   పాడి పొగడెదము మన ప్రభుని

5. శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన
   ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను
   ముదమారగను ప్రణుతింతుము
167 ఆశ్చర్యకరుడ వీవే యెహోవా నీవే ధన్యుడవుaashcharyakaruda veeve yehovaa neeve dhanyudavu

Psalms 36:10

పల్లవి:
ఆశ్చర్యకరుడ వీవే (2)  - యెహోవా నీవే ధన్యుడవు (2)

1. నీ కృప నింగినంటెను (2)
   వచ్చినవారే దయ పొందెదరు - నీవే దయాళుడవు (2)

2. నీ విశ్వాస్యత గొప్పది
   ఉన్నతమైనది అందరి యెడల - ఎన్నడు మారనిది

3. నీ నీతి స్థిరమైనది
   పరిశీలించెదవు యెల్ల ప్రజలను - సరిదిద్దువాడ వీవే

4. అమూల్యము నీ కరుణ
   వచ్చినవారికి ఆశ్రయమిచ్చి - రెక్కలతో కప్పెదవు

5. నీ యింట తృప్తిగలదు
   ఆనంద జలమును త్రాగనిచ్చెదవు - నీ ప్రజలందరికి

6. నీ ప్రకాశము నిలుచు
   నిన్నెరిగియున్న వారిపై నిరతం - మెండైన కృపనిత్తువు
168 నా ప్రాణమా నా సర్వమాnaa praanamaa naa sarvamaa

Psalms 103

పల్లవి:
నా ప్రాణమా నా సర్వమా (2)- ఆయన పరిశుద్ధ నామమునకు (1)
సదా స్తుతులను చెల్లించుమా (1)- మరువకు ఆయన మేలులను (2)

1. క్షమించును నీ పాపములను (2)- కుదుర్చును నీ రోగములను (1)
   క్షమించును నీ పాపములను (1)- కుదుర్చును నీ రోగములను (1)
   కీడు నుండి నీ ప్రాణమును రక్షించి - కరుణా కిరీటము దయచేయును (2)

2. పడమటికి తూర్పెంత దూరమో - పాపములన్నియు దూరపరచెను
   తండ్రి తన తనయులపై జాలిపడునట్లు - భక్తుల యెడల జాలిపడును

3. నిన్ను మేలులతో తృప్తి పరచున్ - నీ యౌవనము నూతన పరచును
   బాధితులకు బహున్యాయము తీర్చు - యెహోవా యెంతో దయాళుడు

4. మనము నిర్మింప బడినరీతి - మంటి వారమని ప్రభు యెరుగును
   గడ్డి పువ్వువలె నున్నది మన బ్రతుకు - గాలి వీచగ అది యెగిరిపోవున్

5. స్థిరపరచె తన సింహాసనము - సర్వలోకమును యేలు చుండె
   నీ యాజ్ఞలను పాలించెదము - నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా
169 గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభుgaayamulan gaayamulan naa korakai pondenu kreestu prabhu

Isaiah 53:5

పల్లవి:
గాయములన్ గాయములన్ - నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2)

1. సురూపమైన సొగసైన లేదు - దుఃఖ భరితుడాయెను (2)
   వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ - వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2)

2. మా రోగములను మా దుఃఖములను - మనకై తానే భరియించె
   మొత్తబడెను బాధించబడెను - యెంతో శ్రమనొందె మనకై

3. మా అతిక్రమ క్రియలను బట్టి - మరి నలుగగొట్టబడెను
   తాను పొందిన దెబ్బలద్వారా - స్వస్థత కలిగె మనకు

4. పాపంబు కపటంబు లేదు ప్రభునందు - మౌనము వహియించె మనకై
   ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించె - ప్రభువే ఘోర సిలువపై

5. క్రీస్తు ప్రేమను మరువజాలము - యెంతో ప్రేమించె మనల
   సిలువపై మేము గమనించ మాకు - విలువైన విడుదల గలిగె
170 దూతగణములెల్ల ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవనిdootaganamulella aaraadhinchirigaa parishuddhudu sainyamula yehovani

Isaiah 6:3

పల్లవి:
దూతగణములెల్ల ఆరాధించిరిగా - పరిశుద్ధుడు సైన్యముల యెహోవని (2)

అను పల్లవి:
ఇహపరములలో ఆయన మహిమ - నిండియున్నదని గానము చేసిరి - (2)

1. నిష్కళంకమైనది నీ కనుదృష్టి
   నీవు చూడలేవుగా దుష్టత్వమును (2)
   దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో (2)
   చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము (2)

2. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి
   నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి
   పెన్నుగా నీ పరిశుద్ధత నొసగిన దేవా
   ఘనముగాను పొగడెదను పావన ప్రభువా

3. పాపముతో పతనమైన నా దేహమును
   పరిశుద్ధాలయముగాని చేసికొంటివి
   పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన
   సర్వోన్నతుడా నిన్ను స్తుతియించెదను

4. నీ రక్తముచేత నాకు కలిగించితివి
   నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో
   ప్రవేశింపజేసియున్న ప్రియ యేసువా
   పూజించెద నిన్ను నాదు జీవితమంతా

5. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు
   పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి
   సమస్తమును చేయుటకు బలపరచితివి
   సమాధాన కర్తనీకే వందన స్తుతులు
171 మా ప్రభుయేసు నీవే మా సర్వము మహిన్ మాకెపుడు నీతోనే స్నేహముmaa prabhuyesu neeve maa sarvamu mahin maakepudu neetone snehamu

Psalms 36:8

పల్లవి:
మా ప్రభుయేసు నీవే మా సర్వము - మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము (2)

1. సంతృప్తి నీ మందిరమున గలదు (2)
   అందానంద ప్రవాహంబు మెరిసింది (2)
   వింతైన జీవపు యూటందు గలదు (2)
   యెంతైన మా పూజార్హుండ వీవే (2)

2. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు
   మొదటి ప్రేమ నెంతో విడచి పెట్టితిని
   సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా
   సతతంబు మా పూజార్హుండ వీవే

3. మా తలపు మాటల్లో మా చూపు నడకలో
   మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన
   మక్కువతో మా ప్రభున్ మెప్పించెదము
   యెక్కడైనా మా యేసు సన్నిధిలో

4. పరిశుద్ధంబైనది నీ దివ్య స్వభావము
   పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము
   పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి
   పాలించుము ప్రభుయేసు రారాజా

5. సోదర ప్రేమ సమాధానంబులతో
   సాత్వీక సంతోష భక్తి వినయాలతో
   వింతైన మాదు స్తుతి పరిమాళాలతో
   వినయంబున పూజింతుము నిన్ను
172 ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావాpranutintumu maa yehovaa paripoorna mahima prabhaavaa

Psalms 4:8

పల్లవి:
ప్రణుతింతుము మా యెహోవా - పరిపూర్ణ మహిమ ప్రభావా (1)
ప్రబలెన్ నీ రక్షణ మా విభవా (2)

1. నేను నిదురబోయి మేలు కొందును (2)
   నాపైన పదివేలు మోహరించినను (2)- నేనెన్నడు వెరువబోను (2)

2. నా మీదికి లేచి భాధించువారు
   వానికి రక్షణ లేదనువారు - వేలాదిగా నిల్చినారు

3. యెలుగెత్తి యెహోవా సన్నిధియందు
   విలపించి వేడినయట్టి దినమందు - వింతగ రక్షించితివంచు

4. రక్షణనిచ్చుట మన యెహోవాది
   రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు - రంజిల్లు నీ ధరణియందు

5. నీ అందచందాల మోము మెరిసింది
   నీ మాటలమృత ధారలొలికింది - నిన్నే ప్రేమించి పూజింతున్
173 అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవాasamaanundagu o kreestu adviteeyundagu devaa

Colossians 1:18

పల్లవి:
అసమానుండగు ఓ క్రీస్తు (1)- అద్వితీయుండగు దేవా (1)
అల్ఫాయు ఓమేగ  (2) - నీవే ప్రభువా (2)

1. ఇహపరములలో నీ జన్మ - మహానందము కలిగించె (2)
   అభయము నిచ్చి మాకు (1)- భయభీతిని బాపితివి (2)

2. నీ జీవిత వాక్కులన్ని - సజీవము జనులందరికి
   పావనుడా ప్రభు యేసు - అవనికి మాదిరి నీవే

3. మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవే
   సాతానున్ ఓడించి - నీతిగా మము తీర్చితివి

4. పాపశాపముల బాపితివే - చూపితివే పరమదారి
   శక్తిగల ఓ ప్రభువా - నీకే మా స్తోత్రములు

5. విశ్వమంతట ఓ దేవా - శాశ్వతమైనది నీ ప్రేమ
   జ్ఞానమునకు మించినది - ఉన్నతమైన ప్రేమ

6. సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివి
   సర్వ సంపూర్ణుండా - సర్వ మహిమ నీకే
174 ఘనత మహిమ ప్రభుకేghanata mahima prabhuke

Psalms 145:3

పల్లవి:
ఘనత మహిమ ప్రభుకే (2)  -తర తరములలో తనకే చెల్లును గాక (1)
ఘనత మహిమ ప్రభుకే (1)

1. నీతిమంతుడు మహానీయుడు (2) - స్తుతికీర్తనలతో సన్నుతించెదము (2)
   అద్భుతములను చేయు దేవుడు (2) - వినుతించెదము విమలాత్ముడని (2)

2. పావన ప్రభుయేసుండు - పరమ దీవెనలు మనకిచ్చెను
   తరతరములలో ఎరిగిన తండ్రిని - నిరంతరము స్తుతియించెదము

3. మనలను సిలువ రక్తముతో - కొని సమకూర్చెను సంఘముగాను
   తన శిరసత్వములో మనలుంచి - మనల నడుపు రారాజునకే

4. మాట తప్పని దేవుడేగ - మేటిగ నెరవేర్చె వాగ్దానము
   ధీటైన జనముగ మము జేసెనుగ - మెండుగ మమ్ము దీవించెనుగా

5. పరమప్రభువు మనకొరకు - అర్పించుకొనెను తన్ను తానే
   సర్వము మనకు యిచ్చిన ప్రభునే - సర్వద మనము సంస్తుతియించెదము
175 స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకుstutiyu mahima ghanata neeke yugayugamula varaku

Psalms 70:4

పల్లవి:
స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు (1)
ఎంతో నమ్మదగిన దేవా (2)

1. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము (2)
   మేమందరము ఉత్సహించి సంతోషించెదము (2)
   కొనియాడెదము మరువబడని మేలులజేసెనని (2)

2. నీ వొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు
   నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా
   నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము

3. నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యత మాపై
   ఖ్యాతిగ నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు
   ప్రీతితో మాస్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా

4. నీవే మాకు పరమప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి
   జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా
   నడిపించెదవు సమభూమిగల ప్రదేశములో నన్ను

5. భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మాకొరకు
   మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్
   పరము నుండి మాకై వచ్చే ప్రభుయేసు జయము
176 నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెనుnaa prabhu preminchenu nannu priyudaina kreestu preminchenu

Galatians 2:20

పల్లవి:
నా ప్రభు ప్రేమించెను (2) నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను (1)
నాకై తానే అర్పించుకొనెను (2)

1. ప్రేమించెను నన్ను ప్రేమించెను - పరిమళ సువాసన ప్రభువాయెను (2)
   యెహోవా సన్నిధిలో అర్పించెను (2) మహాబలి గావించెను (2)

2. శాశ్వత ప్రేమతో ప్రేమించెను - సంఘమును క్రీస్తు ప్రేమించెను
   దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను - తన ప్రాణమును అర్పించెను

3. మొదటాయనే నన్ను ప్రేమించెను - తన్ను ప్రేమింపను నేర్పించెను
   దేవుడే ప్రేమామయుడని తెల్పెను - ప్రియముగ ప్రాయశ్చిత్తంబాయెను

4. లోకమును ఎంతో ప్రేమించెను - కార్చెను రక్తము పాపులకై
   కడిగెను నన్ను తన రక్తముతో - నాకై మరణము సహించెను

5. ప్రభువా నిన్నే ప్రేమింతును - నీ నామమునే ప్రేమింతును
   నీ రక్షణ నాకు ప్రియమైనది - నీ మందిరమున్ ప్రేమింతును
177 ఓ ప్రభు నీవే ధన్యుడవుo prabhu neeve dhanyudavu

Ephesians 1:3-11

పల్లవి:
ఓ ప్రభు నీవే ధన్యుడవు (2)
సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి (1)
ఉల్లసించుచున్నది అద్భుతము నీ సంకల్పం (2)

1. స్తుతి ప్రశంస ప్రభుయేసునకే - క్రీస్తు నందు తండ్రి సర్వంచేయున్ (2)
   పరమందలి ప్రతి ఆశీర్వాదం (2) క్రీస్తు నందు మనకు సర్వంనొసగె (2)

2. జగత్తు పునాది వేయకమునుపే ఏర్పర్చుకొనె మనల క్రీస్తు ప్రభులో
   పరిశుద్ధులుగా నిర్దోషులుగా జేసె - పరలోక దీవెనలు మనకొసగె

3. తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించె
   ఒకదినము అధికారము మనకొసగును
   యేసునందుకలదీ ఆశీర్వాదం

4. తన కృపామహదైశ్వర్యమునుబట్టి తన వారిగమనల స్వీకరించె
   తన రక్తముతో విమోచించి - క్షమాపణ మనకు క్రీస్తులో నొసగె

5. తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు
   తన చిత్తము ద్వారా సర్వము చేసి
   తన స్వాస్థ్యముగా మనల జేసెను
178 పొందితిని నేను ప్రభువా నీ నుండిponditini nenu prabhuvaa nee nundi

2 Cor 9:15

పల్లవి:
పొందితిని నేను ప్రభువా నీ నుండి - ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు (2)

1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని (2) ఇంతవరకు నాకుతోడై యుండి (2)
   ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా (2) నా రక్షణ కర్తవు నీవైతివి (2)

2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకారశక్తుల ప్రభావమునుండి
   నీ రెక్కల చాటున నను దాచితివయ్యా - నీవే ఆశ్రయ దుర్గం బైతివి

3. కష్టదుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే
   భయభీతి నిరాశలయందున ప్రభువా
   బహుగా దైర్యంబు నా కొసగితివి

4. నా దేహమందున ముల్లు నుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్
   వ్యాధి బాధలు బలహీనతలందు - నీ కృపను నాకు దయచేసితివి

5. నీ ప్రేమచేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
   కష్టపరీక్షల యందున ప్రభువా - జయజీవితము నాకు నేర్పించితివి
179 అందరము ప్రభు నిన్ను కొనియాడెదముandaramu prabhu ninnu koniyaadedamu

Revelation 19:1

పల్లవి:
అందరము ప్రభు నిన్ను కొనియాడెదము (2)
మహాత్ముండవు పరిశుద్ధుడవు (2) బలియైతివి లోకమును రక్షించుటకు (2)

1. అపారము నీ బుద్ధిజ్ఞాన మెంతయో (2)
   సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది (2)
   సర్వలోకము నీదు వశమందున్నది (2)

2. గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా
   అద్భుతములు చేయు దేవ నీవే ఘనుడవు
   శత్రువులను అణచునట్టి విజయశాలివి

3. బండవైన ప్రభూ మమ్ము స్థిరపరచితివి
   నీదు మార్గములు యెంతో అగమ్యంబులు
   కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు

4. కృపాళుండవైన యేసు దయగల దేవా
   దయాకనికరములు గల దీర్ఘశాంతుడవు
   వేల వేల తరములలో కృపను జూపెదవు

5. క్షమించెదవు మానవుల పాపములెల్ల
   విరోధులకు ప్రేమ జూపు దయామయుడవు
   పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా
180 పూజనీయుడేసుప్రభు పలునిందల నొందితివా నాకైpoojaneeyudesuprabhu palunindala nonditivaa naakai

1 Peter 2:23

పల్లవి:
పూజనీయుడేసుప్రభు పలునిందల నొందితివా నాకై (2) పూజనీయుడేసు ప్రభు (1)

1. నీ స్వకీయులే నిందించిన - నీన్నంగీకరించక పోయిన (2)
   ఎన్నో బాధ లొందితివా నాకై - సన్నుతింతును నీ ప్రేమకై (1)

2. సత్యము మార్గము మరి జీవమై - నిత్యజీవమియ్యను వచ్చితివి
   వంచకుడవ నిన్ను నిందించిర - ఓ దయామయ నజరేయుడ

3. యూదా గోత్రపు ఓ సింహమా - ఆద్యంతరహిత దైవమా
   అధములు నిన్ను సమరయు డనిర - థుడా నిన్ను బహు దూషించిరా

4. దూషించు శత్రుసమూహములన్ - దీవించి ఎంతో క్షమించితివి
   దూషకుడవని నిన్ను దూషించిర - దోషరహితుడా నా యేసు ప్రభు

5. దయ్యములు నినుజూచి వణికినను - దయ్యముల పారద్రోలినను
   దయ్యములు పట్టిన వాడనిర - ఓ దయామయ నా యేసు ప్రభు

6. మధురం నీ నామం అతి మధురం - మధుర గీతముతో నిన్నా రాధింతును
   వధియించబడితివ యీ పాపికై - వందితా ప్రభు నిన్ను పూజింతును
181 నే పాడెద నిత్యము పాడెద ప్రభువా నీకు స్తుతి పాడెదన్ne paadeda nityamu paadeda prabhuvaa neeku stuti paadedan

Psalms 78:72

పల్లవి:
నే పాడెద నిత్యము పాడెద (2)
ప్రభువా నీకు స్తుతి పాడెదన్ (2)
నే పాడెద నిత్యము పాడెద - నే పాడెద  (1)

1. మంచి కాపరి నీవైతివి - గొర్రెలకొరకు ప్రాణమిచ్చితివి (2)
   పాపపు పాత్రను నీవే త్రాగితివి - రక్షణ పాత్రను నా కొసగితివి (2)
   హర్షించి ప్రభు పాడెదను (1)

2. గొప్ప కాపరివి తోడై యున్నావు - ప్రతి అవసరతన్ తీర్చుచున్నావు
   నా ప్రాణమునకు సేదనుదీర్చి - మరణలోయలలో తోడై యుందువు
   యాత్రలో పాడుచు వెళ్ళెదను

3. ఆత్మల కాపరి సత్యవంతుడవు - గొర్రెలన్నిటికి కాపరి నీవై
   ద్వేషించెదవు దొంగకాపరులన్ - నీగొర్రెలు నీస్వరమును వినును
   హృదయపూర్తిగ పాడెదను

4. ప్రధానకాపరి ప్రేమమయుడవు - త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు
   మహిమకిరీటము నాకొసగెదవు - పరమనగరమందు నన్నుంచెదవు
   ఎలుగెత్తి ప్రభు పాడెదను
182 ప్రవిమలుడా పావనుడా స్తుతిస్తోత్రము నీకేpravimaludaa paavanudaa stutistotramu neeke

Romans 5:5

పల్లవి:
ప్రవిమలుడా పావనుడా - స్తుతిస్తోత్రము నీకే (2)
పరమునుండి ప్రవహించె - మాపై కృప వెంబడి కృపలు (1)

1. నీ మందిర సమృద్ధివలన - తృప్తిపరచు చున్నావుగా (2)
   ఆనంద ప్రవాహ జలమును (2) - మాకు త్రాగనిచ్చితివి (1)
   కొనియాడెదము నీ కృపకై - ఆనందించుచు పాడెదము (2)

2. దేవుని సంపూర్ణతలో మమ్ము - పరిశుద్ధులుగా జేసియున్నావు
   జ్ఞానమునకు మించిన ప్రేమ - మాలో బయలు పరచితివి
   కృతజ్ఞతలు చెల్లించుచు - పూజించెదము నిన్నెప్పుడు

3. దైవత్వము నిండి యుండెనుగా - క్రీస్తు యేసు ప్రభువునందు
   ఆయనయందు సంపూర్ణులుగా - మమ్ము జేసియున్నావు
   సాగిలపడుచు నీ కృపకై - ఆరాధింతుము నిన్నిలలో

4. నిర్ధోషులుగా నిరపరాధులుగా - నీ రక్తముతో మము జేసితివి
   సర్వసంపూత్ణత మాకిచ్చి - సిలువలో సంధిజేసితివి
   నిత్యము నిన్ను స్తుతించి - ఘనపరచెదము నిన్నిలలో

5. కృపా సత్యసంపూర్ణుడవై - మామధ్యలో నివసించితివి
   లోకమునందు నమ్మబడితివి - అద్వితీయ తనయుడవై
   నిరతము నిన్ను కీర్తించి - సమాజములో పాడెదము
183 విజయుండు క్రీస్తు ప్రభావముతోvijayundu kreestu prabhaavamuto

1 Cor 15:57

పల్లవి:
విజయుండు క్రీస్తు ప్రభావముతో - ఘనవిజయుండాయెను (2)
సాతానుని తలను చితుక ద్రొక్కెను (2) - సదా రాజ్యమేలును (1)

1. ఓ మరణమా నీ ముల్లు యెక్కడ? ఓ సమాధి నీ విజయమెక్కడ? (2)
   సిలువ శక్తితో విరుగగొట్టెను (2) - విజయుండు సర్వంబులో (1)

2. యూదా గోత్రంపు సింహమాయనే - గ్రంథమును విప్ప యోగ్యుండు తానే
   ఏడు ముద్రలను విప్పెడివాడు - యోగ్యుండు సర్వమందు

3. ఆయనే శిరస్సు తన సంఘమునకు - మృతులలో నుండి ప్రథముడై లేచె
   మన ప్రభుయేసే మరణమును గెల్చె - సర్వములో ప్రధానుడై

4. సింహాసనమందు వున్న మన ప్రభువే - పద్మరాగముల మరకతముల బోలి
   సూర్యకాంతివలె ప్రకాశించెను - జయమని పాడెదము

5. ఆయన యెదుట సాగిలపడి - నాలుగు జీవులు పెద్దలందరును
   సర్వసృష్టికి దేవుండవని - ఆరాధించి మ్రొక్కిరి

6. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు - విజయమునిచ్చె తన ద్వారా మనకు
   అధిక విజయము మనకిచ్చు ప్రభు,వే - అందరిలో అతిశ్రేష్టుండు
184 యేసు ప్రభువే సాతాను బలమును జయించెనుyesu prabhuve saataanu balamunu jayinchenu

Hebrews 2:14-15

పల్లవి:
యేసు ప్రభువే సాతాను బలమును జయించెను - అందరము (1)
విజయగీతములు పాడెదము (2)

1. దావీదుకు చిగురు నీవై - యూదా గోత్రపు సింహము నీవై (2)
   దేవా నీవే గ్రంథము విప్ప (2)- జయమొందితివి నీకే స్తోత్రములు (2)

2. మన శ్రమలలో విజయము నిచ్చున్ - తన రాజ్యమునందు మనలను చేర్చున్
   ఘన విజయమును మనకై పొందెన్
   ఘన విజయము యేసేయని హర్షించెదము

3. మనలనెంతో ప్రేమించెను - తనయులముగ జయము పొందితిమి
   సర్వములో విజయమిచ్చిన - సర్వేశ్వరుండా నీకే జయము

4. మన మాయన సంఘముగా - తన రక్తము ద్వారా సమకూర్చెను
   సంఘమునకు శిరస్సాయనే - సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము

5. మహోన్నతుడు మహా ఘనుడు - మహిమరాజు మనకు విజయమునిచ్చె
   మరణము గెల్చి తిరిగి లేచె - ఆర్భాటముతో మనము హర్షించెదము
185 పాడెదము నీ స్తుతులను మహా ప్రభువాpaadedamu nee stutulanu mahaa prabhuvaa

Psalms 24:8

పల్లవి:
పాడెదము నీ స్తుతులను మహా ప్రభువా (2)
నిన్ను మేము పూజించెదము శ్రద్ధభక్తితో (2)

1. ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు నిచ్చి (2)
   ధనవంతులుగ మమ్ము జేయ పేదవైతివి (2)

2. దేవుని స్వరూపమైయుండి యెంచలేదు సమానుడని
   రిక్తుడై నిందను భరించి దాసుడైతివి

3. పరీక్షించబడిన ప్రభు నిర్దోషిగనైతివినిల
   నీతి న్యాయములు గలిగి జయించితివి

4. పాపమెరుగని వాడవు కపటమేమి లేదు నీ నోట
   ఎవరిని దూషింపను లేదు పవిత్రుడవు

5. నీచుడుగా నీ వెంచబడి తృణీకరింప బడితివి
   వ్యాధి బాధ వేదన పొంది సహించితివి

6. గాయపరచబడితివి మాకు బదులుగా ప్రభువా
   నలుగ గొట్టబడిన నీవు మరణమైతివి

7. పరాక్రమ శాలివై ప్రభు సజీవుడవై లేచితివి
   మరణమును జయించితివి విజయుండవై
186 ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్prabhuvaina kreestu mahimaasvaroopa poojintumu nin

Exodus 40:34

పల్లవి:
ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్ (2)

1. సార్వత్రిక సంఘ నగర విహారీ (2) - సర్వస్వానీ కాధారీ (ఆ..ఆ..) (2)
   పరిశుద్ధ మహాసభల ప్రధానీ (2) - భక్తస్తుతి హారాధారీ (ఆ..ఆ..) (2)

2. భక్తుండగు మోషే నీదు ఆనతిని - నిర్మించె గుడారమున్
   దానిన్ నీదు మహిమతో నింపి - ధగధగ మెరిపించిన ప్రభో

3. రూపాంతర మొంది రవికాంతిన్ మెరసి - రమ్యంబుగా శిష్యుల
   హృదయ సుమముల్ విరియబూయన్ - సదయా ప్రకాశించితివి

4. దీక్షన్ నీవే ప్రభూ తండ్రిచిత్తమున్ - నెరవేర్చితివి పూర్తిగా
   ధీరుడవై నీ ప్రాణం నొసగి - తండ్రిని మహిమపరచితివి

5. మంటి పురుగులమౌ మమ్ము రక్షించి - మా నీతిమహిమ నీవై
   మాలో నీవు మహిమరూప - మహిమ పరచబడినావు

6. మా స్తుతిసుగంధముల్ మా ప్రేమపూజల్ - మాదు కృతజ్ఞతలు
   మాప్రాణాత్మల్ మాదుతనువుల్ -మా ప్రభు నీస్వంతం నిరతం
187 యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికిyesu prabhuni sankalpamulu maaravu ennatiki

Exodus 40:33

పల్లవి:
యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి (1)
మహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు (2)

1. మోషేను ఏర్పరచుకొనె తన ప్రజలను విడిపింప (2)
   చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో (2)
   త్రోసినను నడిపించెను వారిని విసుగక తనత్రోవ (2)

2. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపె
   ఆవరణము నేర్పరచెను నిండుగ తెరవేసె
   దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసె

3. మందిరపని అంతయును సంపూర్ణము చేయగనే
   సుందరముగ నొక మేఘము గుడారమును కమ్మె
   మందిర మంతయు యెహోవా తేజస్సుతో నిండెన్

4. నావన్నియును నీవేగదా అమరుడవగు దేవా
   నీవన్నియును నాకిచ్చితివి నీకృపను బట్టి
   మహిమ పరతును ఎల్లప్పుడు ఇహపరములయందు

5. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి
   పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో
   నిరతము మహిమ స్తుతిఘనత చెల్లించెద మెపుడు
188 జయశీలుడవగు ఓ మా ప్రభువాjayasheeludavagu o maa prabhuvaa

2 Cor 2:14

పల్లవి:
జయశీలుడవగు ఓ మా ప్రభువా -  జయగీతముల్ పాడెదం (2)

1. పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి (2)
   కృతజ్ఞతచే హృదయము నిండె స్తుయింతుమో మా ప్రభు (2)

2. నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయెను
   ఉదయించెమాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము

3. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబును
   నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడ నొసగితివి

4. శత్రుని వురిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి
   భయభీతిలోన అభయంబు నిచ్చి విడిపించితివి మా ప్రభో

5. యుద్దంబు నాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను
   అని ప్రభూ నీవు పోరాడితివి మా పక్షమందు నీవే

6. క్రీస్తేసు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహముతో మము
   ఊరేగించుచు మహిమ నొందుచున్న దేవా స్తోత్రములు

7. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచు కొంటివి నీవు
   విడువబడిన మమ్ము వివాహితగా జేసె హల్లెలూయా పాడెదము
189 మహా సామర్థ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవుmahaa saamarthyaa o yesu bahu vishaaludavu neevu

Colossians 1:16

పల్లవి:
మహా సామర్థ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు (2)
ప్రేమపూర్ణుడా నిన్ను మనస్సార స్తుతించెదను (2)
మహా సామర్థ్యా  ఓ యేసు బహు విశాలుడవు నీవు (2)

1. ప్రభు నీవే నాదు జీవము నేను పూర్తిగా మృతుడను
   దాచబడితిని నీయందు స్థిరపరచితివి నన్ను (2)
   ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను (2)

2. సర్వశ్రేష్టుండా ప్రభువా సర్వ ప్రదానుండవు నీవే
   నీదు చిత్తం నెరవేర్చుకో నీదు ప్రభుత్వమందున్నాను
   నీవే శిరోమణివి ప్రభో ఆర్భాటించి స్తుతించెదను

3. నాయందున్న ప్రభువా నీవే శుభ నిరీక్షణయైతివి
   వేగ వచ్చుచున్నావని నా ఆశ అధికంబగుచుండె
   సంధింతు ప్రభు నిన్ను మహా సంతోషస్తుతుల నర్పించి

4. ప్రభు నీవే విజయుండవు మరణమున్ జయించితివి
   సర్వశక్తి అధికారంబుల్ నీదు వశమందున్నవి
   నిన్నుబట్టి జయించెదను దీనుడనై భజించెదను
190 స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూstutiyoo, prashansayoo, mahimayoo

John 4:24

పల్లవి:
స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ - నా ముక్తి దాతకే
ఆత్మసత్యముతో - ఆరాధించెదన్ - హృదయపూర్వక - కృతజ్ఞతలన్
సదా సర్వదా చెల్లింతున్ - (2) స్తుతియూ

1. కొనియాడెదన్ నీదు కల్వరి ప్రేమను - వర్ణించలేను నీ అపార ప్రేమను (2)
   ఘోరవేదన - సంకట శ్రమలన్ - శపిత సిల్వపై క్రీస్తు సహించెను
   తండ్రి చిత్తము నూ నెరవేర్చెను - (2)

2. కీర్తించెదా నీదు అపారకరుణకై - పరమ పుత్రుండు వేదన నోర్చెను
   అవమాన నిందలు - మోముపై ఉమ్మియూ
   ప్రేమతో అన్నియూ సహించె మౌనమున్
   అమూల్య ప్రాణమిచ్చె మానవాళికే (మనకొరకే)

3. కృతజ్ఞత చెల్లించెద నీ బలిదానమునకై - అంతులేని నీ గొప్ప ప్రేమకై
   అనంత జీవము మహిమ నిరీక్షణ - నా జీవితమునకే ఆధారమాయె
   క్రీస్తుకే పాడెదన్ హల్లెలూయ
191 ఓ అబ్రాహాం, ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవుo abraahaam, issaaku ishraayelu devaa nitya nivaasi neevu

1 Kings 18:36

పల్లవి:
ఓ అబ్రాహాం, ఇస్సాకు - ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు (2)

1. ఏలోయి అదోనియా - త్రియేక దేవా
   ప్రభుడవు - సృష్టి - కర్తవు నీవు (2)
   ఎల్లరి అద్భుత - రక్షకుడవు (2)

2. యెహోవాదేవా - ప్రభువుల ప్రభువా - దర్శనమిచ్చు - దేవుడవు
   ఉన్నవాడవు - నిత్యుడవు

3. ఎల్ షద్దాయి - ప్రభువా - సర్వశక్తిమంతుడా
   సంపూర్ణ తృప్తినిచ్చు - ప్రభువు నీవే
   సమృద్ధిని రక్షణను - యిచ్చు వాడవు

4. యెహోవా యీరే - చూచుకొనువాడవు
   యెహోవా రోపె - స్వస్థ పరచువాడవు
   యెహోవా నిస్సీ - విజయమిచ్చువాడవు

5. యెహోవా కాదేషు - శుద్ధి చేయువాడవు
   యెహోవా షాలేము - శాంతి కర్తవు
   యెహోవా సిద్కెను - మా నీతియు నీవే

6. యెహోవా రోహి - లోక సంరక్షకుడా
   గొర్రెల నెన్నటికి - నెడబాయవు
   వాటిని విడువక - నడి పెద

7. యెహోవా షమ్మా - ఇచ్చటున్న వాడవు
   జీవింతువు ప్రభు - యుగ యుగముల్
   సదా మమ్ము నీతోనే - నుంచెదవు
192 నా ప్రియమైన యేసుప్రభు వేలాదిస్తోత్రములుnaa priyamaina yesuprabhu velaadistotramulu

Psalms 103:2

పల్లవి:
నా ప్రియమైన యేసుప్రభు - వేలాదిస్తోత్రములు (1)
నీ విచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు (1)
నీవు చేసిన ఉపకారముకై దేవా - స్తోత్రము స్తోత్రములు (1)

1. ఆపద దినములలో - నా ప్రభుని తలచితిని (2)
   దేవా నీ దయతోడనే - నాథా - ఆశ్రయం పొందితివి (2)

2. ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం
   నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై

3. పాపపు లోకపులో - నే పాపిగా జీవించితిని
   శుద్ధ హృదయ మిచ్చావు - దేవా - నిన్నునే దర్శించుటకై

4. ఈ దినమునే పాడుట - నీ వలనే యేసుప్రభు
   ఎల్లప్పుడు నే పాడెదన్ - దేవా - నాయందు వసియించుము

5. మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును
   నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి
193 తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదముtambura sitaarato maa prabhuni aaraadhinchedamu

Psalms 150:3-4

పల్లవి:
తంబుర సితారతో  మా ప్రభుని ఆరాధించెదము (2)
తన నివాసముగ  మమ్ము సృష్టించిన (2)
నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము (2)

1. ఆది ఆదాము - మరణ శాసనము - మా శరీరమున్ - ఏలుచుండగా (2)
   అమరుడవై ప్రభూ - భువికేతెంచి (2)
   మరణపు ముల్లు విరచి - మరణమున్ - గెలిచిన మా ప్రభువా (2)

2. పాపము నుండి - చీకటి నుండి - ఆశ్చర్యకరమగు - వెలుగులో నడిపి
   తన ఆలయముగ చేసిన ప్రభుకు
   స్తుతి మహిమ - ఘనత - సీయోనులో అర్పించెదమెప్పుడు

3. పరలోక పిలుపుతో - ప్రభు మమ్ము పిలచి - నరకపు శిక్ష - తొలగించె మానుండి
   పరిశుద్ధులతో - మమ్ము చేర్చిన ప్రభూ
   నిర్మించెను యిలలో - గృహముగా - తన ఆత్మ ద్వారా

4. ఆత్మీయ యింటికి - క్రీస్తే పునాది - సజీవమైన రాళ్ళే ప్రజలు
   ఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పి
   ఆద్యంతరహితుడై - నడుపును - మోక్షపురికి మమ్ము

5. మన్నయినది - వెనుకటివలెనే - మరల భూమికి తప్పక చేరున్
   మానవ సంపద - కీర్తి మహిమలు గతించి పోవునిల
   "సీయోను - మరువకు నీ ప్రభుని

6. లెబానోను వీడి - నాతోరమ్ము - లోకపు ఆశలు గతించిపోవును
   హెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచు
   హెబ్రోను చేరుదము - ప్రభువును ఆరాధించెదము
194 నా ప్రియుడా పాపవిమోచకుడాnaa priyudaa paapavimochakudaa

Ephesians 1:7

పల్లవి:
నా ప్రియుడా - పాపవిమోచకుడా - ప్రభుయేసు (2)
నా ప్రాణమును కాపాడి - నూతన బలమొసగెను (2)
స్తుతి గీతములతో - ఆరాధించెదను - ఎల్లప్పుడు (2)

1. యేసుని రక్తమందు - ముక్తి లభించెను - స్తుతించెదన్
   యేసుని నిత్య జీవము - పొందెదను నిశ్చయం
   యేసునకె నా స్తుతి సుమములు - సుమధురం

2. తల్లి గర్భమునె ఎరిగి నన్ను - ప్రేమించెన్
   తల్లిని మించిన ప్రేమ - జూపిన మరువని ప్రేమ
   తల్లి మరిచిన మరువ డేసు - నిరతము

3. సూర్యకాంత సుగంధ సునీల - సువర్ణము
   సూర్యతేజస్సు మించిన - ఆ వెల్గు రాజ్యములో
   సూర్యునివలె తేజరిల్లెదను - నా యేసుతో

4. బూరశబ్దముతో నీవరుదెంచు - దూతలతో
   నాకై గాయపడిన - బంగారు నీ మోమున్
   రక్షణతో నిరీక్షించెదన్ - వీక్షింపన్

5. సూర్యచంద్ర ఆకాశం దాటి - నీ చెంతకు
   జీవవృక్షమున చెంత జీవనదిని చేరి
   హల్లెలూయ హల్లెలూయ - ఎల్లప్పుడు
195 నీ మందిరము అతిశృంగారము - నీ ప్రజలందరికిnee mandiramu atishrungaaramu - nee prajalandariki

Revelation 21:10

పల్లవి:
నీ మందిరము అతిశృంగారము - నీ ప్రజలందరికి
మహిమ తేజస్సు మెండుగ నింపి - నూతన పరచు దేవ  (2)

1. నీ రక్తము చిందించి - నూతన జన్మము నిచ్చి - (2)
   స్వాస్థ్యముగ మమ్ముజేసి - నీ మందిరమున నిలిపి - (2)
   కొదువలయందు కృపచూపించి - తృప్తిగ పోషించితివి - (2)
   మహిమ ... మహిమ ... మహిమ ... నీకే - (2)

2. నీ మందిరములో నిత్యము - వసియించి వర్ధిల్లెదము"
   అనుదినము స్తుతియించి - నూతన బలమును పొంది
   అన్నిటియందు దీవించబడి - ధన్యులుగా నుండెదము
   మహిమ ... మహిమ ... మహిమ ... నీకే

3. నీ మందిరములో దొరుకున్ - నిత్యానందము నిరతం
   శోధన శ్రమల యందు - కదలక స్థిరముగ నిలచు
   అంతము లేని అద్భుతమైన - ఆదరణ పొందెదము
   మహిమ ... మహిమ ... మహిమ ... నీకే

4. కోల్పోతిమి నీ మహిమను - మా అతిక్రమముల వలన
   క్షమియించి నింపుము దేవ - మహాప్రభావ మహిమను
   మునుపటి మహిమను మించిన మహిమతో - నిండుగ నింపుము దేవ
   మహిమ ... మహిమ ... మహిమ ... నీకే

5. అంతము వరకు మమ్ము - సజీవ రాళ్ళవలె నుంచి
   కట్టుము ఆత్మ మందిరము - నింపుము అధిక మహిమను
   యుగయుగములకు ఘనత మహిమ - నీకు కలుగును గాక
   మహిమ ... మహిమ ... మహిమ ... నీకే
196 యేసు నీకే జయం జయముyesu neeke jayam jayamu

John 4:42

పల్లవి:
యేసు నీకే జయం జయము (2) - నీవె లోక పాల - కుడవు (2)
సర్వ సృష్టికి సృష్టి - కర్తవు - సర్వలోక రక్ష - కుడవు  (2)
జై జై అనుచు నీ - కే పాడెదం (2)

1. జన్మించె జగమున మానవ రూపములో
   ప్రాయశ్చిత్తముకై - తానె బలియాయె (2)
   పాపియైన మానవుని రక్షింప - శిలువ నెక్కి తన ప్రాణము నిచ్చెన్ 2"
   హల్లెలూయా భువిపైన (2)

2. మరణము ద్వారా - అంతమాయె బలులు - తన సమాధి, సర్వం కప్పెన్
   తిరిగి లేచుటచే, సర్వం నూతనమాయె
   సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి
   హల్లెలూయా భువిపైన

3. స్వర్గం వెళ్ళి, గొప్ప స్వాగతమొందెన్
   తండ్రి కుడిప్రక్కన, ఆయన కూర్చుండెన్
   రాజుల రాజై, ప్రభువుల ప్రభువై - పొందె అధికారము పరలోకముపై
   హల్లెలూయా భువిపైన

4. తన రూపమునకు మార్పు, నిష్టమాయె
   సృష్టికంటె ముందు తానే సంకల్పించె
   లోక దుఃఖము నుండి - మనం తప్పించుకొని
   తన రూపము నొంది - తనతో నుండెదం
   హల్లెలూయా భువిపైన
197 ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతోaanandamuto aaraadhintun aatmatonu satyamuto

John 4:24

పల్లవి : ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను - సత్యముతో
అనుపల్లవి : రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతును
హర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును

1. పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెను
పరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను
|| ఆనందముతో ||

2. మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెను
పరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను
|| ఆనందముతో ||

3. శత్రుని ఉరి నుండి విడిపింపను - శత్రువుతో నాకై పోరాడెను
పదిలంపు జీవం నాకివ్వను - క్రీస్తునందు నను దాచెను
|| ఆనందముతో ||

4. పరలోక పౌరసత్వం నా కివ్వను - పరమును వీడి ధరకేతెంచెను
సమృద్ధి జీవం నాకివ్వను - తన ప్రాణమర్పించెను
|| ఆనందముతో ||

5. శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైనను
ప్రత్యేక జీవం జీవించను - అర్పించుకొందు నీకు
|| ఆనందముతో ||

 6. అంగీకరించు - నా జీవితమును - నీ కొరకే ప్రభువా
హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ
|| ఆనందముతో ||
198 నా మనోనేత్రము తెరచిnaa manonetramu terachi

Ephesians 1:17

పల్లవి:
నా మనోనేత్రము తెరచి - నా కఠిన హృదయమును మార్చి (2)

అను పల్లవి:
అంధకారములో నేనుండ (2) - వెదకి నన్ రక్షించితివి || నా ||

1. నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి (2)
   కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) - పొందినన్ విడిపించితివి (1)

2. వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేర
   సర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా

3. ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా!
   బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా

4. ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యా
   విరిగి నలిగిన హృదయముతో - అర్పింతు ఆత్మార్పణను

5. నీ సన్నిధిని నే కోరి - నీ సన్నిధిలో నేమారి
   స్తుతి పాత్రగ ఆరాధింతున్ - యుగ యుగములు సర్వయుగములు
199 మహిమ, ఘనత, స్తుతి ప్రభావముmahima, ghanata, stuti prabhaavamu

Revelation 5:13

పల్లవి:
మహిమ, ఘనత, స్తుతి ప్రభావము - నీకే కలుగును గాక ఆ. ఆ. .
నీకే కలుగును గాక మా దేవా - నీకే కలుగును గాక !

1. బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు - నీ దానములే జ్ఞాన స్వరూపి (2)
   జగమును సౄష్టించి - నిర్వహించు వాడవు (2)
   నీ జ్ఞానమును - వివరింపతరమా (2)
   నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా - నీ జ్ఞానముతో నింపు మమ్ము

2. వెండి బంగారు అష్టైశ్వర్యములు - నీ దానములే శ్రీ మంతుడా
   శ్రేష్ఠ ఈవులనిచ్చు - జ్యోతీర్మయుడవు
   నీ మహిమైశ్వర్యం - వివరింపతరమా
   నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా - నీ మహిమైశ్వర్యమిమ్ము

3. అధిక బలము సంపూర్ణ శక్తి - నీ దానములే యుద్దశూరుడా
   నీ కసాద్యమైనది లేదే యెహోవా
   నీ సర్వశక్తిని - వివరింపతరమా
   నీ సర్వశక్తితో నింపు మా దేవా - నీ సర్వశక్తితో నింపు

4. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ - జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీ
   కొలువగలేము నీ - ఘనప్రేమను
   సాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమా
   నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా - నీ ప్రేమతో నింపు మమ్ము

5. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని - అగాధ సముద్రముల్ జ్వాలామయుడా
   మరణమంత బలమైన - నీ ప్రేమ ధాటిని
   అగపె ప్రేమను - వివరింప తరమా
   అగపే ప్రేమతో నింపు మా దేవా - అగపే ప్రేమతో నింపు
200 హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్hallelooya paadedaa prabhu ninnu koniyaadedan

Psalms 146:2

పల్లవి:
హల్లేలూయ పాడెదా... ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందున (2)- నిన్ను పూజించి కీర్తింతును (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

1. వాగ్ధానముల నిచ్చి - నెరవేర్చువాడవు నీవే (2)
   నమ్మకమైన దేవా - నన్ను కాపాడువాడవు నీవే (2)
   ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

2. నాదు శత్రువులను - పడద్రోయు వాడవు నీవే
   మహా సామార్థ్యుడవు - నా రక్షణ శృంగము నీవే
   ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

3. ఎందరు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్
   ప్రభువా నే వేలుగొందితిన్ - నా జీవంపు జ్యోతివి నీవే
   ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

4. భయమును పారద్రోలి - అభయము నిచ్చితివి
   ఎబినేజరు నీవై ప్రభు - నన్ను సంరక్షించుచుంటివి
   ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

5. కష్టములన్నింటిని - ప్రియముగా భరియింతును
   నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే
   ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

6. ఈ జీవిత యాత్రలో - ఏమి సంభవించిన
   మహిమా నీకే ఓ ప్రభూ - ఇదియే నా దీన ప్రార్థనా
   ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
201 ఆరాధనలకు యోగ్యుడవు - స్తుతి గీతంబులకు పాత్రుడవుaaraadhanalaku yogyudavu - stuti geetambulaku paatrudavu

Revelation 5:12

పల్లవి:
ఆరాధనలకు యోగ్యుడవు (2) - స్తుతి గీతంబులకు పాత్రుడవు (2)
ప్రభు యేసు నిన్ను పూజింతును (2) - మనసార నిన్నే కీర్తింతును (2)
ఆరాధనలకు - యోగ్యుడవు (2)

1. భరియించితివి నా రోగములన్ - భరియించితివి నా వ్యసనములన్ (2)
   అరిగితివి నాకై కలువరికి (2) - పరిహరించితివి పాప శిక్షన్ (2)

2. నా యతిక్రమములకై గాయపడి - నా దోషములకై కొట్టబడి
   చిందిన సిలువ రక్తములో - నా దారిద్య్రము తొలగించితివి

3. నశియించిన నను వెదకితివి - నశియించిన నను లేపితివి
   నా శాపమును చూపించితివి - నీ శాంతముతో క్షమించితివి
202 స్తోత్రించెదము దైవకుమారునిstotrinchedamu daivakumaaruni

Psalms 40:2

1. స్తోత్రించెదము దైవకుమారుని - నూతన జీవముతో (2)
   నిరంతరము మారని రాజును - ఘనంబు చేయుదము (2)

పల్లవి:
యేసు మా రక్షకుడు - కల్మషము లేనివాడు  (1)
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ  (2)

2. భయంకరమైన భీతిని గొల్పెడు - జిగట ఊబి నుండి
   బలమైన హస్తముతో నన్ను ఎత్తి - బండపై స్థిరపరచెను ||యేసు||

3. కనుపాపగ నను కాయు ప్రభుండు - కునుకడు నిద్రించడు
   తనచేతిలో నన్నుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము ||యేసు||

4. తల్లిదండ్రియు యెడబాసినను - విడువక కాయును
   ఎల్లప్పుడు నేను భజియించెదను - వల్లభుడేసు ప్రభున్ ||యేసు||

5. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు - ఆత్మశక్తినిచ్చెన్
   స్తుతియునీకే ఘనతయు నీకే – యుగయుగములలోన ||యేసు||
203 దావీదు వంశ యేసు క్రీస్తుకు - స్తుతి చెల్లించుడిdaaveedu vansha yesu kreestuku - stuti chellinchudi

Matthew 21:9

1. దావీదు వంశ యేసు క్రీస్తుకు - స్తుతి చెల్లించుడి (2)
   స్వర్గస్తులమగుటకు మనలను విడిపించిన ప్రభువునకు (2)
   హోసన్నా హోసన్నా - భువిలో సంతోషం (2)

2. మనుజావతారమున భువికి వచ్చి
   తన స్వంత జీవమును బలిగాను యిచ్చి
   హోసన్నా యేసుని పేరిట పరమును మనకొసగెన్

3. ప్రియ తండ్రీ ఈ భువిలో సకల మహిమయు నీకే
   సూర్య చంద్ర సృష్టియావత్తు స్తుతియించి మహిమపరచున్
   హోసన్నా హోసన్నా క్రొత్త యెరూషలేములో
204 దేవాది దేవుని భూజనులారా - రండి స్తుతించ సదాdevaadi devuni bhoojanulaaraa - randi stutincha sadaa

Psalms 136:2

పల్లవి:
దేవాది దేవుని భూ జనులారా - రండి స్తుతించ సదా (2)

1. కరుణ కృపా ప్రేమ - మయుడైన దేవుడు (2)
   వరుసగ మనకన్ని - దయ చేయువాడు (2)

2. వదలక అడుగుడి - ఈయంబడు ననెన్
   వెదకుడి తట్టుడి - తీయంబడు ననెన్

3. యేసుని పేరట - వేడిన దానిని
   దాసుల కిడును - దేవుడు వేగమే

4. సుతుని ఇచ్చినవాడు - కొరత గానీయడు
   ప్రీతిగా సమస్తము - నిచ్చును దయతో

5. సత్యమునందు - మనల నడిపించను
   నిత్యాత్మను శాశ్వతముగ నిచ్చెను

6. ప్రాకటముగా నల్లెలూయా పాడుటకు
   సకల మానవులు నిరతము స్తుతింపను
205 స్తోత్రము యేసునాథా నీకు సదాstotramu yesunaathaa neeku sadaa

Psalms 34:1

1. స్తోత్రము యేసునాథా నీకు సదా - స్తోత్రము యేసునాథా (2)
   స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము - పిత్రపుత్రాత్మలకు (2)

2. నేడు నీదు నామమందున - మేము - చేరి స్తుతించునట్లు
   చేసిన కృపకై నీకే నిరతము - స్తోత్రము చేసెదము

3. నీదు రక్తధారచే కలిగిన - సజీవ నవమార్గము
   దాసులము తండ్రి సన్నిధి చేరను - నిత్యము స్వాతంత్య్రము

4. ఇట్టి ప్రభావమైన పదవిని - పురుగులమగు మాకు
   ఇంత దయతోడ నిచ్చిన కృపమా - కెంతయె నాశ్చర్యము

5. దూతల సైన్యములు శృంగార - గీతముల నెప్పుడు
   రాజాధిరాజా నీ స్తుతులు పాడుచు - నార్భ టించుచుందురు

6. నీవు తప్ప మాకు పరమందున - వేరెవరు గలరు?
   ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవరు?
206 స్తుతియించు ప్రియుడా సదా యేసునిstutiyinchu priyudaa sadaa yesuni

Psalms 103:1

పల్లవి:
స్తుతియించు ప్రియుడా సదా యేసుని - ఓ ప్రియుడా సదా యేసుని (2)

1. నరకము నుండి - నను రక్షించి - పరలోకములో చేర్చుకొన్నాడు (2)

అను పల్లవి:
ఆనంద జలనిధి నానందించి - కొనియాడు సదా యేసుని (1) ||స్తుతి||

2. సార్వత్రికాధి - కారి యేసు - నా రక్షణకై - నిరు పేదయాయె ||ఆనంద|

3. పాపదండన - భయమునుబాపి - పరమానందము - మనకొసగెను ||ఆనంద||

4. మన ప్రియయేసు - వచ్చుచున్నాడు
   మహిమ శరీరము - మనకొసగును ||ఆనంద||
207 స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవాstotramu stotramu stotramu yesu devaa

Revelation 4:8

1. స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా (2)
   పాత్రుల జేసి నేటివరకు మమ్ము (2) - కాచిన దేవా (1)

2. పొత్తిగుడ్డల చేత చుట్టబడిన తండ్రి
   పాపులకై జీవమిడి గొల్లలకు నిజ - హర్ష మిచ్చితివే

3. హేమకిరీటము తెల్లంగి నే ధరింప
   హీనకిరీటము ముండ్లతో పొందితి - నన్ను రక్షింప

4. పాపినై చేసెడు పాపములను తీర్చను
   ఏపుగ కల్వరి యందున నాకై - పాట్లుపడితివి

5. పాప నివారణ బలియగు గొఱ్ఱెపిల్ల
   పాపమృతులమౌ మమ్ము రక్షింప - ప్రాణమిచ్చితివే

6. సైతానును జయింప శక్తినిచ్చిన దేవా
   బుద్ధితో పోరాడి యుద్ధమున గెల్వ - జ్ఞానమీయుము

7. ఈలాటి ప్రేమను ఏలాగు తెల్పుదును
   జీవమార్గమున చక్కగ నడుతు - నాయన శక్తిచే

8. దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి
   దానములిమ్ము దయతోడ నిత్యము - దయగల మా తండ్రి
208 నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతునుnammakamaina naa prabhu ninnune stutintunu

1 Cor 10:13

పల్లవి:
నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును - నిన్ను నే స్తుతింతును

1. కరుణతోడ - పిల్చియు (1)- స్థిరపరచి కాపాడిన (2)
   స్థిరపరచిన - నా ప్రభున్ - పొగడి - నే స్తుతింతును (2)

2. ఎన్నోసార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభు
   మన్ననతోడ - నీదరిన్ చేర్చినన్ క్షమించితివి

3. కృంగియుండు వేళలో - పైకి లేవ నెత్తితివి
   భంగపర్చు - సైతానున్- గెల్చి విజయమిచ్చితివి

4. నా కాశ్రయశైలమై - కోటగా నీవుంటివి
   ప్రాకారంపు - యింటివై - నన్ను దాచియుంచితివి

5. సత్య సాక్షివై యుండి - నమ్మదగినవాడవై
   నిత్యుడౌ మా దేవుడా - ఆమే నంచుపాడెద
209 రక్షకుడా యేసుప్రభో స్తోత్రము దేవాrakshakudaa yesuprabho stotramu devaa

Romans 8:35

పల్లవి:
రక్షకుడా యేసుప్రభో స్తోత్రము దేవా (1)
స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2) - రక్షకుడా

1. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు? (2)- దూతలైనను - ప్రధానులైనను (2)
   ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?

2. నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను- కరువైనను -ఖడ్గమైనను
   ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
   క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?

3. సర్వలోక రక్షణకై - సిలువనెక్కెను - శ్రమయైనను - బాధయైనన
   ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
   క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?

4. ఎంచలేని యేసునాకై - హింసపొందెనే
   హింసయైనను - హీనతయైనను
   ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
   క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?

5. మరణమున్ జయించి క్రీస్తు - తిరిగి లేచెను - మరణమైనను -జీవమైనను
   ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
   క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?

6. నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెను - ఎత్తైనను లోతైనను
   ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
   క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?

7. ఎన్నడైన మారని మా యేసుడుండగా - ఉన్నవైనను -రానున్నవైనను
   ప్రభువు ప్రేమనుండి మమ్ము వేరు చేయునా?
   హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
210 స్తోత్రము పాడి పొగడెదనుstotramu paadi pogadedanu

1 Cor 13:13

పల్లవి:
స్తోత్రము పాడి పొగడెదను (1)
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను (2)

1. అద్భుతమైన ప్రేమ - నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ (2)
   ఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ (2)

2. జ్యోతిగా జగమునకు - వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ
   త్యాగియైన క్రీస్తు ప్రేమ - దివ్య మధుర ప్రేమ

3. మాయలోక ప్రేమను - నమ్మి నశించిన నన్ను ప్రేమించెను
   నన్ను జయించిన దైవ ప్రేమ - నాలో ఉప్పొంగు ప్రేమ

4. ఆధారమైన ప్రేమ - దినము మాతవలె నన్నాదుకొను ప్రేమ
   ఉన్నత మహాదైవ ప్రేమ - నన్నాకర్షించె ప్రేమ

5. మాట తప్పని ప్రేమ - పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమ
   సర్వశక్తిగల దైవ ప్రేమ - సతతము నుండు ప్రేమ
211 స్తుతియింతుము - స్తోత్రింతుముstutiyintumu - stotrintumu

Ephesians 1:3-9

పల్లవి:
స్తుతియింతుము - స్తోత్రింతుము
పావనుడగు మా పరమ తండ్రిని  - స్తుతియింతుము

1. నీ నామము ఋజువాయే - నీ ప్రజలలో దేవా (2)
   వర్ణింప మా తరమా - మహిమగలిగిన నీ నామమును (1)

2. మా ప్రభువా మా కొరకై - సిలువలో సమసితివి
   మాదు రక్షణ కొరకై - రక్తమును కార్చిన రక్షకుడా

3. మా ప్రభువైన యేసుని - పరిశుద్ధాత్మ ప్రియుని
   ప్రియమగు కాపరులన్ - ప్రియమార మా కొసగిన తండ్రి

4. పరిశుద్ధ జనముగా - నిర్దోష ప్రజలనుగా
   పరలోక తనయులుగా - పరమ కృపతో మార్చిన దేవా

5. సంపూర్ణ జ్ఞానమును - పూర్ణ వివేచనమును
   పరిపూర్ణంబుగ కలుగ - పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి

6. ప్రభు యేసు క్రీస్తులో - పరలోక విషయములో
   ప్రతి యాశీర్వాదములన్ - ప్రాపుగ నొసగిన పరమ తండ్రి

7. ఎల్లరిలో జీవజలం - కొల్లగ పారునట్లు
   జీవంబు నిచ్చితివి - జీవాధిపతి హల్లెలూయ
212 యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో గ్రహింప శక్యము కానిదిyehovaa mahaatmyamu goppadi yento grahimpa shakyamu kaanidi

Psalms 145:3

పల్లవి:
యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో (2)  - గ్రహింప శక్యము కానిది (2)

1. పరలోక సైన్యమా పరమతండ్రి మహిమను (2)
   పరాక్రమ క్రియలు తెల్పెదము రారండి (2)
   పరిశుద్ధ దేవుని గొప్పకార్యముల్ (2)
   పరిశుద్ధ కార్యము ప్రకటింతుము (2)

2. మహాత్మ్యము గల్గిన దేవుడరుదెంచెను
   మహిమను విడచి నరుడుగ జన్మించె
   ఆహా సిలువలో సాతానును జయించె
   బాహాటముగా రక్షణ నొసగె మనకు

3. తప్పుపోతి మిలలో గొఱ్ఱెలను బోలియు
   తప్పులెన్నో చేసి శిక్షార్హుల మైతిమి
   అర్పించెను ప్రాణము మంచి కాపరియై
   గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను

4. ఆదామునందు పోయె దేవుని మహాత్మ్యము
   అంధులమై యుంటిమి అజ్ఞానుల మైతిమి
   నాథు డేసునందు పొందితిమి వెలుగు
   అధికమైన జ్ఞాన మహిమలొసగె

5. పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము
   పాప ఫలితము మరణము సహింతువా?
   పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే
   తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును

6. ప్రధానుల కంటెను అధికారులకన్న
   అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును
   అంధరికి ప్రభువు శిరస్సై యున్నాడు
   అందరు పాడెదము హల్లెలూయా పాట
213 కృపగల దేవుని కొనియాడెదముkrupagala devuni koniyaadedamu

1 Cor 15:10, John 1:17, 1 Peter 5:10

పల్లవి:
కృపగల దేవుని కొనియాడెదము - కృపచాలు నీకనే ప్రభుయేసు (2)

1. పాపములెన్నియో చేసినవారము (2) - నెపములెంచక తన ప్రాణమిడె (2)
   కృపద్వారానే రక్షించె మనల (2)

2. కృపయు సత్యమును యేసు ద్వారనే - కృపగల దేవుడు ఈ భువికి వచ్చె
   కృపతోడనే గాచును మనల

3. సర్వకృపానిధియగు మన దేవుడు - పరిపూర్ణత నిచ్చి బలపరచును
   స్థిరపరచి కాయున్ దుష్టుని నుండి

4. సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్ - సర్వకాలము ప్రభుతో నిలుచుందుము
   సర్వము మీవని బోధించె

5. శ్రమయైనను సిలువ బాధైనను - శ్రమనొందిన క్రీస్తు ప్రభువుతో
   క్రమముగా కృపచే సాగెదము

6. ఇక జీవించువాడను నేను కాను - ఇక జీవించుట నా ప్రభు కొరకే
   సకలంబు ప్రభున కర్పింతున్

7. నేనేమై యుంటినో అది ప్రభు కృపయే
   నన్ను నడిపించును ప్రభువు సదా - పెన్నుగా నేర్పును హల్లెలూయ
214 స్తుతి ప్రశంసపాడుచు కీర్తింతు నిత్యముstuti prashansapaaduchu keertintu nityamu

Psalms 66:16

పల్లవి:
స్తుతి ప్రశంసపాడుచు కీర్తింతు నిత్యము (1)
మహారక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను (2)

1. పాపలోక బంధమందు దాసత్వమందుండ (2)
   నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి (2)

2. పాప భారముచే నేను దుఃఖము పొందితి
   నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు

3. హృదయాంధకారముచే నేను దారి తొలగితి
   ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె

4. పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి
   దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి
215 భజియింప రండి - ప్రభుయేసునిbhajiyimpa randi - prabhuyesuni

John 4:23

పల్లవి:
భజియింప రండి - ప్రభుయేసుని
ఆత్మసత్యములతో ప్రేమామయుని పరమ తండ్రిని - భజియింప రండి

1. పాప క్షమాపణ మనకిచ్చెను - మనల విమోచించె రక్తముతో (2)
   జయము జయము మన ప్రభుకే (2)

2. ఆత్మమందిర ప్రత్యక్షత నొసగెన్ - నేత్రము తెరచెను యేసుని చూడ
   ఆశ్చర్యకరుడు సదాకాలము

3. ఘనత పొంద సదా రాజ్యము నిచ్చె - స్వాస్థ్యము పొంద వారసులమైతిమి
   హోసన్న హోసన్న విజయునికే

4. జగమును జయించే జీవితమునిచ్చె - సిలువ శక్తిచే మనలను గాచెగా
   స్తుతులర్పింతుము ముక్తిదాతకే

5. సంఘము ప్రభుని చేర తేరి చూచెగా - సదాకాలమాయనతో నుండ నెప్పుడు
   సాగిలపడెదము సృష్ఠికర్తకే
216 అనుదినము మా భారము - భరించే దేవాanudinamu maa bhaaramu - bharinche devaa

Psalms 68:19

పల్లవి:
అనుదినము మా భారము - భరించే దేవా (1)
అనిశము నీ మేళ్ళతో - నింపుచున్నావు (2)

1. సన్నుతించు మనిశము - నా ప్రాణమా యేసుని (2)
   పరిశుద్ధ నామమును - పొగడు మెప్పుడు (2)
   ఒంటె బరువు దీవెనలు - వీపున మోపె (2)

2. నా శరీరమున ముల్లు - బాధపరచుచుండగా
   వేదనతో వేడగా - ధైర్యమిచ్చితివి
   నా కృప నీ కెల్లప్పుడు - చాలునంటివి

3. అపరాధముతో మేము చిక్కుకొని యుండగా
   నీ రక్తముచే మమ్ము - విమోచించితివి
   నీదు కృపా మహదై-శ్వర్యంబును బట్టి

4. అన్నిటిలో నెప్పుడు - సకల సంపదలతోను
   సమృద్ధితో మమ్ములను - సాకుచుంటివి
   కృపా క్షేమములను మాపై - కుమ్మరించితివి

5. సర్వవేళల సంతృప్తిని - నేర్పినావు మాకిల
   సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి
   బలపరచుము నిన్ను బట్టి - బలుడగు దేవా
217 భక్తులారా స్మరియించెదము ప్రభుచేసిన మేలులన్నిటినిbhaktulaaraa smariyinchedamu prabhuchesina melulannitini

Mark 7:37

పల్లవి:
భక్తులారా స్మరియించెదము ప్రభుచేసిన మేలులన్నిటిని (2)
అడిగి ఊహించు వాటికన్న మరి (2)- సర్వము చక్కగ జేసె (2)

1. శ్రీ యేసే మన శిరస్సై యుండి, మహాబలశూరుండు (2)
   సర్వమునిచ్చెను తన హస్తముతో (2) - ఎంతో దయగల వాడు (1)

2. గాలి తుఫానులను గద్దించి,బాధలను తొలగించె
   శ్రమలలో మనకు తోడైయుండి - బయలు పరచె తన జయమున్

3. జీవ నదిని ప్రవహింపజేసె, సకల స్థలంబులయందు
   లెక్కకుమించిన ఆత్మలతెచ్చె - ప్రభువే స్తోత్రార్హుండు

4. అపోస్తలుల, ప్రవక్తలను, సువార్తికులను యిచ్చె
   సంఘము అభివృద్ధిని చెందుటకు - సేవకులందరినిచ్చె

5. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించె
   ఇంతవరకును ఆదుకొనెనుగా - తన మహాత్మ్యము జూపె

6. ఈ భువియందు జీవించుకాలము, బ్రతికెదము ప్రభుకొరకే
   మనమాయన కర్పించుకొనెదము - ఆయన ఆశయమదియే

7. కొంచెము కాలమే మిగిలి యున్నది, ప్రభువును సంధించుటకై
   గనుక మనము నడచుకొనెదము - ప్రభు మార్గములయందు
218 యేసు ప్రభును స్తుతించుట యెంతో యెంతో మంచిదిyesu prabhunu stutinchuta yento yento manchidi

Psalms 18:2

పల్లవి:
యేసు ప్రభును స్తుతించుట - యెంతో యెంతో మంచిది (2)
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ (2)

1. మహోన్నతుడా నీనామమును (2)- స్తుతించుటయే బహుమంచిది (2)

2. విలువైన రక్తము సిలువలో కార్చి - కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను ||హ||

3. ఎంతో గొప్ప రక్షణ నిచ్చి - వింతైన జనముగా మము జేసెను ||హ||

4. మా శైలము మా కేడెము - మా కోటయు మా ప్రభువే ||హ||

5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము - రక్షించువాడు మన దేవుడే ||హ||

6. అతిసుందరుడు అందరిలోన - అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు ||హ||

7. రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను - స్తుతించుటయే బహు మంచిది ||హ||
219 యేసు దివ్య రక్షకుని స్తుతించుyesu divya rakshakuni stutinchu

Psalms 103:1

1. యేసు దివ్య రక్షకుని స్తుతించు - భూమీ - దివ్య ప్రేమను చాటుము
   ముఖ్యదూతలారా శుభ మహిమను - బలఘనముల నర్పించుడి
   మోయురీతి యేసు కాపాడు మిమ్మున్ - చేతులందు మోయుచుండును
   సీయోను వాసులగు భక్తులారా - సంతోష గీతములు పాడుడి

2. యేసు దివ్యరక్షకుని స్తుతించు - పాపమునకై మరణించెను
   బండ నిత్యరక్షణ నిరీక్షణుండు - సిల్వ వేయబడిన యేసుడు
   రక్షకా భరించితి దుఃఖ వార్థిన్ - ముండ్ల మకుట ధారివైతివి
   త్యజింపబడి చేయి వీడబడిన - మహిమా ప్రభూ నీకే స్తోత్రము

3. యేసు దివ్య రక్షకుని స్తుతించు - నాక గుమ్మములారా పాడుడి
   యేసు నిత్యానిత్యము రాజ్యమేలున్ - గురుద్దేవ రాజు నాయనే
   మరణ విజయుడు మాదు రాజు - మృత్యువా నీ ముల్లు యెక్కడ
   యేసు జీవించియున్న జయవీరుండు - నీ గుమ్మముల్ కీర్తించి పాడనీ
220 ప్రభు నా దేవా నీ చేతి కార్యములనుprabhu naa devaa nee cheti kaaryamulanu

Psalms 92:5

1. ప్రభు నా దేవా - నీ చేతి కార్యములను - ఆశ్చర్యముతో నే నెంచి చూడగన్ (1)
   తారలజూచి గంభీర యురుముల వినగా - విశ్వమంత నీ శక్తిన్ - కనుపరచన్ (1)

పల్లవి:
నా ప్రాణమెంతో నిన్ను పాడును - గొప్ప దేవా - గొప్ప దేవా (1)
నా ప్రాణమెంతో నిన్ను పాడును -  గొప్ప దేవా - గొప్ప దేవా (1)

2. అడవులందు నే సంచరించగను- పక్షుల మధుర సంగీతములు వినగా
   పర్వత శోభ నే పరికించి చూడ - సెలయేరుల చల్లగాలి సోక ||నా||

3. ప్రియసుతుని నా కొరకై చనిపోవ - పంపుట తలచి భరించ గలనా?
   సిలువ పైని నా భారమంత మోసి - పాపము తీయ రక్తము కార్చెను ||నా||

4. ఆర్భాటముతో క్రీస్తు ఈ భువికేతెంచి
   పర గృహమునకు నను గొనిపోయెడి వేళ
   ఆనందముతో పూజించి ప్రకటింతు - ఓ నా దేవా నీవే ఘనుడవంచు ||నా||
221 ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపుprabhaava shaktulu kalgina raajunutimpu

Psalms 145:1

1. ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు - దీని ప్రియాత్మ! కోరుదు రేని స్మరింపు
   కూడుడిదో! కిన్నెర వీణెలతో గానము చేయనులెండి

2. సర్వము వింతగ - పాలన చేసెడువాడు
   రెక్కలతో నిను మోసెను గావున బాడు
   నీకు సదా - కావలి యుండుగదా - దాని గ్రహింపవేల

3. ఆత్మను! మిక్కిలి వింతగా నిన్ను సృజించి
   సౌఖ్యము నిచ్చుచు స్నేహముతో నడిపించి
   కష్టములో - కప్పుచు - రెక్కలతో - గాచిన నాథునుతింపు

4. స్నేహపు వర్షము - నీపై తా గురియించి
   అందరు చూచుచు ఉండగనే కరుణించి
   దీవెనలు - నీకు నిరంతరము - నిచ్చిన నాథునుతింపు

5. నాథుని నామము - నాత్మ! స్మరించి నుతింపు
   ఊపిర గల్గిన స్వరమా! నీవు నుతింపు
   సంఘములో నాబ్రాహాం సంతతితో - నాథునుతింపుము
222 యేసు ప్రభు నీ ముఖ దర్శనముచేyesu prabhu nee mukha darshanamuche

John 6:35

పల్లవి:
యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే (2) - నా ప్రతి యాశను తీర్చుకొందును (2)

1. నీవే నాకు జీవాహారము (2) - నిన్ను సమీపించువారే మాత్రము (2)
   ఆకలి గొనరిల ఆదర్శుడవు (2)

2. నీ మందిర సమృద్ధి వలన - నా మది నెప్పుడు తృప్తి పొందితిని
   ఆనంద జలమును త్రాగించుచున్నావు

3. నీవే నాకు జీవపు మార్గము - నీ సన్నిధిని పూర్ణానందము
   కలదని నిన్ను ఘనపరచెదను

4. ఆశతో నిండిన నా ప్రాణమును - ఆకలిగొనిన నాదు ఆత్మను
   మేలుతో నీవు తృప్తిపరచితివి

5. నీ సంతోషము నాకొసగితివి - నా సంతోషము పరిపూర్ణముగా
   కావలయునని కోరిన ప్రభువా

6. నాజీవిత కాలమంతయును - నీ ఆలయములో నివసించుచు
   హల్లెలూయ పాటను పాడెద ప్రభువా
223 జయమనిపాడు జయమనిపాడు ప్రభుయేసునకేjayamanipaadu jayamanipaadu prabhuyesunake

Ephesians 1:18

పల్లవి:
జయమనిపాడు జయమనిపాడు ప్రభుయేసునకే (1)
మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే2

1. ఆది అంతము అల్ఫ ఓమేగ ఆయనే ప్రభువు (2)
   ఆయన యేగా రానున్నవాడు శక్తిమంతుడు (2)

2. ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను
   ప్రేమతో మమ్ము పవిత్ర పరచి నిర్దోషులుగ తీర్చె

3. యేసులో మమ్ము రక్తముద్వారా విమోచించితివి
   యెంతో కృపతో మమ్మును కడిగి మన్నించి నావుగా

4. యేసులో మాకు యేశిక్షలేదు భయము బాపెగా
   వాసిగ మరణబలము తొలగించి పాపము బాపెగ

5. క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెను
   కరుణించి మమ్ము అంగీకరించె ఎంతో అద్భుతము

6. మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మ ముద్ర నిచ్చెను
   మనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణ ని చ్చె

7. ప్రభు క్రీస్తులో వాడబారని స్వాస్థ్యముగ నైతిమి
   పరిశుద్ధులలో మహిమైశ్వరంబు యెంతో గొప్పది
224 ఓ జగద్రక్షకా, విశ్వవిధాతo jagadrakshakaa, vishvavidhaata

Romans 8:32

పల్లవి:
ఓ జగద్రక్షకా, విశ్వవిధాత - రక్షణ నొసగితివి (2)
సర్వకృపలకు దాతవు నీవే (2)- బలియైతివి మాకై (2)

1. కృపద్వారా రక్షణ మాకొసగె (2)- విశ్వాసము ద్వారానే (2)
   అపాత్రులమైనట్టి మాకు (2)- యిది నీ వరమేగా (2)

2. పాపములో మేము మరణించినప్పుడు - వచ్చితివి యిలకు
   ప్రభువా మేము నీ చెంతనుండ - జీవము నిచ్చితివి

3. పాపభారముచే పడిచెడియున్న - మమ్మును గాంచితివి
   కృప ద్వారానే మమ్మును పిలిచి - శాంతిని వొసగితివి

4. రక్షణ సందేశమును ప్రభువా - ప్రచురము చేసితివి
   రయముగ విశ్వసించిన మాకు - ఆత్మను వొసగితివి

5. మరుగైన వాటిని అజ్ఞానులకు - బయలుపరచితివి
   మర్మములను గ్రహియించుటకు - జ్ఞానము నొసగితివి

6. సేవను మాకు నిచ్చితివయ్యా - యుగయుగముల వరకు
   శక్తిమంతులమై నిను స్తుతియింప - విజయము నొసగితివి
225 కృపాతిశయముల్ ఓ నా యెహోవాkrupaatishayamul o naa yehovaa

Genesis 15:1 , Psalms 89:34, Daniel 7:14

పల్లవి:
కృపాతిశయముల్ ఓ నా యెహోవా - నిత్యమున్ కీర్తింతును -
తరతరములకు నీ విశ్వాస్యతన్ - తెలియ జేసెదను (2)

1. యెహోవా వాక్కు దర్శనమందు - అబ్రామునకు వచ్చెను (2)
   అబ్రామా భయపడకు (2)
   నీ కేడెమును - బహుమానము నేనై యున్నాననెను (2)

2. నా నిబంధనన్ ఏ నాటికిన్ - రద్దుపరచనని పల్కెన్
   మార్చవు నీ మాటను
   పెదవులతో పల్కిన దానిని దృఢము చేతువు

3. శాశ్వతమైనదా ప్రభుత్వము - తొలగిపోదే నాటికిన్
   లయము కాదు ఆ రాజ్యం
   మహిమ ఘనత ఆధిపత్యమును నీవాయెన్ నిత్యము

4. నీ నిబంధనన్ దావీదుతోడని లేవీయులతో జేసితివి
   ఆకాశ తారల వలెన్
   సముద్ర ఇసుక రేణువులంతగ జేసెదనంటివి

5. దివారాత్రులతో నా నిబంధన - మార్చెదరా మీరు మీరునట్లు
   అట్లయిన భంగమగున్
   దావీదుతోనే జేసినయట్టి నిబంధనంటివి

6. సింహాసనమున దావీదు - సంతతి యుండక మానదు"
   లేవీయుల్ యాజకులన్
   నా పరిచారకులందరిన్ ఫలింపజేసెదనంటివి

7. యెహోవా నీ కృప కార్యములన్నియు - వీనుల విందుగ నొప్పుచుండె
   శ్లాఘింతున్ మనసారగన్
   హల్లెలూయ - స్తోత్రములతో - కీర్తింతు నిత్యము
226 స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించుstutinchu stutinchu prabhu yesu ne stutinchu

Jeremiah 31:3

పల్లవి:
స్తుతించు - స్తుతించు - ప్రభు యేసు నే స్తుతించు (2)
నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే (2)
జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే (2)

1. ప్రేమించెను నిన్ను ఆయనే - శాశ్వత ప్రేమచే
   ఏర్పరచు కొనె నిన్ను - భూమి పుట్టకమునుపే (2)
   దేవుడే నరరూపియాయె - ఆయన పేరు యేసు ప్రభు (2)
   ఆయన పేరు యేసు ప్రభు

2. యాకోబును సృజియించే - ఇశ్రాయేలుకు రూపునిచ్చె
   నీకు తోడైయుందున్ - భయపడకుమని పలికె
   పేరు పెట్టి పిలిచి - నా సొత్తు నీవనెను - నా సొత్తు నీవనెను

3. ప్రేమించి నన్ను రక్షించె - స్తుతి చెల్లించి పూజింతున్
   తన రూపము నాకు నిచ్చె - ఆరాధించి ఘనపరతున్
   పరలోక పౌరినిగా చేసెన్ - హృదయార్పణ నర్పింతున్
   హృదయార్పణ నర్పింతున్

4. సహవాసములో నిలిచి - ప్రత్యక్షత యందుండి
   ఏమి సంభవించినను - ప్రభు పక్షము నుండవలెన్
   అంతమందు బహుమానమిత్తున్ - అని ప్రభువే చెప్పెనుగా
   అని ప్రభువే చెప్పెనుగా
227 నే స్తుతించెదను యేసు నామమునుne stutinchedanu yesu naamamunu

Galatians 3:14

పల్లవి:
నే స్తుతించెదను యేసు నామమును - భజించెదను క్రీస్తు నామమును  -
స్తుతికి యేసే యోగ్యుడని - నిత్యం నిత్యం నే స్తుతించెదను (2)

1. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ -వర్ణింప నెవరికి తరమౌనా? (2)
   పాపిని నన్ను రక్షించుటకై - చూపెను ప్రేమన పారముగా (2)

2. పాపములన్నియు బాపుటకై - శాపములన్నియు మాపుటకై
   ఏ పాపమెరుగని ఆ పావనుండు - శాపగ్రాహియై చావొందెను

3. శోధన కాలముల యందున - వేదన కాలముల యందున
   నాధుడు యేసు మనతోడనుండ - అంతమేగా మన చింతలకు

4. ఎనలేని ప్రేమతో కౌగలించెను - ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను
   మహామహుండు మహిమ ప్రధానుడు
   మహిమతో వచ్చును మేఘముపై

5. రాజాధిరాజు ప్రభు యేసే - దేవాదిదేవుడు మన యేసే
   పరమందుదూతలు యిహమందు నరులు
   పాడుడి ప్రభునకు హల్లెలూయా
228 పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్paadeda devaa nee krupalan nootana geetamulan

Ephesians 1:6

పల్లవి:
పాడెద దేవా - నీ కృపలన్ - నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్ - స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2)

1. భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి (2)
   ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి - ఈ దీనుని బ్రోచితివి

2. ప్రవిమల రక్తము కలువరి సిలువలో ఖలునకు నిచ్చితివి
   ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి
   నా పాపము తుడిచితివి

3. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి
   అపరాధములచే చచ్చిన నన్నుధర బ్రతికించితివి
   నన్ను బ్రతికించితివి

4. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి
   చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి
   చెర నను విడిపించితివి

5. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి
   సత్యస్వరూప నిత్యనివాసి సొత్తుగా చేసితివి
   నీ సొత్తుగ చేసితివి

6. అన్యుడనై నిన్ను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి
   ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి
   కృప వరముల నొసగితివి
229 యేసు నామం మనోహరంyesu naamam manoharam

Philippians 2:7

పల్లవి:
యేసు నామం మనోహరం - ఎంతో అతిమధురం
పరమునందైన ఇహమునందైన వేరే నామమే లేదు

1. అమూల్య ప్రాణమిచ్చెన్ - పాపులను రక్షించుటకై
   దాసుని రూపమొంది - ఇహమున దిగివచ్చెను
   కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం
   ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప

2. కల్వరిగిరిలో ఇనుపమేకులతో
   ప్రభువా నీ దేహమును - సిలువపై నెక్కించిరి
   కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం
   ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప

3. పూర్ణ స్వస్థత మాకు - ప్రేమతో నొసగితివి
   శాంతి ఆనందములు - నీ నామమున దొరుకున్
   కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం
   ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప
230 ఎంత జాలి యేసువా - యింతయని యూహించలేనుenta jaali yesuvaa - yintayani yoohinchalenu

Psalms 103:13

పల్లవి:
ఎంత జాలి యేసువా - యింతయని యూహించలేను - ఎంత జాలి యేసువా

1. హానికరుడ హింసకుడను - దేవదూషకుడను నేను (2)
   అవిశ్వాసినైన నన్ను (2)- ఆదరించినావుగా (1)

2. రక్షకుండా నాకు బదులు - శిక్ష ననుభవించినావు
   సిలువయందు సొమ్మసిల్లి - చావొందితివి నాకై

3. ఏమి నీ కర్పించగలను - ఏమి లేని వాడనయ్యా
   రక్షణంపు పాత్రనెత్తి - స్తొత్రమంచు పాడెద

4. నీదు నామమునకు యిలలో - భయపడెడు వారి కొరకై
   నాథుడా నీ విచ్చు మేలు - ఎంత గొప్పదేసువా

5. నేను బ్రతుకు దినములన్ని - క్షేమ మెల్ల వేళలందు
   నిశ్చయముగ నీవు నాకు - ఇచ్చు వాడా పభువా

6. నాదు ప్రాణమునకు ప్రభువా - సేద దీర్చు వాడ వీవు
   నాదు కాపరివి నీవు - నాకు లేమి లేదుగా

7. అందరిలో అతి శ్రేష్ఠుండా - అద్వితీయుడగు యేసయ్యా
   హల్లెలూయ స్తోత్రములను - హర్షముతో పాడెద
231 శ్రీ యేసు నాథుని శిరసావహించి శిష్యుల మేసుని ఘనపరచెదముshree yesu naathuni shirasaavahinchi shishyula mesuni ghanaparachedamu

Psalms 103:2

పల్లవి:
శ్రీ యేసునాథుని శిరసావహించి (1) - శిష్యుల మేసుని ఘనపరచెదము (2)

1. పాపుల రక్షింప నవనికి వచ్చెను (2)- ఏపుగా కౌగలించి సన్నుతించెదము (2)

2. డెంద మేసునిచేత హర్షము బొందె - అందమగు యేసుని స్తుతించెదము

3. పాపకూపము నుండి ఎత్తి రక్షించెను - భీకర ధ్వనితోడ భజియించెదము

4. మరణపు ముల్లును విరచి జయించిన - కరుణాబ్ధి యేసుని స్మరియించెదము

5. దూరస్థులగు వారలను చెంత చేర్చెను - నిరతము యేసుని సన్నుతించెదము

6. రక్తితో హల్లెలూయ ఆనందముతో పాడి - శక్తిగల యేసును స్తుతియించెదము
232 దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల రాజా హల్లెలూయdevaadi devaa prabhuvula prabhoo raajula raajaa hallelooya

Matthew 14:27, Isaiah 43:1

పల్లవి:
దేవాది దేవా - ప్రభువుల ప్రభూ - రాజుల రాజా - హల్లెలూయ (2)

1. నీ రక్తముతో విమోచించి - నీ రక్తముతో సంపాదించి (2)
   పరలోక రాజ్య ప్రజలతో జేర్చి (2) - పరలోక పాటన్ నా కొసగితివి (2)

2. జీవిత నావలో తుఫాను రేగ - భయపడకుడని అభయమునిచ్చి
   జయప్రదముగా నన్ను నడిపించి - జయజీవితము నా కొసగుచున్న

3. పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి - కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి
   అరమర లేక నన్నాదరించి - పరలోక దర్శనంబిచ్చితివి

4. మరణ పాత్రులం యిద్ధరణిలోన - దురిత ఋణముల స్మరణను మాన్పి
   ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము - నీ రాజ్యమందు రాజులన్ జేసి

5. శోధనగాధల కష్టములలో - నా దుఃఖములలో నే నేడ్వకుండా
   నీ దయ నాపై నిండార నింపి - ఓదార్చి నన్ను నీ దారినడుపు

6. ప్రతి వత్సరము దయతోడ నింపున్ - ప్రభు జాడలు సారము జల్లున్
   ప్రతి బీడునూ సారము చిలకన్ - ప్రతి పర్వతము ఆనందించున్

7. పరలోక పరశుద్ధ సంఘంబు యెదుట - సర్వశక్తి గల క్రీస్తుని యెదుట
పరలోక నూతన గీతము పాడ - జేర్చితివి నన్ నీ జనమునందు 
233 జై జై యేసురాజా జై జై - రాజాధిరాజా నీకే జై జైjai jai yesuraajaa jai jai - raajaadhiraajaa neeke jai jai

Exodus 19:5,1 Peter 2:9

పల్లవి:
జై జై యేసురాజా జై జై (1) -రాజాధిరాజా నీకే  జై  జై (2)

1. పాపకూపములో బడియున్న (2)- నన్ను జూచి చేయి జాచి (2)
   చక్కగ దరికి జేర్చితివి (2)

2. సిలువ రక్తములో నన్ను కడిగి - పాపమంతా పరిహరించిన
   పావనుడగు నా ప్రభుయేసు

3. నీతి హీనుడ నైన నాకు - నీతి రక్షణ వస్త్రములను
   ప్రీతితో నొసగిన నీతి రాజా

4. మంటి పురుగు నైన నన్ను - మంటి నుండి మింట జేర్చిన
   మహాప్రభుండా నీకే జై జై

5. పాప శాపగ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీ స్వకీయ
   సంపాద్యముగా జేసితివి

6. రాజులైన యాజక గుంపులో - నన్ను గూడ సొత్తయిన
   పరిశుద్ధ జనములో జేర్చితివి

7. తల్లియైన మరచిన మరచును - నేను నిన్ను మరువననిన
   నమ్మకమైన నా ప్రభువా

8. అధిక స్తోత్రార్హుడవైన - ఆది యంతము లేని దేవా
   యుగా యుగములకు నీకే జై జై
234 నాదు ప్రాణమా - నాదు ప్రాణమా - దేవుని క్రియల్మరువకుమాnaadu praanamaa - naadu praanamaa - devuni kriyalmaruvakumaa

Psalms 103:2

పల్లవి:
నాదు ప్రాణమా  -  నాదు ప్రాణమా - దేవుని క్రియల్మరువకుమా (1)
ఆయన చేసిన దేనిన్ మరువకుమా (2)

1. వ్యర్థుడవై నాశనంబౌ - నిన్ను రక్షించి (2)
   మోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చెనే (2)
   ఓ నా మనసా యెంతటి ప్రేమ (2)- దేవుని క్రియ ల్మరువకుమా - నీ (1)

2. ప్రియులులేక భ్రమసి నీవు పరుడవైనపుడు
   ప్రియుడేసు నిన్ను జేరి సంతసంబిడెనే
   సమర్పించు సర్వము తనకే - దేవుని క్రియల్మరువకుమా - నీ

3. రక్షణాలం - కార వస్త్రము జీవాహారము
   శాంతి సమాధానము నీతి నీకు నిచ్చెనే
   ప్రేమపరిమళ స్తుతులను పాడి - దేవుని క్రియల్మరువకుమా - నీ

4. గెత్సేమనెలో కార్చెనేసు రక్తచెమటలను
   వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్
   వినుమా మనసా యేడ్చెను నీకై - దేవుని క్రియల్మరువకుమా - నీ

5. వచ్చెదననిన కాలమాయె తామసం బేల
   ప్రభునిరాక బూరధ్వనించు కాలమెప్పుడో
   ఆశతో ప్రభుని రాకను కోరి - దేవుని క్రియల్మరువకుమా - నీ
235 ప్రభు నిను కీర్తించుచున్నాముprabhu ninu keertinchuchunnaamu

Psalms 63:5

పల్లవి:
ప్రభు నిను కీర్తించుచున్నాము
యేసు నిను కీర్తించుచున్నాము -నిను కీర్తించుచున్నాము

1. పాపములోన చచ్చిన నన్ను - ప్రభువా ప్రేమించితివి

2. తప్పిన నన్ను వెదకి రక్షింప - తనయుడవై వచ్చితివి

3. నా యాశ్రయము కూలిపోగ - నను రక్షింప నేగితివి

4. సిలువలో చిందిన రక్తముతో నా - కలుషములు కడిగితివి

5. మరణించి మరణపు ముల్లును - విరచి మరల లేచితివి

6. తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి- తనయా తోడ్పడితివి

7. నాకై మరల వచ్చుచున్నావు - సంకీర్తించెద నిన్ను
236 జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరముjeevambu nichina devudaa ne paadeda neeku nirantaramu

Psalms 116:12

పల్లవి:
జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము
హల్లెలూయా  - హల్లెలూయా
పావనుండా నీకు పలుమారు నే - నింకేమియ్యంగ పాత్రుండను
హల్లెలూయా - హల్లెలూయా

1. వెలుగిచ్చినావు - వెలిగించినావు - గాలిని మాకై కలుగజేసి (2)
   అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరిపోసి కాపాడితివి (2)
   ఎంచలేక నీ మంచి పనులు - హల్లెలూయా - హల్లెలూయా అని పాడెదన్ (2)
   హితుడ నీకే యీ స్తుతిగీతము (2)- హల్లెలూయా - హల్లెలూయా (1)

2. కరుణ కిరీట మిచ్చెనని - గడిగడికి నాతో నడిచేనని
   కోపించువాడు కాడంచు నా - పాపంబులెల్ల పాటింపడు
   ఎంచలేక నీ మంచి పనులు - హల్లెలూయా - హల్లెలూయా అని పాడెదన్
   హితుడ నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయా - హల్లెలూయా
237 స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదముstotrinchi keertintumu ghanaparachedamu koniyaadedamu

2 Chronicles 16:9

పల్లవి:
స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము  (1)
ఆదరించి - కాపాడువాడు - ఈడేర్చువాడు (2) - స్తోత్రించి కీర్తింతుము (1)

1. మనకింత వరకు సహాయపడెన్ - తానప్పగించుకొనె మనకై (1)
   మనల నడిపెను సుఖముగను (1)
   తనదు సత్యము నేర్పించి - కనుపాపగ కాచె ఆ ... (2)

2. ఈ ధరలోని నరులలో - యధార్థ హృదయులకు
   ముదమున తన చిత్తము తెలుపున్
   పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు

3. అన్ని సమయములలో - కన్నులతో బోధించును
   నన్ను మార్చెను తప్పినన్
   పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు

4. అగ్ని వంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించు"
   తగిన సహాయము చేయును
   ఎక్కాలమందును కునుకవు - మక్కువ పిల్లలకు

5. హాగరును చూచిన కన్నులు - అనేకుల చూచెను
   శ్రాయేలుల కనికరించె
   ఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు

6. నీతిమంతుల జూచె - దాదిబోలి కాచెన్
   జ్యోతుల వలె నుండును
   అతిబలమిచ్చు అవసరతన్ - క్షితినిను విడువడు

7. ఏడు కన్నులు గలవాడు - నాడు నేడు కాపాడును
   ఎడతెగని చెడుగుల బాపున్
   రేడుల నేర్పరచు వాడు - పాడుడి హల్లెలూయా
238 స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయstotrinchi keertinchedamu hallelooya

Habakkuk 3:18

పల్లవి:
స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ -
స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ (2)

అను పల్లవి:
గడచిన కాలమెల్ల - కంటిపాపవలె (2)
కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్ (1)

1. పాపమును బాపినాడు హల్లెలూయ - మన
   శాపమును మాపినాడు హల్లెలూయ (2)
   కన్నతల్లి వలెనే - కనికరించెను మమ్ము (2)
   యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్ (1)

2. తల్లియైన మరచినను హల్లెలూయ - తాను
   ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ
   ఎల్ల యీవులనిచ్చి - యుల్లాస మొసగును
   కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్

3. శోధన కాలములందు హల్లెలూయ - మన -
   వేదన కాలములందు హల్లెలూయ
   నాథుడు యేసు మన చెంతనుండ నిల
   చింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్

4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహు -
   ఘోరముగ లేచినను హల్లెలూయ
   దోనెయందున్న యేసు - దివ్యముగను లేచి
   ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్

5. సర్వలోకమునందున హల్లెలూయ - నన్ను -
   సాక్షిగ నుంచెను యేసు హల్లెలూయ
   చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు
   చేర్చును కౌగిటిలో హల్లెలూయ - ప్రభున్
239 మా దేవ మా దేవ నీదు విశ్వాస్యత చాల గొప్పదిmaa deva maa deva needu vishvaasyata chaala goppadi

Lamentations 3:23

పల్లవి:
మా దేవ మా దేవ నీదు - విశ్వాస్యత చాల గొప్పది (2) - మా దేవ (1)

1. దయామయుండగు తండ్రివి నీవే - తల్లిని మించిన దాతవు నీవే (2)
   మాయా మమతల గాధలనుండి -మమ్ములను రక్షించితివి (2)

2. కోడిపిల్లలను కాసెడు పగిది - ఆపదలన్నింటి బాపితివయ్యా
   సర్వకాలముల యందున నీకే -చక్కగ సంస్తుతులగు నీకే

3. సింహపు పిల్లలు ఆకలి గొనిన - సింహపు గుహలో నను వేసినను
   సిగ్గు కలుగకుండగ నను నీవు -గాపాడుచున్నా వీ యిలలో

4. మరణ లోయలందున నేనున్న -తరుణములు నాకు విరోధమైన
   చరణముల్ పాడెడు విధమున నీవు -నన్నొనర్చుచున్నావుగా

5. వ్యాధులు నన్ను బాధించినను-వ్యాకులములు హృదయములో నున్న
   వదలవు నన్నిల అనాథునిగ నెప్పుడు -నను బ్రోచుచు నుందువుగా

6. నీదు సత్యమాకాశము కంటె -అత్యున్నతముగ స్థాపించబడె
   నీదు సత్యమును నీచుడనగు నా - కనులకు ప్రత్యక్షపరచితివి

7. పర్వతంబులు తొలగినగాని -పలువిధ కొండలు తత్తరిల్లినను
   పావనుడా నీదు వెల లేనియట్టి కృప - నను విడువదు హల్లెలూయా
240 యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరికొరకుyehovaa goppa kaaryamulu chesenu veerikoraku

Psalms 126:3

పల్లవి:
యెహోవా - గొప్ప కార్యములు - చేసెను - వీరికొరకు (1)
ఇహమున - అన్యజనము - లెల్ల - చెప్పుకొనుచున్నారటుల (2)

1. యెహోవా మనకొరకు - గొప్ప కార్యములు చేసెను (2)
   మహా సంతోషభరితుల మైతివిు - సహపనివారినిగా జేసెన్ (2)

2. ప్రారంభ కాలపనులను - పరిహసించువారెవరు
   ప్రభు పనిచేయ పదివేలగు నొకడు - విరవిగ బలమౌ జన మగును

3. ప్రభు సువార్తకై బహుగా మేము - బాధించబడి యుంటిమి
   ప్రబలెను ప్రభుని వాక్యము - ప్రబలితిమి మేము ప్రభు కృపలో

4. పొరపాటులెన్నో చేసితిమి - ప్రభుకృపతో మమ్ము క్షమించెన్
   విరోధి మంత్ర శకునము లేమి - ఇశ్రాయేలులో నికలేవు

5. భూమిపై గడ్డిని తడుపు - వానవలె విజయము నిచ్చెను
   సమ భూమిని బోలి సముద్రములో - క్షేమముగా మము నడిపెను

6. అధికంబాయె మా అంత్యదశ - మొదటి పనులను మించెన్
   మొదటి మందిర మహిమను మించె - తుది మందిరపు మహిమ

7. మహిమ ఘనతా ప్రభావములు - మా కృతజ్ఞతా స్తోత్రములు
   సింహాసనాసీనుండా మాదు - సీయోను రాజా హల్లెలూయా
241 స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతోstutintun parishudduni aaraadhanato

Psalms 89:1

పల్లవి:
స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో - ఇంతవరకు కాచె దేవుడే (2)

1. ఇరువదై దేండ్లు గాచెన్ - కొరతలేని మేళ్ళనిచ్చే (2)
   చేర్చె ప్రజల నెందరినో - చేరిపాడి స్తుతించెదము (1)

2. సువార్త సైన్యము నిచ్చి - భువిపై శత్రుని పనినాపే
   వినిన వారిని ప్రత్యేకించె - చేరిపాడి స్తుతించెదము

3. పరిశుద్ధ సంఘము కూర్చె - నేర్పె సత్య మర్మములు
   సరిగ సాక్ష్యము స్థాపించె - చేరిపాడి స్తుతించెదము

4. సేవకులనిచ్చెను బహుగా - కావలి యుంచెన్ ప్రభువే
   సహపని - వారి నొసగె - చేరిపాడి స్తుతించెదము

5. ఇండియాలో ఈ నగరు - అంతియొకయ వలె జేసె
   స్వంతముగను జేసికొనెన్ - చేరిపాడి స్తుతించెదము

6. పరమ దర్శనము నిచ్చి - సరిగా లోబరచె మనల
   కరము నిచ్చి నడిపించె - చేరిపాడి స్తుతించెదము

7. సంఘ మర్మమును దెల్పి - శీఘ్రముగ నంపెను వార్త
   మార్చె పాపుల నెందరినో - చేరి స్తుతించెదము హల్లెలూయ
242 ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదముprabhu goppa kaaryamulu chesenani manamutsahinchedamu

Psalms 103:2

పల్లవి:
ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము (2)
ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా (2)

అను పల్లవి:
ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె (2)
పాత్రులముగా సేవింతుము (2)

1. దైవ కార్యములు జనముల మధ్య - ప్రసిద్ధి చేయుదము (2)
   దేవుని ఆశ్చర్య కార్యము మనలో - ధ్యానించి పాడెదము (2)

2. సంగీత గానములతోను - సన్నుతించుచు ప్రభుని
   సితార స్వర మండలములతో - మన మార్భాటించెదము

3. మన భారములన్నియు తొలగించి - ఘనకార్యములను జేసె
   దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో

4. నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు
   బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం

5. ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమము నిచ్చువాడు
   మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము

6. మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి
   ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్
243 ఆనందముగా యెహోవా నీ కృపలన్నిaanandamugaa yehovaa nee krupalanni

Lamentations 3:23

పల్లవి:
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని - అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)

1. చావు గోతినుండి లేవనెత్తి నాకు - జీవమిచ్చిన జీవదాత (2)
   వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో -
   సవ్యంబుగా ఈ భువియందున్ (2)

2. సింహపు పిల్లలు - ఆకలిగొనును- యెహొవా సహాయుడందరికి
   ఇహమందున ఏ మేలు కొదువయుండదు
   అహా! ఏమందు నీ విశ్వాస్యతన్

3. ఎన్నెన్నో శోధన బాధలు రేగి - నన్ను కృంగదీయ పోరాడినన్
   ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
   కన్నతండ్రీ నిన్ను కొనియాడెదన్

4. చావు చీకట్ల లోయలందున - జీవపు వెలుగై త్రోవ జూపి
   దేవా తోడై నడిపించితివి నీ కృపన్ - వివరించెదన్ నీ విశ్వాస్యతన్

5. నీతిన్యాయంబులు - ఆధారములై - నీసింహాసనమున - నిలచినవి
   నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్‌ - నిరతంబు వెలసి నిలచినవి

6. పర్వతంబులు - పారిపోయినను - ఉర్విలో మార్పు - కలిగినను
   తరుణములు విరోధముగ పై లేచిన - స్మరియించెద నీ విశ్వాస్యతన్‌
244 దేవుని కీర్తించెదము దైవపుత్రుని నామమందుdevuni keertinchedamu daivaputruni naamamandu

Psalms 107:1-2

పల్లవి:
దేవుని కీర్తించెదము - దైవపుత్రుని నామమందు (2)

1. యోసేపుపై దృష్టినుంచి మోసపు చెరనుండి గాచి (2)
   యేసునం దైగుప్తు నుండి (2) క్రీస్తునందరిని గాచిన (1)

2. పాప ఋణముచేత నిత్య - కోపమునకు గురియైతిమి
   శాపగ్రాహియై శ్రీ యేసు - పాప ఋణము తీర్చినాడు

3. మార్గ సత్య జీవమై నిత్య - మరణ భయము లేనివాడు
   మరణ బంధితులను గావ - మరణమొంది లేచినాడు

4. నీతిమంతుడైన యేసు - నీతి కార్యములను జేసి
   నీతి నిలయుండై తండ్రి నిల - నీతితోనే తృప్తిపరచెన్

5. యేడ్చెను మన పాపములకై - కార్చెను తనరక్తము నిల
   ఓర్చెను తన శత్రువులను - గెల్చెను తన సిలువలోనే

6. లేదు నీకు భయము చింత - లేదు నమ్మి నిలచినచో
   నీదు స్వాస్థ్యమంత తిరిగి - నాథుడేసులో పొందగలవు

7. జయము పాడు ప్రియుడ లేచి - జయ జీవితము నొంది వేగ
   జయశీలుండు కీస్తు యేసుని - జయము పాడు హల్లెలూయ
245 పగటిలో మేఘ స్తంభముగా - రాత్రిలో యగ్ని స్తంభముగాpagatilo megha stanbhamugaa - raatrilo yagni stanbhamugaa

Luke 24:15

1. పగటిలో మేఘ స్తంభముగా - రాత్రిలో యగ్ని స్తంభముగా (2)
   రక్షకుడవుగా నుండి (2) - ప్రభువా సుఖశాంతితో గాచితివి (2)

పల్లవి:
ధన్య ధన్య ధన్య ప్రభుకు (2)- తానే రక్షణ మన కొసగే  (2)
నీ సన్నిధికి నడిపి (2) - ప్రభువా రాత్రింబవళ్ళు గాచితివి (2)

2. వాక్యమన్నాతో పోషించి - బండ నీళ్ళను త్రాగించితివి
   ఆత్మకు తృప్తినిచ్చి - ప్రభువా శాంతిని నా కిచ్చితివి ||ధన్య||

3. ఆత్మీయ సుందర హృదయములో - ఆత్మ ప్రాణ శరీరములో
   ఆత్మీయజీవ మొసగి - ప్రభువా ఆత్మను మేల్కొలిపితివి ||ధన్య||

4. కానానులోనికి తెచ్చితివి - పరశుధ్ధులతో జేర్చితివి
   ప్రణుతించెదను నిన్ను - ప్రభువా సాగిలపడి పూజింతున్ ||ధన్య||
246 రక్షణ్య పాటలుపాడి - రక్షకు డేసును సదా కొనియాడుrakshanya paatalupaadi - rakshaku desunu sadaa koniyaadu

Psalms 32:7

పల్లవి:
రక్షణ్య పాటలు పాడి - రక్షకు డేసును సదా కొనియాడు (2)

అను పల్లవి:
ఇక్కట్టులోన యేసును వెదకి (2) - ఎక్కాల మందును స్తుతించ కూడి (2)

1. అంధకారము నుండి విడిపించి - అమర్త్యుడేసుని రాజ్యము జేరి (2)
   అన్నియు నొసగు దేవుని జేరి (2) - పెన్నుగ ప్రభును మహిమపరచి (2)

2. అగ్ని నుండితీసి కొరవిని - విఘ్నము లేక బైట వేసి
   కపట వేషము పారద్రోలిన - ప్రాపకు డేసగు వేకువ చుక్కను

3. భయంకర పాపకూపము నుండి - బురదలో నుండి పైకిలాగి
   కాళ్ళను బండమీద నిలిపి - పాదములను స్థిరపరచిన యట్టి

4. మరణము నుండి తప్పించినట్టియు - తత్కాలమున తప్పించుచున్న
   ఇక ముందును తప్పించునను - గొప్ప నమ్మకమును మనకిచ్చిన

5. సంకటములనుండి విడిపించి - వణకును మన కెడబాటు చేసిన
   కష్టపెట్టిన బాధల తొలగించి - విడిపించినట్టి యేసును చూచి

6. శ్రమల నెల్లను పారద్రోలి - శోధనలు మనలను జేరకను
   సుఖముల మా కెల్లప్పుడు నిచ్చిన - ప్రేమ స్వరూపిని స్తోత్రించుచును

7. దుష్టలోకము నుండి మనలను - లోకాధిపతి సైతాను నుండి
   పిసాచి యధికారములో నుండి - విడిపించిన ప్రభునకు హల్లెలూయ
247 కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతునుkrutajnyatan talavanchi naadu jeevamu arpintunu

2 Cor 5:14

పల్లవి:
కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును (1)
లేదే యిక నే యీవి యిల (1) - అర్పింతును నన్నే నీకు (2)

1. దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్ (2)
   దూరముగనిక వెళ్ళ జాల - కూర్చుండెద నీ చెంతనే (2)

2. ఆకర్షంచె లోకాశలన్ని - లోక మహిమ నడ్డగించు
   కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును

3. తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము
   నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము

4. లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును4
   నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా జీవితము

5. చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి
   కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై
248 నాకొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములోnaakorakai anniyu chesenu yesu naakinka bhayamu ledu lokamulo

Psalms 138:8

పల్లవి:
నాకొరకై అన్నియు చేసెను యేసు - నాకింక భయము లేదు లోకములో (2)

అను పల్లవి:
నాకొరకై అన్నియు చేసినందులకు (2)
నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్ (2)

1. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను - క్షామంతీర్చి ఏలీయాను ఆశీర్వదించెన్ (2)
   క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2)
   ఇంట నూనెకైన పిండికైన కొరతలేదు (2)

2. ఆకాశపక్షులను గమనించుడి - విత్తవు అవి పంటను కోయవు
   వాటిని పోషించునట్టి పరమపితా
   మమ్ము అనుదిన మద్భుతంబుగా నడుపున్

3. ఏమి ధరింతుమని చింతపడకు - అడవి పుష్పములను తేరిచూడుము
   అడవి పువ్వుల ప్రభు అలంకరింప
   తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించును

4. రేపటి దినము గూర్చి చింతపడకు - ఆప్తుడేసు నాకుండ భయమెందుకు
   రేపుదాని సంగతులనదే చింతించున్
   ఏ నాటికీడు ఆనాటికే ఇలచాలును

5. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో - పోషించెను ఐదువేలమందిని కూడ
   తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్
   యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై
249 యెహోవ మన కొరకు గొప్ప కార్యములనుyehova mana koraku goppa kaaryamulanu

Psalms 126:3

పల్లవి:
యెహోవ మన కొరకు గొప్ప కార్యములను (2)
జేసెనని మనము ఆనందించెదము (2)
యెహోవ మన కొరకు - గొప్ప కార్యములను (2)

1. ఆయన యేర్పరచిన దినమిది (2) -అగుపడె మనకు ఆశ్చర్యముగా (2)
   దీనియందు మనముత్సహించుచు (2) -సంతోషించెద మెప్పుడు (2)

2. తన సేవకులు మొర పెట్టగానే - కనుపరచెను ప్రభువు ఈ స్థలమును
   మన మెల్లరమును యేకముగా కూడి - మహిమను చాటెదము

3. యాకోబులో ప్రభుయే దోషమును - ఇశ్రాయేలులో యే వంకర తనమున్
   కనుగొనలేదే ప్రభు యెహోవా - తనకే స్తుతి చెల్లింతము

4. క్రీస్తే మనకు మూలరాయైయుండ - ప్రవక్తలు వేసిరి ఆ పునాది
   దానిమీద కట్టబడితిమి మనము -తన రక్షణ ప్రకటింతము

5. ప్రతి కట్టడమును ఆయనలోనే - పదిలముగా నమర్చబడినదై
   అతిసుందరంబైన గృహముగా - స్తుతియించి సేవింతుము

6. మన ప్రభువైన క్రీస్తే సునందు - పరిశుద్ధ ఆలయముగ మనము
   నిర్మింపబడితిమి ఈ భువియందు - సాగిలపడి మ్రొక్కెదము

7. ఘనదేవా నీవే సమస్తమును - బాగుగాను చేసితి వనుచు
   స్తుతి మహిమ ప్రభావములు - నీకే హల్లెలూయా
250 యెహోవా కార్యములన్నిటికై అర్పింతు కృతజ్ఞతలుyehovaa kaaryamulannitikai arpintu krutajnyatalu

Psalms 107:7,8

పల్లవి:
యెహోవా కార్యములన్నిటికై - అర్పింతు కృతజ్ఞతలు (2)
ఆశించెడి వారి ప్రాణములెల్లను (2) - సంతృప్తి పరచెదవు (1)

1. వెదకిన నా మది కొసగెను రక్షణ - దర్శనమిచ్చి దరి జేర్చితివి (2)
   నీ రాజ్యమును నీ నీతియును
   వెదకుమని నన్ను - ప్రేమతో పిలిచితివి (2)

2. కనిపించెడి ఆ కానానును జూడ - ధన్యతలకది ధననిధిగా నుండె
   దానిపై నుండు నీకను దృష్టి
   దివా రాత్రులు ప్రియమది నీకెంతో

3. నూతన మాయెను భూమ్యాకాశముల్ - పాపముల్ పడిన సముద్రములేదట
   పరిశుద్ధంబైన యెరూషలేమది
   దేవుని మహిమతో దిగివచ్చుచుండె

4. కళంకము లేక - అలంకరించిన - పెండ్లి కుమార్తెయై - ప్రియునిజూచు
   సంఘము యిదియే - ప్రియుడా కనుమా
   కానవు నెచ్చటన్ - ఈ వజ్రకాంతుల్

5. శిల్పియై యెహోవా - నిర్మించుచున్న
   పండ్రెండు పునాదుల - ఆ పట్టణముకై
   నబ్రహాము ఎదురు చూచెనుగా
   పరికించుము నీవు - నీ కన్నుల నెత్తి

6. కుక్కలు మాంత్రికులు - వ్యభిచారులును
   నరహంతకులును - విగ్రహారాధికులు
   అబద్దమును - ప్రేమించి జరిగించు
   ప్రతివాడునట - వెలుపట నుందురుగా

7. కృప కాలంబిది - ఓ నా ప్రియుడా - నిర్మల వాక్యమన్ - పాలను పొంది
   శిశువును బోలి - ఎదుగుము నీవు
   పదములు నేర్తువు - అపవాది నెదిరింపన్
251 పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెద ప్రభునకేpoorna hrudaya stotramul chellincheda prabhunake

Psalms 86:12

పల్లవి:
పూర్ణ హృదయ స్తోత్రముల్ - చెల్లించెద ప్రభునకే (2)

1. ఏర్పరచుకోలేదు నేను - ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2)
   పాపినైన నాకు - ఆయనే రక్షణ నిచ్చెన్ (2)
   పరలోక రాజ్యములో - భాగమునిచ్చెన్ (2)

2. నా హృదయ పాపమును - తన రక్తములో కడిగెన్
   మృతమైన నా ఆత్మను - జీవింపజేసె ప్రభు
   ఉచితంబుగానే పొందితి - నిత్య జీవం

3. నే పాప బంధములో నుండ - హృదయమశాంతితో నిండె
   నా పాప మొప్పుకొనగా - కడిగెను రక్తములో
   శాంతి ఆనందముతో - నన్ను నింపెన్

4. వర్ణింపజాలను నేను - ప్రభు యొక్క గొప్ప ప్రేమన్
   పాపిని నను ప్రేమించెన్ - మరువలేనా ప్రేమను
   ప్రశంసలను పాడెద - ప్రభునకే

5. నిత్య రాజ్యము నన్ను చేర్చ - నిత్య నిబంధన చేసె
   సుఖదుఃఖములందైన - ముగింతు నాదు పరుగున్
   స్థిరముగ నుందు పరమును చేరువరకు
252 అడవి చెట్ల నడుమadavi chetla naduma

Songs of Solomon 2:3

పల్లవి:
అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో - యేసు ప్రజ్వలించుచున్నాడు (2)

అను పల్లవి:
కీర్తింతున్ నా ప్రభుని - జీవ కాలమెల్ల ప్రభు యేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను (2)

1. షారోను రోజా ఆయనే - లోయ పద్మమును ఆయనే
   అతి పరిశుద్ధుడు ఆయనే - పదివేలలో అతిశ్రేష్టుడు (2)

2. పరిమళతైలం నీ నామం - దాని వాసన వ్యాపించెగా
   నిందశ్రమ సంకటములలో - నను సుగంధముగా చేయున్

3. మనోవేదన సహించలేక - సిలువవైపునే చూడగా
   లేవనెత్తి నన్నెత్తుకొని - భయపడకుమని యంటివి

4. నాత్రోవకు దీపం నీవే - నా బ్రతుకుకు జీవం నీవే
   నా సేవకు బలము నీవే - నా ఆత్మకాదరణనీవే

5. ఘనమైన నా ప్రభువా - నీ రక్త ప్రభావమున
   నా హృదయము కడిగితివి - నీకే నా స్తుతి ఘనత

6. నీవు నా దాసుడవనియు - ఏర్పరచుకొంటినని
   నేనే నీ దేవుడనని - భయపడకు మని యంటివి
253 దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున కాపాడెన్devuni stutincha randi gata samvatsaramuna kaapaaden

1 Samuel 7:12

పల్లవి:
దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్ (2)

అను పల్లవి:
కీడు మనలను చేరకను (2) - కోటి కీడుల నుండి కాపాడినట్టి - మహా (1) || దేవుని ||

1. కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము (2)
   కష్టములబాపి మనల నింక (2)
   జగమున జీవితులుగ నుంచినట్టి - మహా (1)

2. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేళ్ళను చెసెనుగా
   నిరతము కాచి చక్కగను - ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి

3. ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై
   ఆత్మ దేహములను బలిగ - నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి

4. వత్సరారంభమున నిను మే మొక్కటిగా నారాధింప
   దైవకుమారా కృపనిమ్ము - మా జీవిత కాలమంతయు పాడి - మహా

5. భూమియందలి మాయలనుండి సైతానుని వలలో నుండి
   ఆత్మతో నిను సేవింప - నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి

6. ప్రతి సంవత్సరమును మముజూడుము - దుర్గములో మము చేర్చుమయ్యా
   దాటునపుడు నీ సన్నిధిని
   చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా - మహా

7. స్తోత్రింతుము ప్రభువా నీ పదముల - సకలాశీర్వదముల నిమ్ము
   ప్రేమతో ప్రభుతో నుండ - నెట్టి యాపద లేక బ్రోవుమా మెన్ - ప్రభు
254 స్తోత్రము స్తోత్యమయ్యా దేవా స్తోత్రము స్తోత్యమయ్యాstotramu stotyamayyaa devaa stotramu stotyamayyaa

Psalms 65:11

పల్లవి:
స్తోత్రము స్తోత్యమయ్యా దేవా - స్తోత్రము స్తోత్యమయ్యా (1)

అను పల్లవి:
నేత్రమువలె గత వత్సరము (2) - మిత్రుడా బ్రోచితివి - స్తోత్రము స్తోత్యమయ్యా (1)

1. ఎన్నో గొప్ప కీడులు అ..అ.. (2) మాకు పెన్నుగా కలిగినన్"
   అన్నియు మా చెంత చేరకుండునట్లు (2) - మన్నాధిపా బ్రోచితి..1

2. పేరాశ పాపంబుల - నీవు ధారాళముగ మన్నించి
   ఈ వత్సరమందు పాపమున పడకుండ - నోవత్సా కాపాడుము

3. ఆనందారంభముతో-నిండు ఆశతో ప్రవేశించి
   భూమియందు రక్షకుడుగ జన్మించిన - స్వామి నిన్ను కొల్తుము

4. ఈ క్రొత్త యేడునందు - మా అక్కర మేళ్ళన్నియు
   సతతము మాకు దయతోడ తీర్చుమో - వింత యేసు రక్షకా

5. గద్దియ జీవితము - నీతో ముదముతో సల్పుటకు
   నిత్యము యేసును ప్రేమతో వెంబడింప - నన్ను కనికరింపుము

6. దేశకీడు తొల్గను - ఇంక దోషములు వీడను
   హోసన్నా ఏకంబుగా పాడుటకు - దాసుల కరుణింపుము

7. హల్లెలూయా పాటను - నీ ఏట నెక్కువగా పాడన్
   దిక్కులవారికి సువార్త ప్రకటింప - గ్రక్కున వరములిమ్ము
255 దేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావుdevaa samvatsaramunu dayaakireetamugaa nichi yunnaavu

Psalms 65:11

పల్లవి:
దేవా -  సంవత్సరమును - దయాకిరీటముగా నిచ్చి యున్నావు (1)
దేవా  -  నీదు జాడలు - సారమును వెదజల్లుచున్నవి (1)

1. నీ మీద నా - దృష్టి నిలిపి (2) - నీకాలోచన (1)
   నే చెప్పెదను (2) - అనిన మహోన్నతుడా (1)

2. సతతము మీతో - కూడా నేను - ఉన్నాననిన
   మా ప్రభు యేసు - అభయంబొసగిన మా

3. తలవెండ్రుకలు నెరయు వరకును - నేనే నిన్ను
   ఎత్తుకొనుచును - రక్షించెద ననిన

4. నీవే నాదు సొత్తని పిలచి - శాశ్వతముగ నిను
   ప్రేమించితిని - అనిన ప్రేమామయుడ

5. మా కాపరివై మాదు ప్రభుడవై - జీవజలముల
   చెంతకు మమ్ము - నిడిపించెద ననిన

6. పలువిధములగు బాధలు పొంది - రక్తము కార్చి
   ప్రాణము నిచ్చి - రక్షచింన మాదు

7. మా ప్రభుయేసు మహిమయు నీదే - నీ నామము
   పాడెద మెపుడు హల్లెలూయా ఆమెన్
256 స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదంstutulu neekarpintumu satatamu maa prabhuvaa sannutinchedam

Psalms 36:8

పల్లవి:
స్తుతులు నీకర్పింతుము - సతతము మా ప్రభువా సన్నుతించెదం (2)

1. గడచినట్టి కాలము - కరుణతో నన్ గాచితివి (2)
   వెల లేనట్టి నీ కృప - చూపినట్టి మా ప్రభు (2)

2. నాదు దినము లన్నిటన్ - నీదు క్షేమ మేలును
   నీదు జాడలన్నియున్ - సారంబు నిచ్చును

3. నీదు మందిరంబులో - మేలుచెత మమ్మును
   తృప్తిపరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును

4. నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులను
   నాథుడా నే పాడెద - నాదు ప్రియ ప్రభువా

5. సత్య రూపి నీవెగా - సకల సృష్టి కర్తవు
   సతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం
257 ప్రభువా పాడెద నొక స్తుతి గీతంprabhuvaa paadeda noka stuti geetam

Psalms 107:29 ; Matthew 14:27 ; Mark 4:39

పల్లవి:
ప్రభువా (2) పాడెద నొక స్తుతి గీతం - ప్రేమించి రక్షించితివి (1) - ప్రభువా ...

1. గత వత్సరంబులోన - కాపాడి నడిపినావు (2)
   నూతన వత్సరమున - స్తుతియింప చేసినావు (2)

2. యేసయ్యా పలికితివి - ఆ సముద్ర పొంగులలో
   నిశ్శబ్దముగా యూర - కుండుము నిమ్మళముగా

3. భయపడిన శిష్యులతో - రయమున పలికితివి
   భయపడకుడి నేనే - ధైర్యము తెచ్చుకొనుడి

4. తుఫాను రేగె త్వరలో - తరంగములు లేచె
   ఆపితివయ్యా దేవా - ఆపద బాపితివి

5. ముండ్లకు బదులు గొంజి - దేవదారులు మొలచు
   ఉండును సూచనలుగా - నిత్యంపు ఖ్యాతిగాను

6. అభివృద్ధి జేసెదవు - ప్రభువైన యేసు దేవా
   అధికంబు మేలులతో - మునుపటి కంటె మరల

7. సిలువలో మా తుఫాను - బలిలో భరించితివి
   హల్లెలూయ పాడెదను - కలువరి యేసు నాథా
258 ఓభక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతియించెదముobhaktulaaraa manamandaramu nityamu yesuni stutiyinchedamu

Hebrews 7:25 ; 2:18; Jude 24

పల్లవి:
ఓ భక్తులారా మనమందరము - నిత్యము యేసుని స్తుతియించెదము (2)

1. గత కాలమున మన ప్రభుయేసు - నూతన దీవెనలను (2)
   ఖ్యాతిగానొసగె మనకు (2)- స్తుతియించెదమేసుని (2)
   నూతన అనుభవములతో - ఖ్యాతిగా సర్వశక్తుని (2)

2. శక్తిమంతుడు మన ప్రభు యేసు - నిత్యమును దీవించును -
   రక్షించును మనలను తానే - సంపూర్ణముగా కాయున్
   సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు

3. ఎన్ని శోధనలు భువినున్న - తానేమనలను విడిపించును
   శోధింపబడెను యేసు - తన సహాయము నొసగున్‌
   కనుపాపవలె ప్రభువు కాయున్‌ - నిత్యము నిలుచు మనతో

4. శక్తిమంతుడు మన ప్రభు యేసు - తొట్రిల్లకుండకాపాడును
   నిర్జాషులనుగా ప్రభువు - నిలుపును తన మహిమతో
   తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల

5. కృంగిన భక్తులారా మీరు - భంగపర్చు శత్రువుపై
   జగముపై చాటుడి - జయము - జయము జయమని ప్రభుకే
   యుగయుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో
259 మేము భయపడము ఇక మేము భయపడముmemu bhayapadamu ika memu bhayapadamu

Isaiah 27:3

పల్లవి:
మేము భయపడము ఇక మేము భయపడము (1)
ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు (2)

1. దైవభ్రష్టులమైన మమ్ము - దివ్యంపుగా రక్షించె (2)
   దివారాత్రులు దేవుడే కాయును (1)

2. శత్రుకోటి మమ్ము జుట్టన్ - పాతాళము మ్రింగ జూడన్
   నిత్యుడు యేసు నిత్యము కాయును

3. అగ్ని పరీక్షల యందు - వాగ్దానమిచ్చె మాతోనుండ
   యే ఘడియైనను విడువక కాయును

4. బలమైన ప్రభు హస్తములు - వలయము వలె మమ్ము జుట్టి
   పలు విధములుగా కాపాడుమమ్ము

5. కునుకడు మనదేవుడు - యెన్నడు నిద్రించడు
   కనుపాపగ మము కాపాడునెప్పుడు

6. జీవిత కష్టనష్టములు - ఆవరించి దుఃఖపరచ
   దేవుడొసంగిన ఈవుల నెంచుచు

7. ఇహమందు మన శ్రమలన్ని - మహిమకు మార్చెడు ప్రభున్
   మహిమపరచి మ్రొక్కెదమిలలో
260 భయము లేదుగా మనకు భయము లేదుగాbhayamu ledugaa manaku bhayamu ledugaa

Job 5:19,20 ; Isaiah 27:3

పల్లవి:
భయము లేదుగా మనకు భయము లేదుగా (2)
దయగల మన దేవుడుండ భయము లేదుగా (1)

1. క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియు (2)
   ధరణి గిరులు అదరి సముద్రములు పొంగిన (2)
   పరిశుద్ధుడు యేసుడే - నిత్యము కాపాడు గనుక (2)

2. అపవాది తంత్రములపై విజయమిచ్చును
   అభయమిచ్చి క్షేమముగ ఆదరించును
   అక్షయుడగు యేసుడే - నిత్యము కాపాడు గనుక

3. దివారాత్రులు దేవుడు ధైర్యపరచును
   ఈ కాలపు శ్రమలే మనల మార్చు మహిమకు
   నిర్మలుడగు యేసుడే - నిత్యము కాపాడు గనుక

4. శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకిన
   ఏకీడు తగులకుండ కాయు శక్తితో
   శక్తిమంతుడు యేసుడే - నిత్యము కాపాడు గనుక

5. పాడెదము మన ప్రభునకే హృదయ గీతము
   మహిమరాజు మనకొరకై తిరిగి వచ్చును
   మన ప్రభువగు యేసుడే - నిత్యము కాపాడు గనుక
261 ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులుprabhu kreestesu neeke maa stutulu

Deuteronomy 2:7

పల్లవి:
ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు
విభుడా మాదు స్తుతులే - నీ హారములు

1. నీ దేవుండైనట్టి నేను - నీకు నిత్యం - తోడై యున్నాను
   నీకేమియు తక్కువకా - దన్న ప్రియుడా

2. మునుపటికంటె - అధికంబైన - మేలును మీకు - కలుగ జేసెదను
   అని ప్రోత్సాహించిన మా - క్రీస్తు ప్రభువా

3. విస్తార వెండి బంగారం - ఎంతో ఉన్నది - పని ప్రారంభించి
   మందిరమును కట్టించు - మనిన ప్రభువా

4. నా సంఘమును - నే కట్టెదను - నాతో మీరు - జత పనివారనిన
   వింతైన మా ప్రధాన - శిల్పి క్రీస్తు

5. పర్వతముల - నెక్కి మీరు - మ్రానులందెచ్చి - నా మందిరమును
   నిర్మించిన సంతోషింతుననిన

6. సంధ్యారాగ - చంద్రబింబం - సూర్యకాంతి - కళలన్ మెరిసేటి
   సంఘముగా మమ్ముల రూ-పించెదనన్న

7. ఆ దివ్య భాగ్యమా - కెపుడో - వింతైన నీ - రాకడ నాశించి
   వేచి యున్నామిలలో - ప్రాణ ప్రియుడా
262 నా ప్రియుడు నావాడు నేను అతని వాడనుnaa priyudu naavaadu nenu atani vaadanu

Songs of Solomon 2:16; Daniel 10:18 ; Matthew 17:5

పల్లవి:
నా ప్రియుడు నావాడు నేను అతని వాడను

1. నీవు బహు ప్రియుండవనుచు - దానియేలునకు
   దివ్యముగ నభయంబిచ్చిన మా - పరమజనకుండా

2. ఈయనే నా సంతసమైన - ప్రియతనయుండు
   ఈయన మాట వినుడనిన - పరమజనకుండా

3. ఎన్ని సంద్రముల జలరాసుల్ - ఆర్పగలేని
   ఉన్నతంబైన నీ ప్రేమన్ - ఎన్న మా తరమా

4. కల్వరిన్ చిందించిన నీదు - రక్త ధారలతో
   కడిగితివి మా పాపములన్ని - కరుణగల క్రీస్తు

5. మా పై నపవాది నదిబోలి - పొర్లిపారినను
   ముంచి వేయగ జాలదు మమ్ము - మాతో నీ వుండన్

6. క్రొత్త వత్సరమును దానముగా - నిచ్చిన క్రీస్తు
   క్షణ క్షణం నడిపింతువు మమ్ము - విజయవంతముగా

7. నీదు రాకడ కై దినదినము - వేచియున్నాము
   నిత్య మహిమలో నీతో మేము - మెరయుచుందుము
263 ఈ సుదినము యేసు ప్రభువా నీదు దానంee sudinamu yesu prabhuvaa needu daanam

Revelation 21:2

పల్లవి:
ఈ సుదినము - యేసు ప్రభువా - నీదు దానం

1. పరిశుద్ధంబైన - సమాజకూ-టములన్ మాకు
   ప్రసాదించి - విస్తారమగు - ప్రేమను జూపి - విజయోత్సవమున్
   నడుపుచున్న - యేసు ప్రభువా - నీకే మహిమ

2. నూతనంబైన - యెరూషలేము - అను పట్టణము
   భర్తకొరకు - పెండ్లి కుమార్తె - వలె సిద్ధపడి - దేవుని నుండి
   వచ్చుట చూచి - సంస్తుతించు - చున్నామిలలో

3. సంపూర్ణంబైన - సిద్ధిని మేము - పొందెదమిలలో
   స్వచ్ఛంబైన - నీ చిత్తములో - నిలకడ కల్గి - ప్రార్థన యందు
   పోరాడెదము - నీదు కౄపతో - యేసు ప్రభువా

4. స్వర్ణాలంకృతమై - సూర్యకాంత - పద్మరాగ - రత్నావళితో
   యేసు ప్రభుని - మహిమతో మెరిసే - పరిశుద్ధ
   పట్టణముగ మమ్ము - జేసిన ప్రభువా
264 సంవత్సరాది మొదలుsamvatsaraadi modalu
పల్లవి:
సంవత్సరాది మొదలు - సంవత్సరాంతము  వరకు (1)
నీ దేవుడేహోవా - నిను కనుపాపగా కాచెను  (1)
నీపై కనుదృష్టి నుంచెను . (1)- సంవత్సరాది మొదలు (1)

1. నలువది సంవత్సరములు అరణ్యములో - నీ సంచార జీవితమును (2)
   ఎరిగెను ఆయనే నిన్ను - ఆశీర్వదించి - నీ చేతిపనిని1
   నిండుగా దీవించెను. - నిండారుగ దీవించెను (1)

2. మునుపటికంటే అధికమైన - మేలులు నీకు కలుగజేయ
   ఎరిగెను ఆయనే నిన్ను - అభివృద్ధి పరచి - విస్తృతి పరచి
   వాసముగా చేసెను - నివాసనముగా జేసెను

3. లెక్కకు మిక్కుట బంగారమును - ఇత్తడి ఇనుము నీ కలవని
   ఎరిగెను ఆయనే నిన్ను - మందిర పనికి - పూనుకొనుమని
   తోడుగా నుండెను - నీకు తోడుగా నుండెను

4. నీ కోరికను సిద్దింప జేసి - నీ ఆలోచన సఫలము జేయ
   ఎరిగెను ఆయనే నిన్ను - ఆత్మతో నింపి - శరీరేచ్ఛ త్రుంచి
   కోరిక నెరవేర్చెను - నీ కోరిక నెరవేర్చెను

5. నిను ప్రేమించి ఆశీర్వదించి - అభివృద్ధి చేతు ననిన ప్రమాణము
   ఎరిగెను ఆయనే నిన్ను - పశూ సంపదతో - ఫల సస్యముతో
   తృప్తిపరతుననెను - సంతృప్తి పరతుననెను
265 దేవసుతుడు యేసు జన్మించెdevasutudu yesu janminche

Luke 2:11

పల్లవి:
దేవసుతుడు యేసు జన్మించె - నిరతము స్తుతియింతుము - దేవసుతుడు (1)

1. పాపుల రక్షించ పరమ నాథుడు - శ్రమలను పొందెను ఆ ...2
   నశియించిన వారిన్ వెదకి రక్షింప - రక్షకుడై పుట్టెను (1)

2. బెత్లెహేములో నుత్తముడు జన్మించెను - తండ్రి చిత్తము చేసెను
   భక్తులు పాదములకు మ్రొక్కిరి - మనము స్తుతియింతుము

3. ఘనుడు పుట్టెను పశుల పాకలో - గొల్లలు పూజించిరి
   వేరే జనులు చోటీయకున్నను - మనము స్తుతియించెదము

4. పుట్టినరాత్రి ప్రకాశమానం - మృతిన్ పగటిలో
   స్తుతులకు తగిన శుద్ధుడు దూతల - స్తుతులను బొందెను

5. నరులు బొంకినను వేదము బొంకదు - నరుల హృదయమేమో
   పుణ్యుని జన్మము మీ మదినున్న - పూజింతురు వాని

6. అనాది దేవుని చిత్తముచే - శ్రీ - యేసు బయలుపడెను
   జలనిధి వలెనే ఆయన జ్ఞానము - మనలను నింపును

7. ఆనందముగా యెహోవాకు - హల్లెలూయ పాడెదము
   హల్లెలూయ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ - హల్లెలూయ ఆమేన్
266 మరియకు సుతుడుగ ధరనుmariyaku sutuduga dharanu

1 Timothy 3:16

పల్లవి:
మరియకు సుతుడుగ ధరను జన్మించి - ఇమ్మానుయేలాయెన్

అను పల్లవి:
నిరుపేదగాను పశువుల పాకలో - తేజోమయ ప్రభు భువుని
శిశువుగ బుట్టెను

1. పాపసంకటము పోగొట్ట ధరను - ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున
   పాపపరిహారుడు నరుల మిత్రుడు - అవనిలో జన్మించెన్

2. ఆకాశచుక్క భాసిల్లుచుండ - వీకతో దీనోపకారుడు వెలసెన్
   హీన సైతానుడు కూలిపోవగన్ -ప్రియముతో ఉదయించెన్

3. దూత గణములు గీతముల్ పాడ - క్షితిలో నరులు మంగళము పాడ
   కన్య మరియమ్మ పాడెను లాలి - పుణ్యుడు జన్మించగా
267 బేత్లెహేం పురమున చిత్రంబు కలిగెbetlehem puramuna chitrambu kalige

Matthew 4:15

పల్లవి:
బేత్లెహేం పురమున - చిత్రంబు కలిగె -
కర్తాది యేసు - జన్మించినపుడు (1)
అంధకారంపు - పృథివి వీధులలో
మోదంపు మహిమ - చోద్యంబుగనరే (2)

1. ఉదయంపు తారల్ - ముదమున బాడె -
   ఉదయించ యేసు - ఈ పృథివిలోన (1)
   ముదమును గలిగె - మరి సమాధానం -
   పదిలంబుతోడ - పూజించరండి (2)

2. పరమును విడచి - నరరూపమెత్తి -
   అరుదెంచె యేసు - పరమ వైద్యుండై
   నరుల దుఃఖములన్ - తొలగించివేసి -
   పరలోక శాంతి - స్థిరపరచె ప్రభువు

3. నీదు చిత్తమును - నాదు హృదయమున
   ముదమున జేయ - మదినెంతో యాశ
   నీదు పాలనము - పరమందు వలెనె
   ఈ ధరణియందు జరుగంగఁ జూడ

4. దేవుని సన్నిధి - దీనత నుండ -
   పావనయాత్మ - పవిత్ర పరచున్
   పావను డేసు - ప్రకాశమిచ్చి -
   జీవంబు నొసగి - జీవించు నెదలో

5. గతించె రాత్రి - ప్రకాశించె కాంతి -
   వితానముగ - వికసించె నెల్ల
   దూతల ధ్వనితో - పతి యేసు క్రీస్తు
   అతి ప్రేమతోడ - అరుదెంచు నోహో
268 ఓ సద్భక్తులారా లోక రక్షకుండుo sadbhaktulaaraa loka rakshakundu

Matthew 2:11

1. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు - బేత్లెహేమందు నేడు జన్మించెన్
   రాజాధిరాజు ప్రభువైన యేసు - నమస్కరింప రండి నమస్కరింప రండి
   నమస్కరింప రండి యుత్సాహముతో

2. సర్వేశ్వరుండు నరరూపమెత్తి - కన్యకుబుట్టి నేడు వేంచేసెన్
   మానవజన్మ మెత్తిన శ్రీ యేసు - నీకు నమస్కరించి నీకు నమస్కరించి
   నీకు నమస్కరించి పూజింతుము

3. ఓ దూతలారా యుత్సహించి పాడి - రక్షకుండైన యేసున్ స్తుతించుడి
   పరాత్పరుండ నీకు స్తోత్రమంచు - నమస్కరింప రండి నమస్కరింప రండి
   నమస్కరింప రండి యుత్సాహముతో

4. యేసు ధ్యానించి నీ పవిత్రజన్మ - మీ వేళ స్తోత్రము నర్పింతుము
   అనాది వాక్యమాయె నరరూపు - నమస్కరింప రండి నమస్కరింప రండి
   నమస్కరింప రండి యుత్సాహముతో
269 దూత పాట పాడుఁడి రక్షకున్ స్తుతించుడిdoota paata paaduఁdi rakshakun stutinchudi

Luke 2:13

1. దూత పాట పాడుఁడి - రక్షకున్ స్తుతించుడి
   ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందునన్
   భూజనంబు కెల్లను - సౌఖ్య సంభ్రమాయెను
   ఆకశంబునందున - మ్రోగు పాట చాటుడి
   దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి

2. ఊర్థ్వలోకమందున - గొల్వఁ గాను శుద్ధులు
   అంత్యకాలమందున - కన్యగర్భమందున
   బుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో
   ఓ నరావతారుఁ డా - నిన్ను నెన్న శక్యమా
   దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి

3. రావె నీతి సూర్యుఁడా - రావె దేవపుత్రుఁడా
   నీదు రాకవల్లను - లోక సౌఖ్యమాయెను
   భూనివాసులు అందరు - మృత్యుభీతి గెల్తురు
   నిన్ను నమ్మువారికి నాత్మశుద్ధి కల్గును
   దూత పాట పాడుఁడి - రక్షకున్ స్తుతించుడి
270 వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమునుvintimayyaa nee svaramu kantimayyaa nee roopamunu

Matthew 17:8

పల్లవి:
వింటిమయ్యా నీ స్వరము - కంటిమయ్యా నీ రూపమును (1)
ప్రియప్రభూ నిన్నుగాక  - వేరెవరిని చూడము వినము (1)

1. భక్తి మర్మము గొప్పది యెంతో - శరీరుడుగా మారిన దేవా, (2)
   దూతలకు కనబడితివి - లోకమందు నమ్మబడియున్న దేవా (2)

2. భయపడవలదని దూతలు తెల్పె -మహా సంతోషకరమైన వార్త,
   రక్షకుడు పుట్టెనని - పరమందు మహిమ భువికి శాంతియనిరి

3. నరరూప ధారివి యైతివి ప్రభువా - అద్భుతములు చేసియున్నావు,
   వేరెవ్వరు చేయలేరు - అద్భుతకరుడ ఘనత కలుగును గాక

4. మూగవారికి మాటలిచ్చితివి - గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి,
   మృతులను లేపితివి - పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా

5. ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి - అధికారముతో తిరిగి లేచితివి,
   మరణపు ముల్లు విరచితివి - నమాధి నిన్ను గెలువక పోయెను

6. ఇహము నుండి పరమున కేగి - మా కొరకై నీవు రానై యున్నావు,
   ఆనందముతో కనిపెట్టెదము - మదియందె నిరీక్షణ కలిగి స్తుతింతుమ్
271 ఉదయించె దివ్య రక్షకుడుudayinche divya rakshakudu

Luke 2:11

పల్లవి:
ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున (1)
మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను - (2)

1. ఘోరాంధకారమున దీపంబులేక - పలుమారు పడుచుండగా (2)
   దుఃఖ నిరాశ యాత్రికులంతా - దారితప్పియుండగా - (2)
   మార్గదర్శియై నడిపించువారిన్ - ప్రభుపాద సన్నిధికి (1)
   దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు - ఉదయించె ఈ ధరలో- (2)

2. చింతవిచారముతో నిండియున్న - లోకరోదనవిని
   పాపంబునుండి నశించిపోగా - ఆత్మవిమోచకుడు
   మానవాళికై మరణంబునొంది - నిత్య జీవము నివ్వన్
   దివ్యరక్షకుడు ప్రకాశతార - ఉదయించె రక్షింపను

3. పరలోక తండ్రి కరుణించి మనల - పంపెను క్రీస్తుప్రభున్
   లోకాంధులకు దృష్టి నివ్వ - అరుదెంచె క్రీస్తు ప్రభువు
   చీకటినుండి దైవ వెలుగునకు - తెచ్చె క్రీస్తు ప్రభువు
   సాతాను శృంఖలములను తెంప - ఉదయించె రక్షకుడు
272 నిరాకారా, సురూపుడా, మనోహరాniraakaaraa, suroopudaa, manoharaa

John 19:17

పల్లవి:
నిరాకారా, సురూపుడా, మనోహరా (1)
కరిగితివా నాకై వ్రేలాడుచు (2)- సిలువలో - నిరాకారా (1)

1. వారుల దెబ్బలబాధ నొంది - వాడి మేకులతో గ్రుచ్చబడి (2)
   తీరని దాహము సహించితివి (2) - సిలువలో (1)

2. మానవులు ఏడ్చి ప్రలాపింప - భూరాజు లెల్లరు మాడిపోగా
   శిష్యుల డెందములు పగుల - సిలువలో

3. అరచి ప్రాణము వీడిన సుతుడా - వైరి నే నీ పాదముల బడితిని
   కోరి రక్షణ నెరవేర్చితివి - సిలువలో

4. కోరి సిల్వభారమును మోసితివి - పాపభారమును ద్రుంచితివి
   ఘోర గాయములు పొందితివి - సిలువలో

5. నన్ను రక్షింపను ఎన్ని పాట్లన్ - పెన్నుగ నీవు సహించితివి
   నన్ను నీ చిత్తమున బిడ్డచేయ - సిలువలో

6. కౄరుడు ప్రక్కనీటె గ్రుచ్చగా - నీదు రక్తమును పారెనయ్యా!
   తీరుగా నే రక్షణ పొందను - సిలువలో

7. ఒక్కడగు నిత్య దేవునికే - ఒక్కడగు సుతుడేసునకే
   ఒక్కడగు సత్య ఆత్మ నీకే - హల్లెలూయా
273 యేసుని శ్రమలతోడyesuni shramalatoda

Luke 22:44

పల్లవి:
యేసుని శ్రమలతోడ - ఆశతో పాలు పొందెదను (2)- యేసుని శ్రమలతోడ (1)

అను పల్లవి:
ఇతని ఓదార్పు నిజము - ఇతర ఓదార్పు వృథయే (2)

1. నిందలెల్ల ఏకముగా - మహామహునిమీద బడగా (2)
   వింతగానే యోర్చుకొనెను - తండ్రి మాట నెరవేర్చెన్ (2)

2. దుఃఖముతో నిండియుండెన్ - ప్రక్కలోన గ్రుచ్చబడెను
   రక్తితోడయోర్చుకొని వి - రక్తి మాట పల్కకుండెన్

3. శోకంబు చెత నేను - నాకంబు కదిలింతును
   రక్తంబుధార పోసెన్ - రిక్తులమైన మనకు

4. సదయుని రక్తముచే - హృదయాలంకారముచే
   కలుగు నాహారమిదియే - ఎల్లరకు శ్రేష్టాహారం

5. తల్లి ప్రేమకన్న మిగుల - తన ప్రేమ చూపె మనపై
   నోటి మాటతోడ శత్రున్ - కోటల నశింపజేసెన్

6. నా యేసు రక్తచెమట - నాయప్పు యంతయున్ తీర్చెన్
   ఎల్లరికి నంగీకారమిదే - ఎల్లప్పుడు నా ధ్యానమున్

7. హల్లెలూయా గీతమును - ఎల్లప్పుడు చాటుచుందున్
   ఎల్లరియందు తానే - ఎల్లప్పుడు వసించున్
274 మనకై యేసు మరణించె మన పాపముల కొరకైmanakai yesu maraninche mana paapamula korakai

Isaiah 53:5

పల్లవి:
మనకై యేసు మరణించె మన పాపముల కొరకై (1)
నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె (2)

1. తృణీకరింపబడె - విసర్జింపబడెను (2)
   దుఃఖా క్రాంతుడాయె (2) - వ్యసనముల భరించెను (1)

2. మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్
   మన మెన్నిక చేయకయే - మన ముఖముల ద్రిప్పితిమి

3. మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు
   మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె

4. గొర్రెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్
   అరుదెంచె కాపరియై - అర్పించి ప్రాణమును

5. దౌర్జన్యము నొందెను - బాధింపబడెను
   తననోరు తెరువలేదు - మనకై క్రయధనమీయన్

6. ఎదిరింపలే దెవరిన్ - లేదే కపటము నోట
   యెహోవా నలుగ గొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్

7. సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెను
   సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ
275 యేసు ప్రభూ నా కొరకై బలిగాను నీవైతివిyesu prabhoo naa korakai baligaanu neevaitivi

1 John 1:7

పల్లవి:
యేసు ప్రభూ నా కొరకై - బలిగాను నీవైతివి (2)

1. సిలువలోన యేసు - నీదు ప్రాణమిచ్చితివి.... (2)
   ప్రాణమిచ్చితివి - ప్రాణమిచ్చితివి.... (2)

2. సిలువ రక్తము తోడ - నన్ను జేర్చుకొంటివి - చేర్చుకొంటివి

3. నీ వెలుగును నీవు - నాలో వెలిగించితివి - వెలిగించితివి

4. నీ ప్రేమను నీవు - నాలో నింపితివిగా - నింపితివిగా

5. నా పాపము నంతటిని - నా నుండి తీసితివి - తీసితివి

6. నిత్యము నే నిన్ను - స్తుతియించి కీర్తింతును - కీర్తింతును
276 ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెనుprabhuyesu prabhuyesu adigo shrama nondenu

Ephesians 4:8

పల్లవి:
ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెను  -
ఖైదీలను విడిపించెను సిలువలో (2)

1. ఎంత కౄరమో - ఎంత కౄరమో -శత్రు కార్యము చూడుమా (2)
   అంతగా బాధించి సిలువమీద కెత్తిరి (1)
   బాధనొందియు (2) - ఎదురు మాటలాడక (1)

2. ముండ్ల మకుటము - ముండ్ల మకుటము - తన తల నుంచిరి
   మూర్ఖుల దెబ్బల బాధను సహించెను
   మూసియుండిన - మోక్షద్వారము తెరచి

3. ఆత్మదేవుడు ఆత్మదేవుడు - ప్రత్యక్షంబాయె సిలువలో
   సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి
   సార్వత్రికము - గడగడ వణికెను

4. మరణించెను - మరణించెను - సమాధి నుంచబడెను
   మూడవనాడు సమాధినుండి లేచెను
   విడిపించెను - మరణ బంధితులను

5. తీసివేసెను - తీసివేసెను -నా పాప నేరమంతయు
   దేవయని ప్రభు అరచిన యపుడు
   దేవునిదయ - కుమ్మరించబడెను

6. కారు చీకటిలో - కారు చీకటిలో - దుఃఖంబులలో నేనుంటిని
   నీకువేరుగా నారక్షణిల లేదుగా
   నాదు శ్రమలు - వేరెవ్వరు నెరుగరు
277 నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్nee raktame nee raktame nan shuddheekarinchun

1 John 1:7

పల్లవి:
నీ రక్తమే - నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్  - నీ రక్తమే  నా బలము (2)

1. నీ రక్తధారలే యిల - పాపికాశ్రయంబిచ్చును (2)
   పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచుము (2)

2. నశించువారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది
   రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియైయున్నద

3. నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే
   పాప విముక్తిఁ జేసితివి - పరిశుద్ధ దేవ తనయుడ

4. పందివలె పొర్లిన నన్ను - కుక్కవలె తిరిగిన నన్ను
   ప్రేమతో జేర్చుకొంటివి - ప్రభువా నీ కే స్తోత్రము

5. నన్ను వెంబడించు సైతానున్ - నన్ను బెదరించు సైతానున్
   దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే

6. స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకును
   స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడ నీకే తగును
278 సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్లsiluvalo baliyaina devuni gorrepilla

Isaiah 53:5

పల్లవి:
సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల (1)
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు (2)

1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి (2)
   కాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే (2)

2. నా యతిక్రమములకై - నలుగగొట్టబడి
   నా దోషముల నీవు - ప్రియముగను మోసితివా

3. మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేత
   సురూపము లేక - సోలిపోతివా ప్రియుడా

4. నా రోగముల నీపై నమ్రతతో భరియించి
   తృణీకరింపబడి - ప్రాణమర్పించితివి

5. వ్యసనాక్రాంతుడవుగా - వ్యాధి ననుభవించి
   మౌనము ధరియించి - మరణమైతివా ప్రభువా

6. నా పాప దోషముచే - నే చచ్చి యుండగనే
   మరణమై నాకొరకు - మరి తిరిగి లేచితివా

7. పరమున కెత్తబడిన - ప్రియ యేసురాకడకై
   పదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూయ
279 అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడేadigo kalvarilo yesu rakshakude deenudai vrelaaduchunnaade

1 Cor 1:23

పల్లవి:
అదిగో కల్వరిలో  - యేసు రక్షకుడే (1)- దీనుడై వ్రేలాడుచున్నాడే (2)

1. మహిమ ఘనతను మరచి వదిలెనే - కఠిన సిలువనే కోరుకొన్నాడే (2)
   మాయ జగత్తులో నాశన మొందక (2)
   కౌగలించెను కల్వరిలో ప్రేమన్ (1)

2. సురూపమైన సొగసైన లేదు - నన్ను రక్షించ వికారుండాయెన్
   పలునిందలన్ భరించెను - పదివేలలో నతి కాంక్షణీయుడే

3. ముండ్ల మకుటం శోభిత వస్త్రమే - పాద హస్తములలో చీలలు కలవు
   రక్త డాగులతో వ్రేలాడెను - మరణ దాసుల విమోచించెన్

4. యేసుని త్యాగం నా యాశ్రయమే - గొప్ప సంతోషం ప్రియుని రాజ్యం
   పాద జాడలలో నడచుటయే - నా జీవితమందలి యానందం

5. సిలువ దృశ్యమును చూచి నే - ఉజ్జీవముతో సేవ చేయుదునే
   నిరీక్షణతో జీవించెదనే - నన్ను చేర్చుకొను - యేసు రాజ్యములో
280 దైవతనయా క్రీస్తునాథుండా అయ్యాdaivatanayaa kreestunaathundaa ayyaa

1 John 3:16

పల్లవి:
దైవతనయా క్రీస్తునాథుండా  - అయ్యా -
పాపులకై ప్రాణమిచ్చితివా - దేవుడే నిను పంపినాడా (2)

1. పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా (2)
   ప్రాణదానము చేసినావా - దేవా - పరలోకము తెరచినావా (2)

2. కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ము
   కడిగి పావన పరచినావా - దేవా - కడకు బూరతో రానై యున్నావా

3. మరణము జయించినావా మరణముల్లు విరచినావా
   మహిమతోడ లేచినావా - దేవా - మాదు చింతలు దీర్చినావా

4. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి
   ధరణికే ఏతెంచినావా - దేవా - ధన్యులనుగా జేసినావా

5. ఆదియంతము లేనివాడా అందరికిని దేవుడవు
   అల్ఫయు ఓ మేగయు నీవేగా - యేసు - ఆర్భటించుచు రానై యున్నావా
281 యేసుని రక్తమే జై జై ప్రభు -యేసుని రక్తమే జైyesuni raktame jai jai prabhu -yesuni raktame jai

Revelation 12:11

పల్లవి:
యేసుని రక్తమే జై జై ప్రభు -యేసుని రక్తమే జై (2)

1. యేసుని రక్తమే ముక్తిమార్గము - నా పాపమంతయు పరిహరించెను (2)

2. యేసుని రక్తమే యేక మార్గము - నిండు నెమ్మదితో నింపెనన్ను

3. యేసుని రక్తమే సత్యమార్గము - సంతోష మిచ్చి స్థిరపరచెను

4. యేసుని రక్తమే శక్తి మార్గము - జయముతో నింపి జీవమిచ్చెను

5. యేసుని రక్తమే శాంతి మార్గము - పాపభారమును పార ద్రోలేను

6. యేసుని రక్తమే నిత్య మార్గము - పాప మరణముల పాడుచేసెను

7. యేసుని రక్తమే యుక్తమార్గము - ఆత్మకు శాంతియు హాయినిచ్చెను

8. అన్నలారా అక్కలారా పిల్లలారా పాడుడి
   అందరం కలసి హల్లెలూయ పాడెదం
282 ఎటువంటి యాగంము జేసితివి యేసుetuvanti yaagammu jesitivi yesu

Philippians 2:8

పల్లవి:
ఎటువంటి యాగంము జేసితివి  - యేసు నీవలె నేనుండ నా కొరకై (2)

1. పరమ తండ్రి సన్నిధిన్ బరలోక ప్రణుతింపు విడచితివి (1)
   పశువుల తొట్టిలో పరుండియు (2) -పరమ ప్రేమన్ జూపెను ఆ ..ఆ ..ఆ .. (1)
   పశువుల తొట్టిలో పరుండియు (1)

2. జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చువరకు
   మాకై సిలువ బాధ నొందితివి - మమ్మును విమోచించన్
   మాకై సిలువ బాధ నొందితివి

3. తల వాల్చుటకైనను స్థలమిలలో లేనే లేకుండె నీకు
   నీయడుగు జాడలలో నేనుండన్ - నాముందు వెళ్ళితివి
   నీయడుగు జాడలలో నేనుండన్

4. తమ తల్లి దండ్రులను తమ స్వంతవాటిని విడచిపెట్టి
   నీ సిలువ మోయువారెల్లరును - నీ మహిమ జూచెదరు
   నీ సిలువ మోయువారెల్లరును

5. నీ శ్రమలు బాధలేగా నీ మహిమ లోనికి దెచ్చె నిన్ను
   నీకై నా జీవమెల్ల నియ్యను - నీ శ్రమలే నే కోరెదన్
   నీకై నా జీవమెల్ల నియ్యను

6. నా యానంద మీవేగా నా ప్రభువా నాకిలలో వేరే వలదు
   నీ వెంట వెళ్ళను నే వెరువను - నీ ప్రేమ నాలో నుండ
   నీ వెంట వెళ్ళను నే వెరువను
283 చూడుమదే నీ కొరకే సిలువపై వ్రేలాడుchoodumade nee korake siluvapai vrelaadu

Isaiah 53:5

పల్లవి:
చూడుమదే నీ కొరకే - సిలువపై వ్రేలాడు
శ్రీయేసు రక్షకున్  - చూడుమదే (1)

1. నలుగ గొట్టబడె నీకై - పలుకకుండె మారుగా (2)
   శిరస్సున రక్తధారలు విరచె రెక్కలను గ్రుచ్చ (2)
   నీ పాపమే, పాదములను - చీల్చెను, బల్లెమై ప్రక్కన్ బొడిచె (1)

2. రక్తసిక్తమై మోము - ఎఱ్ఱనయ్యె కొయ్యపై
   చూడు వీపున దున్నెను - దీనునిగా జేసె నీ పాపమే
   ప్రభు రక్తము ఏరులై - పారెను, నీ కొరకే సిలువపై

3. గాయమైన చేతులన్ - దినమెల్ల చాపెనో పాపీ
   చూచుచుండె ప్రేమతో - నీకై కన్నెటిని కార్చుచు
   తన కృపతో, సంధించును - పాపి నిను, చేరుచెంతన్ నీక్షణమే

4. ఎంతకాల మేడ్పించి - వెలుపలనుంతు వతనిని
   తెరువు హృదయ ద్వారమున్ - పొందు మారుమనస్సును
   ఈ దినమే, నీ పాపముల్ క్షమియించును - నీకిచ్చును రక్షణను
284 జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసుjeevapu maarga jyotivi siluva mosina yesu

John 19:17

పల్లవి:
జీవపు మార్గ జ్యోతివి - సిలువ మోసిన యేసు (1)
మహిమ పూర్ణుడవు  నీవే - సిలువ మోసిన యేసు (2)

1. శరీరధారివైతివి - నీ ప్రేమను కనుపరచితివి (2)
   దీనుల నుద్ధరించితివి - సిలువ మోసిన యేసు (2)

2. నీవే మార్గ సత్యమని - నీకు పేరు కలిగెను
   నిత్యజీవపు దాతవు - పునరుత్థానుడవు నీవే

3. అర్పణ చేసితివి బలిగా - సిలువపై నీ ప్రాణమును
   కడిగితివి నీ రక్తముతో - సిలువ మోసిన యేసు

4. నీ ద్వారమున జేరితిమి - నీచులము అయోగ్యులము
   నీకే మహిమ స్తుతి ఘనత - సిలువ మోసిన యేసు

5. కల్వరి మార్గ యాత్రికులం - నీకే జయమని పాడెదము
   సర్వద నిను స్తుతియించెదము - సిలువ మోసిన యేసు
285 యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకేyesu chaavonde siluvapai nee korake naa korake

1 Peter 2:24

పల్లవి:
యేసు చావొందె సిలువపై  - నీ కొరకే నా కొరకే (1)
ఎంతగొప్ప శ్రమ నోర్చెను - నీ కొరకే నా కొరకే (2)

1. నదివలె యేసు రక్తము - సిలువలో నుండి ప్రవహించె (2)
   పాపము కడిగె మలినంబు తుడిచె (2) - ఆ ప్రశస్త రక్తమే (1)

2. నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకో
   నీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో - క్రీస్తుయేసు రక్తములో

3. పాపశిక్ష పొంద తగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెను
   నలుగ గొట్టబడె పొడువబడె నీకై - అంగీకరించు యేసుని
286 మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వజూడ నాmahaatmudaina naa prabhu vichitra silvajooda naa

1 Cor 1:23

1. మహాత్ముడైన నా ప్రభు - విచిత్ర సిల్వజూడ నా
   ఆస్తిన్ నష్టంబుగా నెంచి - గర్వంబణంగ ద్రొక్కుదున్

2. నీ సిల్వగాక యోదేవా - దేనిన్ బ్రేమింపనీయకు
   నన్నావరించు సర్వమున్ - నీ సిల్వకై త్యజింతును

3. శిరంబు పాదహస్తముల్ - సూచించు దుఃఖ ప్రేమలు
   మరెన్నడైన గూడెనా - విషాద ప్రేమలీగతిన్

4. ముండ్లన్ దుర్మార్గులల్లిన - కిరీట మేసు కుండినన్
   ఈ భూకిరీటములన్ని - దానిన్ దూరంగ జాలునే

5. లోకంబు నే నర్పించినన్ - అయోగ్యమైన యీవియౌ
   వింతైన యేసు ప్రేమకై - నా యావజ్జీవమిత్తును

6. రక్షింపబడ్డ లోకమా - రక్షింప చావు పొందిన
   రక్షకుడేసును సదా - రావంబు తోడ గొల్వుమా
287 కల్వరి గుట్టమీదను దుర్మార్గవైరులుkalvari guttameedanu durmaargavairulu

Acts 3:15

1. కల్వరి గుట్టమీదను - దుర్మార్గవైరులు
   ద్వేషించి సిల్వ మీదను - శ్రీ యేసుజంపి

2. శ్రీయేసు శ్రమలన్నియు - నే నెంచజాలను
   నన్నున్ రక్షించులాగున - ప్రాణంబు బెట్టెను

3. నే జీవ మొందులాగున - చావును పొందెను
   నన్నున్ రక్షింప శ్రమను - శ్రీ యేసు పొందెను

4. శ్రీ యేసు గాక గురువు - లేరింక నాకును
   నా వంటి పాపులెల్లరిన్ - రక్షింప వచ్చెను

5. నా యేసు ప్రేమగొప్పది - యమూల్యమైనది
   నే ప్రేమతోను యేసును - సేవింతు నిత్యము
288 దేవా నాదేవా నన్నేల విడచితివని సిలువలో బలియైన నా యేసువాdevaa naadevaa nannela vidachitivani siluvalo baliyaina naa yesuvaa

Psalm 22:1

పల్లవి:
దేవా నాదేవా నన్నేల విడచితివని -సిలువలో బలియైన నా యేసువా (1)
పలుబాధ లొందితివి నా శైలమా (2)

1. నా తండ్రి నీకిది సాధ్యమైతే - ఈ గిన్నె నానుండి తొలగింపుమని (2)
   నా నాథా తండ్రిని వేడితివా (2)
   నే మోయలేని ఈ భారమంత (2)
   నీవు గాక యెవరు భరింతురు (2)

2. నీ శిష్యులంతా యేమైపోయిరి - నీవు స్వస్థపరచిన రోగులేరి
   నీ తండ్రికూడా నిను విడనాడెనా
   నా దోషమంతా నీపై మోపెనా
   నిను నలుగగొట్టుట కప్పగించెనా

3. నిన్ను రచ్చకీడ్చను నా రక్షకా - నీ నేరమేమిటి ఓ నా ప్రభువా
   మానవులు దేవుని చంపుటయా?
   ఏ చరితంబులోనూ కలదా ప్రభూ?
   ఈ ఘోరమరణము నాకై నొందితివా?

4. సొగసైన షారోను ఓ పుష్పమా - సురూపమంతా కోల్పోయితివా
   వ్యసనా క్రాంతుడవైతివా నాకై
   వ్యాధిని అనుభవించితివి నాకై
   వధియింప బడితివి బలి పశువుగా
289 దూరపు కొండపై శ్రమలకు గుర్తగుdoorapu kondapai shramalaku gurtagu

Galatians 6:14

1. దూరపు కొండపై శ్రమలకు గుర్తగు - కౄరపు సిలువయే కనబడె (1)
   పాపలోకమునకై ప్రాణము నొసగిన - ప్రభుని సిలువను ప్రేమింతున్ (1)

పల్లవి:
ప్రియుని సిలువను ప్రేమింతున్ - ప్రాణమున్నంత వరకును (1)
హత్తుకొనెదను సిలువను - నిత్యకిరీటము పొందెదన్ (1)

2. లోకులు హేళన చేసిన సిలువ - నా కెంతో అమూల్యమైనది
   కల్వరిగిరికి సిలువను మోయను - క్రీస్తు మహిమను విడచెను

3. రక్తశిక్తమైన కల్వరి సిలువలో - సౌందర్యంబును నే గాంచితిని
   నన్ను క్షమించను పెన్నుగ యేసుడు - ఎన్నదగిన శ్రమ పొందెను

4. వందనస్తుడను యేసుని సిలువకు - నిందను ఈ భువిన్ భరింతు
   పరమ గృహమునకు పిలిచెడు దినమున -ప్రభుని మహిమను పొందెద
290 గీతం గీతం జయ జయ గీతంgeetam geetam jaya jaya geetam

Psalm 24:9

పల్లవి:
గీతం గీతం జయ జయ గీతం - చేయి తట్టి పాడెదము (2)

అను పల్లవి:
యేసు రాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము (2)

1. చూడు సమాధిని మూసినరాయి - దొరలింపబడెను (2)
   అందు వేసిన ముద్ర, కావలి నిల్చెనా - దైవ సుతుని ముందు (2)

2. వలదు వలదు ఏడువ వలదు వెళ్ళుడి గలిలయకు
   తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి

3. అన్న, కయప, వారల సభయు - అదరుచు పరుగిడిరి
   ఇంక దూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి

4. గుమ్మముల్ తెరిచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా
   మీ మేళ తాళ వాద్యముల్ బూర - లెత్తి ధ్వనించుడి
291 లేచినాడురా సమాధి గెలిచినాడురాlechinaaduraa samaadhi gelichinaaduraa

Isaiah 25:8

పల్లవి:
లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు (1)
లేచినాడురా సమాధి గెలిచినాడురా (1)

అను పల్లవి:
లేతునని తా జెప్పినట్లు - లేఖనములో పలికినట్లు (2) || లేచి ||

1. భద్రముగా సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు (2)
   ముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న (2)

2. ప్రభువు దూత పరము నుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి
   భళిర దాని పై కూర్చుండె - భయము నొంద కావలివారు

3. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధమును
   శ్రద్ధ తోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ

4. చూడ వెళ్ళిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ
   లేడు గలిలయ ముందుగ పోతు - న్నాడు అపుడే లేచినాడని

5. చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు
   చచ్చినను నను లేపుతాడు - చావు అంటె భయపడరాదు

6. నేను చేసే పనుల నెరుగు - నేను నడిచే మార్గ మెరుగు
   నేను చెప్పు మాట లెరుగు - నేను బ్రతికే బ్రతుకు నెరుగు

7. నేను లేచిన యేసు నందు - మానక మది నమ్ముకొందు
   తాను నాలో యుండినందున - దయను జేర్చును మోక్షమందు

8. పాప భారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు
   నరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభుని

9. యేసునందే రక్షణభాగ్యం - యేసునందే నిత్యజీవం
   యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం

10. పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించినాడు
   పాపులను ప్రేమించినాడు - ప్రాణదానము చేసినాడు
292 శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెనుshreshtageetamu vinabaduchunnadi yesu lechenu

1 Cor 15:55

పల్లవి:
శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను (2) -
ఈ  కష్టలోకమందు మనకు మిత్రు - డాయనే (2)

1. మాయక్షితిని రక్షింప వచ్చిన పరమ నాయకుడు (2)- ఈ
   భయంకర చీకటి పోగొట్ట వచ్చిన ప్రభువు (2)

2. ముండ్ల కిరీటమును ధరించి ముఖమున గొట్టబడెన్ - ఆ
   గండుదొంగను సిలువలో వ్రేలాడి రక్షించెన్

3. హీనమైన ఈటెతోడ ప్రక్కన గ్రుచ్చబడెను - ఆ
   పావనమగు రక్త ఊట ప్రవహించెన్

4. మూడవ దినమున సమాధి నుండి కర్త లేచెను - తన
   తోడిశిష్యులు చూచుచుండ నారోహణమాయెన్

5. జయము జయము అనుచు నీవు ప్రకటించుము - నీ
   జన్మమెల్ల యేసుని గూర్చి సాక్ష్యమీయుము

6. ఆరోహణమైనట్లు మరల వచ్చెద ననెను - ఈ
   ధరణికి వేంచేయు కాలము సమీపించెను

7. హల్లెలూయ పాడుచు నార్భాటముగ నాడు - ఆ
   వల్లభుడేసు నెదుట నిలువ నాయత్తపడుము
293 యేసు సమాధిలో పరుండిyesu samaadhilo parundi

1 Cor 15:4

1. యేసు సమాధిలో - పరుండి- వాసిగా మూడవ - నాడు లేచెన్

పల్లవి:
లేచెన్ సమాధినుండి - మృత్యువుపై విజయమొంది
శత్రువు నోడించి జయశాలియై - నిత్యం జీవించ
మధ్యవర్తియై - లేచెను! లేచెను! హల్లెలూయ!

2. వ్యర్థమే కావలి - సమాధియొద్ద
   వ్యర్థంబు ముద్రయు - యేసు ప్రభూ! ||లేచెన్||

3. మృత్యుబంధంబులన్ - నిత్యుండు త్రెంచెన్
   స్తుత్యుండు జయించెన్ - జయమో జయమ్ ||లేచెన్||
294 క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!kreestuleche! hallelooya! leche jayasheeludu!

Luke 24:6

1. క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!
   స్తోత్రమైన హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను
   చూచి మళ్ళీ తనకాంతి - హృదుల్ నాయనన్
   చింతవీడి సంతసాన వంగి క్రీస్తునెదుట

పల్లవి:
క్రీస్తులేచె - హల్లెలూయ! లేచె జయశీలుడు!
స్తోత్రమైన -  హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను

2. క్రీస్తులేచె! మండలపు - చింతయంత తీరెను!
   హర్ష ద్వార మొప్పదీసి - మళ్ళీ జీవ మొందెను
   చావు నరకాలు మ్రొక్కి - దూతలెల్ల గల్వను
   కోట్లు చుట్టు కాంతి గూడ - లేచెనిప్డు శూరుడు ||క్రీస్తు||

3. క్రీస్తులేచె! నాటి వంత - యంత యంత మొందెను
   నేడు గొప్ప హర్షమాయె - క్రీస్తు లేచినందునన్
   శుద్ధ భూసమాధి తొలి - పంటను గల్గించెను
   వింతగన్ సజీవుడాయె - బోయిమళ్ళి కన్పడెన్ ||క్రీస్తు||

4. క్రీస్తులేచె! నింక చావు! నరకాల భయము
   లేనే లేదు! క్రీస్తు నందు నన్ని గెల్చినారము
   మా భయాదులన్ని పోయి - శంకదిగులుంబాసె
   నేడు పునరుత్థానంపు - దీవెనల నొందుదము ||క్రీస్తు||
295 క్రీస్తు నేడు లేచెను మర్త్య దూత సంఘమాkreestu nedu lechenu martya doota sanghamaa

Mark 16:6

1. క్రీస్తు నేడు లేచెను - మర్త్య దూత సంఘమా
   భూమి నాకాసంబులో - బాడు విందుచేతను

2. మోక్ష మియ్య నాథుదు - యుద్ధమాడి గెల్చెను
   సూర్యుడుద్భవింపగ - జీకటుల్ గతించెన్

3. బండ, ముద్ర, కావలి - అన్ని వ్యర్థమైనవి
   యేసు నరకంబును - గెల్చి ముక్తి దెచ్చెను

4. క్రీస్తు లేచినప్పుడు - చావు ముల్లు త్రుంచెను
   ఎల్లవారి బ్రోచును - మృత్యు వింక గెల్వదు

5. యేసు మృతి గెల్చెను - మేము కూడ గెల్తుము
   యేసుడుండు చోటుకు - మేము కూడఁ బోదుము

6. భూమి నాకాసంబులో - యేసు, నీకు స్తోత్రము
   మృత్యు సంహారకుండ - నీకేను విజయము
296 యేసురాజు వచ్చును దూతలతో వచ్చునుyesuraaju vachunu dootalato vachunu

Matthew 25:6

1. యేసురాజు వచ్చును దూతలతో వచ్చును - దాసుల పరమున జేర్చుటకు (2)
   యేసుని ముఖజ్యోతిని జూచెదము (2)
   జయ ధ్వనులచే నుప్పొంగెదము (2)

2. సంఘ వధువు పెండ్లి కుమారుండేసుతో - మంగళ గీతము పాడును
   నాడు మహిమలో మనము పాడెదము
   యేసు స్నేహంపు లోతును రుచియింతుము

3. ముద్ర నొంది శుద్ధులు తెల్ల నంగి ధరించి - శుద్ధుని ముంగిట నిలిచెదరు
   నాడు స్వర్ణ కిరీటమును దాల్చి
   అందు పాడుచు ప్రకాశించెదము

4. యేసునే ప్రేమించితి - లోక స్నేహం వీడితి - సదా నా యేసుతో ముచ్చటింతున్
   ఆహా! భాసిల్లు మహిమతో ముచ్చటింతున్
   నాడు ప్రభు యేసునితో సుఖ మొందెదన్

5. పరలోక బూరధ్వని మ్రోగగానే - పరిశుద్ధులెగిరి వెళ్ళెదరు
   ఆ సత్యుని కళ్యాణ విందులో -మన మేసుతో నార్భటించెదము
297 రాజాధిరాజా రావేraajaadhiraajaa raave

Revelation 22:20

పల్లవి:
రాజాధిరాజా రావే - రాజు యేసు రాజ్యమేల రావే -
రాజులకు రాజువై రావే - రవికోటి తేజ యేసు రావే (2)
ఓ ... మేఘ వాహనంబు మీద వేగమే (1)
ఓ ... మించు వైభవంబుతోడ వేగమే (1)

1. ఓ ... భూజనంబులెల్ల తేరి చూడగా - ఓ ... నీ జనంబు స్వాగతంబు నీయగా (2)
   నీ రాజ్య స్థాపనంబు చేయ - భూరాజులెల్ల గూలిపోవ (1)
   భూమియాకాశంబు మారిపోవ - నీ మహాప్రభావమున వేగ (1)

2. ఆ ... ఆకసమున దూతలార్భటింపగా - ఆ ... ఆది భక్త సంఘ సమేతంబుగా (2)
   ఆకసంబు మధ్య వీధిలోన - ఏకమై మహాసభచేయ (1)
   యేసునాథ! నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ (1)

3. ఓ ... పరమ యెరూషలేము పుణ్యసంఘమా !
   ఓ ... గొఱ్ఱెపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా !
   పరమదూతలారా ! భక్తులారా ! పౌలపొస్తులారా !
   పెద్దలారా ! గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్త గీతమెత్తి పాడరారా
298 మేఘా రూఢుండై ప్రభుయేసుmeghaa roodhundai prabhuyesu

Revelation 1:7

పల్లవి:
మేఘా రూఢుండై - ప్రభుయేసు, అతి - వేగముగా నేతెంచున్ (1) ఏతెంచున్ (4)
ఆకాశమునుండే వాడైన యేసు యిలకు నేతెంచున్ (1)

1. ఆకాశమందాయనను - సంధింప -
   ఏకముగ నేగుదురు - నిజ విశ్వాసులందరు (2)

2. పాపబంధకముల్ ఆయనే త్రుంచున్ -
   పాపముల నెడబాపున్ ప్రభుయేసే నినురక్షించున్

3. రక్తముచే విమోచన మొంది -
   యేసుతో నేగ నాయత్తమా? క్రీస్తేసే - నీకై రాగన్

4. శాశ్వత జీవము నిచ్చును నీకు -
   తండ్రితో నైక్యపర్చునిన్ - నదాతనతోనే నిన్నుంచున్
299 ప్రభుని రాకడ ఈ దినమేprabhuni raakada ee diname

Amos 4:12

పల్లవి:
ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే (2)

అను పల్లవి:
పరమునందుండి మన ప్రభువు - ధరకు నరుగును -
పాలనకై (2)- బూరశబ్దముతో - జనులారా (1)

1. సిద్ధులగువారిన్ - మనయేసు - శుద్ధి జేయునిలన్ - పరమునకై (2)
   బుద్ధిహీనులను - శ్రమచేత - బద్ధులుగ జేయున్ - వేదనతో (2)
   బాధ కలిగించున్ - సాతాను (1)

2. స్వరముతో వచ్చున్ - అధికారి - మహిమతో మరలున్ - తనదూత
   సూర్యచంద్రునిలన్ - తారలతో జీకటుల్ క్రమ్మున్ - ప్రభురాక
   పగలు రాత్రియగున్ - త్వరపడుము

3. మొదట లేతురు సజీవులై - ప్రభుని యందుండు - ఆ మృతులు
   మరల అందరము ఆ ధ్వనితో - పరము జేరుదుము - ధరనుండి
   ధన్యులగుదుము - పరికించు

4. వెయ్యియేండ్లు పాలించెదరు ప్రియుని - రాజ్యమున -ప్రియులు
   సాయం సమయమున చేరి - నెమలి కోకిలలు -రాజున్
   పాడి స్తుతించును - ఆ దినము

5. గొఱ్ఱె మేకలును - ఆ చిఱుత సింహజాతులును - ఒక చోట
   భేధము లేక బరుండి - గరిక మేయును - ఆవేళ
   కలసి మెలగును - భయపడక

6. న్యాయ నీతులన్ మన - ప్రభువు ఖాయముగ దెల్పున్ - ఆనాడు
   సాక్షులుగ నిలుతుం అందరము - స్వామియేసునకు - ధ్వజమెత్తి
   చాటి యేసునకు - ఓ ప్రియుడా
300 మహిమయుతుడు మా యేసు రాజుmahimayutudu maa yesu raaju

1 Thes 4:16

పల్లవి:
మహిమయుతుడు మా యేసు రాజు - మహిమదూత సైన్యము తోడ -
ఇహకు వచ్చున్ మహానందము (2)

1. ఇమ్మహి అతిశయిల్లు - దూతలు ఆర్భటించ (2)
   దూత వెల్గుతోడ మేఘముపై యేసు (2)- సమ్మతిన్ రాగా సంధింతుము వేగ
   ఆ ... ఆనందము (1)

2. బూరశబ్దించగానే - వాంచలు తీరుటకు
   మిత్రునిచెంత భక్తులందరు చెరి - హర్షంబుతోడ పాడి స్తుతింతుము
   ఆ ... ఆనందము

3. భూమి గోత్రములును - దేశాధికారులును
   ఇమ్మానుయేలుచే న్యాయ తీర్పుపొంద - ఇమ్ముగ మేమును చేరుదు మచ్చట
   ఆ ... ఆనందము

4. వేయేండ్ల రాజ్యమున భూలోక రాజ్యములు
   తీరిన పిదప మిత్రునితో మేము - జయప్రదులమై నిత్యమేలుదుము
   ఆ ... ఆనందము
301 మేఘము మీద యేసురాజు వేగ మిలకువచ్చున్meghamu meeda yesuraaju vega milakuvachun

Rev 1:7

పల్లవి:
మేఘము మీద యేసురాజు వేగ మిలకువచ్చున్ (1)

అను పల్లవి:
సిద్ధముగ నుండువారల జేర్చును శీఘ్రముగా దిగును (2) || మేఘ ||

1. ప్రభువు తానే ఆర్భాటముతో ఈ భువికి వచ్చున్ (2)
   ఇక్కడ నమ్మినవారలు ఎగురుచు ఈ భువి విడచెదరు (2)

2. క్రీస్తునందు మృతులగు వారు లేచి వెళ్ళుదురు
   నిలిచియుండు పరిశుద్ధులందరు మాయమై పోయెదరు

3. వేల వేలగు ఆయన మాటలు రాకను దెల్పెను
   ప్రవక్తలపొస్తలులు దానిని గూర్చియే ప్రకటించిరి

4. పాట్లుపడెడు వారల కేసు ప్రతిఫలమిచ్చును
   చేరు మనకు సంపూర్ణశక్తిని చెలువుగ నొసగును

5. ఆయన తెల్పిన గురుతులన్నియు నెరవేరుచున్నవి
   రాకడ గడియ నెవరు యెరుగరు తండ్రికే తెలియును

6. వేయి యేండ్లు యేసు యిలలో రాజ్యము యేలును
   నీతి సమాధానములుండు నాయన రాజ్యములో

7. హల్లెలూయా గీతముపాడి ఆర్భాటించెదము
   వల్లభుడిదిగో వచ్చెడు వేళ సమీపమాయెను
302 సోదరులారా లెండి రాకడ గుర్తులు చూడండిsodarulaaraa lendi raakada gurtulu choodandi

Matthew 25:6

పల్లవి:
సోదరులారా లెండి - రాకడ గుర్తులు చూడండి (1)
దివిటీల నూనెతో నింపి - సిద్ధపడండి (2)

1. అర్ధరాత్రివేళలో - ప్రభురాకడ ధ్వని మ్రోగెను (2) సోమరితనము విడచి (2)
   నడుమున దట్టి గట్టి - ప్రభుని కెదురుచూడుము (2)

2. సర్వత్రయుద్ధాలు భూకంపములును ఘోరవ్యాధులు
   ఘోరముగ ప్రబలెను
   యేసుని రాకడ సమీపం - బాయెనో సోదరా

3. రాజ్యాలు అధికారాలన్ని - కదలిపోవుచున్నవి -కలవర మధికంబాయె
   కన్నులు తెరచి చూడుమా ప్రభు - వచ్చేవేళాయె

4. చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే యొక సూచన
   క్రీస్తుయుగ మారంభము
   రానై యున్న వేళిదే - కనిపెట్టుము సోదరా

5. తలుపు వేయబడిన లోన - ప్రవేశించనేరవు -పశ్చాత్తాప పడుము
   యేసుపై నాధారపడి సంసిద్ధపడుమా
303 యేసు రాగానే సంఘముyesu raagaane sanghamu

Hebrews 9:27

పల్లవి:
యేసు రాగానే సంఘము - మార్పు చేయబడి పైకెత్తబడును

1. మేల్కొనును క్రీస్తునందు మృతులు - కడబూర మ్రోగగనె - ఓ ప్రియులారా
   కడబూర మ్రోగగనె - శ్రీ యేసు రాగానే

2. కుడివైపున గొర్రెల జేర్చున్ - మేకల -నెడమ ప్రక్క జేర్చున్ - ఓ ప్రియులారా
   నెడమ ప్రక్క జేర్చున్ - శ్రీ యేసు తీర్పులో

3. తనవారి నత్యధికముగా ప్రేమించి - తన కేర్పరచుకొనును - ఓ ప్రియులారా
   తన కేర్పరచుకొనును - శ్రీయేసురాగానే

4. మేఘముపై మహిమా ప్రభావముతో - వచ్చును శ్రీయేసు - ఓ ప్రియులారా
   వచ్చును శ్రీ యేసు - శ్రీ యేసు దూతలతో
304 రాజుల రాజుగ యేసుraajula raajuga yesu

Revelation 22:7

పల్లవి:
రాజుల రాజుగ యేసు ప్రభుండు -రయమున రానై యున్నాడు (2)

1. రక్షణాలంకారముతో - తక్షణమే సిద్ధపడుడి (2)
   అక్షయుడగు నా రక్షకుని - నిరీక్షణతో వేడండి (2)

2. మన ప్రభు యేసుని రక్తము - మన పాపములను పోగొట్టి
   మన ప్రభురాకడ మనకెంతో - మహిమానందము కలిగించున్

3. మొదట గొఱ్ఱెపిల్ల వలె - నొదిగి వచ్చెను మన ప్రభువు
   కొదమసింహముగా వచ్చును - గుండెదిగులు పాపికి

4. గురుతులన్నియు జరుగుచుండ - సరిగా చూడుము విశ్వాసి
   త్వరపడుము నీ ప్రభుని జూడ - కరములెత్తి ప్రార్థించు

5. ఎల్లరు క్రీస్తుని రాకను - ఉల్లాసముతో కోరుచు
   హల్లెలూయా పాటలు పాడి - ఎల్లప్పుడు స్తుతియించెదము
305 నీ దేవుని సంధించ నీవు ఆయత్తమాnee devuni sandhincha neevu aayattamaa

Amos 4:12

పల్లవి:
నీ దేవుని సంధించ నీవు ఆయత్తమా? (2)

1. భువికి యేసు వచ్చునప్పుడు దుష్టులణిగెదరు (2)
   ఆ విధమున నీవుండిన ఏమి చేతువు? (2)

2. మేఘముతో వత్తునని చెప్పినవాడు
   మేఘముపై వచ్చుకాలము సమీపించెను

3. దూత గణములతో బూరధ్వనితో
   ఆ భక్తగణముల గలియు కాలమాయెను

4. భక్తి హీనులెల్ల నపుడు అంగలార్తురు
   రక్షణను పొందలేరు వారలప్పుడు

5. పాప జీవులెల్ల నాడు దాగుకొందురు
   శుద్ధ పరచబడినవారు ఎగిరిపోదురు

6. కృపకాలమందే పశ్చాత్తాప మొందుము
   ఇప్పుడే అంగీకరించి మన్నింపు నొందు

7. నీకై మృతి బొంది యేసు కాచియున్నాడు
   నిన్ను అంగీకరించును కరుణతోడను

8. దేవుని అంగీకరించని వారు ఆ నాడు
   దాగుకొని నిరతము పరితపింతురు
306 పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి పాడి యార్భటించి పరముననుండparishuddhulellaru yesun pogadi paadi yaarbhatinchi paramunanunda

Rev 7:14

1. పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి - పాడి యార్భటించి పరముననుండ -
   పరమానంద గీతమచ్చట ధ్వనింప (1) నీ వచట నుందువా? (3) నా మానసమా!

2. గొఱ్ఱెపిల్లయు రాజ్యమేలుచుండ - నాశ్రితు లెల్లరు నాయనను చేర-
   మిత్రుడెల్ల కన్నీటి దుడుచుచుండ - నీ వచట నుందువా? - నా మానసమా!

3. పేతురు పౌలు యోహాను నచట - పితామహులు యపో స్తలులందరు-
   హతసాక్షులెల్లరు సమావేశింప - నీ వచట నుందువా?- నా మానసమా!

4. జగములో సిలువను మోసినచో - కిరీటము ధరియించి భాసిల్లుదురు-
   దేవ పుత్రులుగా నెల్లరు మారగా - నీ వచట నుందువా? నా మానసమా!

5. శోధనల జయించిన వీరులెల్ల - కష్టశ్రమలోర్చిన మహాత్ములు-
   జ్యోతిర్మయులుగా నొప్పారుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!

6. కన్యకరణినాడు ప్రభుసంఘము - రాజు యేసు పెండ్లి కుమారునికి-
   భార్యగా ప్రకాశింప దాని రుచింప - నీ వచట నుందువా? నా మానసమా!
   నేనచట నుండెదను - నా యేసుతోడ
307 యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడిyesu sheeghramugaa vachun aashato kanipettudi

Mark 13:37

పల్లవి:
యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి (2)

1. గురుతులెల్ల లోకమంతా - సరిగజూడ కాననగున్ (2)
   పరిశుద్ధమైన ప్రవర్తనతో - ప్రభుకై కనిపెట్టుడి (2)

2. ప్రొద్దు గ్రుంకి వచ్చునేమో - అర్ధరాత్రి యందేమో
   ఉదయంపు కోడికూతలప్పుడు - వచ్చునేమో కనిపెట్టుడి

3. సిద్ధపడుడి మీరిలలో - మీరు దేవుని సంధింప
   సిద్ధపడుడి తీర్పునకై - ప్రభువుకై కనిపెట్టుడి

4. పరిశుద్ధులై జీవించుడి - ప్రభుని చిత్తము చేయుడి
   మరణమేసు నందె సుమ్మా - మేలుకొని కనిపెట్టుడి

5. యేసువలె జీవించుడి - తీసి వేయుడి మలినములన్
   మోసంపుటాశల నన్ని విడచి - ఆశతో కనిపెట్టుడి

6. వేషధారణ విడచి - యేసు ముద్రల ధరించి
   పెండ్లి కుమారుని సంధింప - అందరు కనిపెట్టుడి

7. మేఘములపై వెళ్ళిన ప్రభు - వేగముగ వచ్చునిల
   సకల శ్రమలను భరించి - హల్లెలూయ పాడుడి
308 మేలుకో! మహిమ రాజుmeluko! mahima raaju

Mark 13:37

పల్లవి:
మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు (2)

1. పరమునుండి - బూర ధ్వనితో అరయు నేసు - ఆర్భాటముతో (2)
   సర్వలోకము - తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా (2)

2. గురుతులెల్ల - ధరణియందు సరిగ చూడ - జరుగుచుండ
   చిరునవ్వుతో - చేరి ప్రభుని త్వరపడు ఓ ప్రియుండా

3. క్రీస్తునందు - మృతులెల్లరు కడబూర - మ్రోగగానే
   క్రీస్తువలె - తిరిగి లేతురు - లేతువా? నీవు ప్రియుడా

4. అరయంగ - పరిశుద్ధులు మురిసెదరు - అక్షయ దేహులై
   పరమందు - ప్రభుక్రీస్తు నిరతము - ఓ ప్రియుండా

5. కరుణలేని - ఓ మరణమా నిరతము నీకు జయమగునా
   మరణ సంహా - రుండేసు త్వరగా - రానై యున్నాడు

6. మాంసలోక - పిశాచాదులు హింస పరచ - విజృంభించిన
   లేశమైనను - జడియకుము ఆశతో - కాచుకొనుము

7. పాపమును - చేయకుమా రేపకుమా - దైవ కోపమును
   శాపమును - తప్పుకొని శ్రద్ధతో - కాచుకొనుమా
309 అదిగో వచ్చునదెవరో చూడుమాadigo vachunadevaro choodumaa

Luke 21:28

పల్లవి:
అదిగో వచ్చునదెవరో చూడుమా - మహిమ గలిగిన మన యేసే (1)
నీ కన్నులెత్తి చూడుమా - క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్ (2)

1. మేఘారూఢుడై వచ్చుచున్నాడు - కంపించెను ఆకాశమెల్ల (2)
   వీణె వాయింప దూతల్ పాడంగ (2) పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్ (2)

2. సూర్యచంద్రులు అదృశ్యులైరి - మృతులెవ్వరులేరు అచ్చట
   అందరు భయపడి వణకుచున్నారు - తీర్పుచేయ క్రీస్తు వచ్చుచుండెన్

3. గతించును మనమున్న లోకము - నూతన లోక మొకటి కలుగును
   నూతన మగును జగమంతయును - క్రీస్తు రాజ్యమేల వచ్చుచుండెన్

4. ముండ్ల మకుటము నింకలేదు - మహిమ కిరీటము ధరించెను
   అలంకారముతో అందమైయున్న - పెండ్లి కుమార్తెకై వచ్చుచుండెన్
310 యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్yesu sheeghramuga tirigivachun

Matthew 24:33

పల్లవి:
యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ - సత్యదేవుని వాక్యమిదే (1)
ఆయన రాకడ అంత్య గుర్తులు - అన్నియు నెరవేరుచున్నవి
యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ (1)

1. పాపదుఃఖములు పెరుగుచున్నవి - యుద్దకలహములు వృద్ధియాయెను (2)
   జనముపై జనము లేచుచున్నది - రాజ్యముపై రాజ్యము లేచుచున్నది (2)

2. భూకంపములు భువిని జరుగుచుండె - లోకమున తెగులు కరువు లున్నవి
   ఆకసమున భయసూచనలు - వీక్షింతురు వింత సూచనలు

3. విశ్వాసులు పైకి ఎత్తబడన్ - యేసు పరమునుండి దిగివచ్చును
   యేసుతో వెయ్యేండ్లు ఏలెదురు - ఆశతో కనిపెట్టుకొనువారలు

4. మారుమనస్సు నొందుమీ క్షణమే - కోరు యేసు రక్తాన కడుగుమని
   ఈ రోజున నీవు సిద్ధపడుము - పరలోకమున ప్రవేశింతువు
311 ఇదిగో నేను వచ్చుచున్నానుidigo nenu vachuchunnaanu

Revelation 22:12

పల్లవి:
ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగా వచ్చుచున్నాను (2)
ఎవని క్రియల ఫలితము - వానికియ్య వచ్చుచున్నాను (1)

1. మేఘారూఢుడనై నిక్కముగా - తిరిగి వచ్చుచున్నాను (2)
   ప్రతి నేత్రము వీక్షించును - పరిశుద్ధులై యుండుడి (2)

2. నేను త్వరగా వచ్చుచున్నాను - ఎవడు నీ కిరీటమును
   అపహరింప కుండునట్లు - జాగ్రత్తగా చూచుకో

3. యేసు ప్రభువే సర్వమును - నూతన పరచుచున్నాడు
   క్రీస్తుని రాకడను ప్రేమించి - కాయువారే ధన్యులు

4. వేవేగరా మా ప్రభు యేసు - వేచియున్నాను నీ కొరకే
   నీ దూతలతో వినుతించుచు - హల్లెలూయ పాడెదము
312 జయమని పాడు ప్రభుయేసునకే హోసన్న జైjayamani paadu prabhuyesunake hosanna jai

Matthew 21:9

పల్లవి:
జయమని పాడు ప్రభుయేసునకే హోసన్న జై - ప్రభు వచ్చుచుండె
యెంతో సంతసము - మధ్యాకాశమందు సంధించెదము

1. మనము మారెదము మర్మమిది గొప్పదే (2)
   బూరధ్వని మ్రోగగానే మన మెత్తబడెదము (2)
   ప్రియ యేసుని సంధింప, మనమాయనవారమే (2)

2. ప్రభుని పోలియుందుము ప్రభుని సంతతిగా
   ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము
   పొందెదము ప్రభువునే, మనమాయనవారమే

3. మన నిరీక్షణయే ప్రభుని చూతుమని
   తృప్తి చెంది నింపబడెదం వాంఛలు తీరును
   ప్రభుని రుచించెదము, మనమాయనవారమే

4. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే
   దేవుని గృహ మానంద మహిమతో నిండియుండును
   ప్రభువు మనవాడు, మనమాయనవారమే
313 కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్kaalamu sameepamu prabhu yesu vachun

1 Cor 3:14

పల్లవి:
కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ (2)
జీతము పొందును నిజ దాసుడు (2) -  ఆనందమొందెదరు (4)

1. బయలుపడు ప్రతివాని క్రియలు - కర్రగడ్డి కొయ్యకాలైనను (2)
   వెండి బంగారము విలువ రాళ్ళైనను (1)
   అగ్నియే తెల్పును - (2) అప్పుడే కనుగొందువు (1)

2. పందెమందు నీకు పాలున్నదా - పొందువాడొక్కడే బహుమతిని
   యోధుడవై మంచి బుద్ధిని కలిగిన
   వాడబారని - కిరీట మొందెదవు

3. ఆత్మలకొరకై భారమున్నదా - ఫలితమున్నదా నీ సేవలో
   ప్రభుని రాకలో అందరి యెదుట
   ఆనందమహిమ - (2) కిరీట మొందెదవు

4. సంఘము నడిపే సేవకుడా - మందను నడుపుము ప్రేమతోడ
   ఆదర్శుండవై మందను కాచిన
   మహిమ కిరీటము - నీవు పొందెదవు

5. మంచి పోరాటము పోరాడుము - కాపాడుకొను విశ్వాసమును
   తన ప్రత్యక్షత నపేక్షించుము
   నీతి కిరీటము - నీ కివ్వబడును

6. భక్తితో బ్రతుక గోరినచో - సిద్ధపడు పొంద హింసలను
   అంతము వరకు నమ్మికయుంచిన
   జీవకిరీటము - పొందెద వెరుగు

7. దయచేయు శ్రేష్ఠ దీవెనలు - అంగీకరించు నీ ప్రార్థనలు
   ప్రార్థన యందు మేల్కొని యుండుము - స్వర్ణకిరీటము
   ధరింపజేయును
314 ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతోprakaasha vastramuto paraloka mahimato

Matthew 24:30

పల్లవి:
ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో -
లోకంబున కేతెంచును మేఘంబుపై ప్రభువే (2)

1. అంత్య సూచనలు చూడుము - ప్రభు రాకకు మునుపు
   క్రీస్తు నిశ్చయముగా వచ్చును - బూర శబ్దముతో
   విస్తరించు లోకమందు - యుద్ధము కరవులు
   విస్తరించు పాపములు దుఃఖము కలవరము

2. పాపముచే జన్మించిరి - తల్లి గర్భమునుండి
   కోపము దుష్టమోసము - ఎల్లరి హృదయములు
   పాప దృష్టి జారచోర - దేవదూషణ హత్యలు
   వేపుగా దుష్టగర్వముల్ - హృదయ రోగములు

3. వెళ్ళరు పరలోకమునకు - ఎవ్వరు పాపముతో
   చాలవు నీతి క్రియలు - ప్రార్థనలు రక్షింపవు
   చాలును యేసు రక్షింప - ప్రాణమర్పించెను
   కలుషములు కడుగును - తన రక్తము చిందించె

4. క్షణములోనే గతించును - జీవిత మేపాటిది
   తన యాస్తి విడచి నరుడు - నరకము పాలగున్
   నిన్ను రక్షింప నీ ప్రభు - సిద్ధముగ నిలచె
   పెన్నుగ పొందుము రక్షణ - నమ్మి యేసు ప్రభువులో
315 రాజుల రాజు ప్రభువుల ప్రభూraajula raaju prabhuvula prabhoo

Revelation 19:16

పల్లవి:
రాజులరాజు - ప్రభువుల ప్రభూ (1)
ఈ జగతికి - అరుదెంచె ప్రభూ (1)- రాజులరాజు (1)

1. ప్రభావంపు దూతలతోడ - ప్రభువేతెంచున్ అగ్ని జ్వాలలలో (2)
   ఆ దినమున పవిత్ర జనమున (2)
   మహిమాశ్చర్యకరుడగు ప్రభు (1)

2. ప్రభు యేసు తానే స్వర్గమునుండి - ఆర్భాటముతో పిలుచుచు వచ్చున్
   ప్రభు జీవితులను మృతులైన వారిని
   దేవుని ప్రజలను తనచెంతన్ జేర్చున్

3. ధన్యులు ప్రభుకై జూచెడివారు - మిన్నున ప్రభుతో కలసి వెళ్ళెదరు
   విశ్వాసులను ప్రేమతో ప్రభువు
   ఆహ్వానించును తన సన్నిధికి

4. అనంత జీవము నీకిచ్చును - ఘనత మహిమ ప్రభు నీకిచ్చున్
   తండ్రితో నిన్ను జేర్చును ప్రభువు
   జీవ కిరీటము నీకిచ్చును
316 జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభుయేసు వేగవచ్చునుjaagratta, bhaktulaaraa pilupide prabhuyesu vegavachunu

1 Thes 4:16

పల్లవి:
జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభుయేసు వేగవచ్చును (2)
వందనం, హోసన్న, 2రాజాధిరాజు వచ్చును (2)
వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము (2)

1. చాలా రాత్రి గడిచిపోయె (2) - చూడు పగలు వచ్చెనుగా (2)
   విడువుము అంధకార క్రియలు (2) - తేజో ఆయుధముల ధరించుము (2)

2. గుర్తులన్ని నెరవేరినవి - నోవహు కాలము తలచుము
   లోతుభార్యను మరచిపోకు - మేలుకొనెడి సమయమువచ్చె

3. మన దినములు లెక్కింపబడెను - మేల్కొనువారికి భయమేమి
   ఘనముగ వారెత్తబడుదురు - యెవరు ప్రభువుతో నడచెదరో

4. దైవజనులు కలుతురు గగనమున - ప్రభునందు మృతులు జీవింతురు
   మేఘమునందు ఎల్లరు చేరి - అచ్చటనే ప్రభుని గాంతురు

5. క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును - విజయులే దాని పొందెదరు
   ప్రీతిగ పల్కును ప్రభువే - మనతో నావన్నియు మీవేయనుచు
317 సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడుseeyonuraaju vachunu madin siddhapadu

Zechariah 9:9

పల్లవి:
సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు (2)
మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజు కొఱకే (2)

1. లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు యెవరని (2)
   తన శక్తిని విన్నవారు చూడ నాశింతురుగా (2)
   క్రీస్తే మన రారాజని ఉత్సహించెదము (2)

2. వాహనములు ఎన్నియున్న గార్ధభమును యెక్కెను
   తా నెవరియింట నుండునో వారిని యుద్ధరించును
   పరీక్షించ ఆయనను చేర్చుకో నీయందు

3. యేసుని స్వీకరించెడు వారేగుదు రాయనతో
   తృణీకరించువారలు నశింతురు నిక్కంబుగ
   ప్రాముఖ్యమౌ ప్రశ్నయిది యోచించి చూచుకో

4. రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే
   న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు
   సదా రాజ్యంబాయనదే ఆనంద మొందుడి
318 ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమేprabhuvu digivachunu paramunundi vegame

1 Thes 4:16

పల్లవి:
ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే (1)
విభుడు తిరిగివచ్చును పరమ వధువుకై (2)

1. ప్రభువు దిగివచ్చు నార్భటముతో (2)- దూత శబ్దముతో బూరధ్వనితో (2)
   క్రీస్తునందు మృతులు మొదటనే లేతురు (2)
   వారితో నేకమై ప్రభువు నెదుర్కొందువా? (2)

2. వాని వాని పనులనుబట్టి ప్రభువు - సిద్ధపరచిన జీతము తానిచ్చును
   తానే త్వరగా వచ్చున్ ఎదుర్కొన సిద్ధమా
   సిగ్గుతో భయముతో నుందువా దినమునా?

3. హృదయములో కలవరపడక - క్రీస్తునందు విశ్వాసముంచుడి
   శుద్ధులుగ మీరు సిద్ధమనస్సుతోడ
   ప్రార్ధన చేయుచు మేల్కొని యుండుడి

4. అనేకుల పాపములను భరింప - ఒక్కసారే క్రీస్తు అర్పించుకొనెను
   తనకొరకై వేచియుండు వారికొరకు
   పాపరహితుడు తిరిగి ప్రత్యక్షమౌ

5. ప్రొద్దు గ్రుంకి వచ్చునో ఎప్పుడో అర్థరాత్రియో తెల్లవారు ఝామునో
   నిద్దుర పోవుచునుండగా వచ్చునో
   మేల్కొనియుండుడి మీరు ఎల్లప్పుడు
319 క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడిkreestu yesu vachunu aayattamuga nundudi

Revelation 22:12

పల్లవి:
క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడి (2)

అను పల్లవి:
సూచనలు చూపుచున్నవి (1)- వేచియుండుడి ఆయనకై (2)

1. రక్షణ సంపూర్తిచేయుటకై - అక్షయుడేసు వచ్చును (2)
   అక్షణ పొందిన వారెల్లరు - తక్షణమే ఎత్తబడెదరు (2)

2. పరిశుద్ధులందు మహిమ నొంద - పరమ యేసు వచ్చును
   పరిశుద్ధులు వింతపడునట్లు - అరయునేసు వేగమే

3. మరుగైనవి బయలు పరచ - వరుడు యేసు వచ్చును
   హృదయ ఆలోచనలెల్ల - సదయుడు బయలుపరచును

4. వేయేండ్ల పాలన చేయుటకై - రయముగ యేసు వచ్చును
   సర్వరాజ్యములు అన్నియు - సర్వేశుడేసుని రాజ్యమగున్
320 బూర శబ్దంబు నింగిన్ ధ్వనింపboora shabdambu ningin dhvanimpa

1 Thes 4:17

1. బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట (1)
   ఓర్పుతో మేము వేచియుంటిమి (1) - నిద్రించే వారు నిలతురిలన్ (2)

పల్లవి:
ప్రాణప్రియుడా - ప్రాణప్రియుడా రమ్ము మా యేసు - పాడెదము -
హల్లెలూయ - ఎంతో సంతోషం (1)  ఎగిరి పోయెదం - పాటలతో (2)

2. భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరు
   దూతలు నింగిన్ ఏకమైకూడి - పాటతో బూర ధ్వనింతురు

3. వేకువ చుక్క కాంతినిబోలి - సౌందర్యమైన మాధుర్యుడు
   పరలోకమందు హెచ్చయినవాడు - నాకొరకై శ్రమ సహించెను

4. రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగై పోదు రాయనతో నుండన్
   మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మే - సునచ్చట

5. పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద - దూతలు కాచి నిల్చుదినం
   సంఘ వధువు ధవళ వస్త్రంబు -ధరించి ఘనతనొందే దినం

6. హల్లెలూయా - ఆనందించెదం హల్లెలూయా - ఆర్భటింతుం
   హల్లెలూయా - ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్
321 యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగyesukreestu sheeghramuga sheeghramuga sheeghramuga

Acts 1:11

1. యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగ (1)
   యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును (1)
   దిగివచ్చును - దిగివచ్చును - యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును (1)

2. సంధింప నీవాయత్తమా ఆయత్తమా ఆయత్తమా
   సంధింప నీవాయత్తమా - యేసు రాకడన్

3. లేనియెడల సిద్ధపడు సిద్ధపడు సిద్ధపడు
   లేనియెడల సిద్ధపడు - కృపకాలమున

4. భక్తులెల్లరు సిద్ధపడి సిద్ధపడి సిద్ధపడి
   భక్తులెల్లరు సిద్ధపడి - కాచియుందురు
322 కొంతసమయమే మిగిలినది క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్kontasamayame migilinadi kreestesu prabhuvu tirigi vachun

Hebrews 10:37

పల్లవి:
కొంతసమయమే మిగిలినది (2)- క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్  (2)
లేశమైనను జాగుచేయడు (2)

1. ప్రభు వచ్చువరకు కనిపెట్టుము (2)- నిశ్చయముగా ఆయన వచ్చును (2)
   ప్రభురాక నెవరు ప్రేమింతురో - వారిని ప్రభువు కొనిపోవును (2)

2. ఆయన రాకడ సమీపము - సహవాసములో నిలిచియుండి
   ప్రభు వాక్యమునకు లోబడియు -ఆయన కొరకై కనిపెట్టెదం

3. అడుగంటుచున్నది ఆత్మీయత - అందరి ప్రేమలు చల్లారెగా
   కన్నులు తెరచి మేల్కొనుడి - విడువబడిన మీగతి యేమగున్

4. తమ స్వంత పనులలో విశ్వాసులు - కొందరు నిద్రించు చున్నారుగా
   మేల్కొను వారెత్తబడెదరు - విడువ బడిన వారిగతి యేమగున్

5. నోవహు కాలమున్ స్మరియింతుము - సమస్తమును దిద్దుకొని
   విడుదల దిన మాసన్నమాయె - విమోచనా విశ్రాంతి నిచ్చు
323 జయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చునుjayinchu vaarini konipova prabhu yesu vachunu

1 Thes 4:13-18

పల్లవి:
జయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును (2)
స్వతంత్రించు కొనెదరుగ వారే సమస్తమున్ (2)

1. ఎవరు యెదురుచూతురో సంసిద్దులౌదురు (2)
   ప్రభురాక నెవరాశింతురో కొనిపోవ క్రీస్తువచ్చును (2)

2. యేసు శిష్యులతో పల్కె తిరిగి వత్తునని
   సిద్ధపరతు స్థలమును నేనున్నచోట మీరుండ

3. యెవరేసునితో నడతురో ప్రత్యేకమవుదురు
   మేల్కొనియున్న వారిని ప్రభుక్రీస్తు కొనిపోవును

4. క్షణములోనే మార్పుచెంది ఎత్తబడెదము
   మమ్మును సిద్ధపరచిన శ్రీయేసును సంధింతుము

5. తన సన్నిధిలో మనల నిలుపు నిర్ధోషులనుగా
   బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక యిదే

6. సదా ప్రభుని తోడనుండి స్తుతిచెల్లించెదము
   అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా
324 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రంhallelooyaa hallelooyaa hallelooyaa stotram

Titus 2:13

పల్లవి:
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం -
హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక (2)

1. పాపమునుండి విడిపించి స్వతంత్రుని జేసె (2)
   హోసన్నా హోసన్నా హృదయమర్షించును (2)

2. గొర్రెపిల్ల మహిమతో పృధివి ప్రకాశించగా
   పరలోక దర్శనమును జగమంతా పొందును

3. సకల జనములారా రండి ఆరాధించెదము
   పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవింతుము
325 ఓ సంఘమా శుభవార్త యిదేo sanghamaa shubhavaarta yide

2 Peter 3:14

1. ఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె (1)
   ఆయనను సంధింప త్వరపడుము సమయము గతించుచుండె (1)

పల్లవి:
చూడుమదే చూడుమదే నీ వరుడు వచ్చుచుండె (1)
నిన్ను కొనిపోవుటకు ప్రియుడేసు వచ్చుచుండె (1)

2. లోకమున కేతెంచెను యేసు రక్తమును చిందించె
   కల్వరిలో క్రయమును చెల్లించి నిన్ను తానే కొనెను || చూడు ||

3. ఈ లోకమంతయు మోసమేగా కలుషముతో నిండె
   ఈ లోకము నీకు సత్రమేగా విడచిపోవలెనుగా || చూడు ||

4. జరుగును వెయ్యేండ్ల పాలన ప్రభు వచ్చినప్పుడు
   తరుణమునందు శుద్ధి పొందినిచో కరుణను గాంచలేవు || చూడు ||
326 లేరు లేరు జగతిన్ న్నీ సమముleru leru jagatin nnee samamu

John 14:6

పల్లవి:
లేరు లేరు - జగతిన్ న్నీ సమము -భాసుర తేజ - యేసురాజ

1. ప్రేమతో నేపాడెద - మార్గము నీవే - సత్యం నీవే
   జీవం నీవే - జ్యోతివి నీవే ప్రభువా
   నీదు కృప - రసాంబుధిలోన - నిరతము పానము చేసెద

2. ఈ ధర పరదేశమే - కపట సహోదర - కుట్రల మయము
   స్వార్థం ద్రోహం - పక్షపాత మయం - పక్షపాత మయం
   బాబెలు - వేశ్యాసామ్రాజ్యం - ఈ ధరన్ - న్యాయమే - లేదు ప్రభూ

3. ఈ భువి - సైతాను వశం - అబద్ధ ప్ర - వక్తల మయము
   క్రీస్తు విరోధి - దుర్మార్గమయము
   ఇచ్చోట - నీ సంఘంభునకు - నీవే - ప్రభువా ఆధారము - ఆశ్రయము

4. నీవేగా నా దిక్కు ప్రభూ - దినదినమున నీ వాక్యబలమున
   నేనీ ధరలో - పయనించెద ప్రియుడా
   యేసుప్రభూ - నీ రాకడ ఎపుడో - త్వరపడి - త్వరపడి
   రా ప్రియుడా - రా ప్రియుడా
327 రాజులకు రాజైన యేసు ప్రభు రానై యున్నాడుraajulaku raajaina yesu prabhu raanai yunnaadu

Revelation 2:4

పల్లవి:
రాజులకు రాజైన యేసు ప్రభు రానై యున్నాడు (2)
ఎత్తబడెదవా లేక విడువబడెదవా? (2)

1. తెలిసికొంటివా నీవెంత ఘోరపాపివో -సిలువపై తీర్చెగా నీ పాప ఋణమున్ (2)
   ఒప్పుకొనిన పాపమున్ క్షమించును యేసు
   లేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా (2)

2. బుద్ధిలేని కన్యకవలె మోసపోతివా - చేయలేవు ప్రభుసేవ నీ శక్తితో
   నూనెలేక భ్రమతో బ్రతికెదవా
   లేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా

3. వాక్యముకై జీవితం అప్పగింపక - దాచితివా తలాంతులను లెక్కచేయక
   మొదటి ప్రేమను తిరిగి పొందుమా
   లేని యెడల నష్టపోదువు సిద్ధపడుమా

4. ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో - కృపనుబట్టి నడిపితివి నాదు యాత్రలో
   ముగియువరకు సిద్ధపరచు నీ రాకకై
   హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
328 పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకైparama tandri sutudu praanamichene paapi korakai

Romans 5:5,8

పల్లవి:
పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే - పాపి కొరకై (2)

1. వినుము సోదరా - వింతవార్తను దేవదేవుడే - త్యాగమాయెను (2)
   ఆ - దేవుడే దయతో నన్ను వెదకి వచ్చెగా (2)

2. కల్వరి ప్రభున్ - గాంచు సోదరా వ్రేలాడెను - యేసునాథుడు
   నా - పాపముల్ సిలువలో మోసె నేసు కల్వరిన్

3. దేహమంతయున్ - గాయమొందెనే నా రోగమున్ బాగుచేసెనే
   నా శాపమున్ బాపెను మోసె నెల్ల బాధలన్

4. మహిన్ ప్రేమచే - మహిమ విడచెనే - మాత వలెనే - మమ్ము బ్రోచెనే
   ఇ - మ్మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే

5. యేసు ప్రభుకై - ఏమి చేతును - దీన మనసుతో - సేవజేతును
   నన్ - నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్
329 దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడుdeva gorrepilla siluvalo samasinapudu

John 1:29

1. దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు
   పాప పరిహారార్థ ఊట తెరచెన్ (1)
   పాపి నీవు ఆరక్తమందు నిలచియున్నావా!
   ఇపుడు విడుదలను కోరి పొందెదవా! (1)

పల్లవి:
రక్తమందు రక్తమందు - పాపి నీవు ఆ రక్తమందు నిలిచియున్నావా? (1)
రక్తమందు రక్తమందు - ఇపుడు విడుదలను కోరి పొందెదవా? (1)

2. అపవిత్రుడైనను అక్రమస్తుడైనను
   ఆ పవిత్రరక్తము శుద్ధిచేయును
   ఏలు పాపమైనను - అతిక్రమమైనను
   ఏలికచే మన్నింపబడి యున్నావా? || రక్త ||

3. ప్రియులారా యను ప్రభుని పిల్పు వింటివా?
   మాయవేషమంతయు - వీడియున్నావా?
   పాప బంధము లింక నిన్ను కట్టియున్నవా?
   శాపలోకముపై జయ మొందుచున్నావా? || రక్త ||

4. ఆత్మజీవ శరీరంబుల నర్పించితివా?
   అల్పవిషయములోను సత్యమున్నదా?
   నాడు మరణించిన యేసులేచియున్నాడు
   నేడుయేసున్ చేరిన యభయ మిచ్చును || రక్త ||

5. పంచఖండములను రక్షించుట కొరకు
   పంచగాయ మొందిన ప్రభుని చూడుమా
   ఇంచుకైన త్రోయడు డాసినట్టి వారల
   మించు సత్యములను కోరి వెదకుము || రక్త ||

6. రేపు రేపు యనుట నమ్మిక కానేరదు
   మాపు మరణించిన నెచటి కేగుదువు?
   ప్రాపకుండగు యేసుని చిత్తమును జరిపిన
   శ్రీ పాలుండు నిన్నుత్తముండని మెచ్చును || రక్త ||

7. హల్లెలూయా పాడుము శక్తిగల యేసుకు
   కల్ల కార్యములను విడచివేయుము
   చెల్లచెదరగును కష్టము లచ్చోటను
   కొల్లగా ననుభవింతువు సుఖంబును || రక్త ||
330 మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాకmahaaraajaa yesu neeke mahima kalugu gaaka

Revelation 4:11

పల్లవి:
మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక (2)

అను పల్లవి:
ఘనత ప్రభావము నీదే నిత్యరాజ్యము నీదే (2)

1. కన్యగర్భమున జన్మించ సంకల్పించుకొన్నావే (2)
   పాపమెల్ల నాశము చేయ పాపి రూపము దాల్చితివే (2)

2. సిలువశ్రమలను సహించి మరణము రుచించితివే
   ప్రాణము పెట్టి మము రక్షించి తండ్రిని తృప్తిపరచితివే

3. పాప మరణ నరకమునుండి రక్షింప సంకల్పించి
   త్రియేక దేవునితో జేర్చ చెడుగు తీసి వేసితివే

4. పాపీ దేవునిచే మారు మనస్సును పొందుమా
   ఆత్మానుగ్రహ కాలమున వచ్చి రక్షణ పొందుమా
331 పరలోక రాజ్యము చేరుటకు ప్రభుయేసే మార్గంబుparaloka raajyamu cherutaku prabhuyese maargambu

John 14:6

పల్లవి:
పరలోక రాజ్యము చేరుటకు - ప్రభుయేసే మార్గంబు (2)
మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను (2)

1. సర్వలోకుల పాప - పరిహారార్థము శ్రీ యేసు (2)
   పరిశుద్ధ రక్తము చిందించి - బలియాయెను శ్రీ యేసు (2)

2. పాపపరిహారార్థము - పావన రక్తము నిచ్చిన
   యేసుని చేర ప్రియుడా - సంశయమదియేల

3. నిను ప్రేమించి ప్రాణము - నీకై పెట్టిన యేసుని
   నాకు వలదంచు వెళ్ళుట - న్యాయమా ప్రియుడా

4. మరణించిన యేసు ప్రభువు - మూడవనాడు లేచెను
   మహిమా ప్రభావముతో యేసు - మరణము గెల్చెను

5. తక్షణమే మారు మనస్సు - నొంది యేసును నమ్మిన
   రక్షణ నొందెదవు - నిశ్చయముగనో - ప్రియుడా
332 ప్రేమడంకా జగమున వినబడు నాదము నీమముగా ప్రభు సిలువచేpremadankaa jagamuna vinabadu naadamu neemamugaa prabhu siluvache

Matthew 10:7,8

పల్లవి:
ప్రేమడంకా జగమున - వినబడు నాదము - నీమముగా ప్రభు సిలువచే (2)

1. మృత హృదయులకు జీవము నిడెను (2)
   ఆత్మల నమ్మికను రంజిల్ల జేసెను (2)
   జనుల యందు అద్భుతముల జేసెను - మన సిల్వ మిత్రుడు శ్రీయేసు (2)

2. సిలువ యందున శ్రీ యేసు ప్రాణమిడెన్
   చెలువుగ మన శ్రమలను పార ద్రోలెన్
   తన ప్రేమ పాత్రను మనకిచ్చెను - మన సిల్వ మిత్రుడు శ్రీయేసు

3. కబోధులకు కన్నుల నిచ్చెను - కాళ్ళనిచ్చెను కుంటివారలకు
   కొరతలేని దర్శనము మనకిచ్చెను - కొట్టబడిన మిత్రుడు శ్రీయేసు

4. ఇలను నిద్రమత్తున నుండి సోమరుని - కాలము వ్యర్థపరచెడు సుఖజీవిని
   పుడమిలో యేసు క్రీస్తు గరుణించెను - దొడ్డ విలువ మిత్రుడు శ్రీయేసు

5. ప్రేమతోడ నెల్లరను పిలుచునెపుడు - సోమరులను దేశదిమ్మరులను
   ధరణి జనులను చూచి మరలుటకు - కరుణించెను మిత్రుడు శ్రీయేసు
333 జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత యేసునకుjayamani paadudi sarva janamaa muktidaata yesunaku

Ephesians 1:7

పల్లవి:
జయమని పాడుడి సర్వ జనమా (2) - ముక్తిదాత యేసునకు  (1)
సోదరసోదరి పిల్లలు పెద్దలు (2)  - జయమని పాడుడి యేసునకు - జై

1. సిలువలో చిందిన రక్తమున పాప క్షమాపణ కలిగించె (2) - జై

2. యేసురక్తమున నీతికల్గె అగ్ని శిక్ష తొలగెను - జై

3. రక్తాన ఆశ్చర్య క్రియజేసె పాపపు బంధము ద్రుంచెను - జై

4. రక్త విలువచే ముక్తి గల్గె - ప్రభుని దాసుడనైతిని - జై
334 జగతి కరుదెంచె రక్షణకర్తjagati karudenche rakshanakarta

1 Timothy 1:15

పల్లవి:
జగతి కరుదెంచె - రక్షణకర్త (2)
పాపుల మొర వినెను యేసు -జగతి  కరుదెంచె (1)

1. కృంగినవారిని - నింగికి యెత్తి - పాపము శాపము - ఆపదలన్ని (2)
   బాపెను యేసు (2)

2. పాపపుపాత్రను - పానము జేసి - మరణపు ముల్లును - విరచి జయించి -
   తెరచె మోక్షద్వారమున్

3. లెండి రండి - పాడుచు వేగ - చాటెద మెల్లెడ - కోట్ల ప్రజలకు
   ప్రేమామయు డేసున్
335 ధన్య ధన్య యేసు నామము జయజయ ప్రభు నామముdhanya dhanya yesu naamamu jayajaya prabhu naamamu

Psalms 17:5

పల్లవి:
ధన్య ధన్య యేసు నామము జయజయ ప్రభు నామము (2)

1. యేసు పేరట ముక్తి దొరకున్ (2) ప్రభునామమే శుద్ధి పరచున్ (2)

2. యేసు నామమే ఎంతో ప్రియము - దుఃఖితుల కాశ్రయ నామం

3. రమ్యమైనది యేసుని నామం - మనశ్శాంతి నిచ్చు నామం

4. యేసు నామమే శక్తి కలది - ప్రభు పేరున భూతము తొలగెన్

5. ఇహపరములలో యేసు నామం - మహోన్నతమైన నామం
336 ఈయన మాట వినుడి నేడు ఈయనే నా ప్రియ కుమారుడుeeyana maata vinudi nedu eeyane naa priya kumaarudu

Matthew 17:5

పల్లవి:
ఈయన మాట వినుడి  నేడు (2)- ఈయనే నా ప్రియ కుమారుడు (2)

1. ఈయనే నా ప్రియ కుమారుడు (2)- శాపముతీర్చెడు పాపరహితుడు (2)
   దైవకుమారుండీయనే (1)

2. ఈయనమాట నిరాకరించెడివారు - తప్పించుకొనరు దైవదండనను
   దహించబడుదు రెల్లప్పుడు

3. మహిమగల రాజు మాట నిచ్చెను - ఇహమందాయన మాటను దెల్ప
   మహాసైన్యము లేచెను

4. పరలోక దేవుని దర్శనమునకు - స్థిరులై యుండెదము మరలక మనము
   విధేయులై వికసింతుము

5. దాసుని స్వరూపమును దాల్చెను - మరణము పొందునంత విధేయుడై
   రిక్తుడుగ మరణించెను

6. పరమందునుండు వారిలోగాని - భూమి యందును భూమిక్రిందైన
   పూజనీయుడీయనే

7. సర్వశక్తిగల ప్రభువునకు - స్తోత్రము ఘనత మహిమ ప్రభావము
   నిత్యము కల్గును గాక
337 పాపమునకు జీతము మరణముpaapamunaku jeetamu maranamu

Romans 6:23

1. పాపమునకు జీతము మరణము (3) - ఓ పాపి భయపడవా? -
   చూచునదెల్ల నశించు నిశ్చయము (3) - చూడనిదే నిత్యము

పల్లవి:
యేసురాజు వచ్చును - ఇంక కొంతకాలమే - మోక్షమందు చేరుదుము (2)

2. లోకసుఖము నమ్మకు నమ్మకు - ఆ యిచ్ఛలు మాయమగు -
   నీ జీవముపోవు సమయమున - చిల్లిగవ్వ వెంటరాదు || యేసు ||

3. నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది - లోకమాయలయందున -
   దైవకోపము వచ్చుటకు ముందు - నీ రక్షకుని చేరుము || యేసు ||

4. దైవ ప్రేమ పారుచున్నది - కల్వరిగిరి మీదనుండి -
   నీ పాపమెల్ల అందుపోవును -స్నానంబుచేసినన్ || యేసు ||

5. మహా పాపినైన నన్నును -నా మిత్రుడంగీకరించెన్
   ఓ పాపి నీవు పరుగిడి రా - దేవ దీవెనల పొందుము || యేసు ||

6. కష్టదుఃఖము లెక్కువగుచో - ఇష్టుడేసుని వీడను -
   సిగ్గులేక చేరుదు నాయనచెంత - నెప్పుడు వసింతును || యేసు ||
338 పరుగిడిరా సోదరుడాparugidiraa sodarudaa

Isaiah 55:6

పల్లవి:
పరుగిడిరా సోదరుడా (1)  ప్రభు సన్నిధి నీవు జేరుటకై (2) - పరుగిడరా ..

1. యుగసమాప్తికి ఆగమనమునకు - సూచన లెన్నో చూడుమురా (2)
   వేదన లెన్నో మీదికి వచ్చురా (2) - కలవర మొందక కని పెట్టుమురా (2)

2. ఇండ్లను గట్టుచు పెండ్లికి యిచ్చుచు - నారును నాటుచు త్రాగుచు తినుచు
   జగములో జనులు దిగులు లేనప్పుడు - దొంగవలె యిల దొరయై వచ్చురా

3. ఆ దినమైనను ఆ గడియైనను - పరమున దూతలు ధరణిలో మనుజులు
   ఎవరునుగాని ఎరుగనె ఎరుగరు - మెలకువతో యేసు పిలుపును వినుచు

4. ఆ దినముల శ్రమ అంతము కాగ - సూర్యుని చంద్రుని చీకటి కమ్ము
   ఆకసమందలి శక్తులు కదలును - మహిమతో యేసు యిమ్మహిదిగురా

5. ఆర్భాటముతో ఆశ్చర్యముతో - దేవుని బూరతో మనప్రభు దిగురా
   క్రీస్తు నందున్న మృతులగువారు - ఏకముగ ప్రభు యేసుని జేర

6. ఎటుచూచిన నీకటు కనిపించును - కొండల బండల నుండినను
   కొదమ సింహమై కోపాగ్నియై - ఎదురుగ వచ్చిన కదలగ లేవురా

7. ఎత్తబడుట కాయత్తమా నీవు - తరుణము యిదియే తడవు చేయకురా
   రక్షణలో నిరీక్షణ కలిగి - రక్షకు డేసుని రాజ్యము చేర
339 వినుడి సోదరులారా నా యేసు ప్రభు యిల కేతెంచెన్vinudi sodarulaaraa naa yesu prabhu yila ketenchen

1 Timothy 1:15

పల్లవి:
వినుడి సోదరులారా - నా యేసు ప్రభు - యిల కేతెంచెన్ (2)

1. ఇలకేతెంచెన్ - ముక్తిని దెచ్చెన్ (2)
   పాపుల విడిపించెన్ - విడిపించ నేసు యిలకేతెంచెన్ (2)

2. స్వర్గీయ తండ్రికి - ఏక కుమారుడు
   మనుష్య పుత్రుండాయెన్ - పుత్రుండుగా యిలకేతెంచెన్

3. గ్రుడ్డికి కన్నులు - మూగకి మాటలు
   చెవిటికి చెవుల నిచ్చెన్ - యిచ్చుటకేసు యిలకేతెంచెన్

4. కుష్ఠ రోగుల - శుద్ధులజేసెను
   చచ్చినవారిని లేపెన్ - లేపుటకేసు యిలకేతెంచెన్

5. పాపములో నీవు - పడియుండగా
   పవిత్ర ప్రేమను జూపెన్ - జూపించనేసు యిలకేతెంచెన్

6. పాపుల కొఱకై - సిలువను మోసెన్
   రక్తము చిందించెన్ - చిందించ నేసు యిలకేతెంచెన్

7. యేసు నామమున - విశ్వాసముంచుము
   నిశ్చయముగ రక్షించున్ - రక్షించనేసు యిలకేతెంచెన్

8. మహిమ ఘనత - మాయేసు ప్రభునకే
   మమ్ముల తండ్రితో జేర్చెన్ - జేర్చుటకేసు యిలకేతెంచెన్
340 రండి రండి రయమున యేసునిrandi randi rayamuna yesuni

John 3:16

పల్లవి:
రండి రండి రయమున యేసుని - రక్షకునిగ నంగీకరించుడి (2)

అను పల్లవి:
ప్రీతితో - ప్రభుని చేరుడి ప్రభుల ప్రభువే -
రాజుల రాజువే - రాబోవు నాతడే (2)

1. ప్రయాసపడి భారము మోయువారల (2)- అతి ప్రేమతో నాహ్వానించెను (2)
   భారమంత పార ద్రోలును, విశ్రాంతినిచ్చును -
   వేగమే రారమ్ము ఈ మాట నిక్కము (2)

2. పాపపు జీతము నిత్యనరకము - ఓ పాపి నీకిక దిక్కెవరు
   నిత్యజీవ మియ్యవచ్చెను, నీ కొరకువచ్చెను -
   తన ప్రాణమిచ్చెను, నిన్నురక్షింపను

3. మాయలోకం మోసముజేసెను - మరణసమయము సమీపించెను
   తన్నుచేరువారి నెవ్వరిన్, తృణీకరించడు
   నిను త్రోసివేయడు ఈ మాట నమ్ముము

4. క్రీస్తుయేసు నిను ప్రేమించి - నీ కొరకై తానే వచ్చెన్
   నీదు దోషమంతటికై, రక్తము కార్చెను -
   శిక్షను పొందెను, శ్రీ యేసున్ చేరుము

5. పాపులారా పరుగిడిరండి - పాపుల మిత్రుడేసుని చేరుడి
   శక్తితో నిన్ను రక్షించును సంతోషమిచ్చును -
   సందేహపడకు, సువార్తన్ నమ్ముము

6. నీదు పాపము నంతటిని - నీవు నిక్కముగ నొప్పుకొనిన
   ఆయనే తనరక్తముతో, కడుగు ప్రేమతో -
   కాపాడు నేర్పుతో, కరుణ శక్తితో
341 ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరేiruku maargambulo praveshinchu vaaru kondare

Matthew 7:13

పల్లవి:
ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే -
యేసు రక్తంబున శుద్ధియగువారు కొందరే (2)

1. ఎల్లరు యీ లోక సౌఖ్యమును పొందజూతురు (2)
   కొందరే శ్రమలయందు పాలు గోరెడు వారు (2)

2. సైతానుతో పోరాడి జయము నొంద గోరిన
   సంయుక్తుండవు కావలెను ప్రభు యేసునితో

3. పాడుచేసితివి దుష్టత్వంబులో నీ జీవితము
   నేడైన నీ పాపములనుండి విడుదలొందవా

4. యేసు సేవకై నీ జీవితము నర్పించుము
   యేసుకు నీ ప్రాణము నిచ్చునంత ప్రేమించుము
342 కృపకాలము దాటిపోవుచున్నదిkrupakaalamu daatipovuchunnadi

2 Cor 6:2

పల్లవి:
కృపకాలము దాటిపోవుచున్నది (1)
కృపపొందను పరుగిడి రండు వేవేగ (2)

1. పగలు దాటిపోయెను రాత్రి వచ్చుచున్నది (2)
   దిగులులేక యేసుని సొంతముగా చేరుడి (2)

2. పాప ఆశ వీడుచు, లోకమైత్రి వీడుచు
   పాపమన్నింపొందియే జీవమార్గము చేరు

3. సొంత క్రియలు ముందును వెనుక నంధకారము
   నంతమగ్ని కొలిమియె ఇట్టి మార్గమందున

4. రేపు నీది యగునా మరణవేళ తెలియునా?
   ప్రాపకుడు యేసుడు వచ్చు వేళ తెలియునా?

5. క్రీస్తు విరోధి వచ్చును నరుల మోసగించును
   అంత పాప మధికమై దేవ భక్తి తగ్గును

6. దొంగభక్తి వీడుచు బూతుభాష విడచుచు
   దండనకు తప్పుము శిక్ష రాకముందుగా

7. ఎన్ని మార్లు రక్షణ వార్త వినియు నమ్మక
   యున్నవారు కృపకై లేచి అంగలార్తురు

8. వ్యాధి శ్రమలు మరణమో వేరు ఎట్టి కష్టమో
   బాధించక ముందుగా నేసునొద్ద కరుగుము

9. నిన్ను ప్రభువు త్రోయక నరకమునకు పంపక
   యుండునట్లు దైవకృప పొంద యేసును చేరు

10. ఆది ప్రేమ భ్రష్ఠులై అల్లలాడి జీవించు
   మానవులను చూడక యేసు విభుని చూడుమా
343 ప్రభు యేసుకే జయమని పాడు పాప పరిహారమును బొందిprabhu yesuke jayamani paadu paapa parihaaramunu bondi

John 8:32

పల్లవి:
ప్రభు యేసుకే జయమని పాడు (2) - పాప పరిహారమును బొంది (2)

1. యేసు ప్రభువే మా ప్రియుండు - వాసిగా మనదు రక్షకుడు (2)
   ఆయనే మన హృదయేశ్వరుడు (2)- హృదయ ద్వారము తెరువుము (2)

2. మన పాప శిక్ష భరించి - తన రక్తమును కార్చెను
   చక్కని మార్గము జూపెను - ఇంకను నిలువకు పాపములో

3. పాపముచే బంధింపబడి - పాపములో నిలువగ నేల
   యేసు నిను విడిపించును - రక్షణార్థ సువార్తయిదే
344 కలువరిలో విముక్తి కలిగెనో ప్రియుండాkaluvarilo vimukti kaligeno priyundaa

1 Cor 1:18

పల్లవి : కలువరిలో విముక్తి - కలిగెనో ప్రియుండా (2)

1. పాపమెరుగని యేసు - పాపముగ జేయబడి (2)
   శాపంబు వహించి - శ్రమల సహించెను (2)

2. పాదహస్తముల నుండి - ప్రక్క గాయము నుండి
   ప్రవహించెను పుణ్య - ప్రణయామృత ధార

3. ప్రభు యేసుని రక్తమే - ప్రేమామృత ధార
   ప్రియమారగ త్రాగు - ప్రభు సన్నిధి జేరి

4. ఘన ప్రేమనుజూపి - తన రక్తముచేత
   తానే కడుగును - మన పాపము నంత

5. సర్వజనులకు - సువార్త నందించి
   సరియైనట్టి దారి - జూపింతుము వేగ

6. ప్రాపంచసాగరాన - ప్రభువా నేను దుమికి
   పాపులను రక్షించు - ప్రాదేహత నిమ్ము
345 యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడుyesu prabhuvegaaka vasudhalo rakshakude ledu

Acts 4:12

పల్లవి:
యేసు ప్రభువేగాక (1)- వసుధలో రక్షకుడే లేడు (2)

1. సార్వత్రికమున - సర్వజగమున (2)- వెదకిన గాని - వేసారినను (2)

2. బైబిలు చూపెడు జీవమార్గము - భువిలో నెచ్చట కనుగొన లేము

3. కులములు స్వార్థుల కల్పన గాని - పరలోక మిడిన పద్ధతి గాదు

4. తిరిగెదవేల పొరపాటులలో - త్వరపడి సత్యము జేరుము నేడే

5. యేసుకు నేను ని - వాసము కాగా - సుస్థిరమాయెను నా రక్షణ

6. మానవజీవిత మనియెడు నావ - పాప భరితమై మునిగెడు వేళ

7. స్వయంకృషులు సహస్రములు - చేసినను దోషము పోదు

8. యేసులో గాక మోక్షము లేదు -మరువకు మనసా కరుణామయుని
346 ప్రభు శ్రీ యేసు ప్రభు శ్రీ యేసు జయశాలీprabhu shree yesu prabhu shree yesu jayashaalee

2 Samuel 22:29

పల్లవి:
ప్రభు శ్రీ యేసు - ప్రభు శ్రీ యేసు జయశాలీ
సర్వ సృష్టి కర్తయు తానే - సకల జీవుల పాలకుడు యేసే

1. సకల ప్రజలకు సిలువలో యేసు - స్వర్గనగరికి మార్గము జూపి
   రండి జీవజలము త్రాగుడనుచు - నిండైన ప్రేమతో పిల్చుచున్నాడు

2. జీవన జ్యోతియై వెలుగుచున్నాడు - ప్రేమతో మమ్ముల వెలిగించినాడు
   పాపాంధకారమును బాపినాడు - పావనపరచెను మమ్ములను

3. పాపులు పశ్చాత్తాపము నొంది - పాపుల ప్రాపకుడేసుని జేరి
   పాపవిముక్తిని బొంది మీరు - పావను డేసుని సంకీర్తించుడి
347 పరిపూర్ణంబగు గురువు యెవరు?paripoornambagu guruvu yevaru?

John 1:45

పల్లవి:
పరిపూర్ణంబగు గురువు యెవరు? -ప్రేమతో నిండిన హృదయుండె (2)

1. పాపులు మరి పేరాశ హృదయులు - ప్రాపంచ గురువులు (2)
   నీ సొమ్మును హృదయము నడిగెదరు - దాసుని హెచ్చరిక యిదే (2)

2. ఇహమును విడచిన త్యాగియె గాదా - మహాసత్య సద్గురువు
   కపటము డాగులేని సుబుద్ధి - కరుణామయ హృదయుడు

3. కనుగొంటిమి అటువంటి గురువును - ఘనుడగు యేసు ప్రభువులో
   ప్రేమానంద సమాధానముతో - పూర్తిగ నింపును మనలన్

4. సిలువపై మన పాపము మోసి - తొలగించెను స్వార్థమును
   తనపై మన పాపములనుమోసి - మన కొసగెను విడుదలను
348 ప్రజలారా వేగమే రారే నిజదైవమును కనుగొనరేprajalaaraa vegame raare nijadaivamunu kanugonare

Jeremiah 6:16

పల్లవి:
ప్రజలారా వేగమే రారే - నిజదైవమును కనుగొనరే (2)

అను పల్లవి:
ప్రతివాడు మోక్షము జేర (2)- ప్రభుయేసు వార్తను వినరే (2)

1. పాపాత్ములనబడువారి - భారంబుదీయనుగోరి (2)
   ప్రభు యేసు జూపినదారి (2)- పరమందు సుఖమిడుదారి (2)

2. యేజాతి వారలనైనన్ - యే దేశవాసులనైనన్
   యేమైన భేదములేక - యేసయ్య బ్రోచును వేగ

3. పాపాత్ములే తనసుతులు - ప్రభు యేసునికి స్నేహితులు
   నీ పాపమెల్ల బోయెన్ - నీకింక మోక్షము కలుగున్

4. ప్రయాసపడి భారమును - మోసెడి ఓ ప్రజలారా
   ప్రభు యేసు క్రీస్తే మీకు - ప్రశాంతినిచ్చును రండి

5. యేసయ్యగాకను వేరే - యెవరైన లేరిక రారే
   దోషంబులెల్లను బాపి - ఆశీర్వదించును గాచి
349 ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు?premaamruta dhaarala chindina mana yesuku samamevaru?

1 John 4:8

పల్లవి:
ప్రేమామృత ధారల చిందిన మన - యేసుకు సమమెవరు? (2)
ప్రేమయే తానై నిలచి - ప్రేమోక్తులనే పల్కి (2)
ప్రేమతో ప్రాణముబెట్టి (2)- ప్రేమగరికి చనియె (2)

1. నిశ్చలమైన ప్రేమ జీవికి - ఇలలో తావేది
   ప్రేమద్రోహులేగాని - ప్రియమున జేరరు వాని
   చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా

2. ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించును రారా
   పాపభారముతో రారా - పాదములపై బడరా
   పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు

3. ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెద వేల
   రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా
   ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము
350 రమ్మనుచున్నా డేసు రాజు రండి సర్వ జనులారాrammanuchunnaa desu raaju randi sarva janulaaraa

Matthew 11:28

పల్లవి:
రమ్మనుచున్నా డేసు రాజు - రండి సర్వ జనులారా (2)

1. ఇల్లువాకిలి లేనివారలు (2)- ఇహాన నమ్మదగని వారలు (2)
   తన రాజ్యము మీకిచ్చును యేసు (2)

2. కరువుచే కృశించుచున్న - మరణించుచున్న ప్రజలారా
   ఆకలి దప్పులు తీర్చును మీకు

3. ముండ్ల మకుటము ప్రక్కన గాయము - పాద హస్తములలో గాయములు
   పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము

4. రయమున ప్రియులారా కూడి - రండి పరీక్ష చేయండి
   భరించును మీ భారములన్ని
351 రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడుrandi randi yesuni yoddaku rammanuchunnaadu

Matthew 11:28

పల్లవి:
రండి రండి యేసుని యొద్దకు - రమ్మనుచున్నాడు (2)

అను పల్లవి:
ప్రయాసపడి భారము మోయువారలు (2)
ప్రభునిచెంతకు పరుగిడి వేగమె (2) || రండి ||

1. యేసుని పిలుపు వినియు నింక యోచింపరేల (2)
   అవనిలో అగచాట్ల పాలైన (2)
   అబ్బదు శాంతి ఆత్మకు నిలలో (2)

2. కరువు రణము మరణము చూచి - కలుగదు మారుమనస్సు
   ప్రవచనములు సంపూర్ణము లాయెను
   యూదులు తిరిగి వచ్చుచున్నారు

3. ప్రభు యేసు నీ కొరకై తనదు - ప్రాణము నిచ్చెగదా
   సిలువను రక్తము చిందించియును
   బలియాయెను ఆ ఘనుడు మనకై

4. యేసుని నామమునందే పరమ - నివాసము దొరుకును
   ముక్తిని పాప విమోచనమును - శక్తిమంతుడు యేసే యిచ్చును

5. నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును
   నేనే గాకింకెవ్వరు లేరని - యెంచి చెప్పిన యేసుని యొద్దకు
352 రారండి యేసు పాదముల చేర పాప విముక్తి పొందraarandi yesu paadamula chera paapa vimukti ponda

John 6:37

పల్లవి:
రారండి యేసు పాదముల చేర - పాప విముక్తి పొంద (2)

అను పల్లవి:
వచ్చువారల త్రోయనని - నెచ్చెలు డేసు వాక్కు నిచ్చెను (2) రారండి (1)

1. జాగేల పాపి నీవింకను చావునకు తప్పెదవా? (2)
   సద్గురు చరణము వెదకిన - సద్గుణముగ నిను మార్చును (2)

2. ఆశతో యేసు నిలిచియున్నాడు -పాపీ - నిన్ను రక్షింపను
   జీవితము మోసమగుచున్నది - పాపీ - యేసుని రక్షణ వెదుక

3. నేడే నే మరణించిన నెచట చేరుదునని తలచి
   యేసుని చెంత రమ్ము తరుణము - దొరుకదు గుణపడుము వేగమే

4. ఈ ప్రేమ ఉత్కృష్టమని యెంచి వెంటనే రారమ్ము
   నీదు పాపముల క్షమింపను - నాథు డేసుడు సిల్వ నెక్కెను

5. పాపము శాపము తోడను వచ్చెదనని చెప్పుము
   జీవ దేవాది దేవుడు నీకై - చేయునదెల్ల పరికింపను

6. మాయవేషముల ధరియించి కాలము వ్యర్థపరచి
   తప్పుడు బోధ చేయువారల - వీడి పరమున జేరనిచటకు

7. కడపటి కాలమిదే యగును ఇల మోసపోకుడి
   మిత్రుడేసుడు మీకు ఇచ్చిన - దాని పొందుచు పాడు డల్లెలూయా
353 ఇలలో యేసునకే జయము సర్వజనమా పాడు జయంilalo yesunake jayamu sarvajanamaa paadu jayam

Psalms 72:17

పల్లవి:
ఇలలో యేసునకే జయము (2)- సర్వజనమా పాడు జయం (2)

1. జగముకొరకై ప్రభువు తన ప్రాణమిచ్చెను (2)
   సర్వజనమా వినుడి మీరు (2) - తానే రక్షకుడు (2)

2. పాపులను ప్రేమించువాడు, పాపి కాశ్రయుడు
   పాపులను తన దాపున జేర్చి - పావనపరచును

3. తానే మనకు నిత్య ప్రభువు, రాజులకు రాజు
   అందర మొకటే పాడెదమిలలో- ఆయనకే జయము

4. జయధ్వనులను చేయరండి, విజయుడేసునకే
   సర్వజనమా జయమని పాడు - డాయనే జయశాలి
354 క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగkreeste sarvaadhikaari kreeste alphaa omega

Revelation 1:8

పల్లవి:
క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఒమేగ  -
ఆది యంతము క్రీస్తే - యుగాయుగములు క్రీస్తే (1)

1. మనల రక్షింపనెంచి - సిలువలో ప్రాణమిచ్చె (2)
   తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె (2)

2. నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండె
   నేడే రక్షణ దినము - అంగీకరించు మిపుడే

3. ఆయన ప్రత్యక్షత - ప్రేమించు వారి కొరకు
   ప్రభు తిరిగి వచ్చుచుండె - పరలోక మహిమతోడ

4. ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరశుద్ధ పరచబడెనో
   వారే ప్రభురాక యందు - సంతోషించెదరు మిగుల

5. ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఃఖ బాధల్
   బహుమానములుగ మారి - కాంతి కిరీట మౌను

6. ఆనంద భాష్పములతో - హల్లెలూయ పాటలు
   పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ
355 అంధకారలోకమునకు వెలుగునివ్వ ప్రభువు వచ్చెనుandhakaaralokamunaku velugunivva prabhuvu vachenu

Luke 19:10

పల్లవి:
అంధకారలోకమునకు - వెలుగునివ్వ ప్రభువు వచ్చెను -
స్తుతి మహిమ ప్రభునకే - అంధకారలోకమునకు (1)

1. నిష్కళంక బలి నిర్దోష ప్రభువే - అమూల్యరక్తమేగ ముక్తిమార్గము (2)
   ఏమి యర్పించెదము దానికి బదులుగా -స్తుతి మహిమ ప్రభునకే (2)

2. మృత్యువుపై జయమునొంది మన ప్రభువు
   ప్రార్థించుచుండె తండ్రి కుడిప్రక్కను
   ఏమి యర్పించెదము దానికి బదులుగా - స్తుతి మహిమ ప్రభునకే

3. జీవజ్యోతి రక్షకా నీవే ప్రతిఫలం - నీవే ప్రేమ సత్యానంద ధైర్యము
   సర్వమందు నమ్మదగిన వాడవు నీవే - స్తుతి మహిమ ప్రభునకే
356 మానవ రూపమును ధరించిmaanava roopamunu dharinchi

John 4:42

పల్లవి:
మానవ రూపమును ధరించి - అరుదెంచె యేసు ఇహమునకు (1)
ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే (2)

1. కౄర సిల్వనెక్కి తానే యోర్చె దుఃఖబాధలన్ (2)
   శరీరమంతటినుండి కార్చెనమూల్య రక్తమున్ (2)
   వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్ (1)
   ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే (2)

2. చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్ మనకై -
   యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకైయేసును స్వీకరించుము నీ - స్వంత రక్షకునిగా
   ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే

3. సణుగుచును శాంతిలేక పాపభారము క్రిందను -
   కన్నీటిని విడచుచును దూరముగా నీవుందువా?
   నిన్ను యేసు నేడే పిలిచెన్ ఆయన యొద్దకురా
   ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే
357 సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగునుsaati lenidi yesuni raktamu paapamunu kadugunu

1 John 1:7

పల్లవి:
సాటి లేనిది యేసుని రక్తము -  పాపమును కడుగును -
ప్రియుడా పాపమును కడుగును .. ఆ ..ఆ ..  (2)

1. చూడుము సోదరా దేవుడు ఎంతో -
   ప్రేమించె యీ జగతిన్ - ప్రియుడా ప్రేమించె యీ జగతిన్ (2)
   సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు (2)
   యేసుని పంపెను - ప్రియుడా యేసుని పంపెను (1)

2. లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు -
   ప్రాణము బలిగా నిచ్చె - ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చె
   లోకపాపమెల్ల సిలువలో మోసి
   తొలగించె శాపమున్ - ప్రియుడా తొలగించె శాపమున్

3. విముము సోదరా ప్రభుయేసు క్రీస్తుని -
   పరలోక వార్తను - ప్రియుడా పరలోక వార్తను
   ఉన్నతమైన పరలోక ప్రేమను
   చాటించు చుంటిమి - ప్రియుడా చాటించు చుంటిమి

4. యేసుని నీవు క్షమించుమని వేడు -
   విరిగిన హృదయముతో - ప్రియుడా విరిగిన హృదయముతో
   యేసుని అమూల్య రక్తధారలే
   కడుగును పాపమెల్ల - ప్రియుడా కడుగును పాపమెల్ల

5. పాప భారమును మోసికొని నీవు
   ప్రయాస మొందెదవా? -ప్రియుడా ప్రయాస మొందెదవా?
   పాపమొప్పుకొని యేసు పాదముల
   చెంతకు జేరుము - ప్రియుడా చెంతకు జేరుము

6. గతించుచున్నది స్వల్ప జీవితము
   శీఘ్రముగా రమ్ము - ప్రియుడా శీఘ్రముగా రమ్ము
   కర్త యేసునందు విశ్వాసముంచి
   రక్షణ పొందుము - ప్రియుడా రక్షణ పొందుము

7. కృపయనందము పవిత్ర ప్రేమలో
   భాగము పొందుము - ప్రియుడా భాగము పొందుము
   పాప సాగరమును దాటించ గలడు
   యేసు రక్షకుడే - ప్రియుడా యేసు రక్షకుడే
358 రక్షణ నొసగెడు యేసుని ప్రేమనుrakshana nosagedu yesuni premanu

Isaiah 55:6

పల్లవి:
రక్షణ నొసగెడు యేసుని ప్రేమను - లక్ష్యము చేయుము ఓ ప్రియుడా (2)
అక్షయ రాజ్యము నీయను వచ్చిన -రక్షకున్ బొగడుము స్నేహితుడా (2)

1. లోకపు ప్రేమను యేమని తెల్పెద -నీ కవమానంబే దలచినచో (2)
   ఆకలిచెందని రక్షకున్ ప్రేమ - తాకుడు నొందుము ఓ ప్రియుడా (2)

2. పాపపు ప్రేమలో విడువక నిలచిన - తాపము చెందెద వో నరుడా
   పాపిని గావను ప్రేమ స్వరూపుడు - శాపము నోర్చెను కల్వరిలో

3. చచ్చిన పాపిని వెదకి రక్షింప - చచ్చి బ్రతికిన ఘనుడెవడు
   వచ్చిన పాపిని వద్దని త్రోయని -నిశ్చల ప్రేమామయుడు యేసే

4. నమ్ముము సోదరా నిన్ను రక్షించును - నెమ్మది నొందెదవు నిజము
   నమ్మినచో ప్రభుప్రేమను గానవు - నమ్ముము ప్రభు ప్రేమ నీదినమే

5. ఘన ధనికుల మత సౌందర్యంబులన్ - గానవు నిజ ప్రేమాదరణల్
   ఎన్నిల నున్నను నిలచునే నిత్యము - పెన్నుగ బొందుము ప్రభు ప్రేమన్

6. తండ్రి కుమార శుద్ధాత్మల చిత్తమున్ - దండిగ నెరవేర్చుచు ఘనులు
   ఎందరో వేగిరి పొందను మకుటము
   పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయ
359 పాపులకొరకు ప్రభుయేసు సిలువలో బలియాయెనుpaapulakoraku prabhuyesu siluvalo baliyaayenu

Ephesians 1:7

పల్లవి:
పాపులకొరకు ప్రభుయేసు (2)- సిలువలో బలియాయెను (1)
పాపికి రక్షణనిచ్చెను (1)-పావన రక్తము కార్చి (2)

1. దుష్ట జగమున ఏల తిరిగెదవు ప్రియుడా?
   మునిగెదవేల ఎన్నడు పాపములో? (2)
   దాచిన నీవు నీ పాపమును ప్రియుడా -
   నిత్య జీవమును ఏలాగు పొందెదవు? (2)

2. పాపభారము క్రింద పడియున్న ప్రియుడా
   ప్రభునికడకు రమ్ము విశ్రాంతికై
   నెమ్మది నిచ్చును దీనులకు ప్రియుడా -
   యిదియే యేసుని వాగ్దానము నమ్ము

3. నరక మార్గము విశాలము ప్రియుడా
   జీవమునకు పోవుమార్గము ఇరుకు
   ప్రభుయేసువే నిజమార్గము ప్రియుడా -
   పరము చేరుదువు యేసుని ద్వారానే

4. ఇహలోక నీ బ్రతుకు నీడయే ప్రియుడా
   పాప దుఃఖముతో నిండియున్నది
   దీనుడవై నీవు శుద్ధిని కోరుము ప్రియుడా -
   దొరుకును రక్షణ యీ క్షణమే
360 దేవుడు లోకమును యెంతో ప్రేమించెనుdevudu lokamunu yento preminchenu

John 3:16

పల్లవి:
దేవుడు లోకమును యెంతో ప్రేమించెను (1)
అద్వితీయ కుమారుని అనుగ్రహించెను (1)- దేవుడు లోకమును (1)

1. ఎవరాయనను విశ్వసించెదరో (2) - నశింపక నిత్యజీవము పొందెదరు (1)

2. తన ప్రేమ యెంతో శాశ్వతమైనది - రక్తము కార్చి ప్రాణమునిచ్చె

3. ప్రభువు పిలిచెను పాపుల నెల్ల - వచ్చినవారే కడుగబడెదరు

4. తప్పినవారిని వెదకుచున్నాడు - వచ్చినవారే ముక్తి పొందెదరు

5. పాపముచేత చచ్చిన మిమ్ము - ప్రభుకోరుచుండె జీవమునివ్వ

6. నలిగిన మనస్సు కలిగినవారే - గొప్ప రక్షణను పొందెదరిలలో

7. క్రొత్త జన్మమును ఎత్తనివారు - ప్రవేశింపలేరు ప్రభురాజ్యమందు
361 మాయ లోకము మోసపోకుము యేసునందే రక్షణ దొరుకును నీకుmaaya lokamu mosapokumu yesunande rakshana dorukunu neeku

Ecclesiastes 1:2

పల్లవి:
మాయ లోకము - మోసపోకుము  - యేసునందే రక్షణ దొరుకును నీకు (2)

1. బంధుమిత్రులు - భార్య బిడ్డలు (2) -ధనము ఘనము అందచందము (2)
   అవి అన్నియును - నీటిబుడగలె (2) - సమాధితోనే - సమాప్తమౌను (2)

2. పడగ విప్పిన పామువలె నీ - పాపము నిన్ను వెంబడించును
   పాప ఫలితము మరణమేగదా - దాని అంతము నిత్యనరకము

3. నిన్ను రక్షింపనెంచి ప్రభువు - పరమును విడచి ధరకు వచ్చెను
   నీకు బదులుగా శ్రమల నోర్చెను -సిలువలోనే బలియాయె నేసు

4. ఇప్పుడైనను ఒప్పుకొనుమిక - నీ పాపజీవితము నంతయు
   నిన్ను క్షమించును కృపతో ప్రభువు - ఇదియే నీ రక్షణ దినముగా

5. దేహమంత ప్రభు గాయముల్ పొందె - పరిశుద్ధ రక్తమును కార్చెను
   నిత్యజీవము నీకు నీయను - మృతిని గెల్చి తిరిగి లేచెను
362 న్యాయపీఠము నీ ముందు వున్నదిnyaayapeethamu nee mundu vunnadi

2 Cor 5:10

పల్లవి:
న్యాయపీఠము నీ ముందు  ఉన్నది -ధ్యానించిచూడు కూర్చున్న దెవరో (2)

1. నీవు నశించుట కోరడు ప్రభువు (2)
   ఓపికతో ఆయనే వేచి యున్నాడు (2)
   పశ్చాత్తాప పడుమిప్పుడైన (2)
   నిశ్చయ మెరుగు నరకము తప్పదు (2)

2. పరీక్షించుకొనుము నీమరణమెప్పుడో
   రక్తము ద్వారా ముక్తి పొందితివా
   కఠినత్వముతో తృణీకరించిన
   న్యాయ త్రాసు ఉన్నది రారాజు చేతిలో

3. దాగి యున్న పాపము ప్రభుయేసు చూచెను
   అంధకార పాపము తన కంటపడెను
   తన దృష్టినుండి తప్పించుకొందువా
   తీర్పు కొడవలి తనచేతనుండగ

4. అందరికొరకై గ్రంథముల్ తెరువగ
   వారి విషయమై వ్రాసిన రీతిన్
   దేవ గొఱ్ఱెపిల్ల న్యాయము తీర్చును
   తన చేతనున్నది తీర్పుకై చేట

5. క్రీస్తు యేసునందు శిక్షా విధిలేదు
   దీవెనల నొందుచు ఘనత నొందెదరు
   ఎల్లప్పుడాయనతోనే యుండెదరు
   ప్రభువే నిచ్చును జీవకిరీటము
363 మహావైద్యుండు వచ్చెను బ్రజాళి బ్రోచు యేసుmahaavaidyundu vachenu brajaali brochu yesu

Exodus 15:26

1. మహావైద్యుండు వచ్చెను - బ్రజాళి బ్రోచు యేసు (1)
   సహాయ మియ్యవచ్చెను - సంధింపరండి యేసున్ (1)

పల్లవి:
మాధుర్యంపు నామము - మోదమిచ్చుగానము (1)
వేదవాక్య సారము - యేసు దివ్యయేసు (1)

2. మీపాపమెల్ల బోయెను - మేలొందు డేసు పేరన్
   గృపా సంపూర్ణ మొందుడి - యపార శాంతుడేసు ||మాధు||

3. వినుండి గొఱ్ఱెపిల్లను - విశ్వాసముంచి యేసున్
   ఘనంబుగన్ స్తుతించుడి - మనంబుప్పొంగ యేసున్ ||మాధు||

4. ఆ రమ్యమైన నామము - అణంచు నెల్ల భీతిన్
   శరణ్యులైనవారి నా - దరించు నెంత ప్రీతిన్ ||మాధు||

5. ఓ యన్నలారా - పాడుడీ - యౌదార్యతన్ సర్వేశున్
   ఓ యమ్మలారా మ్రొక్కుడీ - ప్రియాతి ప్రియుడేసు ||మాధు||

6. ఓ పిల్లలారా కొల్వుడీ - యౌన్నత్యరాజు నేసున్
   దపించువారి దాతయౌ - దయామయున్ శ్రీ యేసు ||మాధు||

7. శ్రీయేసుకై యర్పించుడీ - మీ యావజ్జీవమును
   ప్రియంపు దాసులౌచును - రయంబు కొల్వుడేసున్ ||మాధు||
364 శుభవార్త వింటిమి యేసు రక్షించునుshubhavaarta vintimi yesu rakshinchunu

2 Kings 7:9

1. శుభవార్త వింటిమి - యేసు రక్షించును
   ఎల్లవారు విననీ - యేసు రక్షించును
   ప్రభుమాట వింటిరె - అది పర్వతంబులన్
   దాటి ప్రకటించుడి - యేసు రక్షించును

2. ఓడనెక్కి పోవుడి - యేసు రక్షించును
   దైవ భ్రష్టు లెల్లరిన్ - యేసు రక్షించును
   ద్వీపవాసులందరు - వినునట్లు చాటుడి
   దివ్య వర్తమానము - యేసు రక్షించును

3. ఇహ బాధనుండియు - యేసు రక్షించును
   పరమ భాగ్యమిచ్చును - యేసు రక్షించును
   దీన శ్రేష్టు లెల్లరు - భూనివాసులందరు
   యీ సువార్త వినుడి - యేసు రక్షించును
365 ఇమ్మానుయేలుని రక్తము నిండిన ఊటయేimmaanuyeluni raktamu nindina ootaye

Hebrews 9:22

1. ఇమ్మానుయేలుని రక్తము - నిండిన ఊటయే
   ఇమ్ముగ దోషములెల్ల - నివృత్తి చేయును

పల్లవి:
హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్

2. పాపాత్ముడైన దొంగయు - ఆ ఊటలోమున్గి
   మన్నింపు, మోక్షానందము - నొందియానందించెన్ || హల్లె ||

3. ఆలాగే నేను యేసుచే - విముక్తి పొందుదు
   విలువైన మన్నింపునొంది - పాడుదును సదా || హల్లె ||

4. గాయంపు రక్తమును నే - విశ్వసించి చూచి
   ప్రియంపు యేసు ప్రేమను - ప్రకటింతు నెల్లడన్ || హల్లె ||

5. మోక్షంబునందు రక్షకున్ - చూచి ప్రహర్షింతున్
   రక్షించునట్టి ప్రేమను - రక్తితో పాడుదున్ || హల్లె ||
366 డాగునేది మాపును వేగయేసు రక్తధారేdaagunedi maapunu vegayesu raktadhaare

1 John 1:7

1. డాగునేది మాపును - వేగయేసు రక్తధారే (1)
   రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారే (1)

పల్లవి:
హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము (1)
నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే (1)

2. పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారే
   శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే ||హా||

3. ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారే
   నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే ||హా||

4. నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారే
   నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే ||హా||
367 మన ప్రభువైన యేసునందుmana prabhuvaina yesunandu

Ephesians 1:3

పల్లవి:
మన ప్రభువైన యేసునందు - ఎన్నో దీవెనలు (2)

1. ముందుగా నిర్ణయించబడి - తనచే ఏర్పరచబడిన (2)
   తనయులుగాను స్వీకరించబడి - ధన్యులయ్యెదరు వారే

2. అపరాధములు క్షమించబడి - ప్రభు రక్తముచే కొనబడి
   కృపద్వారా రక్షింపబడెదరు - ధన్యులయ్యెదరు వారే

3. మనో నేత్రములు వెలిగింపబడి - ఘనముగా ప్రభుచే పిలువబడి
   తన భక్తులతో స్వాస్థ్యము పొంది - ధన్యులయ్యెదరు వారే

4. నిర్మలము - మరి అక్షయము - విరివిగ వాడ బారనిది
   పరలోకములో స్వాస్థ్యము కలిగి - ధన్యులయ్యెదరు వారే

5. కన్నులకు కనిపించనివి - వినిపించనివి చెవులకును
   మనో గోచరము కానివి పొంది - ధన్యులయ్యెదరు వారే
368 నీ జీవితము క్షణభంగురమేnee jeevitamu kshanabhangurame

James 4:14

పల్లవి:
నీ జీవితము క్షణభంగురమే (2)- ఒక గడియలోనే గతియించెదవు (2)

1. నీటి బుడగవలె నీ జీవితము (2)- సంపూర్ణముగా నశియించు (2)
   సాగిపోయెడు నీడవలెనే (2) - నీదు బ్రతుకు వున్నదిగా (2)

2. ధన సంపదలు గౌరవములు - ధరలోనున్న సర్వమును
   వ్యర్థము వీటి వైభవమంతయు - విడిచెదవు ఒక దినమందే నీవు

3. మోసపోతివిగా నీవు యిలలో - నష్టపడితివి పాపములో
   నేడే రమ్ము యేసుని కడకు
   నీకై రక్తము చిందించెనుగా - నిన్ను పిలుచుచున్నాడు
369 ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదేento goppa nityamaina poorna rakshana yide

Hebrews 2:3

పల్లవి:
ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే (2)
నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ (2)

1. మన ప్రభువే రక్షణ శృంగమాయె (2)- శత్రువు నోడించ శక్తి మంతుడు (2)
   మనకు జయము నిచ్చును (2)

2. ప్రభువే మన రక్షణ శైలమాయె - దృఢపరచె నాయనే మనల
   పాదముల స్థిరపరచెను

3. ప్రభువే మన రక్షణ దుర్గమాయె - తనయందే మనకు పూర్ణ భద్రత
   ప్రియమార దయచేయును

4. ప్రభువే మన రక్షణ కేడెమాయె - దుష్టుని బారినుండి తప్పించి
   పదిలముగా రక్షించును

5. ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము - జీవము ద్వారా రక్షణ కనుపరచ
   ఆశతోడ నుందుము

6. రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది - రక్షణ ఊటచే సంతృప్తి కలిగె
   పరిపూర్ణత నీవేగా

7. రక్షణ వస్త్రము ధరింప జేసెనుగా - నీతి వస్త్రములను ధరింపజేసి
   ఆనందింప జేసెను
370 యేసు లేనిచో పాపికాశ్రయమే లేదుyesu lenicho paapikaashrayame ledu

Ephesians 2:12,13

పల్లవి:
యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు (2)

1. లోకము నాలుగు దినముల నటనే - నికరము గాదెవరికిని (2)
   దారిని తప్పి తిరిగెదవేల (2)
   ఎరిగితివా నీ గురిని - కడకీలోకము వదలెదవు (2)

2. కూర్చుకొంటివి పాపము నిలలో కాలము వ్యర్థంబాయె
   ప్రభువును నీవు మరచిపోతివి
   పాడైపోయె నీ రూపం - కడకీలోకము వదలెదవు

3. ప్రభుయేసు సిలువలో వ్రేలాడె - పాపిని రక్షించుటకు
   పాట్లుపడె తనరక్తము కార్చె
   పాపపు ముల్లును విరచె - కడకీలోకము వదలెదవు

4. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను - ప్రియుడా త్వరపడి రమ్ము
   ఆయన యందు నమ్మికయుంచిన
   ఆయనే నీ శరణగును - కడకీలోకము వదలెదవు
371 మారు మనస్సు పొందుముmaaru manassu pondumu

Matthew 4:17

పల్లవి:
మారు మనస్సు పొందుము (2)- ప్రభుని రాజ్యము సమీపించెను (2)

1. యెహోవా దేవుని రాజ్యము - మహోన్నతమై వ్యాపించెను (2)
   తన రాజ్యప్రభావమున్ తన ప్రజలు (2)
   తన శౌర్యమునెంతో చాటెదరు (2)

2. ఆయన రాజ్యము శాశ్వతము - ఆత్మలో దీనులగువారు
   ఆ రాజ్య నివాసులగుదురు - ఆయనకే మా వందన స్తుతులు

3. నూతన జన్మానుభవము ద్వారా చూతురు ఆ రాజ్యంబును
   ఆత్మ జన్మమును గలవారై - ఆ రాజ్యములోన చేరెదరు

4. రక్తమాంసంబులు దానిని - స్వతంత్రించు కొనజాలవు
   స్వాస్థ్యం పాపులకసలే లేదు - దుష్టులకందులో భాగములేదు

5. అంధకార రాజ్యమునుండి - పొందుగా తన రాజ్యంబునకు
   ప్రభుదెచ్చె ప్రియమారగ మనల - ప్రశంస స్తుతి చెల్లించెదము
372 వ్యర్థం, వ్యర్థం, సర్వము వ్యర్థంvyartham, vyartham, sarvamu vyartham

Ecclesiastes 1:2

పల్లవి:
వ్యర్థం, వ్యర్థం, సర్వము వ్యర్థం - నశించు లోకం నాశము తధ్యం (2)

1. దుష్టలోకములో సర్వము చెడెను (2)
   దీని యందంవాడి పోవుచున్నది (2) - పోవుచున్నది (1)

2. చూడన్ మనసేలాగు నాశనమైపోయెన్
   నిండియున్నదిపుడే పాపపుపాత్ర - పాపపుపాత్ర

3. నలుదిశల చూడుమా పాపము కలదు
   కలహ కలవరముతో నిండియున్నది - నిండియున్నది

4. లోకంలో నన్ని గతించి పోవునవి
   లోకం యెంతో అయోగ్యంబైయున్నది - అయోగ్యంబదే

5. యిద్ధరలో మనకేమియు లేదు
   స్వార్థము, శతృత్వము, ఈర్ష్యమయము - ఈర్ష్యమయము

6. ఒకనాడీ మహిని ప్రభువు దహించును
   సకలంబును నాశనంబుచేయును - నాశనముచేయును

7. ఒక రాజ్యము వచ్చునందు దీవెన కలదు
   సకల శాంతి సంతోషమందు కలదు - అందునగలదు

8. ఆ రాజ్యంలో నీవు ప్రవేశించుటకు
   మారు మనస్సునొంది యేసుని నమ్ము - యేసుని నమ్ము
373 క్రీస్తు ప్రభుకే సకల మహిమkreestu prabhuke sakala mahima

Daniel 2:44

పల్లవి:
క్రీస్తు ప్రభుకే సకల మహిమ (2)- శాశ్వతంబైనది తన రాజ్యం (2)

1. మర్మంబిదియే కనుమా ప్రియుడా (2)- ఉర్విని మానవ సాయము లేక (2)
   పర్వతంబు నుండి - మల్చబడె నొకరాయి (2)

2. మేలిమి వెండి రాజ్యాలను - యిత్తడి యినుప రాజ్యాదులను
   ఈ రాయియే నలుగ - గొట్టును చెత్తవలెనే

3. ప్రియుడా వింతై న యీ రాయి - పెరిగి భూలో కమంతాయె
   ప్రభు క్రీస్తుని వింత - సార్వత్రిక సంఘమిదే

4. ఆ రాజ్యమును చూచు భాగ్యం - ఆ రాజ్యములో చేరెడి భాగ్యం
   అనుభవింపనగును - పరిశుద్ధ ప్రజలకే

5. ఈ సుహృదయ శుద్ధి నీకు - క్రీస్తు ప్రభువే కలుగ చేయున్
   యేసాటియులేని - ఈ శుద్ధి నొందుము

6. మనకిచ్చిన ఆ - హ్వానంబునకు - తన రాజ్యని - త్యమహిమలకు
   తగినయట్టి రీతిన్ - నడుచుకోవలె ప్రియుడా
374 ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యాevaro telusaa yesayyaa chebutaa nedu vinavayyaa

Luke 19:3

పల్లవి:
ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా (1)
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా (2)

1. దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా (2)
   మరణించాడు మరిలేచాడు - నీ నా పాప విమోచనకే (2)

2. ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా
   రూపు రేఖలు కోల్పోయాడు - నీ నా పాప విమోచనకే

3. పాపుల రక్షకు డేసయ్యా - కార్చెను రక్తము పాపులకై
   తన దరిజేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో

4. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగ వస్తాడయ్యా
   నమ్మిన వారిని చేర్చును పరమున - నమ్మని వారికి నరకమేగా

5. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై
   అతి వినయముగా బ్రతిమాలుచున్నాడు - నేడే నమ్ముము యేసుప్రభున్
375 శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలోshramalanu ponde shree yesudu nee korakai siluvalo

Romans 5:10

పల్లవి:
శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో

1. సదయుడు ప్రేమించె - శత్రువైన నిన్ను
   దూరస్థుడవైన నీ యెడల - దయచూపించె
   వహించె నీ శాపం భరించె నీ పాపం
   నీ మనస్సు మార్చుకొనిన - సంతసించును ప్రభుయేసు

2. దొంగవై నీవున్నా - దురితంబులెన్నున్నా
   దోషంబుల క్షమియించు - తన సిలువ రక్తముతో
   తెరచెనుగా నీ కొరకు - పరలోక ద్వారము
   నెమ్మది నిచ్చును నీకు - యేసుని విశ్వసించిన

3. ఎవరేసు రక్తములో - కడుగబడెదరో
   వారే చేరెదరు - తన సంఘమునందు
   అంగీకరించుము - యేసును నీవు
   కలిగించు నీకు తృప్తిని - నేడే నీ వాయనను వేడు

4. సిలువపై యేసు - సర్వ మర్పించె
   నీ రక్షణ కొరకు - క్రయము చెల్లించె
   యేసునకు నీవు - ఏమియ్యగలవు?
   తెరువు నీ హృదయ ద్వారమును - నేడే ప్రవేశించును తాను
376 యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగము నందుyesu naamamune paapiki rakshana sarvajagamu nandu

Acts 4:12

పల్లవి:
యేసు నామమునే పాపికి రక్షణ - సర్వజగము నందు (2)

అను పల్లవి:
ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు (2)

1. ఈ జగతికే తెంచి రక్తము కార్చి - బలిగా నర్పించుకొనెన్ (2)
   మనల రక్షింప సంతోషమివ్వ - సిలువలో బలి ఆయెన్ (2)

2. పాపము నుండి శాపము నుండి - మనలను విడిపింప
   దేవాది దేవుడు మానవ రూపము - దాల్చియిలకు వచ్చెన్

3. పాపుల కొరకై రక్తము కార్చి - సిలువలో మరణించెన్
   మరణము జయించి సమాధిని గెలచి - విజయుండాయె యేసే

4. పాపము ఉండదు - భయము ఉండదు యేసయ్య రాజ్యములో
   ఈ ప్రభువే మనతో నుండునుగా - పరలోక రాజ్యములో
377 యేసుని వెంట నేను వెంబడించుచున్నానుyesuni venta nenu vembadinchuchunnaanu

Matthew 16:24

పల్లవి:
యేసుని వెంట నేను - వెంబడించుచున్నాను
నా సిలువను మోయుచు నేను - వెంబడించుచున్నాను

అను పల్లవి:
తన హృదయానుసారునిగా - ఉండుటకు సిద్ధపడుచున్నాను || యేసుని ||

1. ఎంతో అద్భుతమైనది - నా ప్రభుని బలియాగం (2)
   సాదృశ్యముగ నా కొరకై (1) - ప్రాణమర్పించెను (2)
   నా ప్రభుని తలచుచు నేను - వెంబడించుచున్నాను (2) ||తన ||

2. ఈ లోక సౌందర్యము - నన్ను మోసగించదు
   సాతాను యుక్తులన్నియు - నా మీద పనిచేయవు
   యేసుని స్వరము వినుచు - వెంబడించుచున్నాను ||తన ||

3. ఎంతో అద్భుతమైనది - నా ప్రభు నన్ను శిక్షించుట
   ప్రభు నన్ను సరిచేయుట - తన ప్రేమయై యున్నది
   యేసుని స్వరము వినుచు - వెంబడించుచున్నాను ||తన ||

4. ఇబ్బందులెన్నో కలిగిన నా దృష్టి ప్రభు మీదనే
   శ్రమలే మాత్రము కదల్చవు - అద్దరి అగుపడుచున్నది
   శీఘ్రముగానే చేరుటకు - వెంబడించుచున్నాను ||తన ||

5. తన చిత్తములో నన్నుంచి - నా ప్రభు సంతోషించును
   మంచి మాటలన్నియు నేర్పి - నను సిద్ధపరచుచున్నాడు
   మహిమను పొందుటకు నేను - వెంబడించుచున్నాను ||తన ||
378 నీవెన్నాళ్ళు రెండు తలంపులతోneevennaallu rendu talampulato

1 Kings 18:21

పల్లవి:
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో - కుంటి కుంటి నడిచెద వీవు (1)
యెహోవాయే నీ దేవుడా? లేకవేరే దేవతలున్నారా? (2)

1. మనం తీర్మానించెదమిపుడే - మననోట వంచన లేకుండా (2)
   మరుగైనా పాపములన్నిటిన్ - హృదయమునుండి తొలగించెదం (2)

2. మారు మనస్సు పొందెద మిపుడే - జీవిత మోసముల నుండి
   పరిశుద్ధులమై నిర్దోషులుగా - ప్రభుదినమందు కనపడెదం

3. అపవాదికి చోటివ్వక - బహు జాగ్రతతో నుండెదము
   మనుష్యులను సంతోషపెట్టక - దైవ చిత్తములో నిలిచెదము

4. నేను నా యింటి వారలము - యెహోవానే సేవించెదము
   నీవెవరిని సేవించెదవో - ఈ దినమే తీర్మానించుకో

5. పడిపోయిన నీ బలిపీఠమున్ - సరిచేయుటకు నీవు సిద్ధమా
   ఇశ్రాయేలు దేవుని వేడిన - అగ్ని మూలముగ బదులిచ్చును

6. ఇంత వరకు నిన్ను నడిపిన - ఎబినేజరైన నీ దేవుని
   నీవు మరచి జీవించినచో - నీకు నెమ్మదియే ఉండదు

7. ద్వంద్వ జీవిత మార్గములు - ఎరుగుదువా అస్థిరములని
   పూర్ణమనస్సుతో ప్రభున్ వెదకిన - పూర్ణ మహిమతో నిండెదవు
379 పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునాpainunna aakaashamandunaa krindunna bhoolokamandunaa

Acts 4:12

పల్లవి:
పైనున్న ఆకాశమందునా - క్రిందున్న భూలోకమందునా -(2)
లేదు రక్షణ - యే నామమున - లేదు పాప విమోచన ఆ.. ఆ.. (2)

1. అన్ని నామములకు - పైని కలదు (2) - ఉన్నతంబగు - యేసుని నామం (2)
   యేసు నామములో - శక్తి గలదు -
   దోషులకు - శాశ్వత ముక్తి గలదు (2)

2. యేసు నామములో - నిత్యజీవం - శాశ్వతానంద - నిత్యశాంతి
   యేసు నామములో - పాప శుద్ధి - విశ్వసించినచో - సమృద్ధి

3. అలసి సొలసిన - వారికి విశ్రం - జీవములేని వారికి జీవం
   నాశనమునకు జోగేడి వారికి - యేసు నామమే - రక్షణ మార్గం

4. యేసు నామము - స్మరియించగానే - మనసు మారి - నూతన మగును
   భేదమేమియు - లేదెవ్వరికిని - నాథుని స్మరియించి - తరింప
380 యేసు ప్రభువే లోకరక్షకుడుyesu prabhuve lokarakshakudu

John 4:42

పల్లవి:
యేసు ప్రభువే లోకరక్షకుడు
వేరెవ్వరు లేరు - పాపులైన మనల రక్షింప (2)

1. లోక సృష్టికర్త పాపము బాప - నరునిగ భువికి - అరుదెంచె ఆ.. (2)
   పాపిని రక్షింప - సిలువలో మరణించే (2)- ప్రేమతో నిన్ను విడిపింప (1)
   వేరెవ్వరు లేరు - జీవాధిపతి - యేసుడే (2)

2. గ్రుడ్డికి చూపునిచ్చి - కుంటివారిన్ - చక్కగ నడువ జేసెను
   మూగ వారిని మాట్లాడగ జేసెను - చెవిటి వారి చెవుల వినజేసెన్
   వేరెవ్వరు కాదు - సర్వాధికారి - యేసుడే

3. కుష్టరోగుల నెల్ల - శుద్ధుల జేసి -ఇష్టపడి స్వస్థత నిచ్చెన్
   చనిపోయిన వారిని - సజీవులుగ జేసెన్ -కష్టము లేకుండా జేసెన్
   వేరెవ్వరు కాదు - జీవాధిపతి - యేసుడే (2)

4. నేనే మార్గం, సత్యం, జీవం అనెను - వేరొక మార్గం లేదనెన్ ఆ
   సాతాను తలను చితుక ద్రొక్కెను - మరణించి తిరిగి లేచెన్
   నిను పరమున - చేర్చ ప్రభు యేసే నీకు మార్గము
   వేరెవ్వరు లేరు - ప్రభు యేసే నీకు మార్గము
381 యేసుని చెంతకు ఆశతో రమ్మిలyesuni chentaku aashato rammila

2 Cor 6:2

పల్లవి:
యేసుని చెంతకు ఆశతో రమ్మిల - దోషముల్ బాపునయా (2)

అను పల్లవి:
ఇదియే మిక్కిలి అనుకూల సమయము - ఇదే రక్షణ దినము
ఇప్పుడే యేసుని యెదలో నమ్మిన - ఇదే రక్షణ దినము (2)

1. పాపుల కొరకు మన ప్రభుయేసు ప్రాణము పెట్టెనయా (2)
   మృతుడై లేచెను పరమున కేగెను ధర కేతెంచునయా (2)
   స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా (2)

2. జపములు తపములు ఉపవాసములు - పాపముల్ బాపవయా
   దానధర్మములు తీర్దయాత్రలు పాపముల్ బాపవయ్యా
   యేసుని రక్తము పాపము శాపము ఇపుడే బాపునయా

3. యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయా
   ఈ శుభవార్త ఈ జగమంత ఇపుడే చాటెదము
   తరుణము దాటిన మరి ఇకరాదు - మరణము తప్పదయా
382 ఇదియే అనుకూల సమయము నీకుidiye anukoola samayamu neeku

2 Cor 6:2

పల్లవి:
ఇదియే అనుకూల సమయము నీకు - ఘన రక్షణ దినము (2)

అను పల్లవి:
ఆటంకము లేక యేసు నంగీకరించి - చాటెద మెల్లడలన్ (2)

1. ఆయన రాకడ బహు సమీపమని - వాక్యము వ్రాసియున్నది (2)
   వంచకుల దుష్టకార్యములప్పుడు - బహిరంగ పరచబడున్ (2)

2. మత్తయి యిరువది నాలుగవ అధ్యాయము మార్కు పదమూడును
   లూకా యిరువదియొకట వధ్యాయము - చూడ ముగింపు తెలియున్

3. యుద్ధములు భువి జరుగుచునున్నవి - దైవచిత్తము జరుగున్
   మరణముల సంఖ్య హెచ్చుచున్నది - నగరులు వణికెడును

4. దేవుడు రాగా నాకము మారును - భూమి దహనమగును
   నీళ్ళు సముద్రము లింకిపోవు - యేసు తిరిగి రాగన్

5. విశ్వాసులందరు నిల్చుట నిజము - దేవుడేసుని వాక్యము
   వెలలేని రక్షణ కల్గు సంపాద్యము - సంశయులకు లేదు

6. కాలము వ్యర్థము చేయకు ధరలో - కర్మముపట్టుకొనకు
   పాపమున్ ప్రేమతో పట్టియుంచకు - శాపము కౌగిలింపకు
383 ఇదియే సమయంబు రండి యేసుని జేరండిidiye samayambu randi yesuni jerandi

2 Cor 6:2

పల్లవి:
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి (1)
ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి (2)

1. పాపులనందరిని తన దాపున జేర్చుటకై -
   ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా (2)
   మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా (2)

2. రాజులకు రాజైన యేసు రానైయున్నాడు
   గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
   తరుణముండగానే మీరు తయ్యారవ్వండి

3. బుద్ధిలేని కన్యకలవలె మొద్దులు గానుంటే -
   సిద్దెలలోని నూనెపోసి సిద్ధపడకపోతే
   తలుపును తట్టినను మీకు తెరువడు సుమ్మండి

4. వెలుపట నుంటేనూ మీరు వేదన నొందెదరు -
   ప్రభువా ప్రభువనుచు యెలుగెత్తి పిలిచినను
   మిమ్మును ఎరుగనూ మీ రెవరో పొమ్మనును

5. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మది నిచ్చునుగా -
   నమ్మనివారికి నిత్య నరకము తప్పదుగా
   నిర్లక్ష్యము చేయకును రండి రక్షణ పొందండి

6. సందియపడకండి మీరు సాకులు చెప్పకను -
   సత్యవాక్యమును మీరు సరిగా చూడండి
   మరణ దినమును మన మెరుగము సుమ్మండి

7. జాలము చేయకను మీరు హేళనచేయకను -
   కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను
   తరుణముండగానే మీరు త్వరపడి రారండి
384 మాయలోక మాయలోmaayaloka maayalo

Ecclesiastes 12:7

1. మాయలోక మాయలో నేల మున్గి తిరిగెదవు (1)
   కాయము నిన్ను మోసముచేయు కాలమాయెను (1)

పల్లవి:
మరణము వచ్చున్ మరణము వచ్చున్ (1)
లోకము ముగియున్ (1) - మానవులపై కృపకాలము  - దాటిపోవును (1)

2. పాతాళము నిన్ను మ్రింగ కాచి నిల్చెను
   ప్రాణనాథుడేసు నిన్నురక్షింప వచ్చెను ||మరణ||

3. వేదవాక్యము మారక పూర్తియగును
   దేవకోపము మానవులకై పోయబడును ||మరణ|

4. లోకము దిగుల్ కలహములతో తత్తరిల్లును
   మేఘమందు యేసు రాజు కానిపించును ||మరణ||

5. యేసు నేనే మార్గం సత్యం జీవము నేనే
   మోసపోకు డెందు మార్గం వేరే లేదనెన్ ||మరణ||

6. పాపికై మరణించిన యేసు కాచి నిల్చెను
   పాపి! నిన్ను పిల్చుచున్నాడు చెంత జేరుమా ||మరణ|
385 వినతి వినతి వినతి త్రియేకునికిvinati vinati vinati triyekuniki

Matthew 3:7

పల్లవి:
వినతి వినతి వినతి త్రియేకునికి (2)

అను పల్లవి:
మనసునందు సద్గతి నిడును (2)

1. కోపదినమును తప్పించుకొనుటకు - ఏ పని చేసితివి (2)
   బాధలు నిన్ను చేరక యుండును - నాథుని కనుగొనిన (2)

2. ఇచ్ఛల నెల్లను ఇలలో విడచి - నెచ్చెలు డేసును నమ్ము
   మేదినిసకలము మాయమైపోవును - సదయుడేను నిలచున్

3. కాయమస్థిరము కాలము నిల్వదు - మాయక్షితి మాయమగున్
   దాసుడాకాలము వ్యర్థము చేయక - యేసునంగీకరింపుము

4. రక్షకుడేసును సిలువలో గనుము - రక్షింప బడియెదవు
   జీవము సత్యము మార్గము చూతువు - దైవసుతునియందు

5. రక్షకు డాశ్రయదుర్గము వైద్యుడు - రక్షణ శృంగము కోట
   మింటను దేవుడు బండయు కేడెము - జుంటితేనెయు నాయనే

6. మంచికాపరి నిరతము కాచు - నంచితముగ నడుపున్
   జయము నిచ్చున్ త్రోసివేయక - ప్రియముతో పరుగిడరా

7. హల్లెలూయ పాట నార్భాటముతో - నెల్లరకు చాటుము
   త్వరగా రాజువచ్చును భువికి - దుష్టుల నణచుటకై
386 కాలవిలువ నీకు తెలియకపోయినkaalaviluva neeku teliyakapoyina

Romans 13:11

పల్లవి:
కాలవిలువ నీకు తెలియకపోయిన - కన్నీరు కార్చెదవు (2)

అను పల్లవి:
భువిలో యేసు నిన్నుంచిన యుద్దేశము (2)
భావమందు తలచి యేసుచే జీవించుము (2)

1. ఇష్టప్రకారము మనసు వీడి నడచి - కోప పాత్రుడ వగుదువె (2)
   రక్షణ్య జీవితమొంది సంతోషించ (2)
   ననుగ్రహ కాలమిదే యని తెలిసి (2)

2. ఇహమందు సేవకు యేసు నిన్ను పిల్చె - నని తెలిసికొనుము
   ఘనమైన పనిని మరచి నిద్రించిన
   పగలు గతించక నిక నేమి చేతువు

3. నోవహుకాలమున నూట ఇరువది - యేండ్లు చూచి లోకమును
   నశింప జేసెను కృపతో నీ కిడిన
   ఆయుస్సు ఈ ఏటితోనే ముగిసిన

4. ముందు యిర్మియా హనన్యాకు తెలిపిన - ఏటనే మృతిపొందెను
   ఏ సమయము నీకు సొంత మనకుము
   ఈ ఏటనే నీవు మరణించవచ్చును
387 ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడాprabhu yesu pilupunu o priyudaa

2 Cor 6:2

పల్లవి:
ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా - పెడచెవిని పెట్టెదవా (1)
తీర్మానము చేయకనే వెళ్ళెదవా - ప్రభుసన్నిధిలో నుండి (2)

1. లేత వయస్సు నడిప్రాయమును - గతించి పోవునవి (2)
   మన్నయినది వెనుకటివలెనే - మరల భూమికి చేరున్ (2)
   ఆత్మదాని దయచేసిన - దేవుని యొద్దకు పోవున్ (2)
   ఆ లోకములో నీ ముందుగతి ఏమౌనో ఎరిగితివా (2)

2. ఏపాటిది నీ జీవితమంత - ఏపాటిది నీ తనువు
   గడ్డిపువ్వుతో సమమిదియేరా - అదియే నీ జీవితము
   అంతలోన మాయము అగు - వింత బుడగయే కాదా
   అంతలోన అంతర్థానంబగు ఆవిరియేకాదా

3. వ్యర్థము వ్యర్థము సర్వము యిలలో - ఇదియే యేసుని మాట
   నిలువని నీడ యీ లోకమురా - కలుషాత్మ కనుగొనరా
   లోకమంత సంపాదించి - లోభీ నీ ప్రాణమును
   నష్టపరచుకొనిన నీకు నరుడా లాభముకలదా

4. తామసించ తగదిక నీకు - తక్షణమే తిరుగుమురా
   విరిగి నలిగి హృదయము కరిగి - వినయముతో ప్రభు జేరి
   యేసు ప్రభుని సిలువచెంత - యేసుని రక్తముకోరి
   ప్రలాపించి నీదు సకల పాపము నొప్పుకొనుమా

5. నీ రక్షణకై నిలిచెను యేసు - తన రక్తధారలతో
   కడుగును నిన్ను క్షమించును - వడిగా యీ క్షణమందే
   నీ నామమును పరలోకములో - నేడే వ్రాసి యుంచున్
   రక్షణానందముతో నిప్పుడే రంజిల్లెదవు ప్రియుడా
388 ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ముpremato yesu piluchuchunnaadu rammu

John 11:28

పల్లవి:
ప్రేమతో యేసు - పిలుచుచున్నాడు రమ్ము (2)
రక్షణను పొంది - లక్షణముగా వెళ్ళుదము (2)

1. పాపమెరుగని ప్రభు నీ కొరకు - పాపముగను చేయబడెను (2)
   శాపగ్రహియాయె సిలువలో (2) పరుగిడి రమ్ము (1)
   శాపగ్రహియాయె సిలువలో (2) పరుగిడి రమ్ము (1)

2. ముండ్ల కిరీటమును ధరించి - ముఖముపై నుమ్మి వేయబడె
   ప్రాణమిడె నేసు సిలువలో - పరుగిడి రమ్ము
   ప్రాణమిడె నేసు సిలువలో - పరుగిడి రమ్ము

3. సిలువలో నీకై దప్పిగొని - కలుష నీ క్షమకై ప్రార్థించి
   సహించి ప్రాణమిడె నీ కొరకు - పరుగిడి రమ్ము
   సహించి ప్రాణమిడె నీ కొరకు - పరుగిడి రమ్ము

4. తప్పిన గొర్రెను రక్షంప - తనదు రక్తమును చిందించె
   కాపరి స్వరము ధ్వనించె - పరుగిడి రమ్ము
   కాపరి స్వరము ధ్వనించె - పరుగిడి రమ్ము

5. తామసించ తగదిక ప్రియుడా - త్వరపడుము నీ రక్షణ కొరకు
   నేడే నీ రక్షణ దినము - పరుగిడి రమ్ము
   నేడే నీ రక్షణ దినము - పరుగిడి రమ్ము

6. తానే కడుగును తన రక్తముతో - తండ్రివలె నీ పాపమునంత
   తనయుడవై పోదు విపుడే - పరుగిడి రమ్ము
   తనయుడవై పోదు విపుడే - పరుగిడి రమ్ము

7. ప్రేమవార్త ప్రకటింపబడె - ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము
   కృపాకాలమిదే జాగేల - పరుగిడి రమ్ము
   కృపాకాలమిదే జాగేల - పరుగిడి రమ్ము
389 ఇమ్ముగ నీ హృదయము నిమ్ము 2immuga nee hrudayamu nimmu 2

Proverbs 23:26

పల్లవి:
ఇమ్ముగ నీ హృదయము నిమ్ము (2) - ఇమ్మనెన్ నీ ప్రభు (2)
నావలో నిను యావల జేర్చును (2) - నాథుని నామము (2)

1. లోక సముద్రము దాటునపుడు - దుఃఖ సంకటములకు జడియకు (2)
   నావలో నిను యావల జేర్చును (2)- నాథుని నామము (2)

2. లోకమంతా యురులే నీకు - లోకాశలకు లొంగెద వేల
   లోక రక్షకుడేసుని మాటకు - లోబడు మిప్పుడే

3. పాపమును జేర కూర్చితి నీవు - పాపమును జేయ నేర్చితి నీవు
   పావనమగు ప్రభు నామమును - ప్రాపుగా వేడుము

4. శాంతి నియ్యని కారెడి తొట్లన్ - వాంఛతో నీవు తొలిపించితివి
   పూర్ణశాంతిని ప్రభు నీ కిచ్చున్ - పూజ్యుని వేడుము

5. లోకమును నీవు వీడవలయును - లోక మాయలో నిలిచెదవేల
   జాగుచేయక జీవముండగనే - జేరుము యేసుని
390 ఓపాపి జీవపు యూటకురాopaapi jeevapu yootakuraa

Isaiah 55:1

1. ఓపాపి జీవపు యూటకురా - పాపభారము తోడరా
   రక్షకుడు నిన్ను పిల్చుచున్నాడు - అక్షయ జీవమీయను

పల్లవి:
తామసము చేయకుము - తరుణమును వీడకుము
కృపతో నిన్ను రక్షించును - కృపతో రమ్మనెను

2. ఉన్న పాటున రమ్ము యేసు నొద్దకు - పన్నుగ కాచియున్నాడు
   సింధుర పాపమైనను - బంధరముగ మాయమౌ ||తామ||

3. రక్షకుని వాక్కులన్నియు - రయమున నమ్ముచు
   పశ్చాత్తాపమొందువారలకు - నిశ్చయ రక్షణ నిచ్చున్ ||తామ||

4. పాపి మనస్సు మారునపుడు - పరమందలి దూతలు
   సంతోషగాన వితతులచే - వింతగ పాడుదురు ||తామ||

5. వాక్కుల నెరవేర్చిన యేసు - మాట తప్పనివాడు
   సాకు చెప్పువారల నెల్ల - శిక్షకై నియమించెను ||తామ||"

6. యేసు నంగీకరించువారలను - చేయును శుద్ధులుగా
   యెల్లరకును మేలుచేసెను - పిల్చుచున్నాడిపుడు ||తామ||

7. హల్లెలూయా పాటపాడెదవు - చల్లని ఆత్మవలన
   నాథుని నీవు వెదకిన - సాధుగ ఈవుల నిచ్చున్ ||తామ||
391 గడియ నేను తట్టుచున్నానుgadiya nenu tattuchunnaanu

Revelation 3:20

పల్లవి:
గడియ నేను తట్టుచున్నాను
మూఢముగా నుండక మనసు తెరువుము

1. భోజనము చేయనై శాంతిగా నిల్చుచున్నాను
   ఆసనమునిచ్చిన ప్రేమను రుచింతువు

2. ఆనందము పొందును నీ హృదయము నాకిమ్ము
   కష్టదుఃఖముల నెల్ల పారద్రోలెదను

3. నేనే మృతి పొందితిని నీ నాథుడను యేసు రాజును
   పైన వెళ్ళి తండ్రితో మాటలాడుదు నీకై

4. నా శిరస్సునందు ముండ్ల మకుటము ధరియించితిన్
   హేమమకుట మీయను త్రోసినట్టి నీకై

5. తామసము చేయక హృదయమును తెరువుము
   తెల్లని వస్త్రములతో నిన్నలంకరింతును

6. సైతాను దూతలను పారద్రోలెదను నేను
   నాతాను ద్వారా నీకు పశ్చాత్తాపమిత్తును

7. హల్లెలూయ పాడి నీ హృదయమును నా కిమ్ము
   ప్రియుడనైన నేను త్వరగా నీకై వత్తును
392 యేసు రాజున్ నీ యెదలోyesu raajun nee yedalo

Revelation 3:20

1. యేసు రాజున్ నీ యెదలో - వసియింప నీయవా?
   నీదు భారమును మోసెన్ - నేడంగీకరింపవా?

పల్లవి:
యేసు మహారాజు ఇదిగో - వాకిట నిల్చియుండగా
పాపీ! యేసు ప్రేమనెంచి - తలుపును తీయుము

2. లోక ఆశా పాశముల - చేత నిండియున్నావా?
   నీకై సిల్వన్ ప్రాణమిడిన - యేసుకు చోటులేదా? ||యేసు||

3. ఇంక తామసించినచో - వెనుక మోసమగును
   ఇపుడే రక్షణ దినము - వెనుక రక్షణబ్బదు ||యేసు||

4. పిల్చినిల్చు రక్షకునికి - తలుపును తీయుము
   నీదు జీవబలముల - నేడే సమర్పింపుము ||యేసు||

5. రేపు యని తామసింప - నష్టము కల్గు సదా
   మంచి సమయము వృధా - యగున్ కష్టపడెదవు ||యేసు||

6. యోహాను మూడు పదహా-రును విశ్వసింపుము
   దప్పిగొన్న వారిన్ పిల్చున్ - రూక కాసు లేకయే ||యేసు||

7. హల్లెలూయ పాడుటకై - వల్లభుని యొద్దకురా
   త్రోసివేయ డెన్నడును - మంచి యేసునాథుడు ||యేసు||
393 సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభుsodarudaa paapakshamakai vedumaa prabhu

Mark 1:15

పల్లవి:
సోదరుడా పాపక్షమకై వేడుమా - ప్రభు యేసుని (2)

1. యేసుని రాజ్యము - సమయము వచ్చెను (2)
   రక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన (2)

2. మనుజరూపము ధరించి - స్వర్గము దిగి వచ్చెను
   తనదు రక్తముద్వారానే - పాపబంధము త్రుంచెను

3. కలువరిలోని సిలువలో - ప్రాణము నర్పించెను
   ఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను

4. సమయము లేదు సోదరా - త్వరపడి రమ్ము వేగమే
   సువార్తను విశ్వసించి - రక్షణను పొందుము

5. పాప సాగరమునందు ఎంతకాలముందువు?
   పాపసాగరమునుండి - యేసుప్రభు విడిపించును
394 యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చునుyesu prabhuve neeku rakshana nichunu

Hebrews 2:4

పల్లవి : 
యేసు ప్రభువే - నీకు రక్షణ నిచ్చును  (2)
ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు  (2)

1. మృతియే పాపపు జీవము - ప్రభుని వరము జీవము (2)
క్రీస్తు నంగీకరించిన - నిత్యజీవ మిచ్చును  (2)
ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడి నిన్ కొనెగదా  (2)
మరతువా యేసుని ప్రేమను - మరువకు  (2)

2. కంటికి కనబడని వెన్నో - చెవికి వనబడనివెన్నో
గ్రహింప శక్యము కానివి - నీకై సిద్దపడెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను 

3. మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెన్
మరణ భయములో నున్న - వారిని విడిపించెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో

4. సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారిని
మధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితో
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే

5. దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందు
పరలోకపు పిలుపులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ - మొందుము 

6. దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలో
క్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెను
ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా
త్వరపడు నీదు భాగమును పొందను

7. పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్
ధరించుకొను సమూహము - ఖర్జూర మట్టలు చేబూని
దేవునికిని గొఱ్ఱెపిల్లకును - స్తోత్రములు చేయుచుండ
నీవు నీ రక్షణకై పాడువు - హల్లెలూయ
395 ఓపాపీ సంధించితివా నీ పాప విమోచకునిopaapee sandhinchitivaa nee paapa vimochakuni

Matthew 11:28

పల్లవి:
ఓపాపీ - సంధించితివా - నీ పాప - విమోచకుని -
నీ పాపముల్ - క్షమించి - నీ ప్రాణమునకు - శాంతినొసగున్ (1)

1. బంధింపబడె - ప్రభువైన యేసు - విడుదల జేయనిన్ను (2)
   నిందను పొందెను - పొంద నీ వానందము (2)

2. క్రీస్తు యేసు - నీ కొరకేడ్చె - గెత్సెమనే - వనములో
   వాత్సల్యముతో - నిన్నానందింపజేయ

3. రక్షకుడు తీర్పుకై - నిలిచె - అక్షయ జీవమీయ
   శిక్షను బొందె - నిన్నానందింపజేయ

4. ప్రభువైన యేసు - తట్టుచున్నాడు - నీ హృదయ ద్వారమున్
   అబ్బును శాంతి - తెరచిన హృదయమున్

5. జీవజలమిచ్చు - ప్రభువైన యేసు - దప్పిగొనియున్న నీకు
   జీవితాంతము వరకు - దప్పిగొన వే మాత్రము

6. రక్షణ దుర్గమున నిన్నుంచి - శత్రువును - అణచివేసి
   దక్షిణ హస్తముతో - కప్పును - నిన్నెప్పుడు

7. దేవుని స్వరము - వినుడి నేడే - దైవపుత్రులౌదురు
   సేవించుడి క్రీస్తుని - జీవితములర్పించి
396 చూడుము సోదరుడా నీవుchoodumu sodarudaa neevu

John 1:4

పల్లవి:
చూడుము సోదరుడా నీవు - నేడే లేచి రక్షణ కొరకై - వేడుము స్నేహితుడా (2)

1. లెమ్ము నీకు వెలుగువచ్చెను - కమ్ముచున్నది చీకటి లోకమున్ (2)
   చిమ్మచీకటి జనముల గమ్మెను - నెమ్మది నొందగ లేచి రా (2)
   నమ్ముము సోదరుడా (1)

2. దేవుని వాక్యము వెలుగైయున్నది - ఆ వెలుగే నీకు జీవమైయున్నది
   నీ వెనుకే ఆ జీవము నిలచెను - జీవము నొందగ వేగమే రా
   రావో సోదరుడా

3. నిలువుము నీ జీవము ఆవిరియే - ఇలలో లేదిక నీదని చెప్పెడు
   కలుషము లెల్లను కడుగును క్రీస్తు నిలుచును ఇల నీ కాపరియై
   కలువరి చెంతకు రా

4. మొర్రపెట్టుము నేడే లేచి - సరిచేసికొని జీవితమంత
   పరిశుద్ధ రక్తధారలతో - పరిశుద్ధుడు నిలచెను నీకై
   పరుగిడిరా ప్రియుడా

5. యేసుని నమ్మెడి వారిలలోన - యేసుని జీవము పొందిన వారై
   భాసురంబుగా మోక్షము జేర - నిల్చెదరు శక్తిని బొంది
   యేసే ఒసగును రా

6. హల్లెలూయ పాడుము నేడే - వల్లభుండేసు వచ్చునని
   ఎల్ల ప్రజలు చూచెద రేసున్ - చల్లని ప్రభూరాకన్ ఇలలో
   స్తుతులను పాడను రా
397 ప్రభుతట్టు కన్ను లెత్తు యేసు తట్టు కన్ను లెత్తుprabhutattu kannu lettu yesu tattu kannu lettu

Hebrews 12:2

పల్లవి:
ప్రభుతట్టు కన్ను లెత్తు యేసు తట్టు కన్ను లెత్తు (2)
దొరుకు ప్రేమ శాంతి ఆనందం - పరిపూర్ణ మహిమ నిరీక్షణ (2)

1. గతదినముల దుర్నీతి క్రియల మతిని నీవు మరువుము (2)
   పాతకముల జూపి బాపున్ మా దయామయు డేసు (1)

2. చింతపడకు భవిష్యత్తునకై ఏమి చేయుదునంచు
   సంకట దుఃఖములను బాపున్ ఆశ్రయమే నాయేసు

3. అంధకారము కమ్ముచున్నది యుద్ధము దుఃఖములతో
   భీతిభయములతో నెటులబోదు నాతో నా ప్రభువుండన్

4. నమ్మజాల మీ లోకమును వ్యర్థము సర్వమును
   ప్రభుని చరణములే శరణం దయాసాగరుడేసు
398 చూడుము నీవు మేలుకొనుముchoodumu neevu melukonumu

Matthew 25:6

పల్లవి:
చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు (1)
అంధకార రాజ్యమున కా రాజు మహిమతో వచ్చును (2)

1. హృదయ ద్వారమును తెరువు (2) - యేసు తట్టుచున్నాడు (1)
   నేడే నిన్ను పిలుచుచుండె (2)- ఆలస్యము చేయకుము (2)

2. నేడే వినుము సువార్తను - పొందు గొప్పరక్షణ
   రాదు తరుణము లేదు మరల - మరణము నిన్ను కొనిపోవున్

3. విడువుము అంధకార త్రోవ - విడువుము నీ చెడు జీవితము
   నేడే యేసును విశ్వసించి - నడువ నాయత్తపడుము

4. పాపడాగులనేకములు - అపాయ మతి నీచములు
   పాపములేని యేసురక్తము - పాపములన్ని కడుగును

5. కల్వరి సిలువపై చూడుమా - జీవమైన రక్షకుని
   నీవు పొందుము నిత్యజీవము - లేచి పాడుము హల్లెలూయ
399 యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించుyesuni sveekarinchu kreestesuni sveekarinchu

John 1:12

పల్లవి:
యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు (1)
నీ హృదయపు ద్వారము తెరువుము -త్వరితము తానే ప్రవేశించును (2)

1. కనికరమందైశ్వరుండు - నిను - వాత్సల్యముతో విమోచించును (2)
   భయంకరమైన పాపమునుండి - విడిపింప నిన్ను వెదకివచ్చెన్ (1)

2. మన్నించు సర్వ పాపములన్ - తానే - మాన్పును సర్వరోగములన్
   కృప కనికరముల మకుటము నీకు - ధరియింప జేసి ఘనపరచున్

3. అంధులకు దృష్టి కలుగజేసె - అంగ - హీనులను లేపి నడువజేసెన్
   పలు విధములగు వ్యాధి గ్రస్తులకు - స్వస్థత నిచ్చెను తక్షణమే

4. పాపపు భారము భరియించెను - నీ - రోగములన్నిటి తొలగించన్
   సహించెను కొరడా దెబ్బల బాధను - జయించెను అన్ని శోధనలన్

5. కలువరి సిలువలో ప్రేలాడి - తన - రక్తము చిందించె ధారలుగ
   చేతులలో తన కాళ్ళలో చీలలు - ముండ్ల కిరీటము ధరియించె

6. జీవమిచ్చుటకు ప్రాణమిడె - మరి - జయించెను ప్రతివిధ శోధనలు
   నీ కొరకై మరణించి లేచెను - శక్తిమంతుడే నిను రక్షింప
400 జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?jeevita mevvariki, nee jeevita mevvariki?

Luke 12:20

పల్లవి:
 జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి? (1)
ఈ లోకములో జీవించు జీవితమంత  (1)

1. శరీరేచ్ఛలకై ఆశలుండు (1) - ఈ ధరణియందు (2)
   సుఖభోగులుగా జీవింతురు (1) - ఈ ధరణియందు (2)
   వారి యూహలు దినమెల్ల చెడియున్నవి (2)
   వారి పాప జీవిత మంత శాపమెగ (2)

2. ధనాపేక్షకులెందరో గలరు - ఈ ధరణియందు
   ధనముపై మనస్సు నిల్పెదరు - ఈ ధరణియందు
   వారి కలవరమంత ధనము ధనమే
   వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే

3. స్వంత బోధలకై బ్రతికెదరు - ఈ ధరణియందు
   గర్వమునకు అమ్మబడి యుందురు - ఈ ధరణియందు
   వారి మనసులు సంకుచితములై యుండు
   వారి జీవిత ప్రయాసము - పతనమేగా

4. విరిగిన హృదయులు కలరెందరో - ఈ ధరణియందు
   కరిగెడు ఉప్పుగ నుండెదరు - ఈ ధరణియందు
   వారు ప్రభుకై దాగియే నిలచెదరు
   దైవ వాక్కుగ దినమెల్ల సేవింతురు
401 యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము వినుyesu ninnu pilachenu vaasigaa svaramu vinu

John 11:28

పల్లవి:
యేసు నిన్ను పిలచెను - వాసిగా స్వరము విను (2)

1. కార్చె రక్తము కల్వరిలో - కఠిన బాధలెల్ల నోర్చి (2)
   చూపె ప్రేమ నుర్వికొఱకు - జాపె బాహువుల్ కరుణతోడ - చేర దీయును (1)

2. క్రీస్తు ప్రేమ తెలిసికొనుము - రయము తోడ మనసు నిల్పి
   దాని పొడవు వెడల్పు లోతు - నెత్తు గ్రహించు తెలివి తోడ
   చెంత చేరుము

3. ప్రీతి తోడ యేసు ప్రభువు - ప్రాణము నర్పించె నీకై
   దీని వలన ప్రేమ యెట్టిదో - తెలిసికొనుము బుద్ధితోడ
   పాప మొప్పుకో

4. బల్లెముతో పోటుపొడువ - బాధ సహించె ప్రేమ తోడ
   సమాప్తమని తలను వంచె - సర్వలోక సృష్టికర్త
   చాటు జేరుము

5. లోకమంత జయించుకొన్న - లోభివలె నశించెదవుగా
   స్వంత ప్రాణమును కాపాడు - స్వరక్షకుని చెంత జేరి
   సేద దీర్చుకో
402 చూడుము ఈ క్షణమే కల్వరినిchoodumu ee kshaname kalvarini

Luke 23:33

పల్లవి:
చూడుము ఈ క్షణమే కల్వరిని (1)- ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను (1)
గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు (1)- సిలువలో వ్రేలాడు చున్నాడుగా (2)

1. మానవు లెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక (2)
   ఎరుగరు మరణము నిక్కమని - నరకమున్నదని వారెరుగరు (2)

2. ఇహమందు నీకు కలవన్నియు - చనిపోవు సమయాన వెంటరావుచనిపోయినను నీవు లేచెదవు - తీర్పున్నదని ఎరుగు ఒక దినమున

3. మనలను ధనవంతులుగా చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు
   రక్తము కార్చెను పాపులకై - అంగీకరించుము శ్రీ యేసుని

4. సిలువపై చూడుము ఆ ప్రియుని - ఆ ప్రేమకై నీవు యేమిత్తువుఅర్పించుకో నీదు జీవితము - ఆయన కొఱకై జీవించుము
403 ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునుenta paapinainanu yesu cherchukonunu

John 6:37

1. ఎంత పాపినైనను - యేసు చేర్చుకొనును
   అంచు నీ సువార్తను - అంతట జాటించుడి

పల్లవి:
హల్లెలూయ - హల్లెలూయ ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనున-టంచు ప్రకటించుడి

2. మెండుగా క్షమాపణన్ - పూర్ణ సమాధానము
   నెంత పాపికైన దా-నిచ్చి చేర్చుకొనును || హల్లె||

3. తన దివ్యసిల్వచే - దీసి పాపశాపమున్
   నన్ పవిత్రపర్చును - నాకు హాయి నిచ్చెను || హల్లె||

4. ఘోర పాపినైనను - నన్ను జేర్చుకొనును
   పూర్ణశుద్ధి నిచ్చును - స్వర్గమందు చేర్చును || హల్లె||
404 యేసునాథుని గాయములను చూడుముyesunaathuni gaayamulanu choodumu

Philippians 3:7

1. యేసునాథుని గాయములను చూడుము - నిత్యజీవము పొందెదవు
   ప్రాణమిచ్చి విమోచించిన వానిని - నమ్మివచ్చి చేరి చూడుము

పల్లవి:
చూచి జీవించు  యేసునాథుని గాయములను చూడుము
నిత్యజీవము పొందెదవు

2. పాపభారము మోసిన రక్షకునిచే - నీ నేరము తొలగెన్
   జీవనాథుడు కార్చిన రక్తముచే - నీ పాప ఋణము తీరెన్ || చూచి ||

3. ఏ క్రియలు ప్రార్థన కన్నీళ్ళును - నిన్ను రక్షింపజాలవు
   రక్తంబే ఆశ్రయమని వచ్చిన - కరుణించు విమోచకుడు || చూచి ||

4. పాప ప్రాయశ్చిత్త క్రియలు ముగిసె - అని ప్రభువే పల్కెను
   సర్వలోకపు నేర పాపమున్ - సిలువలో నివృత్తి జేసెన్ || చూచి ||

5. పాపనాశకుడు ఇచ్చు రక్షణను - ఈ క్షణమే పట్టుకొనుము
   నీ నీతియగు యేసు పుణ్యముచే - మోక్షానందముల పొందెదవు || చూచి ||
405 రక్షణంపు వార్తను విని రక్షకుండగు యేసునిrakshanampu vaartanu vini rakshakundagu yesuni

Jeremiah 8:20

1. రక్షణంపు వార్తను విని - రక్షకుండగు యేసుని
   పిల్పుకు లోబడెదవా - అలయక యేసును జూతువా

పల్లవి:
నమ్మి రమ్ము నమ్మి రమ్ము - ఇమ్ముగ బ్రతుకుము  (2)

2. వేసవి కాలమెల్ల గడిపి - కోతల ననుభవించితి
   వేసవి వర్షమును చూచితివి - ఇంక పాపమందున్నావే ||నమ్మి||

3. యేసు నీ తీర్మానముకై - వేచియుండగా తీర్మానించు
   ఆత్మ పోరాడుచున్నప్పుడే - అప్పగించుకో ప్రక్కజూచి ||నమ్మి||

4. తగుదునా యని యను కొనక - వేరు స్పర్శల నొందకుము
   తలంపు కాదు నమ్మికయే - ఆత్మ ముద్రనిచ్చును ||నమ్మి||

5. చిత్తము దేవదత్తముజేయ - ప్రాయశ్చిత్తరక్తము నమ్ము
   నాకమందుండు యేసుని చూడు - మారని వాక్యమును చేరుము ||నమ్మి||

6. యెషయా ఒకటి పదునెమ్మిది - నలభై ఐఫు ఇరవై రెండును
   యేసు క్రీస్తు అరచి చెప్పుదాని - ఆయనన్ కూడ పొందుము ||నమ్మి||

7. యిర్మియా ఎన్మిదిరవైయును - రెండవ కొరింథీ ఆరు రెండును
   కార్యములు నాలుగు పండ్రెండును - పొంది హల్లెలూయ పాడుమా ||నమ్మి||
406 ప్రభుయేసు రమ్మనుచుండె పాపుల నెల్లరినిprabhuyesu rammanuchunde paapula nellarini

John 6:37

పల్లవి:
ప్రభుయేసు రమ్మనుచుండె - పాపుల నెల్లరిని (2)
వచ్చిన వారికి ప్రభుయేసుండే - విశ్రాంతి నిచ్చు (2)

1. లోకములో మానవులెల్ల ఘోరపాపములు జేసి (2)
   దేవుని మహిమకు దూరమైపోయిరి (2)
   మానవుల నీతి క్రియలు - మురికి పేలికలే (2)

2. ప్రభు యేసుక్రీస్తు నందు ఏ పాప దోషము లేదు
   మ్రానుపై వ్రేలాడెనుగా మన దోషముల కొరకై
   మరణము గెల్చి విజయమునిచ్చి - నీతిగా తీర్చె

3. ఎందరు విశ్వసింతురో ప్రభువైన క్రీస్తుని
   వారే పొందెదరుగా నిత్యమైన రక్షణ
   నేడె మీ కనుకూల సమయము - రక్షణ దినము

4. పాపమును క్షమించుటకు - ప్రభుకే అధికారము కలదు
   ఎవరి పాపదోషములు పరిహరింపబడునో
   వారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా

5. పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వసించిన వారేగా
   తీర్పు మరణము లేక జీవము పొందెదరు
   పరిపూర్ణులుగా కడుగ బడుడి యేసుని రక్తములో
407 యెరుషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ముyerushalemu gummamulaaraa raajunu loniki raanimmu

Matthew 21:10

పల్లవి:
యెరూషలేము గుమ్మములారా - రాజును లోనికి రానిమ్ము (1)
చిరునవ్వుతో  - ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము (2)

1. విజయుడై వచ్చుచున్నాడు - శత్రు సాతానును ఓడించి (2)
   ఖర్జూర మట్టలు వస్త్రము లెందుకు - మీ హృదయములను పరువుడి (2)

2. అభ్యంతర పరచకుము - పిల్లలు, వృద్ధులు, యౌవనులన్
   ప్రభుని విజయమునందు వారిని - స్తుతిస్తోత్రములు పాడనిమ్ము

3. నీ దుష్టక్రియలను బట్టి - ప్రభుని దయము త్రోసెదవా
   పరమ రాజును హృదయ మందిరమున - నేడే రానిమ్ము స్నేహితుడా

4. నిన్ను దర్శించుటకే - ప్రభు నీ చెంతకు వచ్చెనుగా
   గాయపడిన హస్తమును చాచి - నీ మదిలో చోటిమ్మనెను

5. పశ్చాత్తాపము నొందుము నేడే - నీ పాపము లొప్పుకొనుము
   జీవము రక్షణ శాంతి నొసగును - ఆయనే ప్రభువు శ్లాఘించుము
408 తెరువు నీ హృదయ ద్వారంబు నేడేteruvu nee hrudaya dvaarambu nede

2 Timothy 2:10

పల్లవి:
తెరువు నీ హృదయ ద్వారంబు నేడే - ప్రభుయేసునందే రక్షణ కలదు (2)
నిర్లక్ష్యముగా జీవించనేల  (2) - వేచియున్నది తీర్పు నీ కొరకై (1)
పరమున కేగుట కాయత్తపడుము - తెరువు నీ హృదయంబును  (1)

1. జన్మంబుతోనే పాపివి నీవు - నీతిమంతుడే లేడు (2)
   కామ, క్రోధ, లోభ, మోహ, - పాపపు డాగులివియే (2)

2. ధర్మకర్మల వస్త్రంబు నీవు - కప్పుకొన్న దాగవునీ పాపము కడిగి నీతిగా తీర్చే - ఔషధంబేమి లేదు

3. తెలియదు నీకు నీ మరణ దినము - నిశ్చింతగా నుండెదవా
   పాప ఫలితము నరకమే వినుము - విడిపించెడి వారెవ్వరు?

4. పాపమువలన నీ జీవితమును - నష్టపరచుకొందువా?
   భరింపలేని నరక బాధ - ఏడ్పేగా నీ ఫలితము

5. పాపపు శిక్ష నీదై యుండ - నిన్ను రక్షింపనెంచె
   సిలువ శ్రమలు భరించెనేసు - నీకై రక్తము కార్చెగా

6. ఒప్పుకొనుము నీ పాపములను - అపరాధినంచు వేడు
   తన రక్తమందు కడుగును నిన్ను - రక్షణ నొందెదవు
409 కృపకాలములో ప్రభుయేసునిkrupakaalamulo prabhuyesuni

2 Cor 6:2

పల్లవి:
కృపకాలములో - ప్రభుయేసుని - అంగీకరించుము  ఓ ప్రియుడా (2)
కృపకాలములో (1)

1. సర్వలోకము సంపాదించి - నీ ఆత్మను కోల్పోయిన (2)
   మిత్రుడా నీ కేమి లాభముండును (2) ఈ లాటి జీవముతో (1)
   యేసుని ప్రేమ స్వరము విని - తెరువు నీ హృదయము (1)
   ప్రభు యేసుని చరణముల్ చేరి అనంత ముక్తి పొందు (2)

2. ధర్మ కర్మ సంస్కారమువలన - పరిశుద్ధుడవు కానేరవు
   భక్తి వేషాలు ధరించుకొన్న - పరలోకము చేరవు
   కాగా మిత్రుడా నీ పాపములను - ఒప్పుకొను యేసు నొద్ద
   మహాప్రభుని చరణముల్ చేరి - అర్పించుకో నిన్నే

3. ప్రభుయేసుక్రీస్తు నిత్యరక్షణకు - ఏకైక మార్గం గ్రహించుకో
   పాపమార్గం వదలి పశ్చాత్తాపముతో - ప్రభుశరణము చేరి
   నీ పాపములను ప్రభురక్తమందు - కడిగి శుద్ధిచేసుకో
   పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు

4. క్రీస్తులో పూర్ణ నిత్యజీవం - పరలోక ఆశీర్వాదములు
   ఓ మరణమా నీ ముల్లెక్కడ - క్రీస్తునందు విజయమే
   శిక్ష దండన తొలగింపబడె - ప్రభుయేసు క్రీస్తునందే
   ప్రభు శక్తిచే పాతాళ ద్వారం - సదా ఓడింపబడె
410 క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడాkreestu chentaku rammu priyudaa

John 14:6

పల్లవి:
క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా - యేసు చెంతకు రమ్ము ప్రియుడా -
జీవజలమును త్రాగి - నీ దాహము తీర్చుకొనన్ (2)

1. ఆయనే జీవజలము - నిత్యమైన తృప్తినిచ్చును (2)
   నీవు ఆ జలము త్రాగిన - ఇంకెన్నడు దప్పిగొనవు
   యుగ యుగములవరకు (2)

2. ఆయనే జీవాహారము - నిత్యమైన తృప్తినిచ్చును
   జీవాహారము భుజించిన ఆకలిగొనవెప్పుడు
   యుగ యుగములవరకు

3. ఆయనే జీవ మార్గము - స్వర్గరాజ్యమును చేరను
   ఆయన నంగీకరించిన తండ్రియొద్దకు చేరెదవు
   యుగములు రాజ్య మేలను

4. ఆయనే యేకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను
   నీ వందు ప్రవేశించిన చేరుదువు నిశ్చయముగ
   నిత్యసుఖము లొందెదవు

5. ఆయనే నిత్య సత్యము - సర్వలోకమును రక్షింప
   ఆయనను స్వీకరించిన నిత్య శిక్షనుండి తప్పించున్
   సదా ఆయనతో నుందువు
411 తెరువబడియున్నది కృపద్వారముteruvabadiyunnadi krupadvaaramu

Matthew 25:10

పల్లవి:
తెరువబడియున్నది కృపద్వారము - త్వరపడి రమ్మని పిలిచె నేసు (2)

1. ఎవరును నశియింప వలదని - ఓరిమి ప్రభువు వహియించును (2)
   మారు మనస్సును పొందు సమయమిదే -
   మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు (2)

2. ద్వారము తెరువబడియుండగ - దయచూపి నిన్ను రమ్మనె ప్రభువు
   దీనిని నీవు అంగీకరించిన
   దేవుని దీవెనలు పొందెదవు

3. రాత్రి గడచిపోయి పగలాయెను - అతిక్రమములను వీడుమనె ప్రభు
   నీతి సూర్యుండు ఉదయించును
   భీతిని విడచి సిద్ధపడుము

4. అర్థ రాత్రి వేళ గొప్ప సందడాయెను - అదిగో పెండ్లి కుమారుండు వచ్చెననియు
   సిద్ధముగానున్న వారే వెళ్ళెదరుగా
   ఆ ద్వారము మూయబడు త్వరపడుమా

5. వెళ్ళగోరియున్న సిద్ధపడవలెను - యేసు రక్తమందు శుద్ధకావలెను
   ఘనముగ మీరు ప్రవేశింపవలెను
   మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే
412 నా మాట వినుమని ప్రభువనెనుnaa maata vinumani prabhuvanenu

Hebrews 3:8

పల్లవి:
నా మాట వినుమని ప్రభువనెను (2)- నిను రక్షింపను పిలుచు చుండె  (2)

1. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు (2)- నీతిమంతుల కాదు పాపుల పిలిచెన్ (2)
   నిను హృదయంబార ప్రేమించును (2)- ప్రేమించును (1)

2. తప్పిన వారిని వెదకవచ్చెన్ - తానే వెదకె నిన్ పరికించుము
   దాపున నిలిచెను రక్షింపను - రక్షింపను

3. జీవన దాతగా ప్రభు యేసు వచ్చెన్ -నిత్య జీవము నీకు కలిగించును
   కావున ప్రభు నీ దరిజేరెను - దరిజేరెను

4. జీవన జ్యీతిగా జగమున కొచ్చెన్ - నీ వెరిగితివా నీ స్థితిని
   నీ చీకటిని పోగొట్టును - పోగొట్టును

5. పాత వాటిని పారగ ద్రోలన్ -నూతన పరచును సర్వమును
   పరికించుము నీ స్థితిగతిని - స్థితిగతిని
413 దారితొలగితివేల రక్షణ మార్గము వెదకుdaaritolagitivela rakshana maargamu vedaku

Ephesians 5:15,16

పల్లవి:
దారితొలగితివేల (2) - రక్షణ మార్గము వెదకు (2)

1. పాపమందే జన్మించితివి (2)
   పాపమందే జీవించితివి (2) ఎరుగకున్నావు (2)

2. పాప ఫలితము ఘోరమరణము
   నరకదండన అగ్ని గుండము - మారు మనస్సు నొందు

3. నేడే యేసుని వాక్యము వినుము (2)
   నేడే ప్రభుని స్వరము వినుము - తన చిత్తము నెరుగు

4. నీవు నశించుట కోరడు ప్రభువు (2)
   తరుణముండగ వేడుకొనుము - ఎరుగు నీ స్థితిని

5. అందరిని మారుమనస్సును
   పొందుమని ప్రభువాజ్ఞాపించె - పశ్చాత్తాపపడుము

6. ఒప్పుకొనుము నీ పాపమును
   క్షమాపణకై వేడుకొనుము - రక్షణ పొందెదవు

7. విశ్వాసముతో అడిగిన యెడల
   పొందితివని నిశ్చయముగ నెరుగు - గొప్ప రక్షణ యిదియే
414 లోకమును విడచి వెళ్ళవలెనుగlokamunu vidachi vellavalenuga

Hebrews 13:14

పల్లవి:
లోకమును విడచి వెళ్ళవలెనుగ (2)
సర్వమిచ్చటనే - విడువవలెన్  విడువవలెన్

1. యాత్రికులము యీ దుష్టలోకములో - పాడులోకములో మనకేది లేదు (2)
   యే విషయమందైన గర్వించలేము (2) - గర్వించలేము (1)
   జాగ్రత్తగానే నడచుకొనెదము (2)

2. కష్ట బాధలచే బ్రతుకంత నిండె - కన్నీళ్ళు నిరాశ - నిస్పృహల మయము
   కరుణా కటాక్ష నమ్మెదము - నమ్మెదము
   క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము

3. ఎంత వరకు యీ భువి యందుండెదమో - సైతానుతో సదా - పోరాటమేగా
   శత్రుని తంత్రాల నెరిగితిమి - నెరిగితిమి
   ధైర్యముతోనే కొనసాగెదము

4. గతము నంతటిని మరచిపోయెదము - గురియొద్ద కానందముతో వెళ్ళెదము
   మార్గాన వచ్చేటి శ్రమల నోర్చి - శ్రమల నోర్చి
   అర్హులమౌదము బహుమానమొంద

5. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి - నిజ ప్రేమతోనే - జీవించెదము
   నిష్కళంకులమై శుద్ధులమై - శుద్ధులమై
   పరిపూర్ణతను చేపట్టుదము

6. జీవము గల ప్రభు రక్షించె మనల - విమోచించి నూతన జీవమొసగె
   కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్ - త్వరగా వచ్చున్
   అందుచే మనము సిద్ధపడెదము

7. ఆత్మీయ నేత్రాలతో చూచెదము - ఎంత అద్భుతము సౌందర్య నగరం
   ప్రభువు చెంతకు వెళ్ళెదము - వెళ్ళెదము
   విజయోత్సవముతో ప్రవేశించెదము (2)
415 నీ జీవితములో గమ్యంబుయేదోnee jeevitamulo gamyambuyedo

Jeremiah 1:5

పల్లవి:
నీ జీవితములో - గమ్యంబుయేదో - ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభుయేసుకొరకు - నీ హృదయమర్పింపవా (2)

1. నీ తల్లి గర్భమున నుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు (2)
   యోచించినావా ఏ రీతినిన్ను - నిర్మించె తన చేతులు (2)

2. నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను
   హృదయంపు తలుపు - తెరువంగ లేవా యేసు ప్రవేశింపను

3. తన చేతులందు రుధిరంపుధారల్ - స్రవియించె నీ కోసమే
   భరియించె శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా

4. ప్రభుయేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా
   ఈ చోట నుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా!
416 ఆ కలువరి మార్గములోaa kaluvari maargamulo

John 19:17

పల్లవి:
ఆ కలువరి మార్గములో - యేసు సిలువను మోసెను
రక్షణ నివ్వను ఓ సోదరా - నెమ్మది నివ్వను ఓ సోదరీ (2)

1. గరుకు రాళ్ళ మార్గములో - బరువు సిలువను మోసెను (2)
   కొరడాలతో కొట్టిరి - దేహమంతా చీలెను (2)

2. మేకులు కొట్టిరి కాళ్ళకు - తలకు ముండ్ల కిరీటము
   యేసు రక్తము నదివలె - సిలువపై నుండి ప్రవహించె

3. గాయపడిన చేతులు చాచి - ప్రభువు పిలచుచుండెను
   పాపపు స్థితిని మార్చను - నిత్య జీవము నివ్వను

4. పాపములోనే ఉందువా - పాపము వలన మరణము
   నీ పాపములను ఒప్పుకో - కడుగును యేసు రక్తము

5. హృదయ తలుపు తట్టుచున్నాడు - తెరువుము నీ హృదయము
   చేర్చుకొనుము యేసుని - శాంతి నీకు దొరుకును
417 యేసు ప్రభు పిలుచుచుండెన్yesu prabhu piluchuchunden

Matthew 11:28

పల్లవి:
యేసు ప్రభు - పిలుచుచుండెన్ - నూతన జీవం - నీకిచ్చుటకు
ప్రేమతో నిన్ను - పిలుచుచుండెన్ - దొరకుముక్తి - ప్రభు చెంతనే

అను పల్లవి:
రండి రండి - సర్వజనమా - వెళ్ళెదము మనమందరము (2)

1. అందరిలో ఉన్నతుడు - ఆయనన్ నీవు చేర్చుకొను (2)
   రక్షణ నీవు పొందు నేడే (2)

2. నీ జీవము ఏ పాటిది? - ఒక నాడిది విడువవలెన్!
   వ్యర్థం వ్యర్థం ఈ లోక మాయ

3. నీ కొరకేతెంచెనిల - ముక్తినిచ్చే యేసుప్రభు
   ఒప్పుకొను తప్పిదములన్
418 శాంతి సంతోషం పాపక్షమాపణshaanti santosham paapakshamaapana

James 4:14

పల్లవి:
శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకున్
చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్ ఆ... ఆ... (2)"

1. కొంత కాలంబే ఈ లోకము - అంతలో కనబడి మాయమగున్ (2)
   చింతలన్నియు వీడి - ప్రభు చెంత జేరిన
   సంతసముగ యిచ్చు - నిత్య సుఖముల్

2. సకల సంపదలు - ఆస్తులుయున్నన్ - సకలంబు ఒకనాడు సమసిపోవున్
   సర్వంబు నీవే - అని మోసపోకుము
   సర్వంబు నీకు - ప్రభువే నమ్ము"

3. కొంత కాలంబే ఈ లోకము - అంతలో కనబడి మాయమగున్ (2)
   చింతలన్నియు వీడి - ప్రభు చెంత జేరిన
   సంతసముగ యిచ్చు - నిత్య సుఖముల్
419 పేద నరుని రూపము ధరించిpeda naruni roopamu dharinchi

2 Cor 8:9

పల్లవి:
పేద నరుని రూపము ధరించి - యేసురాజు నీ చెంత నిలచే (1)
అంగీకరించు మాయనను (2) పేద నరుని రూపము ధరించి (1)

1. కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడె - ముళ్ళమకుటము శిరస్సున పెట్టబడె (2)
   నింద వేదన శ్రమలను సహించె నేసు - చిందె తనదు రక్తము నీ పాపముకై (1)
   దీనుడై నిన్ను పిలుచుచుండె (2)

2. తలవాల్చుటకు ఇల స్థలమేలేదు - దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు
   తన్ను ఆదరించు వారెవరు లేరు - ప్రియ రక్షకుడు శిలువలో వ్రేలాడె
   పాట్లుపడె నిన్ను విడిపింపను

3. ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్ - పాపడాగులన్ రక్తముతో కడిగెన్
   నీ వ్యాధిని వేదన తొలగించ - నీ శాపము నుండి విడిపింప
   సిలువలో విజయము పొందె

4. మాయలోకమును నీవు నమ్మకుము - మనుష్యుల మనస్సు మారిపోవు నిల
   నిత్యదేవుని ప్రేమను నమ్మినీవు - నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
   నేడే రమ్ము విశ్వాసముతో "

5. తామసించెద వేల ఓ ప్రియుడా - ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము
   ఈ లోకము నీకివ్వని శాంతిని - ఈ దినమే ప్రభువు నీకొసగ
   ప్రేమతో నిన్ను పిలచుచుండె
420 నాదు హృదయపు ద్వారము తెరచెదనుnaadu hrudayapu dvaaramu terachedanu

Psalms 51:1

పల్లవి:
నాదు హృదయపు ద్వారము తెరచెదను (2)- యేసు పాపపు రోగికి నీ వేగతి (2)

1. యేసు చచ్చిన వారిని లేపితివే (2) - మరి కుంటికి కాళ్ళను యిచ్చితివే (2)
   నేను పాపిని రోగిని నీవేగతి (2) - నాకు దిక్కిక లేదిక వేరెక్కడ (2)

2. ప్రభు కుష్ఠును ప్రేమతో ముట్టితివి - మరి దుష్టుల చెంతను చేరితివి
   నాదు పాపపు కుష్ఠును పారద్రోలి - పరిశుద్ధత నియ్యుము నీవేగతి

3. యాయీరు కుమార్తెను లేపితివి - మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా
   నేను చచ్చిన పాపిని శరణు ప్రభూ - నాకు వేరొక మార్గము లేదికను

4. ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనిన - ఆ అంధుని ధ్వనిని వింటివిగా
   నేను పాపిని అంధుని యేస ప్రభూ - నను దాటకు దిక్కిక లేదు ప్రభూ
421 ప్రియయేసు నిర్మించితివిpriyayesu nirminchitivi

1 Cor 3:16

పల్లవి:
ప్రియయేసు నిర్మించితివి - ప్రియమార నా హృదయం (1)
ముదమార వసియించు నా - హృదయాంతరంగమున (2)

1. నీ రక్త ప్రభావమున - నా రోత హృదయంబును (2)
   పవిత్రపరచుము తండ్రీ - ప్రతిపాపమును కడిగి (2)

2. అజాగరూకుడనైతి - నిజాశ్రయము విడచి
   కరుణారసముతో నాకై - కనిపెట్టితివి తండ్రీ

3. వికసించె విశ్వాసంబు - వాక్యంబును చదువగనె
   చేరితి నీదు దారి - కోరి నడిపించుము

4. ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నేనుండునట్లు
   ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా
422 కనికరించి నన్ను రక్షించు మేసయ్యాkanikarinchi nannu rakshinchu mesayyaa

Luke 18:13

పల్లవి:
కనికరించి నన్ను రక్షించు మేసయ్యా (2)

1. పాపములోనే జన్మించినాను - పాపములోనే - జీవించినాను (2)

2. పాపము చేసితి - మాటలతోను - పాపము చేసితి - యోచనలోను

3. గర్వముతో జీవి-తము గడిపితిని
   హృదయమును కఠి-నము చేసికొంటి

4. యేసు ప్రభూ కష్ట-మును సహించితివి -
   నా కొఱకు రక్త-ము కార్చినావు

5. తెఱచితి నా యెద - విశ్వాసముతో - యేసుని రక్తము నంగీకరించితి
   యేసూ నీ రక్తమందు రక్షణ పొందితి
423 యేసు నా హృదయమునందునyesu naa hrudayamunanduna

Ephesians 3:18

పల్లవి:
యేసు నా హృదయమునందున - నివసించరమ్ము (2)
హృదయశుద్ధి నిమ్ము (2)

1. నిండెను పాపముతో నా జీవం - అండను నేను గాంచలేదెచ్చట (2)
   అండయై దారిని జూపువాడెవడు (2)- పొందుగ జూపునీవే

2. ఎటు జూచిన కారు చేకటియే - ఎటులేగిన యశుద్ధతయే
   ఎచ్చట గాంచనైతి రక్షకుని - నీవే రక్షకుడవు

3. తిరిగితి నే లోకమంతయున్ చేరితి - నే నీ ద్వరము నొద్దన్
   నా ప్రాణ యాధారంబు నీవేగా - నా ప్రభు చేర్చుదారిన్

4. కార్చితివేసు రక్తమునాకై - చేర్చితి వేసు తండ్రితో ప్రేమన్
   నిత్యపురము నన్ను జేర్చితివి - నిత్యజీవ మిచ్చితివి
424 రక్షణ నొసగుము ప్రభువా పాపికిrakshana nosagumu prabhuvaa paapiki

Luke 18:13

పల్లవి:
రక్షణ నొసగుము ప్రభువా  - పాపికి (2)

1. పుణ్యకార్యములు నే చేయలేదు (2)- పాపినై వ్యర్థుడనైతిన్ (2)

2. పాపరోగముచే తల్లడిల్లితిని - మరణ పాత్రుడనైతిన్

3. నీ వంటి వైద్యుడు నాకికలేడు - పాపికి స్వస్థతనియ్యన్

4. గొప్ప శక్తిగల ఓ నాదు ప్రభు - పాపిని దయగను ప్రభువా

5. పాపుల మిత్రుడా పరమ రక్షకుడా - పాపిని మొఱ నాలించు
425 నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుముnenu ghorapaapini cheri veduchuntini kshaminchumu

Psalms 51:5

పల్లవి:
నేను ఘోరపాపిని (2) - చేరి వేడుచుంటిని క్షమించుము (2)

1. ఆదాము హవ్వలందున ఏదేనులో నే పొందిన (2)
   ఆది దోషము అంటియుండెనయ్య - దాని నిర్మూలించు మేసయ్యా (2)

2. నా తల్లి గర్భమందున అవతరించుట తోడనే
   పాపము తోడనే పుట్టితి నేసయ్యా - దాని పరిహరింపుము

3. నా యపరాధము చేతను నే జేసిన పాపమందున
   సత్యములేక నేజచ్చిన వాడను - ననుజీవింపచేయు మేసయ్యా

4. పాపములు దాచుకొంటిని శాపమును గూర్చుకొంటిని
   ఆపద గుర్తించ లేక నే గడిపితిని - దాపు జేరితి ప్రాపునీయుము

5. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకను
   పచ్చిపుండ్లు గాయములతో నేసయ్యా - వచ్చి నీ ప్రాపున జేరితి

6. లోకానంద యంద మందున వీకతో వీక్షింపనేగితి
   దావీదువలె బెత్షెబా బారిలో నుంటి - దేవా విమోచించు మేసయ్యా

7. ఎన్నెనోమార్లు నీ సన్నిధిన్ నేను విడిచి ఏతెంచితి
   యోనావలె మీనాగర్భములో నుంటి - నన్ను నీదరిజేర్చు మేసయ్యా
426 ప్రభువా నన్ను కరుణించుముprabhuvaa nannu karuninchumu

Luke 18:13

పల్లవి:
ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని  (2)
పాపిని , పాపిని నే ఘోర పాపిని (1)

1. లోకాశకు లొంగిపోయి - పడిపోయిన పాపిని (2)
   ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని (2) - నే ఘోరపాపిని (1)

2. అన్యజనుల ఆచారముల - నభ్యసించి చెడిపోతిని
   ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని - నే ఘోరపాపిని

3. నీ వాక్యమును త్రోసివేసి - దుష్కార్యములు - చేసితిని
   ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని - నే ఘోరపాపిని

4. శరీరాశ, నేత్రాశను - పాపేచ్ఛను గల్గియుంటి
   ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని - నే ఘోరపాపిని

5. నారక్షకుడా యేసు నాథా - నన్ను నీవు రక్షించితివి
   నిన్నే నిత్యము పూజింతును - సేవింతు నిరతము - సేవింతు నిరతము
   సేవింతున్ పూజింతున్ - నిరతము సేవింతున్
427 జీవపుదాత నా హృదయములోనికి రాjeevapudaata naa hrudayamuloniki raa

Psalms 51:10

పల్లవి:
జీవపుదాత నా - హృదయములోనికి రా (1)
నూతన వెలుగు నూతన యనుభవ మందరికి నిమ్ము (2)

1. నూతన జన్మమును మా కొసగి - నూతనముగ మము చేయన్ (2)
   నూతన ఆత్మ హృదయము నిమ్ము - నిను నే స్తుతియింపన్ (2)

2. నూతన వ్యక్తిగచేయుము ప్రభువా - లోకము చూచునట్లు
   నూతన వస్త్రాహారము లిచ్చి - సుందరునిగ చేయుము

3. నూతన వాక్కులను మాకొసగి - నూతన గీతము నేర్పు
   నూతన రాగమును మా కొసగి - నిత్యము స్తుతి పొందుము

4. నూతన శక్తిని అందరికొసగి - నూతన మార్గము జూపు
   నీదు మహిమ కొరకై నాకు - నూతన నడకను నేర్పు

5. నూతన పాత్రగను ననుజేసి - నీదు మహిమతో నింపు
   నూతన ఆయుధముగ మముజేసి - శత్రువును ఓడించు
428 విడువవు నన్నిక ఎన్నడైననుviduvavu nannika ennadainanu

Psalms 145:14

పల్లవి:
విడువవు నన్నిక ఎన్నడైనను - పడిపోకుండా కాయురక్షకా (2)
పడిపోవు వారెల్లరిని - లేపెడి వాడవు నీవే ప్రభూ (2)

1. ప్రభువా నీకవిధేయుడనై - పలుమారులు పడుసమయములో (2)
   ప్రేమతో జాలి దీనస్వరముతో - ప్రియుడా నను పైకెత్తితివి (2)

2. ఆదాము హవ్వలు ఏదేనులో ఆశతో ఆజ్ఞమీరినను
   సిలువకు ఛాయగ బలి నర్పించి - ప్రియముగా విమోచించితివి

3. మోషేకు నీ దర్శనమిచ్చి - నీ ప్రజలను నడిపించుటకై
   సాకులు చెప్పిన విడువక తననే - నాయకునిగ నియమించితివి

4. స్వంత తలంపున దావీదు - మందసమును తెచ్చునప్పుడు
   ఉజ్జా మరణముచే దావీదు - హృదయమును కదిలించితివి

5. నీ మాటలు వినక యోనా - తర్షీషుకు తరలినపుడు
   సముద్రములో మునుగుచుండగ - చేపద్వారా దరిచేర్చితివి

6. నిన్నెన్నడు యెడబాయనని - నిక్కముగ పేతురు పలికె
   ముమ్మారు బొంకినను విడువక - ప్రేమతోను రక్షించితివి

7. మా శక్తియు మా భక్తియు కాదు - ఇలలో జీవించుట ప్రభువా
   కొల్లగ నీ యాత్మను నొసగితివి - హల్లెలూయ పాడెదను
429 పాపిని నేను తప్పితిpaapini nenu tappiti

Matthew 14:31

పల్లవి:
పాపిని నేను తప్పితి - భువిలో రక్షించెడి వారెవరు (1)
ఓ ప్రభు యేసు నిరీక్షణతో - నీ దరికి జేరితిని (2)

1. ప్రభువా పాపిని రక్షించుటకు - ఈ భువి కరుదెంచితివి (2)
   దౌర్భాగ్యుడను వేడితి శరణం - వేరేమి చేయలేను (2)

2. జీవము నివ్వ వచ్చితివి - చచ్చి యుంటి నేను
   బంధింపబడితిని మరణ బంధముతో - విడిపించెడి వారెవరు

3. జన్మముతోనే అపవిత్రుడను - నా స్వభావమే
   క్రియలలోను మాటలయందు - నీకు విరోధినైతిని

4. స్వంత నీతితో నిండిన పనులు - మరి పుణ్య కార్యములు
   ఆచారములతో చిక్కుకొన్నాను - తప్పించెడి వారెవరు

5. భరియించితివి పాపపు శిక్ష - ప్రాణమిచ్చితివి నాకై
   రక్తము కార్చి సర్వమిచ్చితివి - నన్ను రక్షించుటకై

6. ఓ ప్రభు యేసు దయాళుడ వీవు - కృంగివచ్చుచున్నాను
   నా పాపములు క్షమియించు ప్రభువా - గొప్ప రక్షణకర్త వీవే
430 నేడు నే నారక్షకుని నామదిలోnedu ne naarakshakuni naamadilo

Psalms 32:1

పల్లవి:
నేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను (2)
సమాధాన సంతోషము అనుభవించితి నేను 2నేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను (1)

1. ప్రభువాక్యము నా పాపముచూపె (2)- హృదయము విరిచె ఆయన ఆత్మ (2)
   గ్రుచ్చబడి నేను ఒప్పుకొంటిని (2)- కోరితి రక్తము మదిలో (2)

2. ప్రభు నాపాపము చూపించగానే - ఒప్పుకొంటిని కప్పుకొనక
   విశ్వాసముతో కన్నీటితో - ఒప్పుకొనగ క్షమియించె

3. పడమటికి తూర్పెంత దూరమో - నా పాపమునంత దూరపర్చితివి
   సముద్ర అగాధములలోన - నా పాపము పడవేసె

4. మిక్కిలి శ్రమలో నెమ్మదికలిగె - నాశన గోతిలో నుండిలేపి
   నీ వీపువెనుక నా పాపములు - పారవేసితివి వీవు

5. తుడిచితిననె ప్రభు నా పాపములు - జ్ఞాపకముంచుకొననని చెప్పె
   మంచు విడిచిపోయినరీతి - నా పాపము తొలగించె
431 నాకై చీల్చబడ్డయో నాయనంతనగమాnaakai cheelchabaddayo naayanantanagamaa

Isaiah 26:4

1. నాకై చీల్చబడ్డయో - నాయనంతనగమా - నీలో దాగియుందును
   జెన్నుమీర బారెడు - రక్తజలధారలా - శక్తి గ్రోలగా నిమ్ము

2. నేను నాదుశక్తిచే - నిన్ను గొల్వజాలను - కాలమెల్ల నేడ్చినన్
   వేలకృతుల్ చేసినన్ -నేను చేయు పాపము - నేనే బాపజాలను

3. వట్టిచేయి చాచుచున్ - ముట్టి సిల్వ జేరెదన్ - దిక్కులేని పాపిని
   బ్రక్కజేర్చి బ్రోవుము -నా కళంకమెల్లను - నాథా నీవె బాపుము

4. ఈ ధరిత్రియందున - నేఱు దాటునప్పుడు - నాదరించి నీకడన్
   నాకై చీల్చబడ్డయో - నాయనంత శైలమా - నన్ను చేరదీయుమా
432 ఓ యేసు రక్షకా నీ పిల్పు విందునుo yesu rakshakaa nee pilpu vindunu

Psalms 51:7

1. ఓ యేసు - రక్షకా - నీ పిల్పు విందును
   కల్వరిపై నా పాపము నివృత్తిచేసితి

పల్లవి:
యేసు - వచ్చెదన్ - నన్నుచేర్చుము
నన్ నీ రక్తమందున - శుద్ధుని జేయుము

2. నేనైతే పాపిని - నీవే నా ప్రాపవు
   నా దోష మెల్ల కడిగి - పవిత్రపర్చుము ||యేసు||

3. ఆశక్తుడనౌ నన్ - నీవే స్థాపించుము
   విశ్వాస ధైర్యబలముల్ - నాలో పుట్టించుము ||యేసు||

4. యేసూ - విమోచకా - యేసు మా శరణు
   యేసూ - మా దైవధ్యానము - నీవే మా రాజువు ||యేసు||
433 ఉన్నట్టు నేను వచ్చెదన్ పాపినైన నన్ పిల్వగన్unnattu nenu vachedan paapinaina nan pilvagan

Psalms 51:7

1. ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపినైన నన్ పిల్వగన్
   నీ నెత్రుచేత గడుగుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా

2. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నే నొప్పుకొందు దప్పులన్
   నీ మాటలతో హరించుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా

3. ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధపర్చగన్
   పాపంబు బాయ నీయొద్ద - యో గొఱ్ఱెపిల్ల దేవుడా

4. ఉన్నట్టు నేను - వచ్చెదన్ - కబోధినై నేనుండగన్
   ఆత్మీయ దృష్టి నీయుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా

5. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టి నన్
   మన్నించి చేర్చుకొనయా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా

6. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను పిల్వగన్
   నీవాడనౌదు సర్వదా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
434 ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడుaakaashamu bhuvilo nella yesu unnatudu

Acts 4:12

1. ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడు
   మనుజులు దూతలు దయ్యాలు యేసుకు మ్రొక్కెదరు

పల్లవి:
నే నమ్ముదు - నే నమ్ముదు యేసు నాకై మరణించెనని
పాపంబు పోవ సిలువలో రక్తము చిందెను

2. రక్షకుడు ప్రాణముబెట్టినది నా కొరకే
   వేరేమి వాగ్వాదంబులు అక్కరయే లేదు ||నే ||

3. ప్రతిపాపి భయమంతయు తీర్చు నామమిదే
   నరకదండన యంతయు తొలగించు నామము ||నే ||

4. పాప సంకెళ్ళు అన్నియు విడగొట్టును యేసు
   సాతానువ్రాని తలను యేసు చితుక గొట్టెన్ ||నే ||

5. పాపంబులో మరణించెడి వారికి ప్రాణమిడున్
   బలహీనమైన ఆత్మలకు శక్తి నిచ్చును యేసు ||నే ||
435 పాపభారము దుష్టగుణ సమేతుండనైpaapabhaaramu dushtaguna sametundanai

Galatians 1:4

1. పాపభారము దుష్టగుణ సమేతుండనై
   దుఃఖనష్ట దౌర్జన్యముతో నుండ (1)
   చిన్న స్వరము వినబడె నన్ను పిలుచునట్లుగా (1)
   రమ్ము పొందు నాదుసిల్వ విశ్రాంతి (1)

పల్లవి:
సిల్వలో సిల్వలో - పాపమెల్ల బోయె సిల్వయందున (1)
భారమెల్ల వీడెను - రాత్రి పగలాయెను - కనుగొంటి సిల్వలో రక్షకుని  (1)

2. ఏగుచుందు నిత్యము జీవమును బొందను
   సిల్వలో కృపశక్తి పొందుదున్
   శోధనలు వచ్చిన జయ మొందుచుందును
   మోకరించి ప్రార్థింతు సిల్వచెంత ||సిల్వలో||

3. జీవితమందు ఏడ్పు బాధ శోధన్లలెల్ల
   ఆత్మసాయముచే సిల్వజూతును
   యేసు పాపికొరకుపడ్డపాట్లు చూడగా
   భారముల మోయుశక్తి పొందుదున్ ||సిల్వలో||

4. భారముచే క్రుంగిన పాపీ నేడే రారమ్ము
   యేసు రక్తమందు నిన్ను కడుగును "
   నిత్యజీవ మిచ్చును నిన్ను సమర్పించుకో
   క్రీస్తు యేసు క్రొత్త శక్తి నిచ్చును ||సిల్వలో||
436 దయగలయేసు పాపికాశ్రయుడాdayagalayesu paapikaashrayudaa

Luke 15:18

పల్లవి:
దయగలయేసు పాపికాశ్రయుడా -
ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము (2)

1. ఓ ప్రభూ నీకు విరోధముగా పాపము చేసిన దురితుండను (2)
   నీచుడనై నిన్ను వేధించితిన్ ఓ నాథా పాపిని క్షమించుము (2)

2. లోకాశలన్నియు శోధించగా నా కాయమంతయు క్షీణించెను
   నా కాశ్రయంబు నీవే ప్రభూ ఓ నాథా పాపిని మన్నించుము

3. నా ధనము ఘనము నా సర్వము నా దేవా పాపముకై వ్యయపరచితిన్
   ఓ దేవా నేను రిక్తుండను నా దురితంబులను బాపుమా

4. అందరు నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరి
   అందరు నన్ను విడువంగను నా తండ్రీ నా కాశ్రయంబిమ్ము

5. మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరియైనది
   నీ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు ఓ యేసువా

6. ఈ నాడే నీ మాట నేవిందును ఎన్నడు నిన్ను విడువను
   ఈ నాడే నన్ను క్షమించుము నా పేరు గ్రంధమందు వ్రాయుము
437 సంఘమొక్కటే, సార్వత్రిక సంఘమనెడి సంఘ మొక్కటేsanghamokkate, saarvatrika sanghamanedi sangha mokkate

John 17:21

పల్లవి:
సంఘమొక్కటే (1)  - సార్వత్రిక (2) - సంఘమనెడి సంఘ మొక్కటే (1)

అను పల్లవి:
శిరస్సు నొకటే శరీర మొకటే - నిత్యశక్తి గల్గినట్టి సంఘమొక్కటే (2)

1. యే నరుని పేరులేని సంఘమిది (2)
   యే సిద్ధాంతపు పేరులేని సంఘము (2)
   స్థానదినముల పేరు లేనిదిది - ఏలాటి పేరు వహించనియట్టి (1)

2. యూదులని హెల్లేనీయులని లేదు
   సున్నతిపొందియున్న లేకున్నను
   దేశీయుడు పరదేశీయని లేదు
   స్వాతంత్య్ర దాస్య స్త్రీ పురుషుడని లేని

3. ఆత్మైక్యమను యేడు పేటలత్రాడు
   ఈ తటిచే సంఘము కట్టబడెను
   ఇట్టి జీవముకల్గి లోకమునకు - వేరైన జీవము జీవించుచున్నట్టి

4. సంఘమే శరీరం శరీరమే సంఘం
   దివ్య దృష్టాంతములతో నిండినది
   దేవుని ఇల్లాయన నివాసస్థలం - నవీన వరుడు రాజనగరము ఇల్లు

5. ఇంటికి పునాది ఆధారమైనట్లు
   ద్రాక్షవల్లిలో తీగెలు నిల్చునట్లు
   నర శరీరమునకు తలవలె - భార్యకు భర్తవలె క్రీస్తునుగల

6. సార్వత్రిక సభను కానగ లేని
   కారణాన సైతాను కలవరమునొందె
   స్థల సంఘము ద్వారా సార్వత్రికమైన
   సంఘమునుజూప వీలగు నిజము

7. మరుజన్మ మొందినవారే యీ సంఘము
   అసమాను డేసుడే యద్దాని శిరము
   యోగ్యముగా నైదుసేవల జేతుము
   ముదమున పాడుము యేసుకు హల్లెలూయ
438 పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజుparishuddha shree yesuve paralokaraaju

Daniel 4:32

పల్లవి:
పరిశుద్ధ శ్రీ యేసువే - పరలోకరాజు
మురియుచు నే పూజింతును - నిరతము - పరిశుద్ధ శ్రీ యేసువే (1)

అను పల్లవి:
పరలోక మహిమనుండి - నరుల రాజ్యములలో (2)
నిరతము తన పాలనము జరిగించుచున్నరాజు (2)

1. పెనూయేలు పోరాటంబున - పోనివ్వనంచు -
   పెనుగునందున యాకోబు - వినయమున (2)- పెనూయేలు పోరాటంబున (1)
   నన్ను దీవించు తండ్రీ - నిన్ను నే విడువనంచు (2)
   కన్నీటితో వేడగా - ఘనత ఇశ్రాయేలనియె (2)

2. ఈ దినమున నుండి - పదిలముగ -
   ముదముగ దీవింతుననెన్ - ఆదరణకర్త - ఈ దినమున నుండి
   తుదిమందిర పునాదిపై - కదలక నిలుచువారిన్
   కదలని నా పునాది - యూదాగోత్ర సింహంబు

3. సీయోనులోనుండి - ప్రియుడైన యేసు -
   కాయుచు నిను దీవించును - ఆయన త్రోవన్ - సీయోనులోనుండి
   పాయక నిన్నెప్పుడు - పరిపాలించు చుండును
   రయమున నిన్ను జేరి - సాయంబు చేయుచుండు

4. జయించుచున్న వానికి - మరుగైన మన్నా
   ప్రియమున భజియింపనిచ్చున్ - జయశాలి- జయించుచున్న వానికి
   వ్రాయబడిన క్రొత్తనామ మున్నట్టి తెల్ల
   రాయినొసంగి వాని భయము తొలగించు జయము "

5. నడిపించుచుండె నిత్యము - తన దృష్టి నిలిపి
   విడువకుండగ నీ ప్రభు - కడవరకు - నడిపించుచుండె నిత్యము
   ఎడతెగని తనదు ప్రేమ - కనుపరచి తృప్తిపరచి
   చెడుగునెల్లను బాపి - తన యడుగు జాడలలో

6. బలము నారోపించుము - బలమిచ్చు ప్రభువు -
   సిలువలో నీకై సమసెను - సీయోను - బలము నారోపించుము
   గెలిచె సమాధినుండి - బలముతో తిరిగిలేచె
   ఎల్ల మేలుల తలచి - హల్లెలూయ పాడెదము
439 జయించువాడు దేవకుమారుడుjayinchuvaadu devakumaarudu

Revelation 21:7

1. జయించువాడు దేవకుమారుడు - భయము చెందక యుండుడి (2)
   సర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును - సర్వ దేవుని వాక్కిదే (2)

2. ఆది ప్రేమ వీడిన ఎఫెస్ సంఘమా - అదియే నీ కొఱత
   జయించిన నీవు జీవఫలములను - ప్రియముగ భుజియింతువు

3. శ్రేష్ఠతమగు స్ముర్నా సంఘమా శ్రమలను నే మరువన్
   జయించిన నీకు రెండవ మరణము భయపడి హానిచేయదు

4. పెర్గము సభ నీ బోధయు తప్పుడు - మార్గముల నెరుగుదున్
   జయించిన మరుగైన మన్నా క్రొత్త పేరు తెల్లని రాతినిత్తున్

5. తుయతైర సభ నీశక్తి నెరుగుదున్ - నీ భయముల నెరుగుదున్
   జయించిన జనులపై నధికారమిత్తున్ - వేకువ చుక్కనిత్తున్

6. సార్థిస్ సభ నీ చావు నే నెరుగుదు - త్వరలోన స్థిరపడుము
   జయించిన నీకు తెల్లని వస్త్రము - లిచ్చి నిన్నొప్పుకొందును

7. ప్రియమగు ఓ ఫిలదెల్ఫియ సంఘమా - నీ అశక్యత తెలియున్
   జయించిన స్తంభముగా నుంచి నీకు - క్రొత్త నామము నిడుదున్

8. లవొదికైయ సభ నీ లక్షణముల - దౌర్భాగ్యత తెలియున్
   జయించిన నిన్ను సింహాసనమున - నాతో కూర్చుండనిత్తున్

9. జయమొందు విధమున తెల్పితి నిందు - జయించువారి భాగ్యము
   అపజయమును పొందు విధమును దెల్పితి - నీవెటు నిల్చెదవో
440 సీయోనుపట్టణమా సువర్ణ నగరమాseeyonupattanamaa suvarna nagaramaa

Zechariah 9:9

1. సీయోనుపట్టణమా - సువర్ణ నగరమా (2)
   మహిమాపురమా - మహా భాగ్యము నీదే (2)
   రమ్యమైనట్టిరా - రాజుపురమా (2)

2. సీయోను సుందరులు - సువర్ణ సములు
   వన్నెపగడాల ఛాయ - కన్న గొప్పది
   కాంతి నీలములకన్న - మంచిది (2)

3. ప్రభువే నిన్ను కోరి - ప్రేమించినాడు
   సర్వోన్నతుడే నిన్ను - స్థిరము జేసెను (2)
   నిత్యనివాసముగ - నిను జేసెను (2)

4. తన చంటిపిల్లను - తల్లి మరచునా
   మరచినగాని నేను - మరువను నిన్ను
   చెక్కితిని నిను నా యర - చేతుల మీద

5. భయమేల సీయోను - బలమొందిలెమ్ము
   సంతసమున పాట సాహాసమున పాడుడీ
   వసియించు నీ ప్రభువు - వచ్చి నీలో

6. పెండ్లి కుమారుడు - పెండ్లి కూతురును
   చూచునట్లు నిన్ను - చూచి దేవుడు
   సీయోను నీయందు - సంతస మొందున్

7. సీయోను పగవారు - సిగ్గునొందెదరు
   నిన్ను భాదించినట్టి - నీ పగవారు
   పరుగున నీ పాదముల - పై బడెదరు

8. సీయోను నీ నీతి - సూర్య కాంతివలె
   రయమున యేసు నీదు - రక్షణజ్యోతి
   వెలిగించువరకు - విశ్రమించడు
441 సీయోను పురమా సర్వోన్నతునిseeyonu puramaa sarvonnatuni

Psalms 48:2

పల్లవి:
సీయోను పురమా - సర్వోన్నతుని (1) శృంగారపురమా - సీయోనుపురమా (2)

అను పల్లవి:
శాశ్వతముగ దైవ - సంకల్పంబైతివి (2)
స్వర్ణాలంకార సీయోను - సతతము నీదే యనుభవ భాగ్యము (1)

1. షాలేము రాజు సంతోషముగా - సంధించెను నిన్ను (2) - షాలేమురాజు (1)
   అర్పించెను నీలో - అబ్రాహాం కొమరుని (2)
   స్వర్ణాలంకార సీయోను - దావీదు పట్టణమనబడెడు (1)

2. ఉత్తర దిక్కున - ఎత్తయిన -శృంగార నగరమా - ఉత్తర దిక్కున
   సర్వభూమికి - సంతసమిడుచున్నావు
   స్వర్ణాలంకార సీయోను - రమ్యముగా రంజిల్లు నగరమా

3. నీ నగరులయందు - నివసించుచున్నాడు - నీ ప్రభువు - నీ నగరులయందు
   రాజులు కూడిరి - నీ తేజము జూచిరి
   స్వర్ణాలంకార సీయోను - రమ్యముగా రంజిల్లు నగరమా

4. నిత్యుండగు తండ్రి - నీ నిర్మాణకుడు - శిల్పియు తానె - నిత్యుండగు తండ్రి
   ప్రభుయేసే నిన్ను - పరిణయమాడను కోరెన్
   స్వర్ణాలంకార సీయోను - వైవాహికానందము నీదే

5. రక్షణ వార్తలు - రమ్యముగా - నీలో వినబడుచున్నవి - రక్షణ వార్తలు
   జనులెల్ల నీలో - జన్మించెనందురు
   స్వర్ణాలంకార సీయోను - జనముల తల్లియని నిన్నందురు

6. నిండియున్నవి - నీలో దైవోద్దేశము - లెన్నెన్నో - నిండియున్నవి
   ఘన కార్యము లెన్నో - గొప్పగ జరిగెను నీలో
   స్వర్ణాలంకార సీయోను - విభవమును వివరింపగ లేము

7. సొంపుగ పాడుడి - సంతసముగ - సీయోను పాటలను - సొంపుగ పాడుడి
   యేసునకే మహిమ - భాసురముగ చెల్లించి
   స్వర్ణాలంకార సీయోను - హల్లెలూయా - యేసుప్రభునకే
442 ప్రభుయేసు సంఘము నిర్మించుచుండprabhuyesu sanghamu nirminchuchunda

Matthew 16:18

పల్లవి:
ప్రభుయేసు సంఘము నిర్మించుచుండ (2)
గర్విసాతాను జయమొంద లేడు (2)

1. పరలోకమాదిరి నిర్మించుచుండె (2) - నరుని ఆలోచన జరిగింప డిందు (2)
   స్థిరపునాదిపై నిర్మించుచుండె (2) - పరిపూర్ణతను విరివిగా నింపున్ (1)

2. ఆదాముతో కూడ నడిచిన దేవుడు - గుడారమున వసియించినాడు
   సొలొమోనాలయము నింపినాడు - కాలమెల్ల తనయునిలో వసించున్

3. క్రీస్తు ప్రభు దాని స్థిరపునాది - ఇసుక పై వేసిన నశియించునంత
   సజీవుడగు యేసు నిజ మూలరాయి - సజీవరాళ్ళను విజయుడు జేర్చున్

4. నిత్య దేవుని నిజ ఆత్మజులారా - ఆత్మీయంబగు ఆలయము మీరే
   ఆత్మ ఐక్యమును అనుసరించుడి - హస్తకృతంబులు ఆలయమగునా?

5. యూదుడని మరి హెల్లేనీయుడని - లేదు జాతుల భేదము లేమి
   లేదు దాసుడు స్వతంత్రుడని - భేదముండదు స్త్రీ పురుషులని

6. ఏ నామమున లేనిది సంఘము - నామమిచ్చిన యెన్నదగు కీడు
   కనబడు కట్టడములు కలిపి పోల్తుమా - కనివిడిచెదము పొరబాటులను

7. ప్రకటించెదము ప్రాకటముగను - ఏక మనస్సుతో ఏక శరీరమని
   సకల కాలము శక్తితో నిలిచి - పొగడుచు శిరస్సును పాడెద మిపుడె
443 భక్తుల సంఘమే ప్రభుని శరీరముbhaktula sanghame prabhuni shareeramu

Ephesians 1:23

పల్లవి:
భక్తుల సంఘమే - ప్రభుని శరీరము (1)
అందాయన తన - పూర్ణత నింపును (2)

1. ఒక్క శరీరమునకు శిరస్సు నొకటేగా (2)
   సంఘమునకు ప్రభువే శిరస్సుగా (2)

2. శిరస్సునుండే యోచనలు వెలువడును
   శరీరము నందు ప్రకటింపబడున్

3. యూదులని హెల్లే నీయులని లేదు
   దాసులనియు స్వతం త్రులనియు లేదు

4. కలవు శరీరములో అనేకావయవముల్
   కలసి ఏకముగా నివసించుచుండున్

5. కరములు కాళ్ళతో కలహించలేవు
   కలయకనే కార్యమును చేయలేవు

6. ఆత్మైక్యత నవ యవములు కలిగిన
   క్షేమాభివృద్ధిని దేహము బొందున్

7. శిరస్సాధీనములో సర్వాంగములుండిన
   సేవలో ప్రభు పరిపూర్ణత యుండును
444 సంతసిల్లును మీ హృదయాలుsantasillunu mee hrudayaalu

Acts 8:8

పల్లవి:
సంతసిల్లును మీ హృదయాలు (2) - సీయోను మహిమజూచి (2)

1. సుందర వరుడు యేసు ప్రభువు (2) - సుందరవతి సీయోను (2)
   శాశ్వత శోభాతిశయముతో (2) - భాసిల్లుటను జూచి (2)

2. నీలమయ నిత్య పునాదులు - మేలిమి ఛాయామణులు
   సూర్యకాంత సుగంధములు - పుష్యరాగ నిర్మితము

3. నిత్య మహిమతో వెలిగెడు - ముత్యాల గుమ్మములు
   స్వచ్ఛమగు సువర్ణమయము - ఆశ్చర్య నగరము

4. జీవవృక్షము జీవఫలములు - జీవామృతపానము
   కాంతి వంతముగా మెరిసేటి - వింతలుగొల్పు నగరము

5. స్వర్ణ సమము దాని ప్రజలు - సంతోష సహితులు
   దూతలే వింతపడునట్లు - ఖ్యాతిని కలిగిన వారు

6. మందిర సమృద్ధిని వారు - తృప్తి నొందుచున్నారు
   ఆనంద ప్రవాహమునందు - పానము చేయుచున్నారు

7. దేవుడు సెలవిచ్చినయట్టి - దేవో క్తులలో నేది
   జరుగకుండగ పోలేదు - వరుసగా నెరవేరెన్
445 శక్తిగల షాలేమురాజా షారోను రోజాshaktigala shaalemuraajaa shaaronu rojaa

Matthew 16:18

పల్లవి:
శక్తిగల షాలేమురాజా షారోను రోజా - స్తుతియించెదము యేసు (2)

1. పూర్వమున పల్కిన నీ ప్రవచవోక్తులన్ని (1)
   చక్కగను మక్కువతో చేసితివి నీవు - చేసితివి నీవు (1)
   పూర్వమున చూపిన నీ ప్రత్యక్షతలన్ని (2)
   వరుసగను జరిపితివి నిన్ను పోలినవాడు వేరెవ్వరు లేరు (2)

2. బయలు పరచినట్టి నమూనాను పోలి నాడు
   బలముగను నీదు ప్రత్యక్ష గుడారమును - నీ గుడారమును
   కట్టితివి నీ దాసుడై నట్టి మోషే ద్వారా
   నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను

3. షాలేము యెసూషలేములోని ఆలయము
   సొలొమోను ద్వారా కట్టించిన మహారాజా - కట్టించిన రాజా
   ఆలయమును నిర్మించినట్టి మహారాజా
   నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను

4. కాలము సంపూర్ణముగ పరిణమించగానే
   కన్య గర్భమున ప్రభో జన్మించితి వీవు - జన్మించితి వీవు
   కట్టెదను నా సంఘము నని సెలవిచ్చి
   కట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు - నీ ఆలయముగను

5. హస్తకృతాలయములో వసించని నీవు
   వింతగాను మా మధ్యను ఉండగోరినావు - ఉండగోరినావు
   కాంతివంతమైన నీదు మహా మహిమతోనే
   స్వంత వారినంత నింప తీర్మానించినావు - తీర్మానించినావు

6. అక్కడను ఇక్కడ నొక్కొక్కరిని యేరి
   అద్భుతముగను జత చేయువాడ వీవు - చేయువాడ వీవు
   నూతన దంపతులను వింతగా దీవించి
   అంతకంతకు వర్ధిల్ల జేయువాడ వీవే - కాయువాడ వీవే

7. వ్యక్తులను కుటుంబములనుగా మార్చివేసి
   శక్తిగల సంఘ వధువుగ మార్చివేసి - నీవే మార్చివేసి
   వింతగా నా వధువునకు వరుండవై నావు
   ఆంతము లేదహా నీ మహిమ రాజ్యమునకు - హల్లెలూయా ఆమెన్
446 దైవదర్శనమున యాకోబుdaivadarshanamuna yaakobu

Genesis 28:19

1.  దైవదర్శనమున యాకోబు - దివ్యముగను చూచి (2)
ఆ స్థలమునకు బేతేలనియెడి నామమును తానిడియె (2) 
సుస్థిరముగ మన పరమ తండ్రి - వసియించెడి స్థలమిదియె (1) || దైవ||

2. దేవుని నిచ్చెనగు క్రీస్తు దివికి నిలువబడెను  
దేవుని దూతలు దానిపైని ఎక్కుచు దిగుచున్నారు  
దేవుని మందిర మిదియె కాని వేరే స్థలమిదికాదు || దైవ||

3. నిశ్చయముగా నీ స్థలమందు - నిలిచి యుండె నెహోవా  
ఆశ్చర్య పరలోకపు గవిని రక్షణ బొందగ రారే  
విశ్రాంతి దేవునికి కలుగు - పాపికి భయంకరము || దైవ||

4. ఉన్నత స్థలముల నెక్కించి ఆనందింప జేసి  
అనుభవమునందు యాకోబు - స్వాస్థ్యము నొసంగి  
ఐగుప్తు యవమానమును దొరలింపజేయును || దైవ||

5. పర్వతములు తత్తరిల్లి తొలగిపోయినను  
సర్వదా తన కృపతోడై - నిన్ను నడిపించును  
పూర్వమందు పలికిన మాటల - నిర్వహించును నీలో || దైవ||
447 ఇమ్ముగ నీ సు దినంబు నుండి మిమ్ము నాశీర్వాదించెదనుimmuga nee su dinambu nundi mimmu naasheervaadinchedanu

Haggai 2:19

పల్లవి:
ఇమ్ముగ నీ సు - దినంబు నుండి మిమ్ము నాశీర్వాదించెదను
పొమ్మనిన ఓ మా ప్రభువా (2)

1. మునుపటి మందిర - మహిమను మించు - కడపటి మంది-ర మహిమ (2)
   ఈ స్థలమందు నా సమాధానం (2)
   ఎంతైన నిచ్చెద నంటివి ప్రభువా (2)

2. అన్యజనులను కదిలింపగానే - అన్ని వస్తువులు తేబడును
   వెండి బంగారము అన్నియు నావే
   దండిగ నిచ్చెద నంటివి ప్రభువా

3. ఇంపుగ తొమ్మిదవ మాసమున - ఇరువది నాల్గ - వ దినము
   నీ మందిర ఆ-స్థి భారమును
   నీ వాజ్ఞాపించి - వేయించితివి

4. నీ ఆజ్ఞలను - శిరసావహించి - దివ్యంబుగ నా-బ్రాహాము
   హెబ్రోనులో గు-డారంబు వేసి
   కట్టెను బలిపీ-ఠము నాచోట

5. నిండు మనస్సుతో - కాలేబు నిన్ను - దండిగ ననుస-రించగ
   హెబ్రోనును తన - స్వాస్థ్యంబుగను
   సంభ్రముగ నొ-సంగినదాత

6. దావీదు రాజు - నీ సన్నిధిలో - దీనతతో మన-వి చేయ
   హెబ్రోను పొమ్మని - సెలవిచ్చితివి
   ప్రభో కలుగు నీకు నిత్యమహిమ

7. ఎల్లల నెల్ల - విశాల పరచి - కొల్లగ ప్రేమను - జూపి
   ఎల్ల శక్తిని - జూపిన ప్రభో
   హల్లెలూయ నీకే - యేసు ప్రభో
448 సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవేsarva shaktuni vaakku idiye samastamunu meeve

1 Cor 3:21

పల్లవి:
సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే (2)

1. పౌలుయైన అపొల్లోయైన - కేఫాయైనను (2)
   లోకమైన యేమియైన (2) - సర్వమును మీవే (1)

2. జీవమైన మరణమైన - రాబోవునవైన
   ప్రస్తుత మందున్న వైన - సర్వమును మీవే

3. దైవ వ్యవసాయంబు గృహము - దివ్యముగ మీరే
   అగుటవలన - ననర్గళముగ - నన్నియును మీవే

4. దివియు భువి స-ర్వాధి కారము - దైవ దీవెనలు
   సంఘ సంపూర్ణతయు మీదే - సర్వమును మీవే

5. నీరుకట్టిన తోటవలెను - నీటి యూటవలె
   పచ్చని తరులై ఫలించి - ప్రబలుటయు మీవే

6. జయమునొంది సర్వమును స్వతంత్రించుకొని
   దేవుని కుమారులగుట - దినదినము మీదే

7. పావనసభ వాగ్దానము - పుత్రశ్లాఘ్యము
   క్రొత్తసృష్టిలోని భాగ్యము - సర్వమును మీవే
449 సీయోను వాసులారాseeyonu vaasulaaraa

2 Peter 1:4

పల్లవి:
సీయోను వాసులారా

అను పల్లవి:
సకల వాగ్దానములు మనవాయెను (2)
సాగిలపడి యేసుని ఆరాధించెదము (2)

1. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో (2)
   దాని నివాసులుగా మనలను దీవించెన్ (2)

2. సంతోషించుము దేశమ భయపడవలదు
   గంతులు వేయుము ఘనకార్యములను చేయున్

3. పచ్చిక మొలచును ఫలియించును మరి తరులు
   ఫలియించును ద్రాక్ష అంజూరపు చెట్లు

4. తొలకరి కడవరి వర్షము విస్తారముగా
   తనదు నీతిని బట్టి మనకొసగును

5. కొట్లు ధాన్యముతో నిండి పొర్లును
   క్రొత్త తైలము ద్రాక్షరసము పారును

6. పసరు గొంగలి చీడపురుగులు మిడుతల్
   నాశనముచేసిన పంటను మీకొసగును

7. సర్వ శరీరులపై తన ఆత్మను పోసి
   స్వప్నముల దర్శనముల మీ కొసగును

8. సీయోను వాసులు సిగ్గునొందరు
   శేషము నిలిచి వాసము చేతురు ప్రభులో

9. ఆ దినమున యెహోవా నామమునందు
   ప్రార్థించు వారు రక్షణ నొందెదరు
450 గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండిgorrepilla vivaahotsava samayamu vachenu randi

Revelation 19:7

పల్లవి:
గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2)

1. సర్వాధి కారియు - సర్వోన్నతుండైన (2)
   మన తండ్రిని ఘనపరచి - మన ముత్సహించెదము (2)

2. సిద్ధపడెను వధువు - సుప్రకాశము గల
   నిర్మల వస్త్రములతో - నలంకరించు కొనెన్

3. పరిశుద్ధుల నీతి - క్రియలే యా వస్త్రములు
   గొఱ్ఱె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు

4. తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు
   నమ్మకమై యున్నట్టి - పెండ్లి కుమారుడు

5. దేవుని వాక్యమను - నామము గలవాడు
   రక్తములో ముంచిన - వస్త్రమున్ ధరియించె

6. ప్రేమించి సంఘముకై - ప్రాణంబునిడె ప్రభువుపరిశుద్ధ పరచుట కొరకై - తానప్పగించుకొనెన్

7. శ్రీ యేసు క్రీస్తుండే - సంఘంబునకు శిరస్సు
   వాక్య ఉదకముతోడ - శుద్ధిపరచుచుండె
451 ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడుaatma mandiramunu prabhu kattuchunnaadu

1 Peter 2:5

పల్లవి:
ఆత్మ మందిరమును - ప్రభు కట్టుచున్నాడు
ఆత్మ నియమముతో - నిర్మించున్  (2)

1. మందిర దర్శన - మాత్మకు నిచ్చి - ఆత్మ ద్వార నే - కన పరచున్ (2)

2. ఆత్మ జీవముతో - నిర్మించబడును - నిండు జీవముతో - దృఢ మగును

3. ఆత్మైక్యముతో - నిర్మించబడును - ఆత్మతో నపుడే - నింపబడున్

4. ఆత్మీయ సేవను - ఆత్మసేవకులన్ - ఆత్మ మందిరములో - ప్రభు కోరున్

5. ఆత్మీయ బలులను - అర్పించు నపుడే - ప్రభు మనసు సంతృప్తి పడున్

6. ఆత్మ మందిరములో - లోక శరీర - ఆశయములకు - పాలులేదు

7. ఆత్మ మందిరములో - అన్నియు నుండిన
   లోకము జీవముతో - నిండున్
452 ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురుprabhu dayacheyu nitya deevenalu beraakaalo chooturu

2 Chronicles 20:26

పల్లవి:
ప్రభు దయచేయు - నిత్య దీవెనలు బెరాకాలో చూతురు (2)

1. కీడు, యుద్ధము, తెగులు, కరువైనను - దాడి చేయబూని విజృంభించి నపుడు (2)
   నీవు మొరపెట్టిన నీకు దొరుకు - నిజముగా - రక్షణ (2)

2. శత్రు శోధనలు పై బడినప్పుడు - శక్తిహీనులమై పోయినప్పుడు
   క్రీస్తు దయచేయు నిత్యాదరణ - నిజముగా - చూతురు

3. ప్రభు యుద్ధము చేయు నాయకుడు - ప్రభు పక్షమందు చేరుము యీనాడే
   నీవు పొందెదవు బెరాకాలో - నిజముగా - జయము

4. పలువిధ శ్రమలందు చేరుమా - ప్రీతిమీర మిమ్ము దరిచేర్చును
   నీతియుక్తముగా స్తుతించుము - ఖ్యాతితో ప్రభుని

5. నిత్యదేవుని మహాకృప నిరతం - శత్రువును జయించును నిశ్చయం
   కృతజ్ఞతా స్తుతులు మీరు - నిత్యముగా చెల్లించుడి

6. స్వరమండల సితారా వాయించుడి - శత్రువులతో ప్రభు పోరుసల్పెను
   బెరాకాలో ప్రభు స్వరమెత్తి - మరి మరి - పాడుడి

7. పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది - భూరాజులు గడగడ వణికిరి
   తన ప్రజలను సంతోషపరచును - హల్లెలూయ - పాడుడి
453 నిర్మింపబడితిమి మనము దైవగృహముగాnirmimpabaditimi manamu daivagruhamugaa

Eph 2:22

పల్లవి:
నిర్మింపబడితిమి మనము దైవగృహముగా (2)
తన కృపచే స్థిరపరచబడితిమి (2)

1. కార్చెను యేసు రక్తము మనకై - కూర్చెను సంఘముగా (2)
   కృతజ్ఞతలు చెల్లించెదము - మనప్రభు యేసునకే (2)

2. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే
   పూజనీయుని పూజించెదము - మనసార మనము

3. పరదేశులమై యున్న మనల - తన ఇంటికి జేర్చె
   ప్రాపుగ మనము ప్రస్తుతింతుము - భక్తపాలకుని

4. తన కార్యమును మనలో జేసి - తన సేవకు పిలిచె
   తనివి తీరగ స్తుతులర్పింతము - వినయముగా మనము

5. సంఘంబునకు శిరస్సైయున్న శ్రీ యేసు ప్రభునే
   సర్వకాలము జయశబ్దముతో - సన్నుతించెదము
454 స్తుతించుము స్తుతించుముstutinchumu stutinchumu

Eph 2:20 ; Rev 19:16

పల్లవి : స్తుతించుము స్తుతించుము
ప్రభుయేసు రారాజని

1. యెరూషలేమా తెరువుము ద్వారము
రాజు నీలో ప్రవేశించును
అడ్డుపరచక నేడే రమ్మనుము
ప్రభుయేసు నీకు రాజాయెను
|| స్తుతించుము ||

2. ఎందుకు నీవు దారి తొలగితివి
పిలచెను నీ రక్షకుడు
దూరమునుండక తృణీకరింపక
అంగీకరించుము నీ రాజుగా
|| స్తుతించుము ||

3. మారు మనస్సును పొందుమనే
ప్రభు తన రాజ్యమునకు చేర్చను
రాజు యేసుని స్వీకరించుము
నీ హృదయమునకు రాజాయనే
|| స్తుతించుము ||

4. యేసురాజు యిల్లు కట్టుచున్నాడు
సౌందర్యమైనది ఆ గృహము 
మచ్చునుబోలి కట్టుచున్నాడు
ఆయనే ప్రభువు రారాజు
|| స్తుతించుము ||

5. సజీవరాళ్ళతో కట్టుచున్నాడు
ఆత్మద్వారానే చేయుచుండె
యాజకులముగా పూజింతమెప్పుడు
స్తుతికి యోగ్యుడు - మన ప్రభువే
|| స్తుతించుము ||

6. దైవ నివాసస్థలమౌనట్లు
కలసి నిర్మింపబడితిమి
యేసు ప్రభుని నైపుణ్య హస్తము
నిర్మించె నిల్లు పూర్ణముగ
|| స్తుతించుము ||
455 ఈ సంఘపు బునాది క్రీస్తేసాధీశుడేee sanghapu bunaadi kreestesaadheeshude

1 Cor 3:12

1. ఈ సంఘపు బునాది - క్రీస్తేసాధీశుడే
   దక్కించె యేసు దీని - వాక్కాపుల్ రెట్టించే
   పై నుండి వచ్చి యేసు - పెండ్లాడె నీమనే
   కోరుచు రక్తమిచ్చి - కొనె నీ కన్యనే

2. ఒక్కడే దేవుడిందు - ఒక్కటే మార్గము
   ఒక్కటే జన్మ మిందు - ఒక్కటే సత్యము
   ఒక్క ప్రసాదమిందు - ఒక్క కష్టంబులే
   నిరీక్షణొక్కటిందు - నిరంత ప్రాప్తికే

3. అసత్య మార్గమంచు - ననేకుల్ నవ్వినన్
   విభాగమై శ్రమంబుల్ - విశేషమొందినన్
   సుభక్తుల్ వేడ్రుచుంద్రు - అభయకాంతికై
   యా నిందలెల్ల బోయె - నానంద నాటికై

4. కఠిన దుఃఖ బాదల్ - కలిగిన నోర్చుచు
   విభవానంద ప్రాప్తి - లభింపగోరుచు
   ఆ స్వర్గ పంక్తిజేరి - యానంద మొందుచున్
   యీ సంఘ మేసు గూడి - విశ్రాంతి బొందును
456 దేవపట్నమా? సీయోను నీ మహాత్య మాడితంdevapatnamaa? seeyonu nee mahaatya maaditam

Psalms 87:3

1. దేవపట్నమా? సీయోను - నీ మహాత్య మాడితం
   ఆడితప్పనట్టివాడు - చేసే నిన్ స్వదేహము
   గుట్టమీద గట్టబడ్డ - నిన్ గదల్తు రెవ్వరు
   రక్షణంపు గోడలున్న - త్రుంచవచ్చు శత్రులన్

2. శాశ్వతంపు బ్రేమసూరు - జీవ వారి జూడుము
   వాంఛితంబు లిచ్చినీదు - లేములన్ని బాపును
   ఎప్డుపారునె రిటుండ - దప్పిగూరు నెవ్వడు
   నిత్యమా కృపాఝరంబు - క్రీస్తుదాత బోలు

3. నే సీయోను వాసినైతి - నేని క్రీస్తు సత్కృపన్
   బాడుకొందు నీదు ప్రేమ - భూమి గేళిచేసినన్
   ఐహికంబు సుఖంబు - లన్నియు యస్థిరంబులు
   నిత్యసౌఖ్యమిచ్చు స్వాస్థ్యమే - సీయోను బిడ్డలు ఆమెన్
457 ఓ పావనులారా మీరు విశ్వాసంపుo paavanulaaraa meeru vishvaasampu

2 Timothy 2:19

1. ఓ పావనులారా - మీరు విశ్వాసంపు - పునాది యెంతెంతో - స్థిరమైనది
   శ్రేష్ఠంపు వాక్య - మా కందము నిచ్చున్ - శ్రీ యేసు నాశ్రయించు
   శ్రీ యేసు నాశ్రయించు - తన్నాశ్రయించు వారే - ధన్యులు

2. నీకెట్టి విపత్తు - సంభవింపగాను - నే నీతో నున్నాను భయ - మేటికి
   దేవుడన్ - నే నీ కొనర్తున్ సాయం -నా గొప్ప శక్తితోను - నా గొప్పశక్తితోను
   నా గొప్ప శక్తితోను - నిన్నిల్పుదు

3. దేవాగ్ని పరీక్షలు - నీకు కల్గగాను - కృపాశక్తి మెండుగా - నీకిత్తును
   ఆ మంట నిన్ను - నావరింపగాను - నీలోని కల్మషంబు - నీలోని కల్మషంబు
   నీలోని కల్మషంబు - దహించును

4. వృద్ధాప్యము నందు - స్వంత ప్రజలెల్ల - నా మారని ప్రేమ రుచి - చూతురు
   ప్రాయమున్ ప్రొద్దు - గ్రుంకినట్టి వేళన్
   నే కౌగిలింతు వారిన్ - నే కౌగిలింతు వారిన్
   నే కౌగిలింతు వారిన్ - నా కౌగిటన్

5. నా యందు విశ్వాస - ముంచునట్టి యాత్మన్ - నే విడ్వను శత్రుకోటి - చేతికిన్
   పాతాళ మెల్లన్ - వాని మ్రింగజూడన్ - నే నెల్ల వేళలందు - నే నెల్ల వేళలందు
   నే నెల్ల వేళలందు - రక్షింతును
458 మనమే ప్రభుని పరలోక గృహముmaname prabhuni paraloka gruhamu

Ephesians 2:19

పల్లవి:
మనమే ప్రభుని పరలోక గృహము - తానే వసించును దానియందు (2)

1. ఎంత సుందరమో ప్రభుని గృహము (2) - నలుదిక్కులనుండి కూర్చెనుగా (2)
   ఏక శరీరము రక్తబంధముచే (2)
   వేలాది భాషల నుండినను (2)

2. ఒక నూతన వ్యక్తిగా మము జేసె - పరమ గృహమునకు చెందితిమి
   ఐక్యతతో స్థిరముగ నమర్చబడి
   దేవుని గుడారముగా నైతిమి

3. నల్లని తెల్లని వారని లేదు - ధనికులు దరిద్రులనియు లేదు
   పామరులని జ్ఞానులని లేదు
   యేసు ప్రభువే సర్వముగా

4. ప్రభుని గృహమున కలహము లేదు (2) - ఈర్ష్య కపట భేధము లేదు
   శాంతి ఆనందము నిజ ప్రేమయుండును
   నేర్పుతో నడుపును మన ప్రభువే

5. ప్రభుని గృహము యిద్ధరయందున్నది - తన దాసుల కధికారమిచ్చె
   ప్రతివానికి వాని పని నియమించె
   కావలి యుండుము మెలకువతో

6. దృఢ విశ్వాసము మదినందుంచి - విజయులలై యాత్రలో సాగెదము
   ఆదర్శులమై ఈ జగమందున
   పూర్తిగ శత్రువు నోడింతుము

7. ప్రియుని దినము సమీపించు చున్నది - చెప్పెను మేల్కొని యుండుమని
   విశ్వాస యోగ్యులముగ జీవించి
   ఓరిమితో వేచియుండెదము
459 సంఘమే క్రీస్తు యేసుని శరీరముsanghame kreestu yesuni shareeramu

Ephesians 1:23

పల్లవి:
సంఘమే క్రీస్తు యేసుని శరీరము - అందు చేరిన వారే అంగములు (2)

1. ఆత్మ మూలముగా దేవుని కాలయముగా (2)
   కట్టబడు చున్నారు పరిశుద్ధాత్మచే (2)
   స్థిరులై యుండెదరు యెవరు నిలిచి యుందురో (2)

2. మర్మమైయున్న దేవుని సంకల్పము
   సంఘము ద్వారా ఇహమునకు తెలిపెను
   ఎవరు విశ్వసింతురో వారే ధన్యులగుదురు

3. దేవునికే క్రీస్తు యేసు మూలముగా
   మహిమ కలుగును గాక తరతరములు
   ఎవరు మహిమ పరతురో వారే స్వాస్థ్యమగుదురు

4. క్రీస్తు యేసు సంఘమును కట్టు చుండగా
   ప్రబల లేవు పాతాళ ద్వారములు
   ఎవరు జయము గాంతురో వారే తనతో నుందురు

5. వధువు సంఘముకై క్రీస్తు వచ్చుచుండగా
   తానే కొనిపోవును శుద్ధులైన వారిని
   ఎవరు సిద్ధపడెదరో వారే యెత్తబడెదరు
460 క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమునkreestesu prabhuvu tanaraktamichi konnatti sanghamuna

Acts 2:42

పల్లవి:
క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున (1)
యెవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది (2)

1. ప్రభుని వాక్యమును సంతోషముతో - ఎవరు స్వీకరింతురో (2)
   ప్రకటించెదరు తమ ఐక్యతను - బాప్తిస్మమునందు (2)

2. అపొస్తలుల బోధను నమ్మి - స్థిరపరచబడిన వారే
   ఆత్మశక్తితో వారు యెల్లప్పుడు - సంఘములో నిలిచెదరు

3. పరశుధ్ధులతో సహవాసమును - ఎవరు కలిగియుందురో
   వారే పొందెదరు క్షేమాభివృధ్ధి - క్రీస్తేసు ప్రభువునందు

4. ప్రభుదేహరక్తమును తినిత్రాగువారే - తనయందు నిలిచెదరు
   ప్రకటించెదరు ఆయన మరణ - పునరుత్థానమును వారు

5. పట్టువదలక సంఘముతో కూడి - ఎవరు ప్రార్థించెదరో
   ప్రార్థన ద్వారా సాతాను క్రియలు - బంధించెదరు వారే

6. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు - ఎవరెదురు చూచెదరో
   నిత్యానందముతో సాక్షమిచ్చెదరు - సర్వలోకమునందు
461 పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేముparishuddha pattanamu krotta yerooshalemu

Revelation 21:1-17

పల్లవి:
పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము - పరము నుండి వచ్చుట చూచితిని (1)
భర్త కొరకు అలంకరింపబడిన - పెండ్లి కుమార్తెగా చూచితిని (2)

1. సింహాసనమందు గొప్ప శబ్దముతో - బలముగ పలికిన స్వరము వింటిన్ (2)
   దేవుడు నివసించు మానవులతో
   తానే వారితో సదా వసించున్ (1)

2. దేవుడు తానే వారితో నుండి - ఆయన వారికి తండ్రియగును
   ప్రతి బాష్పబిందువుల తుడిచివేయున్
   మరణము దుఃఖము ఏడ్పు నిక నుండదు

3. మొదటి సంగతులు గతించు చుండె - పరికించుము సర్వము క్రొత్తవాయె
   సింహాసన మందుండి ప్రభువే పలికె
   నూతనముగా నే చేసితి ననెను

4. ఈ వాక్యము విశ్వాసులకు యోగ్యము - సత్యమై మారనిదై యుండు నెప్పుడు
   ఆది యంతము అల్ఫా ఓమేగ
   దప్పి గొన్న వానికి జలము లిచ్చున్

5. జయించువారు వీటన్నింటిని - వారసులై స్వతంత్రించు కొందురు
   ఆయన వారికి దేవుడై యుండి - వారాయనకు పుత్రులవుదురు
462 నూతనమైన యెరుషలేము పరిశుద్ధ పట్టణముnootanamaina yerushalemu parishuddha pattanamu

Revelation 21:2

పల్లవి:
నూతనమైన యెరుషలేము పరిశుద్ధ పట్టణము (2)
దానికి మనలను పాత్రుల జేసిన (2)
మన ప్రభు యేసుకే వందన స్తుతులు (2)

1. సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండియున్నది (2)
   శాంతి దాత యేసు ప్రభువు యేలుచున్న రాజ్యములో (2)
   మనలను పాలివారిగ జేసిన (2) - రారాజునకే స్తోత్రములు (1)

2. మన పాపములను క్షమియించెనుగా కల్వరిసిలువ రక్తము ద్వారా
   తన పరిశుద్ధతయందు మనల పాలివారినిగ జేసె
   మహిమాపూర్ణుడ మాదేవ - మనసార నిను పాడెదను

3. పరిశుద్ధ పట్టణము యెంతో సౌందర్యము కలిగియున్నది
   భర్త కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా నుండెనుగా
   తన వధువుగా జేసిన ప్రభుకే - స్తుతిచెల్లించెదము నిరతం

4. దేవుడే మనతో నివసించును - కాపురముండును మనతో నిత్యము
   దేవుడే మనకు తోడై యుండి - నడుపును మనల పరమునకు
   మనలను ప్రేమించిన ప్రభునే - ఆరాధించి మ్రొక్కెదము

5. మనకన్నుల ప్రతి భాష్పములను తుడిచివేయును మన ప్రభు యేసు
   మరణము దుఃఖము వేదనయుండదు పరిశుద్ధ నగరములో
   మరణము లోకము సాతానున్ - గెలిచిన ప్రభునే పూజింతుము
463 ప్రభుని గృహముprabhuni gruhamu

2 Chronicles 7:2

పల్లవి:
ప్రభుని గృహము ఆయన మహిమతో - పరిపూర్ణముగా నిండెను (2)

1. అపరాధములచే ప్రజలందరును - దేవుని మహిమను కోల్పోయిరి (2)
   తన మహిమను మన కిచ్చుటకు (2)- యేసు ప్రభువే బలి యాయెన్ (1)

2. కృపా సత్యములు సంపూర్ణముగా - మన మధ్యలో వసించెను
   తండ్రి మహిమను తన సుతునిలో - మన మందరము చూచితిమి

3. ప్రభువు యింటిని నిర్మించు చుండె - సజీవమైన రాళ్ళతో
   ఆయన మహిమ దానియందుండ - తన సంకల్పమై యున్నది

4. శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు - మానవ హస్తము అందుండదు
   క్రయమునిచ్చి స్థలముకొనెను - తాను కోరిన స్థలమదే "

5. ప్రత్యేక పరచిన ఆత్మీయ యింటికి తన పునాదిని వేసెను
   రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా - ప్రభువే సర్వము చేసెను

6. సింహాసనముపై కూర్చున్న ప్రభువే - అణగ ద్రొక్కెను శత్రువును
   సంపూర్ణ జయముతో ఆర్భాటముతో - వెలిగించెను తన యింటిని

7. దేవుని యిల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగివచ్చున్
   దహించ బడును సర్వమలినము - ఇంటిని మహిమతో నింపును
464 పరిశుద్ధ మందిరము నాకు నిర్మించ మంటిరి ప్రభువాparishuddha mandiramu naaku nirmincha mantiri prabhuvaa

Exodus 25:8

పల్లవి:
పరిశుద్ధ మందిరము నాకు (2) - నిర్మించ మంటిరి ప్రభువా (2)
ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచ మంటిరి ప్రభువా (2)

1. తుమ్మ కర్రతో మందసమును (2)- జేసి బంగారును - పొదిగించిన (2)
   తుమ్మకర్ర మీరేయని యంటిరి (2)

2. కరుణాపీఠము కావెలెనంటిరి - కరుణాపీఠము నేనే యనుచు
   ప్రాణమిడితిరి కరుణను జూపి

3. బలిపీఠమును చేయుమంటిరి - బలిపీఠము నా సిలువయే యనుచు
   బలియైతిరి మీ రక్తము కార్చి (2)

4. ఆవరణ ద్వారంబుల జేసి - ముగించితిని మీ పనినంతటిని
   మహిమయు ఘనత మీకే కల్గున్

5. నావన్నియును మీకిచ్చితిని - మీ వన్నియును నావే ప్రభువా
   కృప జూపితిరి మీ మహాప్రేమన్

6. పరిశుద్ధ పట్టణమునందు - నివాస స్థలము నా కొసగితిరి
   తరతరములు మీతో నివసింతున్
465 దేవుడొక నగరము మన కొరకైdevudoka nagaramu mana korakai

Hebrews 11:10

పల్లవి:
దేవుడొక నగరము మన కొరకై - సిద్ధపరచుచుండె నుండుటకై (2)
మనము వెళ్ళెదం నిశ్చయముగా (1)

1. మేలిమి బంగారము అద్భుత నగరం - విలువైన రాళ్ళతో పునాది వేసెను (2)
   రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి (2)
   మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా (2)

2. నగర ప్రాకారములు ఎత్తైనవి - సూర్య కాంతములచే కట్టబడెను
   ప్రభువే విమోచించి అధికారమిచ్చెను
   మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా

3. ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు - పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి
   పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు
   మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా

4. ఆ నగర వీధులు మేలిమి బంగారం - ద్వారములు ఎప్పటికి మూయబడవు
   ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో
   మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా

5. గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును - ఆయనే దీపము నాలయమై యుండును
   జీవగ్రంథమందున పేరులున్నవనుచు
   మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా

6. జయవంతుల కొరకే ఆ నగరం - పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు
   విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే
   మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా
466 ప్రభు ప్రజలారా రయమున రండిprabhu prajalaaraa rayamuna randi

Isaiah 2:5

పల్లవి:
ప్రభు ప్రజలారా - రయమున రండి (1)
యాకోబు వంశమా - స్వకీయ జనమా (1)
యెహోవా వెలుగులో - నడుతము రండి (2)

1. అంత్య దినములందు - పొంతన లేనట్టి (2)
   మందిర పర్వత - శోభను గాంచగ (2)
   ఉన్నత పర్వత - శిఖరమందుండి (2)
   మహిమతో యిమ్మహి - వర్థిల్లును (2)

2. యెహోవా మందిర - మందున బోధించు
   హితబోధను విని - తన త్రోవ నడువగ
   యాకోబు దేవుని - నివాసమునకు
   పంక్తులై జనులు - పరుగిడి వత్తురు

3. యెహోవా వంతు ఆయన జనమే
   యాకోబే తన - స్వాస్థ్యం బాయెన్
   భీకర యెడారిలో - కనుగొనె వానిని
   ఎంచెను కాచెను - కనుపాపగను

4. కమనీయంబగు - కలకని యాకోబు
   గాంచెను నిచ్చెనన్ - భువినుండి దివికి
   నిలువగ యెహోవా - దానికి పైగా
   బేతేలే యిది - వేరేది కాదనెన్

5. దేవుని మందిర - ప్రత్యక్షతలు
   సజీవ్ సంఘ - మందున నింపెన్
   సత్యమునకు నిది - ఆధారమును
   స్తంభము గానై - స్థిరముగ నుండెను

6. నూతనమైనట్టి - యెరూషాలే మది
   నిత్య దేవుని - నివాసమాయె
   భక్తులు చేరి - ప్రస్తుతింపగ
   స్తుతులకు మధ్యను - ప్రభవించును ప్రభు

7. కుక్కలు మాంత్రికులు - వ్యభిచారులును
   నరహంతకులును - విగ్రహారాధికులు
   అబద్ధమును ప్రేమించి - జరిగించు
   ప్రతివాడునట - వెలుపట నుందురు

8. సర్ప సంతానము నుండి - వేరైనవారై
   క్రీస్తుని రక్తమున్ - కోరి వేడినచో
   స్వకీయ ధనమౌ - యాకోబు వంశమై
   కీర్తింతురు ప్రభున్ - హల్లెలూయ
467 ప్రభుని సంఘమా - మేల్కో - నేడేprabhuni sanghamaa - melko - nede

Mark 13:33

పల్లవి:
ప్రభుని సంఘమా - మేల్కో - నేడే - నిద్ర నుండి మేల్కో

1. నీ శత్రువై - నఘటసర్పం - నీపైతనపడ - గనెత్తి
   నీపైనబడి - కాటువేయన్ - పొంచియున్న - దినములలో

2. అబద్ధ ప్ర - వక్తలిలలో - ప్రభలుచున్న - దినములలో
   క్రీస్తు విరోధి - కీలు బొమ్మవై - బానిసబ్రతుకు - నీకేలా

3. బంధువులు భవ - నాలెన్నున్న - ధన సంపన్నత - యెంతున్న
   ఇహమును వదలి - వెళ్ళునప్పుడు - యేమియురాదు - నీ వెంట

4. మహాశ్రమల సంవత్సరముల్ - ప్రభలకమునుపే - త్వరపడుమా
   మధ్యాకాశం బునకు నెగిరి - వెళ్ళుట కాయ - త్తపడుమా

5. పరిశుద్ధంబైన - నీ జీవితము - ప్రభుని ప్రేమ - గుణగణముల్
   ఆత్మల సంపాదనయేనీదు - నిరతం నిలిచే - నీ ధనము

6. ప్రియుడేసునితో - వెయ్యియేండ్లు - పాలింప సి - ద్ధపడుమా
   పరమున నిత్యం - పరిపాలించే - ఆ భాగ్యమును - ఆశించి
468 ఎంత సౌందర్య నగరముenta saundarya nagaramu

Revelation 21:10

పల్లవి:
ఎంత సౌందర్య నగరము (2) -  అద్భుత మహిమ ప్రభావముతో నిండెను (2)
పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం, అన్నియు (2)

1. ఆ నగర పునాది ఎంతో దృఢమైనది (2)- స్థిరమై కదలని శాశ్వతమైనది (2)
   ప్రభువే తన వారిన్ సిద్ధపరచుచున్నాడు (2)
   అద్భుతం అద్భుతం అద్భుతనగరం (2)

2. పవిత్ర జనులు తనతో వసింతురు - ఎవరిని ప్రభువు రక్తముతో కొనెనో
   జయవంతులే అచ్చట చేరుదురు
   విజయులై విజయులై అత్యంత విజయులై

3. ఇవి మానవులకు - గ్రాహ్యము కానివి - ప్రభుని ఆత్మీయ జనులె గ్రహింతురు
   ఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్
   ఆత్మీయం ఆత్మీయం అన్నియు ఆత్మీయం

4. ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం - యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను
   పై నున్న వాటిని - నిలచి చూతుము
   ఆనందం ఆనందం పరలోక ఆనందం
469 దేవుని మహిమ మందిరంdevuni mahima mandiram

Revelation 21:10

పల్లవి:
దేవుని మహిమ మందిరం (2)  -  యాజకుల ఆరాధనాలయం (2)

1. అదియే మోరియా గొల్గొతాకొండయు - ఇస్సాకు బల్యర్పణ స్థలమును (2)
   యెబూసీ యెరూషలేమదే (2)

2. యాకోబు బలిష్టుని నివాసమదియే - ఆ స్థలమెంతో భీతి గొల్పునది (2)
   పరలోకపు గవినీయదే (2)

3. సీనాయి కొండపై మోషేకు చూపిన - పరలోక ప్రత్యక్షపు గుడారమదియే
   అగ్నివంటి ఆకారమున్న స్థలమదే

4. దావీదు దేవుని గుడారమదియే - తేజోమహిమ నిలుచు నివాసము
   ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే

5. యెహోవా పట్టణము పాదపీఠ స్థలము
   ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే
   చిగురు మహిమ భూషణమగునచట

6. సజీవరాళ్ళతో నిర్మించబడుచున్న
   యేసుని మానస మందిరమదియే
   పెండ్లికుమార్తె సంఘము అదియే

7. కలహించుట మాని కలిసి వెళ్ళుదము
   హెబ్రోను దేవుని మహిమ మందిరముకు
   మన దుఃఖ దినములు సమాప్తమగును

8. మునుపటి మహిమను మించిన మహిమతో
   పరలోకము నుండి దిగి వచ్చుచున్న
   నూతన యెరూషలేమదే
470 యెహోవ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాకyehova ninnu aasheervadinchi ninnu kaapaadunu gaaka

Numbers 6:24-26

పల్లవి:
యెహోవా నిన్ను  ఆశీర్వదించి నిన్ను కాపాడును  గాక
కృపయు సమాధానము  నీకు కలగ జేయును

1. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నీదాసుని మీద
   నీదు కృపతో నన్ను - దేవా రక్షింపుము

2. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నీదు జనులకును
   చెరలోనుండి మమ్ము - ప్రభువా విడిపింపుము

3. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నీదు దాసునికి
   నీ కట్టడలను గూర్చి - ప్రభువా బోధింపుము

4. నీముఖకాంతి ప్రకాశింపజేసి - శిధిలంబైయున్న
   నీ పరిశుద్ధ స్థలమున్ - దేవా కట్టుమయ్యా

5. నీముఖకాంతి ప్రకాశింపజేసి - పూర్ణశాంతితో
   నీపై మనస్సుంచి యున్న - వానిన్ కాపాడుము

6. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నిలుపు సమాధానము
   కావలి యుండుము ప్రభువా - హృదయ తలుపులకు

7. నీముఖకాంతి ప్రకాశింపజేసి - క్షేమమును నదిగా
   సాగర తరంగము వలెనె - నితీన్ స్థాపించుము
471 పాత క్రొత్త నిబంధనలందునpaata krotta nibandhanalanduna

Luke 24:27

1. పాత క్రొత్త నిబంధనలందున - అరవై యారు పుస్తకముల్ (2)
   పేర్లు తెలియవలెననిన దైవకృపచే - విభజించి పాడవలయున్ (2)

2. పాత నిబంధన యందలి గ్రంథముల్ - ముప్పది తొమ్మిదియు
   మరి క్రొత్త నిబంధనయందున - ఇరవై - ఏడు పుస్తకములును

3. ఆదికాండము - నిర్గమ కాండము - లేవీయుల కాండము
   సంఖ్యా, ద్వితియోపదేశ కాండముల్, యెహోషువ -
   న్యాయధిపతులు, రూతు,

4. మొదటి సమూయేలు, రెండు సమూయేలు - మొదటి రెండు రాజులును
   మరి ఒకటి రెండు దిన వృత్తాంతములును, -
   ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు,

5. యోబు, కీర్తనలు, సొలొమోను - సామెతల్, ప్రసంగి, పరమగీతము
   యెషయా , యిర్మియా, విలాపములు, యెహెజ్కేలు,-
   దానియేల్, హొషేయా, యోవేలు

6. ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, - నహూము, మరి హబక్కూకు
   జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, చెప్పితి ముప్పై తొమ్మిది

7. మత్తయి, మార్కు, లూకా, యోహాన్, అపొస్తలుల కార్యములు
   రోమా, ఒకటి - రెండు కొరింథీయులు, గలతీయ, ఎఫెసీయులు

8. ఫిలిప్పీయు, కొలస్సైయు, ఒక థెస్సలోనికైయ, రెండు థెస్సలోనికైయులు
   ఒకటి, రెండు తిమోతి పత్రికలును, - తీతు, ఫిలేమోన్ పత్రిక

9. హెబ్రీయులును, యాకోబు, పేతురు - ఒకటి, రెండు పత్రికలున్
   యోహాను వ్రాసిన పత్రికలు మూడును, - యూదా ప్రకటనయు

10. అరవై ఆరును దేవునిచేత - నీయబడిన వేదము
   దానిమోకాళ్ళమీద ప్రార్థనతోడ - అనుదినము చదువుడి
472 క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడుkreestuni svaramu vindunu prabhuve palikinappudu

Psalms 29

పల్లవి:
క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమే యది (2)

1. యెహోవా నీ స్వరము - జలములపై వినబడెను (2)
   మహిమగల దేవుడు (2) - ఉరుమువలె గర్జించెను (1)
   మహిమగల దేవుడు - ఉరుమువలె గర్జించెను (1)

2. బలమైన నీ స్వరము - బహుప్రభావము గలది
   దేవదారుల విరచును - ప్రజ్వలింప చేయునగ్నిని

3. అధ్భుత ప్రభుస్వరము - అరణ్యము కదిలించును
   ఆకుల రాలజేయును - లేళ్ళ నీనజేయును

4. ఆలయమందన్నియు - ఆయననే ఘనపరచున్
   ఆశీర్వాదము శాంతి - నోసగు నాయన స్వరమే

5. నీ మధుర స్వరము - నీ వాక్యమున విందున్
   ప్రార్థనల యందున - ప్రతిదినము పల్కెదవు

6. నీ మధుర స్వరము - నీ చిత్తము తెల్పును
   అనుదిన జీవితములో - అనుసరించెద నిన్ను

7. నీ మధుర స్వరము - నీ మార్గము జూపును
   కుడియెడమల తిరిగిన - నీ స్వరమే వినబడును

8. తుఫానులు కలిగి - భయభీతులలో నుండ
   భయపడకు మనిపలికే - ప్ప్రేమగల నీ స్వరము

9. మరణాంధకార - లోయలో నేనుండ
   నీకు తోడైయుంటి - ననెడి స్వరమును వింటిన్

10. ప్రభువా సెలవిమ్ము - నీ దాసు డాలించున్
   దీనుడనై నీ మాట - అంగీకరించెదను
473 దాహము తీర్చుమయ్యాdaahamu teerchumayyaa

Psalms 42:1

పల్లవి:
దాహము తీర్చుమయ్యా - అభి - షేకము నీయుమయ్యా (2) - మాదు

1. వేదము పూర్వము తెలిపిన విధమున - నీ దాసుల నాత్మతో నింపి (2)
   కరుణసాగరా బీదలమగు మము - కరుణించు మిపుడే (2) - మాదు
   కరుణసాగరా బీదలమగు మము - కరుణించు మిపుడే (1)

2. శత్రువు చేత సహించరాని - కష్టము లేన్నో కల్గినను
   దేవా నీదుకృప బలముచే - నవిరత జయమభ్భున్ - మాకు
   దేవా నీదుకృప బలముచే - నవిరత జయమభ్భున్

3. వేదపుసారము భోధించునట్టి - భోధకుడా పరుశుద్ధాత్ముడా
   పాదశరణము వేడినట్లయిన - పరిశుద్దు లయ్యెదము - మేము
   పాదశరణము వేడినట్లయిన - పరిశుద్దు లయ్యెదము

4. శుద్ధ జీవితము పరిశుద్ధ సేవయు - శుద్ధునికి హితమగు కానుకలు
   పరిశుద్ధ చిత్తప్రకారము దయనొంది - ఫలమును చూచెదము - మేము
   పరిశుద్ధ చిత్తప్రకారము దయనొంది - ఫలమును చూచెదము
474 ఆ దినములలో దేవోక్తి అరుదాయెను దేవునివార్తaa dinamulalo devokti arudaayenu devunivaarta

1 Samuel 3:1

పల్లవి:
ఆ దినములలో దేవోక్తి (2) - అరుదాయెను - దేవునివార్త (2)
ఆ దినములలో దేవోక్తి  (2)

అను పల్లవి:
దైవోక్తి ప్రత్యక్షత - దొరుకునదే - అరుదాయెనట - ఆదినములలో దేవోక్తి

1. ఇశ్రాయేలీయుల కానాడు (2) - యే రాజు లేకపోయె (2)
   తనయిష్టానుసారముగా (2) - తిరుగుచుండెను ప్రతివాడు (2)

2. పరమ తండ్రి మందసము - చెరపట్టబడినందున
   ప్రభావము పోయెను - ప్రభుని ప్రజలలో నుండి

3. దావీదంతకంతకు - దినదినము వర్థిల్లెను
   సైన్యములధిపతి యెహోవా - సర్వదా తనతోడై యుండెను

4. సొలమోనర్పించిన - బలుల నగ్ని కాల్చగనే
   ప్రభుని ఆలయమంతయు - ప్రభావముతో నిండెను

5. లెమ్ము తేజరిల్లుము - నీకు వెలుగు కలిగెను
   యెహోవా తండ్రి మహిమ - నీ మీద నుదయించెను

6. యెహోవా పట్టణమని - ఇశ్రాయేలు పరిశుద్ధ
   దేవుని సీయోనని - నీకు పేరు పెట్టెదరు
475 మంగళముగ పాడుడీ - కృప సత్యంబునుmangalamuga paadudee - krupa satyambunu

John 17:17

1. మంగళముగ పాడుడీ - కృప సత్యంబును (1)
   రంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యము (1)
   విజయ సత్యవేదము - మంగళ నిత్యదీపము (1)

పల్లవి:
అమృతము అద్భుతము దివ్యసత్యము (2)

2. సువి శేషమును ప్రకటింపు - కృప సత్యంబును
   పాప ఘోరంబు తెల్పును - దివ్యవాక్యము
   పరలోక వర్షము - జ్ఞాన నింపుదలయును ||అమృత||

3. దేవుడేసు హర్షించెడు - కృపసత్యంబును
   జీవ మంగళ వాక్యముల్ - దివ్యవాక్యముల్
   యేసు నన్నుచూడు - నిత్యము శుద్ధీకరించు ||అమృత||

4. రెండుయంచుల ఖడ్గము - కృప సత్యంబును
   ఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యము
   యోచనల్ చూపుదర్పణము - కలితిలేని జ్ఞానము ||అమృత||

5. ఆత్మకాహారమిదియే - కృప సత్యంబును
   పాపికి జీవపానము - దివ్యవాక్యము
   పాదములకు దీపము - కాళ్ళకు మంచి వెల్గును ||అమృత||

6. విశ్వాసుల సువార్తయే - కృప సత్యంబును
   నిశ్చయమైన పునాదియే - దివ్యవాక్యము
   విడుదలనిచ్చు సత్యము - ఉన్నతలోక సత్యము ||అమృత||

7. హల్లెలూయ పాడెద - కృప సత్యంబును
   అపవిత్రతను పోగొట్టున్ దివ్యవాక్యము
   ప్రభువు నామమిదియే - నాదు ఆస్తియునిదే ||అమృత||
476 నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకైnityudesune stutinchu tana satyamu korakai

Psalms 108:4

పల్లవి:
నిత్యుడేసునే స్తుతించు - తన సత్యము కొరకై - నిత్యుడేసునే స్తుతించు (1)

అను పల్లవి:
మధ్యవర్తియాయే చెదరిన - పరిశుద్ధులకు తానే యిలలో (2)

1. మేఘ మండల మంటుచున్నది - నాకు దాహంబది తీర్చుచున్నది (2)
   వేగమే మనుజులను మార్చివేయును - మార్చివేయునదియే (2)

2. విడుదలను ఇచ్చునదియే - విడిపించు ఘోరపాపము నుండి
   కడు శ్రమలనది స్వీకరించును - స్వీకరించునదియె

3. పృధివి నెల్లయు మారిపోయినన్ - సత్యమెన్నడు మారనే మారదు
   నిత్యమైన యేసు సత్యమాయెనిలలో - సత్యమాయెనిలలో

4. ఖడ్గంబుబోలి కోయునదియె - పడగొట్టును దుష్టులనదియే
   వడివడిగా తనపని నెరవేర్చునదియే - నెరవేర్చునదియే

5. ఉదకంబు బోలి కడుగునదియే - అద్దముబోలి చూపునదియే
   అది బంగారు విలువ గలది - విలువ గలదియే

6. దీపమై చీకటిని పోగొట్టును - కోపమున్ బారద్రోలును నదియే
   ఆపదలనెల్ల తొలగించునదియే - తొలగించునదియే

7. సుతైను బోలి పగులగొట్టును - మెత్తగా చేసి ఒప్పించునదియే
   క్రొత్త తేనెన్ బోలి రుచించునదియే - హల్లెలూయా ఆమెన్
477 దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువేdappigonina vaanipai neetin kummarinchunu aa prabhuve

Isaiah 44:3

పల్లవి:
దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే (1)
ఎండియున్న భూమిపై జలముల్ - ప్రవహింప జేయునాయనే (2)

1. వడిగల జలములలో దారిన్ - నిర్మించును ఆ ప్రభువే (2)
   అడవులలో రాజబాటలను - స్థాపించును మన ప్రభువే (2)

2. మన సంతతిపై ఆత్మన్ - కుమ్మరించును మన ప్రభువే
   తన ఆత్మలో వారిని నింపి - నిర్మించును సంఘముగా

3. నీటికాలువలయొద్ద - నిరవంజి చెట్లవలె
   గడ్డిలో యెదుగునట్లు - వారు వర్ధిల్లెదరు

4. కరుణాపీఠము పై నుండి - మాట్లాడెను మన దేవుడే
   పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే

5. ఆకాశము తెరువబడగా - మాట్లాడెను మన దేవుడే
   ఒక శబ్దముచే తన సుతుని - ఘనపరచెను మన దేవుడే

6. మందసమున్ దేవుని ప్రజలు - మందిరమందుంచగనే
   మందిరమున్ క్రమ్మెను ప్రభుని - తేజోమహిమంతటను

7. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ - సేవింతురు హర్షముతో
   దిన దినము దేవునికొల్చి - హల్లెలూయ పాడెదరు
478 సరస్సు ప్రక్కన రొట్టెలను వడ్డించునట్లుగా నాకుsarassu prakkana rottelanu vaddinchunatlugaa naaku

John 6:48

1. సరస్సు ప్రక్కన రొట్టెలను - వడ్డించునట్లుగా నాకు
   ప్రభూ! నీ జీవాహారము వడ్డించుము - అదే నా యాత్మకెంతో ప్రియము

2. రొట్టెను దీవించిన ప్రకారము - నన్ను - సత్యంబుతో దీవించుము
   కీడులోనుండి నన్ రక్షించుము - నీ శాంతి నకనుగ్రహించుము

3. గలిలయ యందు నీ శిష్యులు - జీవించునట్లుగా నాకు నేర్పు
   నాచింతలన్నిటిన్ జయించుచు - జీవుడవైన నిన్ను జూతును
479 నాథా! సమూయేలు రీతి నీయామోద శబ్దముnaathaa! samooyelu reeti neeyaamoda shabdamu

1 Samuel 3:10

1. నాథా! సమూయేలు రీతి - నీయామోద శబ్దము (1)
   సేవకుడనైన నన్ను - నిప్పుడాలకింపని (1)
   నాతో నీవేమందువో - నేనాలించువాడనే (1)

2. నీ మాట గ్రహించునట్లు - దాని దేటపర్చుము
   నిన్ను వెంబడించునట్లు - నిబ్బరింప జేయుము1
   నేను నీదు గొఱ్ఱెను - బండనీడల్ మేపుము

3. నేను స్వల్ప శిష్యుడను - నన్ నిరాకరింపకు
   నిన్నాలింప ఎంతయాశ - నీ వెరింగియుందువు
   ఆత్మ యక్కరల్ తీర్చు - ధన్యుడన్ నే నౌదును

4. నాథా! నీ శబ్దమాలింప - నన్ను సిద్ధపర్చుము
   నీదు మాట లక్ష్యపెట్టి - నిత్య సేవ జేయనీ
   నాతో నీవే మందువో - నేనాలించువాడనే
480 నే బోధింప జనాళికిన్ - నేర్పింపు నాకు నో ప్రభుne bodhimpa janaalikin - nerpimpu naaku no prabhu

Psalms 78:1

1. నే బోధింప జనాళికిన్ - నేర్పింపు నాకు నో ప్రభు
   నన్ వెద్కినట్లు నేనును - నశించువారిన్ వెద్కెదను

2. ఆత్మీయ భోజనంబుతో - పోషించునట్లు నన్నును
   మూర్ఛిల్లువారికిన్నదే - నేనియ్యగాను నడ్పుమా

3. కష్టంబులొందు వారిని రక్షింప గల్గునట్లుగా
   నాకిమ్ము నీదు శక్తిని - నన్ ధైర్య పర్చుమో ప్రభూ

4. నే నేర్పునట్లు నాకును - నీ దివ్య వాక్యం నేర్పుము
   ఆలించునట్లనేకులు - నా బోధను దీవింపుమా

5. ప్రయాసమొందు వారికి - విశ్రాంతి కల్గునట్లుగా
   ఓదార్చు శక్తి మెండుగా - నీ యాత్మచే నాకిమ్మయా

6. నీ దివ్యమోము జూచుచున్ నీ హాయి సంతోషంబులు
   నే నొందుదాక నన్నిలన్ - నీ చిత్తమార నడ్పుమా
481 నీ స్వరము వినిపించు ప్రభువాnee svaramu vinipinchu prabhuvaa

1 Samuel 3:9

పల్లవి:
నీ స్వరము వినిపించు ప్రభువా - నీ దాసుడాలకించున్
నీ వాక్యమును నేర్పించు - దాని యందు నడచునట్లు నీతో

1. ఉదయమునే లేచి నీ స్వరము వినుట - నాకు ఎంతో మధురము
   దినమంతటి కొరకు నను సిద్ధపరచు - రక్షించు ఆపదల నుండి

2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు - నేను సరిచేసికొందు
   నీ మార్గములో నడచునట్లుగా - నేర్పించుము ఎల్లప్పుడు

3. భయ భీతులలో తుఫానులలో - నీ స్వరము వినిపించుము
   అభయము నిమ్ము ఓ గొప్ప దేవా - ధైర్యపరచుము నన్ను

4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా - నీ స్వరము నా కొరకే
   నీతో మనుష్యులతో సరిచేసికొందు - నీ దివ్య వాక్యము ద్వారా

5. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది - అది రెండంచులుగల ఖడ్గం
   నీ వాక్యమేగా అద్భుత అద్దం - నిజ స్వరూపమును చూపించున్

6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా - నీ వాక్యమును ఎంతో
   నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో - నీ యందు నిలచునట్లుగా

7. నా హృదయములోని చెడు తలంపులను - ఛేదించు నీ వాక్యము
   నీ రూపమునకు మార్చుము నన్ను - నీదు మహిమ కొరకేగా
482 వినిపించు ప్రభూ నీ స్వరమునుvinipinchu prabhoo nee svaramunu

1 Samuel 3:9

పల్లవి:
వినిపించు ప్రభూ నీ స్వరమును - వినుచుంటి నీదాసుడన్ (2)
నేర్పించు నీ వాక్యమును -చూపించు  అందు నే నడుచునట్లు (2)

1. వేకువనే నే - లేచి విందును నీ స్వరము - ఉత్తమము అది ఎంతో (2)
   దినమంతటికై సిద్ధపరచుచు - విడిపించు అడ్డుల నుండి (2)

2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు - నే సరిచేసికొందును
   నే నెరుగుదును ఇదియే మార్గమని - నేర్పుమందు నడువను

3. తుఫానుల యందు భీతుల లోన - ప్రేమతో నాతో నుందువు
   భయపడ వలదు నాదాసుడవను మర్మము నాకు నేర్పు

4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా - నీ స్వరము నా కొరకే
   నీతో మనుషులతో సరిచేసుకొందును - నీ దివ్య వాక్యము ద్వారా

5. నీ వాక్యము అగ్నియు సుతై వంటిది - అది వవాడియేన ఖడ్గం
   ఆ వాక్యమేగా అద్భుత అదం - నా నిజ రూపమున్ చూపించును

6. వెళ్లి యున్నాను నే శ్రమల నుండి - నేర్చుకొంటి నందు నుండి
   పొందితి జీవం ఆ శ్రమల ద్వారా - నిలుపు నీదు విశ్వాసత్యలో

7. చేధించి సరి చేయు నీ వాక్యమేగా - నా హృదయ చెడు తలంపులను
   నీ స్వరూపములో నన్ను మలచుము - నీ మహిమ నింపుము నాలో
483 నిత్యము నిలుచునది దేవుని వాక్యముnityamu niluchunadi devuni vaakyamu

Isaiah 40:8

పల్లవి:
నిత్యము - నిలుచునది - దేవుని వాక్యము
సత్యమై యున్నది - సర్వము చేయునది

అను పల్లవి:
ఆ వాక్యమే యేసు దైవము - ఆదియందు ఉన్న దైవము (2)
అంతమే లేని దైవము

1. అంధకారమును - తొలగించు జ్యోతి అది
   ప్రతి మనిషిని వెలిగించు - మహిమ వెలుగు అది (2)
   వెలిగించును - నడిపించును - త్రోవకు దీపమై (2) - ఆ వెలుగు వాక్యము (1)

2. ఎండిన ఎడారిలో - నీటి ఊటవంటిది
   వడిగా ప్రవహించు - జీవనదియే అది
   దప్పిగొనిన - ప్రతి జీవి - దప్పిక తీర్చునది - ఆ జీవ జలవాక్యము

3. అపవాదిని అణచివేసె - ఆత్మఖడ్గమది
   రెండంచులు వాడీగలదై - వధించును వైరులను
   ఓడించును - విడిపించును - తోడై ఎల్లప్పుడు - ఆ శక్తిగల వాక్యము

4. పోరాడుము యేసుకై - మంచి సైనికునిగా
   శ్రమలను భరించుము - వాక్యములో బలమొంది
   తన ఐశ్వర్యములో - తీర్చును - నీ ప్రతి అవసరము - ఆ దేవాది దేవుడు

5. నిత్యుడగు దేవుడు - త్వరగా వచ్చుచున్నాడు
   జయించు వారినెల్ల - తనతో కొనిపోవును
   తన వాక్యమునందు వర్ధిల్లుచు - విజయుడవై యుండుము
   హల్లెలూయా హల్లెలూయ - (3)
484 ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుడిidigo mee devudani yoodaa pattanamulaku prakatinchudi

2 Timothy 2:3; Isaiah 40:9 ;Philip 4:19

పల్లవి:
ఇదిగో మీ దేవుడని - యూదా పట్టణములకు - ప్రకటించుడి
ప్రభువగు మన యేసు తానే - శక్తి సంపన్నుడై త్వరగా వచ్చును

అను పల్లవి:
బలముగా ప్రకటించుడి - భయపడక ప్రకటించుడి (2)

1. ప్రేమగా మాట్లాడుడి - యెరూషలేముతో
   నా జనులను - ఓదార్చుడి
   ఆమె దోషరుణము తీర్చబడెనని
   రెండింతలు ప్రతిఫలము - పొందెనని

2. సర్వ శరీరులు - గడ్డివంటివారే
   అడవి పువ్వు వంటిదే వారి అందము
   గడ్డియెండి దాని పువ్వుము - వాడిపోవును
   మన దేవుని వాక్యము - నిత్యము నిలుచునని

3. మన దేవుని మార్గమును సిద్ధపరచుడ
   సరాళము చేయుడి రాజమార్గము
   మన యేసు మహిమతో బయలుపడును
   సర్వ శరీరులు దాని చూచెదరు

4. శ్రమననుభవించుడి - మంచి సైనికులై
   చిక్కుకొనకుడి - జీవన వ్యాపారములలో
   నియమ ప్రకారము - పోరాడుడి
   కిరీటము పొంది - యేలుటకై

5. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును
   తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో
   ప్రీతికరమైన సేవ - చేయుదము
   దేవునికే మహిమ - యుగ యుగములకు

6. సువార్తను ప్రకటించు ఓ సీయోను
   ఉన్నత పర్వతమును ఎక్కుము
   సువార్తను ప్రకటించు యెరూషలేమా
   నీ యుద్ధకాలము సమాప్తమాయెను

7. ఉపదేశించుము సరిగా సత్యవాక్యము
   యోగ్యునిగా సిగ్గుపడని పనివానిగా
   బహుమానముతో వచ్చును యజమానుడు
   అవిధేయత చూపకు దర్శనమునకు
485 నా దృష్టి నీపై నిలిపిnaa drushti neepai nilipi

Psalms 32:8 ; Deuteronomy 16:9

పల్లవి:
నా దృష్టి నీపై నిలిపి - నాదు యోచనలతో సదోపదేశము
సదా నే జేసెద - నడువ నీవు నా మార్గమును2

1. మరణము నుండి ప్రాణము నిరతము విడిపింపును ధరలో
   జీవించన్ కరువులో మరి సజీవులుగా - నీతిమంతులపై ప్రభు నేత్రం
   నిలుచును నిలకడగా యదార్థుల మొఱ యెహోవా వినులు వినును
   వీడక సహనముతో

2. యెహోవా నేత్రములు ఏడు - జెరుబ్బాబేలు చేతకాని గుండు నులున్
   సంతోషించును బహు మెండుగాను - మహిమతో వేసెను వినయముగా
   మందిర పునాదిని ముగించునతని చేతులు ముదమున
   జరుగునిది దైవాత్మచే

3. దైవాసన పెద్దల మధ్య - చంపినట్లున్న సజీవ గొఱ్ఱెపిల్ల
   యేసుని కన్నులు నిన్ను కనగా జివించ్చుచున్నాను కొనినన్
   మృతుడవే నీవిలలో చావనైనను వాటిని సరిదిద్దు
   జాగ్రత్త యేసుని స్వరము విను

4. మదిలో పరమ ప్రభువునెరుగు - యధార్థహృదముల బలపరచ
   పృదివి లో పయనించి చూడగా ప్రభుదృష్టి
   యెహోవాను వీడి వెల్లెను ఆసా - సిరియా రాజు దరికి
   మతి తప్పి నీవు మది వర్తించితివి - ఇది మొదలు నీకు యుద్ధములే

5. స్వార్ధముతో నేనబదినై - వ్యర్థముగా నడిచిన యెడల
   మోసముకై త్వరపడి - నా పాదము పరుగిడిన
   దృష్టించు ప్రభు నేత్రోవలను - లెక్కించు అడుగులను
   దేవుడెరుగు నా యదార్థతంతయు - తరచి తూచును త్రాసులో

6. ఏడు ఆత్మల ఉపదేశం - ఏడు సంఘముల హెచ్చరించన్
   రూఢిగ మేఘమున ప్రభు వేగమిలకు రాగా
   బీతితో గాంచు ప్రతి నేత్రం - పొడిచిన వారు సహా
   లోకులు రొమ్మును బాదుకొందురు - బహు సిద్ధమా నీవు ప్రభుని చేర

7. ప్రభు ఆలోచన నిలుచు సదా ప్రభుసంకల్పము తర తరముల్
   సంస్తుతితో నీతిపరులు క్రీస్తు సన్నిధని ఆనందించుడి దేవునిలో
   క్షితిని ప్రతి క్షణము యదార్ధ హృదయులందరు
   ఏకమై చేయుడి ఉల్లాస గానము
486 యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతోyesuni nammedivaaru aayana uchita krupato

Psalms 92:12

పల్లవి:
యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో (1)
నీతిమంతులయ్యెదరు - యేసుని నమ్మెడివారు (1)

1. ఖర్జూరపు చెట్టువలె - మొవ్వు వేయుచుండెదరు (2)
   ఖర్జూరపు మట్టలతో - రక్షణకై స్తుతించెదరు (2)

2. లేబానోను దేవదారు - చెట్టువలె ఎదుగుదురు
   ప్రభు కృపాజ్ఞానములో - ఎదుగుచు నుందురువారు

3. యెహోవా మందిరములో - నాటబడి యుండెదరు
   సహనముతో నిలిచెదరు - కదలక స్థిరులై యుండెదరు

4. దేవుని యావరణములో - వర్ధిల్లుచు నుండెదరు
   సేవింతురు తమ ప్రభుని - ఘనపరతురు నిరతంబు

5. వారు ముసలితనంబున - చిగురు పెట్టి ఫలింతురు
   ప్రసిద్ధి చేతురు ప్రభుని - యథార్థవంతుడనుచు

6. నీటి కాలువ యోరను - నాటబడిన వారలై
   మేటిసారము కలిగి - పచ్చగ నుందురు వారు

7. హల్లేలూయ పాటపాడి - వల్లభుని స్తుతింతురు
   చల్లని ప్రభురాకడకై - మెల్లగా వేచియుండెదరు
487 యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడుyehovaanu stutinchudi aayana dayaaludu

Jeremiah 15:21

పల్లవి:
యెహోవాను స్తుతించుడి - ఆయన దయాళుడు
శత్రుని చేతిలో నుండి కాచిన బలవంతుడు తానే (2)

1. యోసేపును విడిపించిన కర్త - ఎల్ల - మోసములోనుండి కాచున్ (2)
   ప్రియముతోడ పాశముతోడ (2)
   నాశము లేకుండ బ్రోచిన దేవుడే (1)

2. షిమ్యోనును గాచిన ప్రభువు - ప్రతి - నిమిషము మనలను కాచున్
   కూడెద మిపుడే స్తోత్రముతోడ
   పాడెద మిచ్చట కూడిన మనము

3. మనష్షేను కరుణించి - వాని పాపములను మన్నించెన్
   రాజాధిరాజు తప్పడు మాట
   ఎన్నటెన్నటికి మనతో నుండును

4. యెహోయాకీను తలనెత్తి మరణాజ్ఞనుండి మన్నించి
   చెరవస్త్రములను మార్చిన తండ్రి
   డాగులేని వస్త్రముల మనకిచ్చెను

5. యిర్మియాను పైకెత్తి - చెఱ ముట్టడినుండి కాపాడి
   విడుదలనిచ్చి యింటికి నడిపి
   కష్టములబాపి ప్రేమ చూపించెను

6. పేతురును కాచినదూత - అనేకులకాచిన ప్రభువు
   ప్రార్థనలెల్ల వెంటనే వినుచు
   సంఘపు మొఱలను విని విడిపించెను

7. పౌలును సీలను కాచి - సంఘ చింతల నెల్లను తీర్చి
   విడుదల నిచ్చున్ తిమోతియుకు
   కడు భక్తితో పాడెదముగా హల్లెలూయ
488 సీయోను పాటలు సంతోషముగseeyonu paatalu santoshamuga

Hebrews 13:14

పల్లవి:
సీయోను పాటలు సంతోషముగ - పాడుచు సీయోను వెళ్లుదము (2)

1. లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు (2)
   పొందవలె నీలోకమునందు - కొంత కాలమెన్నో శ్రమలు (2)

2. ఐగుప్తును విడచినట్టి మీరు - అరణ్య వాసులే యీ ధరలో
   నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానాను పై నిలుపుడి

3. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి
   నీరక్షకుండగు యేసే నడుపును - మారనితనదు మాటనమ్ము

4. ఐగుప్తు ఆశల నన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి
   పాడైన కోరహు పాపంబుమాని - విధేయులై విరాజిల్లుడి

5. ఆనందమయ పరలోకము మనది - అక్కడ నుండి వచ్చునేసు
   సీయోను గీతము సొంపుగ కలసి - పాడెదము ప్రభుయేసుకు జై
489 ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానుidigo nenoka nootana kriyanu cheyuchunnaanu

Isaiah 43:19

పల్లవి:
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను (2)

అను పల్లవి:
ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2) ||ఇదిగో||

1. అడవిలో త్రోవనుజేసి - ఎడారిలో నదులను నేను (2)
   ఎల్లప్పుడు సమృద్ధిగా - ప్రవహింప జేసెదను (2)

2. నాదు ప్రజలు త్రాగుటకు - నేనరణ్యములో నదులు
   సమృద్ధిగా పారునట్లు - సృష్టించెదను నేను

3. అరణ్యములో జంతువులు - క్రూరపక్షులు సర్పములు
   ఘనపరచును స్తుతియించును - దీని నాలోచించుడి

4. నూతన సృష్టిగ నినుజేసి - నీ శాంతిని నదివలెజేసి
   ననుజూచి మహిమపరచి - స్తుతిబాడ జేసెదను

5. నేనే దేవుడనని దెలసి - నా కార్యములను నెరవేర్చి
   ముందున్న వాటికన్న - ఘనకార్యములను జేతున్

6. మరుగైన మన్నానిచ్చి - మరితెల్లని రాతినిచ్చి
   చెక్కెదనా రాతిమీద - నొక క్రొత్త నామమును

7. పరలోక భాగ్యంబులు - నరలోకములో మనకొసగెన్
   కరుణాసంపన్నుడగు - మన ప్రభువునకు హల్లెలూయ
490 స్వచ్ఛంద సీయోనువాసి సర్వాధికారి కస్తూరి పూరాసిsvachhanda seeyonuvaasi sarvaadhikaari kastoori pooraasi

Joshua 21:44

పల్లవి:
స్వచ్ఛంద సీయోనువాసి - సర్వాధికారి - కస్తూరి పూరాసి ఆ .. ఆ ..  (2)

అను పల్లవి:
వర్తమాన భూతభవి - ష్యత్కాలవాసి (2)
అల్ఫా ఓమేగ తానే - ఆద్యంతము మన యేసే (2) || స్వ ||

1. ఇదిగో నేనొక నిబంధనను - అద్భుతముల జేతున్ నీ ప్రజలందరి యెదుట (2)
   పరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువే (2)
   లెక్కలేని యద్భుతముల్ - మక్కువతో చేయువాడు (2)

2. సంగీత నాదములతోడ - సీయోనుపురము సొంపుగను చేరితిమి
   శాశ్వత సంతోషము మా - శిరములపై వెలసెన్
   దుఃఖము నిట్టూర్పును పోయెన్ - మిక్కిలి ఆనందముగల్గెన్

3. నీలముల పునాదులు వేసి - నీలాంజనములతో - మాణిక్య మణులతో
   సువర్ణ శునీయముల - సూర్యకాంతముతో
   ప్రశస్త రత్నములతో - ప్రవిమలముగ నినుగట్టెదను

4. సుమముల హారము - సంతోషానంద తైలము నీదే - స్తుతి వస్త్రమును నీదే
   ఉల్లాసవస్త్రంబు నీదే - విడుదలయు నీదే
   హితవత్సరము విముక్తి - ఆత్మాభిషేకము నీదే

5. జలములలోబడి దాటునప్పుడు - బలమై యుండెదను - నీతోడై యుండెదను
   నదులలో వెళ్ళునప్పుడు - నీపై పారవు
   అగ్ని మధ్యను నడచినను - జ్వాలలు నిను కాల్చగలేవు

6. ఇత్తడి తలుపుల బగుల గొట్టెద - నినుప గడియలను - విడగొట్టెదను నేను
   అంధకారస్థలములలో ను-న్నట్టి నిధులను
   రహస్యములో మరుగైన - ధనమును నీ కొసంగెదను

7. గర్భమున పుట్టినది మొదలు - తల్లి యొడిలోన - కూర్చుండినది మొదలు
   నేను చంక బెట్టుకొన్న - నాదు ప్రజలారా
   ముదిమి వచ్చువరకు నిన్ను - ఎత్తుకొను వాడను నేనే
491 యెహోవాయందానందమేyehovaayandaanandame

Nehemiah 8:10

పల్లవి:
యెహోవాయందానందమే - మహా బలము మీకు (2)
ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా (2)

అను పల్లవి:
ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా (2) ||యెహో||

1. నీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదవు (2)

2. నీ దేవుడే నిన్ను తృప్తిచేసి నీ ఎముకలను బలపరచును

3. ఉన్నత లోకాన మీ పేరు ఉన్నదనుటే మన సంతోషము

4. ఆనంద మొందుము యెహోవాలో ఆయనే తీర్చును నీ వాంఛలు

5. దేవుని చిత్తమును చేయుట జీవార్థమగు మన సంతోషము

6. సంపూర్ణముగ మన సంతోషము సొంపుగా యేసునిలోనున్నది

7. వేడిన దొరకు నేడే మీకు నిండైన సకల సంతోషము

8. జీవ జలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును

9. కన్నుల నుండి తుడుచును కన్నతండ్రివలె కన్నీటిని
492 దేవుడు మీకు ఎల్లప్పుడుdevudu meeku ellappudu

Zechariah 8:23

పల్లవి:
దేవుడు మీకు ఎల్లప్పుడు -దేవుడు మీకు ఎల్లప్పుడు - తోడుగనున్నాడు ... (3)

1. ఏదేనులో ఆదాముతో నుండెన్ (2) - హానోకు తోడనేను (2)
   దీర్ఘ దర్శకులతో నుండెన్ (2) - ధన్యులు దేవుని గలవారు (2)
   తోడుగనున్నాడు (1)

2. దైవాజ్ఞను శిరసావాహించి (2) - దివ్యముగ నా బ్రాహాము
   కన్న కొమరుని ఖండించుటకు - ఖడ్గము నెత్తిన యపుడు
   తోడుగనున్నాడు

3. యోసేపు ద్వేశించ బడినపుడు (2) - గోతిలో త్రోయబడినపుడు
   శోధనలో చెఱసాలయందు - సింహాసన మెక్కినయపుడు
   తోడుగనున్నాడు

4. ఎర్ర సముద్రపు తీరమునందు ఫరోతరిమిన దినమందు
   యోర్దాను దాటినదినమందు - యెరికో కూలిన దినమందు
   తోడుగనున్నాడు

5. దావీదు సింహము నెదిరించి (2) - ధైర్యాన చీల్చినయపుడు
   గొల్యాతును హతమార్చినయపుడు - సౌలుచే తరుమబడినపుడు
   తోడుగనున్నాడు

6. సింహపు బోనులో దానియేలు - షద్రకు మేషా కబేద్నెగో
   అగ్ని గుండములో వేబడెన్ నల్గురిగా కనబడినపుడు
   తోడుగనున్నాడు

7. పౌలు బంధించబడినపుడు పేతురు చెరలో నున్నప్పుడు
   అపోస్తలులు విశ్వాసులు (2) - హింసించ బడినయపుడు
   తోడుగనున్నాడు
493 ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు సంతోషముellappudu ellappudu ellappudu santoshamu

1 Thes 5:16

పల్లవి:
ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు సంతోషము - యేసు నాతోకూడ నున్నందున (2)

1. ఎల్లను పెంటతోడ తుల్యము - నరు - లెల్లరును మన్నై పోవుదురు (1)
   రంగుగ ప్రియ యేసు మిత్రుడు నాకుండ - మంగళముగ నుందు కొదువలేదు (1)

2. తల్లి దండ్రులాప్తుల్ మరణమైన - నింక - నెల్ల స్నేహియులు గతించినన్
   రాజుయేసుక్రీస్తు ప్రకాశమిత్రుడు
   కొదువలేదు నాకు దిగులు లేదు

3. కావలివాడు నిద్రపోడు కున్కడు - ఆశ ప్రేమ కలిగినవాడు
   పదివేలు కత్తివాతన్ ప్రక్క కూలిన
   దిగులొందను నేను భయమొందను

4. ఇహలోహ సత్రంబు నందున్నను - స్వర్గ - గృహము పైన నాకు నిత్యముండున్
   అచ్చట శాశ్వతంబుగ నుందుగాన నా
   కిచ్చట సతతమని ఎటులందును

5. ఈ నరులు నన్ను బహుతిట్టి దూషించిన -నా పేరు చెరుప ప్రయత్నించిన
   బదులు చెప్పను నా నాలుక నెత్తను
   యేసు వలె వారి కరుణింతును

6. ఎట్టి శ్రమలు కష్టనష్టములున్న - దుష్ట సైతానుడు ఎదిరించిన
   భయపడను నా కపాయము కలుగదు
   నా యేసు నాకు జయవీరుడు

7. ఆదరించు వారలాప్తులెల్లరు - ఈ భూతలమును వీడిపోయినను
   పరమ ఆదరణ కర్త యేసు వెంట
   ప్రేరేపితుడనై ఏగుదు నెల్లడన్

8. నా మిత్రుని చేయిబట్టి - నే నిల్తును - నా శత్రుని జయింతు - ప్రభు శక్తిచే
   వాక్య ఖడ్గంబును - విల్లును ధరియించి
   విజయంబు నొందెద - వీరునిగా
494 దేవసమాధానం శాంతినదివలెdevasamaadhaanam shaantinadivale

Isaiah 66:12

1. దేవసమాధానం శాంతివలె - ప్రవహించుచుండు వరదరీతి
   మెండుగాను పారుచుండు నిత్యము - నిండులోతుగాను వృద్ధియగును

పల్లవి:
దివ్య యేసు మీద నానుకొందుము -నిత్య విశ్రాంతిని పొందియుందుము

2. చేతినీడ క్రింద నన్ను దాచెను - శత్రుభయముచే దిగులొందను
   కాపాడును చంచలము రానీక - కించిత్తేని దుఃఖ పడనీయడు ||దివ్య||

3. నీడవలెనుండు దుఃఖక్లేశమున్ - సూర్యజ్యోతియైన తన కృపచే
   పారద్రోలి నిత్యానంద మిచ్చును - కాన జీవితము సఫలమగున్ ||దివ్య||
495 ఆత్మ విషయమై దీనులైనవారుaatma vishayamai deenulainavaaru

Matthew 5:3-12

1. ఆత్మ విషయమై - దీనులైనవారు (2)
   ధన్యులు పరలోక (2) - రాజ్యము వారిది (1)
   దుఃఖపడువారు - ధన్యులు ధన్యులు (2)
   వారు ఓదార్చ - బడుదురు (2)

2. సాత్వీకులు ధన్యులు వారు
   భూలోకమును స్వ - తంత్రించుకొందురు
   నీతికొర కాకలి - దప్పులు గలవారు
   ధన్యులు వారు తృప్తి - పరచబడుదురు

3. కనికరములుగల - వారు ధన్యులు
   వారు కనికరము - పొందుదురు
   హృదయశుద్ధిగల - వారు ధన్యులు
   వారు దేవుని చూచెదరు

4. సమాధానపరచు - వారు ధన్యులు వారు
   దేవుని కుమారు - లనబడుదురు
   నీతి నిమిత్తము హిం - సింపబడువారు
   ధన్యులు పరలోక రాజ్యము వారిది

5. నా నిమిత్తము జనులు - మిమ్మును నిందించి
   హింసించి మీమీద - అబద్ధముగా
   చెడ్డమాటలెల్ల - పలుకునప్పుడు
   మీరు ధన్యులు - మీరు ధన్యులు

6. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు
   మీ ఫలము అధికమగును
   ఈలాగున వారు - మీకు పూర్వమందు
   ఉం డిన ప్రవక్తలను - హింసించిరి
496 శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమshaashvatamainadi prema yehovaa tandri prema

1 Cor 13:8

పల్లవి:
శాశ్వతమైనది ప్రేమ (2) - యెహోవా తండ్రి ప్రేమ (2)- శాశ్వతమైనది ప్రేమ (2)

అను పల్లవి:
ప్రేమలో భయమేమియు లేదు (2) - ప్రేమ పరిపూర్ణంబైయున్న (2) || శాశ్వ ||
భయమును - పారగద్రోలున్ (2)

1. దీర్ఘకాలము ప్రేమ (2) - దయచూపి సహించును (2)
   దీర్ఘకాలము ప్రేమ (2) - మత్సరపడదీ యుత్తమ ప్రేమ (2)
   డంబముగా నడువనిదీ ప్రేమ (2) - ఉప్పొంగనిదీ ప్రేమ (2)

2. స్వప్రయోజనమును - ఎప్పుడు కోరనిదీ ప్రేమ
   స్వప్రయోజనమును - అమర్యాదగ నడువని ప్రేమ
   త్వరగా కోపపడని ప్రేమ - తలచదు అపకారమును

3. దుర్నీతిలో గాక - సత్యాన సంతోషించున్
   దుర్నీతిలో గాక - అన్నిటిని తాళుకొను ప్రేమ
   అన్నిటినమ్మియోర్చెడి ప్రేమ - అన్నిటి నిరీక్షించున్

4. నిలుచును విశ్వాసము - నిరీక్షణయు మరి ప్రేమ
   నిలుచును విశ్వాసము - వీటిలో శ్రేష్టమైనది ప్రేమ
   ప్రేమను కల్గియుండుటకు - ప్రయత్నించుడి మీరు

5. ప్రేమలేనివాడు - దేవుని ఎరుగనివాడు
   ప్రేమలేనివాడు - మన దేవుడు ప్రేమస్వరూపి
   తన ప్రేమ మనలో సంపూర్ణ - సిద్ధిని పొందవలయు

6. నిన్నడుగుచున్నాడు - నిను ప్రేమించిన ప్రభుయేసు
   నిన్నడుగుచున్నాడు - నన్ను ప్రేమించుచున్నవా?
   వీరికంటె నా పై నీకు - ఎక్కువ ప్రేమగలదా?

7. నను ప్రేమించినయెడల - నాయాజ్ఞలను గైకొనుము
   నను ప్రేమించినయెడల - మీలో మీరు ఒకరినొకరు
   ప్రేమించుకొనుచున్న ఎడల - అదియే మహాదానందం
497 పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడిparishuddhulai yundudi daiva chittamuna perugudi

1 Peter 1:16

పల్లవి:
పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి (1)
యథార్దులై యుండుడి - పరిశుద్ధులై యుండుడి (1)

1. నడతలలో - వస్త్రములలో - ఆటంకము లేమియు లేకుండ (2)
   అడుగు ప్రశ్న జవాబులలో - విడువకజూపుము - పరిశుద్ధత (2)

2. పనులలోన ప్రతిస్థలమున - పరిశుద్ధ జీవిత మవసరము
   ప్రతిదారిన్ - ప్రతి సమయమున - పనులలో చూపుము - పరిశుద్ధత

3. ప్రేమ ఐక్యత పెరుగజేయున్ శ్రమ దుఃఖముల దూరపరచున్
   ప్రియముతో నెల్లరు చేరి - పోరుమాని కోరుము - పరిశుద్ధత

4. దేవునిపోలిన జీవముఁజూప - కావలయును పావన జీవం
   జీవిత వేషంబు వ్యర్థము - కీడునుబాపును - పరిశుద్ధత

5. శుద్ధసాక్ష్యము - భద్రపరచును - ఇద్దరిణిలో సిద్ధపరచున్
   శుద్ధమగు - చిత్తంబు కలుగు - నిత్య పవిత్రత నిడు - పరిశుద్ధత

6. నీతితోడ - జ్యోతియుండిన - లేదు కొఱత లేదు చూడన్
   మేదినిపై నిలుచు శేషము - వాదమేమి నికలేదు - పరిశుద్ధత

7. ఇలను దేహమాత్మలందు - కల్మషంబు కానరాదు
   తెలుపగు తేటైన మచ్చలు - సిలువరక్తమున - పరిశుద్ధత
498 ప్రేమా ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే ఆనంద మానందమేpremaa premaa premaa priyudavu neeve aananda maanandame

1 John 4:8

పల్లవి:
ప్రేమా ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే (1)- ఆనంద మానందమే (2)

1. నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచితినయ్యా (2)
   నీ ప్రేమధికమయ్యా - నా పై - నీ ప్రేమధికమయ్యా (2)

2. పరలోక ప్రశస్తరాజా - ప్రేమతో నేతెంచినావా
   ప్రేమ తెలియగలనా - నీ ప్రేమ - లోతునెరుగగలనా?

3. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను - గాంచక తిరిగితినయ్యా
   ప్రేమతో నా ప్రియుడా - నన్ను - కౌగిలించితివే

4. ఇహలోక సకల మహిమ - పువ్వులవలె వాడిపోవున్
   వాడదే అయ్యా - నీ ప్రేమ - వాడిపోదయ్యా

5. నీ ప్రేమ మాధుర్యమును - వివరింప తరమౌనే నాకు
   అతి సులభముగానే - పరమున - వివరించగలను
499 ఎరిగియుంటివే యెహోవాerigiyuntive yehovaa

Romans 8:29-30

1. ఎరిగియుంటివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - ఎరిగియుంటివే (1)
   భూమి పునాదులు వేయకముందే (2) - ఆకాశము సహా లేకున్నపుడే (1)
   ఇలపర్వతములు నిలవకముందే (1)- కనబడు ప్రతిదియు లేకున్నపుడే (2)
   ఎరిగియుంటివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - ఎరిగియుంటివే (1)

2. నిర్ణయించితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నిర్ణయించితివే
   పరమున కూటము జరుగకముందే - రక్షణ వెలుగుకు రాకున్నపుడే
   ప్రాయశ్చిత్తపు బలికాకున్నపుడే - యేసు రూపమిల్ నేర్పడనపుడే
   నిర్ణయించితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నిర్ణయించితివే

3. పేరున పిల్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - పేరున పిల్చితివే
   చేత ఆదామును చేయకముందే - హానోకు నీతో నడువకముందే
   నోవాహును రక్షింపకముందే - పిత్రుడబ్రామును పిలువకముందే
   పేరున పిల్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - పేరున పిల్చితివే

4. నీతిగ తీర్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నీతిగ తీర్చితివే
   గర్భములో నే కలుగకముందే - కాలపరిమితి కాకున్నపుడే
   కటిక చీకటి కాకున్నపుడే - నిర్దేవుడనై నేనుండగనే
   నీతిగా తీర్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నీతిగ తీర్చితివే

5. మహిమ పరచితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - మహిమ పరచితివే
   తేజోమయముగ దివిరాజ్యమున - దూత గణంబులు ప్రీతిగ పొగడ
   తరుగని నిత్యతండ్రి మహిమతో - మహిమ రూపుడగు మరియ సుతునితో
   మహిమ పరచితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - మహిమ పరచితివే
500 నే యేసుని వెలుగులో నడిచెదనుne yesuni velugulo nadichedanu

John 8:12

1. నే యేసుని వెలుగులో నడిచెదను - రాత్రింబగలాయనతో నడిచెదను (1)
   వెల్గున్ నడిచెదను వెంబడించెదను - యేసుడే నా రక్షకుడు (1)

పల్లవి:
నడిచెద నే ప్రభుయేసునితో - నడిచెద నే ప్రభు హస్తముతో (1)
కాంతిలోనుండగ జయంగాంతును - యేసునే నే వెంబడింతును (1)

2. నే యేసుని వెలుగులో నడిచెదను - గాఢంబగు చీకటిలో భయపడను
   ఆత్మతో పాడుచు సాగిపోవుదును - యేసుడే నా ప్రియుండు ||న||

3. నే యేసుని వెలుగులో నడిచెదను - వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును
   సర్వమిచ్చెదను చెంత నుండెదను - యేసుడే ప్రేమామయుడు ||న||

4. నే యేసుని వెలుగులో నడిచెదను - దిన సహాయము నే పొందెదను
   సుఖదుఃఖమైన మరణంబైన - యేసుడే నా యండనుండును ||న||

5. నే యేసుని వెలుగులో నడిచెదను - నా దృష్టిని ప్రభుపై నుంచెదను
   సిల్వధ్వజమునే బట్టి వెళ్ళెదను - యేసుడే నాచెంత నుండును ||న|
501 మీరే లోకమునకు వెలుగుmeere lokamunaku velugu

Matthew 5:13-16

పల్లవి:
మీరే  (2)   లోకమునకు వెలుగు - లోకమునకు ఉప్పు మీరే (1)

1. మనుజులు మీదు మంచి క్రియలను - కని తండ్రిని మహిమ పరచగ (2)
   వినయమున మీ వెలుగు వారికి - కనబడగా ప్రకాశించుడి (2)

2. కొండమీద నుండు పట్టణము - ఉండనేరదు మరుగైనిజముగ
   దండిగ మనదు తండ్రి స్వరూపము - ఉండగ మీలో ప్రకాశించుడి

3. దేవుని వాక్యము వెలుగై యున్నది - జీవించుడి వెలుగును కలిగి
   పావనమగు సహవాసము కలిగి - దేవుని ఆత్మలో నిండి వర్థిల్లెడు

4. మరణచ్చాయలో మీరుండగ - పరమ వెలుగు ప్రకాశించెను
   పరిగిడె చీకటి వెలుగుదయించగ - పరిశుద్దాత్మ ఫలములు పొందిన

5. మీరికమీదట పరదేశులును - పరజనులుగ నుండక యుందురు
   పరిశుద్దులతో నేకపౌరులై - దేవుని గృహమునై యున్న

6. రాత్రి పగలు భేదము లేక - చంద్రుని సూర్యుని కాంతియు లేక
   ప్రభువగు దేవుడు ప్రకాశించును - యుగయుగముల కాయన రాజ్యము

7. ప్రభువగు దేవుడే జీవమై యుండియు - ఉప్పుగా జేసెను మిమ్మును తనకై
   ఉప్పును బోలి సారము కలిగి - ప్రభుయేసునకే హల్లెల్లూయ పాడుడి
502 బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింపbalavantudesu mahima - paadi veelagune vivarimpa

Isaiah 12:3

1. బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింప (1)
   కల్వరి రక్షణవిలువ ఎల్లరికిని దొరుకును (1)

పల్లవి:
హా! రక్షణంపు బావులెల్లను అంతులేని లోతుగలవి (1)
ఎండిపోవు ఎన్నడైనను చేదికొందు మెన్నడందున (2)

2. నీళ్ళు లేని శ్రమ యెంతయో - దీని నాలోచించరే యెవ్వరు
   విలువైన ప్రభుని మాటలను ఆలకించి యంగీకరించు || హా! ||

3. ఉప్పునీళ్ళ బావులున్నను ఇక ఉపయోగము యుండదు
   తప్పులన్ని త్రోసివేయుము అప్పుడే యానందమబ్బును || హా! ||

4. కలహముల మానివేతుము మంచి - జలముల త్రాగి యానందింతుం
   ఎల్లర మేకమౌదము తొలగద్రోసి యడ్డులన్నియు || హా! ||

5. జీవజలముల త్రాగినవారు - మీరు దేవుని సాక్షులై యుండుడి
   భువి నెందరో దప్పిగొన్నారు త్రోవ జూపుడి వారికి || హా! ||
503 నేనే భయపడ కూడదనెనుnene bhayapada koodadanenu

Matthew 14:27

పల్లవి:
నేనే భయపడ కూడదనెను ఆ ఆ ఆ  -
ఆ - ఆ - ఆ  శిష్యులను ధైర్యపరచిన వాడతడే (2)

1. ఐదు రొట్టెలు రెండు చేపలతోనే - ఐదువేలను పోషించినవాడే (2)
   అద్దరికి వెళ్ళ నాజ్ఞాపించిన ప్రభువే - ప్రేమించిన వాడే (2)

2. గాలి యెదురైన ధైర్యము విడువకు - అన్నియు మేలుకై సమకూడి జరుగును
   అంతము వరకు తోడుగ నుండును - మొరలిడి కలవరపడకుడి

3. లోకములో మీకు శ్రమలే కలుగున్ - శ్రమలే సహజము నరులందరికిన్
   శ్రమలో ధైర్యము కలిగించుటకై - వాగ్దానము లన్నియు నిచ్చెను

4. ఆయనే దేవుడు ఊరక యుండుడి - ఆయననే యెరుగుడి మీరు
   ఉన్నతుడాయనే అన్యజనులలో - మహోన్నతుడు భూజనములలో

5. కలవర పడకుండని నడువుచు తనబిడ్డల నాదరించినవాడే
   పరిశుద్ధాత్ముని అందర కొసగి - కృపజూపిన మహాప్రభుండే

6. యుద్ధము చేయును యెహోవా - స్తుతించుట మన విధి యగును
   యుద్ధాయుధము ఆత్మీయమైనది - ఆయనకే స్తుతి హల్లెలూయా
504 మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమిmanamu yesu prabhuni mahima kanugontimi

John 1:14

పల్లవి:
మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి (2)

1. తండ్రినుండి కలిగిన ఏకైక పుత్రుని మహిమ -
   వలె ఆయన మహిమను - కనుగొంటిమి (2)

2. నీవు నమ్మిన యెడల - దేవుని మహిమ చూతువు -
   జీవ పునరుత్థానము యేసు

3. ప్రత్యక్షగుడారమును - మేఘము కమ్మగానే -
   యెహోవా తేజస్సు నిండెను

4. దేవుని నివాసము - మనుజులతో నున్నది -
   నివసించు - దేవుడే వారిలో

5. మహిమా ప్రభావముతో - మకుటము ధరించిన క్రీస్తు -
   తనయులను తెచ్చె మహిమకు

6. మన రక్షణ కర్తను శ్రమతో - సంపూర్ణుని జేయ -
   మన తండ్రికే తగియున్నది

7. మన చులకని శ్రమలు - రాబోవు మహిమ యెదుట -
   ఎన్నతగినవి కావు

8. పరిశుద్ధ పట్టణములో - దేవునికే మహిమ -
   ప్రభువునకే మహిమ హల్లెలూయ
505 దేవా! నీ తలంపులు నా కెంతో ప్రియము ఎంతో ప్రియముdevaa! nee talampulu naa kento priyamu ento priyamu

Psalms 139:17

పల్లవి:
దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము ఎంతో ప్రియము (2)
వాటిమొత్తము దాసుడనగునే - నెంచి చెప్పెద గొప్పది గొప్పది (2)

1. పాతాళపు పాశములు - నన్ను అరికట్టగా (2)
   ఆవరించె మరణ ఉరులు (2) - క్రుంగిపోతినో దేవా (3)
   ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని (2)
   అందుకే నే పాడెద - కీర్తించెద (1)

2. నా మీదికి లేచువారు - నన్ను బెదరించెడు వారు
   దేవా నీ రక్షణ నా నుండి - దాటిపోయెననె వారు
   ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
   అందుకే నే పాడెద - కీర్తించెద

3. నీవే నా కాపరి నంటివి - కాపుదలలో రాలేక యుంటిని
   పాపినై యుండి పాపమెరుగనంటి - శాపగ్రస్తుడనైతి దేవా
   ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
   అందుకే - నే పాడెద - కీర్తించెద

4. మూతవేసిన నా మూర్ఖతయును - దాగియుండిన నా పాపమును
   విప్పిచూపి శిక్షింపనంటివి - కక్షలేని నా దేవా
   అర్హతలేనివాడను - సర్వము పోయినవాడను
   అందుకే నే పాడెద - కీర్తించెద

5. నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లును
   శ్రమపొంది యుండుట నాకు - మేలని నేర్పించితివి
   నీ ధర్మ శాస్త్రము నాకు ప్రియము - దినమెల్ల నేను
   ధ్యానింతును అందుకే నే పాడెద - కీర్తించెద

6. పర్వతములు తొలగిపోయినను - తత్తరిల్లిన మెట్టలు మట్టమై
   ఒట్టు పెట్టుకొని నేను చెప్పెద - విడచిపోదు నిన్ నాదు కృప
   నీ వాగ్దానములకే నా స్తోత్రము - నా ఆర్త ధ్వనులు నా హృదయ ధ్యానం
   అంగీకరించు దేవా - కీర్తించెద

7. నేను చేయునది ఇపుడు - నీవు ఎరుగజాలవనె
   తెలిసికొందువు నీవు ఇక ముందుకు - నా పరిపూర్ణ మార్గమిదే
   వింటిని నే నీ స్వరము - కంటిని నే నీ రూపము
   హల్లెలూయ పాడెద - కీర్తించెద
506 ఆకాశమా! ఆలకించుమా మాటలాడెదన్aakaashamaa! aalakinchumaa maatalaadedan

Genesis 35:2

పల్లవి:
ఆకాశమా! ఆలకించుమా - మాటలాడెదన్...2
యెహోవా వంతు ఆయన జనమేగదా యాకోబే స్వాస్థ్యభాగము...2

1. అరణ్య ప్రదేశంబుల యందున (2)
   భీ - క -ర -ధ్వనిగల యెడారిలో వాని కనుగొనెను (2)
   ఆవరించి వాని పరామర్శించి గాచె కనుపాపగా (2)

2. యెహోవాయే వాని నడిపించెను
   భూ - మి -యొక్క ఉన్నతస్థలముల మీద వాని నెక్కించి
   అన్య దేవతలతో నేదైనను లేకపోయె వానిలో

3. లేచి వెళ్ళుమనే బేతేలునకు
   దే - వు - నికి బలిపీఠమచ్చట కట్టుమని సెలవియ్యగా
   అన్యదేవతల పారవేయుమని తనవారితో చెప్పెన్

4. తిరిగి బేతేలులో దర్శన మిచ్చెను
   దీ - వించి నీ పేరు ఇశ్రాయేలుగా నెల్లప్పుడుండుననెను
   తన యింటికి వచ్చువారి నెల్ల ప్రభుదీవించు నీరీతిన్

5. ప్రభుని రాకడ సమీపమంచును
   స - మా - జముగా కూడుట మరువక మరియు మీరు మానక
   ప్రభుని యింటి దీవెన లెల్ల పొందుడి నిక్కముగా
507 సమాధాన గృ హంబులోనుsamaadhaana gru hambulonu

Ephesians 2:16

పల్లవి:
సమాధాన  -  గృ  -  హంబులోను  సమాధానకర్త  స్తోత్రములు (2)

1. క్రీస్తు యేసు మనకిలలో - నిత్య - సమా - ధానము (2)
   మధ్యపు గోడను - కూలద్రోసెను (2)
   నిత్యశాంతిని మనకొసగెన్ (2)

2. నదివలె - సమాధానం - వడిగా ప్రవహించు చున్నది
   అడ్డుల ద్రోసి - మధ్యను నిలిచె
   శ్రద్ధతో - మధ్యకు చేర్చెన్

3. లోకమిచ్చు - నట్లుగా - కాదు ప్రభు సమాధానము
   సత్యమైనది నిత్యము నిల్చును
   నిత్యు డేసుచే కల్గెన్

4. దేవుని - రాజ్యమిల - కాదు - భోజనపానముల్
   నీతియు - సమాధానము నిల
   పరిశుద్ధాత్మలో ఆనందం

5. పర్వతములు - తొలగినను తత్తరిల్లిన - కొండలు
   నాదు - కృప నిన్ను - విడువదనెను
   నా సమాధానము - ప్రభువే

6. ఆశ్చర్య - కరుడు యేసే ఆలోచన - కర్తయు
   బలవంతుడేసు - సమాధాన ప్రభు
   బలపరచు - తన ప్రజలను
508 లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటనుlechirandi vishvaasulaaraa yordaan nadini daatanu

Joshua 1:2

పల్లవి:
లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను (1)
విడిచి పెట్టుడి మిశ్రాయీం సుఖవిలాస మాయలన్ (2)

1. సందేహించక లేశమైన - యేసుని వాగ్దానముల్ (2)
   ముందంజవేసి నిరాశ వీడి (2)
   ప్రభుపై నమ్మికయుంచుడి (1)

2. యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్
   సొదొమవైపు తిరిగి చూడక
   వెళ్ళుడి - సీయోన్ నగరునకు

3. పరికించుడి యేసుని కల్వరిలో కన్నులతో
   దూరపరచి బంధకముల
   నశింపజేసె మరణమున్
509 రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ముraarammu raarammu saatveekudaina yesuni yoddaku raarammu

Matthew 11:29

పల్లవి:
రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము -
రారమ్ము - ప్రభుని యొద్ద నేర్చుకొన నేర్చుకొన (1)

1. సర్వమునకు సృష్టికర్త - సర్వాధికారియగు (2)
   దేవుని కుడి పార్శ్వమున - నుండి నీతో మాట్లాడును (2)

2. పాపభారము వలన నీవు - కృంగిపోయి ఉంటివా
   లోక చింతవలన నీవు - కలవరము కలిగియుంటివా

3. దీనుడవై నీ పాపమును - నేడే ఒప్పుకొనుము
   క్రీస్తు నందు విశ్వసించిన - కడుగు తనదు రక్తముతో

4. నీకు ఆయన సమాధాన విశ్రాంతి దయచేయును
   నిన్ను పవిత్రునిగ చేసి - నిన్ను తృప్తిపరచును

5. యేసు ప్రభునే వెంబడించుము - నిన్ను విడువడెన్నడు
   ప్రభునిచిత్తము నెరవేర్చుచు ఆయననే సేవించుము

6. ప్రభునియందు నిలిచియుండిన - ప్రాపుగ ఫలియింతువు
   ప్రభువునకే మహిమ కలుగు - మంచి ఫలముల ఫలియించుము

7. యౌవనజనమా ప్రభుని వాక్యము - విని విధేయత చూపుమా
   యౌవన జీవిత మర్పించుటకు యేసు నొద్దకు రారమ్ము
510 భయపడకుము నీవు యుద్ధము యెహోవదేbhayapadakumu neevu yuddhamu yehovade

Isaiah 54:17

పల్లవి:
భయపడకుము నీవు - యుద్ధము యెహోవదే
నిశ్చయముగ జయము - నీదే భయపడకుము - భయపడకుము నీవు (1)

1. గర్జించు సింహమువలె శత్రువు - నీపైని బడ జూచుచుండె (2)
   నదివలె నీపై పారవచ్చును (2) - యుద్ధము యెహోవదే భయపడకు (2)

2. పాలు తేనెలు ప్రవహించెడు - కానాను మీయెదుట నుండె
   శత్రువు నిన్ను జంపజూచె - యుద్ధము యెహోవదే భయపడకు

3. నీకు విరోధముగ రూపించు - యే ఆయుధము వర్ధిల్లదు
   ప్రతి నాలుక తీర్పుకు లోనగును - యుద్ధము యెహోవదే భయపడకు

4. ఇహపరమునందు మన ప్రభువునకు - సర్వాధికారము నియ్యబడెను
   ఆయన సన్నిధి నీతో యుండును - యుద్ధము యెహోవదే భయపడకు

5. నీవు పోరాడెడు పనిలేదు - నమ్మకముంచి విశ్వాసముతో
   రక్షణను తిలకించుము - జయము ప్రభువుదే భయపడకు
511 భయపడకుము ఓ చిన్న మందా దయగల మీ తండ్రి పిలుచుచున్నాడుbhayapadakumu o chinna mandaa dayagala mee tandri piluchuchunnaadu

Luke 12:32

పల్లవి:
భయపడకుము  ఓ చిన్న మందా -  దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు  (2)

1. తన రాజ్యమంత నీ కీయగోరి (2) - ఉన్నత పిలుపు నీకు నిచ్చెను (2)
   తనరక్తమిచ్చి నిన్ను కొన్నాడు (2)

2. దేవుని రాజ్య మహిమను బొంద - సువార్త ద్వారా నిన్ను పిలిచెను
   నీవు నడువుము తగినట్లు ప్రభుకు

3. పరిశుద్ధులలో పాత్రునిచేయ - పరలోక పిలుపు నీకు నిచ్చెను
   ప్రభుని స్వాస్థ్యమును నీ కిచ్చున్

4. అక్షయ నిర్మల వాడబారని - రక్షణ స్వాస్థ్యము భద్రపరచి
   నిశ్చయముగా నిన్ను పిలిచెను

5. తన కుమారుని నీ కొరకీయ - వెనుదీయలేదు నీ ప్రియతండ్రి
   తన స్వాస్థ్యమంత నీ కొర కిచ్చున్

6. ప్రైశుద్ధాత్మలో నిను శుద్ధిజేసి - పరిశుద్ధుల స్వాస్థ్యము నీ కీయ
   తెరువ జేసెను నీ కన్నులను

7. సిలువలో యేసు చనిపోయి బ్రతికె - గెలిచె - సమాధి బలమీయ నీకు
   హల్లెలూయ యని పాడుము నీవు
512 మనమేసుని వారలముmanamesuni vaaralamu

John 1:14

పల్లవి : 
మనమేసుని వారలము - తనవారిగానే యుందుము
మనలను రక్షించెను - తనకే స్తుతి పాడెదము

1. కృపాసత్య సంపూర్ణ వాక్యము - నరరూపియాయెను
కనుగొంటిమి తండ్రి మహిమను - జనితైక కుమారునిలో
తన ప్రేమ అద్భుతమైనది - మనము కొనియాడెదము
|| మనమేసుని ||

2. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను
మనలను తానే వెలిగించెను - తన వాక్యము ద్వారనే
ప్రభు వుత్తముడని యెరిగి - తనకే స్తుతి పాడెదము
|| మనమేసుని ||

3. దైవపుత్రుండు సజీవరాళ్ళతో - యింటిని కట్టుచున్నాడు
దేవుని తేజము రాగా - మహిమతో నిండె గృహము
ఆయన మందిరములో - తన మహిమను పాడెదము
|| మనమేసుని ||

4. ఎందరిని ప్రభు ముందు యెరిగెనో - వారిని నిర్ణయించెను
పిలిచి నీతిగా తీర్చి - మహిమ పరచెను
తన తనయుని రూపమిచ్చె - మన మానంద మొందెదము
|| మనమేసుని ||

5. పూర్ణమహిమతో మనప్రభు యేసు - దూతలతో వచ్చును
కనిపెట్టు వారెత్తబడెదరు - తన మహిమ పొందెదరు
తన రాజ్యముగా జేసె - హల్లెలూయ పాడెదము
|| మనమేసుని ||

6. మహిమ నివసించు మహిమ రాజ్యంబు
మహిమతో నిండి యుండును
మన ప్రభువే దీపమై యుండును
తన వెలుగు ప్రచురమగున్
యుగయుగములు మనమంతా
ప్రభుయేసుతో నుండెదము
|| మనమేసుని ||
513 వారు ఆయన తట్టుచూడగా వెలుగు కలిగెనుvaaru aayana tattuchoodagaa velugu kaligenu

Psalms 34:5

పల్లవి:
వారు ఆయన తట్టు చూడగానే (2) - వారికి వెలుగు కలిగెను (2)

1. కృపా సత్య సంపూర్ణుడగు ప్రభువు - కాపాడును మనల ప్రతి శోధన నుండి (2)
   చూపించు తన మహిమ నిత్యము మనకు (2)
   స్థాపించును మనలను తన రాజ్యముగా (2)

2. కనుగొంటివా నీవు దేవుని మహిమ - తన కుమారుడైన యేసు ప్రభువులో
   తన ప్రజలను విడిపింప క్రీస్తేసు
   తనయుండై యిహమున జన్మించెను

3. అంత్య దినంబు వచ్చుచుండెను చూడు - చింతించెదరు పాపులందరిలలో
   చింతించుచు నేడే పశ్చాత్తాపముతో రా
   వింత రక్షణను పొంది ఆనందింతువు

4. యెహోవా తేజస్సు ఆయన శక్తితో - మహిమతో మందిరము నిండి యుండెను
   మహామహుని పాదముల నేడే వేడిన
   మహిమానందము పొంది సంతసింతువు

5. క్రీస్తు యేసు ప్రజలకు యీ భువిని - నీతి సూర్యుడు ఉదయించును మెండుగా
   అతని రెక్కలు ఆరోగ్యము నిచ్చును
   నిత్యము సంతోష గానము చేతురు

6. రక్షింపబడిన ప్రభుని జనమా - రక్షకుడేసుని స్వకీయ ధనమా
   రక్తముతో కొన్నట్టి క్రీస్తు సంఘమా
   ముక్తి దాతను శ్లాఘించి కొనియాడుము
514 లోకం, జీవం, మరణంబైనన్lokam, jeevam, maranambainan

1 Cor 3:22

పల్లవి:
లోకం, జీవం, మరణంబైనన్ -
సకలము మీవె నిజం - స్థిరముగ నమ్ముడిలన్ (2)

1. ప్రస్తుతమందు ఉన్నవియైనన్ - రాబోవునట్టివియైనను (2)
   వాస్తవముగా సమస్తము మీవె (2) - మీరేసుని వారు (1)

2. తన్ను ప్రేమించుచుండెడి వారికి - దేవుడు వేటిని సిద్దపరచెనో
   కన్నులకు గోచరము కావవి - చెవులకు వినబడవు

3. హృదయములకు అగోచరమైనవి - మరుగైయుండె లోకజ్ఞానులకు
   పదిలముగా ప్రభు సహాయముతో - నేరుగు మీ మర్మమును

4. అక్షయమైనది నిర్మలమైనది - వాడబారనిది మీ స్వాస్థ్యము
   రక్షకుడేసు భద్రపరచెను - పరమున మీకొరకు

5. అసమానమగు శక్తిచే మిమ్మున్ - నిత్యముకాచి భద్రపరచును
   యేసు ఆ కడవరి రక్షణ మీకు - నిచ్చు విశ్వసించు

6. మీరే దేవుని పుత్రులటంచు - ఆత్మయే సాక్షమిచ్చు చున్నాడు
   వారసులగు మీరు శ్రమపడిన - మహిమను పొందెదరు

7. జయించువాడు వీటన్నిటిని - స్వాతంత్రించుకొను నిక్కముగా
   ఆయనే మీకు దేవుడైయుండు - మీరాయన సుతులు
515 సర్వశక్తుని వాక్కు యిదియేsarvashaktuni vaakku yidiye

1 Cor 3:21

పల్లవి:
సర్వశక్తుని వాక్కు యిదియే - సర్వమును మీవే  -  దేవుని సర్వమును మీవే (1)

1. పౌలైన కేఫాయైన - అపొల్లోయైన - లోకమైన (2)
   ఉన్నవి మరి యేవియైన (1) - సర్వమును మీవేగా (2)

2. జీవమైనను మరణమైన - ప్రస్తుతమందున్నవైన
   రాబోవునవియైనను - సర్వమును మీవేగా

3. దేవుని పనివారైన - దేవుని గృహమైన
   దేవుని వ్యవసాయమైన - సర్వమును మీవేగా

4. భూమి ఆకాశములందు - అధికార దీవెనలు
   సంఘ సంపూర్ణతయును - సర్వమును మీవేగా

5. నీరు కట్టిన తోటైన - నీటి యూటలైనను
   ఫలములిచ్చు చెట్లయినను - సర్వమును మీవేగా

6. అన్ని స్వతంత్రించుకొని - దైవపుత్రులగుటయును
   అవసరతల ననుభవింప - సర్వమును మీవేగా

7. క్రొత్త సృష్టి స్వాస్థ్యము - పుత్రశ్లాఘ్యమైనను
   దేవుని జీవవాక్యము - సర్వమును మీవేగా
516 సంపూర్ణ రక్షణయూటsampoorna rakshanayoota

Psalms 53:6

1. సంపూర్ణ రక్షణయూట - పొంగుచున్నది చూడుము
   ప్రవహించే రక్షకుని ప్రక్క - గాయమునుండి ఎల్లెడల
   సంపూర్ణ రక్షణ ప్రవహించె - శాశ్వత రక్తనదులు

2. హా! మహిమ ప్రత్యక్షత చూడు ఎడతెగని ప్రవాహము
   శిక్షయును మచ్చల కడిగెను - హిమముకంటె ధవళముగా
   పూర్ణరక్షణ నెరుగుటచేత - ఆశీర్వాదములు కల్గున్

3. అడ్డులేని ప్రేమ ప్రవాహం - ప్రవహించె నన్ని చోట్ల
   శుద్ధముగానుంచును తలంపులను - వాంఛలను సదాకాలం
   పాపమలిన శక్తినుంచి - సంపూర్ణమగు రక్షణ

4. నిత్యమోక్ష జీవము దిగెను - నా హృదయ ఆలయమందు
   దేవుడు నరుడైక్యపడుట - ఆహా! ఎంతటి స్నేహమిది
   క్రీస్తుతో దివ్యజీవమునకు - జేర్చబడిన రక్షణ

5. దుఃఖము చీకటి భయము సిగ్గు - చింత నావిక కానేరవు
   నా రక్షకుడు ముందు నడుచును చీకటి లేదు విశ్వాసములో
   సర్వసంపూర్ణమగు రక్షణ - శాశ్వతమగు రక్షణ
517 నాయాత్మ లంగరువేయ సుస్థిర భూమి చిక్కెనుnaayaatma langaruveya susthira bhoomi chikkenu

Psalms 40:2

1. నాయాత్మ లంగరువేయ - సుస్థిర భూమి చిక్కెను
   నా పాపము హరించెడు - నిత్యుండౌ యేసుగాయముల్
   కల్పాంతకాలమైనను - సదా యీ ప్రేమనిల్చును

2. తండ్రీ! నీ ప్రేమ నిత్యమై - మాయల్ప బుద్ధిని మించు
   నీ యుల్లమందు సర్వదా - కారుణ్యముండినందున
   మరలివచ్చు పాపులన్ - జేర్చి జీవింప జేతువు

3. నీ ప్రేమ లోతుతేలదు - మేమెన్న శక్యముగాదు
   నా పాపమంత దాచితి - నిర్దోషిగా నన్నెంచితి
   శ్రీయేసు పుణ్యముండగా - ధారాళ కృపనిత్తువు

4. నా కష్టముల్ తుఫానుగా - నా తలపైన క్రమ్మిన
   లోకేచ్ఛలన్ని భంగమై - యసౌఖ్యముల్ ప్రాప్తించిన
   నీ ప్రేమ నిత్యము కాగా - నదే నాయాత్మలంగరు

5. హృదయ భీతియుండిన - ప్రపంచము లయించిన
   నీ వన్ని కదిలింపుము - నాలంగర్ స్థిరమై యుండి
   ననంత ప్రేమ శక్తిని అనుభవింతు
518 జీవితంబు ఘోర కష్టనష్టముల్jeevitambu ghora kashtanashtamul

Psalms 77:11

1. జీవితంబు ఘోర కష్టనష్టముల్ - ఆవరించి నిన్ను దుఃఖపర్చిన
   దేవుడిచ్చినట్టి యీవులెంచుము
   నీ వాశ్చర్యమందెదవు వాటికై

పల్లవి:
ఎంచుము లెక్కించు మీవులన్ -  ఎంచి, చూడు మేసు దీవెనల్
ఎంచు, మెంచు - మెంచు మీవులన్ -  వింత నొందెదవు నీవు వాటికై

2. చిOత మానసంబు నీకు గల్గినన్ - వంతచే భారంబు గల్గు నీయెదన్
   సంతసంబుతోడ నెంచు మీవులన్
   వింతతో స్మరించు మేసు నామమున్ ||ఎంచు||

3. నాశనంబు జెందు నాస్తి జూచినన్ - వాసిగా శ్రీయేసు నా కొసంగిన
   భాసురంపు భాగ్యము - దలంపుమా
   యీ సుభాగ్యమే కదా సదాయుండు ||ఎంచు||

4. జీవితాదియందు ధైర్య మొందుము - దేవుడుండు తన వార్కి తోడుగ
   జీవయాత్రయందు సాయమియ్యగన్
   దేవదూతల్ నీకు తోడుగా నుండు ||ఎంచు||
519 ఆయన నన్ను నడుపుననుaayana nannu nadupunanu

Psalms 143:10

1. ఆయన నన్ను నడుపునను - ఆలోచనే నా కాధారం
   నే నేమిచేసిన నెట్లున్నన్ - దేవునిచేయి నన్నడుపును

పల్లవి:
ఆయనే నన్ను నడిపించున్ -  తన స్వంత చేతితో నడిపించున్
విశ్వాసముతో తన వెంబడి నే -  వెళ్ళెద నన్ను నడుపును

2. ఒకనాడు చిమ్మ చీకటిలో - మరునాడు పూలపొదరింట
   విశ్రాంతిలో కలతలలో నన్ - దేవుని హస్తమే నన్నడుపున్

3. సణుగు గొణుగుల మాని నీ - చేయి పట్టుకొనెద నా ప్రభో
   సదా సంతృప్తితో యుండెద - దేవుని హస్తమే నన్నడుపున్

4. భువిలోన నా పని కాగానే - నీ కృపచే జయమరయగనే
   చావునకైన భయపడను - యోర్దాను ద్వారా నడిపెదవు
520 నడ్పుమా మహా యెహోవాnadpumaa mahaa yehovaa

Psalms 23:4

1. నడ్పుమా మహా యెహోవా - లోకయాత్ర యందున
   నీదు శక్తి నాకు దిక్కు - నన్ రక్షంప జేదివ్యమన్నా దివ్యమన్నా - నా కాహారమై యుండుపట్టు

2. ఊటగా స్వచ్ఛజలంబు - బండనుండి పారనీ
   అగ్ని మేఘ స్తంభాలచే - నడవిన్ నన్ దాటించు
   గొప్ప ప్రాపూ గొప్ప ప్రాపూ - నాకు డాలు నీవే

3. యోర్దాన్ నది దాటువేళ - భీతులెల్ల బాపుము
   మృత్యు శ్రమలన్ని నన్ను - క్షేమ కానాన్ - జేర్చును
   స్తుతిగీతి - స్తుతిగీతి - నీ కర్పింతు నిత్యము
521 యేసు మమ్ము నడిపించుyesu mammu nadipinchu

Psalms 80:1

1. యేసు మమ్ము నడిపించు, నీదు కాపు కావలెన్
   నీవు మమ్మును బోషించు - మమ్ము జేర్చు దొడ్డిలోన్
   యేసునాథా! ప్రియనాథా! మమ్ము విమోచింపుమా

2. మమ్ము నాదరించు యేసూ - మాకు పాలకుండవు
   పాప మార్గమందు నుండి - ప్రేమతో దప్పించుమీ
   యేసునాథా! ప్రియనాథా! మొఱనాలకించుమా

3. బీద పాపులైన మమ్ము - నీ వంగీకరింతువు
   మమ్మును బవిత్రపర్చి - మమ్ము విడిపించుమీ
   యేసునాథా! ప్రియనాథా! నిన్ను నాశ్రయింతుము

4. బాల్యమందు నిన్నుఁ జేరి - నిన్ను హత్తుకొందుము
   ప్రియ రక్షకుండ, యేసూ! నీదు ప్రేమఁజూపుమా
   యేసునాథా! ప్రియనాథా! మమ్మింకఁబ్రేమించుమా
522 నీ చెంతకో ప్రభో - నే జేరెదన్nee chentako prabho - ne jeredan

Psalms 139:18

1. నీ చెంతకో ప్రభో - నే జేరెదన్ - కష్టంబు లేచినన్ - నిన్ జేరెద
   నా పాట యెప్పుడు - నీ చెంత నుండును - నీ చెంత నుందును - నా రక్షకా

2. భానుండు ద్రిమ్మరి - యట్లిప్పుడు - క్రుంకంగ నిక్కడ నా చుట్టును
   చీకట్లు గ్రమ్మినన్ - స్వప్నంబు నందును - నీ చెంతనుందును - నా రక్షకా

3. ఆకాశమండల - మార్గంబును - నాకీవు చూపుమా - నీ కూర్మిచే
   నీ దివ్యదూతలు - నన్ గోరి పిల్వగా - నీ చెంతనుందును - నా రక్షకా

4. నే నిద్రలేక నీ - స్తోత్రంబుతో - శోకంపు రాళ్ళుగ - బేతేలును
   నీకై నిర్మింతును - నా దుఃఖమందున - నీ చెంతనుందును - నా రక్షకా

5. ఆనంద పూర్ణమై - పక్షంబులన్ - నాకంబు నంటుచు - నే లేచినన్
   నా పాటయంతయు - నీ చెంతనుండు - నీ చెంతనుందును - నా రక్షకా
523 పూర్వమాశీర్వాదము నేడు శ్రీయేసే.poorvamaasheervaadamu nedu shreeyese.

Philippians 3:8

1. పూర్వమాశీర్వాదము - నేడు శ్రీయేసే
   మున్ను నా యాలోచన - నేడు తనమాట
   మున్ను వరము కోరితి - నే డొసగు వానిన్
   మున్ను స్వస్థత కోరితి - నేడు వానినే

పల్లవి:
సర్వములో సర్వదా - యేసునే పాడెద
యేసులో సమస్తము - సమస్తము యేసే

2. మున్ను శోధన శ్రమ - నేడు నమ్మకం
   ముందు అర్థరక్షణ - నేడు సంపూర్ణం
   మున్ను విడువనిపట్టు - నేడేసు నన్ బట్టెన్
   పూర్వము నే నస్థిరం - నేడు - స్థిరమైతి ||సర్వములో||

3. మున్నునా ప్రయత్నము - నేడు ప్రార్థన
   పూర్వమెంతో జాగ్రత్త - నేడతని శ్రద్ధ
   మున్ను నాదుకోరిక - నేడేసుమాట
   పూర్వ మడుగుచుండుట - నేడు సంస్తుతి ||సర్వములో||

4. మున్ను నాపనియది - యికను తన పని
   మున్ను తనను వాడితిన్ - నేడు నన్ వాడును
   మున్ను శక్తి కోరితిన్ - నేడు శక్తునే
   మున్ను నాకై చేసితిన్ - నేడు తనకే ||సర్వములో||

5. మున్ను యేసును కోరితిన్ - నా వాడాయె నేడు
   మున్ను జ్యోతులుగ నుండే - నే డేంతో కాంతి
   మున్ను చావు గోరితి - నేడు తన రాకన్
   నా నిరీక్షణలెల్ల - స్థిరమాయెను ||సర్వములో||
524 యేసూ ఆత్మ ప్రియుడా నిన్ను నాశ్రయించితిyesoo aatma priyudaa ninnu naashrayinchiti

Psalms 27:9

1. యేసూ, ఆత్మ ప్రియుడా - నిన్ను నాశ్రయించితి
   లేవగా దరంగముల్ - గాలివాన కొట్టగా
   జీవ బాధలన్నిటన్ - నన్ను దాచు రక్షకా
   నన్ను నడ్పి రేవునన్ - ఆత్మ జేర్చుమీ తుదన్

2. దిక్కులేని యాత్మకు - వేరే ప్రాపు లేదిక
   నొంటిగాను విడ్వక - నన్ను యాదరించుమీ
   నిన్నే నమ్మియుంటిని - నీవే నా సహాయము
   కాపులేని నా తలన్ - నీదు రెక్క క్రమ్మనీ

3. క్రీస్తు నిన్ను గోరుదున్ - దొర్కునన్ని నీకడన్
   పడ్డహీను నెత్తుమీ - స్వస్థపర్చు రోగులన్
   న్యాయ శుద్ధ నామము - నీదే నేను పాపిని
   నేను పాపపూర్ణుడన్ - నీవు ప్రేమరూపివి

4. పాపమెల్ల మాన్పగా - నీదు ప్రేమ చాలును
   మాన్పు నీళ్ళు నా యెదన్ - శుద్ధిచేయగా నిమ్ము
   నీవు జీవపూటవు - త్రాగనిమ్ము నీదరిన్
   పుట్టి నాదు నాత్మలో - నెల్ల వేళ పారుమీ
525 నా ప్రేమరాజు కాపరి నన్నెంతో ప్రేమించునుnaa premaraaju kaapari nannento preminchunu

Psalms 23:1

1. నా ప్రేమరాజు కాపరి - నన్నెంతో ప్రేమించును
   ఈ రాజు వాడనైనచో - నా కెట్టి లేమిలేదు

2. పోషించి నాదు నాత్మకు - జీవంపు నీటినిచ్చున్
   పోషించు దాని నిత్యమున్ - జీవాహారంబుతోను

3. నే త్రప్పుత్రోవనుండగా - రక్షింప వెదకె నన్ను
   మోదంబుతో కనుగొనెన్ - నన్ మందలోన జేర్చెన్

4. పాతాళం యొక్క చీకటి - నన్ భీతిపర్చబోదు
   నా దాపునుండ క్రీస్తేసు - నా ముందు నిల్చున్ సిల్వ

5. నా దృష్టిలో నాహారము - సిద్ధంబు జేతు వీవు
   నీ శుద్ధ ప్రేమానందముల్ - పారెన్ రక్షింప నన్ను

6. నీ మంచి నైజంబో ప్రభూ - నిరంతరంబు నిల్చున్
   స్తోత్రింతు నిన్ను నీయింటన్ - ఓ కాపరి నా యేసు
526 దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని మించునుdaiva prema pruthviloni yannitini minchunu

Ephesians 3:19

1. దైవ ప్రేమ పృథ్విలోని - యన్నిటిని మించును
   ఏసు మాలో నివసించు - మది మా విముక్తియే
   నీ కమూల్య ప్రేమయుండు - నీవు ప్రేమమూర్తివే
   నీ దాసులమైన మమ్ముఁ గృపతో రక్షించుము

2. మమ్ము సంరక్షించు శక్తి - నీకుండు మా ప్రభువా
   యెన్నఁ డెన్నఁ డేని నీదు - సన్నిధిని బాయము
   నిన్ స్తుతించుచుండి మేము - సర్వదా సేవింతుము
   నిన్ బ్రార్థించి పూర్ణ ప్రేమ - మే మతిశయింతుము

3. క్రొత్తగా మమ్ము సృజించి పాపమెల్లఁ బాపుము
   మాకు స్వస్థత నొసంగి - గొప్ప రక్షణ జూపుము
   భక్తి యభివృద్ధి పొంది - స్వర్గమందుఁ జేరఁగా
   వింతనొంది ప్రేమ స్తుతి - నీ కర్పింతు మెపుడు
527 ఇమ్ముగ నడిపించితివి నెమ్మదిగలimmuga nadipinchitivi nemmadigala

1 Chro 28:20 ; Nehemiah 6:16 ; Numbers 13:24

పల్లవి:
ఇమ్ముగనడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు
ఇమ్ముగనడిపించితివి (1)

1. మా కున్నస్థలము ఇరుకనియు నీకు మొరలిడగా (2)
   మరియొకస్థలము మాకొసగితివి (2) - నీకృపకై స్తుతులు (2)

2. బలపరచి మరిధైర్యము నిచ్చి అభయము నిచ్చితివి
   ఇల నీ మందిరమును నిర్మింప - జనులను కూర్చితివి

3. ప్రభువా నీకై నిర్మింపబడిన నీ మందిర ఘనత
   సకల దేశ నివాసులయందు - భాసిల్ల గోరితిని

4. మీ మధ్యలో నాఆత్మ యున్నదని సెలవిచ్చిన యేసు
   ప్రభువా మాకు తోడైయుండి - పనిజరిగించితివి

5. పుష్కలమై బహుజలమయమైన తావుకు తెచ్చితివి
   ఎష్కోలు ద్రాక్షాఫలములుగ - ఫలియింప గోరితివి

6. అన్యజనులు బహు ఆశ్చర్యపడిరి నీ ఘన కార్యముకై
   గుర్తించిరిగా నీ అద్భుతములు - దేవా స్తోత్రములు

7. వెండి బంగారము లన్నియు నీవి దండిగ నిచ్చెదవు
   మెండుగ నీదు మేలుల కొరకై - హల్లెలూయ పాడెదము
528 ఆనంద మహానందంaananda mahaanandam

John 15:11

పల్లవి:
ఆనంద మహానందం ప్రభువే మనకానందం (1)
మనయందు నిలిచి యుండును పరలోకపు ఆనందం (2)

1. దూతలు తెచ్చిరి శుభవార్త యెంతో గొప్పానందము (2)
   కుమ్మరించును మదిలో పరమునుండి పాపి నలిగినప్పుడే (2)

2. ఆనందించుడనె ప్రభువే పరమందున మీ పేరుల్
   గొఱ్ఱెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడియున్నవని

3. నీ సన్నిధియందే కలవు నిత్యసంతోషములు
   నీ చిత్తము నెరవేర్చువారెల్లరు ఆనందించెదరు సదా

4. ఇదివరకును మీరేమియును అడుగలేదు నన్ను
   మీ సంతోషము పూర్ణమగునట్లు అడిగి పొందుమనెను

5. యెహోవా విమోచించిన వారే పాటలు పాడి
   శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు

6. ఆయన కొరకవమానమును మరినిందకు పాత్రులము
   తన వాక్యమెవ్వరి మదియందుండునో సంతోషింతురు మిగుల

7. ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు
   సర్వకాలము సంతోషము కలిగి హెల్లెలూయ పాడెదరు
529 మీరు బహుగా ఫలించినచోmeeru bahugaa phalinchinacho

John 15:8

పల్లవి:
మీరు  బహుగా  ఫలించినచో -  మహిమ  కలుగును  తండ్రికి (1)
ఈ రీతిగా  ఫలించినతో  శిష్యులై  యుండెదరు (2)

1. నీరు కట్టిన తోటవలె నీటి వూటవలె నుండెదరు (2)
   క్షామములో తృప్తి నిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును (2)
   బలపరచును మీ యెముకలను (2) - అధికముగా ఫలించుడి (2)

2. చెట్లులేని మెట్టలలో నదుల ప్రవహింపజేయు ప్రభువు
   ఎండియున్న నేలనెల్ల నీటిబుగ్గలుగా జేయువాడు
   మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి

3. వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తనశాంతిని
   ఐశ్వర్యముతో నొంపు మిమ్ము ముదిమివరకు మిమ్ము మోయువాడు
   మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి

4. పాడేదరు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు
   పొగడేదరు ప్రజలెల్లరు ప్రభుని ఆశ్చర్య కార్యములను
   మహిమ ఘనత చెల్లించుచు హల్లెలూయ పాడెదరు
530 మేల్కొనుమా మేల్కొనుమాmelkonumaa melkonumaa

Matthew 24:42

పల్లవి:
మేల్కొనుమా మేల్కొనుమా
యేసే నుడివెను ఓ ప్రియుడా మేల్కొనుమా మేల్కొనుమా (1)

1. తెలిసికొనుము వివేచించి విభుని యొక్క చిత్తంబేమో (2)
   కాలవిలువను యెరిగి మేల్కొనుమా (2)

2. నమ్మజాల మీ లోకమును నీ జీవమేపాటిది (2)
   సమస్తంబు వ్యర్థంబేగా ప్రార్థించుమా (2)

3. తప్పుడు బోధలనుండి భద్రపరచు కొనుము నీవు (2)
   ఎప్పుడు ప్రభు యిష్టమును నెరవేర్చుమా (2)

4. ఆవేశము వ్యర్థంబేగా ప్రవర్తింపకు డంబముగా (2)
   అహంకార గర్వమునుండి తప్పించుకో (2)

5. యేసు శీఘ్రముగావచ్చు యెదురు చూడవలెను నీవు (2)
   భాసురముగా తనతో వెళ్ళ సిద్ధపడుమా (2)
531 అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివిadbhuta deevenalu - prabhuvaa kummarinchitivi

Deuteronomy 11:27

పల్లవి:
అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి (1)
నీదు ప్రేమ అపారము - ప్రభువా మాపై జూపితివి (2)

1. మానవుని చేసినావు - నీ స్వంత రూపమునకు (2)
   నీ కిష్టులముగా బ్రతికి (2) - దీవెనలెన్నో పొందెదము (2)

2. నూతన జన్మవలన - ఆశీర్వాదములు దొరికె
   శాపమును దూరపరచి - సర్వంబు క్రొత్తజేసె

3. లోకమునుండి వేరై - సిలువను మోయవలెను
   అప్పుడే ప్రభు దీవించు - స్వాస్థ్యమును గాంతుమెంతో

4. తన సుతులుగాను మెలిగి - తన చిత్తమందు నిలిచి
   జీవజలమును పొంది - దేవెనలెన్నో పొందెదము

5. ఆత్మీయముగ నడిచి - శరీర క్రియలను విడిచి
   ఆయన స్వరము వినుచు - దీవెనలెన్నో పొందెదము

6. ఆశీర్వాదముల కొరకు - పిలువబడియున్న మనము
   ఆజ్ఞలను నెరవేర్చినచో - దీవెనలెన్నో పొందెదము
532 క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదనుkreestuni choochuchu saagivelledanu

Hebrews 12:1,2

1. క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను - సీయోను యాత్రలో (2)
   లోకమున్ విడిచి చేరుకొందును మహిమ దేశమున్ (1)
   క్రీస్తుని అనుగ్రహములో సురక్షిత హస్తములలో (2)
   మహానందముతో స్తుతించుచు చేరుదు నాదేశమున్ (2)

పల్లవి:
ఎంతో సుందర జీవితము - మహిమతో నిండినది (2)
సదా సర్వదా క్రీస్తుతో నుండి (1) మహిమ పరచెదను - మహిమలో నుండెదను

2. దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు దాగుచోటు ఆయనే
   సంకటక్లేశ పరీక్షలలో జయము పొందెదను
   ప్రభునికై జీవించెదను ఆయన అడుగు జాడలలో
   ఆత్మ ప్రాణ శరీరము లర్పించి ఆయనను సేవింతును || ఎంతో ||

3. యాత్రికుడను ఈ జగమందు - పరవాసినైతి నేను
   స్వల్పజీవితము భువియందు గడిపి - చేరుదున్ ఆ దేశమున్
   నాకై విజ్ఞాపనము చేయు - మహాయాజకుడు యేసునితో
   తోడి వారసుడనై ఆయనతో - నిత్యము ఏలెదను || ఎంతో ||
533 వెళ్ళెదము కూడి వెళ్ళెదముvelledamu koodi velledamu

2 Peter 3:13

పల్లవి:
వెళ్ళెదము కూడి వెళ్ళెదము (2)
శ్రేష్ఠ దేశమును చేరుటకు (2) - నీతి నివసించును అందున (2)

1. భయమును కలిగి బ్రతికెదము - పరదేశులమని యెరుగవలె (2)
   ప్రవేశించ వలె విశ్రాంతిలో (2) - తప్పిపోదుము మరచినచో (2)

2. ప్రభువాజ్ఞలను పాలించుటకు - ప్రయాస పడెదము మనమిలలో
   పదిలముగా అంతము వరకు - పడిపోకుండా చూచుకొందుము

3. ప్రభువు మన కప్పగించినవి - పట్టుకొని మనముండెదము
   దుష్టుని బారిని తప్పించుకో - దోచుకొన నివ్వకు మకుటము

4. సుళువుగా ఉరియొడ్డు - ప్రతి పాపమున్ - సంపూర్ణముగను తొలగించుచు
   సహనముతోడ పరుగెత్తుచు - స్వర్గ దేశము చేరవలెన్

5. సంపూర్ణత పొందసాగెదము - సమర్పించుకొని పూర్ణముగా
   సహించిన కష్టదుఃఖములు - బహుగా ఫల మొందెదము"
534 ఓ ప్రభువా నే దారి తొలగితిo prabhuvaa ne daari tolagiti

Hebrews 9:14

పల్లవి:
ఓ ప్రభువా నే దారి తొలగితి (2)
నీ శరణు జొచ్చితిని (1)- నీ ప్రేమను పొందితిని (2)

1. నా పాపముల నే నొప్పుకొని (2)
   పశ్చాత్తాప పడితిని (1)- పాపక్షమాపణ కలిగె (2)

2. ప్రభుయేసు నీ రక్తము ద్వార
   ప్రాయశ్చిత్తము జేసితివి - కడుగ బడితిని నేను

3. నీ రక్తముతో నామది కడిగి
   పాపఋణము తీర్చితివి - స్వతంత్రుని జేసితివి

4. నీ రక్తముచే పాపము తొలగె
   రక్షణ నే పొందితిని - పాపడాగులను తుడిచె

5. నీ రక్తముచే నా శిక్ష తొలగె
   బంధకముల తెంచితివి - నిర్దోషిగా తీర్చితివి

6. నీరక్తముచే సహవాసమును
   పరిపూర్ణత నొందుటకు - నను విజయుని జేసితివి
535 ఈ లోక యాత్రలో నే సాగుచుండee loka yaatralo ne saaguchunda

Philippians 3:14

పల్లవి:
ఈ లోక యాత్రలో నే సాగుచుండ (2) - ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు (2)
అయినను క్రీస్తేసు నాతోడ నుండు (2)

1. జీవిత యాత్ర యెంతో కఠినము (2) - ఘోరాంధకార తుఫాను లున్నవి (2)
   అభ్యంతరములు యెన్నెన్నో వుండు (2)
   కాయువారెవరు రక్షించేదెవరు (2)

2. హృదయము శుద్ధి పరచుకొన్నాను - నా చేతులెంతో పరిశుద్ధ పరచ
   అనుకొనని రీతి అపవాదివచ్చి
   నా జీవితమును నిరాశపరచె

3. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా - అనుదినము నన్ను ఆదరించెదవు
   నీతో వున్నాను విడువలేదనెడు
   నీ ప్రేమ మధుర స్వరము విన్నాను

4. ఈ అనుభవముతో నేనడచు కొందు - ప్రియ యేసు వైపు నేను చూచుచు
   గతమునంత నేను మరచిపోయెదను
   కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు

5. తోడైయుండెదవు అంతము వరకు - నీవు విడువవు అందరు విడచినను
   నూతన బలమును నా కొసగెదవు
   నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే
536 ఆది ప్రేమను విడచిపెట్టితివా?aadi premanu vidachipettitivaa?

John 21:15

పల్లవి:
ఆది ప్రేమను విడచిపెట్టితివా (1)
ఓ నాదు ప్రియుడా మాదిరిగ జీవించ మానితివా (2)

1. నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు (2)
   నిశ్చయముగ ఒప్పుకొంటివి స్వంత పనులకు సాగిపోతివి (2)

2. సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్ల సేవ చేయుచు
   ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళెదనను పలికితివిగా

3. మనుష్య సంగతులను తలంచి మనుష్యేచ్ఛలకు లొంగిపోయి
   యేసు ప్రభుని అనుమానించి ధనమోసంబులో చిక్కుకొంటివి

4. ఏమి తిని త్రాగుచుందునో ఏమి ధరించుదునోయని
   నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివా నీదు ప్రభుని

5. మేడమిద్దెల పొలము ఆస్తుల పుడమి నికనెన్నో ఘనతలకు
   ఇదియే సమయమని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువా

6. యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచి యిట్లు
   మార్చుకొంటివి నీదునడతను నాథుడేసుడు ఏడ్చుచుండె

7. నీదు దీపము యింక యిలలో ఆరిపోవక ముందెనెరిగి
   సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ జేయుము
537 దేవునితో సహపాటి పాలివారిగానుజేసెdevunito sahapaati paalivaarigaanujese

1 Cor 3:9

పల్లవి:
దేవునితో సహపాటి పాలివారిగానుజేసె (2)
తోడివారసులనుగా మనలను ప్రభు జేసెనుగా (2)

1. దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించె (2)
   అమూల్య వాగ్దానములిచ్చి దైవస్వభావ మొసగెనుగా (2)

2. దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలు పొంది
   దివ్య వాక్యమును పొంది దివిని రుచి చూచితిమి

3. ప్రభు పరిశుద్ధతలో పాలి వారమగునట్లు
   సకల శ్రమల పాలై దైవశిక్ష నొందితిమి

4. పరలోక పిలుపునందు పాలివారిగాను జేసె
   తన యింటి వారినిగా జేయ మనల నేర్పరచె

5. తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మముజేసె
   పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారిగా జేసె

6. క్రీస్తులో పాలివారై క్రీస్తు సుగుణములను పొంది
   దృఢముగా నిలిచెదము పట్టువదలక మనము

7. రాబోవు మహిమయందు పాలివారమౌ మనము
   ప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము "
538 నిశ్చయముగ నిన్ను దీవించెదనుnishchayamuga ninnu deevinchedanu

Genesis 12:2-3 ;17:2-6

పల్లవి:
నిశ్చయముగ నిన్ను దీవించెదను (2)
నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2)
నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2)

1. ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు - సర్వశక్తిగల యెహోవాను నేను (2)
   నా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన (2) - నీతో నిబంధన నియమింతును (2)

2. నీ సంతానమును దీవించి - నిన్ను ఫలియింప జేసెదను
   నీలో నుండి జనములు వచ్చును - నీతో నిబంధన స్థిరపరతున్

3. యుగయుగములు నీకు దేవుడను - కనాను దేశము నీకొసగెదను
   నిత్యస్వాస్థ్యమును నీ కొసగెదను - నీలో మహిమ నే పొందెదను

4. గొప్ప జనముగా జేసెదనిన్ను - నిశ్చయముగా ఆశీర్వదింతున్
   నీనామమును గొప్ప జేసెదను - ఆశీర్వాదముగ జేసెదను

5. నిన్నాశీర్వదించువారిని - నేను ఆశీర్వదించెదను
   దూషించువారిని నే శపించెదను - నీ ద్వారా దీవింపబడెదరు
539 యేసు మనతోనుండగ ధైర్యముగా సాగుచుyesu manatonundaga dhairyamugaa saaguchu

Acts 4:13

పల్లవి:
యేసు మనతోనుండగ ధైర్యముగా సాగుచు -
కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము (2)

1. పాత సంగతులన్నియు గతించె మరల రావుగ (2)
   యేసునందు క్రొత్తవై నూతనముగ నడుపును (2)
   యేసు ప్రభుని యాజ్ఞలు అద్భుతముగ దొరికెను (2)
   పరమ దర్శనమందుండి తొలగిపోము యెన్నడు (2)

2. సైతాను శరీరము లోకముతో పోరాడుచు
   యెంత క్రయమునైనను సంతోషముగ చెల్లింతుము
   యుద్ధ మందు జయమొంద ప్రభుని శక్తి పొందెదం
   యేసు జయము పొందుచు సాతాను రాజ్యమణచెదం

3. దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక
   యేసు నామమందున పొందెదము శక్తిని
   అల్పకాల యాత్రలో గొణుగు సణుగు లుండక
   ప్రతి పరిస్థితియందు తృప్తిచెంది యుందుము

4. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందము
   ఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదం
   నాగటిమీద చేతిని వుంచి వెనుక తిరుగము
   యేసు వైపు చూచుచు ఆయనతోడ నడచెదం

5. మనలో పాత పురుషుని చంపెదము సిలువలో
   అంతరంగ పురుషునందు బలమును పొందెదము
   ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందెదం
   శరీర యిచ్ఛలన్నియు అణగద్రొక్కి వేసెదం

6. విడచెదం ఈలోకము యాత్ర పూర్తి చేసెదం
   పరమ రాజ్యమందున పరమ గృహము చేరెదం
   యేసు ప్రభును సంధించెదం ఆనందముతో నిండెదం
   బహుమానములు పొందెదం సదా ఆయనతో నుండెదం
540 ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో నెరవేర్చితివిprabhuvaa chesitivi vaagdaanamulu maato neraverchitivi

Jeremiah 1:5

పల్లవి:
ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో (2)
నెరవేర్చితివి   బహు నేర్పుతోడన్ సన్నుతించెదనో ప్రభువా (2)

1. వెదకితివి నన్ను నీ వాక్యముచే (2)
   తగిన కాలమున నిన్ను చేరన్ తరుణమిచ్చితివి (2)
   సొత్తని నన్ను నీ పుత్రునిజేయ (2) - కడిగితివి నీ రక్తముతో (1)

2. బాలుడను భావన వలదంటివి
   బహుజనంబులకు ప్రవక్తగా నియమించితివి
   గర్భమునందే రూపించిన ప్రభూ
   పేదనైన నేను పూజింతున్

3. భయభీతిలో నాకు అభయము నిచ్చి
   విజృంభించిన విరోధిపై విజయము నిచ్చి
   కట్టను నాటను నా నోటను నీ
   మాట నుంచిన ప్రభూ కీర్తింతున్

4. మందిర మహిమను హెచ్చులోనుంచ
   సైన్యాధిపతి నీదు సమాధానము నిచ్చి
   ఈ స్థలమును నీదు శాంతితో నింపిన (2)
   షాలేమురాజా స్తోత్రింతున్

5. మోషేకు నీవు మాటిచ్చినట్లు
   అడుగుడి ప్రతి స్థలము లన్నిటిని మాకిచ్చుటకు
   పరిశుద్ధాత్మతో నింపిన ప్రభువా
   పలుమాటలతో ప్రణుతింతున్

6. ఇహపరమందున సర్వాధికారివై
   శిష్యులకు నీ ఆజ్ఞనిచ్చిన
   ఆత్మదేవా యుగాంతమున నీ సన్నిధి మాతో
   నున్నందులకై స్తుతియింతున్

7. వర్థిల్లదంటివి ఏ ఆయుధమున్
   నీకు విరోధంబుగా రూపించినచో
   న్యాయ విమర్శలో తరుణమిచ్చితివి
   నేర స్థాపన చేయన్ హల్లెలూయా
541 ఆనందించెదము యెహోవాలోaanandinchedamu yehovaalo

Isaiah 61:6-11

పల్లవి:
ఆనందించెదము యెహోవాలో (2) - అతిశయించును మాదు ఆత్మ (2)
రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము (2) -  నీతి వస్త్రమున్ ధరింప జేసె (2)
ఆనందించెదము యెహోవాలో (2)

1. పరదేశులు మమ్ము ప్రభువా దేవా (2) - నీదు యాజక సేవకులనెదరు (1)
   పరదేశులు మమ్ము ప్రభువా దేవా (2) - నీదు యాజక సేవకులనెదరు (1)
   జగమున జనముల భాగ్యంబిచ్చి - ప్రభవింతు రంటివి ప్రభావముతో (2)

2. అన్యులు చేసిన అవమానమునకు - ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను
   అన్యులు చేసిన అవమానమునకు - ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను
   నిందకు ప్రతిగా పొందిన భాగము - అనుభవించుచు హర్షింతు రంటివి

3. వారు తమదు దేశమునందు - రెట్టింపు భాగమునకు కర్తలౌదురు
   వారు తమదు దేశమునందు - రెట్టింపు భాగమునకు కర్తలౌదురు
   నిత్యానందము వారికి కలుగును - ఎన్నడు వారిని విడువ నంటివి

4. న్యాయము చేయుట నాకెంతో ప్రీతి - అన్యాయపు సొత్తు నా కసహ్యము
   న్యాయము చేయుట నాకెంతో ప్రీతి - అన్యాయపు సొత్తు నా కసహ్యము
   సత్యముబట్టి ప్రతిఫల మిచ్చుచు - నిత్య నిబంధన చేసెదనంటివి

5. జనములకు వారి సంతతి తెలియును - జనముల మధ్యను ప్రసిద్ధి నొందును
   జనములకు వారి సంతతి తెలియును - జనముల మధ్యను ప్రసిద్ధి నొందును
   యెహోవా ఆశీర్వదించిన జనమని - ఒప్పుకొందురు చూచినవారు

6. భూమి మొలకను మొలిపించినట్లుగా - తోటలో మొలిచిన విత్తనమువలె
   భూమి మొలకను మొలిపించినట్లుగా - తోటలో మొలిచిన విత్తనమువలె
   జనముల యెదుట ప్రభు యెహోవా - నీతిస్తోత్రములను ఉజ్జీవింపజేయును

7. క్రీస్తునందు మాకిచ్చినయట్టి - ఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకై
   క్రీస్తునందు మాకిచ్చినయట్టి - ఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకై
   సర్వోన్నతుడా సన్నుతించుచు - హల్లెలూయ స్తోత్రముల్ ఆరోపింతుము
542 లేలెమ్ము సీయోను ధరియించుము నీ బలముlelemmu seeyonu dhariyinchumu nee balamu

Isaiah 52:1 ; 60:1 ; Eze 36:11

పల్లవి:
లేలెమ్ము సీయోను - ధరియించుము నీ బలము (2)
సుందర వస్త్రముల ధరించు (2) - పరిశుద్ధ పట్టణమా (2)
లేలెమ్ము సీయోను (1)

1. నిష్కళంక యెరూషలేమా (2) - ఇంకెన్నటికి నీ మధ్యకు (1)
   నిష్కళంక యెరూషలేమా (2) - ఇంకెన్నటికి నీ మధ్యకు (1)
   సున్నతి పొందని అపవిత్రులును (2) - లోనికి రారెన్నడు (2)

2. లెమ్ము నీవు తేజరిల్లుము - వెలుగు నీకు వచ్చియున్నది
   యెహోవా మహిమ నీ మీద - ఉదయించెను లేలెమ్ము

3. మనుష్యులను పశువులను - విస్తరింప జేసెదను
   అభివృద్ధి నొందును అపూర్వముగ - పూర్వస్థానములో నిన్నుంతున్

4. మునుపటికంటె అధికమైన - మేలు నీకు కలుగజేతును
   అపుడు నీవు యెహోవా నేనని - వివరముగా నెరిగెదవు

5. అందుచేతనే చెప్పుచున్నాడు - నిద్రించే నీవు మేలుకొనుము
   మృతులలో నుండి లేచిరమ్ము ప్రకాశించును క్రీస్తు
543 ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పదిo ishraayelu needu bhaagyamento goppadi

Deuteronomy 33:29

పల్లవి:
ఓ ఇశ్రాయేలు - నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన - నిన్ను పోలినవాడు ఎవ్వడు?

1. భయ పడకు - నేను నీ కేడెమును - బహుమానమున్
   అత్యధికముగా చేతునని - యెహోవా దేవుడే పల్కెన్

2. నా నిబంధనను - నే - రద్దు పరచ ననె గదా
   నా నోట నుండి - వెళ్ళిన మాటను - మార్చననె గదా

3. సర్వోన్నతుని రాజ్యము - శాశ్వతంబు నిక్కము",
   తొలగి పోదు ఎన్నడు - లయము కాదు ఎన్నడు

4. నీ మందిర సమృద్ధిలో - వారికి తృప్తిగలదు
   నీ ఆనంద ప్రవాహములో - నీవు త్రాగించుచున్నావు

5. నీవు భయపడకుము - బాధించు వారు రాకుండను
   దూరముగా నుంచి యున్నాను - నీకు తోడైయున్నాను
544 నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువాnaa jeevita saagaramuna nanu nadipinchumu prabhuvaa

Isaiah 30:21

పల్లవి:
నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా (1)
కుడి యెడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు (2)

1. అంధకార లోకములో అంధుడనై నేపందెరంగములో నేను గెలువ నా ముందుగ నడువుము 2నుండగా (2)

2. లోకములో మాయలకు లోకుల మోమాటముకు
   లోకువ నేను కాకుండునట్లు మెళకువ నొసగుము ప్రభువా

3. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్
   సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా
545 నీకు కలిగిన దానిని చేపట్టుముneeku kaligina daanini chepattumu

Revelation 3:11

పల్లవి:
నీకు కలిగిన దానిని - చేపట్టుము
జారవిడచెదవేమో - జాగ్రత్తపడు (2)

1. పరమునకు విజయోత్సవముతో - మనము వెళ్ళెదము (2)
   పూర్ణ ఫలమును సంతసములో - మనము పొందెదము (2)

2. క్రీస్తు యేసుని స్వీకరించి - ప్రభులో నడచెదము
   వేరుపారి స్థిరతనొంది - విస్తరించెదము

3. లోక ఇచ్చలనన్ని మనము - విడచి పెట్టెదము
   ప్రభుని చిత్తము నెరిగి లోబడి - నిలిచియుండెదము

4. ఓపికతో పందెములో మనము - పాలు పొందెదము
   యేసువైపే దృష్టియుంచి - సాగి పోయెదము

5. చింతలన్నియు ప్రభుని మీదే - మనము వేసెదము
   ఆయనే నిరతంబు మనపై - చింతగలవాడు

6. బహు శీఘ్రముగా శ్రీ యేసు - మరల వచ్చును
   మనకు కలిగిన నిరీక్షణను - విడువ కుండెదము
546 యెహోవాయే మనదేవుడు మార్పులేనివాడుyehovaaye manadevudu maarpulenivaadu

Hebrews 13:8

పల్లవి:
యెహోవాయే మనదేవుడు - మార్పులేనివాడు (2)
నిన్న నేడు నిరంతరము - ఒకే రీతిగా ఉన్నాడు (2)

1. పాపశాపముల బాప - మానవ రూపి ఆయెను
   అద్భుత ప్రేమ జూపి - మనలను తానె రక్షించెను

2. తన రెక్కలతో కప్పి - ఆశ్రయమిచ్చును ఆయనె
   స్వరక్త మిచ్చి కొన్న - తన సంఘమును కాయును

3. క్రుంగిన వేళలందు - అభయమునిచ్చె దేవుడు
   తన హస్తముతో నిలిపి - అంతమువరకు ఆదుకొనున్

4. శాశ్వత ప్రేమ జూపి - శ్రమలలో విజయ మిచ్చును
   విశ్వమంతయు మారిన - ఎన్నడుమారడు మనయేసు

5. సంఘముగా చేరి - యెహోవాకే మొర్ర పెట్టెదము
   ఆపత్కాలము నందు - ఉత్తరమిచ్చును ఆయనె
547 తన రాజ్యమునకు మహిమకు పిలచినtana raajyamunaku mahimaku pilachina

1 Thes 2:11,12 ; Luke 24:15 ; Revelation 3:4

పల్లవి:
తన రాజ్యమునకు మహిమకు పిలచిన -  (2)
మన ప్రభువుకు తగినట్టు నడిచెదము - తన రాజ్యములో మనము చేరెదము

1. కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము (2)
   మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము (2)

2. ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము
   యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును

3. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను
   అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును

4. దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము
   ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు

5. విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి
   ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము
548 ప్రభువుకు తగినట్లు నడుచుకొందము రండిprabhuvuku taginatlu naduchukondamu randi

1 Thes 2:12

పల్లవి:
ప్రభువుకు తగినట్టు - నడుచుకొందము రండి
తన్ రాజ్య మహిమకును - తగినట్టు నడుచుకొందము రండి

1. ఆదాము దేవుని, నిబంధనను మీరి - దారి తప్పిపోయెను (2)
   హానోకు దేవునితో కూడ నడువగా (2)
   తనతో నతనిని కొనిపోయెను

2. నోవహు దేవునితో కూడ నడిచె - కృప పొందినవాడై
   తనతరములో నీతిమంతునిగా నెంచి
   జలప్రళయమునుండి కాపాడెను

3. అబ్రాము దేవుని సన్నిధిలో నడిచె - నిందారహితునిగా
   దేవుడతనితో, నిబంధనను చేసి
   తన స్నేహితుడని ప్రకటించెను

4. దేవుని యింటి దర్శనము పొంది - ప్రజలను నడిపించెను మోషే
   దేవుని యింటిలో నమ్మకమైన
   వాడని ప్రభువే పలికెనుగా

5. దేవుని కట్టడల ననుసరించి - నడుచుకొనెను దావీదు
   స్థిరపరచెనాతని సింహాసనమును
   తన చిత్తానుసారుడని పలికెన్

6. పేతురు , యాకోబు , యోహానులు - ప్రభువును వెంబడించిరి
   పరలోక సంఘ దర్శనమిచ్చి
   మనుజులను పట్టువారిగా చేసెన్

7. పునరుర్ధానుడైన ప్రభువును గనక - ఎమ్మాయి కెళ్లిరి శిష్యులు
   యేసే వారితో కూడా నడిచెను
   గద్దించి వారి కళ్ళు తెరిపించెను

8. వస్త్రములు అపవిత్రపరచుకొనని - కొందరుండిరి సార్దీసులో
   అర్హులై తెల్లని వస్త్రము ధరించి
   సంచరింతురు ప్రభుతో

9. యేసుని వెలుగులో నడుచుకొందము రండి - జీవముగల దేవుని సంఘమా
   మన అతిక్రమములను ఒప్పుకొనెదము
   యేసుతో కలిసి కొనసాగేదం
549 సమాధానము దేవుని సమాధానముsamaadhaanamu devuni samaadhaanamu

Luke 2:14

పల్లవి:
సమాధానము - దేవుని సమాధానము (2)
ఇష్టులైన మనుష్యులకు సమాధానము
దేవుని కిష్టులైన మనుష్యులకు సమాధానము - (1)

1. దయగలదేవుడు - ఈ భువి - కరుదెంచెను
   ప్రాణమిచ్చె సిలువలో - నిన్ను ప్రేమించి (2)
   ఈ ప్రేమను ఎరిగి - నీవు విరిగిపోతే - సమాధానము - (2)

2. దుష్టులకు నెమ్మది - లేదనెను దేవుడు
   శాంతి మార్గమును - వారెరుగరనెను
   మారు మనస్సు పొందితే - వారికి దొరుకు - సమాధానము

3. ఒప్పుకొనుము నీ పాపము - యేసుని యొద్ద
   క్షమియించి - పరిశుద్ధునిగా చేయును
   అప్పుడు నీ ఆత్మలో పొందెదవు - సమాధానము

4. ఆయన ఉపదేశము - నవలంబించుము
   హృదయములో - నుంచుకొనుము ఆ మాటలను
   ఆయనతో సహవాసము - చేసిన యెడల - సమాధానము

5. చింతించవలదు - ఏ - విషయమందును
   తెలియజేయుడి - దేవునికి విన్నపములతో
   తలంపు హృదయములకు - కావలియుండును - సమాధానము

6. నిన్నాశీర్వదించి కాపాడు - దేవుడు
   ప్రకాశింపజేయును - తన కృపాసన్నిధి
   నిన్నాశీర్వదించి -యిచ్చు తన నామమున - సమాధానము
550 యెహోవా విమోచించిన వారెyehovaa vimochinchina vaare

Isaiah 35:9,10

పల్లవి:
యెహోవా విమోచించిన వారె - పాటలు పాడుచు
సీయోనునకు తిరిగి వత్తురు - నిత్యానందము కలిగిన వారై

1. ప్రభువైన యసు భూలోకమున - మహారాజై ఏలగ రాగ
   నిత్యానందముతో విజయసూచనతో - మనస్సున దుఃఖము నిట్టూర్పును లేక

2. అరణ్యమును ఎండిన భూమియు - విరియబూయు నుల్లాసముతో
   ఘనడై యెహోవా మహిమను గాంచు - ప్రభుక్రీస్తుని ప్రభావమును

3. గ్రుడ్డికి కన్నులు చెవిటికి చెవులు - కుంటిని గెంతెడి దుప్పిగా జేయ
   సుందరుడైన రాజున్ డెందమున గాంచి - మూగవాని నాలుక పాడి హర్షింప

4. పయనింతురు వారు రాజ మార్గమున - అపవిత్రులు పోజాలరందున
   ఉండదచ్చోట ఏ మృగ రాజును - పరిశుద్ధ దారిలో పరమగీతముతో

5. భయపడవలదని అభయంబిచ్చి - వారిని రక్షింప వేగమేరాగా
   ప్రతిదండన జేయు ప్రభువును జూచి - దిగులుతో జనులు వణకుచుండ

6. నిత్యము దహించు అగ్నిజ్వాలలలో - నుండగజాలినవారు ఎవరు?
   వేషదారులకు బీతిగనుండ పాపిగా - నుండిన నిలుతువెచ్చట

7. నీతిని బూని యదార్ధముగా - వీడిన పాపలాభమును
   నిత్యము నిలుచు సీయోను పురికి - ముదమున జేరి స్తుతింతువు

8. ఉన్నత పర్వత శిలలే వానికి - బలమైన మహాకోటగ కాగా
   కొదువేనుండదు తన ఆహారమును - పానమునకు హల్లేలూయ
551 దేవుడెహోవా దీవించి ఆశీర్వాదించెనుగాdevudehovaa deevinchi aasheervaadinchenugaa

Eze 36:11;Deuteronomy 2:7; 2 Chro 22:6

పల్లవి:
దేవుడెహోవా దీవించి ఆశీర్వాదించెనుగా (2)
కొదువేమి లేకుండా చేతిపను - లన్నిటిలో నిమ్ము (1)

1. గొప్ప అరణ్యములో నీ నడకలను, తిరుగుటను ప్రభువెరుగు (2)
   నలువది వత్సరములు యెహోవా మీతో నడిచెను (2)

2. పూర్వమున్నట్లుగా చేసెదమిమ్ము - నా నివాస స్థలముగాను
   పరిపూర్ణముగా మేలులనేకము చేసెద మీమధ్య

3. మీమీద మనుష్యులను పశువులను విస్తరింప చేసెదను
   అప్పుడు యెహోవా నేనని మీరు తెలిసికొందురు

4. కష్ట కాలములో సమకూర్చి యుంటిని సమృద్ధి పరికరముల్
   మందిర పనికై నీవును బహుగా విస్తరింప చేయుము

5. లెక్కింపలేనంత బంగారు, వెండియు, ఇత్తడి, ఇనుము నాకుండ
   కాబట్టి నీవు పని పూనుకొనుము యెహోవా తోడై యుండ
552 యెహోవాను నమ్ముకొను మానవులుyehovaanu nammukonu maanavulu

Jeremiah 17:7

పల్లవి:
యెహోవాను నమ్ముకొను మానవులు ఈ మహిలోన ధన్యులు (2)
ఆయనపై నిరీక్షణను నుంచువారు ధన్యులు వారు (1)

1. జలము యొద్ద నాటబడిన - చెట్టువలె అది యుండును (2)
   కాల్వల యోరను వేళ్లు తన్నును - కదలదు తుఫాను గాలులున్న (2)

2. వెట్ట కలిగినను భయపడదు - ఆకులు పచ్చగా నుండును
   వర్షములేని సంవత్సరమున - చింతించదు కాపు మానదు

3. హృదయము అన్నిటికంటే - బహు మోసకరమైనది
   అది ఘోరమైన దుష్టత్వమైనది - దీని నెరుగువారెవ్వరు

4. యెహోవా నగు నేను పరీక్షింతు - అందరి అంతరీంద్రములను
   ప్రతివాని క్రియల ప్రవర్తనను బట్టి - నేను ప్రతిఫలమిత్తును

5. ఓ యెహోవా పరమ తండ్రి - ఇశ్రాయేలాధారుడా
   నిన్ను విసర్జించు వారందరిలలో - సిగు నొందెదరు గాక

6. ద్రోహులు నన్ను విసర్జించిరి - జీవ జల ఊటనైన నన్ను
   ఇసుక మీద పేరు వ్రాయ బడినట్లు - అట్టివారి పేరు నుండుగా

7. దేవా నన్ను స్వస్థపరచు - నేను స్వస్థత నొందెదను
   దేవా రక్షించుము రక్షింప బడుదును - నా సోత్రములకు ఆధారుడా
553 యూదాయందు దేవా ప్రసిద్ధుడవుyoodaayandu devaa prasiddhudavu
పల్లవి:
యూదాయందు దేవా ప్రసిద్ధుడవు - నామమెం గొప్పది తఇశ్రాయేలులో (1)
షాలోము నందు గుడారముండగా - సీయోనులో నీ సన్నిధి గాంచితి (2)

1. స్ముర్నలో నున్న సంఘపు దూతకు - సందేశంబు నిచ్చితివి
   మొదటి కడపటి వాడను నేనె - మృతుడైతిని గాని జీవించుచుంటిని

2. ఎరుగుదును నీ శ్రమ దుఖఃమును - దరిద్రతను నీ దరిద్రతను
   అయినను నీవు ధనవంతుడవే - అని సెలవిచ్చి హెచ్చించితివి

3. యూదులు కాకయే యూదులమనుచు - సాతాను సేనలు బ్రమపరచ
   శ్రమలకు నీవు భయపడవలదని - అభయంబిచ్చి బ్రోచిన ప్రభో

4. నమ్మకముగా నీవు నుండుము నిరతము - ప్రాణాపాయము కలిగినను
   ధరియింప జేతును జీవ కిరీటము - వనరుగా నీపై ననినట్టి ప్రభువా

5. సెలవిచ్చుచుంటివి ఆత్మస్వరముతో - చెవిగల వాడు జయించు విని
   ఏ హాని చేయదు రెండవ మరణము - పొందెదరు నిత్య స్వాస్థ్యమును

6. సిలువయే నీదు స్ముర్నగా కాగా - నిలువక సాగుము శ్రమలందు
   ఎంచక నీదు విలువేమాత్రం - అని సెలవిచ్చిన నా ప్రియయేసు

7. మనుష్యకు మారుడు మహిమతో రాగ - ప్రతిఫలమొందు ప్రతివాడు
   ధవళ సింహాసనమందున్న ప్రభువే
   ఘన స్తుతినొందును తన ప్రజలందు
554 యెహోవా దావీదు బాధలyehovaa daaveedu baadhala
పల్లవి:
యెహోవా దావీదు బాధల జ్ఞాపకముంచు కొనుము -
మాట ఇచ్చి ప్రమాణము చేసెను - యాకోబు బలిష్ఠుని తోడన్ (2)

1. యెహోవాకు నేనొక స్థలమును చూడక
   యాకోబు దేవునికి నివాసము చూడక (2)
   ప్రవేశింపను నా గుడారము నందు
   కన్నులకు నిద్ర రానియ్యననెను (1)

2. అది ఎఫ్రాతాలో నున్నదని వింటిమి
   యారు పొలములో అది దొరెకెను
   పోదము రండి తన నివాసమునకు
   సాగిలపడుదము పాదపీఠము యొద్ద

3. లెమ్ము యెహోవా కృపతోడ రమ్ము
   బలసూచకమైన మందసముతో
   ప్రవేశించు నీదు విశ్రాంతి స్థలమున
   యాజక భక్తులు ఉత్సహించగను

4. నీ దాసుడైన దావీదు నిమిత్తము
   విముఖుడ గాకుము అభిషిక్తునికి
   నీ గర్భఫలమును నీ రాజ్యము మీద
   నియమితుంటివి నిబంధన చేసి

5. దావీదు తోడ సత్య ప్రమాణము
   చేసిన వాడు మాటను మీరడు
   సింహాసనముపై నీదు కుమారులు
   కూర్చుందురంటివి నిబంధనన్ గైకొనన్

6. నా నివాసముకై నే కోరుకొనిన
   సీయోను నే నేర్పరచుకొంటిని
   ఇచ్చటనే నేను వశియించెదను
   దీవింతును దాని నిండారులుగా

7. నీతి వస్త్రముతో యాజకులందరిన్
   శత్రువులను అవమాన వస్త్రముతో
   ధరియింప జేసి ఆనందింతున్
   తేజరిల్లును దావీదుపై కిరీటము
555 ప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు నాకుprabhuyesu naa rakshakaa nosagu kannulu naaku

Hebrews 12:2

పల్లవి:
ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు  -  నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే - ఓమేగయు నీవే (2)

1. ప్రియుడైన యోహాను పత్మాసులో - ప్రియమైన యేసూ - నీ స్వరూపము (2)
   ప్రియమార జూచి - బహు ధన్యుడయ్యె - ప్రియ ప్రభు - నిన్ను జూడనిమ్ము (2)

2. లెక్కలేని మార్లు - పడిపోతిని - దిక్కులేనివాడ - నే నైతిని
   చక్కజేసి నా - నేత్రాలు దెరచి - గ్రక్కున - నిన్ను జూడనిమ్ము

3. ఎఱిగి ఎఱిగి నే - చెడిపోతిని - యేసు నీ గాయము - రేపితిని
   మోసపోతి నేను - దృష్టి దొలగితి - దాసుడ నన్ను - జూడనిమ్ము

4. ఎందరేసుని వైపు - చూచెదరో - పొందెదరు వెల్గు - ముఖమున
   సందియంబు లేక - సంతోషించుచు - ముందుకు - పరుగెత్తెదరు

5. విశ్వాసకర్తా - ఓ యేసు ప్రభూ - కొనసాగించువాడా - యేసు ప్రభూ
   వినయముతో నేను - నీవైపు జూచుచు - విసుగక - పరుగెత్త నేర్పు

6. కంటికి కనబడని - వెన్నియో - చెవికి వినబడని - వెన్నియో
   హృదయ గోచరము - కాని వెన్నియో - సిద్ధపరచితివా - నాకై

7. లోక భోగాలపై - నా నేత్రాలు - సోకకుండునట్లు - కృపజూపుము
   నీ మహిమ దివ్య - స్వరూపమును - నిండార నను - జూడనిమ్ము
556 ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడాo sarvashaktudaa naa satyadevudaa

Jeremiah 33:3 ; Eph 3:20 ; Isaiah 65:24

పల్లవి:
ఓ సర్వశక్తుడా (2)- నా సత్యదేవుడా (2)
సర్వదా నిను నే స్మరియింతును (2)

అను పల్లవి:
ఆనందమే మహాదానందమే -ఆశ్చర్యకరుడు యేసుండు (2)
నా పాపముల క్షమియించెను (2)

1. చెరనుండి నేను - మొరపెట్టగా (2) - పరమునుండి - ఉత్తర మిచ్చెను (2)

2. గూఢమైన సంగతులన్ - గ్రహించునట్లు ప్రభుచేయును

3. అడుగువాటికన్న ప్రభువు - అత్యధికముగా దయచేయును

4. ఊహకు మించిన కార్యములన్ - మహాప్రభు నడిగిన నెర వేర్చును

5. వేడుకొనక మునుపే ప్రభు - వడిగా మాకుత్తరమిచ్చును

6. మునుపటికన్న అధికముగా - మేలుల మాకు కలుగజేయున్

7. ప్రార్థనకు ప్రతిఫలముల్ - ప్రియముగ నొసగును - హల్లెలూయ
557 నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించునుneetimantula praarthana devudaalakinchunu

Psalms 92:12

పల్లవి:
నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును (1)
వారు తమాల వృక్షమువలె మొవ్వు వేయుదురు  (2)

1. మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు (2)
   మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్ (2)

2. గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి
   సతతము ఆనంద మొంద అడుగుడి దొరుకున్

3. యెహోవాకొరకు ఎదురుచూచి పొందుడి బలము
   ఇహమునందు పక్షిరాజువలె పై కెగురుదురు

4. ఊహించలేనిది శక్యము గానివైనట్టి క్రియలను
   యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా

5. మిమ్ము విడువనెన్నడు నెడబాయననెగదా
   నమ్ముము నరమాత్రుం డెపుడే హానిచేయడు

6. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో
   మీ ప్రతి యవసరము తీర్చి కాచు నిరతమున్

7. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును
   నిశ్చయముగా వృద్ధిపొందింతుననె నీ దేవుడు
558 చెట్లులేని మెట్టలందు నదుల పారజేయు దేవాchetluleni mettalandu nadula paarajeyu devaa

Isaiah 41:19

పల్లవి:
చెట్లులేని మెట్టలందు నదుల పారజేయు దేవా   -   చెట్లులేని మెట్టలందు (1)

1. అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను (2)
   ఏదెనుగా మార్చువాడా నాహృదయము మార్చుము (2)
   నాహృదయము మార్చుము (2)

2. ఎండియున్న లోయలందు దండిగ జీవనదిన్
   మెండుగ ప్రవహింపచేయుము బండయైన క్రీస్తును
   బండయైన క్రీస్తును

3. నీటి కాలువ యోరనుండి జీవ వృక్షపుటాకుగా
   సాటి మానవకోటిమధ్యను నిల్పుకొమ్ము నీశక్తితో
   నిల్పుకొమ్ము నీశక్తితో

4. శక్తి హీనుడ శాంతిలేక అలసి సొలసియుంటిని
   ముక్తిదాత పీషోను గీహోను నదుల పారజేయుము
   నదుల పారజేయుము

5. సంకుచితమై సమృద్ధిలేక సారహీనుడనైతినే
   ఇంక హిద్దెకెలు ఫరాతు నదుల పారచేయుము
   నదుల పారజేయుము

6. మరణమునకు పాత్రుడనై నిష్ఫలితముగా నుంటిని
   పరమ జీవ వృక్షఫలములు ఫలింపజేయు నెల నెలన్
   ఫలింపజేయు నెల నెలన్
559 దేవుని ప్రార్థించెదము దైవ పుత్రుని నామమందుdevuni praarthinchedamu daiva putruni naamamandu

Jeremiah 33:3

పల్లవి:
దేవుని ప్రార్థించెదము - దైవ పుత్రుని నామమందు (2)

1. అడుగుడి మీకు నిత్తుననెన్ - వెదకుడి మీకు దొరకుదును (2)
   మదిని నమ్మి మీరు తట్టినచో (2)
   ముదమున తలుపు తీయుదుననె (1)

2. గూఢమైన - సంగతులిలన్ గాఢమై - నీవు - గ్రహింపలేని
   వేడిన పొందెద విలలో
   దండిగ దాని యేలు పొందెనహా

3. ఇదివరకు మీరేమిలయున్ - నాదు పేరట అడుగ లేదనెన్
   మీదు సంతోషము ఇలలో
   అధికమగును పొందిరి శిష్యులు

4. మనలో కార్య సాధకమైన తనశక్తి - చొప్పున క్రీస్తు చేయున్
   మనమడిగినవాటి కంటే ఎంతో
   ఘనముగా చెరలో పౌలు పేతురు గాంచె

5. ఊహించువా టన్నిటి కంటె - సాహసకార్య ములు ఎన్నో
   ఊహకు మించె నగ్నిగుండములో
   ఆహాహా నలుగురు తిరుగుచునుండిరి

6. నా నిమిత్తము జనులు నిన్ను - కాని మాటలెల్ల పలుకునపుడు
   నిన్ను శపించి హింసించిన
   కన్నులెత్తి ప్రార్థించి దీవించుమనె

7. నిశ్చయముగా నేను నిన్ను - ఆశీర్వదింతు నని పల్కె
   నిశ్చయముగ నభివృద్ది జేసి
   శాశ్వతముగా తోడై యుందు ననే

8. ఎన్ని శోధనలు - వచ్చిన పెన్నుగా - ప్రార్ధించు ప్రభుని
   కన్నతండ్రి నిన్ను విడువడు
   సన్నుతించి పాడు హల్లెలూయా
560 ఆకాశ మహా కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడాaakaasha mahaa kaashambulu pattani aashcharyakarudaa

2 Chro 6:18

పల్లవి:
ఆకాశ మహా - కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా (2)

1. కృపజూపి నిబంధనను - నెరవేర్చిన ఉపకారి (2)
   కాపాడితివి నడిపితివి (2)- నీ యింటికి మమ్ములను (2)

2. నీ దాసునికి నీ ప్రజలకు - నీ క్షమను కనుపరచు
   నీదు కల్వరి రక్తమున - నీవె కడుగు కరుణామయ

3. నీతి న్యాయముల కర్త - ప్రీతితోడ నీ ప్రజలకు
   నీతి న్యాయముల నిమ్ము - స్తుతియింప నిరతంబు

4. రాజులనుగా యాజకులనుగా - మము చేసిన మా రాజా
   విజయమిమ్ము మా విజయుండా - నిజమైన నీ ప్రజలకు

5. కరువు తెగులు కష్టనష్టముల్ - వర్ష లేమి పురుగు బాధల్
   కరుణజూపి విడిపించి - మురిపించుము మమ్ములను

6. సమాధాన సంతోషము - ఆదరణ ఆలోచన
   అనుభవింప ననుగ్రహించు - మనిశంబు మాకిచట

7. బలపరచు నీ భక్తులను - బలము తోడ ప్రవేశించి
   విలువైన నీ రక్షణన్ను - ధరింపజేయు మల్లెలూయ
561 ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము పరిపూర్ణముగా జీవము నిమ్ముprabhuvaa paraloka jeevaagni nimmu paripoornamugaa jeevamu nimmu

Ephesians 5:18

పల్లవి:
ప్రభువా పరలోక - జీవాగ్ని నిమ్ము -  పరిపూర్ణముగా - జీవము నిమ్ము
పావనాత్మాగ్నిని - నాలో జ్వలింపగ -  పరిశుద్ధ జీవము - పూర్తిగ నిమ్ము (2)

1. నిను హృదయంబార - ప్రేమించునట్లు - నింపుము నా మది - ప్రేమాగ్నితో (2)
   సర్వము హృదయము - కాయము నిచ్చెద -
   స్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము (2)

2. యేసు స్తుతి నే పాడునట్లు - ఆశనొసగుము - నా హృదయములో
   నన్నుండి జీవము - ప్రవహించునట్లు-నీలో సంతృప్తిగ త్రాగెదను

3. ప్రశస్తరక్తమున - కడుగుము - పాప మృత్యువు నుండి విడిపించుము
   సింహాసనం నాలో స్థాపించి-వాగ్దానము నెరవేర్చుము నాలో
562 పరిశుద్ధ అగ్నిని పంపు దేవాparishuddha agnini pampu devaa

Matthew 3:11

1. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా (2) - రాజిల్లి వ్యాపింపజేయు దేవా (2)

2. కరుణతో అగ్నికణములను -కరిగించి హృదయము తాకించుము

3. దేశమెల్లడలను దివ్యాగ్నిచే - దోషమెల్లను కాల్చి వేయుటకు

4. కన్యక వృద్ధులు యౌవనులు - ఉన్నత ఆత్మచే నింపబడన్

5. పాపులు పశ్చాత్తాపపడన్ - శుద్ధుల మలినము పోగొట్టన్

6. పాపము శాపము లన్నియును - భస్మమై కాలి నశించునట్లు

7. యేసుని ప్రేమను రుచిచూడను - విశ్వాసమునందు వర్థిల్లను
563 పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ముparishuddha parishuddha prabhuyesu rammu

Revelation 22:17

పల్లవి:
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము (2) - మాకు నేడే నీ దీవెనలిమ్ము (1)

1. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు (2) - కృపనిమ్మయా - (4)

2. వేడుచున్నాము యేసు - వేగిరముగా రమ్ము - రమ్ము ప్రియుడా

3. హృదయముల నీరక్తముచే శుద్ధి చేయుమా - శుద్ధిచేయుమా

4. ఆత్మతో మా హృదయముల నిప్పుడు నింపుమా - ప్రభు నింపుమా
564 నీ వాత్మ యుద్ధములో జయ మొందుముnee vaatma yuddhamulo jaya mondumu

2 Timothy 2:3

పల్లవి:
నీ వాత్మ యుద్ధములో జయ మొందుము (2)
ఓ నా సోదరా వెనుకంజ వేయకు -  ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1)

1. స్వామి యేసు తన సిలువను మోసి (2)
   సైతాను రాజ్యము పూర్తిగా జయించె (2) - నీవును యేసుని వెంబడి వెళ్ళుమా (2)
   ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1)

2. శిరమున ముండ్ల మకుటము ధరించి
   సిపాయిచే తలపై కొట్టబడె - నీ శిరస్సు నట్లే సమర్పించు
   ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు

3. కల్వరి పైకి ఒంటరిగానే
   వెళ్ళెను యేసు త్యాగ సహితుడై - నీవును ఆదారినే వెళ్ళుమా
   ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు

4. లోకస్తులంతా నిద్రించుచుండగా
   మోకాళ్ళపై యేసు కొండపై నుండె - నీవును ప్రార్థన శక్తి నొందుమా
   ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు

5. సాహసమున నీ - వాత్మ ఖడ్గమున
   సైతాను బంధము - ఖండించి వేసి - క్రీస్తుని సంఘమా ముందంజ వేయుమా
   ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు
565 పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదెంచితిమిparamaasheervaadamu kori paraloka pitaa arudenchitimi

Numbers 6:24

పల్లవి:
పరమాశీర్వాదము కోరి - పరలోక పితా అరుదెంచితిమి (2)

1. తండ్రీ యోగ్యతలేని మాకు నేడే దయచేయుము నీశక్తి (2)
   హృదయముల ఖాళీజేసి (2) పరలోక పితా అరుదెంచితిమి (1)

2. ఎన్నెన్నో పాపాలు జేసి అపరాధమున సిగ్గునొంది
   మాదు శిరములను వాల్చి - పరలోక పితా అరుదెంచితిమి

3. బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే
   నిన్నే సదా స్తుతియించెదము - పరలోక పితా అరుదెంచితిమి

4. ఇలలో శ్రమలనోర్చిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము
   నీ దాసులను మరువకుము - పరలోక పితా అరుదెంచితిమి
566 శుద్ధ ఆత్మ దిగిరమ్ము మా పైshuddha aatma digirammu maa pai

Acts 2:18

1. శుద్ధ ఆత్మ దిగిరమ్ము - మా పై వేగమే - శుద్ధి యేసు నీ ఈవుల మాకీయుమా (2)

2. పెంతెకోస్తను నాట దిగివచ్చిన - ప్రియ ఆత్మ దిగిరమ్ము ఈ వేళయందు

3. దప్పిగొన్న ఆత్మలను దప్పి తీర్చును - తప్పక ఒక్కొక్కరిని సంధించు వేగ

4. ప్రేమతోడనే శుద్ధ పావురమా రా - డాసి మమ్ము యుద్ధమునకు సిద్ధపర్చుమా

5. నిద్ర కష్టముల సోమరత్వమున్ వీడి - స్తోత్రింప నుత్సాహమును మా పై పోయుమా

6. గత కాలమందు జయమిచ్చిన యట్టి - నూతన ప్రార్థన వాంఛ మాలో పోయుమా

7. అనుదిన మాత్మలను సంపాదించను - గిన్నెనిండి పొర్లిపార నాత్మనీయుము

8. ప్రేమ దీనత్వము శాంత సమాధానముల్
   సంతోషము మాలో వృద్ధి పొందజేయుమా
567 దేవుని ఆశ్చర్యకార్యములను అందరు చూడరండిdevuni aashcharyakaaryamulanu andaru choodarandi

Psalms 106:2

పల్లవి :
యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు 2
మేలుతో నీహృదయమును - తృప్తిపరచుచున్నాడు 2

1.  దేవా నీదు కృపతో - నన్ను కరుణింపుము 2
నీ వాత్సల్యముతో నా - గత పతనంబుల క్షమియించు 2 || యె ||

2. ఆకాశమున నుండి కలిగిన - దర్శనమునకు 
నే నవిధేయుడను కాను - నా దేవా జూపుము కృపను || యె ||

3. బాధించు శత్రువు నన్ను - బలముగ బాధించినను 
నే ధైర్యము విడువను - నను బలపరచుము నీలోన || యె ||

4. ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నేనుండెద నిలలో 
పావనమగు నీ యాత్మన్ - ప్రాపుగ నొసగుము నీదయతో || యె ||

5. ప్రభుయేసు నామమిలలో - ప్రాకటముగ నే బ్రకటింతు 
ప్రత్యక్షముగ నీ శక్తిన్ - ప్రసాదించుము నాకిలలో || యె ||

6. నీయందు నేను నిలిచి - నిత్యము నే ఫలియింతున్ 
సత్యాత్ముడా నాకిమ్ము - నిత్యముగను నీ జీవం || యె ||

7. ఆత్మాగ్ని చేత దేవా - అజ్ఞానుండగు నను నింపు 
నీ జ్ఞానము నాకిమ్ము - సుజ్ఞానుండా హల్లెలూయా || యె ||
568 నింపుమో ప్రభువా నన్ను సర్వ సంసంపూర్ణతతోను నన్నుnimpumo prabhuvaa nannu sarva sansampoornatatonu nannu

Ephesians 5:18

పల్లవి:
నింపుమో ప్రభు నన్ను2  -  సర్వ సంసంపూర్ణతతోను నన్ను (2)

1. నింపుము నీదు ఆత్మతో నన్ (2) - నింపుము సర్వ శక్తితోనన్ (2)

2. పరమానందముతో నింపుము నన్ - ఆత్మీయశాంతితో నింపుము నన్

3. నీదు మహిమతో నింపుము నన్ - ఫలములతో నా జీవితమున్

4. నింపుము ప్రభువా జీవముతో - నింపుము ప్రేమతో నను ప్రభువా

5. సత్యముతో నా హృదయమును - నెనరుతో నింపుము హృదయమును

6. విశ్వాసముతో నింపుము నన్ - నీ జ్ఞానముతో నింపుము నన్

7. ఊటలధారల యనుభవమున్ - నదులను నన్నుండి పారనిమ్ము
569 దేవా నిన్ను నేను విడువనుdevaa ninnu nenu viduvanu

Genesis 32:26

పల్లవి:
దేవా నిన్ను - నేను విడువను నన్ను దీ - వించు వరకు (2)

అను పల్లవి:
దేవా నిన్ను - నేను విడువను - నన్ను దీ - వించు వరకు (2)

1. నేటినుండి - మమ్ము నీవు2 - ఆశీర్వదిం - చెద వంచు (2)
   మాదు హృదయ - కోర్కెలనెల్ల (1) - సఫల పరచు - వాడ (2)

2. లోతునుండి - అబ్రాహాము వేరుపడిన - విధముగా మమ్ము
   లోకమునుండి - వేరుపరచిన - లోకనాథ - నీవేగా

3. అడవి బీడుల - యెడారిభూముల యేహోవ - తన హస్తములతో
   ఏదేను తోటగా - నగునట్లు మార్పు జేయు - వాడ

4. సీయోనులో - నుండి నీవు మమ్ము నాశీర్వ - దించెదవు (2)
   ఇమ్ముగా మా - ప్రార్థన లెప్పుడు - ఆలకించు - వాడ (2)

5. మాదు - స్వాస్థ్య - మును నీవు వాక్యముతో - ప్రత్యక్షపరచి
   ఆత్మీయ - పోరాటమునందు - జయము కూర్చు - వాడ

6. గుండె జారిపోవునట్లు మండిపడుచు - శత్రువురేగ
   అండయై - మము ఆదరించు - బండయైన - క్రీస్తు ప్రభు

7. ఆదియంతము - లేని దేవా అల్ఫయు - ఓమేగయు నీవే
   హల్లెలూయా స్తోత్రములకు - అర్హుడవు - నీవేగా
570 కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నానుkaruninchi tirigi samakoorchu prabhuvaa kshamaapana ninnu veduchunnaanu

1 Samuel 30:19

పల్లవి:
కరుణించి తిరిగి - సమకూర్చు ప్రభువా (2) -  క్షమాపణ నిన్ను  -  వేడుచున్నాను (2)

1. దావీదు రాజు - దీనుడై వేడ (2) - అవనిలో బొందిన నష్టములన్నియు (2)
   దేవా నీవు - సమకూర్చితివే (2)

2. శత్రు సమూహపు - కుతంత్రములతో - బొత్తిగ నేను - నష్టపడితిని
   మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి

3. పసరు గొంగళి - చీడ పురుగులు - నాశము చేసిన - పంటను కూర్చుమ
   యేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను

4. ప్రేమ సంతోషా - నందములను - ప్రధాన యాజకా - పోగొట్టు కొంటిని
   ప్రేమతో నీవు - సమకూర్చుమా

5. పాపపు విషముతో నా పాత్ర నిండెను - ప్రభు యేసుండను పిండిని కలుపుము
   పాప మరణమును - తొలగించుమా

6. ఆత్మీయ సోమరి - తనములో నుండి - ఆత్మనష్టముల - నెన్నియో బొందితి
   ఆత్మదేవా నీవు - సమకూర్చుమా

7. పాపము చేసి - పడియున్న చోటున్ - ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువా
   కోపగించక నాపై - కృప జూపుమా

8. చేసిన పాపము - కప్పుకొనక - విశ్వాసముతో - ఒప్పుకొందున్
   సిలువరక్తముతో - శుద్ధి చేయుమా
571 మా మొర నాలకించుము మహారాజ యేసు ప్రభువాmaa mora naalakinchumu mahaaraaja yesu prabhuvaa

Psalms 22:5

పల్లవి:
మా మొర నాలకించుము - మహారాజ యేసు ప్రభువా (1)
కోపముతో నను జూడకుము (1)- కనికరమున పలుకుము (2)

1. నిన్నెట్లు విడనాడెదను - ప్రాణప్రియుడా నా యేసు (2)
   సిలువకు జడియలేదు - శ్రమలకు బెదురలేదు (2)
   నీ నోట దూషణమాట (2) - ఒకటైనను రాలేదు (2)

2. పరలోకమును విడచితివి - పాపులకై ఏతెంచితివి
   సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివి
   ఇట్టి నీ ప్రేమకు నేను - ఎట్టి ధనమియ్యగలను

3. సమస్త లోకమునకు - నీ రక్తము నిచ్చితివి
   మూయబడిన యీ తలుపు - తీయబడెను నీ వలన
   నే నేల నీ సంస్తుతిని - నిరతంబు చేయకపోతి

4. జగమంత నీ రాకడను - నిరీక్షించుచుండెను
   నీ నీతిని నెరవేర్చుటకు - ఖ్యాతిగ నరుదెంచితివి
   నిబంధన ననుసరించి - విముక్తిని మా కొసగితివి

5. రక్షకుండా పాపులను - శిక్షించక రక్షించు
   నిత్యజీవము నిమ్ము - ఆత్మయందు దీనులకు
   దైవ కుమారా యేసు - సార్వత్రిక నివాసీ
572 ఆత్మ దీపమును వెలిగించుaatma deepamunu veliginchu

John 8:12

పల్లవి:
ఆత్మ దీపమును (2) -  వెలిగించు యేసు ప్రభో  (1) - ఆత్మ దీపమును (2)

1. మార్గంబంతయు చీకటిమయము (2) - స్వర్గ నగరికి మార్గంబెటులో (2)
   సదయా నీవే నను పట్టుకొని (2) - సరిగా నడుపుము - ప్రేమ పథమున (2)

2. వసియించుము నా హృదయమునందు - వసియించు నా నయనములందు
   అన్నియు నిర్వహించు చున్నావు - నన్నును నిర్వహించుము ప్రభువా

3. కలుషాత్ములకై ప్రాణముబెట్టి - కష్టములంతరింప జేసి
   కల్వరి సిలువలో కార్చిన రక్త - కాలువయందు కడుగుము నన్ను
573 ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలోprabhuvaa nee kaaryamunu nootana parachumu maalo

Habakkuk 3:2

పల్లవి:
ప్రభువా నీ కార్యమును (1) - నూతన పరచుము మాలో (2)
పరిశుద్ధ దేవా నీకు (1) - ప్రజలమై యున్నా మిలలో (2)

1. సంవత్సరములు జరుగు - చుండగనే సత్యదేవా (2)
   విలువైన నీదు కార్యమును (2) - తెలియజేయుము మాకు (2)

2. పాపము జేసి నీదు - కోపము రేపితిమయ్యా
   కోపించుచునే నీదు - వాత్సల్యము జూపుమయ్యా

3. ప్రేమతో మము రక్షించి - క్షేమము నిచ్చితివయ్యా
   ప్రేమించకున్నాము మేము - ప్రేమా మయుడా నిన్ను

4. వెలిగించితివి మమ్మిలలో - వెలుగైన ఓ మా ప్రభువా
   పలుచోట్ల లోన మేము - వెలుగకున్నామయ్యా

5. మారుచున్న లోకమున - కారుతొట్లలో త్రాగన్
   జీవపు ఊటవు నిన్ను విడచి - త్రొవతప్పితిమయ్యా

6. సోదర ప్రేమను జూపు - మాదిరి విడచితిమయ్యా
   ఓదార్పు పొందిన మేము - ఆదరణియ్యకున్నాము

7. మేలిమి బంగారుగను - మమ్ముల జేసితివయ్యా
   మాలిన్యమునంటి మేము - మందగిలియున్నాము

8. మాటతప్పని మాదేవా - కోటగా నున్నావయ్యా
   చాటించెద నీదు ప్రేమన్ - సాటిలేని ప్రియుడా
574 ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ముo prabhuvaa ujjeevamu nimmu

Psalms 85:6

పల్లవి:
ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము (2)  - విరిగిన మనస్సుతో నే వేడెదను (2)
ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము (2)

1. కోల్పోయితిని మొదటి ప్రేమను - చల్లారిపోయె నీ ప్రేమ నాలో (2)
   నాలో నిలుపుము నీదు ప్రేమ (2)

2. పడినవారి యాశ్రయమా - విడువ బడిన వారి సహాయుండా
   గాయపు చేతితో లేపుమా

3. శత్రుని యురిలో చిక్కియున్నాను - నాదు బంధకమును తెంపుము నీవు
   ఆనందము నిమ్ము మరల నాకు

4. దోషిని నేను నీకు సఖులకు - అడుగుచుంటిని మన్నన మిమ్ము
   కడుగుము నీదు రక్తములోన

5. ఐక్యతయే నా యభిలాష - నాదు చేదును తొలగించుము
   శత్రుని శక్తిని ఓడించుము

6. పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా - వడిగా నీదు ఉజ్జీవము నిమ్ము
   బూడిద చేయుము నాలోని మన్షున్

7. ఆత్మ ఉజ్జీవ జ్వాలలు జగమున - కదలింపగ వ్యాపింప జేయుము
   హృదయమును ఫలియింప చేయుము
575 పరమతండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుముparamatandri karamuletti stutula narpintumu

Isaiah 40:31

పల్లవి:
పరమతండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము  (1)
శిరములెత్తి స్వామి నీకై  చూచుచుంటిమి  (1)
ఉజ్జీవ నాత్మ  నొసగు  నిలువ  సజీవ  సాక్షిగ  (2)

1. పాప శాపములందు మేము - పడి చెడి యుండగా (2)
   దేవ మాదు దరికి జేరి - లేవ నెత్తితివి (2)
   ఎంత జాలి ఎంత ప్రేమ - స్తుతుల నర్పింతుము (2)

2. దినదినము నిను శోధించి - దుఃఖ పెట్టితిమి
   కేవలము శరీరులమని - కనికరించితివి
   క్షమించి మమ్ము కడిగితివి - స్తుతుల నర్పింతుము

3. నింద వేదన శ్రమలు బహు - నిట్టూర్పులయందు
   విసుగకుండ సేవచేయ - నొసగు నోర్పును
   నింపు నీ శుద్ధాత్మతోను - స్తుతుల నర్పింతుము

4. సూర్యచంద్ర తారలందు - వింత సూచనలు
   జరుగ జనులు ధైర్యము చెడి - కూలి చూచెదరు
   అయితే నీకై చూచు మేము - బలము నొందెదము

5. సమాజముగ కూర్చి నీదు - సన్నిధియందు
   ప్రార్థన సహవాసములలో - స్థిరులజేయుము
   తేరి చూస్తూ నీ రాకడకై - స్తుతుల నర్పింతుము

6. శత్రుటురులు త్రుంచివేసి - జీవమిచ్చితివి
   ఆహా! యేమర్పింతుము - నీ ఉపకారములకై
   చేతబట్టి రక్షణపాత్ర - స్తుతుల నర్పింతుము

7. గతబ్రతుకులో వాత్సల్యమున - గాచి యీ క్షితిన్
   నడిపె నవ్యవత్సరముకై - కృపాక్షేమములతో
   సత్యుడ సిల్వశక్తి నొసగు - సాగముందుకు
576 నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతోnimpumu o prabhuvaa! sarva sampoornatato

Ephesians 3:18

పల్లవి:
నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో  (2)
మేము నిండియుండెదము (2) - పరిపూర్ణత నొందెదము  (4)

1. పాప క్షమాపణ నిచ్చి - జీవముతో నింపుము (2)
   ఆత్మీయ వరమిచ్చిన - బలముతో నిండెదము (2)

2. పరమ సంతోషమిచ్చి - సమాధానంబిమ్ము
   చూపించు పరలోకమహిమ - ప్రకాశముతో నింపు

3. ఆత్మ ఫలములతో నింపి - ప్రేమ సంతోషము
   మంచితనము సాత్వీకము - విశ్వాసముతో నింపు

4. నింపు సత్యముతో మమ్ము నిల్పు - ప్రత్యక్షతలో
   నీ జ్ఞానముతో నింపిన స్తుతితో నిండెదము

5. పరమాశీర్వాదమిచ్చి - తప్పించు యిహమునుండి
   అర్హులుగ చేయు పరమునకై - ఆశించుచున్నాము
577 వెలుగిచ్చి నాకు మార్గము చూపుvelugichi naaku maargamu choopu

Psalms 43:3

పల్లవి:
వెలుగిచ్చి నాకు మార్గము చూపు (1) -  వెలిగించి నా మది ప్రియ యేసు

1. గురి చేరుటకే ఈ నా యాత్ర (2) - సరిగా భువిలో నే చేరుటకుకోరి నీ వెలుగు నే నడచుటకు - ప్రభూ! నడిపించు (2)

2. ఘోరచీకటి నన్నావరింప - మార్గమున ఘోర తుఫాను రేగ
   కరమునెత్తి ప్రభూ! గద్దించుము - ప్రభూ! రక్షించుము

3. నిను చేరి నిత్యం - నీతో నుండుటకే - నే నాశించితి నా హృదయములో
   నను బలపరచి నిలుపుము - ప్రభూ! స్థిరముగను
578 ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించుprabhu kummarinchu prabhu kummarinchu

Isaiah 44:3

పల్లవి:
ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు (1)-  దీవెనల వర్షము కుమ్మరించుము (1)
ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు (1)

1. ఓమా యేసు విను మామనవి (2) - మా మధ్యకు ప్రభు రారమ్ము (2)
   నీ ద్వారమున చేరి యున్నాము (2)- నింపుము ప్రభువా మమ్ములను (2)

2. దప్పిగొన్న వారికి జలము - యెండిన భూమికి జలధారల్
   నీ సంతతిపై ఆత్మను పంపు - నీ దీవెనలతో నింపుము

3. తండ్రి కుడిప్రక్కన నిలుచున్న - యేసు ప్రభువును చూపుము
   ఆ మహిమా నివాసములోని - సమృద్ధితో మమ్ము నింపుము

4. రెండు కెరూబుల మధ్య నుండి - మధుర స్వరము విననిమ్ము
   యేసుని తప్ప యెవరిని వినక - ఆత్మలో తృప్తి పొందెదము

5. తెరువబడిన పరమునుచూడ - దూతలు యెక్కుచు దిగుచుండ
   నీ సంఘమును అభిషేకించి - ఘనకార్యములను జరిగించు
579 కరుణించుము నా యేసువాkaruninchumu naa yesuvaa

Luke 18:7

పల్లవి:
కరుణించుము నా యేసువా -  కనికరమందైశ్వర్యుడా (1)
రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరబెట్టు (1)-  ప్రార్థనకు చెవి యొగ్గుమా (2)

1. నిత్యము మాకై విజ్ఞాపన చేయు - నిశీదరాత్రిన్ ప్రియుడా (2)
   ప్రేమపితా నేడు మీ ఎదుట ప్రార్థించే (1) - ప్రియుల ప్రార్థన వినుమా (2)

2. మా బంధు జనులు మా తల్లి దండ్రులు - మా ప్రియులు నశియించుట
   చూచి సహింపక కన్నీటితో చేయు - మా ప్రార్థన వినుమా

3. నీనెవె పట్టణ దుర్గతిని జూచి - కరుణించి కాపాడితివే
   యోనా మొరకొసగిన ఆలోచన నా కొసగ - నా బీదమనవి వినుమా

4. శ్రమలెన్నో సహించి రక్షించితివే - ఇవియన్నియు వ్యర్థంబౌనా?
   అంజూరపు చెట్టుకై ప్రార్థించినా యట్టి - ఆ ప్రార్థన వినుమా

5. శోధన నుండి రక్షించితివే - సొదొమలో భక్తుని
   అబ్రాహాం ఆనాడు విన్నపించినట్టి - ఆది ప్రార్థన వినుమా
580 నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యాnee paada sannidhiki krupaamaya yesayyaa

Hebrews 4:16

పల్లవి:
నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా (1)
నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని (2)

1. విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా (2)
   సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను (2)

2. ప్రార్థించుమంటివి ప్రభువా - సంకట సమయములో
   దయచూపి నను కరుణించి - ప్రేమతో ఆదరించుమయ్యా

3. నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుము
   మనస్సార ప్రార్థించుచు - యేసు నీదరి చేరెదను

4. నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందినను
   నీకై సహించెదనంత - నీ బలము నా కిమ్ము

5. ఆశతో నీ ముఖమును నేను - ఆసక్తితో చూడ
   సిగ్గుపడనుగా నేను - నీ ప్రకాశము నాపై నుండ

6. శత్రువు నోడించుటకు - నీ శక్తిని చూపు
   నన్నాదరించి నీవు - ఆవరించి కాపాడుము

7. జీవించి ఎదుగునట్లు - జయ జీవితంబిమ్ము
   ఫలించి వర్థిల్లుతకై - ప్రభువా నీ కృప నిమ్ము

8. సీయోను మూలరాయి - అయ్యున్న ఓ ప్రభువా
   కలతను చెందక నేను - నీకై కనిపెట్టెదను
581 అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్adugudi meeru mana prabhuvichun

Matthew 7:7

పల్లవి:
అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ -  తప్పక యిచ్చున్
అడిగెడి ప్రతివాడు పొందున్ (2)

1. భక్తులు విశ్వాసముతో - ప్రార్థించి పొందిరి (2)
   వారి జీవితముల నెంచి చూచి (2) - మీ మేలు కొరకై ప్రార్థించి పొందు (2)

2. మనలో తన శక్తికొలది - అనుగ్రహించును
   ఊహకుమించి చేయు దేవునిని - మీ మేలు కొరకై ప్రార్థించి పొందు

3. మన ప్రార్థనల నాలకించి - సంతృప్తి చెందును
   తన నామమునకు మహిమ కలుగ - మీ మేలు కొరకై ప్రార్థించి పొందు

4. ఇదివరకు మీరేమియు - అడుగకుంటిరి - మీరానంద భరితులగునట్లు
   మీ మేలు కొరకై ప్రార్థించి పొందు

5. దేవుని కేదైనను - చేయ నసాధ్యమా - సర్వశక్తిగల మన దేవునడిగి
   ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు
582 వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరనుvelledamu mari dhairyamuto krupaasanamu cheranu

Hebrews 4:16

పల్లవి:
వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను (2)
తన కనికరము కృపలను పొంద తానె సహాయకుడు (2)

1. మన ప్రార్థన ప్రభువాలకించి - అత్యధికముగా మనకిచ్చును (2)
   మేల్కొని మనము ప్రార్థించిన - ఆశీర్వదించునుగా (2)

2. ఆత్మలనెల్ల ప్రభు రక్షించి - తన మందిరమునకు తెచ్చి
   తన ఆలయములో మేలుపొంద - వేడెదము మనము

3. అందరికి రక్షణ కలుగ - రాజులకు అధికారులలో
   సర్వలోకుల ఉజ్జీవముకై - వేడెదము ప్రభునే

4. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను - శత్రుని రాజ్యము కూలునట్లు
   సేవకులాత్మతో నింపబడ - వేడెదము మనము

5. ఆత్మతో ప్రభుయింటిని కట్టి - దాని యందు ప్రభు మహిమనిండి
   తన ఘనత వర్ధిల్లునట్లు - వేడెదమాయనను

6. సజీవ రాళ్ళతో యిల్లుకట్టి - నీ అధికారము నిలుచునట్లు
   దేవా నీ హృదయానుసారులను - లేపమని వేడెదం
583 ప్రభువా పంపు వర్షమునుprabhuvaa pampu varshamunu

1 Kings 18:41

పల్లవి:
ప్రభువా పంపు వర్షమును - నీ వాగ్దానములు స్థిరపరచి (1)
భీకర ధ్వనితో రానిమ్ము (2)

1. ఏలియా మొరపెట్టగానే - మేఘములు కారుగమ్మెను (2)
   మోపైన వాన - భువిపైన గురిసే (2)- మా దీన ప్రార్థన వినుమా (2)

2. కడవరి వాన కాలమున - వర్షము దయ చేయు మిలలో
   పైరు మొలుచునట్లు ప్రతి చేని లోను - మెరుపులను పుట్టించుము

3. దేవా! నీ స్వాస్థ్యము మీద - సమృద్ధిగా కురిపించుము
   దాహముతోను - దస్సిన మమ్ము - బలపరచి స్థిరపరచుము

4. ఆత్మీయ గొడ్డుతనములో - నలమటించుచున్న మాకు
   ఉపదేశమిచ్చి పరిశుద్ధ పరచి - ఉజ్జీవింప జేయు మమ్ము

5. మా నోట నగ్ని తగిలించి - మా దోషమంతా తొలగించి
   పంపుము దేవా - నిను సేవించుటకు - ప్రాపుగ ప్రకటింపనిమ్ము
584 ఓ కరుణానిధీ, మహా ప్రభుయేసు నీవే సింహాసనాసీనుడవైతివిo karunaanidhee, mahaa prabhuyesu neeve sinhaasanaaseenudavaitivi

Revelation 5:7

పల్లవి:
ఓ కరుణానిధీ, మహా ప్రభుయేసు (2) - నీవే సింహాసనాసీనుడవైతివి   (2)

1. సత్యస్వరూపివి పరిశుద్ధుడవు (2) దావీదు తాళము కల్గియున్నావు (2)
   నీవు తెరచినది మూయగలేరు (2) బంధించినది తెరువగలేరెవ్వరు (2)
   నీ మహాత్మ్యమదే (2)

2. ఏడు నక్షత్రములు నీచేత కలవు - దీప స్తంభముల మధ్య సంచరించెదవు
   జీవించువాడవు ఆది అంతములు - రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా
   అదియే నీ ఘనత

3. అగ్నివంటి నేత్రములు కల్గి - అపరాపరంజి వంటి పాదములు కలిగి
   దేవుని ఏడు ఆత్మలు కలిగి - గ్రంధము తెరచే యోగ్యుడవీవే
   ధన్యుడవు నీవే

4. నమ్మకమైన సత్యసాక్షియు - సర్వసృష్టికి కర్తయైయుండి
   నీతిమంతుడు బహుజ్వాలామయుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు
   ఆమెన్ అనువాడు

5. ఎల్లరు ప్రభుని స్తుతించెదరు - సాగిల పడెదరు కృతజ్ఞులై
   ఆశ్చర్యక్రియలు చేసితివంచు - ప్రభువా నీవే అగమ్యుడవంచు
   నిను కొనియాడెదము
585 రక్షకా, నన్ మర్వబోకు మొఱ్ఱనాలించుrakshakaa, nan marvaboku morranaalinchu

Psalms 77:1

1. రక్షకా, నన్ - మర్వబోకు - మొఱ్ఱనాలించు
   అన్యులైన వారిఁబిల్వన్ - మర్వబోకు నన్

పల్లవి:
యేసు, యేసు - మొఱ్ఱనాలించు
అన్యులైన వారి బిల్వన్ - మర్వబోకు నన్

2. నీ కృపాసనంబు నొద్ద - శాంతమియ్యుము
   పశ్చాత్తాపపడె నన్ను - నాదరించుము || యేసు ||

3. నీదు పుణ్యమేను నమ్మి - యాశ్రయింతు నిన్క్రుంగినట్టి నాదునాత్మఁ - బ్రోవు ప్రేమతో || యేసు ||

4. నాకు సుఖదాత వీవె - జీవదాతవే
   ఇహపరములయందు - దిక్కు నీవెగా || యేసు ||
586 గద్దియలో నుండి పారు - జీవపు నదినీరుgaddiyalo nundi paaru - jeevapu nadineeru

Ezekiel 47:1

1. గద్దియలో నుండి పారు - జీవపు నదినీరు
   ఆశీర్వాదముతో నిండి - యేసు నుండి వచ్చును

పల్లవి:
జీవంపు   జలనదులు - ఉచిత  జీవనది
రక్షకా  నీ  నుండి   పారున్   -   నాద్వారా   పారనిమ్ము

2. రక్షకా నన్ను శుద్ధీకరింపుము - కాల్వగా మార్చునన్ను
   ఖాళీగా చేసి నన్ నింపి - లోబడుటకు నేర్పుము || జీవం ||

3. అప్పుడే యేసు ప్రభువా - నాలో నదుల్ పారును
   అట్టుల నితరులు నీ - పూర్ణత నెరుగుదురు || జీవం ||
587 ఆశీర్వాదంబుల్మామీద - వర్షింపజేయు మీశaasheervaadambulmaameeda - varshimpajeyu meesha

Zechariah 10:1

1. ఆశీర్వాదంబు ల్మామీద - వర్షింపజేయు మీశ
   యాశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము

పల్లవి:
ఇమ్మహి మీద  - గ్రుమ్మరించుము -  దేవా
క్రమ్మర  ప్రేమ  వర్షంబున్  -  గ్రుమ్మరించుము దేవా

2. ఓ దేవ పంపింప వయ్యా - నీ దేవెన ధారలన్
   మా దాహ మెల్లను బాపు - మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మహి ||

3. మా మీద కురిపించు మీశ - ప్రేమ ప్రవాహంబులన్
   సమస్త దేశంబు మీద - క్షామంబు పోవునట్లుగన్ || ఇమ్మహి ||

4. ఈనాడే వర్షంపు మీశ - నీ నిండు దీవెనలన్
   నీ నామమందున వేడి సన్నుతి - బ్రార్థింతుము || ఇమ్మహి ||
588 ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడుpreetigala mana yesu ento goppa mitrudu

John 15:15

1. ప్రీతిగల మన యేసు - ఎంతో గొప్ప మిత్రుడు
   మితిలేని దయచేత - హత్తుచు బ్రేమించును
   క్రీస్తునొద్ద మన భార - మంత నప్పగించినన్
   శక్తిగల యేసు చేత - మోత లెల్ల వీడును

2. నీతిగల మన యేసు - ధృతిగల మిత్రుడు
   మృతి బొంది కృపతో - వి - శ్రాంతి కలిగించెను
   భీతి నొందు బాపులైన - జింతాక్రాంతులైనను
   క్రీస్తు యొక్క దీప్తిచేత - క్రొత్తగతి జూతురు

3. దయగల మన యేసు - ప్రియమైన మిత్రుడు
   మాయ లోకమందు నిజా - శ్రయుడై కాపాడును
   భయ దుఃఖ శ్రమలాది - మోయరాని బాధలన్
   జయ మొప్ప నోర్చి యేసు - స్థాయి వృద్ధి చేయును

4. ధరణిలో యేసుగాక - వేరుగొప్ప మిత్రుడా!
   పరలోకమందు నింక - పరమ రక్షకుడా!
   నరులను గావ వేగ - గ్రూరహింస పొందుచు
   కరుణించి నిల్చి ప్రతి - ప్రార్థనాలకించు
589 సర్వశక్తి యుతుడా - సభకు శిరస్సాsarvashakti yutudaa - sabhaku shirassaa

Habakkuk 3:2

పల్లవి:
జీవింపచేయుము నమ్మి ప్రార్థింతుము  - వాక్కు నెరవేరువరకు - కాచియుండెదము

1. సర్వశక్తి యుతుడా - సభకు శిరస్సా
   కొఱతయెక్కువాయెను - త్వరగా కృపనిమ్ము

2. ప్రేమతో పిల్చితివి - నన్ను రక్షించితివి
   నీ జీవము నాలో వాడెను - నాదేవా దిగుము || జీవింప||

3. ప్రేమ చల్లారెనే - ఆత్మ కొఱతచే
   శవమువలె నైతిని - నీ చేత నన్నెత్తు || జీవింప||

4. ప్రార్థన వాంఛయు - వాక్యంబు నాసక్తి
   నాలో నూటగా రానిమ్ము - సర్వం సమర్పింతున్ || జీవింప||

5. వైరి చెఱ వీడన్ - పోరుపట్టుదలతో
   సల్పి జీవపత్రిక గా - నీచే ప్రకాశింతున్ || జీవింప||

6. ఆత్మ పెండ్లికుమారా - నీరాక కొరకై
   నిర్భయముతో వేచియుండ - నానిద్ర పోగొట్టు || జీవింప||

7. హల్లెలూయ పాడను - మరుపులు తొలగును
   శుద్ధాత్మను వెదకును - ఎల్లరకున్ చాటన్ || జీవింప||
590 ఓ ప్రార్థనా సు ప్రార్థనా నీ ప్రాభవంబున్ మరతునా?o praarthanaa su praarthanaa nee praabhavambun maratunaa?
1. ఓ ప్రార్థనా సు ప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా? (1)
   నా ప్రభువున్ ముఖాముఖిన్ - నేబ్రణుతింతు నీ ప్రభున్ (1)
   నా ప్రాణమౌ సు ప్రార్థనా - నీ ప్రేరణంబుచే గదా (1)
   నీ ప్రేమధార గ్రోలుదు - నో ప్రార్థనా సు ప్రార్థనా - (2)

2. పిశాచి నన్ను యుక్తితో - వశంబుచేయ జూచుచో
   నీ శాంతమైన దీప్తియే - నా శంకలెల్ల మానుపున్
   నీ శక్తి నేను మరతునా - నా శైలమైన ప్రార్థనా
   నాశోక మెల్లదీర్చెడు - విశేషమైన ప్రార్థనా

3. నీ దివ్యమైన రెక్కలే - నా దుఃఖభారమెల్లను
   నా దేవుడేసు చెంతకు - మోదంబు గాంచుబోవును
   సదా శుభంబులొందను - విధంబు జూప నీవెగ
   నా ధైర్యమిచ్చు ప్రార్థనా - సుధాసుధార ప్రార్ధనా

4. అరణ్యమైన భూమిలో - నా రమ్యమౌ పిస్గా నగం
   బురంగుగాను నెక్కి నా - చిర గృహంబు జూతును
   శరీరమున్ విదల్చి నే - బరంబు బోవు వేళలో
   కరంబు నిన్ను మెచ్చెదన్ - బరే శు ధ్యాన ప్రార్థనా
591 యేసూ నా ప్రభువా - నీ ప్రేమ లేకున్నyesoo naa prabhuvaa - nee prema lekunna

Psalm 86:1

పల్లవి:
ఒక్కొక్క గంట నేను - నిన్నాశించుకొందు -  నీ యాశీర్వాదమిమ్ము - నా రక్షకుడా

1. యేసూ నా ప్రభువా - నీ ప్రేమ లేకున్న
   నా యాత్మ కేదియు - విశ్రాంతి నియ్యదు

2. యేసూ, రేబగళ్ళు - నాయొద్ద నుండుము
   నాతో నీ వుండిన - ఏ భయముండదు || ఒక్కొక్క ||

3. సుఖంబు నొందగా - నిన్నే యాశింతును
   దుఃఖంబు నొందగా నీవే శరణ్యము || ఒక్కొక్క ||

4. నీదు మార్గమందున - నే నడ్వనేర్పుము
   నీ మాట చొప్పున నన్నున్ దీవించుము || ఒక్కొక్క ||

5. నిన్నే యాశింతును - యేసూ నా ప్రభువా
   నీ వంటి వాడనై నన్నుండ జేయుము || ఒక్కొక్క ||
592 విసుగకుండా నిత్యము ప్రార్థించ వలెననిvisugakundaa nityamu praarthincha valenani

Luke 18:1

పల్లవి:
విసుగకుండా నిత్యము - ప్రార్థించ వలెనని -
విశదముగా నుడివితివి - విసుగకుండా నిత్యము (1)

1. ఏకీభవించి భువిపైన యిద్దరు (2)- వేడుకొను సంగతులను గూర్చి (2)
   నా తండ్రివలన దొరుకునని (2)- నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా (2)

2. ఆది అపొస్తలుల యేక భావముగా - ఎడతెగక నిను ప్రార్థించగా
   వారి మొఱ నాలించిన ప్రభువా - మా మొఱ నీ చెంతకు రానిమ్ము

3. పేతురపొస్తలుడు చెరసాలలో నుండ - అత్యాసక్తిగా ప్రార్థించగా
   ఆనాటి శిష్యులు కనిరి - నీ గొప్ప మహాత్మ్యమును

4. నా యందు మీరు మీలో నావాక్యము - నిలిచియుండిన యెడల మీకు
   ఏది ఇష్టమో దాని నడిగి - పొందుమంటివి క్రీస్తు ప్రభువా

5. ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ - విసుగక కూడియుందురో
   అందరి మధ్యనుండే ప్రభువా - రమ్ము మా మధ్యకు నేడే
593 నీ సన్నిధి చేరితిమి ప్రభువా ప్రార్థన వినుమాnee sannidhi cheritimi prabhuvaa praarthana vinumaa

Acts 4:24

పల్లవి:
నీ సన్నిధి చేరితిమి (2) - ప్రభువా ప్రార్థన వినుమా (1)
సన్నిధి చేరితిమి ప్రభు నీ సన్నిధి చేరితిమి (2)  -  నీ సన్నిధి చేరితిమి (1)

1. భారములతో వచ్చితిమి ప్రభువా2 - దృఢనమ్మికతో వచ్చితిమయ్యా2
   హృదయాలోచన లెరిగినవాడా (2) - మా మనవిని వినుమా (1)

2. ఆత్మతో నీకే మొఱపెట్టితిమి - నీ చిత్త మెరిగి ప్రార్థించితిమి
   అడుగక మునుపే మొఱ వినువాడా - మా మనవిని వినుమా

3. మా మధ్యకు రారమ్ము మా ప్రభువా - రక్తముతో మము శుద్ధీకరించుమా
   శత్రుని శక్తిని బంధించు ప్రభువా - మా మనవిని వినుమా

4. కాంక్షించితిమి దీవెనలొంద - రక్షించుము ఆత్మలను ప్రభువా
   నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు - మా మనవిని వినుమా
594 గుణవంతురాలైన ఘనమైన స్త్రీయేgunavanturaalaina ghanamaina streeye

Proverbs 31:10

పల్లవి:
గుణవంతురాలైన   ఘనమైన   స్త్రీయే
గొప్పది  యెంతో   వెలగల   ముత్యము కన్న

1. క్రీస్తేసు రక్తములో కడుగబడి - కృపద్వారా రక్షణ పొందిన స్త్రీయే
   కొనియాడ తగినది ధన్యురాలు తానే

2. నీ జనమే నా జనమని ఎంచుకొని - నిజదేవుని వెదకి వెంటాడిన రూతు
   కొనియాడ తగినది ధన్యురాలు తానే

3. దేవుని సన్నిధిలో ప్రార్థించగా - దేవుడు హన్నా ప్రార్థన వినెను
   కొనియాడ తగినది ధన్యురాలు తానే

4. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి - యుద్దము జయించెను దెబోరా
   కొనియాడ తగినది ధన్యురాలు తానే

5. నేను నశించిన నశించెదనని - తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించె
   కొనియాడ తగినది ధన్యురాలు తానే

6. ఆభరణ వస్త్రాలంకారముగాక - అక్షయాలంకారము కల్గిన స్త్రీయే
   కొనియాడ తగినది ధన్యురాలు తానే

7. ప్రభుయేసుని గుణగణములను కల్గి - పృథివిపై ప్రభు కొరకై నిలిచెడు స్త్రీయే
   కొనియాడ తగినది ధన్యురాలు తానే
595 జీవిత తృష్ణలను - నాదు తీర్చుమయ్యా ప్రియ యేసునాథాjeevita trushnalanu - naadu teerchumayyaa priya yesunaathaa

John 4:15

పల్లవి:
జీవిత తృష్ణలను - నాదు - తీర్చుమయ్యా  ప్రియ - యేసునాథా

1. నా జీవాధారము నీవే - నీ నుండే జీవము ప్రవహించు
   ప్రవహించే ఈ నీ జీవముతో - ప్రభువా నన్ను నింపుము

2. నా శాంతిదాతవు నీవే - శాంతము నీనుండే వచ్చునుగా
   నిశ్చలమైన నీ శాంతముతో - నా జీవితమును నింపుము

3. సత్యానందమును నీవే ప్రభు - అసమానము నీ యానందమేగా
   అత్యానంద భరితునిగాజేసి - నిత్యము నన్ను నింపుము

4. పరిశుద్ధ జీవానందము - పరిశుద్ధతను నా కొసగితివి
   నిరతము నా జీవితము ద్వారా - లోకమును దీవించుము
596 ఓ యెహోవా నీవే నన్ను శోధించి యెరిగితివిo yehovaa neeve nannu shodhinchi yerigitivi

Psalm 139:1-7

పల్లవి:
ఓ యెహోవా నీవే నన్ను - శోధించి యెరిగితివి (2)

1. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును (2)
   నా తలంపులు నీకు తెలిసెన్ నాలో కలుగక పూర్వమే (2)

2. నాదు నడక, నాదు పడక నీవే పరిశోధింతువు
   నా ప్రవర్తన యంతా నీకే సంపూర్ణముగా తెలియును

3. నీదు చేతిన్ నాపై నుంచి నన్ను ఆవరించితివి
   నీదు యెడమ కుడిచేతులలో నన్ను భద్రపరతువు

4. నీదు యాత్మకు మరుగైయిలలో నెచ్చటికి నే వెళ్ళెదన్
   యెక్కడికి వెళ్ళినను అక్కడున్నావు ప్రభూ

5. నాదు అంతరంగమును నాదు ఆలోచనలను
   నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయమున్
597 దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాముdevaa nee sannidhilo nilachi deenulamai morapettuchunnaamu

Nehemiah 13:31

పల్లవి:
దేవా నీ సన్నిధిలో నిలచి (1)- దీనులమై మొరపెట్టుచున్నాము (2)

1. అపరాధులగు నీదు ప్రజల నెపములన్నియు బాపి (2)
   కృపాళుండగు యేసు ప్రభువా కృపను జూపి రక్షించుమయా (2)

2. చేసి యున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి
   మోసములలో బడియున్నాము యేసుప్రభు జయమునిమ్ము

3. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు
   నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ము నీ వాక్యముచే

4. నిస్వార్థులగు నీ దాసులను విశ్వాసప్రమాణికులన్
   శాశ్వతమైన ప్రేమతోనింపు విశ్వాసులు స్థిరపడి నడువ

5. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి
   మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈమహిలో చాటించుటకు
598 ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువాpraarthana vinedu devaa praarthinchumanina prabhuvaa

John 16:24

పల్లవి:
ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా (1)
స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మముజూడు (2)

1. పొందిన మేలుల మరచి మందిర సమృద్దిన్ విడచి (2)
   పొందితిమిలలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా (2)

2. ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరులవలె మేము
   అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా

3. ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మముజూచి
   పరిహాసమును చేయ తరుణము నిచ్చితిమయ్యా

4. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా
   త్రోసివేయని మా దేవా నీ చెంత జేరితిమయ్యా

5. నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు
   నింపునీయాత్మనుమాలో సంపూర్ణులుగా జేయుమయ్యా
599 నేను వెళ్ళెదను మీరు ప్రార్థనలో నుండుడిnenu velledanu meeru praarthanalo nundudi

Acts 2:42

పల్లవి:
నేను వెళ్ళెదను మీరు ప్రార్థనలో నుండుడి (2)
దేవుని వాక్యమును పాటించు చుండుడి  (2)   నేను వెళ్ళుచున్నాను (1)

1. దేవుని వాక్యమే మీ జీవాహారము (2)
   ఎల్లప్పుడు ధ్యానించి స్తుతించుచు నుండుడి (2)

2. నలుగురు ఎక్కడ కలిసి యుండెదరో
   నన్ను మరువక ధ్యానించుచుండుడి

3. వెరువక నిలువుము ఎట్టి బాధలలో
   మరువక మీరు ప్రార్థించు చుండుడి

4. హింసించబడినను హింసింపకుడి
   కీడుకు బదులుగా మేలు చేయుచుండుడి

5. మిమ్మును కొనిపోవ త్వరగా వచ్చెదను
   ముచ్చటించుడి నారాకను గూర్చి

6. ప్రేమతో ప్రాణము నర్పించితిని
   ఈ ప్రేమనే సదా ధ్యానించు చుండుడి
600 యెడతెగక ప్రార్థించుముyedategaka praarthinchumu
పల్లవి:
యెడతెగక ప్రార్థించుము (2)  - మెలకువతో కొనసాగుము (1)
యెడతెగక   ప్రార్థించుము (1)

1. క్రీస్తుని ఉపదేశమును పొంది (2) - ఆయన మాదిరి మదియందుంచి (2)
   ప్రార్థించుము - కౄతజ్ఞతతో (2) - ఆనంద గీతము పాడుచును (2)

2. ఆయన రాకడ సమీపము - అర్థరాత్రో కూడి కూయునపుడో
   గమనిక లేనివానివలె నుండిన - యజమానుని శిక్షకు గురి యగుదువు

3. ఉగ్రత నుండి తప్పించు యేసు - ప్రత్యక్షమౌను పరమందుండి
   ఉపద్రవమందు పొందిన రక్షణ - కాపాడుకొనన్ నీ ఆత్మయందు

4. మీరేగదా మాదు నిరీక్షణ - ఆనందమును అతిశయమని
   ప్రేమతో ప్రయాస మొందునట్టి - దైవజనుల పోలి నడువంగను

5. విశ్వాసమందున్న లోపములను - సరిదిద్దుటకు కృపను పొంద
   ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి - వేదనతో వేడు శక్తిని పొంద

6. ప్రధానదూత శబ్దమును - దేవుని బూర ద్వనిని వినగా
   క్రీస్తునందుండి మృతులైనవారు - లేతురు మొదట మనకన్న ముందు

7. నిద్రపోక భద్రముగా నుండ - భారముతో వేడుము ప్రభు శక్తిని
   ఎత్తబడరు మత్తులైనవారు - మెలకువతో వేడు ఉజ్జీవాత్మకై

8. మీ ఆత్మజీవమును రాకడయందు - నిందారహిత సంపూర్ణతతో
   సమాధాన కర్తన్ ప్రార్థించుము - కాపాడబడను పరిశుద్ధతలో
601 విలపింతువా నెహెమ్యావలె?vilapintuvaa nehemyaavale?

Ezra 10:1

పల్లవి:
విలపింతువా నెహెమ్యావలె? - విలపింతువా ఎజ్రావలె? (2)
కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో (1)
పడిపోయిన ప్రభుని యింటిని గూర్చి విలపింతువా? (2)

1. ఆత్మీయ గ్రహింపు లేకయే - ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి (2)
   ఎటుచూచిన ప్రభు యిల్లు పడిపోయెను - ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి (2)

2. అగ్నిచే కాల్చబడిన గుమంబులన్ - పడిపోయిన ప్రాకారమున్
   పునఃనిర్మించి నిందను తొలగించెదమా? ప్రభు హస్తంబుతోడుండగన్

3. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో - ఆత్మకలిగించు ఐక్యతతో
   ఒకరినొకరు క్షమించి, సహించుచు - ప్రభు ప్రత్యక్షత పొందెదమా?

4. నెహెమ్యావలె హృదయంబుల చింపుకొని - పశ్చాత్తాపముతో ప్రభుని చేరి
   ఒక చేత ఆయుధము పట్టుకొని - ప్రభుయింటిని కట్టెదమా
602 నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలిnenu taggaali yesu neeve hechaali

John 3:30

పల్లవి:
నేను తగ్గాలి యేసు - నీవే హెచ్చాలి (2)
నేను పూర్తిగా మరుగై - నీవే కనబడాలి (2)
ఇదియే నా ప్రార్థన - నీ చిత్తము (2)

1. నేను యేసుతో కూడ - సిలువ వేయబడాలి - (2)
   నా స్వార్థ జీవితమంతా - లయమైపోవాలి - (2)
   యేసుని స్వభావమునాలో - అధికమౌతు ఉండాలి - (2)
   పరలోక జీవమునాలో అభివృద్ధి చెందాలి - (2)

2. ఆదాము పాపమునాలో - వశియించియుండగా
   యేసుని రక్తమోదాని - నశియింపచేయును
   ఆటంకమేమియు లేక - జీవధారలుండాలి
   యేసుని జీవమునాలో - నింపబడుతుపోవాలి

3. ప్రాచీన స్వభావమంత - సిలువ్ వేయబడాలి
   దాని ప్రభావమంత - లయమై పోవాలి
   అన్నిటిలో పాత స్వభావం - తొంగి తొంగి చూస్తుంది
   ప్రతిదినము యేసుప్రభువే - నాలో వృద్ధి చెందాలి

4. ఇహలోక కోరికలన్ని - సిలువవేయబడాలి
   ప్రభువైన యేసుకునాలో - ప్రథమ స్థానముండాలి
   శరీరేచ్ఛలన్ని మృతమై - ఆత్మీయతరావాలి
   ఆత్మీయ జీవము నాలో - అభివృద్ధి చెందాలి

5. లోకమంతయునాకై - సిలువ వేయబడాలి
   లోకముకై నేను కూడ - మృతమై పోవాలి
   కాదు లోకం యేసేనాలో - ఘనపరచబడాలి
   ఆశలన్నినావి యేసులో - దాగిపోయి ఉండాలి

6. నా శేష జీవితమంతా - యేసుకే సమర్పితమై
   ఆయన మహిమా స్వరూపం - పొంది మార్పు చెందాలి
   ఒకదినాన యేసుని రూపం - నాలో కనబడాలి
   మెట్టు మెట్టుకు ఆయన పోలిక - నాలో ఏర్పడాలి
603 ప్రార్థించుము నీ జీవితములోpraarthinchumu nee jeevitamulo
పల్లవి:
ప్రార్థించుము నీ జీవితములో - నెమ్మది సుఖము లొందెదవు (2)
సంపూర్ణ భక్తిని కలిగించును - క్షేమములెన్నో పొందెదవు (2)

1. యెడతెగక నీవు ప్రార్థించినా - విసుగక నీవు ప్రార్థించినా (2)
   సమస్తమును నీవు పొందెదవు - తప్పక న్యాయము పొందెదవు (2)
   నీ కొరకై ప్రభు వేచియున్నాడు - ప్రార్థనలో కనిపెట్టుము (2)

2. కష్టము నష్టము కలిగినను - శోధన బాధలు వచ్చినను
   సాతాను నీపై విజృంభించి - నిన్ను గాయపరచినను
   భయపడకుము ప్రభువే నీకు - జయము నిచ్చును

3. ప్రభువే మనతో సెలవిచ్చెను - మెళకువగా నుండి ప్రార్థించు మని
   విశ్వాసము కోల్పోయే దినములలో - విశ్వాసముతో ప్రార్థించినా
   సాతాను దుర్గములను - పడగొట్టి - బలము పొందెదవు

4. ప్రభువచ్చు వేళాయే గమనించుము - ఆత్మ వలన ప్రతి విషయములో
   ప్రార్థన విజ్ఞాపన చేయుచు - పూర్ణమైన పట్టుదలతో
   పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు - మెళకువగా నుండుడి

5. యెరూషలేము క్షేమముకై - అన్యజనుల రక్షణకై
   భారముతో నీవు ప్రార్థించిన - ప్రభువే నీకు ఫలమిచ్చును
   వారి క్షేమమే నీ క్షేమమునకు - ఆధారమగును
604 ప్రార్థించుము ప్రియుడా ప్రభు సన్నిధిలోpraarthinchumu priyudaa prabhu sannidhilo

Matthew 7:7

పల్లవి:
ప్రార్థించుము - ప్రియుడా ప్రభు సన్నిధిలో  (2)
పోరాడుచుండుము - పట్టు విడువక (2)

1. అడుగుము నీకు ఇవ్వబడును (2)
   తట్టుము నీ - కెల్లప్పుడు - తెరువబడును (2)

2. ఆవగింజంత విశ్వాసమున్న
   అవనియందు - కదలింతువు - పర్వతములను

3. అడుగు వాటిని - పొందితివని నమ్ము
   ఊహించు - వాటికన్నను - పొందెదవు
605 యెహోవా నీ దిక్కునకు నా ఆత్మనుyehovaa nee dikkunaku naa aatmanu
పల్లవి:
యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుచున్నాను -
నీపై నమ్మిక యుంచితిని - నన్నెన్నడు సిగ్గు పడనీయ్యకు (2)
యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుచున్నాను (1)

1. ఎందరు నీకై కనిపెట్టెదరో - వారందరును సిగునొందరుగా (2)
   ద్రోహము చేయువారందరును (2) - తప్పక సిగ్గునొందెదరు (1)

2. అతిశయించుచున్నాను దేవా - నా హృదయమున నిన్ను బట్టి
   సంతోషింతురు దానిని వినగా - ఆత్మలో దీనులగువారు

3. ఉత్తరమిచ్చెను నా యెహోవా - తన యొద్దనే విచారణ చేయగ
   తప్పించెనుగా ఆయనే నన్ను - ప్రతివిధ భయములనుండియును

4. ఆయన తట్టు చూచెడువారికి - ధీటైన వెలుగు కలుగును గాన
   లజ్జింపకుండును వారి ముఖంబులు - ఎన్నటెన్నటికైన నా దేవా

5. యధార్థహృదయులందరిని దేవా - బలపరచుటకై నీకనుదృష్టి
   సంచారము చేయు లోకమంతటను - సంక్షేమమును కోరినదై

6. యెహోవా నాకిల సహాయుడవై - నన్నాదరించు చున్నావు నీవు
   చూపుము నాకు శుభ సూచనను - నా పగవారు సిగ్గు నొంద

7. హృదయ పూర్తిగా చెల్లించెదను - వందిత నీకు నా కృతజ్ఞతలు
   నిత్యము నేను నీ నామమును - మహిమపరతును నాప్రభువా
606 నా సన్నిధీని యెహోవాnaa sannidheeni yehovaa
పల్లవి:
నా సన్నిధీని యెహోవా - వెదకుమని చెప్పగా (2)
నా హృదయము నీతో పలికెను మక్కువతో -
ఓ యెహోవా నీ దర్శనమునకై - వెదకుచున్నాను (1)

1. సిద్ధపరతువు శత్రువు యెదుట - భోజనపు బల్ల (2)
   నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది (2)

2. మనుష్యుల కపటో పాయము నుండి - దాచుచున్నావు
   మాన్చితివి వాక్కులహమునుండి - గుడారములో దాచుచున్నావు

3. నీకు విరోధముగా చేయబడిన - ఏ ఆయుధమును
   నిలువదు నీకు విరోధముగా - ఎన్నడైనను వర్ధిల్లదననెను

4. న్యాయ విమర్శలో ఎదిరించువారు - నిలువరు ఎన్నడును
   చేతువు నీవు నేర స్ధాపన - చేర డెన్నడు దాపుకు వారు

5. యెహోవా సేవకుల భాగము మరియు - స్వాస్థ్యము ఇదియే
   యెహోవా వలనే దాసుల నీతి - ఇదే యెహోవా సెలవిచ్చు వాక్కు
607 ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్పశక్యమాaahaa yemaanandam aahaa yemaanandamu cheppashakyamaa

Acts 3:8

పల్లవి:
ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్పశక్యమా (2)
ఆహా నారాజగు యేసు నావృజినముల మన్నించివేసెను (2)

1. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించెదము (2)
   వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము (2)

2. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను
   దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను

3. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించినందున
   రక్షకుడు యేసునుగూర్చి మా సాక్ష్యము నిశ్చయముగ నిత్తుము

4. తెల్లంగి, వాద్యము, స్వర్ణ కిరీటము, మేడపై జయజెండాల్
   ఉల్లసించి మంటినుండి మింటకేగిన రాజున్ స్తుతింతుము
608 కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతుkrupa kanikaramula maa devaa krutajnyatanarpintu
పల్లవి:
కృప కనికరముల - మా దేవా - కృతజ్ఞతనర్పింతు (2)

1. యెహోవా చేసిన - ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును? (2)
   యెహోవా నామమున - ప్రార్థన జేసెదను (2) - రక్షణ పాత్రచేబూని (1)

2. యెహోవాకు నా - మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను
   యెహోవా ప్రజలలో - యెరూషలేములో - ఎల్లప్పుడు స్తుతింతు

3. తల్లి గర్భమున - రూపింపబడక మునుపే నన్ను - ఎరిగితివి
   తల్లి గర్భమునుండి - బయలుపడకముందే - ప్రతిష్టించితివి

4. పూర్ణ మనస్సుతో - నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి
   కరుణతో నీవే - నన్ను వెదకి - రక్షించితివి ప్రభువా

5. దూషకుడను - హింసకుడను హానికరుడనై యుంటిని
   దాసునిగా నన్ను - జేసికొంటివి - దోషముల బాపి

6. ఇది నీకొరకై - విరువబడిన నా శరీరమనియంటివి
   ఇది నీ పాప - క్షమకొరకై - చిందిన రక్తమంటివి

7. నీదు కృపతో - నాదు యేసు నన్ను నీవు - రక్షించితివి
   కాదునాదు - క్రియలవలన - ఇది దేవుని వరమే

8. చెప్పనశక్యము - మహిమా యుక్తము నీవొసంగిన - సంతోషము
   తప్పకుండ హల్లెలూయ - పాటపాడెదన్
609 అమూల్యరక్తము ద్వారా రక్షణపొందిన జనులారాamoolyaraktamu dvaaraa rakshanapondina janulaaraa

Ephesians 2:13

పల్లవి:
అమూల్యరక్తము ద్వారా రక్షణపొందిన జనులారా (1)
సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము (1)
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము (1)

1. మన యౌవన జీవితముల్ - శరీరాశకు లోబరచి (2)
   చెడుమాటలను పలుకుచు - శాంతిలేక యుంటిమిగా (2)

2. చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము
   నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి

3. నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక
   స్వంత నీతితోడనే - దేవుని రాజ్యము కోరితిమి

4. కనికరముగల దేవుడు - మానవరూపము దాల్చెను
   ప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను

5. తన రక్తధారలలో - మన పాపములను కడిగి
   మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో

6. పాపులమైన మనమీద - తన యాశ్చర్య ఘనప్రేమ
   కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము

7. మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా
   మన దేవుని కర్పించెదము - ఆత్మ ప్రాణ శరీరములన్
610 పాప సముద్రమందు పగిలె నా హృదయనావpaapa samudramandu pagile naa hrudayanaava

Mark 4:38

పల్లవి:
పాప సముద్రమందు - పగిలె నా హృదయనావ (1)
నావను దరికి యేసు - నడిపించు చక్కజేసి (2)

1. ప్రక్కలో కారిన రక్త - చుక్కల దర్శనమిమ్ము (2)
   నా తండ్రి నడుపు సత్య - నూతన మార్గమందు (2)

2. నజరేయుడా యేసు నీదు - నాణ్యంపు ముఖమును జూపి
   స్వస్థపర్చు రోగుల - సర్వజనుల బ్రతికించు

3. సీయోను పర్వత మహిమ - చూపించుము ఎల్లరికి
   నా హృదయముపైనున్న - నల్ల తెరను చింపుము

4. నా ప్రాణ ప్రియుడా యేసు - నా ప్రార్థన వినుమా
   సంపూర్ణునిగా చేయు - నీ చక్కని దర్శనమిచ్చి
611 నీలి గగనాన వెలిగే తారల బోలి లోకాన వెలుగుదంneeli gaganaana velige taarala boli lokaana velugudam

Philippians 2:16

పల్లవి:
నీలి గగనాన వెలిగే తారల - బోలి లోకాన వెలుగుదం (1)
మధుర స్వరంపు పక్షుల బోలి (1) - యేసునకే స్తుతి పాడుదం (2)

1. పువ్వుల పరిమళంబు లెల్ల తోటలో వ్యాపించునట్లుగా (2)
   పూనికతోడ లోకమనెడి - తోటలో పరిమళం నింపుము (2)

2. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ
   నీదు జీవిత తేజంబు వెల్గన్ - పాపాంధకారము పోవును

3. దీపమున తైలమున్నంత కాలం - దీపమునందున్న వత్తి మండున్
   ఈ పృధివిలోన జీవించు కాలం - వ్యాపింపజేయుము యేసునామం
612 విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసునిvishvaasa sahitamuganu prakatinchudi yesuni
పల్లవి:
విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని (2)

1. నిత్యజీవము చేపట్టి - సత్యవేదము చేబూని (2)
   పవిత్ర హృదయములతో - పోరాడుడి విజయముతో (2)

2. నీతిని భక్తిని గోరి - నిజమైన విశ్వాసులుగా
   ఓర్పును ప్రేమనుగల్గి - పోరాడుడి విజయముతో

3. ఆకాశమున నుండి - కలిగిన దర్శనమునకు
   అవిధేయత చూపకను - పోరాడుడి విజయముతో

4. క్రీస్తేసు మనన్సు కలిగి - సత్క్రియలను జరిగించి
   యోధులుగా నిలుచుండి - పోరాడుడి విజయముతో

5. దీన మనన్సు కలిగి - ప్రియులారా లోబడియు
   మహిమ కిరీటముకై - పోరాడుడి విజయముతో

6. ఆత్మల రక్షణకొరకై - అర్పించుడి జీవితము
   అంతమువరకు నిలిచి - పోరాడుడి విజయముతో

7. యేసుని జీవము కలిగి - ఇలలో శ్రమనోర్చుచు
   విజయోత్సాహముతోడ - హల్లెలూయ పాడెదము
613 జీవించుచున్నాడు యేసుప్రభు నా హృదయములో నున్నాడుjeevinchuchunnaadu yesuprabhu naa hrudayamulo nunnaadu

Galatians 2:20

పల్లవి:
జీవించుచున్నాడు యేసుప్రభు - నా హృదయములో నున్నాడు (1)
కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును (1)

1. మాటచే సాగరము పాయలై పోయె - కోటగోడలు కూలి మట్టలైనవి (1)
   గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభు మాటచే-
   కుష్ఠరోగి శుద్ధుడాయె ప్రభుముట్టగా (1)

2. నన్ను వదలక పట్టుకొనుము - నిన్ను విడువక వెంబడింతును
   మరణించువేళ పరలోకపు - ఇంటికి నడుపు విమోచకుడా
614 నా పాపములను క్షమించెన్naa paapamulanu kshaminchen

Psalm 32:5

పల్లవి:
నా పాపములను క్షమించెన్ - ప్రభు నా నేత్రములను వెలిగించెన్ (1)
ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ - ప్రాణమును నా కొరకొసగెన్  (2)

1. మలిన వస్త్రములతో నేను (1)- చెడిన హృదయముతో నేను (2)
   కలువరి సిలువను చేరన్ (2)

2. మరణమునుండి నా ప్రాణమును - కన్నీటినుండి నా కన్నులను
   తప్పించెను నా తండ్రి

3. నా జీవిత కాలమంతయును - నే నాయనకు మొరపెట్టెదను
   నా ప్రభు నా మొర వినును

4. యెహోవా బహుదయాళుండు - నీతి న్యాయముగల దేవుండు
   సాధువులను గాపాడున్

5. మందిర ఆవరణములో నేను - యెరూషలేమా నీ మధ్యను
   నా ప్రభునే స్తుతియింతున్

6. యెహోవా తన స్వాస్థ్యముగానన్ - బహుగా తన మహిమను జూపించన్
   బహుప్రియమున నన్ బిలచెన్
615 నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగాnaa sankata duhakhamulella teeripoyegaa

Exodus 12:13

పల్లవి:
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా (1)
నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2)

1. విలువైన గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా (2)
   కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2)

2. ఇంకా నేను ఫరోకు దాసుడను కాను
   ఇంకా నేను సీయోను కన్యుడను గాను

3. మార్చబడు నాదుమారా మధురముగా
   పారు జలముబండనుండి త్రాగుచుందును

4. సౌందర్యమయమగు పరమ కానాను
   నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు

5. ఆనందమే పరమానందమే
   కానాను జీవితము నా కానందమే

6. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు
   నా దేవుడిచ్చు క్రొత్తమన్నా నాకు చాలును

7. నా యేసు ప్రభువే నా బలము గానము
   నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా
616 రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపునుrakshana aunnatyamu rakshakude telupunu

Isaiah 58:14

పల్లవి:
రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును (1)
పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది  (2)

1. మలిన వస్త్రమువలెనే - నిండియుంటిమి నిందలతో (2)
   తండ్రిమాదిరిగా మము వెదకివచ్చి వింతగా మమ్మురక్షించెను (2)

2. అరణ్య ప్రదేశములో - పాడైన యెడారిలో
   కనుగొనెను, పరామర్శించెన్ కనుపాపవలె గాచెన్

3. యాకోబువలె నుంటిమి - ఇశ్రాయేలుగా మార్చెను
   తన స్వాస్థ్యముగా, తన భాగముగా తన జనముగానైతిమి

4. పర్వతములను సృజించెన్ - శ్రేష్టమైనవి నిచ్చెన్
   అబ్రహాం మోషే ఏలియా యేసు ఎక్కిరి శిఖరములను

5. పక్షిరాజువలె ప్రభువు - రెక్కలతో మము మోయున్
   అలసట లేక, మము పట్టుకొని ఆకసమున నడుపును

6. యేసుని సత్యములు - పర్వత శిఖరములు
   పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింప జేయును

7. యేషయా ప్రవచనములు - రక్షణ వివరములు
   శిఖర శ్రేణి యనుభవములు శిఖరముపై పొందుము
617 పరమ జీవము నాకునివ్వ తిరిగి లేచెను నాతోనుండparama jeevamu naakunivva tirigi lechenu naatonunda

Romans 5:6

పల్లవి:
యేసు చాలును యేసు చాలును -  యే సమయమైన (1)
యే స్థితికైనా నా జీవితములో -  యేసు చాలును (1)

1. పరమ జీవము నాకునివ్వ తిరిగి లేచెను నాతోనుండ (2)
   నిరంతరము నడిపించును మరల వచ్చి యేసు కొనిపోవును (2)

2. సాతాను శోధనలధికమైన-సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
   లోకము శరీరము లాగిననూ-లోబడక నేను వెళ్ళెదను ||యేసు ||

3. పచ్చిక బయలులో పరుండజేయున్-శాంతి జలముచెంత నడిపించును
   అనిశము ప్రాణము తృప్తిపరచున్-మరణ లోయలో నన్ను కాపాడును||యేసు ||

4. నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను
   హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడిచినను ||యేసు ||
618 నా హృదయము వింతగ మారెనుnaa hrudayamu vintaga maarenu

John 9:25

పల్లవి:
సంతోషమే సమాధానమే  (3) - చెప్పనశక్యమైన సంతోషమే  (2)

1. నా హృదయము వింతగ మారెను (3) - నాలో యేసు వచ్చినందున (2)

2. తెరువబడెను నా మనోనేత్రము - యేసు నన్ను ముట్టినందున ||సంతోషమే||

3. ఈ సంతోషము నీకు కావలెనా - నేడే యేసు నొద్దకు రమ్ము ||సంతోషమే||

4. సత్య సమాధానం నీకు కావలెనా - నేడే యేసు నొద్దకు రమ్ము ||సంతోషమే||

5. నిత్య జీవము నీకు కావలెనా - నేడే యేసు నొద్దకు రమ్ము ||సంతోషమే||

6. మోక్ష భాగ్యము నీకు కావలెనా - నేడే యేసు నొద్దకు రమ్ము ||సంతోషమే||

7. యేసు క్రీస్తును నేడే చెర్చుకో - ప్రవేశించు నీ యుల్లమందు ||సంతోషమే||
619 హాయానంద సుదినము నా యేసున్ నమ్ముదినముhaayaananda sudinamu naa yesun nammudinamu

Psalm 126:3

పల్లవి:
భాగ్యమౌ దినము - ప్రభున్ గైకొన్న దినము
భక్తి ప్రార్థన లేసుడు - ప్రఖ్యాతి నాకు నేర్పిన
భాగ్యమౌ దినము - ప్రభున్ గైకొన్న దినము

1. హాయానంద సుదినము - నా యేసున్ నమ్ముదినము
   ప్రయాసమెల్ల బోయిన - దయారక్షణ్యదినము

2. ప్రభునితో నిరంతరమౌ - నిబంధన జేసికొంటి
   నేబట్టితి నింపొందగ - విభుని పాదపద్మము ||భాగ్య||

3. నాయాత్మ శాంత మొందుము - నీ యేసే నీ యాధారము
   భయంబులేక రక్షణన్ - పాలిభాగంబు పొందుము ||భాగ్య|

4. నే నేసువాడ నేసుడు - నిత్యంబు నా వాడయ్యెను
   నా దెంత గొప్ప భాగ్యము - నే నేసుయొక్క మిత్రుడన్ ||భాగ్య||
620 పదివేలలో ప్రియుని చూచి తెలిసికొంటివా?padivelalo priyuni choochi telisikontivaa?

Isaiah 40:28

1. పదివేలలో ప్రియుని - చూచి తెలిసికొంటివా?
   నీ హృదయము పట్టుకొన్న - వాని కోరుకొనుము

2. విగ్రహము లాకర్షించెన్ - లోక యాశలు నిను
   పాప క్రియలు మెరయుచు - నిన్ను విడనాడవు

3. విగ్రహములకు దృష్టి - లేక లేదు అందము
   మంచి చెడ్డ తెలియదు - అందుచేత వ్యర్థము

4. వాని పగుల గొట్టుటచే - వాని నుండి తొల్గదు
   యేసు అందము కిరణ - మాయన హృదయమే

5. వాని వత్తినార్పువాడు - ఎవరో తెలియునా?
   చలికాలమును వేస - విగ మార్చు ప్రభువే

6. పేతురును మార్చిన చూపు - స్తెఫన్ చూచిన ముఖము
   మరియతో నేడ్చిన హృదయం - మాత్రం ఆకర్షించెన్

7. ఆకర్షించి నిండ చేయున్ - గిన్నెనిండి పొర్లగ
   విగ్రహములు మాకు వద్దు - యేసుతో మేముందుము
621 హా! ఎంత అద్భుతాశ్చర్య దినముhaa! enta adbhutaashcharya dinamu
పల్లవి:
పరము దిగెను మహిమ నిండె నాలో - సిలువ యొద్ద స్వస్థత కలిగెను
నా పాపం కడిగెను రాత్రి పగలై మారెను
పరము దిగెను మహిమ నిండెనాలో

1. హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం
   నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె
   హా! ఎంత జాలి గల మిత్రుడు హృదయ అక్కర తీర్చెను
   మరణచ్చాయలు పోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్

2. పరిశుద్ధ ఆత్మతో జన్మించితి దేవుని గృహమందు
   కల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యము
   తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా
   కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము ||పరము||

3. నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే
   భవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్
   నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం
   నిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి ||పరము||
622 మాకనుగ్రహించిన దైవ వాక్యములచేmaakanugrahinchina daiva vaakyamulache

Ephesians 1:17-19

పల్లవి:
మాకనుగ్రహించిన దైవ వాక్యములచే -
మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా (2)

అను పల్లవి:
రక్షణ నొందిన వారికి దేవుడు (2)- ఒసగిన శక్తిని యెరిగి జీవింతుము (2)

1. రక్షణ కృపలు ప్రభువిచ్చినవే (1)- అతిశయింపలేము అంతయు కృపయే (2)
   అమూల్యమైన సిలువశక్తిచే (2)
   ఖాళీయైన మమ్మును నింపె (1)

2. పాప మృతులమైన మమ్మును లేపెను - ప్రేమతో మమ్ము ప్రభుతోనే లేపెను
   పరలోక పదవి పాపులకిచ్చె
   పునరుత్థాన శక్తిచే కలిగె

3. మరణ పునరుత్థాన మందైక్యతచే - బలాతిశయమున్ పొందెదము
   విశ్వసించు మనలో తన శక్తి యొక్క
   మితిలేని మహాత్మ్యము తెలిసికొనెదము

4. సర్వాధికారము ఆధిపత్యముల కంటె - శక్తి ప్రభుత్వము లన్నిటికంటే
   అన్ని నామములలో హెచ్చింపబడిన
   యుగ యుగములలో మేలైన నామమున

5. తనశక్తిని బయలుపరచుటకు - ఏర్పరచుకొనెను బలహీనులను
   ఎన్నికైన్వారిని వ్యర్థపరచుటకు
   నీచులైనవారిని ఏర్పరచుకొనెన్

6. యుద్ధోపరణముల్ ఆత్మీయమైనవి - మానక ప్రభువు విధేయులమగుటే
   దుర్గములన్నిటిన్ పడగొట్టు నదియే
   ప్రభు యేసు వొసగిన భాగ్యము యిదియే
623 సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించిseeyonuku tirigi cheralo nundi vidipinchi
పల్లవి:
సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి -
యెహోవా రప్పించినప్పుడు ఆ..ఆ.. (2)
మనము కలకన్న వారివలె నుంటిమి  -  నోటి నిండ నవ్వుండెను  ఆ..ఆ.. (2)

1. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని (1)
   అన్యజనులు చెప్పుకొనిరి - సంతోషభరితులమైతిమి ఆ.. ఆ.. (2)

2. దక్షిణ దేశమునందు ప్రవాహములు పారునట్లు
   యెహోవా చెరపట్టబడిన - మా వారిని రప్పించుము

3. కన్నీటితో పిడికెడు - విత్తనములు విత్తువారు
   సంతోషగానముతో పంటను - యుక్తకాలమున కోసెదరు
624 నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది?nee saakshyamu edi? nee bali arpana edi?

Matthew 9:37

పల్లవి:
నీ సాక్ష్యము ఏది? - నీ బలి అర్పణ ఏది? (2)
ప్రభు యేసు నంగీకరించి - నిద్రించెదవేల? (1)
ప్రభు యేసు నంగీకరించి - జాగు చేసెదవేల? (2)
మేల్కో - లెమ్ము (2) - రారమ్ము విశ్వాసి (1)

1. అపొస్తలుల కాలమందు - ఉపద్రవముల ఒత్తిడిలో (2)
   అన్నింటి సహించుచు (2) - ఆత్మలాదాయము చేసిరి (1)

2. రాళ్ళతో కొట్టబడిరి - రంపాలచే కోయబడిరి
   పరమ దర్శనమొంది - సువార్తను చాటించిరి

3. కొరడాతో కొట్టబడిరి - చెరసాలయందుంచబడిరి
   చెరసాల సంకెళ్ళును - వారి నాటంక పరచలేదు

4. సజీవ యాగముగ - ప్రభు సేవను జరిగించిరి
   సువార్త ప్రభలమాయె - సంఘము స్థాపించబడె

5. కోతవిస్తారమెంతో - కోత కోయువారు కొందరే
   యేసునిన్ పిలుచుచుండె - త్రోసివేసెదవా ప్రభు పిలుపున్

6. అర్పించెద నన్ను - ఆత్మ ప్రాణ శరీరముతో
   నా సిలువను ఎత్తుకొని - నిన్నే వెంబడింతును నేను
625 పల్లవరపు కొండలపైనpallavarapu kondalapaina

Psalm 32:8

పల్లవి:
పల్లవరపు కొండలపైన - ప్రభుచూపిన దర్శమలం
అహ  పల్లవరపు కొండలపైన  - పరలోక సంఘదర్శనమిచ్చెన్ (2)

అను పల్లవి:
తొలిప్రేమ కలిగి అందరము - బలియైన క్రీస్తును ప్రకటించి (2)
మారాను పోలిన శ్రమలున్నా - కానాను పురముకు చేరుదము (2)

1. అపొస్తలుల బోధ - సహవాసము ప్రభు బల్ల
   ప్రార్థన జీవితము - సంఘ దర్శనమునకు మూలం (2)
   ఈ ఆత్మీయ లంగరులను కలిగి - కొనసాగెదము తుఫానులలో
   ఈ ఆత్మీయ లంగరులను కలిగి - ఈ పాప సముద్రము దాటెదము

2. విశ్వాసము ప్రేమ - నిరీక్షణ నిలుచునిల
   అపకారము మాని - డంబమును విడచెదము
   సోదర ప్రేమలేనిచో - వ్యర్థులము మన మీ లోకములో
   సోదర ప్రేమలేనిచో మ్రోగెడి తాళము వలె నుండెదము

3. దేవుని చిత్తమును - ఎరిగి జీవించెదము
   ప్రభు చిత్తము కొరకు - చెల్లించెదము క్రయము
   దేవా నీ చిత్తము నెరవేర్చ - మాకెంతో సంతోషము
   దేవా నీ చిత్తము నెరవేర్చ - నీకెంతో సంతోషము

4. దేవుని మందిరమున్ - ప్రేమించెదమెల్లప్పుడు
   దేవుని వాక్యమును - ఆలయములో ధ్యానింతుము
   చిరకాలము దేవుని మందిరములో - నివసించి స్తుతియించెదము
   చిరకాలము దేవుని మందిర తేజో- మహిమలో వసియించెదము

5. ఆత్మతో సత్యముతో - నిజ ఆరాధన కలిగి
   యధార్థ హృదయముతో - మంచి సాక్ష్యమును కలిగి
   పెదవుల పదములు కాదని - మన హృదయములను అర్పించెదము
   పెదవుల పదములు కాదని - హెబ్రోను ప్రభుని కొనియాడెదము

6. చెప్పనశక్యమును - మహిమా యుక్తమునైన
   సంతోషము కలిగి సువార్తను చాటెదము
   ఆకాశము క్రింద ఏ నామమున - రక్షణ లేదని చాటెదము
   ఆకాశము క్రింద యేసు నామమునే - పాపక్షమాపణ కలుగునని

7. పేరున పిలిచితివి - నీ దాసుని సేవకై
   సార్వత్రికమందు - సంఘమునకు ఏర్పరచ
   ఆనంద భాష్పములతో మేము - ఆత్మీయ తండ్రిని స్మరియింతుము
   ఆనంద భాష్పములతో మేము ఆయన బోలి నడిచెదము
626 సువార్తను చాటింప సు సమయంబిది యేనుsuvaartanu chaatimpa su samayambidi yenu

2 Kings 7:9

పల్లవి:
సువార్తను చాటింప - సు సమయంబిది యేను (1)
శ్రీ యేసుని నామంబు (1) - ఎంతో మధురము మనకు (2)

1. సంతసమున సాగెదము (2) - పురికొల్పుచు మనస్సులను (2)
   సంకటములు ఎన్నయిన (2) - చనిపోవుటె మేలనుచు (2)

2. సిలువను మోయుచు భుజమున్ - చేత సువార్తలనూని
   లోకమునకు చాటెదము - ప్రశాంతుడగు యేసున్

3. త్రియేకునికే యిలలో - జయ మార్భటించెదము
   జయశాలులుగా మేము - జగ దేవత నొణికింతుం

4. ప్రవక్తలలో ఘనుడు - పరమున దూతలు పొగడున్
   నేత్రముల కాయనతార - అరుణోదయ నక్షత్రం

5. చిరునగవులతో మేము - చిందింతుము రక్తమును
   0హృదయాలు ప్రకాశించున్ - మనసానందంబిదియే
627 లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి యున్నదిlemmu tejarillumu neeku velugu vachi yunnadi

Isaiah 60:1

పల్లవి:
లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నది (2)

అను పల్లవి:
యెహోవా మహిమ నీపై (2) - ప్రకాశముగా నుదయించె (2)

1. జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు (2)
   రాజులు నీదు ఉదయ (2) - కాంతికి వచ్చెదరు (2)

2. సముద్ర వ్యాపారము - నీ వైపు త్రిప్పబడును
   జనముల ఐశ్వర్యము - నీ యొద్దకు వచ్చును

3. దేవదారు సరళగొంజి - చెట్లు నా ఆలయమునకు
   తేబడును నాదు పాద - స్థలము మహిమ పరచెదను

4. నిన్ను శాశ్వతమైన - శోభాతిశయముగా జేతున్బహుతరములకు సంతోష - కారణముగ జేసెదను

5. వారిలో ఒంటరియైన - వాడు పది వందలగును
   ఎన్నిక లేనివాడు - బలమైనట్టి జనమగును
628 సిలువ వీరులు మీరే చెలువుగ చనుడిsiluva veerulu meere cheluvuga chanudi
పల్లవి:
సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి (2) -  బలుడైన సైతానును జయించను (2)
విలువైన సత్యవార్త ప్రకటించుడి - మహ విలువైన సత్యవార్త ప్రకటించుడి (1)

1. ఇండియా దేశము చీకటి నుండగ - మందునిగ నుండెదవా (2)
   తంతివలె నేగి నరులను వెదకి (2) - తండ్రి శక్తితో రక్షించు నంచు (1)

2. ఇల్లు ఇల్లు త్వరగ వెదకి ఎల్ల - గొఱ్ఱెలను జయింప
   పడెను పాట్లనుశ్రీ యేసనుచు - కూడిన వారల కెరుక పరచ

3. ఆయన త్వరగా వచ్చును భువికి - ఆయెడ కృపకాలము ముగియున్
   కరిగించును మనసుల నన్నిటిని - కరములతో నేసుకడ లాగ

4. హల్లెలూయ గీతము పాడి - ఎల్లరకు ప్రకటించి
   ఆత్మల నెల్ల నాదాయపరచ - అఖిల మెల్లను నాకై పరుగిడి
629 తమ దేవునెరుగువారు చేసెదరుtama devuneruguvaaru chesedaru

Daniel 11:32

పల్లవి:
తమ దేవునెరుగువారు చేసెదరు (1) -  శక్తితో గొప్ప కార్యములు (2)

1. ఇచ్చకపు మాటలవలన (2) - అక్షయుని విడువరు (2)
   తప్పుబోధల నెపుడు తృణీకరించెదరు (2)

2. సత్యమును విడువరు - ఉత్తములుగ నడిచెదరు
   అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు

3. మనుజ భయము జెందరు - మాన్యులై యుండెదరు
   మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు

4. ద్వేషించెదరు విగ్రహముల్ - శిరములు ఖండించినను
   పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు

5. అగ్నిలో వేయబడినను - విఘ్నంబులు కలిగినను
   సింహపు గుహలో వేసినను సిగ్గునొందరు

6. శోధనలను జయించెదరు - బాధలను సహించెదరు
   నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు

7. అదిక జ్ఞానమును పొంది - తగ్గించెకొనెదరు తామే
   యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు
630 సిలువను మోసి ఈలోకమునుsiluvanu mosi eelokamunu

Ephesians 5:15-16

పల్లవి:
సిలువను మోసి ఈలోకమును (1)
తలక్రిందులు చేయు తరుణమిదే (2)

1. లేలెమ్ము సోదరుడానిద్ర నుండి - ప్రకటించను యేసు నామమును (2)
   సోమరి యేల నిద్రించెదవు - ఈ ధరను లేపెడు సమయ మిదే (2)

2. పరిశుద్ధాత్మ కవచము తోడిగి - నీ నడుము కట్టి తయ్యారగుమ
   సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి - సువార్తను చాటెడు సమయమిదే

3. లోకరక్షణకై ప్రభు యేసు - వీకతో నరుదెంచెను ఈ ధరకు
   వెలుగును మనకు నిచ్చెను యేసు
   తన స్తుతులను పాడెడు సమయమిదే

4. పాతాళమునకు కొనిపోయెడి నీ - పాప నిద్రను విడనాడు మిక
   సిలువ మర్మము నెరుగుమిపుడే
   కునికెడు సమయము కాదిది ప్రియుడా

5. రక్షింపబడుట కాశించినచో - పశ్చాత్తాప పడు మీ దినమే
   కలుషాత్ముండా తడవేల నికన్ - కనుమా నీ తేర్పు సమయ మిదే
631 కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్karunan erparachitivi sainyamula yehova nan

Haggai 2:23

పల్లవి:
కరుణన్ - ఏర్పరచితివి సైన్యముల యె...హోవ  నన్ (1)
పరిశుద్ధుడా క్రీస్తులో ఎరిగితివి (2) - కరుణన్ (1)

1. మోషేను కోరుకొని - చేసితివి నాయకుని (2)
   గోషేను నుండి ఎల్లన్ నడుప - ఒసగితివి యవసరతలను (2)

2. యాకోబున్ కోరుకొని - ఏశావును విడిచితివి
   సకలంబౌ కష్టముల నొసగి - ఇశ్రాయేలను పేరును ఇచ్చితివి

3. సొలమోనున్ కోరుకొని - ఇల సకల జ్ఞానమిడె
   ఆలయ నిర్మాణ కృపనిడెను - పాలింప రాజ్యంబొసగెను

4. దానియేలును కోరుకొని - తన పరలోక జ్ఞానమిడె
   ఎన్నెన్నో దర్శనముల నొసగి - కనుపాపగ కాపాడెనిల

5. జెరుబ్బాబెలున్ కోరుకొని - ముద్రయుంగరముగ జేసెన్
   నిర్మించెను ప్రభుని ఆలయమున్ - విరివైన యిరుకుల యందు

6. స్తెఫెనును కోరుకొని - నింపెను తన యాత్మతో (2)
   సంపూర్ణమగు తన సాక్షిగా - పంపెను తన హతహాక్షునిగ

7. పౌలును కోరుకొనెన్ - సౌలుగ నున్నయపుడే
   పలుసంఘముల నిల స్థాపించెన్ - ఎల్ల మేలులకు హల్లెలూయ ప్రభో
632 లోకమునకు నన్ను దేవా నా దేవాlokamunaku nannu devaa naa devaa

Matthew 5:13

పల్లవి:
లోకమునకు నన్ను (2) - దేవా నా దేవా  - ఉప్పుగా జేసితివి (1)
అద్భుత దేవా నా దేవా - ఉప్పుగా జేసితివి (1)

1. నరరూపధారి - పరలోక ఉప్పయి (2)
   ఘోరపాపినైన నన్ను - శుద్ధీకరించితివి (2)
   అద్భుత దేవా నా దేవా - శుద్ధీకరించితివి (1)

2. యెరికో నీళ్ళ - వలె నా జీవం
   మరణచేదైయుండ నీవు - రుచిగా మార్చితివి
   అద్భుత దేవా నా దేవా - రుచిగా మార్చితివి

3. నా రోతహృదయం - నూతన పరచి
   పరమ ఉప్పుతోడ నీవు - నింపిన దేవుండవు
   అద్భుత దేవా నా దేవా - నింపిన దేవుండవు

4. పరులకు యిలలో - ప్రభు క్రీస్తు రుచిన్
   నిరతమునే జూపునట్లు - క్రుమ్మరించుము నన్ను
   అద్భుత దేవా నా దేవా - క్రుమ్మరించుము నన్ను

5. నీ నిత్యజీవం - నీ సంతోషం
   నిత్య సమధానమిచ్చి - భద్రపరచితివి
   అద్భుత దేవా నా దేవా - భద్రపరచితివి

6. దీనుడనై నే - బహుదుఃఖపడిన
   ఎన్నడైన విడువక శ్రేష్ట - ఉప్పుగా మర్చుచున్న
   అద్భుత దేవా నా దేవా - ఉప్పుగా మర్చుచున్న

7. జనులు నన్ను హింసించినపుడు
   ఎన్ని చెడ్డమాటలన్న - హల్లెలూయ పాడెదన్
   అద్భుత దేవా నా దేవా - హల్లెలూయ పాడెదన్
633 లేలెమ్ము సోదరీ సోదరుడాlelemmu sodaree sodarudaa

Ephesians 5:14

"నిద్రించుచున్న నీవు మేల్కొని లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించును." ఎఫెసీయులకు Ephesians 5:14

పల్లవి : లేలెమ్ము సోదరీ సోదరుడా - రక్షకుడేసుని సేవింప

1. సత్యముతో ఆత్మతో దేవుని - సన్నిధి జేరి ఆరాధింప
ఆశ్చర్యకరుడు ఆలోచన - కర్త బలవంతుడు ప్రభుయేసు
|| లేలెమ్ము ||

2. రాజాధిరాజు మన ప్రభుయేసు - రాజ్యము నీయ మనకై వచ్చున్
రాజైన యేసు విజయము కల్గి - విజయుండు యేసుని చాటెదము
|| లేలెమ్ము ||

3. షద్రకు మేషాక బెద్నాగో - పౌరుషముతోడ ప్రభుశ్రమ నోర్చె
కరువైనను మీకు శ్రమలైన - కరుణించుచు ప్రభు మీతో నడుచున్
|| లేలెమ్ము ||

4. స్తెఫెనాది అపొస్తలులంత - అపవిత్రమైన ప్రజలమధ్య
కృపాళుదైన యేసుని చాటె - కృపనొందుచు ప్రభుని చాటండి
|| లేలెమ్ము ||

5. అర్పించుడి మీదు హృదయములన్ - నెరవేర్చను దేవుని చిత్తమును
కర్తను సేవింపగను లెండి - వీరులుగా దావీదు వలెను
|| లేలెమ్ము ||

6. యౌవనేచ్ఛలను విసర్జించి - యౌవన రక్తముతో మిము గొన్న
పావనుడగు యేసు ప్రభువునకై - చావను వెనుదీయక రారండి
|| లేలెమ్ము ||

7. జీవించువాడనే కానంచు - జీవించుట ప్రభు కొరకే యంచు
గావించుము ప్రభు పనులిలలోన - జీవించు ప్రభు కొరకే యిలలో
|| లేలెమ్ము ||
634 జై జై జై జై యేసు ప్రభుjai jai jai jai yesu prabhu

Acts 1:8

పల్లవి:
జై జై జై జై యేసు ప్రభు - మాకై రానున్న ప్రభువా (2)

1. పరిశుద్ధాత్మ శక్తిని పొంది (2)- భూదిగంతముల వరకు (2)
   సాక్షులుగా నుందు రనిన (2)

2. అంద్రెయ సీమోనును చూచి - మెస్సీయాను కనుగొంటిమని
   తెచ్చెనతని యేసు కడకు

3. పిలిప్పు సమరయ పట్టణములో - ప్రభువార్తను ప్రకటింపగా
   ఎంతో సంతోషము కలిగెన్

4. మనము ప్రభుని సంబంధులము - లోబడె లోకము దుష్టునికి
   లోకము ప్రభుని ఎరుగవలెన్

5. దేవుని ప్రేమ మన హృదయమున - కుమ్మరింపబడినందున
   ధైర్యముతో చాటించెదము

6. ప్రభుని వాక్యము మన హృదయములో - వసియించుచున్నందున
   వాక్యమును ప్రకటించెదము

7. నన్ను రక్షించిన ప్రభు యేసుని - నమ్మి సమస్తము చేసెదను
   యేసున కెప్పుడు హల్లెలూయ
635 లేలెమ్ము సోదరీ సోదరుడాlelemmu sodaree sodarudaa

Ephesians 5:14

పల్లవి:
లేలెమ్ము సోదరీ సోదరుడా - వేళాయె యేసుని సేవింపను (2)

1. నిదుర మేల్కొనెడి - వేళాయెను - నిద్రించిన శత్రు - విజృంభించున్ (2)
   భద్రము మేల్కొని సేవింపుము (1)

2. కీడు లెన్నో చేసి - చెడిపోతిమి - పాడెను ముట్టిన - యేసు ప్రభు
   నీడవలె అంటి - వెంటాడెను

3. దేవునికే యిల - లోబడుచు - కావించుము - పనులు యేసునకై
   సేవించుము ప్రభుని చిత్తముతో

4. ఏల ముఖము - లింక నేల మోపి - కాల యాపన చే - తురెందుకయ్యో
   కాల విలువ నెరిగి సాగిరండి

5. సాగిపోవు డంచు - సెల విచ్చెను - ఆగిపోవుట యేల - సోదరుడా
   సాగరము చూడు - పాయలాయె

6. నేనే భయ - పడకుడనెను - తన వాగ్దానములన్ని నెరవేర్చెను
   కను పాపవలె మనల కాపాడెను

7. పరిశుధ్ధ పిల్పులో - పాల్పొందిన - పరిశుధ్ధ సోదరి సోదరుడా!
   పరిశుద్ధు డేసుపై - లక్ష్యముంచి

8. హల్లెలూయ పల్లవిని పాడుచు - యెల్లజనుల కిలలో చాటెదము
   వల్లభుండు యేసు వచ్చుచుండె
636 ప్రియుడా ప్రభు యేసునకుpriyudaa prabhu yesunaku

John 15:16

పల్లవి:
ప్రియుడా ప్రభు యేసునకు - నీ వీనుల నిమ్ము (1)
ప్రియుడా ప్రభు యేసునకు - విశాల స్థలమిమ్ము (1)
ప్రియుడా ప్రభు యేసునకు - విస్తార ఫలమిమ్ము (1)

1. సర్వాధికారియైన యేసు - సర్వశక్తి గలవాడు (2)
   సర్వజనులలోన - శిష్యుల జేయుమనెన్ (2)

2. జనముల నీదు స్వాస్థ్యముగ - భూమి దిగంతముల వరకు
   నన్నడుగుడి మీదు సొత్తు - గా నిచ్చెదననెన్

3. పర్వతముల నీవు యెక్కి - మ్రానులను కొట్టి తెచ్చి
   మందిరము కట్టిన - మది నుల్లసింతుననెన్

4. కోత సమయమింక కొంత - కాలమున్నదనేదంత
   తెల్లబారిన పొలముల్ - కన్నుల గాంచుమనెన్

5. ప్రతివాడు తన స్వంత పనులే - చింత గలిగి చేసెదరిలలో
   ప్రభు యేసు పనులన్ నీవు - పాటింప కుండెదవా

6. నీ దేహమును నీది కాదు - విలువపెట్టి కొన్నాడేసు
   నీ దేహమాయన కిమ్ము - సజీవ యాగముగ

7. ప్రతివాని పనుల పరికించి - ఫలము నియ్య ప్రభుడిలకొచ్చున్
   ప్రతిచోట నీవు ఫలముల్ - ఫలించుచుండు మిలన్
637 ఆలకింతును ఆ పిలుపునుaalakintunu aa pilupunu

Isaiah 6:8

పల్లవి:
సేవించెదను (3) - దేవున
సేవించెదను (3) దేవుని

1. ఆలకింతును ఆ పిలుపును (3) - సేవించెదను దేవుని

2. కొండలందున లోయలందున - సేవించెదను దేవుని || సేవి ||

3. అడవైనను మెట్టలైనను - సేవించెదను దేవుని || సేవి ||

4. కష్టమైనను సుఖమైనను - సేవించెదను దేవుని || సేవి ||

5. ఎండలైనను వర్షమైనను - సేవించెదను దేవుని || సేవి ||
638 మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవుmelkommu o kaavali yesuni yodhudavu

Isaiah 21:11

పల్లవి:
మేల్కొనుము ఓ కావలి యేసుని యోధుడవు (1)
పోరాడవలె నీవే (2) - ప్రభు శక్తితో పోవలెన్ (1)
మేల్కొనుము ఓ కావలి  (1)

1. శత్రువు లెందరో నీ చుట్టు చేరియున్నారు (2)
   తప్పించుకొందువెట్లు? (2) - ప్రభువాజ్ఞను పాలించు (1)

2. ఆయుధములు తీసికో పొందుము ప్రభు శక్తిని
   స్థిరుడవై నిలువవలె - శత్రువులందరి యెదుట

3. సిద్ధపడు మిప్పుడే ఆయుధము పట్టుకో
   ఆత్మీయ యుద్ధం నీది - భయపడ కెవ్వరికిన్

4. సత్యము నీ నడికట్టు తొలగు అబద్ధమునుండి
   తొడుగుకో మైమరువును - ఆత్మ రక్షణ పొందను

5. పాదరక్షలు ధరించు అందించు సువార్తను
   విశ్వాసమను డాలుతో - దుష్టుని అగ్నినార్పు

6. శిరస్త్రాణము ధరించు కనుపరచు నీ రక్షణ
   ఆత్మఖడ్గము తీసికో - వాక్యమే ఆ ఖడ్గము

7. ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్ఠాయుధమదియే
   గురి యెన్నడు తప్పవు - మెలకువగా నుండిన
639 చీకటి కాలము వచ్చుచుండెcheekati kaalamu vachuchunde

John 9:4

పల్లవి:
తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? (2)
కాలమపాయముగా - నుండె - సమయము సద్వినియోగించు (2)

1. చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు (2)
   తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? (2)

2. బీడుభూము లధికముగా - చూచిన నీవు సాగిరా
   యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు || తలుపులు ||

3. ఎన్నో రాజ్యము లీనాడు - దేవుని పనికి మూయబడె
   తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు || తలుపులు ||

4. విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యతగలదు
   అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను || తలుపులు ||

5. రానై యున్న భాధ్యతలు - మన కధికము ప్రియులారా
   మనకు జయము కలుగుటకై - వినమున పోరాడెదము || తలుపులు ||

6. మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా
   హిందూ దేశపు వీధులలో - నాథా నిన్నే చాటెదము || తలుపులు ||
640 నీ ప్రియ ప్రభుని సేవకైnee priya prabhuni sevakai

Romans 12:1

పల్లవి:
నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే (1)
పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే (2)

1. అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే (2)
   ఆ వెలుగు ద్వారానే - నూతనమార్గము కలిగే (2)
   సజీవ బలిగా నర్పించు - నీ జీవితమాయనకే (2)

2. తప్పిపోతివి గతమందు - తప్పుదారిని నడిచితివి
   తన ప్రేమాహస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను
   యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్

3. ఓ ప్రియుడా తలచితివా - నీ జన్మమే పాపమని
   ప్రభువే తన రక్తముతో - నీ పాపము క్షమియించె
   నీ యుల్లము ఆయన కాలయమే - జ్ఞాపకముంచుకొనుము

4. యెవరతని సేవించెదరో - ఫలమొందెదరంతమందు
   ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీ కిచ్చె
   కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని
641 యేసు క్రీస్తుని మంచి శిష్యులముగాyesu kreestuni manchi shishyulamugaa
పల్లవి:
మన యేసు ప్రభువు శీఘ్రముగ వచ్చును -  అతివేగముగా సేవ చేతుము (1)
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము (1)

1. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము (2)
   మనమందరము ఆయన సేవను - ఏకమై సదా జేసెదం (2)

2. అందరి యెడల ప్రేమ జూపెదం - యేసు చెంతకు పిలిచెదము
   అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో - రాజ మార్గమును చూపెదము || మన||

3. సాతాను దుర్గమును పదగొట్టి - ఇక యేసు కొరకే జీవింతుము
   ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ - ఎల్ల వేళలందు చాటెదము || మన||

4. ప్రాణాత్మ దేహములు ప్రభుసేవకే - ఇక జీవించుట తన కొరకే
   అని నిశ్చయించుచు అందు నిలిచియుండి - ప్రభుదినమందు హర్షింతుము || మన||
642 మందలో చేరని గొఱ్ఱెలెన్నోmandalo cherani gorrelenno

John 10:16

పల్లవి:
మందలో చేరని గొఱ్ఱెలెన్నో - కోట్లకొలదిగా కలవు యిల (1)
ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ సంఘమా (1)
మందలో చేరని గొఱ్ఱెలెన్నో (1)
రమ్మనే యేసు - ప్రార్థించుము నడిపించును (2)

1. అడవులలో పలుస్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్ (2)
   వారి నిమిత్తమే శ్రమపడితిన్ - మరి వారిని వెదకెడి వారెవరు? (2)

2. ప్రకటించని స్థలములు కలవు - నన్ను చాటించువారు కలరిచట
   పిలువబడిన వారందరును - మన ప్రభువాజ్ఞకు లోబడి రండి

3. నాకై పలికెడు నాలుకలు - నావలె నడిచెడి పాదములు
   నను ప్రేమించెడి హృదయములు - కావలె నాకవి నీవిచ్చెదవా?
643 జాగ్రత్త జాగ్రత్త - యేసుడిట్లు పిల్చున్jaagratta jaagratta - yesuditlu pilchun

Matthew 21:28

పల్లవి:
పని చేయి , పని చేయి - కోరుచు కాచుచు మా యేసు వచ్చు మట్టుకు

1. జాగ్రత్త జాగ్రత్త - యేసుడిట్లు పిల్చున్ - నేడు పో పని చేయి - నాదు వనములో
   ఆయనే ముందు వెళ్ళి మా త్రోవ చూపున్ - కాగా జాగ్రత్తతో - పని చేయుదము

2. జాగ్రత్త జాగ్రత్త నీతి - నాశించెడు
   వారి నందరిని - తృప్తి పర్చెదము
   యేసు సిలువ నె - త్తి మా ధ్వజముగ
   రక్షణ యుచితం - బని చాటింతుము

3. జాగ్రత్త జాగ్రత్త - వచ్చి పోరాడుడి
   దుష్ట సాతాను రా - జ్యంబు పాడగును
   యేసు నామ ప్రఖ్యా - తిని శ్లాఘించుడి
   ఆయన రక్షణ - యుచితంబగును

4. జాగ్రత్త జాగ్రత్త - యేసు శక్తి నిచ్చున్
   గెల్చువారికి జీ - వ కిరీటంబగున్
   మోక్షానందములో నివసించువారై
   రక్షణ యుచితం - బని పాడెదము
644 రేపు మాపు గూడ రమ్యమైన గింజల్repu maapu gooda ramyamaina ginjal

Psalm 126:5

పల్లవి:
పంట పండగన్ గోసి కొందము - కంట నీరు పోవగోసి కొందము

1. రేపు మాపు గూడ రమ్యమైన గింజల్ - ప్రీతితోను జల్లివేసి యుందుము
   కాపుతోడ నుండి దాపునుండు పంట - నేపు మీరబంటగోసి కొందము

2. సందియంబు లేల స్వామి సేవ యందు - నందనంబు తోడ విత్తుచుందుము
   కొందలంబులేక కష్టవృత్తిచేసి -దరము చేరి యానందింతుము || పంట ||

3. ప్రేమ విత్తనంబుల క్షేమ యంకురంబుల్ - ప్రీతిన్ గాలమెల్ల ప్రాంతమంతటన్
   నేను మొప్ప నాటి నాయకుండు -నిండు పంట గోసి గూర్చుకొందము || పంట ||
645 ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకాodducheri nee yeduta nilchunapdu rakshakaa

Luke 14:23

పల్లవి:
ఒక్క యాత్మనైన నేను - రక్షించక యేసువా
వట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా?

1. ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా
   ఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునా?

2. ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్
   వ్వర్థపర్చు వారన్నాట - చింతతోడ నిల్తురు || ఒక్క ||

3. యేసువా నా స్వరక్షణ - నిశ్చయంబు ఐనదే
   అయిన ఫలితంబు చూడ - కష్టపడక పోతినే || ఒక్క ||

4. కాలమెల్ల గడ్చిపోయెన్ - మోసపోతి నేనయ్యో
   గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను వచ్చునా? || ఒక్క ||

5. భక్తులార ధైర్యముతో - లేచి ప్రకాశించుడీ
   ఆత్మలెల్ల యేసునొద్ద - చేరునట్లు చేయుడీ || ఒక్క ||
646 ఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకుerparachina paatranu raajaadhi raajuku
పల్లవి:
ప్రతిష్ఠ పాత్రలు - ఖాళీ చిన్నవి
అవి మోయు - ఐశ్వర్యము - యేసు ప్రభువే

1. ఏర్పరచిన - పాత్రను - రాజాధిరాజుకు
   వేరు పరచెను - యేసుకు - లోకము నుండి

2. ఏర్పరచెను - మోయను - యేసు - సు నామము
   ఆయనతో - సహించను - సిలువ శ్రమలను || ప్రతిష్ఠ ||

3. ఏర్పరచెను - భరించను - చెడిన - లోకమును
   పోరాటముతో - నిలువను - జయించె - వరకు || ప్రతిష్ఠ ||

4. ఏర్పరచె - మట్టి పాత్రను - ఖాళీ చిన్నవానిని
   నేను మోయు ఐశ్వర్యము - క్రీస్తు ప్రభువే || ప్రతిష్ఠ ||
647 పర్వతమా నీ వేపాటిparvatamaa nee vepaati

Zechariah 4:6-7

పల్లవి:
పర్వతమా నీవేపాటి (1) -  జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదువు (2)

అను పల్లవి:
జనులందరూ కృప కలుగుననగా -
తానుంచున్ - పై - రాతిన్ (2) - పర్వతమా నీవేపాటి (1)

1. శక్తితో కాదిది బలముతో కాదు -
   నాదు ఆత్మచే జరుగును యిదియనే (2)
   సైన్యములధిపతి యెహోవా వాక్కిది - మారదెన్నటికిన (2)

2. కాన ఆలయమును నిర్మింపను -
   పూనుకొందము రమ్మని పలుక
   మేలైన ఈ కార్యమును చేయను - బలమును పొందితిమి

3. ఆకాశమందున నివాసియగు ప్రభు -
   మా యత్నములను సఫలము చేయునని
   ఆయన దాసులమగు మేమెల్లరము - మొదలిడి ముగించితిమి

4. మందిరమును నాదు మహిమతో నింపుదున్ -
   మించును అదియెంతో మునుపటి దానిన్
   మెండుగ నాదు నిండు నెమ్మది - నుండ నను గ్రహింతున్

5. సజీవ రాళ్లుగ ఆత్మ మందిరమున -
   నిపుణతతో మము నిర్మించుటకు
   పిలిచితివి నీదు యాజకులుగను - హల్లెలూయ పాడెదము
648 ఓ ప్రభువా నీ సేవన్ చేసెద నిత్యముo prabhuvaa nee sevan cheseda nityamu

Psalm 25:4

పల్లవి:
ఓ ప్రభువా నీ సేవన్ - చేసెద నిత్యము - (2)
నీ మాటే వినెద - నరుని మాట వినకుందు - (2)

1. శోధించు స్వరములు - వినబడుచునున్నవి
   వేధించు నేరములు - పైబడుచునున్నవి
   బోధించు నీ మార్గం - వినిపించు నీ స్వరము

2. బలమైన శత్రువు - బాధించుచున్నాడు
   విలువైన నీ రక్తం - ప్రోక్షించు నాపైన
   నీ హస్త బలముతో - జయమును నాకిమ్ము

3. లోకాశలు నన్ను - కదిలించుచున్నవి
   నిరాశ సమయములు - బెదిరించుచున్నవి
   ఆకాశము నుండి - ఆదరించుము నన్ను

4. బేతేలు దర్శనము - స్పష్టముగా చూపించు
   పెనుయేలు పోరాటం - దినదినము నేర్పించు
   నా కాలమంతయు - నను నడుపు నా ప్రభువా

5. మెల్లని నీ స్వరము - మధురముగా వినిపించు
   తిన్నని నీ త్రోవన్ - కొరకు చూపించు
   నీ వెలుగులో నన్ను - నిత్యము నడిపించు

6. పరిశోధించుము నన్ను - పరిశుద్ధ వాక్యముతో
   పరిశుద్ధాత్మ చేనన్ - ప్రభునింపు నీ కొరకే
   పరిశుద్ధ సంఘములో - అంగముగా ధౄఢపరచు

7. క్రీస్తే నా జ్ఞానము - క్రీస్తే నా నీతియును
   క్రీస్తే నా విజయము - క్రీస్తే నా ఆశ్రయము
   క్రీస్తే నా రారాజు - క్రీస్తే నా సర్వము
649 యెహోవా సైన్యములారాyehovaa sainyamulaaraa
పల్లవి:
యెహోవా సైన్యములారా
ఆయన చిత్తమున్ నెరవేర్చు పరిచారకులారా
ఆయనను స్తుతించుడి మీరందరు స్తుతియించుడి

1. యెహోవా కృప నిధియని - మహోన్నతుండగు ప్రభువని
   యుగములనేలు మహరాజని - మహిమా స్వరూపిని పొగడి పాడుడి

2. కెరూబు సెరాపులన్నియు - పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువనుచు
   పరలోకమంతా ప్రతిధ్వనింప - పరిశుద్ధ ప్రియులారా ప్రణుతించి పాడుడి

3. మధుర గీతముతో ఆరాధించు - ప్రధానుడైనట్టి సుందర దూత
   మదియందు గర్వించి త్రోయబడగా - అధములు మనల అచ్చోట నుంచెను

4. తనదయా సంకల్పమును బట్టి - మనయందు తనదు క్రియను జేయ
   తన క్రీస్తునందు నిర్ణయించి - ముందుగా మనల ఏర్పరచుకొనెను

5. రక్షణ స్వాస్థ్యమొందునట్టి - అక్షయుల సేవింప ఆజ్ఞాపించె
   లక్షల దూతల సమూహములన్ - వీక్షించి గాయుచు వీరుల జేయును

6. క్షమియించు మనదు దోషములన్ - కుదుర్చు మనదు రోగంబులన్
   సమాధి నుండి విమోచించి - కరుణా కిరీట ధారులు జేయును

7. ఘనత, మహిమ, ప్రభావమును - నిరతము చెల్లును దేవునికి
   గొట్టెపిల్లకు స్తోత్రమనుచు - పరమందు తన దాసులు కీర్తించి పాడుదురు
650 ఈ భువిపై పరలోక వింతైన జనమాee bhuvipai paraloka vintaina janamaa
పల్లవి:
ఈ భువిపై పరలోక వింతైన జనమా ప్రభుయేసు క్రీస్తువులో  తన పరిశుద్దులకు
జయమిచ్చు దేవునికి స్తోత్రములు

1. ప్రభులో మీ ప్రయాసం వ్యర్ధం కాదు - ప్రభు పనిలో
   యెరిగి ఎదుగుచును స్ధిరులై ఆసక్తితో సాగుడి

2. నూతన సృష్టినాశించు మీరు -శుద్ధ ప్రవర్తనన్ ప్రభు దృష్టికి
   అగుపడజాగ్రత్తగా నడువుమా

3. క్రీస్తుప్రభుని ప్రత్యక్షమందు - నిరపరాధులుగా నిలబడును మీరు
   శాంతితో నడుపునంతమువరకు

4. దోషిని నీవు గత దుష్ప్రక్రియలతో - నిర్దోషిగా ప్రభుసన్నిధి నిలువబెట్ట
   ప్రాణమిచ్చి సమాధాన పరచె

5. క్రీస్తేసు బండపై కట్టబడియ- సువార్త సత్య నిరీక్షణలు
   విడువక విశ్వాసముతో నిలువుడి

6. సత్కార్యములన్నిటను సఫలులగుచు - సంతోషింప ప్రభుస్వరములో
   తండ్రితో నడువు తగినట్లుగా

7. దైవాత్మ సుతులు దేవుని వారసులు - నిలువ శ్రమలలో క్రీస్తు వారసులు
   మహిమపొందగా యేసుతో మహిమలో
651 యెహోవా నీ కృపాతిశయమునుyehovaa nee krupaatishayamunu

Psalm 36:8

పల్లవి:
యెహోవా నీ కృపాతిశయమును (1) - నిత్యము కీర్తింతున్ (2)

1. తరతరములకు నీ విశ్వాస్యత (1)- తెలియపరచెదను (2)
   కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి - పాపము క్షమియించె (2)

2. ప్రతిశోధనపై నీవు నాకు - విజయము నిచ్చెదవు
   నన్ను విడిపించుటకు నీవు - నమ్మ దగిన వాడవు - నమ్మ దగిన వాడవు

3. నీదు వాత్సల్యము నాపై - నూతనముగా నుండున్
   నీదు విశ్వాస్యత గొప్పదై - మారనిదై యుండున్ - మారనిదై యుండున్

4. నీదు రాకడ వరకు నన్ను - నిందా రహితునిగా
   నమ్మకమైయున్న నా ప్రభువా - నన్ను కాచెదవు - నన్ను కాచెదవు

5. మంచి పోరాటము పోరాడి - జయమును పొందెదను
   మహిమ మకుటము నిచ్చెడు ప్రభువునకు -
   హల్లెలూయ పాడెదను - హల్లెలూయ పాడెదను
652 ఆనందించెదము ప్రభు యేసులోaanandinchedamu prabhu yesulo
పల్లవి:
నష్టము నంతటిని మరల - మా యేసునిలో ఆర్జించితిమి (1)
ఎల్లప్పుడు జీవితమతయు హల్లెలూయ పాడెదము (1)

1. ఆనందించెదము - ప్రభు యేసులో - అంతయు మరలార్జించు కొంటిమి (1)
   ఆదాము నుండి పోయిన దెల్లయు - అనుభవించు చున్నామిప్పుడు (1)

2. దావీదువలె అంత నష్టపడితిమి - దుఃఖపడి బహుగా ఏడ్చితిమి
   దావీదువలె ప్రభుని వెదకగ - తిరిగి ఆర్జించుకొంటిమి || న ||

3. పూర్వము నైక్యము లేకపోయెను - పేదలమై యుంటిమి అపుడు
   మనలను ఖాళీ చేసికొనగా - మరల నొందితిమి పూర్ణత || న ||

4. మొదటి ప్రమను కోల్పోతిమిల - వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి
   పొందితిమి యేసు ప్రభువులో - నిండుగను దైవ ప్రేమను || న ||

5. దేవుని కల్గియుండకుంటిమి - దైవసమాధాన మొందకుంటిమి
   పాపములలో మరణించియుంటిమి - పరమజీవ మొందితిమి || న ||

6. నిరీక్షణయేమి లేక యుంటిమి - నరకమున కర్హులమై యుంటిమి
   ఘనుడగు యేసు నంగీకరింపగా - నన్నును విమోచించెను || న ||

7. పాపము వలనెంతో నష్టపోతిమి - ప్రభులో సకలము సంపాదించితిమి
   శాపమునందు చుట్టబడితిమి - సర్వమొందెదము మరల || న ||
653 జయము జయమని చాటించెదముjayamu jayamani chaatinchedamu

Revelation 17:14

పల్లవి:
జయము జయమని చాటించెదము (1)
ప్రభు యేసునకు జయం, పాడెదము జయము, జయము (1)

1. నీదు ప్రేమ శ్రేష్టత చేత నాదుమనసును నింపుమా (2)
   సాధుగ స్తుతిభాసిల్ల - జై (2) - జయము (1)

2. సిలువలో రక్తము చిందించితివి కలుషాత్ముని రక్షించితివి
   ఎల్లప్పుడు కాపాడెదవు - జై - జయము

3. నాదు సేవ నంగీకరింపుమా నీదు ఆలయమున నేడు
   ఇండియా దేశము ప్రజ్వరిల్ల - జై - జయము

4. హల్లెలూయ పాట శక్తియనుచు ఎల్లరకు చాటింపుము
   వల్లభుడేసుడు వచ్చునని - జై - జయము
654 మహిమతో నిండిన మా రాజాmahimato nindina maa raajaa

Leviticus 26:12

1. మహిమతో నిండిన మా రాజా - మహిమతో తిరిగి వచ్చువాడా (1)
   శరీరమును దాని క్రియలెల్లను - ఆశతో వాక్యముచే - తొలగించుము (1)
   తొలగించుము వచ్చి తొలగించుము - ఆశతో వాక్యముచే - తొలగించుము (1)

2. ఆకస ఆసనమును వీడి - లోకమునుజూడ వచ్చితివి
   ఇంపుగ వాసము చేయుటకు - సొంపుగ లోన - ప్రవేశింపుము
   ప్రవేశింపుము ప్రవేశింపుము - సొంపుగ లోన - ప్రవేశింపుము

3. గుడారమున వసియించితివి - తోడ నిలచితివి మేఘమువలె
   కొఱతలేక జనుల నడిపితివి - వాక్య ప్రకారము - కోరి రమ్ము
   కోరి రమ్ము నేడు కోరి రమ్ము - వాక్య ప్రకారము - కోరి రమ్ము

4. ఇశ్రాయేలీయులతో నేగితివి - ఎజ్రాతోడనే యుంటివి
   సొలొమోను గుడిలో వసియించితివి - కాలమెల్ల మాతో - నుండుము
   నుండుము మాతో నుండుము - కాలమెల్ల మాతో - నుండుము

5. గిరిపైన చూపిన మాదిరిని - మరువక సొంపుగ చేసితివి
   అక్కరగా మనము లోబడిన - చక్కగా మనలను పాలించును
   పాలించును యేసు పాలించును - చక్కగా మనలను పాలించును

6. భూమ్యాకాశములు పట్టని - వ్యోమపీఠుడు భువికి వచ్చెన్
   నీతితో రాజ్యము నేలుటకు - జ్యోతితోడ లోన - వచ్చునేసు
   వచ్చునేసు నేడు వచ్చునేసు - జ్యోతితోడ లోన వచ్చునేసు

7. హల్లెలూయ పాట చాటింపన్ - ఆశతో నిన్నాహ్వానింపన్
   ఫలము లనేకము లర్పించన్ - ఎల్లరిలోన - ప్రవేశించుము
   ప్రవేశించుము ప్రవేశించుము - ఎల్లరిలోన - ప్రవేశించుము
655 ప్రభు యేసునకే జయము సిలువశక్తిచే జయము జై జై జై జైprabhu yesunake jayamu siluvashaktiche jayamu jai jai jai jai

John 16:33

పల్లవి:
ప్రభు యేసునకే జయము (2)- సిలువశక్తిచే జయము - జై జై జై జై (2)

1. యేసుని రక్తము జయమునిచ్చున్ - సైతాను సేనలపై జయము (2)

2. సిలువే మనకు జయమిచ్చున్ - పాత స్వభావముపై జయము

3. పునరుత్థానుడు జయమిచ్చున్ - పాపమరణములపై జయము

4. ఇహలోకముపై జయమిచ్చున్ - తన జీవముతో జయమిచ్చున్

5. ఆత్మద్వారా జయమొసగున్ - శరీర యిచ్ఛలపై జయము

6. తనప్రేమ మన కొసగు జయం - దుఃఖ సంకటములపై జయము

7. రాజుల రాజు జయమిచ్చున్ - సర్వ శత్రులపై జయమిచ్చున్
656 మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమాmelkonumaa, melkonumaa naa praanamaa

Psalm 17:15

పల్లవి:
మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమా -
యోచించుమా, మాటవినుమా పొందెదవు సర్వమున్ (2)

1. యేసు పాదముల యొద్దకురా యేసు కర్పించు నీజీవితము (2)
   నీ విపుడే (2) యెరుగు దీనిన్ - జ్ఞానము పొందెదవు (2)

2. జీవాహారము భుజించుమిపుదే జీవితమందు శక్తిని పొందు
   నీ విపుడే యెరుగు దీనిన్ - జయమును పొందెదవు

3. సర్వమున్ ప్రభువుతో నారంభించి - సర్వమున్ ముగించు మాయనతో
   నీ విపుడే యెరుగు దీనిన్ - ప్రభువే గొప్పవాడని

4. ఎవ రు ప్రభుసేవ చేసేదరో - ఎవ్వరాయనతో నడిచెదరో
   నీ విపుడే యెరుగు దీనిన్ - పొందెదరు జీతమున్

5. తుఫాను మధ్య నీవుండినను - ధైర్యముగ నీవు నడువవలెన్
   నీ విపుడే - యెరుగు దీనిన్ విశ్రాంతి పొందెదవు

6. నిద్రించి పొందకపోయి రేమియున్ - కలిగినదాని పోగొట్టుకొనిరి
   నీ విపుడే - యెరుగు దీనిన్ లేచి పొందు ఘనత

7. అంతము వరకు స్థిరముగ నుండిన - పొందెదవు ప్రభువిచ్చు ఘనత
   నీ విపుడే - పొందెదవు జీవకిరీటమును
657 ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభుunnata sthalamulapai nekkinchi choopinchu prabhu

Deuteronomy 32:13

పల్లవి:
ఉన్నత స్థలములపై - నెక్కించి చూపించు ప్రభు (2)
ఎన్నతగిన మహారక్షణ శిఖరము - సుందర మొందు సదా (2)

1. మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయె (2)
   మరణపు ముల్లును విరచి జయంబును (1)
   యేసు అనుగ్రహించెన్ ఆ ...2

2. ఎవరు మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో
   దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలిచి - సంతస మొందెదరు ఆ ...

3. ఆశ్చర్యకరుడాయనే - ఆలోచన కర్తయును
   నిశ్చయముగా బహు బుద్ధివివేకము - లిచ్చి నడుపు సదా ఆ ...

4. చంచల హృదయులును - ముష్కరులగు పాపులును
   వంచనలేక వాక్యమునకు - తలవంచి విధేయులౌదురు ఆ ...

5. కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను
   నడువుడి త్రోవయిదే యను శబ్దము - చెవులకు వినబడును ఆ ...

6. పక్షిరాజు తనదు - పిల్లల కాచెడు రీతి
   రక్షణ కర్త యెహోవా నిన్ను- కాచి రక్షించు సదా ఆ ...

7. సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు
   అందమైన యా పరలోక రాజ్యము - ప్రబలుట చూచెదవు ఆ ...
658 ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెనుprabhuke stotramu mrutini gelchenu
పల్లవి:
ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను (1)
ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును - ఘన విజయమిచ్చును (2)

1. ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ -
   మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము (2)
   జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం (1)

2. దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు -
   లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము
   జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం

3. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్ -
   శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్
   జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం

4. అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము -
   అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే
   జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం

5. జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్ -
   దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు
   జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం
659 జయరాజు జెండా ఎత్తి చూపుచుjayaraaju jendaa etti choopuchu

Romans 8:37

పల్లవి:
వెళ్ళుదాం గెలిచెదం రక్షకుని నామమునను (1)
విజయుడుగా యేలును భువిలో జ్యోతిర్మయముగ (1)

1. జయరాజు జెండా ఎత్తి చూపుచు - యుద్ధముచేయ వెళ్ళెదము-
   జయమాలతోడ జయ మొందను - ఆనందముతో పాడెదము

2. శత్రుసైన్యము గర్జించి వచ్చినన్ - రాజుజెండా చూపెదము -
   గుమిగూడివచ్చి పోరాడినన్ - మేముజయ మొందెదము || వెళ్ళు ||

3. ఏ దేశ జాతి బాషవారును - సువార్త వినుటచే -
   యేసునాథుని పాలన రోజులు - సమీపమైనందున || వెళ్ళు ||

4. ఆ మంచి కాలము వచ్చినంతనే - పరిపాలన చేయును -
   భక్తిహీనులెల్ల శూన్యులగుదురు - స్థిరపర్చు తన నీతి || వెళ్ళు ||
660 ఓ యేసు భక్తులారా మీ రాజు ధ్వజo yesu bhaktulaaraa mee raaju dhvaja
1. ఓ యేసు భక్తులారా - మీ రాజు ధ్వజము
   గ్రహించి సాహసించి పోరాడి గెల్వుడీ
   విశ్వాసులారా, రండి - మీ రక్షణార్థమై
   ప్రయాసపడ్డ యేసు - విజయమిచ్చును

2. మీ యందసూయబట్టి - మీ ఆత్మ నాశనము
   నెల్లప్పుడు గోరునట్టి యనేకులుందురు
   మీ రెల్ల రేసు పేరు - వచించి యాయనే
   సర్వాధికారి యంచు - సేవింపవలెను

3. ప్రచండమైన దండు - పోరాడ లేచినన్
   విరోధి శక్తికొద్ది మరీ తెగించుడీ
   స్వకీయ శక్తిగాక - శ్రీ యేసు నామమున్
   స్మరించి వానియందు - విశ్వాస ముంచుడి
661 శోధనకు మీరు చోటీయకుడిshodhanaku meeru choteeyakudi

James 4:7

పల్లవి:
యేసు శక్తిని గోరి - యెల్ల కాలము వేడు
యేసుడాశతో మిమ్ము - డాసి నడుపును

1. శోధనకు మీరు - చోటీయకుడి - ధైర్యము వహించి పోరాటమును
   సాధించెడు వారు - జయించెదరు - సాతానుకు లొంగబాపంబగును

2. దుర్బుద్ధి కుభాష - మానుండు సదా
   పాపాత్ముల పొందు - తప్పించుకొని
   శ్రీ దేవుని పేరున్- దూషింపకయు
   శ్లాఘించు మీరు - వర్థిల్లుడిలన్ || యేసు ||

3. జయించెడువారు - సౌందర్య ప్రభున్
   వారు మకుటంబు - ధరించెదరు
   ప్రభుండగు యేసు - నిక్కంబు నమ్ము
   డాయనే నిత్యంబు - సాయమునిచ్చున్ || యేసు ||
662 అధికారము పొంది యుంటివి ప్రభూadhikaaramu pondi yuntivi prabhoo

Matthew 28:18

పల్లవి:
అధికారము పొంది యుంటివి - ప్రభూ (2)
పరలోకమందును భూమి మీదను - నీవు (2)

1. అన్నిటిలో నత్యధిక జయము - నొందుచున్నాము (2)
   మనల ప్రేమించిన యేసు క్రీస్తు - ప్రభువు ద్వారనే (2)
   కనుల కగుపరచిన విజయముకై - సన్నుతింతుము (2)

2. విశ్వసించు మనయందు తన - శక్తిని గూర్చి
   అపరిమితమైన ప్రబావమును - యెరిగి యున్నాము
   తిరిగి లేచిన ప్రభువును చూచి - హర్షించెదము

3. మనల బలపరచు ప్రభువునందు - బలము నొందుచు
   ప్రభున కింపైన కార్యములను - చేయుచుంటిమి
   తనదు పునరుత్థాన బలమును - పొగడెదమెపుడు

4. క్రీస్తు మరణములో సమానాను-భవము కలిగియు
   కష్ట నష్టములలో పాలివారమగుట - యెరిగియు
   ఆత్మ ప్రాణ శరీరములతో - ఆరాధింతము

5. మనల స్థిరపరచిన శక్తిగల - దేవునికి
   తనదు ప్రియ పుత్రుడు యేసుక్రీస్తు - ద్వారనే తనకు
   నిరతంబును మహిమ ఘనత- హల్లెలూయామెన్
663 స్వాస్థ్యముగా నిచ్చితివి జయించెడు వానికన్నిsvaasthyamugaa nichitivi jayinchedu vaanikanni

1 Peter 1:4

పల్లవి:
స్వాస్థ్యముగా నిచ్చితివి - జయించెడు వానికన్ని (2)

1. నీవే మాకు దేవుడవై యున్నావు (2) - మేము నీదు పుత్రులమైతిమి (2)
   నీ స్వంత రక్తము నిచ్చి (2) - కొన్నావు నీ సొత్తుగా (2)

2. నిన్నంగీకరించిన వారలందరిని - నీ నామమందు నమ్మిన వారిన్
   నీ పిల్లలుగాను జేసి - అధికారమిచ్చితివి

3. నీతో కూడా మహిమను పొందుటకు - నీ శ్రమలలో పాలుపొందుటచే
   నీ తోటి వారసులముగా - పరిగణింపబడితిమి

4. అక్షయమైన నిర్మలమైనదియు - వాడబారని స్వాస్థ్యము కొరకై
   మరల జన్మింపగా జేసి - స్థిరముగా నుంచితివి

5. నీ శాసనములు హృదయానందములు - అవి అన్నియు మాకు నిత్య స్వాస్థ్యముగా
   భావించి నిలిచి యున్నాము - హల్లెలూయ గీతములతో
664 జయము పొందుమని యేసు చెప్పెనుjayamu pondumani yesu cheppenu

Revelation 21:7

పల్లవి:
జయము పొందుమని యేసు చెప్పెను (2)
జయించువారే స్వాస్థ్యమొందెదరు (2)

1. జయవంతులే దైవ పరదైసులోనున్న (2) - జీవ వృక్షఫలమును భుజియింతురు (2)
   రెండవ మరణమును దాటెదరు (2)

2. మరుగైన మన్నానిచ్చి మరి తెల్లరాతి నిచ్చు - ఆ రాతిమీద క్రొత్త పేరుండును
   ఎరిగెదరు దాని పొందువారలే

3. ఎవరు అంతము వరకు స్థిరముగ నిలిచెదరో - ఏలెదరు జనులను అధికారులై
   ఇనుపదండముతో పరిపాలించెదరు

4. ధవళ వస్త్రములను ధరింప జేయువారికి - జీవ గ్రంధమున పేరు తుడువబడదు
   దేవ దూతల యెదుట ఘనత కలుగును

5. ఆలయ స్తంభముగా వారిని దేవుడు - నిలిపి స్థిరపరచి దీవించును
   నూతన యెరూషలేమని వ్రాయువారిపై

6. వారిని దేవుడు సింహాసనముపైన - కూర్చుండబెట్టి జీవమకుట మిచ్చును
   వారసులై నిత్యముగా జీవింతురు
665 క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి ఆయన కృపయందే నిలుచుండుముkreestesu siluvapai drushtinunchi aayana krupayande niluchundumu

Galatians 3:1

పల్లవి:
క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి - ఆయన కృపయందే నిలుచుండుము (1)
పరలోక మహిమ కిరీటముకై - క్రీస్తేసు అడుగులలో నడువుము (2)

1. సమాదాన దేశం పరలోకము - ఎన్నో దీవెనలు కలవందున (2)
   ఇహలోక శాంతి క్షణమాత్రమే - గొప్ప శిక్ష యందు దాగియుండె (2)

2. క్రీస్తు నుండి నిన్ను దూరపరచ - లోకాశలు నిన్ను ఆకర్షించు
   సిలువను చూడక పోయినచో - చిక్కుకొనెదవు ఈ లోకములో

3. ప్రభుయేసు సహవాసమున నిలిచి - సాతానుకు స్థలమియ్యకుము
   ఏవి క్రీస్తునుండి విడదీయునో - యేసు రక్తమందు కడుగుకొనుము

4. పరలోక దీవెనలు రుచిచూడను - ఆశతో వెళ్ళను సిద్ధపడు
   లోకమునకు నీవు వేరైనచో - ఆత్మీయముగ నీవు యెదిగెదవు
666 క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరిkreeste ee jeevitamulo entaina manchikaapari

John 10:11

పల్లవి:
క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి (2)
దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు (2)

1. కష్టబాధలలో మన ప్రభువు - నమీపముగా నుండెనెంతో (2)
   గాలితుఫానులను గద్దించుచు - మనతో నుండు యాత్రలో (2)

2. ఇహలోక సాగరము దాటునప్పుడు - అలలెంతో మనలను కదిలింపగా
   మునుగు నప్పుడు మొరపెట్టిన - మనల రక్షంచు తానే

3. జీవిత నావపై దాడి చేసే - సాతాను క్రియలకు భయపడక
   ధైర్యము కొరకై ప్రార్థించిన - ప్రభువే మనల నడుపున్

4. జీవితములో నిరాశచే - కృంగిపోయి మనమున్నప్పుడు
   విజయము నిచ్చి బలపరచి - జీవకిరీట మిచ్చును

5. యేసు ప్రభువే మన దుర్గము - ఆయన యందే నిలిచినచో
   నిశ్చయముగ జయింతుము - ఓడిపోవును శత్రువు
667 మన జీవిత మంతయు అనుక్షణము యుద్ధమేmana jeevita mantayu anukshanamu yuddhame

Galatians 6:14

పల్లవి:
మన జీవిత మంతయు - అనుక్షణము యుద్ధమే (2)
ఇదియే సిలువ మార్గము - మహిమ రాజ్యమొందను (2)

1. ఈ యాత్రలో ముందుకు - సాగిన తోడ్పడి (2)
   యేసుడే నడుపును మనలను (2)- తన మార్గమునందున (2)

2. ఆ సిలువ మార్గము - ఎంతో యిరుకైనది
   క్రీస్తునే గురిగా నుంచిన - విజయము నిశ్చయము

3. ఇహమందు శ్రమలు - రానున్న మహిమలో
   ఎన్నదగినవి కావుగా - క్రీస్తే దుఃఖము బాపును

4. ఈ జగతులో కష్టముల్ - బాధలు కలిగిన
   ధైర్యము విడువక యుందుము - జయించె ప్రభువు ఇహమును
668 యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడుyesukreestu ninna nedu ekareetigane yunnaadu

Hebrews 13:8

పల్లవి:
యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు (1)
యుగయుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును (2)

1. అన్నిటికంటె ముందుగ నున్న (2)- అల్ఫాగ తానై యుండి (2)
   తనయందు మనల పూర్ణులజేసె (2)- ఓమెగ తానైయుండి (2)

2. లోకము పుట్టక మునుపే తాను - మహిమలో తండ్రితో నుండె
   ప్రేమను పొందిన తానే మనకై - శాశ్వత ప్రేమను జూపె

3. అనేకులైన కుమారులను - మహిమకు తెచ్చుటకై
   రక్షణ కర్తను శ్రమల ద్వారా - సంపూర్ణుని జేసె తండ్రి

4. జగదుత్పత్తి మొదలుకొని - వధియింప బడియున్న
   దేవుని గొర్రెపిల్లగ తానై - పరమందారాధన నొందు

5. నిత్యము నిలచు తన నామంబు - నూతన సృష్టియందు
   తన సేవకుల సంతతి తనతో - తరతరముల వరకుండున్

6. అధికంబైన కృప మహిమన్ - యుగయుగములయందు జూపన్
   మనలను లేపి కూర్చుండబెట్టె - క్రీస్తుతో మన తండ్రి

7. ఇట్టి మహిమన్ పొందుటకై - మనమంత తనతో గూడ
   శిబిరము వెలుపట నిందల నోర్చి - వెళ్ళుద మాయనతో
669 సుఖదుఃఖాలయాత్ర కాదా మానవజీవితమంతsukhaduhakhaalayaatra kaadaa maanavajeevitamanta
పల్లవి:
సుఖదుఃఖాలయాత్ర - కాదా - మానవజీవితమంత (2)
క్షణం క్షణంబీ - ధాత్రిలోన (2) - క్రీస్తేసేనీ - సౌఖ్యం కాదా (1)

1. వ్యాధి - బాధల్ - శ్రమల యందు నీలోవిచారమేల (2)
   అగ్నిలో మేలిమి - మెరయుట లేదా - ఆ మేలిమి నీవే కాదా

2. కపట సహోదర - కుట్రలెన్నో - రహస్య ఆ - లోచనలెన్నో
   క్రుంగజేయ - జూచునపుడు - క్రీస్తేసేనీ కిచ్చును జయము

3. ప్రవక్తలు - అపొస్తలులు - విశ్వాసవీ - రులెందరో
   పలువిధ కఠిన - బాధల ద్వారా - వెల్లగలేదా - ఓ నా ప్రియుడా

4. త్వరలో ప్రభువు - వస్తున్నాడు - తన సంఘవధు - వున్ కొనిపోవన్
   త్వరగా సంసి - ద్ధంబగు ప్రియుడా- తగినరీ - తిన్ నేడే ప్రియుడా
671 యేసులో హర్షించెదముyesulo harshinchedamu

Nehemiah 8:10

పల్లవి:
యేసులో హర్షించెదము -  మహిమలో హర్షింతుము నిరతం (2)
మహిమ మహిమ మహిమలో హర్షించెదము (2)

1. పరిశుద్ధులు హర్షింప - యేసు త్వరగా రమ్మని పలుక (1)
   మారువారికి మకుటం - మనస్సారగ దేవుడిచ్చున్ (1)
   మహిమ ఘనము మహిమలో నానందింప (2)

2. శుద్ధ జీవులైన - దేవసుతులు ప్రకాశింపన్
   సర్వ సృష్టియొక్క - మహా కర్మము లన్నియు తీర
   రాజుకు మహిమ కలుగు దినములు రాగా

3. దాసులెల్లరుకూడి - దేవుడిచ్చు మకుటము పొంది
   వేయి సంవత్సరముల్ - రాజ్యమేలుచుండునపుడు
   నెమలి, కోకిల, గొఱ్ఱె, పులితో వసించున్

4. చెదల పుడమి నశింప - నవభూమ్యాకాశముల్ కలుగ
   శాప పాపముల్ సకల - కడురోగము లెల్లను తీర
   సుఖము, జయముతో నెల్లరు నానందింప

5. బంగారు వీధులను - బహురంగుగా నొప్పుచుండున్
   మెరయు వజ్రకాంతుల్ - కూడ నీవు చూచి హర్షింప
   క్లేశ, కన్నీరులేని నగరులోన

6. స్ఫటిక జీవనదియు - ఇరుప్రక్కల జీవ వృక్షమును
   ఆకలిదప్పులు లేక - నట జీవ ఫలముల భుజించి
   తినుచు, త్రాగుచు యేసులో నానందింప

7. పరిశుద్ధాత్మయు సుతుడు - చేసిన రక్షణ కార్యమును
   తండ్రి దూతల గణముల్ - నట చూచి ప్రహర్షింపన్
   క్రొత్త కార్యముకొరకు ఆనందింప
672 ఎల్ల వేళలందు కష్టకాలమందుella velalandu kashtakaalamandu

Psalm 34:1

పల్లవి:
ఎల్ల వేళలందు - కష్టకాలమందు -  వల్లభుండా యేసు స్తుతింతున్ (1)
ఎల్లను నీవే నా కెల్లెడల - వల్లపడదే వివరింప (2)

1. విమోచకుడా - విమోచన మీవే - రక్షకుడవు - నా రక్షణ నీవే (2)

2. సృష్టికర్తవు - సహాయము నీవే - ఇష్టుడ వీవు - త్రిత్వము నీవే

3. జ్ఞానము నీవే - నా పానము నీవే - దానము నీవే - నా గానము నీవే

4. జ్యోతియు నీవే - నా నీతియు నీవే - ఆదియు నీవే - నా అంతము నీవే

5. నిత్యుడ నీవే - నా సత్యుండ నీవే - స్తోత్రము నీవే - నా నేత్రము నీవే

6. జీవము నీవే - నా దేవుడ వీవే - పావన మీవే - నా కావలి నీవే

7. కాంతియు నీవే - నా శాంతియు నీవే - సంతస మీవే - నా కంతయు నీవే
673 ఆనందమే మనకిలలో మన కానందమేaanandame manakilalo mana kaanandame

Matthew 28:7

పల్లవి:
ఆనందమే మనకిలలో ఆ... ఆ... (2) - మన కానందమే ప్రభు లేచెన్ (1)
ఆనందమే మనకిలలో (2)

1. పాపుల మిత్రుడు - పాప రహితుడు (2) - పాపులకొరకై - శాప గ్రాహియై (2)
   మోపుగ శాపము - వీపున మోసె పాపపు ఋణము తీర్చె (2)

2. పొంతిపిలాతు మసుఖమునందు - శాస్త్రుల పెద్దల యేదుటను నిలిచె
   స్తోత్రార్హుండు - మరణము గెలిచె - సైతానును ఓడించె

3. మరణము భయము - లేని వారమై - మరణమున్ గెల్చిన - యేసుని జేరి
   తరుణమును - పోగొట్టుకొనక - పరమ ప్రభువును చాటన్

4. లేచిన ప్రభువు ప్రియులను జూచి - గాంచెద నంచు అభయమునిచ్చె (2)
   తీసివేసెను - చింతయు నంతను - రోసెద మిపుడే లోకమున్

5. పరమునకేగి - పంపెనాత్మను - పరవశులైరి - శిష్యులు గదిలో
   కొరతలేని - శక్తిని పొందిరి - శిరముల - నెత్తిచాటిరి

6. మన ప్రభుయేసు వచ్చుచుండె - మనము రెప్ప పాటున మారి
   తనివి దీరగా - సంతసించి - వినయుని చేరెదము

7. మహిమ కిరీట ధారులమై - మహిమ వస్త్రములు ధరించి
   మహిమగల - రాజుతో నుండి - మహిని పాలించెదము
674 మహిమ రాజు సన్నిధిన్mahima raaju sannidhin

Revelation 4:11

పల్లవి:
హల్లెలూయ పాట పాడెదము  - హల్లెలూయ పాట పాడెదము (1)
పాడెదము  పాడెదము  హల్లెలూయపాట (1)

1. మహిమ రాజు సన్నిధిన్ - మకుటధారులై
   నిత్యజీవ శాంతిలో - నిలిచియుందుము

2. శాంతి నాథుడేసుని - సముఖములో
   సంతసమే నిత్యము - చింత లేదుగ || హల్లె ||

3. నా ప్రభువు తుడుచును - నా కన్నీటిని
   ప్రేమతోడ మందను - పోషించును || హల్లె ||

4. సంతసమున దూతలు - సంస్తుతించగా
   పాడి మోక్షమందున - మోదమొందెదన్ || హల్లె ||

5. శత్రువునకు వెరువనేల - సోదరులారా
   దైవపుత్రులారా నిద్ర - లేచి పాడుడి || హల్లె ||

6. యేసురాక వార్త మ్రోగె - భాసురంబుగా
   వచ్చుచున్నాడేసు సంఘ - వధువు కొరకు || హల్లె ||

7. తెల్లవస్త్రములు లేక - వెళ్ళజాలవు
   రక్తములో కడుగును - వస్త్రములను || హల్లె ||
675 దప్పిగొనిన వారలారాdappigonina vaaralaaraa

Isaiah 55:1

పల్లవి:
దప్పిగొనిన వారలారా దప్పితీర్చుకొన రండి రండి (2)

అను పల్లవి:
కాసు రూకలు లేకున్నను త్రాగను రండి (2) || దప్పి ||

1. యెషయా యిరువదియైదు ఆరవ వచనము చదివి (2)
   త్రాగుచు తృప్తి పొందను రండి రండి (2)

2. క్రొవ్విన పదార్థమును పాత ద్రాక్షారసమును
   క్రొవ్వు మెదడు గలవాటిని తినుటకు రండి

3. నేనే జీవపానమును - నేనే పరమాహారమును
   రూకలను వ్యర్థము చేయక - రండి రండి

4. నా శరీరమే పరమాహారం - నే చిందించిన రక్తమేపానం
   తిని త్రాగిన వారికి కల్గును నిత్యజీవం

5. ద్రాక్షారసము ఓదార్చున్ - జల్దరు తృప్తిపరచున్
   నీకు నూనె ఉజ్జీవము నిచ్చున్నిచ్చున్

6. గొఱ్ఱెపిల్లలు దూడలును - తినువారికి చంపబడెను
   వ్యర్థసాకులను చెప్పక రండి రండి

7. సర్వసమృద్ధిలోన దేవుడున్నాడు రండి
   హల్లెలూయ పాటలుండును రండి రండి
676 దాహముగల వారెల్లరు నీళ్ళయొద్దకు రారండిdaahamugala vaarellaru neellayoddaku raarandi

Psalm 65:9

పల్లవి:
దాహముగల వారెల్లరు - నీళ్ళయొద్దకు రారండి (2)

1. దేవుని నది నీళ్ళతో నిండి - భువికి సారము నిచ్చుచున్నది - రారండి (2)
   దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు (2)

2. ఆనంద ప్రవాహ నదిలో - పానముతో దప్పి తీర్చును రారండి
   భూనివాసులు దాహముతో - ప్రాణము విడుచుచున్నారు

3. మంచితనముతో వత్సరమునకు మకుటము ధరింప చేసెను - రారండి
   మహిమతో నిండిన తన మార్గములో - మేలులు ప్రవహింప జేసెను

4. ప్రయాసభారము మోయువారు - యేసు నొద్దకు ఆశతోడను - రారండి
   తీసివేయును మీ భారము - నొసగు మీకు విశ్రాంతి

5. సకలము సిద్ధముగా నున్నది - శక్తిగల దేవుని విందునకు - రారండి
   సహవాసంబున భుజించును - చేర్చుకొనిన క్రీస్తు ప్రభుని

6. సత్యమును తెలిపెను ప్రభువు - ప్రత్యేక జీవము జీవింపను - రారండి
   ప్రత్యక్ష పరచెను తన వెలుగు - నిత్యము యేసుతో జీవించుడి

7. దేవుని నది జీవజల నది - ప్రవహించుచున్నది పల్లమునకు - రారండి
   దేవుని కృప పూర్ణతను బొందగ - నీవును విధేయుడవై యుండుము
677 పాపుల రక్షకుడు యేసుpaapula rakshakudu yesu

Colossians 3:11

పల్లవి:
సర్వంబులో నాకు సర్వమేసు - సర్వశక్తిగల యేసు (1)
హల్లెలూయ -  ఆమెన్ (2)

1. పాపుల రక్షకుడు యేసు - గొప్ప దేవాది దేవుడు యేసు (1)
   కృపతో కౌగలించె నను యేసు -
   ఉపకారి నన్ను చేర్చె యేసు (2)

2. గొఱ్ఱెలకు గొప్ప కాపరి యేసు - దొరుకు తన్ను వెదకు వారి కేసు
   ఆరాధికులకు పరిశుద్ధుడేసు -
   నిరాశగలవారి మిత్రుడేసు || సర్వంబులో ||

3. నాదు మార్గంబునకు వెలుగు యేసు - నాదు పాదంబులకు దీపము యేసు (1)
   నాదు దాహంబునకు పానము యేసు -
   నాదు యజ్ఞానంబునకు జ్ఞానము యేసు || సర్వంబులో ||

4. నాదు రోగంబులకు వైద్యుడు యేసు - నాదు బాధ్యతల వహించు నేసు
   నాదు ఏకాంతములో తోడు యేసు -
   నాకు తేనె కంటె బహు తీపి యేసు || సర్వంబులో ||

5. నాకు రక్షకుడు రక్షణ యేసు - నాకు విమోచకుడు విమోచ నేసు
   నాకు జీవంబును దేవుడు యేసు -
   నాకు నీతి నాదు వెలుగు యేసు || సర్వంబులో ||

6. నాకు మాదిరి వెంబడించ యేసు - నాకు ముందు నడచు నాయకుడేసు
   నాకు దుఃఖంబులో ఆదరణేసు -
   నాదు కష్టంబులో ధైర్యము యేసు || సర్వంబులో ||

7. నాదు హృదయంబున యున్నవాడు యేసు - నాదు వృద్ధికి కారకుండు యేసు
   నాదు కృంగుదలలో తోడనుండు యేసు -
   నాదు సర్వమందు నిల సర్వమేసు || సర్వంబులో ||
678 దాటుము యొర్దానున్ యాత్రికుడాdaatumu yordaanun yaatrikudaa

Ecclesiastes 1:2

పల్లవి:
దాటుము యొర్దానున్ యాత్రికుడా -
నాలుగు ఘడియలకే అతిథివి నీవిచట (2)

1. ఇహలోకములో సుఖమేలేదు (2)
   గడ్డిని బోలినదే - జీవిత మంతయును (2)

2. నీడలు క్షణములో మారినరీతిన్
   జీవితముండుగదా - ఆవిరిసమమే గదా

3. వ్యర్థము వ్యర్థము మాయలోకము
   లోని సర్వమును - చెత్తను బోలినదే

4. కన్నులెత్తి చూడుము క్రీస్తున్
   ఆయనే సర్వములో - మహోన్నతుండు

5. సిలువను మోసి సాగుము ప్రియుడా
   చేరుదువు నీవు - కానాను దేశమున

6. వాక్యము మార్గము జూపును నీకు
   క్రీస్తునే గురిగా - నుంచుకొనుము సదా
679 ధన్యుడవు నీవు ధన్యుడవుdhanyudavu neevu dhanyudavu

Deuteronomy 33:29

పల్లవి:
ధన్యుడవు నీవు ధన్యుడవు (2)- ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు (2)
యెహోవాయే నిన్ను విమోచించెను (2)
ప్రజలలో నీవు మహా శ్రేష్టుడవు ధన్యుడవు (1) -  ధన్యుడవు నీవు ధన్యుడవు (2)

1. నీ పాపము పరిహారమాయె - నీ యతిక్రమము తుడువబడెన్ (2)
   నిర్దోషియని నిన్నెంచె ప్రభు (2)- ఆత్మలో కపటము లేదనెను (2)

2. ఏర్పరచబడిన ధన్యుడవు - దరిజేరితివి నీ ప్రభుకడకు
   చేర్చెను తన మందిరములోన - తృప్తిపరచె దాని సమృధ్దిచే

3. దుష్టుల యోచనలో వెళ్ళక - పాపుల మార్గమున నిలువక
   అపహాసకులతో కూర్చుండక - ధర్మశాస్త్రము ధ్యానించునీవు

4. ప్రభునిచే నీవు బలమొంది - ప్రభు మార్గము నీయందుండి
   జలములలో నీవు నడచుచు - జలమయముగా చేయు నీవు

5. యెహోవాయే ఉత్తముడని రుచిచూచి మరి ప్రభు నెరిగి
   మహోన్నతుని ఆశ్రయించి - ఆరాధించు నీవు ధన్యుడవు
680 నూతన ఆకాశమును భూమిnootana aakaashamunu bhoomi

Revelation 21:1-27

పల్లవి:
నూతన ఆకాశమును భూమి నేను జూచితి  -
అందుండె శాంతి ఆనందజ్యోతి మహిమ తేజముల్ (2)
ముందున్న భూమి యాకాశము లదృశ్యమాయెను -
సముద్ర మికను లేదు అందున్న వెల్లను (2)

1. పరలోక రాజ్య పట్టణమెంతో యద్భూతము -
   గొఱ్ఱెపిల్ల కాంతితోడ దాని కాంతి ఎంతయో (2)
   సురక్షితంబు చేయబడెను ప్రాకారంబుతో-
   గొఱ్ఱెపిల్లకు యుగములు స్తుతియరాధన (2)

2. పరిశుద్ధ యెరూషలెము పరలోకమునుండి -
   దేవుని యొద్దనుండి దిగుట నేను చూచితి
   భర్తకొరకు అలంకరింపబడియున్న -
   పెండ్లికుమార్తెవలెనె సిద్ధమై యుండెను

3. సింహాసనము నుండి యొక స్వరము వింటిని -
   దేవుని నివాసము మనుజులలో నున్నది
   ఆయన వారితోడనే ఎల్లప్పుడుండును -
   ఆయన వారి దేవుడు వారాయన ప్రజలు

4. దేవుడు వారి కండ్లనీళ్ళు తుడిచివేయును -
   దుఃఖంబు మరణములు లీక నెన్నఁడుండవు
   ఏడ్పు బాధ శాపము లిక నెన్నడుండవు -
   రాత్రి లేదిక గొఱ్ఱెపిల్ల దీపంబాయెగా

5. సింహాసనాసీనుండు తానే మరల చెప్పెను -
   ఇదిగో సమస్తమును నూతనమాయెను
   పాతసంగతులెల్లను గతించి పోయెను -
   గతించినవి రావు మరల జ్ఞాపకమునకు

6. పట్టణమునకు ఎత్తైన ప్రాకారమున్నది -
   చుట్టు పండ్రెండు గుమ్మములు దానికున్నవి
   కట్టబడెను ముత్యములతో పునాదులు -
   చుట్టబడెను సూర్యకాంత సువర్ణములతో

7. పట్టణపు పునాదులు ప్రశస్తమైనవి -
   సూర్యకాంతము నీలము యమున పచ్చయు
   వైఢూర్యకెంపు స్వర్ణరత్న గోమేధికము -
   పుష్య పద్మరాగ స్వర్ణసునీయ సుగంధము

8. జయించువారు ధన్యులు యేలుదురెన్నడు -
   ధరించి తెల్ల వస్త్రములు సంతసింతురు
   ప్రభువు వారి - దేవుడై యుండు నిరంతము -
   వారసులై సర్వము స్వతంత్రించు కొందురు

9. ప్రభుని భక్తులారా మీరు సిద్ధపడుడి -
   అద్భుత రాజ్యమందు నుండ యాశపడుడి
   గొఱ్ఱెపిల్ల గ్రంథమున పేరున్న వారలు -
   ఘనంబుగ పరంబున ప్రవేశించెదరు
681 మన ప్రభుయేసు వచ్చెడు వేళmana prabhuyesu vachedu vela

Matthew 17:8

పల్లవి:
మన ప్రభుయేసు వచ్చెడు వేళ (2) - మన సంతోష హృదయాలు చాల వెలసె (2)

1. భూదిగంత నివాసులారా (2) - పదిలముగ ప్రభు యేసుని చూచి (2)
   ముదముగ రక్షణ మరి పొందుడి (2)

2. వారాయన తట్టు చూడగనే - వారలకు వెలుగు కలిగెను
   వారి ముఖంబులు లజ్జింపకుండెన్

3. మన విశ్వాసమునకు కర్తయు - కొనసాగించెడు యేసుని చూచి
   వినయమున పరుగిడు పందెమున

4. శిష్యులు కన్నులెత్తి చూడగను - యేసే కనిపించెను వింతగను
   మోషే ఏలియాలు మరుగైరి

5. ప్రభుయేసే మన పరిమళ ప్రియుడు - మురిసెదము మన ప్రభువునందు
   మెరిసే మహిమలు మన భాగ్యమదే

6. మంచి కాపరి మన ప్రభుయేసు - మనకై తనదు ప్రాణము నిచ్చెను
   వినుడి మన రక్షకుని పిలుపు

7. ఆనందముతో ఆర్భాటముతో - అందమగు శ్రీ యేసుని జూచి
   హల్లెలూయా యని పాడెదము
682 నే భ్రమించి నిల్చితి ప్రేమne bhraminchi nilchiti prema

Hebrews 13:12

పల్లవి:
పవిత్ర రక్తముచేత - నా పాపమెల్ల తీరె
నాదరణ పొందితినిపుడు - రక్షకుని రక్తముచే

1. నే భ్రమించి నిల్చితి ప్రేమ - ప్రవాహము తేరి చూచి
   నా హృదయమందు సంపూర్ణ - సమాధానము నొందితిన్

2. మున్ముందు ఈ ఓదార్పు చూడ - మిగుల ప్రయాసనొంది
   వ్యర్థప్రయాస వీడినంత - రక్షకుని కృపనొందితి || పవిత్ర ||

3. తన కరము నా మీదనుంచి - నన్ను స్వస్థపడుమనెన్
   నే నాయన వస్త్రము ముట్టి - ఆరోగ్యము పొందితిని || పవిత్ర ||

4. నిరంతరము పుణ్య నాథుండు - నా ప్రక్క నుందుననెను
   తనముఖ భాసురముచేత - నా యెదను నింపుచుండున్ || పవిత్ర ||
683 ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడుprabhu yesukreestuni darshaname nedu

Isaiah 6:1

పల్లవి:
ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు (1)- ప్రజలందరి కత్యవసరము ఆ ఆ (2)

అను పల్లవి:
దర్శనము లేక ప్రజలు నశింతురు (1) - దీనినక్కరతో గమనించెదము (2)

1. యెషయాచూచె సైన్యముల యెహోవాను (1)- ఉజ్జియా మరణించినపుడు ఆ ఆ (2)
   యెహోవా పరిశుద్ధుడని ముమ్మారు (1)
   దూతల గొప్ప ద్వని వినెనపుడు (2)

2. యెహెజ్కేలుకు అధిపతివలె కనబడె - నా భాగ్యమెవరికి లేదా
   నాళు ముఖములతో నాలుగు జీవులు
   కన్నులతో నిండియున్న చక్రములు

3. శాశ్వత రాజ్యములు కల్గిన రాజును - అగ్నివంటి సింహాసనమున్
   కోట్లకొలది జనులు తీర్పునకై
   కాచియుండుట చూచెను దానియేలు

4. కొండపై యేసు రూపాంతర మొందిన - సందర్భము మరువగలమా
   భయ మొందిరచ్చట ముగ్గురు శిష్యుల్
   ప్రియసుతుని గూర్చి తండ్రి జెప్పగనె

5. పత్మాసు ద్వీపమున యోహానుజూచిన - ప్రభువే సంఘమునకు శిరస్సు
   మహా ప్రధాన యాజకుడాయనే
   మహిమ ప్రభావ రూపుడు యేసే

6. సింహసనము మధ్యలో నున్నవాడే - సింహమగు దైవ గొఱ్ఱెపిల్ల
   ఆరాధింపబడు దేవుడు నాయనే
   అందరి యారాధన లాయనకే

7. తెల్లని యశ్వముపై నున్న వీరుడు - నమ్మకమగు సత్యరూపి
   దేవుని వాక్యము న్యాయాధీపతియగు
   జీవుల దేవునికే హల్లెలూయ
684 యోర్దాన్నది దరిని భ్రమింపకుyordaannadi darini bhramimpaku

Hebrews 13:5

పల్లవి:
యోర్దాన్నది దరిని భ్రమింపకు మనసా (1)
యోచనచే చింతపడకు నా డెందమా (2)

1. ప్రవాహ మెక్కిన శక్తిని వీడకు (2) - దివ్య ప్రభుని వాక్కు మారదెన్నడు (2)

2. వాక్యానుసారము పాదము పెట్టుము - ఏక దేవుడేసు మాటతప్పడు

3. ఉన్నతరాజగు యేసు నీ దళకర్త - అన్ని శ్రమల నుండి కాచు నిక్కము

4. కానాను చెంతను ప్రియుని రాజ్యము - కాంచెద దేశంబు నిత్యానందము

5. ప్రేమ పాల్ తేనెయు పారెడి దేశము - పాటచే దానివర్ణింప వీల్పడదు

6. ప్రార్థన శక్తిచే విజయుల రాజ్యము - ప్రకాశ వస్త్రముల ధరింతు మచ్చట
685 కృపాసింహాసనుండా అల్ఫా ఓమేగా నీవేగాkrupaasinhaasanundaa alphaa omegaa neevegaa

Revelation 21:5

పల్లవి:
కృపాసింహాసనుండా (1)- అల్ఫా ఓమేగా నీవేగా (1)
కృపాసింహాసనుండా  -  కృపా దాపునజేరి నుతించెద (2)

1. ఇదిగో సమస్తమును - నూతనముగ చేయుచున్నాను (2)
   ఇదిగో సమస్తమును (1) - మోదంబు గలుగజేసెద (2)

2. దైవవాక్యము గైకొని - జీవించిజయించువాని
   దైవవాక్యము గైకొని - దేవాలయ స్తంభముగా జేతున్

3. దావీదు తాళము గలిగి - నా దేవుని పేరు వ్రాసెద
   దావీదు తాళము గలిగి - దావీదు జీవింపజేతున్ నెపుడచట

4. సత్యస్వరూపిని నా - క్రొత్త పేరు వాని పై వ్రాతున్
   సత్యస్వరూపిని నా - సత్యమునందు నడిపింతున్

5. పరలోకమును దిగివచ్చు - పరిశుద్ధ పట్టాణము పేరు
   పరలోకమును దిగివచ్చు - మురియుచు వానిపై వ్రాతున్

6. ఉత్తముడు యెహోవా - క్రొత్తగీతము పాడుడి
   ఉత్తముడు యెహోవా - పుత్రుడేసుని మన కొసగెన్

7. తండ్రికి ప్రియుడేసు - అండగ నుండెను తండ్రి
   తండ్రికి ప్రియుడేసు - మెండుగ నాత్మతో నిండెన్

8. సిలువపై ప్రాణమిడెను - విలువ సమాధి నుంచబడె
   సిలువపై ప్రాణమిడెను - గెలిచి లేచె సజీవుండై

9. ఘనుడైన ప్రియుడేసు - దీనుల యాదరించును
   ఘనుడైన ప్రియుడేసు - వినయముతో మనలను పిలిచెన్

10. ఉల్లంబులు రంజిల్లె - ఎల్లప్పుడు ప్రభు మనతో నుండ
   ఉల్లంబులు రంజిల్లె - హల్లెలూయ పాడెదము
686 ప్రభువా నీ పరిపూర్ణత నుండిprabhuvaa nee paripoornata nundi

Haggai 2:5

పల్లవి:
ప్రభువా నీ పరిపూర్ణత నుండి - పొందితిమి కృపవెంబడి కృపను (2)

1. ప్రభువైన యేసుక్రీస్తు - పరలోక విషయములో (2)
   ప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు (2)

2. జనకా నీ వెన్నుకొనిన - జనుల క్షేమముజూచి
   సంతోషించునట్లు - నన్ను జ్ఞాపకముంచుకొనుము

3. నీదు స్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలిసి
   కొనియాడునట్లుగా - నన్ను జ్ఞాపకముంచుకొనుము

4. దేవా నీ ప్రజల యెడల - దిన దినము నీకున్న
   ఘనుడా నీదు దయతో - నన్ను జ్ఞాపకముంచుకొనుము

5. దేవా నీదు స్వరూప - దివ్యదర్శనమును
   దినదినము నాకొసగి - నన్ను జ్ఞాపకముంచుకొనుము

6. మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకు
   డనిన మహోన్నతుడా - నన్ను జ్ఞాపకముంచుకొనుము

7. ముదమార నన్నెన్నుకొని - ముద్ర యుంగరముగను
   చేతుననిన ప్రభువా - నన్ను జ్ఞాపకముంచుకొనుము

8. కృపా సత్య సమ్మిలిత - నంపూర్ణ స్వరూప\
   హల్లెలూయ నీకే ప్రభో - ఎల్లప్పుడు కలుగునుగాక
687 కరుణా కరుడాkarunaa karudaa

Psalm 77:13

పల్లవి:
కరుణా కరుడా - నీ మార్గము - పరిశుద్ధ స్థలములో గలదు - అది

1. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు - వారు
   తిరిగి వచ్చెదరు సీయోనునకు

2. చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ - తమ
   సంతోషం అధికంబగును

3. మోక్షానంద భాగ్యము గలిగి అక్షయులై అరుదెంచెదరు - తమ
   దుఃఖం నిట్టూర్పును పోవును

4. విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి - తమ
   ప్రభుని కొనియాడిరి బహుగా

5. ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదు
   ప్రవిమల నీతి సమాధానం - అది - పరిశుద్ధాత్మానందము

6. మహోన్నతుడే మనకానందం
   మహా బలమగును గాక - అది మహిమార్థంబగును గాక

7. హల్లెలూయ ఎల్లరుపాడి
   హర్షింతుము ప్రభుయేసునిలో - మన - రక్షకుడేసుని పాడెదము
688 ఉన్నత గృహమును త్వరగా చేరి సం పన్నుని దర్శింతును ఈunnata gruhamunu tvaragaa cheri sam pannuni darshintunu ee

Isaiah 35:9

1. ఉన్నత గృహమును త్వరగా చేరి సం - పన్నుని దర్శింతున్ - ఈ (2)
   పేదగు నా కోర్కె సఫలము చేసిన - నాథుని కొనియాడుదున్ (2)

2. దూతల మధ్యను స్తోత్రము లొందెడు - ప్రభుని స్తోత్రింతున్ - సు
   గంధము వీచెడి పుష్పరాజంబుల మధ్యను నిద్రింతున్

3. ఆకాశ గణములు సేవించుచుండగ - వీకతో వారిజేరుదున్ - నా
   యేసుని స్తుతుల నోరార పాడి భాసురముగ నుతింతున్

4. స్ఫటిక నది తీరమున నేను - పాడుచు తిరుగుదును - ఆ
   బంగారు వీధిలో యేసుతో నేను రంగుగ నడుగిడుదున్

5. పలువిధ మృగములు పైబడినను - నె - వ్విధమున భయపడను - ఆ
   వెంగియు సింహము నా పై వచ్చిన నగవుతో రమ్మనెదన్

6. పక్షులు అయ్యెడ ననేకముండును - వృక్షఫలములుండున్ - నా
   రక్షకుడగు యేసు నాకై చేర్చిన అక్షయ ధనముండున్

7. పేతురు యోహాను పౌలుతో నేనును - ప్రీతితో వసియింతును - నా
   చల్లని మిత్రుని ఇంటను హర్షముతో - హల్లెలూయ పాడెదను
689 మన పట్టణంబదిగో మన పౌరత్వంబదిగోmana pattanambadigo mana pauratvambadigo

Philippians 3:20

పల్లవి:
మన పట్టణంబదిగో - మన పౌరత్వంబదిగో -
కానాను పురమదిగో - మన యేసుకు జేయునమో (2)

1. ఆర్భాటంబులతో - విజయోత్సవంబులతో -
   ఏతెంచిన ప్రభు జేరి - పాత భక్తుల జేరి (2)
   మధ్యాకాశంబుననూ - హల్లెలూయా పాడెదము (2)

2. జీవ జలనది - పారు నాసనమునుండి -
   ఆవల నీవలనూ - జీవ వృక్షంబుండు
   నెల నెల కాయును - పండ్రెండు కాపులను

3. నూతన భువియందు - నూతన యెరూషలేముండు -
   నూతన వెలుగుననూ - నూతన ప్రజలౌదుము
   నూతనాలయము - గొఱ్ఱెపిల్లయే తాను

4. తేజోమయునితో - మరి తేజోవాసులతో -
   తేజరిల్లుదుము - తేజో రాజ్యమునందు
   సజీవ జనకుని - సజీవ జనులమని

5. చేరుదు మాపురము - పరమ పరదైసునకు -
   కరువు మరణములు - కానము ఎన్నడును
   మహిమలో నిత్యంబు - ప్రభు యేసుతో నుందుము
690 యేసువా నా ప్రియమైనyesuvaa naa priyamaina
పల్లవి:
యేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా - నన్ను -
భాసురముగ వేగవచ్చి కౌగలించవే (2)

అను పల్లవి:
ఆశ నీవేగా నాదు ఆత్మనాథుడా (2) || యేసు ||

1. ముండ్ల యందు నుండు వల్లి పద్మమువలె - నిచట -
   మూర్ఖజనులు నన్నుకొట్టి గాయ పరచినన్ (2)
   ముద్దు ప్రియుడు యేసునాదు హర్షము (2)

2. ఇద్దరలో యేసు నాకు జల్దరువృక్ష - మిలలో -
   సదమలుండు ఉత్తముండు పురుషులలోన
   ఎదలో క్రొత్తగాలి వలె ప్రేమవీచెను

3. ప్రేమయను ధ్వజము నాకు పైగా నెత్తును - నన్ను -
   ప్రేమతో రక్షింప నా యొద్ద నిల్చెను
   విమల స్వరము వినగా నాశతీరెను "

4. లేడిపిల్ల వలె నాదు ప్రియుడు యేసుడు - ఇదిగో
   కొండలపై ఎగసిదాటి వచ్చువేగమే
   కౌగిలించుకొనును నన్ను వేగమే

5. వర్ష ఋతువు తీరిపోయెన్ వాన రాదిక - ఎంతో -
   వింతగాను పుష్పములు పూసియున్నవి
   సంతసమున రాజ్యమేల జేర్చును
691 నిన్ను విడువను నేనుninnu viduvanu nenu

Acts 18:10

పల్లవి:
నిన్ను విడువను నేను - అందరు నిన్ను విడచినను -
నిన్ను ఎన్నడు ఎడబాయను నేను -  నిన్ను (1)

1. యేసుని పొలములో పనిచేసెడి (2) - దాసులందరికిదే వాగ్దానము (2)
   ఆత్మల పంట కోయునపుడు (2) - మీతో నుందును నేను (1)

2. దుష్టుడు నిరుత్సాహ పరచును - కష్టపడినను ఫలితము లేదని
   యిష్టముగా పనిచేయుము నీవు - శ్రేష్ఠుడొసగును జయము

3. కాయమునందు విత్తిన నీవు - క్షయమను పంటను కోతువు
   ఆత్మీయముగా విత్తిన కోతువు - నిత్య జీవపు పంట

4. మానవులను లెక్కించకుము - ప్రాణుల ప్రభుకై సంపాదింప
   నిను కృంగఁజేయు నిష్మాయేలెప్పుడు - కనుమిస్సాకులో జయము

5. మనకు మాదిరి క్రీస్తునుంచెను - తన స్వరూపమునకు మారునట్లు
   మనము ప్రభుని పోలునట్లు - ఆత్మ చేయున్ మనలన్

6. మనదు స్వార్థము పోవునట్లు - ఆయనతో శ్రమపడుటయే మార్గము
   క్రీస్తు స్వరూపమేర్పడు మనలో - అగ్నిపరీక్ష యందు

7. జలములలో దాటునపుడు - జ్వాలలందు నడచునపుడు
   బలముగా మీకుతోడై యుండి - నిలిపెదను నా దృష్టి
692 సర్వోన్న తుడు సర్వాధికారిsarvonna tudu sarvaadhikaari

Romans 8:28

పల్లవి:
సర్వోన్న - తుడు సర్వాధికారి - సర్వశక్తిమంతుడు - ఆయనే -
సర్వజ్ఞా - నము మనకు - నిచ్చున్ పాడుడల్లెలూయ (2)

అను పల్లవి:
యధార్థమైనది - దైవమార్గ మిల - సంపూర్ణమైనది -
నాథుడేసు నీకై చేయుచున్నది - ఇప్పుడు నీకు తెలియదు -
మననాథు డమర్త్యుని మాటనమ్ము - మిక - మీదట తెలిసి కొందువు (1)

1. ఆశ్చర్యకరుడు యోసేపున్ నెట్టి - తెచ్చె నైగుప్తునకు - రాజుగా -
   చేసి తన ప్రజల అక్కరన్ తీర్చె - పాడు డల్లెలూయ (2)

2. ఆలోచనకర్త మోషేను లేపె - పాలకుడైన ఫరో నెదిరింపన్ -
   బలపరచి తన ప్రజలన్ విడిపించె - పాడు డల్లెలూయ

3. మహోన్నతుడు దానియేలున్ గాచె - మహాబాబెలునందు ఆయనే -
   మహారాజుగా మహిమ నొందెను - పాడు డల్లెలూయ

4. బలవంతుడేసు పేతురున్ గాచి - పౌలును బట్టి తెచ్చి - సంఘమున్ -
   కల్తీలేకుండ కట్టె సత్యాత్మతో - పాడు డల్లెలూయ

5. ఆది అంతము లేని మన యేసు - నాథుడు వచ్చుచున్నా డిదిగో -
   సిద్ధముగా నుండి సుస్వాగత మిమ్ము - ఆమెన్ హల్లెలూయా
693 వెళ్ళెదం శ్రేష్టదేశం నిజముvelledam shreshtadesham nijamu

Hebrews 11:10

పల్లవి:
వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము -  వుండెదం ప్రభుతోనే నిత్యము (2)
పరలోక దేశము వుత్తమం - ఆ మనదేశం అతి వుత్తమం (2)

1. తండ్రి కోరికయే - మనకొక రాజ్యమివ్వ -
   లోకసృష్టి క్రితము - యేర్పాటైన పట్టణం (2)

2. అద్భుత నగరమది - ప్రభు నిర్మించినది -
   దృఢమైన పునాది - స్థిరపరచబడినది

3. పవిత్ర నగరమది - నీతికి స్థానమది -
   పరమ స్వభావముతో - నిర్మింపబడినది

4. నిరంత రాజ్యమది - యుగంబు లుండునది -
   నిత్యముండెద రచ్చట - యేర్పరచబడినవారు

5. ప్రభుని చూచెదము - ఆనంద మొందెదము -
   ప్రభు సమానముగా - మనముండెద మచట
694 ప్రకాశమైన ఆశ్చర్యదేశముprakaashamaina aashcharyadeshamu

Philippians 3:20

పల్లవి:
ప్రకాశమైన ఆశ్చర్యదేశము (1) -
ప్రియుని దేశము - నా ప్రియ దేశము (2)

1. పాపరహిత దేశము - ఏ శాపము కనబడదు (2)
   నిత్యానందము ఆగని గీతము -
   ఆకాశమందు హోసన్నా - హల్లెలూయ (1)

2. సూర్యచంద్రులు లేరు - కాని చీకటి కనబడదు
   దైవకుమారుడు తేజోమయుడు -
   నిత్యము వెలుగిచ్చును - పగలెప్పుడు

3. పలువిధ బోధలతో - నుండు గుంపుల పేరుండదు
   యేక కుటుంబము ఒక నాయకుడే -
   మామయ దేశము - ప్రియులు వెళ్ళు

4. ప్రశ్నలు యేవుండవు - ఎట్టి కలవరమే వుండదు
   జాతి రంగు భాష భేదము -
   కలవారెవరు లేరు - ప్రేమే పల్కున్

5. పలువిధ ప్రణాళికలు - పరిపాలించు చట్టములు
   చెరసాలలును శిక్షయు లేదు -
   నరుల పరిపాలన - అందుండదు

6. సంత వీదులు లేవు - కర్మాగారములే లేవు ధనికులు దరిద్రులు - చిన్నలు పెద్దలు -
   అను భేదము లేదు - అందరు సమం

7. యేసుని రక్తమందు - పాపం కడిగిన చేరుదువు
   ఈ గొప్పధన్యత - పోగొట్టుకొను వా -
   రెవరును కావలదు - నేడేరమ్ము
695 వాగ్దానములు పొందుడి మీలోvaagdaanamulu pondudi meelo

John 16:24

పల్లవి:
వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును
విశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు

1. ఇదివరకు మీరెవ్వరైనను - క్రీస్తు పేరట అడుగలేదుగదా
   మదినెంతో నిండు సంతోషముపొంది - అడుగుడి దొరుకు మీకు

2. తన మహిమ ఐశ్వర్యము చొప్పున - నివ్వ క్రీస్తు యేసు కోరియుండ
   మీ నేత్రములు పరమువైపు త్రిప్పి - అడుగుడి దొరుకు మీకు

3. దేవుని మందిర నిధిలోనికి - దశమ భాగములెల్ల తెండు
   దీవెనలు క్రుమ్మరించు నిక్కముగ - శోధించుడి దేవుని

4. ఆయురారోగ్య శక్తిసంపదల్ దేవుని ఉచిత కృపయేగదా
   ఆయనకు అర్పణం నర్పించి - శోధించుడి దేవుని

5. యెహోవా నాశ్రయించు వారికి - ఎట్టిమేలు కొదువై యుండదు
   యెహోవా ఉత్తముడని నమ్ముడి - రుచించి గుర్తించుడి

6. దీనుడైన నీవు మొరపెట్టగా - శ్రమలలోనుండి రక్షించెదనిన్ను
   తన నామమందు నమ్మిక యుంచి - రుచించి గుర్తించుడి

7. పాటించుము దేవుని ఆజ్ఞలన్ నీ క్షేమము గొప్ప నదివలెను
   నేటినుండి సముద్రపుటలలను - పోలి నీ నీతియుండు
696 నీతి సూర్యుండు ఉదయించుneeti sooryundu udayinchu

Malachi 4:2

పల్లవి:
నీతి సూర్యుండు ఉదయించు నిప్పుడు (2)
అతని కిరణములు ఆరోగ్యమిచ్చును (2)- రెక్కలతోనే కప్పును మనలన్ (2)
నీతి సూర్యుండు ఉదయించు నిప్పుడు (1)

1. కొలిమి కాలునట్లు కాల్చెడి దినము - తిలకించుము అది వచ్చుచున్నది (2)
   ఇల గర్విష్టులు దుష్టులెల్లరు - పాలుపొందెదరు అగ్నిగుండమున (2)

2. సైన్యములధిపతి సెలవిచ్చెను - ఖాయముచూడు నాశనదినము
   భయంకరమైనది తీర్పుదినము -చేయును నాశము రూపులేకుండ

3. దేవునికి మీరు భయపడినచో - పశ్చాతాపమొందు, పశ్చాతాపమొందు
   జీవము నొసగును సమృద్ధిగా - కరమునిచ్చి మిమ్ముకాపాడును

4. ప్రభు నియమించిన ఆ దినమురాగ - ప్రభు ప్రజలందరు తన సొత్తగుదురు
   ప్రభు కరుణించును పుత్రులుగా - అధికారమిచ్చును స్వాస్థ్యము నొసగి

5. క్రీస్తుని ప్రేమ అమూల్యమైనదియు - నిత్యము నిల్చెడి ఆత్మీయమైనది
   దుష్టులకొరకై ప్రాణమిడె - క్షమాపణ నొసగి విమోచించుతానే

6. ప్రభు ప్రజలారా శత్రుని తలను - విభుని సాయమున అణగద్రొక్కెదరు
   శత్రువులందరు దూళి అగుదురు - విజయానందము మీరు పొందెదరు

7. మరువకుడి ప్రభు మాటలెన్నడు - స్థిరముగనుండి సిద్ధపడుడి
   త్వరగా మహిమతో ప్రభు వచ్చున్ - పరమున మిమ్ము తనతోనుంచును
697 నీతి సూర్యుడు నీపై నుదయించునుneeti sooryudu neepai nudayinchunu

Malachi 4:2

పల్లవి:
నీతి సూర్యుడు నీపై నుదయించును -
అతని రెక్కలు నారోగ్యము నిచ్చును (2)

1. పాపపు టంధకారమందుంటిమి - శాప శిక్షపొంద తగియుంటిమి (2)
   దాపున జేరిన నీతి సూర్యుడు (2) - నీపై ప్రకాశించు నిత్యము (2)

2. కృపయు సత్యము యేసుద్వార కల్గెన్ - కృపనుబొందగ వేగమే రారమ్ము
   అపరిమిత కృపనుండి నీవు - కృపవెంబడి కృప బొందెదవు

3. వారాయన తట్టు తేరిచూడగా - వారి ముఖము బహు ప్రకాశించెను
   పరమ ప్రభును చూడు నీతి సూర్యుని - కిరణంబులు వెల్గునిచ్చును

4. మందిరమంత యెహోవా తేజస్సు - అందరు చూడ నిండి యుండెను
   సుందరమగు క్రీస్తు తేజస్సును - పొంది యారాధించి స్తుతించు

5. తన మహిమకు రాజ్యమునకును - మనలను పిలిచిన దేవునికి
   వినయముతోడ విధేయులమై - నడుచుకొందుము నిత్యము
698 ప్రభువైన క్రీస్తుని దినమందుprabhuvaina kreestuni dinamandu
పల్లవి:
ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు (2)
అభయులై నిరపరాధులై యుందురు (2)

1. అంతము వరకు స్థిరపరచు నాయనే (2)
   ఎంతైన నమ్మదగి యున్నవాడు - స్తుతికి పాత్రుండు (2)

2. శోధనలచే క్రుంగియున్న మీకు
   బాధలలో శాంతిని యిచ్చువాడు - ఓదార్చువాడు

3. గత జీవితములో తప్పిపోతి రెంతో
   మితిలేని దేవుని వాత్సల్యత - ఎప్పుడు తప్పిపోదు

4. అవిధేయులై బహు దుఃఖపెట్టితిరి
   దేవుని కనికరమెంతో గొప్పది - విడిచి పోనిది

5. మీ జీవితములలో వాగ్దానములను
   సజీవమౌ విశ్వాసము పొంది - చేపట్టుకొనుడి
699 యేసుని నిత్యము స్తుతియించెదముyesuni nityamu stutiyinchedamu

Malachi 3:6

పల్లవి:
యేసు మారడు - యేసు మారడు - విశ్వమంత మారినను - మాటతప్పడు (2)

1. యేసుని నిత్యము స్తుతియించెదము - భూమి ఆకాశము సృజించినాడు (2)
   మనలో దేవుని సంకల్పము - యేసుని బయలు పరచుటయే (2)

2. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో - అందరిని ప్రభు నిర్ణయించెను
   పొందుగ పిలిచి నీతిగా తీర్చె - సుందరముగా మహిమపర్చు || యేసు ||

3. చేసెను మనలను తన రూపమున - బాసెను పాపముచే నా రూపం
   యేసులో నొసగె మరల మనకు - వాసిగ కాచును పుత్రులుగా || యేసు ||

4. దేవుని ప్రేమించువారందరికి - భువిలో జరుగునన్ని మేలుకై
   కావవి ఎన్నదగిన శ్రమలు - భావి మహిమతో పోల్చుటకై || యేసు ||

5. శ్రమయు బాధ హింసయైనను - కరువు వస్త్రహీనతయును
   ఉపద్రవమైనను ఖడ్గమైనను - ఎడబాపునే ప్రభు ప్రేమనుండి || యేసు ||

6. మరణము జీవమైనను - దేవదూతలు ప్రధానులు
   అధికారులు మరి ఎవరైనను - ఎడబాపరు ప్రభు ప్రేమనుండి || యేసు ||

7. ఆనాది దేవుని ఆ సంకల్పం - మనలో ప్రభుని బయలుపరప
   మనవలెను మనపాపములు - పూనికతో పూర్ణ ఐక్యతకు || యేసు ||
700 అనాది దేవుడు ఆశ్రయముanaadi devudu aashrayamu

Deut 33:27

పల్లవి:
అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే (2)

అను పల్లవి:
నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు -
మరణము వరకు మమ్ము నడిపించును (1) || అనాది ||

1. కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ (2)
   ఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్ (1)

2. అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతి
   దుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్

3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమ
   నీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును

4. ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనే
   కారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే - దొరుకును నెమ్మది నీకు

5. ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనే
   శాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్

6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే
   సీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు
701 యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొనిyesuni vaagdaanamul jnyaapakamunandunchukoni

Matthew 14:27

పల్లవి:
యేసుని వాగ్దానముల్ - జ్ఞాపకమునందుంచుకొని (1)
తుఫాను వీచిన శ్రమలున్న (1) - నా చాటున నేనుండెద (2)
యేసుని వాగ్దానముల్ (1)

1. ద్వేషము ఈర్ష్య లోకములో - అత్యధిక ప్రేమ నీలో (2)
   అంధకారపు లోకములో (2) - నీవే దివ్యజ్యోతివి (2)
   అంధకార పాపమందు - నీవే సత్యమార్గము (2)
   భరియింప రాని మరణపు బాధలో (2) - నీవే సత్యదేవుడవు (2)

2. శక్తిహీనుడనై యుంటి - నీవే నాదు సహాయుడవు
   కృంగియున్న సమయములో - తండ్రిగ కౌగిట చేర్చితివి
   నిత్యజీవిత వసరములను - తీర్చువాడవు నీవేగా
   బాధలోహింస శ్రమలయందు - నిత్యము ఆనందింతును

3. జగమున యుద్ధ కలహములు - శాంతిలేనే లేదచట
   యేసు ప్రభువా నీ ద్వారా - ఆనందభరితుడ నైతిని
   ఘోరమౌ తుఫాను లేవ - హృదయము కంపించెను భీతిన్
   భయపడకుడని ప్రభువే పల్క - నిమ్మళించెను తుఫాను
702 పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్paravaasini ne jagamuna prabhuvaa nadachuchunnaanu naa daarin

Psalm 39:12

పల్లవి:
పరవాసిని నే జగమున ప్రభువా (2)- నడచుచున్నాను నీ దారిన్ (1)
నా గురి నీవే నా ప్రభువా (2)
నీ దరి నే జేరెదను - నేను నీ  దరి నే జేరెదను (1)

1. లోకమంతా నాదనియెంచి (2) - బంధుమిత్రులే ప్రియులను కొంటిని (2)
   అంతయు మోసమేగా (2)
   వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును (1)

2. ధన సంపదలు గౌరవములు - దహించిపోవు నీలోకమున
   పాపము నిండె జగములో
   శాపము చేకూర్చుకొనె - లోకము శాపము చేకూర్చుకొనె

3. తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు యెంతో
   తెలుపుము యెంత అల్పుడనో
   విరిగి నలిగి యున్నాను - నేను విరిగి నలిగి యున్నాను

4. ఆ దినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితిని
   క్షమాపణ పొందితివనగా
   మహానందము కలిగె - నాలో మహానందము కలిగె

5. యాత్రికుడ నే నీలోకములో - సిలువమోయుచు సాగెదనిలలో
   అమూల్యమైన ధనముగ
   పొందితిని నేను - యేసునే - పొందితిని నేను

6. నా నేత్రములు మూయబడగ - నాదు యాత్ర ముగియునిలలో
   చేరుదున్ పరలోక దేశము
   నాదు గానము యిదియే - నిత్యము నాదు గానము యిదియే
703 ప్రభువా నీవే నమ్మకమైన సామర్ధ్యుడవుprabhuvaa neeve nammakamaina saamardhyudavu
పల్లవి:
ప్రభువా నీవే నమ్మకమైన సామర్ధ్యుడవు (2)
ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడ (2)

1. ఇహపరమందు - నివసించువారు - నీ నామమున మోకరింతురు (2)
   మహిమ పరతురు దేవుని (2)
   అంగీకరించు - ప్రతివాని జిహ్వ - నీవే క్రీస్తువనుచు (2)

2. అపారమైన - క్రియలు చేయుచు - మమ్మెల్ల పరిపాలించుచున్నావు
   ప్రేమ గల ప్రభువా
   పాపిని రక్షింప - యిహమున కరిగి - గొప్ప రక్షణనిచ్చె

3. ఐగుప్తు నుండి - విడిపించిన వారిని - నలువది వత్సరములు నడిపించితివి
   కాచితివి కనుపాపగ
   ఉంచియున్నావు - మాదిరిగా వారిన్ - నీ ఆలోచన గొప్పది

4. పరమును తెరచి - మన్నా కురిపించి - అందరికి జీవజలమిచ్చితివి
   పొందిరి తృప్తి నీయందు
   అగ్ని స్తంభము - మేఘ స్తంభమును - నిత్యము నడిపించును

5. తుఫానురేగి - నిరాశపరచ - శత్రువు మా మధ్య చెలరేగగ
   మమ్ములను రక్షించితివి
   వాగ్దానములు - నెరవేర్చి నీవే - స్వాస్థ్యము నిచ్చితివి
704 దేవుని కృప నిత్యముండునుdevuni krupa nityamundunu

Psalm 136:1

పల్లవి:
దేవునికృప నిత్యముండును - ఆయన కృప నిత్యముండును -
స్తోత్రముచేసి స్తుతించి పాడి - హల్లెలూయా ఆర్భాటింతుము (2)

1. ఇరుకునందు నశింపకుండ - ఇంత వరకు కాచె మమ్ము (2)
   ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు - ఆయన కృప నిత్యముండను (2)

2. శత్రు సేనలు చుట్టుముట్టిన - దావీదు భక్తునిగాచిన దేవుడు
   ముందు నడచును ఆయన బలవంతుడు - ఆయన కృప నిత్యముండును

3. అగ్నిశోధన మనకు కలిగిన - ఆదరించి విజయమిచ్చి
   ఆర్భాటముతో మమ్ము నడిపించును - ఆయన కృప నిత్యముండును

4. గాఢాంధాకార లోయలో నడచిన - నా పాదములకు దీపమై యుండి
   నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడు - ఆయన కృప నిత్యముండును

5. నీచులెందరో అపహసించిన - నెహెమ్యాకు తన ఆత్మనొసగె
   నిరతము మనకు ధైర్యము నిచ్చు - ఆయన కృప నిత్యముండును

6. నిత్యదేవుడు సత్యవంతుడు - నిత్యము మనకు జయమునిచ్చి
   ఉత్సాహముగా మము నడిపించెను - ఆయన కృప నిత్యముండును
705 ఉన్నత దుర్గము నా దేవుడేunnata durgamu naa devude

Psalm 18:2

పల్లవి:
ఉన్నత దుర్గము నా దేవుడే (2)- నా రక్షకుడే నాకాశ్రయుడు (2)

1. యెహోవా మహాత్మ్యము - ఎంతో గొప్పది (2)
   అధిక స్తోత్రములకు - పాత్రుండాయనే (2)
   ఆ ప్రభు ఐశ్వర్యము - గ్రహింపశక్యము కానిది (2)

2. నా కోటయు నాశైలము ఆయనే
   నాకేడెము రక్షణ శృంగమును
   ఉన్నతమగు దేవుడే - నా కాశ్రయ దుర్గము

3. నా ప్రియ ప్రభువు - దవళవర్ణుడు
   రత్నవర్ణుడు - నా కతి ప్రియుడు
   పదివేల మందిలో - అతని గుర్తించెదను

4. నిత్యజీవము - మెండుగ నొసగి
   పరమాహారము - తృప్తిగ నిచ్చె
   నిరతము తన కృపతో - నిలుపుకొనెను స్తోత్రము

5. విజయ గీతము - పాడెద ప్రభుకే
   విజయము నిచ్చెను - శత్రువు పైన
   ఉన్నత దుర్గముపై - నెక్కించెను స్తోత్రము

6. మహిమ పూర్ణుడు - నా ప్రభుయేసు
   ఇహకేతెంచును - నాకై త్వరలో
   హల్లెలూయ స్తోత్రముల్ - పాడి ప్రహర్షింతును
706 మిమ్మును నింపె మేలులతోడmimmunu nimpe melulatoda

Psalm 68:19

పల్లవి:
మిమ్మును నింపె మేలులతోడ - అవియేపరలోక దీవెనలు (2)

1. ఆయన మందిరమందే మీకు (2)
   అధిక దీవెనలు దొరుకును ఎన్నో (2)
   తన మందిర సమృద్ధిని పొంది (2) - త్రాగుడి జీవజలములను (2)

2. మీ పాపములను పరిహరించును ప్రభు
   మీకు విమోచన తనయందే కలదు
   సత్యుని కృపామహదైశ్వర్యముతో - సంతోషించుడి మీరు

3. తన రక్తముతో విమోచించిన
   వారికి ప్రభువు యిచ్చును స్వాస్థ్యము
   తేజోవాసులు పరిశుద్ధులతో - పాలివారినిగా చేసె

4. ప్రభు యేసు నెందరు స్వీకరించెదరో
   నిత్యజీవమును స్వతంత్రించుకొని
   పరిశుద్ధాత్మ వరమునుపొంది - ఆత్మలో ఆనందించెదరు

5. మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువు
   మునుపటికన్న హెచ్చుగా నిచ్చి
   మీతో నుండగోరెను నిత్యము - పొందుడి ప్రభు దీవెనలు

6. ఆయన కృపలో వర్థిల్లినచో
   అనుదినము ప్రభు మిము దీవించును
   తన కృప మిమ్ము ఆవరించును - ఆనందించుడి కృపతో

7. జయ జీవితమును కలిగినవారే
   తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు
   విశ్వాసముతో విజయముపొంది - పాడుడి హల్లెలూయ ప్రభుకే
707 యేసే మనకిల స్వాస్థ్యముyese manakila svaasthyamu

Ezekiel 44:28

పల్లవి:
యేసే మనకిల స్వాస్థ్యము - వేరే  స్వాస్థ్యము లేదికను (2)

1. అక్షయమును నిర్మలమైన - వడబారిన స్వాస్థ్యము మనకు (2)
   కరుణతో నోసగెను దేవుడు - హర్షముతో స్తుతియించెదము (2)

2. మనము క్రీస్తుని సంబంధులము - వాగ్దానంతో వారసులముగా
   చేయబడితిమి స్థిరముగా - చేతులెత్తి పూజించెదము

3. దేవుని సంకల్పమును బట్టి - మనలను ముందే నిర్ణయించి
   మనకొక స్వాస్థ్యము నేర్పరచెన్ - మనసారా మరి పాడెదము

4. పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను - పాలుపొందుటకు పాత్రుల జేసిన
   పరమ తండ్రికి స్తోత్రములు - నిరతంబును చెల్లించెదము

5. క్షేమమును మరి అభివృద్ధియును - కలుగ జేయుటకు శక్తిమంతుడు
   స్వాస్థ్యము నిచ్చిన దేవునికి హల్లెలూయా పాడెదము
708 యెహోవాయె మనకందరికి ఎన్నియో మేలుల జేసెన్yehovaaye manakandariki enniyo melula jesen

Isaiah 63:7

పల్లవి:
యెహోవాయె మనకందరికి - ఎన్నియో మేలుల జేసెన్
తన కృప కనికరముల్ - స్మరియించి స్తుతించెదము
యెహోవాయె మనకందరికి

1. మన మాయన జనము - ఆయన సంతతియు (2)
   సిలువ మరణముద్వారా మనకు - తనదు జీవమునిచ్చె (2)
   ఎంత అద్భుత రక్షకుడు (2)

2. అడుగువాటికంటె - అధికముగ నిచ్చె
   తన నిబంధనను స్థిరపరచి - తన వాక్కులు నెరవేర్చె
   మాట తప్పనివాడవు

3. కష్టదుఃఖములందు - పాలివాడాయె
   ప్రేమనుజూపి ప్రభువే మనల - తన రెక్కలపై మోసె
   మనతో నుండును నిరతము (2)

4. ఎన్నిసార్లు ప్రభుని - దుఃఖపరచితిమి
   అయినను ప్రభువే తన దయజూపి - మనలన్ క్షమియించెనుగా
   ప్రేమగల మా తండ్రివి

5. నీవే మా దుర్గమును - కేడెము నీవే
   నిన్ను మేము నమ్మియున్నాము - మాకు సర్వము నీవే
   మేము నీదు ప్రజలము
709 మమ్మున్ సృజించిన దేవుండుmammun srujinchina devundu

Psalm 144:1

1. మమ్మున్ సృజించిన దేవుండు - ప్రాణము
   నొసంగి యెప్పుడు - కాపాడు మమ్మును
   సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్

2. పలువిధాలుగా - బాధించు రోగముల్
   పోఁగొట్టి మీదను - రాకుండఁజేసెను
   సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్

3. దేవుండు మాత్రమే - రక్షణ మార్గము
   నాయత్తపరచి - చూపించె మాకును
   సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్

4. మా నిత్యబాధలు - వారించుకొరకుఁ
   దా సొంత పుత్రుని - బంపెన్ సు ప్రేమతోసంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్

5. ఆనందమొందుడి శ్రీ యేసే మోక్షము
   సర్వజనాళికి - ననుగ్రహించును
   సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్
710 శ్రీ యేసు రాజ్యముండునుshree yesu raajyamundunu

Psalm 145:13

1. శ్రీ యేసు రాజ్యముండును - సూర్యుండు వెల్గు చోటెల్ల
   కల్పాంత కాలమౌదాక - యా రాజ్యము వ్యాపించును

2. నిరతంబు ప్రార్థనల్ - నిత్యస్తుతుల్ శ్రీ యేసుకు
   తన్నామము ప్రత్యహము - సుగంధమట్లు లేచును

3. సమస్తదేశవాసులు - గణింతురేసు ప్రేమను
   శ్రీ యేసు పేరు బాలకుల్ - బాల్యంబున స్తుతింతురు

4. యేసుని యీవు లొల్కును - ఖైదీకి సంకెళ్ళూడును
   డాయంగ శాంతి కల్గును - సుభాగ్య మబ్బుఁపేదకున్

5. శ్రీ యేసు శక్తిచేతను - స్వస్థంబు గల్గు నెల్లడన్
   దచ్ఛక్తియున్న మేరలను - నశించు మృత్యుశాపముల్

6. మా రాజు మాకెల్ల సృష్టియున్ - విశేషస్తుతుల్ సల్పుతన్
   దూతాళి మళ్ళి పాడఁగా - ఘోషించు భూమియు ఆమేన్
711 యేసు నీతి రక్తమేనుyesu neeti raktamenu
పల్లవి:
క్రీస్తు యేసు నాదు బండ - మిగతా యంత యూబియే

1. యేసు నీతి రక్తమేను నా నిరీక్షణంతయును
   నే వేరెవ్వని నమ్మను యేసు నామము మాత్రమే

2. క్రీస్తు మోము మరుగైన తన కృపయే నాదగు
   అల్లలాడు అలల్ లేవన్ నాదు లంగరు నిల్పెదన్ || క్రీస్తు ||

3. అతని వాగ్దాన మేను నన్ను బలపరచును
   ఎల్లవారు ఓడినను అతడే నా నిరీక్షణ || క్రీస్తు ||

4. బూరధ్వనితో రాగన్ ఆయనయందు నిలిచియుందున్
   ఆయన నీతినే దాల్చి గద్దెదుటనుందు నిర్దోషినై || క్రీస్తు ||
712 యేసూ! నీరక్త నీతులు నా సొంపుyesoo! neerakta neetulu naa sompu

Romans 5:9

1. యేసూ! నీరక్త నీతులు - నా సొంపు, నాదువస్త్రము
   వీనన్ ధరించి, మెండు నీ - ధరన్ దిరంబునుందున్

2. ధైర్యాన నిల్తునీ నాడు - నన్నెవరు నింద పర్తురు?
   పాపంబునుండి ముక్తుడన్ - నైతి వీనివల్లను

3. యుగాలు దాటి నన్నదా - ఈ నిష్కళంక వస్త్రము
   ఇట్లుండు, రంగుమారదు - నీ వల్ల యంచుదెల్లగా

4. మృతుల్ నినున్ వినంగ నీచ - పాపుల్ సంతోషమొందనీ
   యేసూ నీ రక్త నీతులు - నీవు వారి సొంపు వస్త్రము

5. పరాన నింటి కోసము - నే ధూళినుండి లేవగా
   నటన్సహ నా పాటిదే 'యేసు నాకోస మీల్గెను
713 యేసు నావాడని నమ్ముదున్yesu naavaadani nammudun
పల్లవి:
ఇదే నా పాట నా సుకథ యేసుని సదా స్తుతించుట
ఇదే నా పాట నా సుకథ యేసున్ నిత్యము ధ్యానించుట

1. యేసు నావాడని నమ్ముదున్ - ఎంతెంతో దివ్య సౌభాగ్యము
   దాసుడనౌచు పాల్పొందెదన్ నాశంబులేని సౌఖ్యంబును

2. సంపూర్ణ భక్తితో నుండెదన్ - పెంపార యేసును ధ్యానించెదన్
   సొంపైన దూతల్ బల్కుచుండన్ - ఇంపైన మాటల్ నే విందున్ ||ఇదే నా ||

3. నిండైన భక్తియే నెమ్మది నిల్చునదేమి యేసుండగ
   మెండైన దీప్తిన్ బ్రార్థించుచు - దండిగ బ్రేమన్ సుఖింతును ||ఇదే నా ||
714 శృంగార దేశము చేరగానేshrungaara deshamu cheragaane
పల్లవి:
ఇదే నాకు ఆనందము ఆనందము ఆనందము
నేను ఆయనను జూచుటయే ఇదే నాకు పరమానందము

1. శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నియుపోవున్
   యేసుని యొద్దను నిత్యము నే - నుండుట మిక్కిలి యాశ్చర్యము

2. అమితమైన కృపవలన నన్ను స్వర్గంబున జేర్చుదురు
   అచ్చోటనుండి యేసుని గాంచి - స్తుతికీర్తనలు పాడుదును || ఇదే నా||

3. నేను ప్రేమించు స్నేహితులను అక్కడజూచి సంతోషింతును
   నా యేసు ముఖము చూచుటయే - నిత్యము నాకది యానందము || ఇదే నా||

4. ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు - కండ్లతో చూడక పోయినను
   యేసుని మాటలు గైకొనుచు - నాత్మతో చూచి సంతోషింతును || ఇదే నా||
715 యేసుని చేతులందుyesuni chetulandu
పల్లవి:
యేసుని చేతులందు - యేసుని రొమ్మునన్
నాకు నభయమందు - నందె పరుండెదన్

1. యేసుని చేతులందు - యేసుని రొమ్మునన్
   నాకు నభయమందు - నందె పరుండెదన్
   దూతలు పాడుచుండు - పాటను వింటివా
   నాయన యందుండి - పొందు సుఖంబహా!

2. యేసుని చేతులందు మిక్కిలి క్షేమము
   ఏ దుఃఖబాధలైన నచ్చోట చేరవు
   పాపపు భీతి బాధలంటవు నన్నిటన్
   కన్నీరు సందియంబుల్ - కొన్ని దినాళ్ళిటన్ || యేసు ||

3. యేసే నా యాశ్రయంబు - నాకై చావొందెగా
   గొల్గోతయందు నుండు - నా గురి సర్వద
   చీకటి దాటుదాక - నోర్పుతో నుండెదన్
   జేరెద నింక నాక - మంచును నమ్మెదన్ || యేసు ||
716 అంత్యదినమందు దూతantyadinamandu doota
పల్లవి:
నేను కూడ - చేరి యుందున్
నేను కూడ - చేరి యుందున్
నేను కూడ - చేరి యుందున్నే
నేను కూడ - చేరి యుందున్ నచ్చటన్

1. అంత్యదినమందు దూత బూర నూదుచుండగా
   నిత్యవాసరంబు తెల్లవారగా
   రక్షణందుకొన్నవారి పేర్లు పిల్చుచుండగా
   నేను కూడ చేరియుందు నచ్చటన్

2. క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతో
   పాలుపొందునట్టి యుదయంబునన్
   భక్తులారా కూడిరండి యంచు బిల్చుచుండగా
   నేను కూడ చేరి యుందు నచ్చటన్ || నేను ||

3. కాన యేసుసేవ ప్రత్యహంబు చేయుచుండి నే
   క్రీస్తు నద్భుతంపు ప్రేమ చాటుచున్
   కృపనొందు వారి పేర్లు యేసు పిల్చుచుండగా
   నేను కూడ చేరియుందు నచ్చటన్ || నేను ||
717 ఓహో! యెరూషలేమాoho! yerooshalemaa

Hebrews 11:10

1. ఓహో! యెరూషలేమా - బంగారు పట్నమా
   నీయందు దృష్టి క్షేమ - మింపార నుండుగా
   ఆ కాంతి సంబరమ్ము - ఏ కన్ను కాంచెను
   జీవంపు భోజనము నీతోను తిందుము

2. సీయోను కొండపైన దూతాళి భక్తులు
   ఆ రక్త సాక్షులైన - వారెల్ల బాడుచు
   ఆ నిత్య కాంతిలోను - మహా ముదంబుతో
   శ్రీ యేసు క్రీస్తుతోను - సదా సుఖింతురహో

3. విముక్తులైనవారు - శ్రీ యేసుతోడున
   జయంబు గొన్నవారు - నిత్యంబు నందున
   శ్రీ యేసు గద్దెచుట్టి - తెల్లంగి ధారులై
   కీర్తించి కేలుతట్టి - హర్షింతు నిత్యులై

4. ఓ దివ్య పట్టణంబ విశ్రాంతి స్థానమా
   భక్తాళి వాంఛితంబ - ఆశింతు నిన్ సదా
   ఓ యేసు నన్నుగూడ - అచ్చోట జేర్చుము
   ఆ భాగ్యమేను జూడ - స్తోత్రింతు నెన్నడు
718 శ్రీ యేసు స్వామిshree yesu svaami

Acts 2:33

1. శ్రీ యేసు స్వామి తిరిగి - మోక్షంబు జేరగా
   ఒక్కాదరణ కర్తను - వొసంగెను

2. ఆ దేవునాత్మ ప్రీతిగా - మదిన్ వసించును
   విధేయులైన మనలన్ - బాలించును

3. సద్గుణమున్న మనకు - ఆ యాత్మ దానమ
   శోధించు దుష్టుని సహా - జయించును

4. ఓ దేవునాత్మ మమ్మును - విశుద్ధి పర్చుము
   మా హృదయంబులో సదా - వసించుము
719 యేసు నిన్ను జూతుyesu ninnu jootu

Psalm 27:4

1. యేసు నిన్ను జూతు నిందుదేటగా - అగోచరార్థముల్ నే ముట్టుదున్
   కృపన్ నేబట్టుకొందు గట్టిగా - నీ మీద వేయుదున్ నా భారము

2. నే దైవాహార మిందె తిందును - ఆత్మీయ ద్రాక్షాపాత్ర త్రాగుదున్
   భూ భారముల్ నేబార వేయుదున్ - క్షేమా సౌక్యంబు గల్గుకొత్తగా

3. సంగీత భోజనాల కాలము - ప్రభుండు నాకై బల్ల వేసెను
   విందారగించుచున్ నీతోడినా - మాధుర్య స్వల్ప మైత్రిన్ బెంచుదున

4. సాయంబీవే వేరే నాకెందుకు? - వేరే చేయి మీద నాను కొనను
   ప్రభూ నిజంబుగా నీదే చాలున్ - నీ శక్తిలోనే నా బలముండున్

5. పాపంబు నాది నీతి నీదేగా - నేరంబునాది శుద్ధి నీదేగా
   నీ రక్తనీతియే నా వస్త్రముల్ - నా కాశ్రయంబు శాంతిస్థితులు
720 నేనే భయపడ వలదనిnene bhayapada valadani

2 Peter 1:3

పల్లవి:
నేనే భయపడ వలదని పలికెను - మన రక్షకుడు యేసుప్రభు (2)

1. తన సమాధానము నీ కిచ్చి - కృపల నెన్నో చూపెనుగా (2)
   తనివి తీర స్తుతి చెల్లించుము - తనదు ప్రేమదయకొరకు (2)

2. శాశ్వతంబగు జాలిజూపి - శాశ్వతరక్షణ నొసగి
   విశ్వాసముతో నిలచిన యెడల - శాశ్వత రాజ్యం బొసగు

3. నరుడుకాడు దేవుడతడు - నరుడు ఆయెను నీ కొరకు
   కరుణతో నిను రక్షించుటకు - సర్వమిచ్చెను శ్రీ యేసు

4. మరణించెను ప్రభు నీ కొరకే - తిరిగి లేచెను కాపాడన్
   త్వరగ వచ్చును కనిపెట్టుము - నిరతమాయనతోనుండ

5. ఎంత పాపివైన నిలలో - చింత లేదిక నమ్మినచో
   వింత రక్షకుడేసు ప్రభువు - స్వంత ప్రాణమునర్పించె

6. నీదుయాత్రలో బలమిచ్చుటకు - తనదు దేహరక్తమును
   ముదముతో అర్పించిన ప్రభుకే - హల్లెలూయా పాడుము
721 ప్రియయేసు రాజునునే చూచినpriyayesu raajunune choochina

Psalm 17:15

పల్లవి:
ప్రియయేసు రాజునునే చూచిన చాలు  - మహిమలో నేనాయనతో నుంటే చాలు (1)
నిత్యమైన మోక్షగృహమునందు చేరి - భక్తుల గుంపులో హర్షించిన చాలు (2)

1. యేసుని రక్తమందు కడుగబడి - వాక్యముచే నిత్యం భద్ర పరచబడి (2)
   నిష్కళంక పరిశుద్ధులతో పేదన్ నేను (2)
   బంగారు వీధులలో తిరిగెదరు (2)

2. దూతలు వీణులను మీటునపుడు - గంభీర జయధ్వనులు మ్రోగునపుడు
   హల్లెలూయ పాటలు పాడుచుండ
   ప్రియ యేసుతోను నేను యుల్లసింతున్

3. ముండ్ల మకుటంబైన తలను జూచి - స్వర్ణకిరీటం బెట్టి యానందింతున్
   కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి
   ప్రతియొక్క గాయమును ముద్దాడెదన్

4. హృదయము స్తుతులతో నింపబడె - నా భాగ్య గృహమును స్మరించుచుంటే
   హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
   వర్ణింప నా నాలుక చాలదయ్యా

5. ఆహా యా బూర యెపుడు ధ్వనించునో - ఆహా నాయాశ యెపుడు తీరుతుందో
   తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో
   ఆశతో వేచియుండె నా హృదయం
722 లెండీ, రండీ, భావిమహోన్నతlendee, randee, bhaavimahonnata

Colossians 1:27

పల్లవి:
లెండీ, రండీ, భావిమహోన్నత సాక్షులారా లెండీ (2)

1. యుగాల పాపముల శ్రంఖలాలు తెగితేలే (2)
   తరతరాల అపవాది తంత్రముల్ - సిలువరక్తముచే తరలిపోయెగా (2)

2. మహిమైశ్వర్యముతో మనలను పిలిచె ప్రభువు
   మహిమ రాజ్యముకు పిలిచిన ప్రభుకు - తగినట్లుగా నడచుకొనెదము

3. మనయందే క్రీస్తు మహిమ నిరీక్షణాయె
   సిగ్గుపరచదు ఈ నిరీక్షణ - పరిశుద్ధాత్మచే మనలో వసించె

4. నిరీక్షణ స్థిరము మన ఆత్మకు లంగరుగా
   శరణాగతులమైన మనకు - వాగ్దానమును స్థిరపరచె గదా

5. లూకాశల విడిచి శుభప్రద నిరీక్షణతో
   క్రీస్త్రు మహిమ ప్రతక్షత కొరకు - ఎల్లప్పుడును ఎదురు చూచెదము
723 యేసుప్రభువే మహిమ నిరీక్షణ మనలో వున్నాడుyesuprabhuve mahima nireekshana manalo vunnaadu

Hebrews 6:19

పల్లవి:
యేసుప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు (1)
జయధ్వనులతో హర్షించెదము (2) - ప్రభువే నిరీక్షణ (2)

1. ఈ నిరీక్షణచే రక్షణకలిగె విడిపించెను మనల (2)
   జీవపు నిరీక్షణ మనకిచ్చుటకు క్రొత్తజన్మను నొసగె (2)

2. మనలనెంతో ప్రేమించి ప్రభువు శుభనిరీక్షణ నిచ్చె
   అనంతకాల దయను జూపి ఆయనే స్థిరపరచెన్

3. క్రీస్తేసే మనకు సర్వాధికారి మనమాయన గృహము
   అంతమువరకు స్థిరముగ నిలిచి మనమానందింతుము

4. ఈ నిరీక్షణను కలిగినవారే శుద్ధిపరచుకొందురు
   సరిజేసికొనుడి ఆయనతో కూడ సమానులగునట్లు

5. ప్రభువుయిచ్చిన ఈ నిరీక్షణ లంగరువంటిది
   నిశ్చలముగా స్థిరముగ మిమ్ము ప్రభుచెంత చేర్చునుగా

6. ప్రభు యేసు మహిమతో - వచ్చునప్పుడు మనలను కొనిపోవును
   శుభప్రదనిరీక్షణ కలిగిన మనము ఎదురుచూచెదము
724 ప్రభూ నీ వాడను నీవుprabhoo nee vaadanu neevu
పల్లవి:
Prabhu nee vadanu neevu naa prabhudavani nee korakai jeevintunu (1)
Migili na jeevitamunu nee korake gadipedanu (2)

1. ప్రభు వా యెరిగితిని లోకమంత మోసమని (2)
   చూపితివి సమాధాన నిరీక్షణ నా కిలలో (2)
   కృతజ్ఞత కలిగి (2) - నీవైపే చూచెదను (1)
   నీయందే నిలిచి యుండి నీయాజ్ఞల పాలింతును (2)

2. నా ముందు నడిచే ప్రభూ నిన్ను వెంబడించెదను
   నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును
   నెమ్మదిని పొంది యిల - కన్నీరు కార్చనిక
   నీవే నా సర్వమని నీయందే బలపడెద

3. యేసుని సిలువజూచి విజయమును పొందెదను
   సహింతును సంతసముగ నీ కొరకు అన్నింటిని
   నిన్ను నే నమ్మెదను - నీతోనే సాగెదను
   నీ రెక్కలచాటు నేనుండ భయపడను

4. మరణనది యొద్దకు సంతసముగ వచ్చెదను
   మృత్యువు బారినుండి జీవమునకు దాటింతువు
   రక్షకుని చూచెదను - నన్నాయన చేర్చుకొనున్
   తక్షణమే తన రూపమునకు మార్పుచెందెదను

5. అగమ్య జ్యోతియందు ఘనముగ నే ప్రవేశించి
   దూతలు, పరిశుద్ధులు, భక్తులనే చూచెదను
   నే సంతసించెదను - ప్రభువుతోడ నుండెదను
   నిరీక్షణ యిదియే ఆయనతో నేనుందును
725 పరలోకము నా దేశముparalokamu naa deshamu
పల్లవి:
పరలోకము నా దేశము - పరదేశి నేనిల -
మాయలోకమేగా - నేను యాత్రికుడను (2)

1. ఎంతో అందమైనది పరలోకము -
   అసమానమైనది నా దేశము (2)
   ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2)

2. దూతలు పాడుచుందురు పరమందున -
   దీవారత్రములందు పాడుచుందురు
   పావనుని చూచి నేను హర్షింతును నిత్యము

3. రక్షకుని చెంతకు యెప్పుడేగెదన్ -
   వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని
   కామ్కించెద నా మదిలో ఆయన చెంతనుండ

4. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళెదన్ -
   అగుపడు చున్నది గమ్యస్థానము
   అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్

5. నిత్యానంద ముండును పరమందున -
   నీతి సమాధానము ఉండునచ్చట
   పొందెదను విశ్రాంతిని - శ్రమలన్నియు వీడి
726 నా కోరికలు తీరిపోయెnaa korikalu teeripoye

Matthew 14:20

పల్లవి:
నా కోరికలు తీరిపోయె ప్రియ యేసులో (2)
నా ప్రాణప్రియుని యందు అవి తీరుచున్నవి (2)

1. పెంటగ కనుపించె ఈ లోకమంతయు (2)
   ప్రభుని చూడ నా హృదయము ఆశపడినది (2)

2. తీర్చును ఆకలిని జీవాహారంబుతో
   తృప్తిని యిచ్చినాకు తన శాంతి నొసగును

3. తీర్చును నా దాహమును జీవజలంబుతో
   నీరుకట్టిన తోటవలె వృద్ధి చేయును

4. బలహీనతలయందు తన బలమునిచ్చును
   కొల్లగ శక్తి నిచ్చి విజయముతో నడుపును

5. నిరీక్షణను కలిగి స్వాస్థ్యమును పొందెదన్
   నను పుత్రునిగా జేసి ఆనంద మొసగెను

6. వెలిగించె ప్రభువు నన్ను ఆత్మీయముగను
   విలువైన నగరమందు నన్నుచేర్చుకొనును
727 ఎదురు చూచెదము దృఢపునాదిeduru choochedamu drudhapunaadi

Hebrews 11:10

పల్లవి:
ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టణమునకై -
దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు - మన ముల్లసించెదము (2)

1. ఆ నగరములో ప్రభుమహానీయుడు - స్తుతులకు పాత్రుడుతానే (2)
   దేవుడా పట్టణమందున గలడు - కదలడు ఎన్నటికిన్ (2)

2. దృఢముగానున్న దేవుని నగరుకు - చుట్టు ప్రాకారము గలదు
   తన సింహాసనమందున గలడు - రాజాధి రాజాయనే

3. ప్రభు పట్టణమున నిత్యసంతోష - శాంతి విజయములు గలవు
   నీతిమంతులు సదాస్తుతులు పాడెదరు - ప్రభువారితోడ నుండ

4. జయవంతు లందరు ఆ నగరమున - నిత్యము నివసించెదరు
   భూమి పునాదులు వేయకమునుపే వారికై సిద్ధపరచెన్

5. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు
   వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందుము"
728 ప్రభురాజ్యం నిశ్చలమైనదిprabhuraajyam nishchalamainadi

Hebrews 12:28

పల్లవి:
ప్రభురాజ్యం నిశ్చలమైనది - శుభప్రదంబు శాశ్వతమైనది (2)

1. పృథివినందు ఉన్న వన్నియు (2)- కదలి గతించి పోవుచున్నవి (2)
   గతించదు నీ వాక్యమెప్పుడు - ఖ్యాతిగాను నిలుచునెప్పుడు (2)

2. జనాంగములు కదలుచున్నవి - జగమందెల్లను శాంతియేలేదు
   ప్రభుని ప్రజలు స్థిరులై యుందురు - విభుని ప్రజలు నిత్యముండెదరు

3. భూమి ఆకాశముల్ కదలింపబడును - అంతరించి తరలిపోవున్
   ప్రభుని గృహము కదలదెన్నడు - విభుని యిల్లు నిత్యమునిలుచున్

4. ఉదయించునుగ రాజ్య మొకటి - పొడిచేయునుగ అన్యరాజ్యములన్
   ఆ రాజ్యం అంతరించదు - ఆ రాజ్యం నిత్యము నిలుచున్

5. తన ప్రజలకు రాజ్యము నొసగన్ - ఘనుడగు తండ్రి కోరిక యిదియే
   ప్రభు ప్రేమ చలించనేరదు - ప్రభు ప్రేమ నిలుచు నిరతం
729 నిశ్చలమైనది యేసు రాజ్యముnishchalamainadi yesu raajyamu

Hebrews 12:28

పల్లవి:
నిశ్చలమైనది యేసు రాజ్యము (2)
ప్రకాశించే రాజ్యము - యుగయుగములు నిలుచును2
ప్రభుని రాజ్యము (1) - నిశ్చలమైనది యేసు రాజ్యము (2)

1. క్రీస్తు రాజ్య సింహాసనమెంతో గొప్పది -
   కనకంబున కన్న బహు ప్రకాశించును (2)
   దానిచుట్టు దేవుని మహిమ యుండును (2)
   దీక్షతోడ జయించెడువారే పొందెదరు (2)

2. నాశనము లేనిది యేసు రాజ్యము -
   నిత్యుడగు తండ్రి దాని స్థిరము జేసెను
   ప్రభుని రాజ్యము యెంతో అనంతమైనది
   పరిపాలించు తానే తరతరంబులు

3. తన రాజ్యమహిమకు మిమ్ము పిలిచెను -
   వినయముగా నీతి భక్తికలిగి నిలువుడి
   కడవరకు విశ్వాసము కలిగియుండిన
   క్రీస్తుయేసు మీకు నీతి మకుటమిచ్చును

4. యేసురక్తమందు యెవరు కడుగబడెదరో -
   వారే హృదయశుద్ధిని పొందెదరిలలో
   పరలోక రాజ్యములో ప్రవేశింతురు
   ప్రవిమలుని ముఖము జూచి సంతసింతురు

5. భూలోక రాజ్యములు అంతరించును -
   ప్రభుయేసు రాజ్యము నిలచు స్థిరముగా
   నీతి సమాధానములతో దేవుడేలును
   నేడే చేరవా నీవు ఆ రాజ్యములో?
730 ప్రభువా, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేనుprabhuvaa, guri yoddake parugettuchunnaanu nenu

Philippians 3:7

పల్లవి:
ప్రభువా, గురి యొద్దకే - పరుగెత్తుచున్నాను నేను (1)
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని (2) ప్రభువా (1)

1. క్రీస్తును సంపాదించుకొని - తన పునరుత్థాన బలమును
   ఎరిగి ఆయన శ్రమలలో పాలి వాడనగుదున్

2. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన - జ్ఞానము నిమిత్తము
   సమస్తమును నష్టముగా - ఎంచుకొనుచున్నాను

3. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన - జ్ఞానము నిమిత్తము
   సమస్తమును నష్టముగా - ఎంచుకొనుచున్నాను

4. వెనుక నున్నవి మరచి - ముందున్న వాటి కొరకై
   వేగిర పడుచు ధైర్యముగా - ముందుకే సాగుచున్నాను
731 క్రీస్తేసే మన మహిమkreestese mana mahima

Colossians 1:27

పల్లవి:
క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు (2)
ఆ నిరీక్షణ పరలోకమందు - మన కొరకై ఉంచబడి యున్నది (2)
క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు (1)

1. సంపూర్ణము చేయబడిన - సిలువ కార్యమునందు
   విశ్వాసము ద్వార మనలను - ఆయనే ఆయన యందు
   నిరీక్షించు నటుల జేసెను

2. సూర్యచంద్రుల కాంతి - తేజోహీనమై పోగా
   నక్షత్రముల కాంతియును - తరిగిపోయిన దినము
   తానే నిరీక్షణ యగును

3. అన్యుడెవడును సీయోను నందు - వాసము చేయగలేడు
   పరిశుద్ధ శిఖరమందున్న - దేవుడెహోవ యనియు
   పరికించు నటుల జేసెను

4. తుదమట్టుకు నిరీక్షణను - మనముంచిన యెడల
   మందిర మందుండి పారుచు - ఉబికెడి ఊటగనుండి
   నిరీక్షించు తన రాకడను
732 ప్రభువైన క్రీస్తులోprabhuvaina kreestulo

Ephesians 1:3

పల్లవి:
ప్రభువైన క్రీస్తులో తండ్రి - ప్రేమతో నిచ్చె - పరలోక దీవెనలు - విరివిగను (1)
ప్రభువైన క్రీస్తులో తండ్రి (1)

అను పల్లవి:
తెరువబడె - ఆకాశము మనకై (2) || ప్రభు ||

1. నీతి యావత్తును నెరవేర్చ క్రీస్తు - బాప్తిస్మమొందిన క్షణమందే (2)
   తెరువబడిన ఆకాశము నుండి (2) - పరిశుద్ధ ఆత్మ దిగివచ్చె (1)

2. మనుష్య కుమారుడు మహిమను నొందగ - పరలోక వార్తలు వివరింప
   తెరువబడిన ఆకాశము నుండి - దూతలు ఎక్కుచు దిగుచుండె

3. దయ్యముల్ లోబడ సంతోషింపకు - నిజ సంతోషము ప్రభు తెలిపె
   తెరువబడిన పరలోకము నందు - వ్రాయబడెను మీ పేరులనే

4. పాటింపకు నర భేదము లేవి - ధీటైన సంఘమర్మమని
   తెరువబడిన ఆకాశము నుండి - పొందెను పేతురు దర్శనము

5. మేఘ ధనస్సున్న సింహాసనమున - తేజోమయుడై ప్రభువుండ
   తెరువబడిన పరలోకము నందు - యెహోవాను గాంచె పరవశుడై

6. లేదిక చీకటి దీప కాంతియు - ప్రబువే వారికి వెలుగాయె
   తెరుబడిన పరలోకమునందున - స్తుతి చెల్లింతురు పరిశుద్ధులు

7. నూతన సృష్టిలో నుండ నాశించిన - క్రీస్తులో తిరిగి జన్మించుము
   జయించు వానిగా నీవుండినచో - రాజ్యము చేతువు క్రీస్తునితో
733 పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లిననుparvatamulu tolagipoyinanu tattarillinanu

Isaiah 54:10

పల్లవి:
పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను -
మెట్టలు బహుగా సమాధానము విడిచిపోదు - నీ నిబంధన తొలగిపోదు (1)
పర్వతములు తొలగిపోయినను (1)

1. సైన్యముల కధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే (2)
   భూషణ కిరీటము సొగసైన మకుటము (2)
   చిగురు మహిమ శుభలక్షణమగును (1)

2. మంటి పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు
   విమోచకుడు పరిశుద్ధ దేవుడు
   భయము వలదని సహాయము చేయును

3. మృతులైన వారు బ్రతుకుదురని వారి శవములు జీవములగునని
   మంటిలో పడియున్న ప్రేతలైన వారు
   మేల్కొని మహిమలో ఆనందింతురు

4. యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా తానే
   నా నిమిత్తము దావీదు నిమిత్తము
   ఈ పట్టణమును కాపాడి రక్షింతు

5. నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభూ నడిపించును
   నా కను దృష్టి యెహోవావైపుకే
   తిరిగి యున్నది హల్లెలూయా
734 దేవుడు దేనికి శిల్పియునుdevudu deniki shilpiyunu

Hebrews 11:10

పల్లవి:
దేవుడు దేనికి శిల్పియును నిర్మాణకుడై యున్నాడో (2)
ఆ పట్టణమే నా గురి - నా జీవితకాలమంతా (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ  హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

1. నా ప్రభు నన్ను ప్రేమించెన్ నాకై సిలువలో మరణించెన్ (2)
   తన రక్తములో నను కడిగెన్ నా పాపమును తొలగించెన్ (2)

2. ప్రతి క్షణము ప్రభు కృపనిచ్చున్ ప్రతి దినము ప్రభు నడిపించున్
   ప్రతి వరము ప్రభు మనకిచ్చున్ అతి ఫలము ప్రభు దయచేయున్

3. జలములు నాపై లేచినను జలము లపై నే వెళ్ళెదను
   జనములు నన్నెదిరించినను జయశాలి ప్రభు జయమిచ్చున్

4. ప్రభు నాకిచ్చిన కార్యమును ప్రభు శక్తితో నే జేసెదను
   ప్రబు నాకిచ్చిన కాలమును ప్రభు కొరకై నే గడిపెదను

5. నిశ్చలమైనది పట్టణము నీతితొ నిండిన పట్టణము
   నిత్యము జీవించెదనచట నిత్యుండగు ప్రభు సన్నిధిలో
735 యేసు ప్రభువా నీవేyesu prabhuvaa neeve

Colossians 1:27

పల్లవి:
యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ! (2)

అను పల్లవి:
హల్లెలూయ, హల్లెలూయ, మహిమ నిరీక్షణ నీవే (2)

1. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి (2)
   మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును (2)
   యేసు ప్రభో జయహో! (4)

2. నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి
   ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును
   యేసు ప్రభో జయహో!

3. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి
   మహిమాకై నన్ను పిలిచితివి, సదా నిన్నే పూజింతును
   యేసు ప్రభో జయహో!

4. మహిమ నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి
   యేసు నాలో నీవున్నావు, నిన్నే నే నమ్ముకొందును
   యేసు ప్రభో జయహో!

5. ప్రభువా మహిమతో మరలా వత్తువు నన్ను కొనిపోవ
   పరలోకమే నా దేశము - మహిమలోనచట నుందును
   యేసూ నీతో సదా! యేసుప్రభో జయహో!
736 నీవు దేనిని వెదకుచున్నావుneevu denini vedakuchunnaavu

John 1:38

పల్లవి:
నీవు దేనిని వెదకుచున్నావు - ఈ పాపలోకము నందు
విను యేసుని స్వరమును - నీవు దేనిని వెదకుచున్నావు (1)

1. ఈ సూర్యుని క్రింద నీవు - బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు (2)
   ఆనంద ధన ఘనతలు - పొందగోరుచునున్నావు (2)
   ఇవి యన్నియు వ్యర్థమే ఎరుగు - దుఃఖంబె లోకమంతయును -
   చింతింతువు ఒకనాడు (2)

2. వెదకుము నీవు మొదట - దేవుని రాజ్యము నీతిన్
   బహు చెంతనుండె నీకు - మారు మనస్సు నొందుము నేడె
   నూతన జన్మమును పొంది - ప్రవేశించుట అందున -
   అంగీకరించుము నేడె

3. శాశ్వత రాజ్యము పొంద - యోగ్యత అవసరము
   ఆత్మలో దీనులు - వారిదే నిత్య రాజ్యం
   దుఃఖపడువారును - విరిగిన హృదయులందరును -
   శాంతి ఆనందం పొందెదరు

4. కనికరము గలవారు - హౄదయ శుద్ధి గలవారు
   సమాధానపరచువారు - తన పుత్రులవుదురు
   హింసను పొందువారు - దీర్ఘ శాంతము గలవారున్ -
   ఆ రాజ్యములో నుందురు
737 యేసు నీ స్వరూపమునుyesu nee svaroopamunu

John 3:2

పల్లవి:
యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2)
నీ పోలికగా నేను మారెదన్ (2)

1. యేసు నా కొరకు నీవు, పరలోకము విడచితివి
   దాసుని రూపము ధరించి, దీనుడైతివి
   నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను
   నీదు వినయముతో నింపుము

2. ప్రేమ గల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
   నీ ప్రేమ ద్వారానే, సమస్తము నిచ్చితివి
   ఈ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను
   నీ ప్రేమతో నింపుము

3. ప్రభువా నీవందరి యెడల, శాంతము వహించితివి
   ఎవరును నశింపక యుండవలెనని
   నేను సహించలేను, సహనమునే కోల్పోయాను
   నీ శాంతముతో నింపుము

4. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము
   నీ సత్యము మేఘముల నంటుచున్నది
   నే నయోగ్యదాసుడను, నిన్ను దుఃఖపెట్టి యున్నాను
   నీ యధార్థతో నింపుము

5. యేసుని స్వరూపము కల్గి ఆయనవలె మారెదన్
   ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్
   ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము
   నీ పవిత్రతతో నింపుము
738 నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులుnee mandiramunandu nivasinchuvaaru dhanyulu, dhanyulu

Psalm 84:4

పల్లవి:
నీ మందిరమునందు - నివసించువారు ధన్యులు, ధన్యులు
నీ ... వలన బలమొందువారు - ధన్యులు ధన్యులు (2)

1. యెహోవా, నీయందు - నమ్మికగలవారె ధన్యులు
   నీ ధర్మశాస్త్రమునందానందం - గలవారె ధన్యులు (2)

2. నీతికొరకు ఆకలి దప్పుల్ - కలిగినవారె ధన్యులు
   ఆత్మ విషయంబై దీనులుగా నున్న - వారె ధన్యులు

3. హృదయశుద్ధి, కనికరము - కలిగియున్నవారె ధన్యులు
   సాత్వీకులు, సమాధానపరచు - వారె ధన్యులు

4. క్రీస్తు కొరకు శ్రమనొందుచు - నిందింపబడువారె ధన్యులు
   మీ మీద, చెడు మాటలు - పలుకునప్పుడె ధన్యులు

5. క్రీస్తు నిమిత్తం, దరిద్రులై - ఆకలిగొనువారె ధన్యులు
   సంతోషించి, స్తుతించినచో - పరలోకంలో ధన్యులు

6. సత్యం కలిగి వాక్యంచదివి - ధ్యానించేవారే ధన్యులు
   వ్రాయబడిన వాక్యంవిన - గైకొనువారె ధన్యులు

7. పరలోకంలో చేరుటకు - రక్షణగలవారె ధన్యులు
   ప్రభుయేసుక్రీస్తు నందు మృతినొందు - వారందరును ధన్యులు"

8. చూచి నమ్మువారికంటె - చూడక నమ్మువారె ధన్యులు
   ప్రియ సోదర, ప్రియ సోదరి - నిరీక్షణ నుంచుము
739 నమ్మదగినవాడవు నెమ్మదినిnammadaginavaadavu nemmadini
పల్లవి:
నమ్మదగినవాడవు - నెమ్మదిని చేకూర్చను
యిమ్మహిలో యెంతైనను - నమ్మిన నను గాచెడి

1. అలలు గాలి తుఫానులవలె - శ్రమలు నన్నిలగొట్టిన
   అమరమందు నిల్చియేసు - అన్నిటిని గద్దించును

2. నరుల రాజులనమ్మిన - నిరుపయోగమె యెందున
   కరము జాచిన కష్టములలో - కొరతలన్నిటి తీర్చును

3. యాత్రికులు ప్రయాణికులుగా - యాతనలు మే బొందిన
   నూతన జీవముతో నీ - పాత్రలుగను వాడను

4. ఆత్మ జీవశరీరములను - ప్రభువు రాకడ యందున
   నిందారహిత సంపూర్ణ మహిమలో - నుండునట్లుగ నిల్పను

5. పరమ తండ్రి కృపాతిశయమును - నిరతమును కీర్తించెద
   తరములకు విశ్వాస్యతను నా - నోటితోనే తెల్పెద

6. శోధనలన్నీ సహించెడి - వరకె నా కవినిచ్చియు
   శోధనలు తప్పించుకొను యా - మార్గమును కలిగించుము
740 యెహోవానైన నేనుyehovaanaina nenu

Malachi 3:6

పల్లవి:
యెహోవా నైన నేను మార్పు లేని వాడను గాన -
యాకోబు సంతతివారగు మీరు లయము కాలేదు (2)

1. దేవుడెహోవ మనుష్యుడు కాడు (2) - మాట మీరని వాడు (2)
   పశ్చాత్తాప పడడే మాత్రం (2) - అబద్ధమాడ నేరడు (2)

2. నా దాసుడైన దావీదు నిమిత్తము - నాదు నిమిత్తమును
   ఈ పట్టణమును కాపాడి రక్షింతు - వేరుతన్ని వారెదుగుదురు

3. యాకోబు దేవుని నామము - నిన్ను ఉద్ధరించును గాక
   ఆపత్కాలమందున నీకు ఉత్తరము - నిచ్చును గాక

4. సైన్యము లధిపతి ప్రత్యక్షమై - తన ప్రజలను రక్షింప
   కిరీటమందలి రత్నములవలె - సురక్షితముగ నుండెదరు

5. గాలివానకు ఆశ్రయమై - పగటి ఎండకు నీడై
   పర్ణశాల నొకటి యుండగ - సురక్షితముగ నుండెదరు

6. మహిమ యంతటి పైన తనదు - వితాన మేఘము నిలచు
   సీయోను నందలి ప్రతి స్థలమందు ప్రభావ మహిమ ప్రజ్వలించు

7. లెమ్ము నీవు ఓ సీయోను - ధరియించు నీదు బలమును
   లోనికి రాడు అన్యుడెవడును - హృదయ సున్నతి లేనివాడు"
741 యేసుని రాజ్యము అదిyesuni raajyamu adi

Hebrews 11:10

పల్లవి:
యేసుని రాజ్యము అది నిశ్చలమైనది (2)
తరతరములకు యుగయుగములకు మార్పులేనిది
పరిశుద్ధులందరు స్తుతులు చెల్లించే - మహిమ రాజ్యమది (2)

1. ప్రకాశమైన రాజ్యము - పరిశుద్ధులకె స్థానము (2)
   కన్నీరు లేని రాజ్యము - మరణము లేని రాజ్యము (2)
   ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే (2)

2. భోజనపానము కాని ఉత్తమమైన రాజ్యము - నీతి సమాధాన రాజ్యము
   సూర్యచంద్రులు లేని రాజ్యము
   ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే

3. జయించు వారిదే రాజ్యము - నీతిమంతులదే కిరీటము
   జీవజలనది పారును - దేవుడే వాటిని త్రాగనిచ్చును
   ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే

4. శాపము లేని రాజ్యము - గొర్రెపిల్ల ఉండు రాజ్యము
   మన ప్రభువే ప్రకాశించును - యుగయుగములు పరిపాలించున్
   ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే

5. క్రీస్తుని రాక ఏ క్షణమో - ఎదుర్కొన నీవు సంసిద్ధమా
   నేడే యేసుని స్వీకరించు - క్రీస్తుకై నీవు జీవించుమా
   ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లపుడు సంతోషమే
742 స్తుతియింతుము యేసు ప్రభువాstutiyintumu yesu prabhuvaa

Revelation 22:12

పల్లవి:
స్తుతియింతుము యేసు ప్రభువా - మా స్తుతికి పాత్రుడా (2)
నిత్యం నిన్నే ఆరాధించి (2) - మహిమ పరతుము ఇలలో (2)
స్తుతికి పాత్రుడా  (1)

1. మా పాపములు మమ్ము నీకు - బహుదూరంబు జేయగా (2)
   ఏ పాపమెరుగని ప్రభువా - మాకై సిలువలో బలియైతివా (1)
   నీ రక్తముతో మమ్ము కడిగి - నీ చెంతకు చేర్చితివా (2)

2. లోకాశకు లొంగిపోయి - నీ సహవాసమును వీడగ
   ఆకాశమును వీడి మాకై - నీతో సహవాస మొసగితివా
   పరిశుద్ధులుగా మమ్ము తీర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చితివా

3. సాతానుకు దాసులమై - నిత్య మార్గమును వీడగ
   పతనమైన మా బ్రతుకుల్ - నిత్య జీవముగా మార్చితివా
   నిత్యము నిన్నే సేవింప - సత్యవాక్యము నొసగితివా

4. నిరీక్షణ లేక మేము - నిర్భాగ్యులమై యుండగా
   త్వరగా రానై యున్న ప్రభువా - పరమ నిరీక్షణ నిచ్చితివా
   నీ రాకకై ఎదురు చూడ - సిద్ధపాటును నొసగితివా
743 జీవమునిచ్చెద జీవాధిపతికిjeevamunicheda jeevaadhipatiki

Philippians 3:11

పల్లవి:
జీవమునిచ్చెద జీవాధిపతికి - జీవము నిచ్చెద నేను నా ... (2)
జీవము నిచ్చెద నేను నా ... (1) - జీవము నిచ్చెద నేను (1)

1. పాడెడు పక్షులు పాడక పోవును -
   పుడమి గృహవనముల్ కూలిపోవున్ - నాజీవము నిచ్చెద నేను (2)

2. మోము సౌందర్యముమాయమై పోవును -
   ఈ మహి అందరము నశియించున్ - నా జీవము నిచ్చెద నేను

3. నరుల మైత్రిచే నష్టము ఏర్పడున్ -
   గురిని మైత్రిచే పాట్లుకల్గినన్ - నా జీవము నిచ్చెద నేను

4. మరణము వచ్చును ఖాయముగాను -
   తరుణము దొరుకుట కష్టము - నా జీవము నిచ్చెద నేను

5. నగలు పుట్టములు కశించి పోవును -
   నగర గోపురముల్ శిథిలమగున్ - నా జీవము నిచ్చెద నేను

6. పాప సంతోషము లిహమున నిల్చును -
   పాపపు దేహము మన్నగును - నా జీవము నిచ్చెద నేను

7. హల్లెలూయ పాట పాడుటవలన -
   నెల్లశ్రమలు నాకబ్బినను - నా జీవము నిచ్చెద నేను
744 నా నాథుడా నాయుల్లమిచ్చితిnaa naathudaa naayullamichiti

Colossians 3:11

పల్లవి:
నా నాథుడా నాయుల్లమిచ్చితి నీకు (2)
అన్నియు నీకై వేడి - నిన్నే వెంబడించితిని -
పెన్నుగ నాలో నాటుమా ప్రేమన్  - పెన్నుగ నాలో నాటుమా (1)

1. దేవాలయ విగ్రహముల్ - దేవతలు వేయిలక్షల్ (2)
   యావత్తు పెంటయనుచు - నిదిగో (2)

2. ఆదియంత రహితుడ - ఆత్మల నాయకుడా
   ఆశ కల్గించు నాలోన - నీవే

3. పరిశుద్ధ యవతారుడా - మరియు తేనె అమృతుడా
   కరుణతో నన్ను గావుమా - యిపుడు

4. భూతల - మునకు వేం చేసి - పాతకుల ప్రేమించితివి
   పాతకుడ నేనైతివి - మహా

5. ఆద్యంతము లేనట్టి - బీదలకు ధననిధీ
   సదయుడా నన్ను చూడుమా - యిపుడు

6. హల్లెలూయ గీతమును - ఎల్లెడల చాటించెదను
   ఉల్లమందానంద ధ్వని - యిదియే
745 యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదనుyesoo naa siluvan mosi ninu ne vembadinchedanu

Luke 9:57

పల్లవి:
యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను (1)
నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను (2)

1. యేసు నన్ను రక్షించి - నా కొరకు రానై యుండ (2)
   నేనికను నీదు వెంటనే వెంటనే వెంబడించెదను (2)

2. నీ ప్రాణము నాకిచ్చితివి - నేనికను నీ దాసుడనే
   ద్రోహంబుచేయక చక్కగ చక్కగ వెంబడించెదను

3. మరణంబు గెల్చి లేచెన్ - మృత్యుంజయుడై యేసు
   నే నీ నిరీక్షణ గలిగి నిను నే వెంబడించెదను

4. నే నేసుస్వామికి సాక్షిన్ - నాసాక్ష్య మిట్లుండగను
   నీదు రాకడకై నిరీక్షించి వెంబడించెదను

5. యేసూ నా జీవదాతా - నా రక్షకా నా ప్రభువా
   నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను
746 నా యేసు మార్గమందునnaa yesu maargamanduna

Hebrews 11:26

పల్లవి:
సిలువను వీడను - సిలువను వీడను (1)
సిలువను వీడను - సిలువను వీడను - సిలువను వీడను (1)
సిలువను సిలువను వీడను (1)

1. నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా?
   గొల్గొతాకొండ బాధలో - పాలు పొందెదవా? (2)

2. బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా? -
   మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా? || సిలువ ||

3. ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా?
   అవమానము వచ్చినన్ - సిల్వను మోతువా? || సిలువ ||

4. పాపాత్ములు గుణపడన్ - దత్తము చేతువా? -
   భయస్థులు ధైర్యపడన్ - యుద్ధము చేతువా? || సిలువ ||

5. లోకులు నాశమైరిగా - వీరులు లేకయే -
   విమోచకుడు సిల్వలో - వ్రేలాడి మృతి పొందెను || సిలువ ||

6. జీవాంతరము వరకు - నిల్చిపోరుసల్పి -
   దైవకృపచే గెల్చి నే - మోక్షము చేరుదున్ || సిలువ ||
747 త్రిత్వమర్మము నెరిగినtritvamarmamu nerigina
పల్లవి:
త్రిత్వమర్మము నెరిగిన - మిత్రుండా ప్రాణమునిమ్ము
విలువ గలిగిన ప్రభుని - సిలువ భుజముపై మోసి (2)

1. గోధుమ భూమిలోపడిన (1) - బహుగాను ఫలియించును (3)
   మోదమున ప్రభుయేసునితో మరణించవలెను ప్రియుడా (2)

2. మహిమ నొందుటకు నీవు - సాత్వికుండవు కావలెను
   మహిమ స్వరూపిని పోలి - నీవును జీవించవలెను"

3. క్రీస్తును ప్రేమను త్రాగి - ఆత్మవశుడవైనచో
   సైతాను సహవాసమును - సంపూర్ణముగా వదిలెదవు

4. పొలము దున్నెడువాడు - వెనుక తిరిగి చూడడు
   ఇలలో నీవున్నను ప్రియుడా - యిలనే మరచిపోవలెను

5. ప్రాణంబు పోయినగాని - విశ్వాసము విడువ వలదు
   ప్రియుడా నీదు ద్వారానే - పృథివి బాగుపడవలెను
748 దేవయాత్మ భాసురాగ్నిdevayaatma bhaasuraagni

Psalm 23:5

1. దేవయాత్మ భాసురాగ్ని తేజస్సుగా నున్నది
   జీవయాత్మ సదా నన్ను బలపర్చుచున్నది
   నాయాత్మ జీవదేహమునా ప్రభునకు సొంతము
   దయాసహిత జీవమిదియే జయము హల్లెలూయ

2. ఇక్కట్టులు బాసిపోయే నేసుక్రీస్తు వలన
   చక్కగా నే నేసుబిడ్డన్ గొప్ప భాగ్యమొందితిన్
   ఆనందము పొందుదు నద్భుతము జరిగెను
   బానిసకు స్వేచ్ఛకల్గె జయము హల్లెలూయా

3. అఖిలమెల్ల ప్రకటించు మేసుప్రభుని గూర్చి
   దుఃఖ మరణ లోకముపై మహా విజయ మొందెను
   నిత్యజీవ మొందుము నీ అంతరంగమందు
   నిత్యజీవమబ్బె నాకు జయము హల్లెలూయా

4. దేవునికే స్తోత్రము పరిశుద్ధాత్మ సుతునకు
   ఈవిగా రక్షణనిచ్చే పాప విడుదలయున్
   ఎల్లజిహ్వలు పాడనీ - మంచి యీవి నిచ్చెనే
   ఎల్లరును పాడుడీ - జయము హల్లెలూయా
749 ప్రభుని దర్శనంprabhuni darshanam

Prov 29:18

పల్లవి:
ప్రభుని దర్శనం యేసుని దర్శన -
మొంది సేవ - చేయుము దేవునికి (2)

1. ఇండియ దేశము రక్షణకై ని - న్నిదిగో రమ్మనెను (2)
   పాప సముద్ర - పాప సముద్ర -
   అగాధములో ఆత్మలు మునిగెను (2)

2. సిలువపై తన ప్రాణమునిచ్చెను - కలుషాత్ములకై
   తన హృదయములో - తన హృదయములో
   ఇండియ దేశమునకు - స్థలమిచ్చెను

3. యౌవన జీవితము నంతటిని - వ్యర్థము చేసితివి
   రక్షకు డేసుని - రక్షకుడేసుని-
   తక్షణమే లేచి సేవించుమా

4. ఆత్మల రక్షణకై సోదరుడా - ఆశతో లేచి రా
   విస్తారముగా - విస్తారముగా -
   కోత యున్నది - నూతన బలమున రా
750 ప్రియ యేసుని సైన్య వీరులముpriya yesuni sainya veerulamu
పల్లవి:
ప్రియ యేసుని సైన్య వీరులము - సైన్య వీరులము సైన్యవీరులము (1)
శ్రేయంపు సిలువను మోసెదము - సైన్య వీరులము సైన్యవీరులము (1)

1. మన తండ్రి సమాధాన ప్రభువు -
   మన సర్వాయుధము మన నమ్రతయే (2)
   మన ఆత్మ సహాయకు డాయనే -
   సైన్య వీరులము సైన్యవీరులము (2)

2. ఎల్లప్పుడు యేసుని ధ్యానింతుము -
   ఎల్లరము జీవము నొసగెదము
   చల్లని యేసు ప్రేమకై సమర్పింతుము -
   సైన్య వీరులము సైన్య వీరులము

3. యేసు క్రీస్తుని ప్రేమకై చనిపోదుము -
   యేసుకై కాయ కసరులనైన తిందుము
   వేసినట్టి ముందంజను వెనుదీయము -
   సైన్యవీరులము సైన్యవీరులము

4. లోక స్నేహపు బంధముల్ త్రుంచితిమి -
   లోక మాయల నెల్లను విడిచితిమి
   వీకతో ప్రభుని కెదల నిచ్చితిమి -
   సైన్య వీరులము సైన్య వీరులము

5. రక్షణమార్గమిదేయని యెరిగితిమి -
   అక్షయంబుగ నాత్మలో నాటితిమి
   లక్ష్యబెట్టము చావు బ్రతుకులను -
   సైన్య వీరులము సైన్య వీరులము

6. వైరికోటల నాశంబు గావింతుము -
   కోరి శుభవేళ సత్యంబు చాటెదము
   చేరిసాక్ష్యము లీయను భయపడము -
   సైన్య వీరులము సైన్య వీరులము

7. హల్లెలూయా జయంబును తెలిపెదము -
   ఉల్లాసముతో ప్రభునిరాక చాటెదము
   ఎల్ల పాపాంధకారముల్ బాపెదము -
   సైన్య వీరులము సైన్య వీరులము
751 యాజక ధర్మము నెరిగి యేసునికే సేవyaajaka dharmamu nerigi yesunike seva

Isaiah 61:6

పల్లవి:
యాజక ధర్మము నెరిగి - యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు (2)

1. ఆది ప్రధాన యాజకు డహరోను - ప్రభునికే ముంగురుతు (2)
   అతని కుమారులు విశ్వాసులకు (2) - ప్రాపుగ ముంగురుతు (1)

2. ప్రధాన యాజకుడు మనయేసే - యాజకులము మనమే
   పరమ పిలుపులో నిలిచినవారే - స్థిరముగ నుండెదరు

3. నాదాబు యనగా మనసున్నవాడని - అబీహువు నా తండ్రి
   ఎలియేజరనగ దేవుడు నా బలము -ఈతామారు ఖర్జూర భూమి

4. అహరోను ధరించిన వస్త్రములేడు - వాని యర్ధమేమి?
   ప్రభుయేసు వాని యందున్న - వాడు రక్షింపబడిన వారును

5. పతకము, ఏఫోదు, విచిత్రమైన దట్టీ - నిలువుటంగీ, పాగ
   మేలిమి బంగరు రేకు, విచిత్ర - మైన చొక్కా ఏడును

6. ఆయనతోడ వేయి వత్సరములు - ఆనందముతో నేలుచు
   యాజకులందరు భాగ్యశాలులై - హల్లెలూయ పాడెదరు
752 యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదముyesuni nindanu bharinchi aayana yoddaku velludamu

Hebrews 13:13

పల్లవి:
యేసుని నిందను భరించి - ఆయన యొద్దకు వెళ్ళుదము (2)

1. సన్బల్లటు టోబీయా చేయు హేళనలు - వారలు పెట్టు శ్రమల భరించి (2)
   ఆయనతో సంతోషముగ భరించి (2) - బయలుదేరి వెళ్ళుదము1

2. స్తెఫను చావును మదిలో దలచి - పేతురు చెఱలో నుండుట దలచి
   మోసము లెన్నియో కల్గినగాని - బయలుదేరి వెళ్ళుదము

3. కపట సోదరుల వలన బాధలు - అపనిందలు మా కెన్నియున్న
   యేసు ప్రభువునే ద్వేషించినను - బయలుదేరి వెళ్ళుదము

4. కర్రలతోనే మము కొట్టినను కత్తులతో మము ఖండించినను
   ప్రజల వలన బహుగా నలిగినను - బయలు దేరి వెళ్ళుదము

5. ఉపవాసములతో యున్ననుగాని - జాగరణములతో యున్నను గాని
   దిగంబరత్వముతో మేమున్నన్ - బయలుదేరి వెళ్లుదము

6. అగ్నిలో నడువ వలసిన గాని - పలువిధ శ్రమలు మా పై బడినన్
   చంపబడిన గొఱ్ఱెపిల్లను జూచి - బయలుదేరి వెళ్ళుదము

7. నిబ్బరముగ నిలుచుందుము మేము - యెహోవాయే మా పక్షము జేరి
   పోరాటములో జయము చేకూర్చున్ - హల్లెలూయ పాడుదము
753 యేసుని శిష్యులముyesuni shishyulamu

Acts 17:6

పల్లవి:
యేసుని శిష్యులము యేగుదము - పిశాచి లోకమును కదలింతుము (2)

1. గాఢనిద్రపోతులను లేపెదము (2)
   దాహము గలవారలకు సాక్ష్యమిత్తుము (2)
   వేగముగ దేశద్రిమ్మరిని పార ద్రోలుచు - త్యాగు డేసుక్రీస్తుని సిలువచే (2)

2. అహంకారుల నెల్లర చేర్చెదము
   మహా ముత్యములను వెదజల్లెదము
   మా దుఃఖములెల్ల సహించెదము - నెచ్చెలుడు యేసుక్రీస్తుని సిలువచే

3. ఒక్కడేయగు తండ్రి బిడ్డలారా
   చక్కగా నొక్కటిగ నుండువారలారా
   ఎప్పుడును మంచి మనస్సుతో నడువుడి - మన రాజగు యేసుని సిలువచే

4. వచ్చు బాధలనన్ని సహించెదము
   గొప్ప పాతక క్రియల రూపార్చెదమురిక్తుడైన మన నాథుని చాటుదము - శక్తి రాజుని శాంతి సిలువచే

5. ప్రజల నెల్లర శిష్యుల గావింతుము
   తేజో మయుడైన తండ్రిని ప్రకటింతుము
   ఎల్లవారికి స్వాగత మొనరింతుము - బోధకుడు యేసుక్రీస్తుని సిలువచే

6. ఆది యపోస్తలుల సభను యేర్పరచి
   దిట్టముగ తప్పుబోధల విడచెదము
   ఎప్పుడును ఒప్పుగానే నడచెదము - గొప్పతండ్రి యేసుక్రీస్తు సిలువచే

7. హల్లెలూయ గీతమును మ్రోగింతుము
   మేలుగల్గ దుష్టక్రియల నణచెదము
   వల్లభుడు క్రీస్తు వార్తకు లోబడుచు - చల్లని నాథుడేసుని సిలువచే
754 యేసుక్రీస్తే సజ్జనుడుyesukreeste sajjanudu

Mark 10:17

1. యేసుక్రీస్తే సజ్జనుడు (1)- వైరికన్న బలవంతుడు (2)
   ఆయన శక్తిచే జయించెదం (జయించెదం ... (5) )
   వైరికి మేము లొంగము జయించెదం (2)

2. క్రైస్తవ సైన్యము స్వల్పము (1)- క్రీస్తు ద్వారభయ మొందము
   ఆయన శక్తిచే జయించెదం (జయించెదం ... )
   వైరికి మేము లొంగము జయించెదం

3. ఆత్మ ఖడ్గముతో నరికి (1)- ఆశతో మేము పనిచేతుము
   ఆత్మలవైరిని ఎదిరింతుము (ఎదిరింతుము ... )
   వైరికి మేము లొంగము జయించెదం

4. సర్వాయుధ వర్గమును ధరించి (1)- సర్వశక్తి చే నింపబడి
   ధైర్యముతో పోరాడెదం (పోరాడెదం ... )
   గర్విపిశాచితో పోరాడెదం జయించెదం
755 మనస్సార కృతజ్ఞత లిడుచుmanassaara krutajnyata liduchu
పల్లవి:
మనస్సార కృతజ్ఞత లిడుచు (2) - ఘనంబు చేయు ప్రభున్ (3)

1. విరివిగ నాశీర్వాదము లొసగున్ (2)- మరువకు యేసుని యుపకారం (2)
   ధర నీకున్నది దేవునిదే యని (2) - కోరిన ప్రబుకిడు త్వరపడుచు2
   ఘనంబు చేయు ప్రభున్ (1)

2. దర్శించిన నీ దయగల ప్రభువునకు - హర్షముతో కొట్లను విప్పి
   విరివిగ మురియుచు ప్రభునకు అన్నియు - అర్పించి కొనియాడెదము
   ఘనంబు చేయు ప్రభున్

3. తనయునిలో మన కన్నియు నిడెను - మనలను ముందే తనకిడెను
   పానార్పణముగ ప్రభుకర్పించి - కాలంబంతయు గడిపెదము
   ఘనంబు చేయు ప్రభున్

4. సంతసముగ నిడుటే ప్రభు చిత్తము ఎంతో మెళకువతో నుండి
   చింతింపక నిడుటే సరియర్పణ - వింతగు వృద్ధిని పొందెదము
   ఘనంబు చేయు ప్రభున్

5. పిసినితనంబుగ దోషార్పణ నిడ - వాసము చేయును లేశములు
   యేసునికి నీ జీవనమియ్యను - శాసనమిదె ప్రభుదని యెరుగు
   ఘనంబు చేయు ప్రభున్

6. ఘనపరచును ప్రభు - మనస్సారగ నిడ - కానుకగా బలకాలములు
   మన కెన్నో తన గుణముల నిడి - ఘనమును బలమును ప్రభువొసగున్
   ఘనంబు చేయు ప్రభున్

7. మకెదొనియ సంఘము వలె నీకు - సకల ఇక్కట్లుండిననుశక్తికి మించి సాగిన గాని - మక్కువగా నిడి మనమిలను
   ఘనంబు చేయు ప్రభున్
756 ఈ జగతికి జ్యోతినిee jagatiki jyotini

Matthew 5:14

పల్లవి:
ఈ జగతికి జ్యోతిని నేను - జీవన జ్యోతి జ్వలించెదను (2)

1. నా గృహంబునకు జ్యోతిని నేను నా జ్యోతిని జ్వలించి సదా (2)
   గాఢాంధకారమునంతటిని - తొలగించెద నా హృదయమునుండి (1)

2. గాఢాంధకారమునంతటిని - తొలగించెద నా హృదయమునుండి (1)
   ప్రభు యేసు జ్యోతిని వెలిగించెద - ప్రతి చీకటి లోయ యందు

3. ప్రణయము త్యాగము సత్యమనునవి - ప్రభు వొసంగిన ప్రత్యక్షత
   సంతోషమున నా జీవితము సమర్పించెద ప్రభు యేసునకు
757 నీ సిలువే నాకు శరణుnee siluve naaku sharanu

Galatians 6:14

పల్లవి:
నీ సిలువే నాకు శరణు యేసుప్రభో! (2)

1. దురితదూరుడా - నీదరి జేరగ (2) - నాదు పాప - శాపము దీర్చి (2)
   దరిజేర్చితివి కృపతో (2)

2. శాశ్వతముగ నన్ను ప్రేమించితివి - నీదు ప్రేమకు నేనే సాక్షిని
   బలమగు నీదు కృపతో

3. నా హృదయములో భారములెల్లను - సిలువను జూడగ సమసిపోయెను
   శక్తిగల నీ కృపతో

4. రక్తముకార్చి మరణము గెల్చి - శత్రు సైతానును ఓడించి
   విజయమిచ్చితివి కృపతో

5. నీవు పొందిన బాధలవలన - నిత్యసుఖంబులు సంపూర్ణముగ
   పొందితి నీదు - కృపతో

6. యేసు నా సిలు వను నే మోసి - ఇలలో నిన్ను వెంబడించుటకు
   ధైర్యమిచ్చితివి - కృపతో

7. నీ రాకడకై నిరీక్షించు - నిత్యకృపను నే పొందితినంచు
   పాడెదను - హల్లెలూయ
758 నే నీవాడనై యుండగోరెదన్ne neevaadanai yundagoredan
పల్లవి:
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా - నీవు పడ్డ సిల్వకున్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా - గాయ పడ్డ ప్రక్కకున్

1. నే నీవాడనై యుండగోరెదన్ - యేసు ప్రియ రక్షకా
   నీవు చూపు ప్రేమను గాంచితిన్ - నన్ను జేర్చు నీదరిన్

2. నన్ను బ్రతిష్ఠబర్చుమీ నాథా - నీదు కృపవల్లనే
   నాదు ఆత్మ నిన్ను నిరీక్షించున్ - నీ చిత్తంబు నాకగున్ || నన్ను ||

3. నీదు సన్నిధిలో నికనుండ - నెంత తుష్ఠి నాకగున్
   స్నేహితునిగ మాటలాడుదున్ - సర్వ శక్తి ప్రభుతో || నన్ను ||

4. నీదు దివ్య ప్రేమాతిశయము - ఇహబుద్ధికందదు
   పరమందున దాని శ్రేష్ఠత - నే - ననుభవించెదన్ || నన్ను ||
759 నాదు ప్రాణము ప్రభోnaadu praanamu prabho
1. నాదు ప్రాణము ప్రభో - నేను నీ కర్పింతును
   నాదు చేతులెప్పుడు - నీదు సేవ చేయనీ

2. నాదు కాళ్ళు లెస్సగా - నీదు త్రోవ నడ్వనీ
   నాదు స్వర మెన్నడు - నీదు స్తుతి పాడని

3. నాదు నోరు నిత్యము - నీదు బోధ పల్కనీ
   నాదు సొమ్ము సొత్తులు - నీకు నిత్తునెప్పుడు

4. నాదు కాలమంతయు - నిన్ను బ్రస్తుతింపనీ
   బుద్ధిపూర్వకంబుగా - నిన్ను నేను కొల్వనీ

5. సొంతమేలు గోరక - నీదు కీర్తి గోరుచు
   నాదు నంతరంగము - స్వీకరించి యేలుము

6. నాదు నిండు ప్రేమను - నీ కర్పింతు నెప్పుడు
   నన్ను నీదు సొత్తుగా - నీవంగీకరింపుము
760 యేసు ప్రభో నీకుyesu prabho neeku

Romans 12:1

పల్లవి:
నా సమస్తము - నా సమస్తము - నా సురక్షకా నీకిత్తు - నా సమస్తము

1. యేసు ప్రభో నీకు నేను - నా సమస్తమిత్తును
   నీ సన్నిధిలో వసించి - ఆశతో బ్రేమింతును

2. యేసు ప్రభో నీకే నేను - దోసిలొగ్గి మ్రొక్కెదన్
   తీసివేతు లోకయాశల్ - యేసు చేర్చు మిప్పుడే || నా సమ||

3. నీదు వాడ నేను యేసు - నీవు నాదువాడవు
   నీవు నేను నేకమని - నీ శుద్ధాత్మ సాక్ష్యము || నా సమ||

4. యేసు ప్రభూ నీకు నన్ను - నీయ నేనే వచ్చితి
   నీదు ప్రేమ శక్తి నింపి - నీదు దీవెన నియ్యవే || నా సమ||

5. యేసు నీవే నా సర్వాస్తి - హా సుజ్వాలన్ బొందితి
   హా సురక్షణానందమా - హల్లెలూయ స్తోత్రము || నా సమ||
761 నా రక్షకుని వెంబడింతుnaa rakshakuni vembadintu

Luke 5:11

పల్లవి:
యేసున్ నేను ఎన్నడెన్నడును - ఆశతోనన్నిటన్ వెంబడింతును
భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ - మూసికొని యెక్కడేని వెళ్ళుదున్

1. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ - ఘోరమైన కొండలైన జంకొందను
   సురక్షితంబుగా నేను వెళ్ళెదన్ - పరమ కిరీట మొందువరకు

2. నా యేసుతోడ వెళ్ళుచుందు నెల్లడన్ - బ్రయాసమైన లోయలైన భయపడన్
   దయజూపు యేసు నన్ను వెంబడించుచో
   భయమేల భువనంబులో దగన్ || యేసున్ ||

3. నా కాలమెల్ల యేసునందునమ్ముదున్ - భీకరంపువార్థియైన నే దాటుదున్
   నా కర్తతోడ నెందునైననేగుదున్ - నాక మెక్కి తండ్రి జూచు వరకున్ || యేసున్ ||
762 నా యేసు నొప్పుకొననుnaa yesu noppukonanu

Romans 1:16

పల్లవి:
సిల్వలో సిల్వలోఁ గాంచి నే చూడఁగన్
చింతలన్ భారమెల్లఁ బోయెనే - విల్వలేనట్టి
రక్తమున్నమ్మన్ - విశ్వంబైన ముక్తి గల్గెనే

1. నా యేసు నొప్పుకొనను నే సిగ్గునొందను
   నా యేసుకై పోరాడను నే వెన్కదీయను

2. నా దేవుని పేరేసుండు నా కేమి లోపము
   ఇదే నా సునిరీక్షణ యింకేమి భయము || సిల్వలో ||

3. బాహాటమై నా భారము భరింపనాయెనే
   మహాత్ముని వాగ్దానము మార్పొంద దెన్నడు || సిల్వలో ||

4. న్యాయంపు తీర్పు నాటిలో నన్నొప్పుకొంచును
   నా యేసు తండ్రి యానతిన్ నాకంబుఁ జేర్చును || సిల్వలో ||
763 సిల్వచెంత నేసువా చేర్చి నన్నుsilvachenta nesuvaa cherchi nannu

Psalm 51:7

పల్లవి:
సిల్వకే సిల్వకే - చెల్లు నా విముక్తి
చెల్వ మొప్ప నద్దరిన్ - జేర నాకు ముక్తి

1. సిల్వచెంత నేసువా - చేర్చి నన్ను నుంచు
   కల్వరిన్ స్రవించెడు - కాల్వలో నన్ముంచు

2. కంపితాత్ము నంధునై - కానలేక యుండ
   సొంపుమీరఁబ్రోచితి - సూర్య తేజస్కుండ || సిల్వకే ||

3. దేవ గొఱ్ఱెపిల్ల - నీ - దీప్తి నాకుఁజూపు
   నీ వధాప్రభావముల్ - పావనుండ నేర్పు || సిల్వకే ||

4. నే నిరీక్షణంబుతో - నెప్డు వేచి యుందున్
   భూనితాంత వారథిన్ - బూని యీది మన్దున్ || సిల్వకే ||
764 ప్రభు యేసుని నేను వెంబడింతునుprabhu yesuni nenu vembadintunu

Revelation 14:4

పల్లవి:
ప్రభు యేసుని నేను వెంబడింతును (2)
తన అడుగు జాడలలో నడిచెదను (2)

1. లోకమున్ విడిచి సిలువను మోసి (2) - దీక్షతో ప్రభుని వెంబడింతును (1)

2. కాపరి యేసు స్వరమును వినుచు - చూపెడి స్థలముల కేగెదను

3. చీకటి జగతిని తప్పించుకొని - వాక్యపు వెలుగులో వెంబడింతును

4. పాప విశాల మార్గమున్ విడచి - పరుగిడెదను జీవ మార్గమున

5. అంతమువరకు స్థిరముగ నిలిచి - అమూల్యమకుటము పొందెదను
765 నా సర్వమైన ప్రభూnaa sarvamaina prabhoo

Romans 12:1

పల్లవి:
నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై -
అంగీకరించు నేడే - నీ సేవ చేయుటకై (2)

1. ఆత్మప్రాణ దేహము - తలంపులు క్రియలు (2)
   అన్నియు నీ కొరకే - గైకొనుము ఓ యేసువా (2)
   జీవించగోరితి నీ కొరకే - నీకే మహిమ ఘనత (2)

2. వెలిగించు నా జీవము - నింపుము నీ ప్రేమతో
   నీ కృపతో నడిచెదను - మెండైన నీ శక్తితో
   ఘనపరచ గోరితిని నీ నామమును - నీకే మహిమ ఘనత

3. నా కాళ్ళు చేతులెల్ల - నీ సేవ కర్పింతును
   నా నాలుక నిత్యము - నిన్ను స్తుతింపనిమ్ము
   మనస్సార ప్రేమింతు నిను ప్రభువా - నీకే మహిమ ఘనత (2)
766 యెహోవాను స్తుతించుడి మీరుyehovaanu stutinchudi meeru

Ecclesiastes 11:9

పల్లవి:
యెహోవాను స్తుతించుడి - మీరు యెహోవా నామమును స్తుతియించుడి (1)

అను పల్లవి:
యెహోవా సేవకులారా - మీరు స్తుతించుడి (2) || యె ||

1. యెహోవా మందిర పునాదిని వేసిన - దినమున పలికిన ప్రవక్తల మాటన్ (2)
   నేటి దినమున వినెడి మీరు (2)
   ధైర్యము తెచ్చుకొనుడనె ప్రభువు (1)

2. పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల - కరుణతో తన కృప జూపుట మరువని
   నిబంధన నెరవేర్చు నీవంటి దేవుడు
   భూమ్యాకాశములందున లేడని

3. ఇల దావీదను పితరుని తోడ - సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు
   సొలొమోను నందా వాగ్దానములను
   కన్నుల విందుగ నెరవేర్చెనుగా

4. పోవుడి, పోవుడి, తొలగిపోవుడి అపవిత్రమైన దేని ముట్టకుడి
   యెహోవా సేవోప కరణములను
   మోయు వారలగు మీరు శుద్ధి చేసికొనుడి

5. ఆలకించుడి మీరు తన సేవకుడు - వివేకముగా ప్రవర్తించును గాన
   ఉన్నతమైన స్థానమందుండి
   ఘనుడైనవాడై హెచ్చింపబడును

6. పర్వతములపై ఎంతో సుందరములు - రాజ్య సువార్తను చాటించువారై
   సీయోను! నీ దేవుడేలు చున్నాడని
   సమాధానమును ప్రకటించు పాదములు

7. ఆ నగరములో నుండదు శాపము - దేవుని గొఱ్ఱపిల్ల సింహాసనముండు
   సేవింతురు తన దాసులాయనను
   రవి తేజులై దివి రాజ్యమునందు
767 క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితంkraistava jeevitam saubhaagya jeevitam
పల్లవి:
క్రైస్తవ జీవితం  - సౌభాగ్య జీవితం - ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం

అను పల్లవి:
కష్టములు వచ్చిన - నష్టములు వచ్చినా -
యేసు ప్రభువే నా సహకారి || క్రైస్తవ ||

1. ఈ లోక ఘనత - నన్ను విడిచినన్ - లోకస్థులెల్లరు - నన్ను విడిచినన్
   నా సహోదరులు - నన్ను విడిచినన్
   యోసేపు దేవుడే - నా సహకారి

2. అంధకారంబు భువి - నావరించిన - రాజులు ఘనులు - శత్రువులైనను
   అగ్నిగుండములో - సింహపు గుహలో
   దానియేలు దేవుడే - నా సహకారి

3. నా మంచి కాపరి - శ్రేష్ఠ స్నేహితుడు - శాశ్వత రాజు - నా సహాయకుడు
   భారం నాకెందుకు - వ్యాకులమెందుకు
   ప్రభు ప్రజలతో - నేకీర్తించెదన్

4. బూర శబ్దంబు - మ్రోగెడి వేళ - శ్రమ నొందిన నా - ప్రభుని చూచెదన్
   ఏనాడు ఎప్పుడు - నీవు వచ్చెదవు
   ఆనాటి వరకు - నే కనిపెట్టెదన్
768 ఆత్మ నియమము ద్వారా సాగి పోవుదముaatma niyamamu dvaaraa saagi povudamu

Hebrews 12:2

పల్లవి:
ఆత్మ నియమము ద్వారా - సాగి పోవుదము - విశ్వాసమునకు కర్తయు దానిని
కొనసాగించు యేసుని జూచుచు - ఓపికతో మనము సాగి పోవుదము

1. భక్తి హీనులకు నీతిని జాటుచు - జల ప్రళయమున
   ఓడలో జేరిన - నోవహువలె మనము సాగి పోవుదము

2. సిద్ధపరచిన పురమును - జేర వాగ్దానములను
   నమ్మి నడిచిన అబ్రహాము వలె - సాగి పోవుదము

3. ఘోరమైనయా జారత్వమునకు - దూరముగాను
   పారిపోయిన - యోసేపును బోలి సాగిపోవుదము

4. దేవుని ప్రజలతో శ్రమయే మేలని - ఐగుప్తు పాపపు
   భోగము విడిచిన మోషేవలె మనము సాగి పోవుదము

5. పరిశుద్ధాత్మతో నిండిన వాడై - దైర్యముగా వాక్యమును
   బోధించిన - పేతురు వలె మనము సాగి పోవుదము

6. పోరు సహించి సువార్త పక్షమున - పరుగు ముగించి
   పానార్పణమైన - భక్త పౌలు వలే సాగి పోవుదము

7. తేటగ దైవ సంకల్పము దెల్పుచు - రాళ్ళను రువ్వగ
   ప్రాణము విడిచిన - స్తెఫను వలె మనము సాగిపోవుదము
769 పరలోకమే నా స్వాస్థ్యముparalokame naa svaasthyamu

Galatians 2:20

పల్లవి:
పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో
నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో

1. ఆకలిదప్పులు - దుఃఖము - మనోవేదన - లేదచ్చట
   పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను

2. సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట
   ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును

3. నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును
   విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను

4. పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను
   పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును

5. ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను
   దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె
770 దైవదాసులారా మీరు దీక్షతోడdaivadaasulaaraa meeru deekshatoda
పల్లవి:
దైవదాసులారా మీరు దీక్షతోడ రారండి
ప్రభు క్రీస్తుని నిజ సేవకులారా

1. నిత్యుడగు క్రీస్తు ప్రభువు - సత్యసంఘమును గూర్చి
   యిచ్చినట్టి దర్శనమందు - కట్టబడగ రండి

2. లేవీయుల పరిచర్యల - వివరము నెరిగియుండి
   సేవకుల పరిచర్యలను- వలదను వారు ప్రబల

3. క్రీస్తుయేసు రక్తమిచ్చి - కొన్నట్టి సంఘమందు
   అపోస్తులులు అధికారమందు ప్రభువును సేవించెదము

4. దేవుని ఎదుట యోగ్యునిగాను - సిగ్గుపడనక్కరలేని
   పనివానిగా కనుపరచుకొనను - జాగ్రత్త పడవలెను

5. యిర్మియా, జెరుబ్బాబేలు - ఎజ్రా, నెహెమ్యా ల
   ధీరతన్ జూచి భీతిని వీడుము - స్తెఫను, పౌలు ల వలెను

6. వాడబారని మహిమ కిరీట - మివ్వను వచ్చుచున్న
   ప్రధాన కాపరి రాకడ దినమాయె - శ్రద్ధతో మందను కాయన్

7. సంఘ దర్శనమొందిన - నిజదైవ దాసులకై
   సహవాసమందు నేర్పిన సత్యముకై - హల్లెలూయ పాడెదం
771 యెహోవా నీ గుడారముyehovaa nee gudaaramu
పల్లవి:
యెహోవా నీ గుడారము - ప్రేమించుచున్నాను (2)
తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించెద నేను (2)

1. యెహోవా నన్ను తీర్చుము - నడచితిని న్యాయముగా (2)
   నీయందే నమ్మిక యుంచితి నేను - కావున నేను జారి పడను (2)

2. శోధించు అంతరీంద్ర్యిముల్ - పరీక్షింపుము నాహృదయం
   వాత్సల్యత నా యెదుటనుంచి - నడచుచున్నాను సత్యముతో

3. భక్తి హీనులతో సాంగత్యం - దుష్టుల సంఘ మసహ్యం
   కోరను స్నేహం నిరుపయోగులతో - వ్యర్థులతోను నేను నడువన్

4. కడిగెదను నా చేతులు - నిర్దోష జలముల యందున్
   యెహోవా నీబలిపీఠము చుట్టు - ప్రదక్షిణమును నే చేతున్

5. నీదు ఆశ్చర్య కార్యముల్ - దేవా నేను వర్ణింతును
   కృతజ్ఞతతో నా స్తుతులు చెల్లించి - ఎలుగెత్తి గీతముల్ పాడెదన్
772 యౌవనుడా సంతోషపడుమాyauvanudaa santoshapadumaa

Ecclesiastes 11:9

పల్లవి:
యౌవనుడా సంతోషపడుమా (1) - యౌవన కాలమున (2)

1. లేత వయస్సు నడి ప్రాయమును (2) - గతించిపోవునవి (2)
   గనుక నీదు హృదయములో (2) - వ్యాకులమును తొలగించుకొనుము (1)
   యువకుడా వినుము (2)

2. దుర్దినములు రాబోకముందే - వీటి యందిపుడు
   సంతోషము లేదనియెడు - సంవత్సరములు రాబోకముందే
   చెడుగును విడుమా

3. పశ్చాత్తాపమున పాపములను - ఒప్పుకొనుచు నేడే
   రక్షణార్థము రక్షకుడేసును - రయమున క్షమాపణ వేడిన
   రక్షణ నీదే

4. మన్నయినది వెనుకటివలెనే - మంటిలో కలియున్
   ఆత్మ దాని దయ చేసిన - దేవుని సన్నిధికి మరల
   వెళ్ళును యౌవనుడా
773 మనకు జీవమైయున్నmanaku jeevamaiyunna

Colossians 3:4

పల్లవి:
మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే (2)

1. దేవుని దీవెనలు పొంద (2)
   యౌవనులార యేసుని సన్నిధికి రారండి (2)
   దైవకుమారుడు పావన క్రీస్తుని జీవము పొంది నడువుడి (2)

2. యేసు నంగీకరించెడి వారి
   పేరులు జీవగ్రంథమునందు - వ్రాయబడున్
   నమ్మకమైయున్న పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి

3. దేవుని స్వరూపము కల్గిన యేసు ప్రభు
   మనుజరూపంబున జన్మించెను
   చావును గెల్చిన పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి

4. యేసు రక్తములో కడుగబడిన
   తెల్లని వస్త్రముల్ ధరియించి రారండి
   గొప్ప కృపానిధి పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి

5. క్రీస్తు యేసుని యౌవన జనమా
   ఆయనకు ప్రాణము లర్పించను నిలువుడి
   సత్యరూపియగు పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి

6. రాజుల రాజు ప్రభుల ప్రభువు
   అను పేరు ఆయన వస్త్రముపై వ్రాయబడెన్
   సర్వశక్తిగల పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి

7. ప్రభుని పిలుపు పొందియున్న
   యౌవనులార విశ్వసించి విజయము పొందుడి
   శత్రువు నోడించి యేసు నామమున - హల్లెలూయ పాట పాడుడి
774 నీ దేవుని సన్నిధిని కనబడనుnee devuni sannidhini kanabadanu

Amos 4:12

పల్లవి:
నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా (2)

1. నీ యౌవనములో - నీ హృదయమును - సంతృప్తిగా - నుండనిమ్ము (2)
   అయితే వీటిని బట్టి దేవుడు - తీర్పులోనికి - తెచ్చు నిన్ను (2)

2. దుర్దినంబులు రాకముందే - వాటిలో సంతోషము లేదని
   చెప్పుసమయము రాకమునుపే - సృష్టికర్తను స్మరియించుమా

3. నీ యౌవన జీవితమును బట్టి - తృణీకారము నొందకుమా
   ప్రభువును బోలి నడచుకొనుమా - మాదిరి కరముగా జీవించుమా

4. వినయ విధేయత కలిగి యుండి - ఒకరి నొకరు యోగ్యులుగా
   మన్నన చేయుచు పరుల కార్యముల - స్వకార్యముల వలె భావించుమా

5. ప్రేమ సంతోష సమాధానము - దీర్ఘ శాంత దయాళుత్వము
   మంచితనము సాత్వీక విశ్వాసము - కలిగి యుండి జీవించుమా

6. మేలు చేయుట యందు నీవు - విసుగక యుండుము యెల్లప్పుడు
   సహనముతో ప్రభు సేవ చేసిన - ఫలము ననుభవించెదవు

7. హల్లెలూయా పాటలు పాడుచు - ఎల్లప్పుడు ప్రభు రాకడకై
   ఉల్లమునందు సంతసించుచు - పాడుము ప్రభునకు హల్లె లూయా
775 సిలువే నీ గురిగా నడువుsiluve nee gurigaa naduvu

Matthew 14:28

పల్లవి:
సిలువే నీ గురిగా - నడువు యౌవనుడా (1)
వెనుకంజ వేయకయే - నిలువు యేసు బండపై (2)
సిలువే నీ గురిగా (1)

1. మునుగు చుండె - నీ జీవనావ దాటించు వారెవ్వరు? (2)
   యేసు ప్రభుండే - దాటించువాడు (2) - నీదు చుక్కాని యేసే (2)

2. వచ్చెను యేసు - ఈ లోకమునకు తెచ్చె నీకు రక్షణ
   అక్షయుడు తెరచె నిశ్చయముగ - మోక్షద్వారము నీకే

3. సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను
   విమోచించును విశ్వసించిన - ముక్తిని పొందెదవు

4. ప్రేమవార్త ప్రకటింప బడెను ప్రియులారా రండి నేడే
   మీ ఉల్లములకు ప్రియమైన యేసే - శాంతి నిచ్చెడి రాజు
776 మీరేమి వెదకుచున్నారు?meeremi vedakuchunnaaru?

John 1:38

పల్లవి:
మీరేమి వెదకుచున్నారు? (2)
సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే (1) - మీరేమి వెదకుచున్నారు (1)

1. నా చెడు మార్గమును విడచితిని - నీచపు జీవితమును విడచితిని (2)
   ఆయన దొరకు కాలమునందు - వేడగ క్షమియించి కడిగె నన్ను (1)

2. యెహోవా యొద్ద వరమడిగితిని - యెహోవా ప్రసన్నత చూడ
   బహుకాంక్షించి మందిరములో - ఇహమందు వసియింప గోరుదున్

3. ఆయన రాజ్యమున్ వెదకుచున్నాను - తానే సమస్తము విత్తుననె గదా
   క్రీస్తుతో లేపబడిన చింతించక - పై నున్న వాటినే నే వెదకెదను

4. దేవుని చిత్తము నే నెరుగుచును - ఆత్మచే దానిని నెర వేర్చెదను
   సీయోను పర్వతముపై నున్న - గొర్రె పిల్లను నే వెంబడించెదను

5. ప్రార్థన సహవాసమును పొంది - రొట్టెను విరుచుటలో యెడ తెగక
   దేవుని వాక్య ఖడ్గము బూని - సేవను చేతుము సంఘమునందు
777 యౌవనులారా! మీ యౌవనములోyauvanulaaraa! mee yauvanamulo

Ecclesiastes 11:9

పల్లవి:
యౌవనులారా! మీ యౌవనములో సంతసించుడి (2)
అయితే మీ పనులను బట్టి మీకు - తీర్పు కలుగును (2)

1. కీడుకై పరిగెత్తెడు మీ పాదములను (2)
   క్రీస్తే సనెడు బండపై నిలిపియుంచి (2)
   సిద్ధ మనస్సనెడు జోడు మీరు తొడుగుకొని (2)
   రక్షణ సమాచారమును ప్రచురించుడి (2)

2. అపవిత్రతతో నిండిన మీ హస్తములను
   ఆ యేసయ్య రక్తములో కడుగుకొని
   పవిత్రమైన చేతులను ప్రభువైపు చాపి
   పరిశుద్ధాలయమునందు ప్రార్థించుడి

3. నరకమున బడద్రోయ గలిగిన మీదు
   నాలుకలను భద్రముగా చేసికొనుచూ
   స్తుతియించుడి కీర్తించుడి ప్రభుయేసుని
   అతిప్రియమున మీ నాలుకలతో ఎల్లప్పుడు

4. అభ్యంతర పరచెడు మీ నేత్రములను
   ఆశ్రయ దుర్గముపై స్థిరపరచి
   మహిమాత్మతో రక్షణకర్తయగు క్రీస్తుని
   మహిమను చూచుటకు ఉపయోగించుడి

5. హితబీధను సహింపని మీ దురద చెవులను
   కల్పన కథల వైపునకు త్రిప్పకుండ
   చల్లని మెల్లని ప్రభుయేసు స్వరమును
   సత్యము వినుటకు మీ చెవులనియ్యుడి
778 దయగల యేసు ప్రభూdayagala yesu prabhoo

Philippians 3:10

పల్లవి:
దయగల యేసు ప్రభూ - నిన్ను యెరుగ కృపనిమ్ము (2)
సర్వజనము నీ పునరుత్థాన శక్తిని గ్రహియింప (2)

1. యౌవనులయందు కలిగించుము నీ భయము మరి వణకును (2)
   నీ రక్షణను కొనసాగింప జేయుము ఓ ప్రభువా ! (2)

2. నీ మాటలు వినిపించుము నీ మార్గములలో నడిపించు
   నిలుపుము నీదు సాక్షులు గాను యౌవన జనములను

3. అపవిత్రజనముల మధ్యలో నీ వాక్యమును ప్రకటింప
   కుమ్మరించుము పరిశుద్ధాత్మను యౌవనజనములపై

4. నీ సంఘమునందు నిలుచుండి నీ దర్శనము గుర్తెరిగి
   ఎల్లప్పుడునూ ఆనందింప జేయుము యౌవనులను

5. నీ మరణ పునరుత్థానములో పాలి వారినిగా జేసి
   శ్రమలయందు నిన్ను కొనియాడ జేయుము యౌవనులను

6. నీ రాకడకై తీర్చుము ప్రభువా నిర్దోషులుగ యువజనుల
   నీతి ఫలములు గల వారినిగా నింపుము మా ప్రభువా

7. ఉన్నత పిలుపును మరి గుర్తెరిగి నీ బహుమానములను పొంద
   పరుగిడనిమ్ము నీ గురియందే హల్లెలూయ పాటలతో
779 ప్రభుని సేవజేయరమ్ముprabhuni sevajeyarammu

Luke 15:22

పల్లవి:
ప్రభుని సేవ జేయరమ్ము ఓ యౌవనుడా (1)
ప్రబలజేయ ప్రభు సువార్తకిమ్ము నీ బలం (1)
శుభమునిట్టి సేవ జేయ యువ జనాళికిన్ (2)

1. యేసు క్రీస్తు సిలువపైని మరణ మాయెను -
   చేసెను పాపికి గొప్ప విడుదల (2)
   నొసగెను మానవులకు నిత్య జీవము (2)
   వాసిగ ప్రజలలో తెలియజేయవా? (2)

2. పాప వస్త్రములను తీసె ప్రభువు క్రీస్తుడు
   శాపగ్రాహి యాయెను ఓ యౌవనుడా
   కప్పెను రక్షణ వస్త్రము నీకు
   తప్పక ప్రకటింపవా గొప్ప రక్షణ?

3. పాదములకు సువార్తనే చెప్పులొసగెను
   హృదయమందు శాంతి ఆనందమొసగెను
   శోధనా బాధలెన్నో నీకు వున్ననూ
   నాథుని సువార్తను బోధపరచవా?

4. తప్పిపోయినట్టి నిన్ను కనికరించెను
   గొప్పవిందు చేసి ఉంగరమును పెట్టెను
   తప్పులన్ని మన్నించెను గొప్ప దేవుడు
   తప్పక క్షమియించవా నీ విరోధులన్?

5. పరలోకపు బహుమానము నీవు పొందను
   పరిశుద్ధుల సహవాసం నీకు శ్రేష్ఠము
   పరలోకపు పందెమందు అంతము వరకు
   పరుగెత్తవా జీవకిరీటంబు పొందను?
780 హల్లెలూయ హోసన్నాస్తుతిhallelooya hosannaastuti

Philippians 3:13

పల్లవి:
హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే (1)

1. సజీవ బలిజేసి శరీరముల్ - ప్రభుని సేవలో నీ పరుగును (2)
   నిస్వార్థముగా ప్రేమతో - ఆత్మ సత్యములతో ముగించుమా (2)

2. విశ్వాస యోగ్యులుగా నిత్యం నిలిచి - ప్రభుని ప్రేమలో స్థిరులైయుండి
   ఆశగల కన్నులతో వీక్షించుచు - ప్రభు రాక కొరకై కనిపెట్టుమా

3. పరిశుద్ధులారా మెలకువగా నుండి - ఎడతెగక ప్రార్థన చేయుడి
   ప్రయత్నించుటలో వెనుదీయక - ఆత్మ ఆసక్తిన్ కలిగి యుండుడి

4. వెనుకనున్న వాటిని మరచి - నూతన దర్శనము కలిగి
   పరలోక బహుమానము పొందుటకై - గురిని చూచుచు పరుగెత్తుడి
781 క్రీస్తు మిమ్ములను స్వతంత్రులkreestu mimmulanu svatantrula

Galatians 5:1

పల్లవి:
క్రీస్తు మిమ్ములను స్వతంత్రుల జేసె
దాస్యపు కాడికి చిక్కుకొనకు

1. నీవు ఈ లోకములో నున్నను - కాని ఈ లోకమునకు జెందవు
   లోకముతో ఏకీభవించకు లోకపు కాడికి చేరకుము

2. నీ శరీరేచ్ఛ దురాశలను సిలువపైన అంత మొందించు
   పరిశుద్ధాత్మచే నడిపింపబడి శరీర ఆశల నెరవేర్చకు

3. దేవుని వాత్సల్యమును బట్టి పరిశుద్ధముగా మీ శరీరములన్
   అనుకూల సజీవ యాగముగ అర్పించుకొనుడి ప్రభువునకే

4. మీరు క్రీస్తుతో లేపబడిన పైనున్న వాటినే వెదకుడి
   లోకమునకు మీరు మరణించి పరలోక వాటినే ప్రేమించుడి
782 ఎవరు జయించెదరోevaru jayinchedaro

Revelation 21:7

పల్లవి:
ఎవరు జయించెదరో - వారే సమస్తమును పొందెదరు

1. ఎవరు కష్ట బాధ లోర్చెదరో - పట్టువదలక ప్రభుతో నుండు వారే
   దిట్టముగా నత్యధిక విజయమును పొంది
   గట్టిగా నిలిచెదరు వారెల్లరు ప్రభులో

2. ఎవరు శోధనలను జయింతురో - జీవమకుటము వారే పొందెదరు
   పావనుడైన పరమ క్రీస్తేసు తోడ
   పరిపాలింతురు ప్రభుని దివ్య రాజ్యములో

3. ఎవరు లోకాశలను జయింతురో - వారే సైతానును ఓడింతురు
   పరిపూర్ణముగా ప్రభుని బలము గలవారై
   పరలోక స్వాస్థ్యమును పొందెదరు

4. ఎవరు క్రీస్తేసు సంబంధులో - వారే పాప మరణము జయింతురు
   ఓ మరణమా నీ ముల్లెక్కడ యనుచు
   వీక్షింతురు పరమ విభుని రాకడ కొరకై

5. ఎవరు ప్రభు సేవను చేసెదరో - వారే పొందెదరు బహుమానము
   ఓరిమి కలిగి పరుగును ముగించి
   మురిసెదరు హల్లెలూయ పాటలతో
783 మహా దేవుండు పరిశుద్ధుడగుmahaa devundu parishuddhudagu

Colossians 3:1

పల్లవి:
మహాదేవుండు - పరిశుద్ధుడగు తనయుని (2)
అర్పించెను నీపై మక్కువతో వందన మర్పించుము (2)

1. పై నున్న వాటినే వెంటాడుచు - ఇహలోక సంగతులు గమనించక (2)
   క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై (2)
   పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము (2)

2. నీ జీవము క్రీస్తుతో కూడను - దేవునిలో దాచబడియున్నది
   క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
   పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము

3. లోకాన నరబేధము పాటింపక - పరలోక దేవుని సేవించుము
   క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
   పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము

4. సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు - హల్లెలూయ స్తుతులర్పించుము
   సమస్తమాయన పేరట చేయుచు
   కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు - వందనమర్పించుము
784 స్తోత్రం స్తోత్రము దేవాది దేవాstotram stotramu devaadi devaa
పల్లవి:
స్తోత్రం - స్తోత్రము దేవాది - దేవా (2)
పాత్రలనుగా - మార్చితివి దేవుని పాత్రలనుగ (2)

1. శుద్ధీకరింప - బడిన పాత్రలు (2) - విజ్ఞాపన చేయునవి (2)
   సరిగ పుటము - వేయబడిన (2) - తగిన బలము కలిగినవి (2)

2. ఏర్పరచ బడిన పాత్రలు - విజ్ఞాపన చేయునవి
   కదలక స్థిరముగ నున్నవి - ప్రభువును పొందినవి

3. ఘనపరచ బడిన పాత్రలు - స్తుతులు చెల్లించునవి
   మరకలేని కారణమున - కొలతలో తగ్గనివి

4. ఉపయోగింప బడెడి పాత్రలు - సాక్ష్యము నిచ్చును భువిలో
   లోక శ్రమకెప్పుడు జడియనివి - దాచిన ధనముకలవి

5. సత్యముతో నిండిన పాత్రలు - తెల్లని రంగు కలవి
   స్వర్ణమువలె కాంతి కలవి - వెనుకంజ వేయనివి

6. కష్టములకు తగిన పాత్రలు - సకలము సహించునవి
   నొక్కినను వంకరకానివి - జయధ్వని చేయునవి
785 ప్రభువుకు తగినట్లుprabhuvuku taginatlu

Colossians 1:12

పల్లవి:
ప్రభువుకు తగినట్టు - పృథివిలో ప్రియుడా - పదిలముగా జీవించవా? (2)

1. ఆదామవ్వలవలె నీవు సహ - కేవలము దిగంబరివైయుండ (2)
   ఆ దేవగొర్రెపిల్ల చావొంది సిలువలో పావన వస్త్రముల నిచ్చెను (2)

2. శ్రేష్ఠబలి నిచ్చి హేబెలు - సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందె
   అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా -
   హతసాక్షిగా నీ వుండెదవా?

3. ప్రభు యడుగుజాడలను పరికించి ప్రభు - కనుకూలంబుగా నడచినచో
   హానోకువలె ఆ రెండవ మరణము - నొందక ప్రభుతో నుండెదవు

4. పరిశుద్ధమైన ప్రవర్తనలో- ప్రభు సర్వాంగ కవచముల్ కల్గి
   నీతిన్ ప్రకటించిన నోవహున్ బోలి - ఖ్యాతి సువార్తన్ చాటు మిలన్

5. మృతులను సహలేపు మహాత్మ్యుడని - తన సుతునర్పించె నబ్రాహాము
   మృతికి లోనగు నీ శరీరంబును - అతనికె బలిగా నర్పించు

6. తన తండ్రి ఖడ్గమునకు ఇస్సాకు - మౌనమున్ జూపి మరణము గోరె
   కడు శ్రమకాలములో ఖండించె ఖడ్గము - ముంగిట నీవట్లుండెదవా?

7. యెహోవా భయము నొంది యోసేపు - ఎంత వైభవ మనుభవించెనో గాంచు
   నీ జీవితంబులో దైవ భయము నొంది - అక్షయ కిరీటమున్ బొందు
786 పరమ వరుడు యేసుparama varudu yesu
పల్లవి:
పరమ వరుడు యేసు ప్రభువు రానై యున్నాడు
సిద్దపడు మేలుకొను ఆనందముతో సంధింప

1. నీవు అనుకొనని ఘడియలో మన ప్రభువు త్వరగా వచ్చును
   సిద్ధముగా నుండు వారెల్లరు - ఆనందముగా తనతో వెళ్ళెదరు

2. ఆ సయమెంతో సంతోషము - అందరి కన్నీరు తుడువబడున్
   శాంతి సమాధాన రాజ్యములో - వెయ్యేండ్లు రాజ్యము నేలెదవు

3. ఆత్మలో నజాగ్రత్తతో నుండక - మేలుకొను ఘడియ ఇదియే
   బుద్ధిలేని కన్యలను బోలి - నిద్రించుచున్న విడువబడుదువు

4. బుద్ధిగల కన్యలవలే నిగ్రహముతో దీపము ఆరిపోకుండ నుంచిన
   మన పెండ్లి కుమారుండొచ్చు వేళ - ఆనందముతో నెదురుకొందుము

5. ధన్యులు సిద్ధపడిన వారే - హల్లెలూయ - హల్లెలూయ
   నిశ్చయముగా నెత్తబడుదురు - హల్లెలూయ -హల్లెలూయ
787 ఒప్పుకొంటి ఒప్పుకొంటిoppukonti oppukonti
పల్లవి:
ఒప్పుకొంటి ఒప్పుకొంటి - నా తప్పిదములన్ని చెప్పి చెప్పి యేసుతో -
ఒప్పుకొంటి ఒప్పుకొంటి (1)

1. ఉదయముననే లేచి - గాంచితి పొగబండి
   ఏర్పరచ బడిన - వారికే తగుబండి
   అది విని చెప్పితి - వచ్చెద పాపిని
   మన్నించుమని నేను - మొరపెట్టితిని ప్రభుతో

2. సుందరమగు మంది - రమునకు నే చేర
   చూచితి మరి వింటి - బాలబాలుర మధ్య
   ఏర్పరచ బడిన వాడవేనా నీవు ?
   ఎటు చూచినను గాని - ఒకటే స్వరము వింటి

3. సత్యముగల బోధ- విప్పెను నా గాథ
   ముత్యములగు మాట - తెల్పెనా ప్రభు బాధ
   గెత్సెమనే తోటన్ - ఏడ్చిచెప్పిన మాట
   చాటించెదను ప్రభువా - ప్రకటింతు ప్రతిచోట

4. గొట్టెమందల గాచే - అడవిలో మన మోషే
   మొఱ్ఱపెట్టుచు గడిపే - సర్వము విడె మోషే
   సర్వకళాశాల జ్ఞానమెందుకు నాకు
   సర్వవ్యాప్తి దివ్యస్వరమే చాలనే మోషే
788 సంపూర్ణ జ్ఞానము కలిగిsampoorna jnyaanamu kaligi
పల్లవి:
సంపూర్ణ జ్ఞానము కలిగి - ఆత్మఫలము నందు అభివృద్ధి నొందుడి
సంపూర్ణ జ్ఞానము కలిగి (1)

1. క్రీస్తేసునందు మనకు పాప- క్షమాపణ కలిగెను (1)
   అంధకార సంబంధమైన - అధికారములనుండి విడుదలదొరికె (2)
   ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడుచుకొనుము (2)
   నీవు ప్రేమను కలిగి యుండుము. (2)

2. ప్రభు యేసు అదృష్యుండైన - దేవుని రూపము గలవాడు
   సర్వసృష్టికి కర్తయు తానే - నిన్ను నూతన సృష్టిగా జేసె
   ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడచుకొనుము
   నీవు ఎల్లప్పుడు ఆనందించుము

3. మృతులలో నుండి మొదట లేచె - యున్నవాడు యేసుప్రభు
   మనలను తండ్రి రాజ్యమునకు - వారసులుగా జేసియున్నాడు
   ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడచుకొనుము
   నీవు ఏలనిమ్ము సమాధానము

4. క్రీస్తేసునందు సర్వసంపూర్ణత - నిండి యున్నది
   సిలువ మరణము ద్వారానే మనల - తండ్రితో సమాధాన పరచే
   ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడుచుకొనుము
   నీవు దీర్గశాంతము కలిగి యుండుము

5. సమస్త సృష్ఠికి ప్రకటింప బడిన - సువార్తను విడువక
   విశ్వాసమందు నిలిచిన యెడల - నీవామహిమను పొందెదవు
   ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడచుకొనుము
   నీవు దయాళుత్వము కనుపరచుము
789 ఆట పాటల చేతaata paatala cheta
పల్లవి:
ఆట పాటల చేత - అటు ఇటు తిరిగెడి (1)
చిన్న పెద్ద పిల్లల్లారా - వేద గ్రంధమున చదవండి (1) - ఆట పాటల చేత (1)

1. సంపూర్ణ జ్ఞానమును - సకల ఆత్మఫలములును
   దైవ సత్కార్యంబులతోను - దీనులుగా నుండుడి (2)
   ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు (2)

2. ప్రేమా సంతోషమును - పరమ సమాధానముతో -
   దయాళుత్వము సాత్వీకము - దీర్ఘశాంతమును కలిగి
   ప్రభునకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెపుడు

3. మంచితనము విశ్వాసమును - మరియు సాత్వీకము కల్గి
   ఆశానిగ్రహము జ్ఞాన - సహనమును కల్గియూ
   ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు

4. సత్యమును నీతియూ - సిద్ధ మనస్సుతో నుండి -
   శ్రేష్ఠుడైన యేసుకై - సాక్షులుగా నుండుడి
   ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు

5. ప్రభుని వార్త చాటుచూ - పిల్లలారా పాడుడి -
   అన్ని వేళలందును - హల్లేలూయ పాడుడి
   ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు
790 దేవుని నిజప్రేమdevuni nijaprema

Romans 11:33

పల్లవి:
పఠించు సోదరా పరిశీలించు సోదరీ - దొరుకు నందు నిత్య జీవం (2)

1. దేవుని నిజప్రేమ పరిశుధ్ధ గ్రంథ మందున్నది (2)

2. దేవుని జ్ఞానము పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||

3. దైవ సమాధానం పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||

4. దేవుని వెలుగు పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||

5. దైవ ప్రత్యక్షత పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||

6. దైవ మహాకృప పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||

7. దేవుని వరము పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||
791 గ్రంథ వాగ్దానములన్ని నావిgrantha vaagdaanamulanni naavi
1. గ్రంథ వాగ్దానములన్ని నావి - ప్రతి అద్యాయము వరుస వచనము (1)

2. తన దివ్య ప్రేమ వాగ్దానములు - గ్రంథ వాగ్దానములన్ని నావి (1)
792 ఆశ్రేష్ఠంబౌ గ్రంథములోaashreshthambau granthamulo
1. ఆశ్రేష్ఠంబౌ - గ్రంథములో - ఎచ్చోట చూచిన - ఆదరణయున్నది -

2. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది (1) - విశ్వాసముంచి ధ్యానించుడి (2)
793 పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్pathimpa shreshthagranthamu baibil

Acts 2:42

1. పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్ - పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్

2. అనుదినము పఠించిన - ప్రేమతోడ నడుపును

3. హా ! పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్
794 ఆనందం నా కానందంaanandam naa kaanandam
1. ఆనందం నా కానందం ఆనందం పరమానందం

2. ఆత్మను శుద్ధిపర్చెను - నేత్రమువలె కాపాడును

3. ఆడుదును నే పాడుదును - వెదకి వచ్చి నన్ను రక్షించెన్
795 యేసునే స్తుతించుyesune stutinchu

Revelation 3:20

పల్లవి:
యేసునే స్తుతించు
రేపేమగునో తెలియనందున స్తుతించు

1. వచ్చె నేసు స్వర్గమునుండి - ముక్తి సందేశము దెచ్చెనేసు
   లేచి మారుమనస్సు నొందు - రక్షణ నొంది సంస్తుతించు

2. రా - యేసు రమ్మను చున్నాడు పాపిరా - నమ్ము నీకు రక్షణ నిచ్చును
   హృదయ తలుపు తట్టుచున్నాడు నీ హృదయ ద్వారము
   తెరువుము యేసు ప్రభున్ లోన రానిమ్ము స్తుతించు
796 వింతయైన యేసు రక్షకుండుvintayaina yesu rakshakundu
1. వింతయైన యేసు రక్షకుండు - తానే నిన్ను నడుపును - (3)

2. యుద్దాలన్నీ తీరి - జయమొందువరకు - నా ప్రభు నిన్ను నడుపును

3. ఓ నా ప్రియ సోదరా - భువి నుండునపుడు

4. అగత్య మేసు - నీ రక్షణకై - నిన్ను దాచు సదా

5. యుగముల బండలో - శాశ్వతబండలో నీ - కాశ్రయము
797 నాదు ప్రాణమా ప్రభున్నుతించుమాnaadu praanamaa prabhunnutinchumaa

Psalm 103:1

1. నాదు ప్రాణమా - ప్రభున్నుతించుమా

2. నా అంతరంగ సకలమా - ప్రభున్నుతించుమా

3. రాజుల రాజు - నిత్యము ప్రభుల ప్రభు - నిత్యము

4. రాజుల రాజు - నిత్యము రారాజు ప్రభుల ప్రభు

5. నాదు ప్రాణమా - ప్రభున్నుతించు

6. నా అంతరంగ సకలమా - ప్రభున్నుతించుమా
798 స్తుతి ఘనత మహిమstuti ghanata mahima
1. స్తుతి ఘనత మహిమ నీదే మహిమ నీదే మహిమ నీదే

2. స్తుతి ఘనత మహిమ నీదే - నీవే మా రాజువు

3. స్తోత్రం స్తోత్రం - శుద్ధు లారాధింతురు

4. స్తోత్రం స్తోత్రం నీవే మారాజువు

5. స్తుతి ఘనత, మహిమ నీదే - నీవే మా రాజువు
799 హల్లె లూయ ఆ ఆ ఆమెన్ హల్లె లూయhalle looya aa aa aamen halle looya
1. హల్లె లూయ ఆ ఆ - ఆమెన్ హల్లెలూయ - ఆమెన్ హల్లె లూయ - హల్లె లూయఆమెన్

2. రాజాధి రాజా - కర్తాది కర్తా - రాజ్యం బలం ఘన - మహిమయు నీదే
800 నాకానందం కారణంబిదేnaakaanandam kaaranambide
1. నాకానందం కారణంబిదే పాపభారమంత పోయెను

2. సర్వకాలము పాడుచుందును - యేసు భారమెల్ల బాపెను

3. పాప భారముచే కృంగియుంటిని

4. పాప భారము తీసి సమాధాన మిచ్చెను

5. సర్వకాలము పాడుచుందును - యేసు భారమెల్ల బాపెను
801 అద్భుత శక్తికలదు రక్తములోadbhuta shaktikaladu raktamulo
1. అద్భుత శక్తికలదు రక్తములో - గొఱ్ఱెపిల్ల రక్తములో

2. శాంతి ప్రేమానంద నిత్యజీవము - గొఱ్ఱెపిల్ల రక్తములో

3. శాంతి ప్రేమానంద నిత్య జీవము - యేసు ప్రశస్త రక్తములో
802 నీ జీవిత నావలో క్రీస్తునుnee jeevita naavalo kreestunu
1. నీ జీవితనావలో క్రీస్తును - యుంచుకొని యున్నచో

2. చిరునగవుతో సాహసించెదవు - భీకర తుఫానులలో

3. సాగి వెళ్ళుచు - సాగి వెళ్ళుచు

4. చిరునగవుతో సాహసించెదవు - భీకర తుఫానులలో
803 యేసు తీర్చె నా అప్పునంతయుyesu teerche naa appunantayu
1. యేసు తీర్చె నా - అప్పునంతయు

2. పాపడాగు లన్నియు - తానే కడిగెను
804 కృపచేత రక్షించెనుkrupacheta rakshinchenu
1. కృపచేత రక్షించెను కృపచేత రక్షించెను

2. ఇదే నా కథ స్తుతి దేవునికే - కృపచేత నన్ను రక్షించెను
805 పోయెను పోయెను పోయెనుpoyenu poyenu poyenu
1. పోయెను పోయెను పోయెను నా పాప భారమెల్ల పోయెను

2. సర్వ పాపంబులు - శుద్ధ రక్తమందును
806 యేసుని వాక్కు నిత్యము నిల్చున్yesuni vaakku nityamu nilchun

Matthew 24:35

1. యేసుని వాక్కు నిత్యము నిల్చున్

2. ఏమి మారినన్ పొల్లుపోదు భూమ్యాకాశముల్ గతించినను

3. మా రాజు పల్కు మారదు
807 నీ ధర్మ శాస్త్రములోnee dharma shaastramulo

Psalm 119:18

1. నీ ధర్మ శాస్త్రములో - ఆశ్చర్యమైనవి

2. చూచునట్లు నా - కన్నులు తెరువుము
808 ఎంత అద్భుత ధనము అనంత దైవవరముenta adbhuta dhanamu ananta daivavaramu
1. ఎంత అద్భుత ధనము అనంత దైవవరము

2. దివ్య గ్రంధము నేను కలసి యాత్ర వెళ్ళెదం
809 ఆయనాశ్చర్య కరుడుaayanaashcharya karudu
1. ఆయనాశ్చర్య కరుడు (4)
   నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును - ఆయనాశ్చర్యకరుడు (2)

2. ఆయన మహోన్నతుడు
   గద్దించును గాలిని అలలను - ఆయన మహోన్నతుడు

3. ఆయన నా ఆశ్రయము
   తన రెక్కలతో నను కప్పును - ఆయన నా ఆశ్రయము
810 పాపమున్ దుఃఖమును వెంటనే డువుమా విpaapamun duhakhamunu ventane duvumaa vi
1. పాపమున్ దుఃఖమును - వెంటనే - విడువుమా

2. యేసు వైపు చూచిన - వెంటవచ్చు ఆనందం

3. ఆనందం ఆనందం - దుఃఖమే లేదు ఆనందం

4. యేసు వైపు చూచిన - వెంటవచ్చు ఆనందం
811 దాగియుందు నీ ఆశ్రయమందున్daagiyundu nee aashrayamandun
1. దాగియుందు నీ ఆశ్రయమందున్

2. కీడు తాకని చోటులో భయమే లేదు

3. దాగియుందును కల్వరేసుని

4. క్రీస్తు పునరుత్థానములో దాగియుందును
812 దైవ ప్రేమ నిత్యముdaiva prema nityamu

Romans 5:5

1. దైవ ప్రేమ నిత్యము - కుమ్మరించుము (2)

2. కల్వరి ప్రేమ మాత్రమే - కోరుచున్నాను (2)

3. నింపి పొర్లి పారజేయుము (2)

4. దీనదాసుని ద్వారా కుమ్మరించుము (2)
813 నిత్య దేవ జీవాత్మnitya deva jeevaatma
1. నిత్య దేవ జీవాత్మ నా పై దిగుమా (2)

2. విరిగించి కరిగించి నిరూపించి నింపుము (2)

3. నిత్య దేవ జీవాత్మ నా పై దిగుమా (2)
814 బలము నిచ్చు యేసుచేbalamu nichu yesuche
పల్లవి:
చేతునెల్ల పనులను

1. బలము నిచ్చు యేసుచే (3)

2. కృపను పోయు వానిచే

3. జ్ఞానము నిచ్చు వానిచే

4. సుఖంబు నిచ్చువానిచే

5. మన్నింపు నిచ్చువానిచే

6. రక్షణ నిచ్చు వానిచే

7. నీతిని యిచ్చు వానిచే

8. ప్రేమను పోయు వానిచే
815 యెహోవా కొరకు యెదురుచూచువారుyehovaa koraku yeduruchoochuvaaru

Isaiah 40:31

1. యెహోవా కొరకు యెదురుచూచువారు - నూతన బలమును పొందుదురు

2. వారు పక్షరాజువలె రెక్కలు - చాచి పైకి ఎగురుదురు

3. అలయక పరుగెత్తుదురు - సొమ్మసిల్లక నడచిపోవుదురు
816 ఆత్మల చెంతకు నడుపుaatmala chentaku nadupu
1. ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా

2. మిత్రులు పాపములో బడిరి తమ మార్గము గానరు

3. శ్రద్ధతో కాన రెవ్వరు ప్రార్థన జేయరు

4. నా యెద జీవముతో నింపి ప్రార్థించను నేర్పుము
817 ఉజ్జీవము నిమ్ముujjeevamu nimmu
పల్లవి:
నాలో నారంభించుము

1. ఉజ్జీవము నిమ్ము

2. నీ ఆత్మతో నింపుము

3. ఈవులను ఇమ్ము

4. పూర్ణాత్మనాకిమ్ము

5. అశీర్వాద మిమ్ము

6. నాటు నాలో సిల్వన్

7. హల్లెలూయా పాడన్
818 చేతున్ అద్భుత మనెనుchetun adbhuta manenu
1. చేతున్ అద్భుత మనెను చేతున్ అద్భుత మనెను

2. ఆశించి అడిగినన్ దాని కన్న - ప్రభుఁనుతించు
819 స్తుతించు నా ప్రాణమాstutinchu naa praanamaa
1. స్తుతించు నా ప్రాణమా - మహిమ హల్లెలూయ

2. స్తుతించు నా ప్రాణమా - ప్రభును
820 మహిమ ఘనత స్తుతిmahima ghanata stuti
1. మహిమ ఘనత స్తుతి స్తోత్రము - గొర్రెపిల్లకే నిత్యము

2. యేసు క్రీస్తు మా రక్షకుడు - హల్లెలూయా - హల్లె లూయ

3. హల్లె లూయ యేసుకే
821 ఆయన నామము ఆశ్చర్యుడుaayana naamamu aashcharyudu

Isaiah 9:6

1. ఆయన నామము ఆశ్చర్యుడు ఆయన పేరాలోచనకర్త

2. బలమైన నిత్యుడునగు తండ్రి సమాధానకర్త నాయేసు

3. బలమైన నిత్యుడునగు తండ్రి ఇమ్మానుయేల్ రక్షకుడేసు
822 ఆశ్చర్య మాశ్చర్య మేసుaashcharya maashcharya mesu
1. ఆశ్చర్య మాశ్చర్య మేసు నాకు - ఆలోచన కర్తయు రక్షకుండును

2. పాప శాపముల బాపి నన్ను రక్షించెన్ - ఆశ్చర్యమే యేసునకు స్తోత్రము
823 నిన్న నేడు నిత్యకాలninna nedu nityakaala

Hebrews 13:8

1. నిన్న నేడు నిత్యకాల - మేసు మారడు

2. యెన్నడైన మారడేసు - మహిమ యేసునకు
824 ఆనందానందము మహదానందముaanandaanandamu mahadaanandamu
1. ఆనందానందము - మహదానందము

2. యేసు ప్రభునకు - జయమని పాడు

3. నాదు పాపమంతయు - తన శరీరమందు

4. ప్రేమతోడ మోసె నాదు - ప్రియుడేసు రాజు

5. నాకు బదులు మరణ మొంది - సమాధి యాయెను

6. నాకై సమాధి నుండి - మరల లేచెను

7. యేసు నావాడు - నే ప్రియుని వాడను - ఆనందానందము
825 ఆశ్చర్య ఆశ్చర్య యేసుaashcharya aashcharya yesu
1. ఆశ్చర్య - ఆశ్చర్య - యేసు - నీతో సమానులేరి!

2. ఆశ్చర్య - ఆశ్చర్య - యేసు - అత్యంత సుందరుడవు

3. ఆశ్చర్య - ఆశ్చర్య - యేసు - నిన్నెంతో ప్రేమింతును

4. సుందరులలో సుందరుడవు - నాయేసు ప్రభువా
826 హల్లెలూయా యేసుకుhallelooyaa yesuku

Matthew 14:13-21

1. హల్లెలూయా యేసుకు - కల్వరిపై మృతుడు
   హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్
   హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్

2. హల్లెలూయా యేసుకు - సమాధి చేయబడిన ||హ||

3. హల్లెలూయా యేసుకు - పునరుత్థానుండాయనే ||హ||

4. హల్లెలూయా యేసుకు - సైతానును జయించిన ||హ||

5. హల్లెలూయా యేసుకు - పరలోకమున కెక్కిన ||హ||

6. హల్లెలూయా యేసుకు విజ్ఞాపనము చేసెడు ||హ||

7. హల్లె లూయా యేసుకు - తిరిగి వచ్చు వానికి ||హ||

8. హల్లెలూయా యేసుకు - పాప పరిహారునికి ||హ||

9. హల్లెలూయా యేసుకు - మార్పులేని దేవునికి ||హ||

10. హల్లెలూయా యేసుకు - లోక రక్షకునికి ||హ||
827 సర్వజనులారా దేవుని కొనియాడుడిsarvajanulaaraa devuni koniyaadudi
1. సర్వజనులారా - దేవుని కొనియాడుడి

2. అన్య జనులారా - దేవుని స్తుతించుడి

3. ఆయా కృప - మన యెడల నత్యధికము

4. ఆయన విశ్వాస్యత - నిత్యముండు నల్లెలూయ
828 హల్లెలూయ హోసన్నాhallelooya hosannaa
1. హల్లెలూయ హోసన్నా హల్లె లూయ హోసన్నా హల్లె లూయా

2. హల్లె లూయ - హోసన్న - హల్లె లూయ - హోసన్నా

3. హల్లె లూయ - హోసన్న - హల్లె లూయ - హోసన్నా

4. హల్లె లూయ - హల్లె లూయ - హల్లె లూయ - హల్లె లూయ

5. హల్లె లూయ హల్లె లూయ హల్లె లూయ హల్లె లూయ ఆమెన్
829 నేడు మీరు కోరుకొనుడి, మీ రెవరిని సేవించెదరోnedu meeru korukonudi, mee revarini sevinchedaro

Joshua 24:15

1. నేడు మీరు కోరుకొనుడి, మీ రెవరిని సేవించెదరో

2. మేము ప్రభుని సేవించెదము, మన ప్రభుని
830 యేసుని సన్నిధి ఎంతోyesuni sannidhi ento
1. యేసుని సన్నిధి ఎంతో ఆనందం - ఎంతో ఆనందం, ఎంతో ఆనందం

2. ప్రభుయేసుని సన్నిధి ఎంతో ఆనందం, ఎంతో ఆనందం

3. పాప భారమెల్ల దొర్లిపోయెనే - దొర్లి పోయెనే దొర్లిపోయెనే

4. నా పాప భారమెల్ల దొర్లి పోయెనే, దొర్లి పోయెనే
831 తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణముtoorpuna, padamara, uttara, dakshinamu
1. తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణము - క్రీస్తు సు-వార్తతో, వెళ్ళవలె మనము

2. నల్లని, తెల్లని ప్రతిజాతి ప్రజలకు - క్రీస్తు సు-వార్తతో, వెళ్ళవలె మనము
832 నా యెదలోన్ నా యెదలోన్naa yedalon naa yedalon
1. నా యెదలోన్ నా యెదలోన్ - రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు

2. రమ్ము నేడే, వసింప రమ్ము - రమ్ము నా యెదలోన్ ప్రభు యేసు

3. నా యెదనుండి నా యెద నుండి - నా యెద నుండి ప్రకాశించుము

4. ప్రకాశించు నేడే, ప్రకాశించు సదా - నా యెదలో నుండి ప్రభు యేసు
833 నల్లనిది నా పాప హృదయంnallanidi naa paapa hrudayam
1. నల్లనిది నా పాప హృదయం - నా రక్షకుడు వచ్చు వరకు

2. తెల్ల జేసె కడిగిదాని యేసు ప్రశస్త రక్తమే

3. బంగారు వీధుల నడిచెదనని ఆయన వాక్యం తెల్పె

4. ఓ ధన్య మద్భుత దినము నా పాపం కడిగె నేసు
834 యేసు క్రీస్తు ఆయనేyesu kreestu aayane
1. యేసు క్రీస్తు ఆయనే నా సర్వ మాయనే - నే కోరు వాడాయనే నా సమస్తము

2. జ్ఞానం, శక్తి, నీతియు, నిత్య పరిశుద్ధత - నిశ్చయ పూర్ణ విమోచన సర్వమాయనే
835 ఆహా ఆహా ఇదిగో మరలaahaa aahaa idigo marala
1. ఆహా ఆహా ఇదిగో మరల వస్తిమి - ఆహా అహా బహు సంతసంబేగా

2. మనమెల్లరము యేసు ప్రేమ నేర్చుకొనుటకు - నిజమైన స్థలంబు బైబిల్ స్కూల్
836 ఐదు రొట్టెలు చేపలు రెండు ఐదు వేలకు పంచిపెట్టెన్aidu rottelu chepalu rendu aidu velaku panchipetten

Matthew 14:13-21

1. ఐదు రొట్టెలు చేపలు రెండు , ఐదువేలకు పంచిపెట్టెన్

2. పంక్తి పంక్తిగా కూర్చుండ - పంచి పెట్టిరి ప్రజలందరికి

3. పండ్రెండుగంపలు మిగిలెను - ప్రభుకు మహిమ కలిగెను
837 ఓ దేవునికి మహిమo devuniki mahima

Psalm 40:2-3

1. ఓ దేవునికి మహిమ - లేవనెత్తెను

2. నన్ను లేవనెత్తెను యేసు - తన చెయ్యిచాచి నన్ను రక్షించెను

3. ఓ దేవునికే మహిమ - యేసుని ప్రేమింతును ఎక్కువగా ప్రేమింతును

4. నే నద్దరి యొడ్డున చేరునప్పుడు ఎక్కువగా స్తుతియింతును
838 వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియున్vaaru gorrepilla raktamunu battiyun

Revelation 12:11

1. వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియున్ - తామిచ్చు సాక్ష్యమున్ బట్టియున్

2. సాతానుఁ జయించి యున్నారు గాని - మరణము వరకు తమ ప్రాణములను

3. ప్రేమించిన వారు కారు
839 మహా దేవుడవీmahaa devudavee
పల్లవి:
మహాదేవుడ వీవే (2) సర్వదర్శి - సర్వజ్ఞాని (2)
సర్వవ్యాపి- యేసు నీవే (2)

1. నీదు కార్యముల్ అద్భుతముల్ - గొప్పది నీ ఆలోచన
   నీదు సంకల్పం బలమైనది -
   సర్వ సృష్టికి కర్తవు నీవే (నీవే సర్వమందు ఉన్నవాడవు - 2)

2. గత దినములు స్మరియించగా - గొప్పది నీ విశ్వాస్యత
   మమ్ము కాపాడి సంరక్షించితివి -
   దయా కిరీటము మాకిచ్చితివి (మమ్ము ఆనందింపజేసితివి )

3. విడచితిమి ప్రత్యేకతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి
   సంఘ క్రమమును లెక్కచేయక - ఆత్మీయముగా నష్టపోతిమి
   మాదు నెపములను బాపుము - (మమ్ము క్షమించి, సరిచేయుము)

4. రానున్న దినములలో - స్థిరముగా నుండ దయచూపుము
   నన్ను నీకే అర్పించుకొందున్ -
   నీదు మాటకు లోబడెదన్ (నేడే నాతో మాట్లాడుము )

5. మహా మహిమతో వచ్చెదవు - లోకము నిన్ను చూడజాలదు
   సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము
   ఇతరులను సిద్ధపరచెదన్, (నిన్నే బహుమానముగా పొందెదన్ )
840 దేవుడు చేసిన పనియైయున్నాముdevudu chesina paniyaiyunnaamu
పల్లవి:
దేవుడు చేసిన పనియైయున్నాము (1)
క్రీస్తునందు ఆయన చేసిన పనియైయున్నాము (2)

1. ఆదాము నిబంధనను భంగము చేసిన -
   దోషము వలన మరణ దాస్యములో నుండగా (2)
   దేవుని కుమారుడు గొట్టెపిల్లయై (2)
   ప్రాణమిచ్చి ప్రాయశ్చిత్తము చేసెను (1)

2. ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి
   నిట్టూర్పులతో మూలుగు లిడుచు మొఱ్ఱపెట్టగ
   పరలోకము నుండి దిగివచ్చి దేవుడు
   విడిపించి వారిని నడిపించెను

3. అపరాధములచే పాపములచే చచ్చిన వారమై
   ఉగ్రత పాత్రులమై యుంటిమి
   దేవుడు తన మహా ప్రేమ చేత
   క్రీస్తుతో కూడ బ్రతికించెను

4. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి
   రక్తము ద్వారా అపరాధములను క్షమియించెను
   దేవుని చిత్తమయిన సంకల్పమును బట్టి
   తన స్వాస్థ్యముగా ఏర్పరచెను

5. దూరస్థులైన మనల క్రీస్తుయేసు నందు
   రక్తము వలన సమీపస్తులుగా చేసెను
   మద్యపు గోడను పడగొట్టి మనల
   ఇశ్రాయేలుతో ఏకము చేసెను

6. క్రీస్తుయేసు ముఖ్యమైన మూలరాయియై యుండగా
   అపోస్తలులు ప్రవక్తల పునాదిపై
   పరిశుద్ధాలయముగా దేవుని వాసముగా
   ఆత్మమూలముగా కట్టబడుచున్నాము

7. దేవ నీవే మా కుమ్మరివి జిగటవంటి వారము మేము
   నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి
   మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి
   మహిమ నొందుచున్న దేవ సోత్రము
841 ప్రభువైన క్రీస్తుకు - దాసులారాprabhuvaina kreestuku - daasulaaraa
పల్లవి:
ప్రభువైన క్రీస్తుకు - దాసులారా
పరిపూర్ణమనస్సుతో - ప్రభును సేవించుడి (2)

అను పల్లవి:
తన సన్నిధిలో నిలచుటకును
శ్రద్ధగాను కొలచుటకును మిమ్మును ప్రభు ఎన్నుకొనెను (2)

1. పాపము వలన గత కాలమున - సాతానునకు దాసులమై యుంటిమి (2)
   పాపక్షమాపణ క్రీస్తులో పొంది - సాతాను చెరనుండి విడుదల నొంది
   ధన్యులమైతిమి - క్రీస్తుకు - దాసులమైతిమి

2. మీ తలాంతులని వాదుడి ప్రభుకై - రెండంతలుగ వృద్ధి చేయుడి
   నమ్మకమైన నిజ దాసులుగా - తన పరిచర్య చేయుడి నిరతము
   ఘనతను పొందెదరు - మీరు - తన సన్నిధియందున

3. యెహోవానే మీరు సేవించుచుందుడి - వేరెవ్వరిని ఇక సేవించకుడి
   పొలములో పంటలు పండకయున్నను - సాలలో పశువులు లేకపోయినను
   సర్వదా సేవించుచు - మీరు - ప్రభువులో హర్షించుడి

4. సర్వము ప్రభుకై అర్పించుకొని - ఆసక్తిగా తన సేవ చేయుడి
   ఘనమైన ఈ గొప్ప భాగ్యము - గమనము చేయుడి మీ బాధ్యత ఇదే
   వ్యర్థము కానేరదు - ప్రభునందు మీ ప్రతి ప్రయాసము

5. ప్రభువు త్వరగా రానైయున్నాడు నిద్రించువారు విడువబడెదరు
   మెళకువగా నుండు దాసులైయుండి - తన చిత్తమును జరిగించుచుండుడి
   జీతము తానిచ్చును - మీకు మీ క్రియల ప్రతిఫలముగా
842 దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెనుdevudu mimmunu erparachukonenu
పల్లవి:
దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను - అశ్రద్ధ చేయకుడి (2)
తనకు పరిచర్య చేయుటకు (1) - 'మిమ్మేర్పరచుకొనెన్' (2)

1. పవిత్రమైన హృదయముతో - శుద్ధ మనస్సుతోను (2)
   దేవుని సన్నిధిలో నిలుచుంది - ధూపము వేయుటకు (2)
   'మిమ్మేర్పరచుకొనెన్'

2. అశ్రద్ధ వలన శాపము నష్టము లెన్నో పొందితిరి
   ఆసక్తితో మీరు పరిచర్య చేసి - 'దీవెనలు పొందుడి
   'దీవెనలు పొందుడి'

3. పూర్ణ మనస్సుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి
   జగత్తు పునాది వేయక ముందే - 'మిమేర్పరచుకొనెన్'
   ‘మిమ్మేర్పరచుకొనెన్'

4. క్రీస్తుకు దాసులమని యెరిగి - దేవుని చిత్తమును
   మనఃపూర్వకముగా జరిగించి - 'దేవుని ఘనపరచుడి'
   'దేవుని ఘనపరచుడి'

5. వాని వాని క్రియల చొప్పున జీతము ప్రభు ఇచ్చును
   దేవుని దృష్టికి నీతిమంతులై - 'సేవ జేయుడి'
   'సేవ జేయుడి'

6. కోతెంతో విస్తారమాయె - కోయువారు లేరు
   వాక్య ఖడ్గమును చేబూని - 'లేచి రండి నేడీ' - 'లేచి రండి నేనే'
843 దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడుdevudu manalanu erparachukonnaadu
పల్లవి:
దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు
ధూపంబు వేయుటకు - పరిచర్య చేయుటకు
అలక్ష్యము చేయకుమా - దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా (2)

1. యెరూషలేము ఎడారియాయెను - యూదా దేశము దిగంబరియాయెను
   ద్రాక్షావనములు పాడైపోయెను
   అయినను దేవుడు కృప చూపుచుండగా

2. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా - దేవుని చిత్తమును యిలలో జరిగించుచు
   చేయుడి ప్రభువుకు - యింపైన సేవ
   భయముతో వణకుతో ప్రియుడైన యేసుకు

3. ప్రతిష్ఠించుకొనుడి - మిమ్ము ఓ యాజకులారా - అపోస్తులులు - ప్రవక్తలు - ఓ పెద్దలారా
   బాగుచేసికొనుడి - మీ బలిపీఠంబులను
   తరుణమిచ్చి యుండగా - తప్పుదిద్దుకొందమా

4. వచ్చుచున్నాడేసు - బహుమానము తోడ ప్రతివాని క్రియకు - వాని జీతమిచ్చుటకు
   సిద్ధపడు జీతము - బహుమానము పొంద
   కాచుకొమ్ము నీ వంతులో నిలిచి యుండుటకు
844 ఆకాశమందు - నీవుండగaakaashamandu - neevundaga
పల్లవి:
ఆకాశమందు - నీవుండగ, నేను ఎవరికి - భయపడను
నీవీలోకములో  - నాకుండగ నేను దేనికి  - భయపడను

1. శత్రు సమూహము - నన్ను చుట్టిన, సైతానుడు సంహరింప జూసిన
   నా సహవాసిగ - నీవుండగ నేను ఎవరికి - భయపదను

2. వ్యాధులు, కరువులు - శోధనలు, బాధలు దుఃఖము - వేదనలు
   మరణము మ్రింగగ - కాంక్షించిన, నేను దేనికి - భయపడను

3. మహిమైశ్వర్యము - వైభవము, మహిమానందము - మారనివి
   నా ప్రభు క్రీస్తే - నాకుండగ, నేను ఎవరికి - భయపడను

4. నా తీర్మానము - నే చేసితి, నా ప్రభు యేసును - నమ్మితిని
   అనుభవ మిచ్చును - ఆ ప్రభువే, నేను ఎవరికి -భయపడను

5. పడిపోయిన వెను - కంజ వేయక, పశ్చాత్తాపము - పడి అడుగు
   నిన్ను క్షమించును - నీ ప్రభువే, నీవు ఎవరికి - భయపడవు
845 ఆనందము ప్రభు నాకొసగెనుaanandamu prabhu naakosagenu
పల్లవి:
ఆనందము ప్రభు నాకొసగెను - నా జీవితమే మారెను
నాయుల్లమందు యేసు వచ్చెన్ - నా జీవిత రాజాయెను (2)

1. ప్రభుని రుచించి యెరిగితిని - ఎంతో ఎంతో ప్రేమామూర్తి
   విశ్వమంతటినే గాంచలేదు - విలువైన ప్రభు ప్రేమను

2. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ - విజయము పొంద బలమొందెదన్
   ప్రభువుతో లోకము జయించెదన్ - ఆయనతో జీవించెదన్

3. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి - పైకి ఉప్పొంగి యెగయుచుండె
   నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెన్ - నూతన జీవమొసగెన్
846 ఆహా ఆనందమే - పరమానందమేaahaa aanandame - paramaanandame
పల్లవి:
ఆహా ఆనందమే - పరమానందమే - ప్రియ యేసు - నొనగే నాకు
కొలతలేనిది - బుద్ధికందనిది - ప్రేమన్ వివరింప వీలగునా?

1. నీచ ద్రోహినైన నన్ - ప్రేమతో చేర్చుకొని
   పాప ఊబి నుండి సన్ - పైకి లేవనెత్తెను

2. నలిగిన రెల్లువలే - నేను విరిగెడు సమయములో
   నాకై విజ్ఞాపన చేసి - స్థిరపరచితివి ప్రేమతో

3. కారు చీకటివేళలో కలత చెందిన నన్ను
   కాచి ఓదార్చితివే - బలమైన నీ ఆత్మతో

4. నాడు ప్రాణనాధుడా - నిన్నెప్పుడు నే గంతునో
   ఆత్మప్రియుడా నిన్ను- చూడ ఆశ నాలో కలిగెను

5. నీ ప్రేమ స్వరమున్ విని - నేను మేలుకొంటిని
   ప్రియుని రొమ్మును చేరను - నాలో వాంఛ ఉప్పొంగుచుండె
847 ఇదిగో మనుష్యుల మధ్యన దేవాది దేవుడుidigo manushyula madhyana devaadi devudu
పల్లవి:
ఇదిగో మనుష్యుల మధ్యన దేవాది దేవుడు - వాసము చేయుచుండె (2)

1. తాను కాపురముండు స్థలము - తన స్వంత ప్రజల మధ్యనే (2)
   దేవుడు తానే వారి దేవుడై యుండి
   ప్రతి బాష్ప బిందువు తుడుచున్ (2)

2. దేవుని ఆలయమాయనే - - ప్రజ్వలించు దీపము ఆయనే
   జీవ జలములతో వారి దాహమును
   తీర్చు జీవనది ఆయనే

3. పూర్ణమహిమతో నిండినది - మహా పరిశుద్ధ స్థలమదియే
   స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో
   మా పాదముల్ నిలిపెదము
848 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యాvarnimpalenu vivarimpalenu yesayyaa
పల్లవి:
వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా - నీవు నాకు చేసిన మేలు
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (4)

1. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు - పాడైపోయిన నన్ను బాగుచేసినావు
   ఏమని వర్ణింపను ఋణం ఎలా తీర్చను
   యేసయ్యా నీవు నాకు చేసిన మేలు

2. తోడులేక నీడలేక తిరుగుచున్న నన్ను- ఆదరించినావు ఓదార్చినావు
   ఏమని వర్ణింపను ఋణం ఎలా తీర్చను
   యేసయ్యా నీవు నాకు చేసిన మేలు

3. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు - ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు
   ఏమని వర్ణింపను ఋణం ఎలా తీర్చను
   యేసయ్యా నీవు నాకు చేసిన మేలు
849 నా ప్రాణ ప్రియుడాnaa praana priyudaa
పల్లవి:
నా ప్రాణ ప్రియుడా - నిన్నే స్తుతింతున్ - నా హృదియార - నిన్నే ఘనపరతున్
నా నిరీక్షణకు - ఆధారం నీవే (2) - ఎల్లకాలం నిన్నే - ఆరాధింతున్ (2)

1. పాపపాశములు నను చుట్టుముట్టి - నిత్యానాశనమునకు చేరువకాగా (2)
   పావనుడేసు నా కట్లుత్రెంచ (2) - సిలువలో బలియాయె (2)
   గొప్ప రక్షణను నాకిచ్చెనని - కొనియాడెదన్ (2)

2. నాదు జీవిత యాత్రలో నాకు - జీవపు వెలుగు నీవైతివి
   నాదు కష్టసమయంబులలో - ఆశ్రయ దుర్గమైతివి
   నాదు కాపరివై జీవమార్గములో - నడిపితివే

3. అలలు నన్ను ముంచజూచినను - బలుసు భయపడవద్దనెను
   తల్లడిల్లకుండ స్థిరపరచె నన్ను - తన సాక్షిగా నిలిపే
   సజీవయాగముగా నన్నే నీకు - అర్పించెదన్

4. తల్లిదండ్రులు నన్ను విడిచినను - • కన్నీళ్ళు నా కంట రాలినను
   కలవరపడకు అంటివి ప్రభువా - కరుణను జూపితివే
   కరములు జోడించి పూజించెద నిన్ను - నా ప్రభువా

5. నిన్ను విడువను ఎడబాయవంటివి - నీ అరచేతిలో చెక్కిన ప్రభువా
   అందరు మరిచిన మరువని దేవా - పొగడక ఎట్లుందున్
   పరిశుద్ధులందరితో హల్లెలూయ పాడుచు కీర్తింతున్
850 వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువాvevela stutulato aaraadhincheda prabhuvaa
పల్లవి:
వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా (2)
దీన మనస్సుతో - నిన్నే కొలుతునయ్యా (2)

1. నే ఘోర పాపిని - అయుండగానె
   నా కొరకై క్రీస్తు - ఈ భువికరుదెంచె
   నన్ను రక్షించుటకై సిలువలో మరణించె (2)
   తన రక్తముతో నా పాపము కడిగె (2)

2. నీ హృదయములో - కలవర పడనీయక
   నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ
   వెళ్లుచున్నాననిన - నా యేసు ప్రభువా
   వాగ్దానమును - ఇచ్చిన ప్రభువా

3. పూర్ణ హృదయముతో నిన్నారాధింతును
   పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును
   కృతజ్ఞతా స్తుతులు నీకే చెల్లింతును
   హృదయమారా నిన్నే సేవింతును
852 మానవా మరలి రా ప్రభు చెంతకు చేరవాmaanavaa marali raa prabhu chentaku cheravaa
పల్లవి:
మానవా మరలి రా ప్రభు చెంతకు చేరవా?
ప్రభు పిలిచే తరుణములోన - రక్షించు నిను నేదైనా (2)

1. హృదయములో నెమ్మది లేక - వేసారి విసిగిన బ్రతుకా
   కడసారి నిరీక్షణ ఇదియే - యేసయ్య కలువరి సిలువే

2. చుట్టుముట్టాయి వ్యాధులు వరుస దిక్కుతోచని మరణపు పడక
   కడసారి నిరీక్షణ ఇదియే - యేసయ్య కలువరి సిలువే

3. పాప భారము తోడ నిండి - పగిలి పోతున్న నీ జీవ పాత్ర
   కడసారి నిరీక్షణ ఇదియే - యేసయ్య కలువరి సిలువే

4. నా కత్తికి ఎదురులేదని - విర్రవీగి తిరుగుచునుంటే
   గర్వంబు నణచును యేసు - విరిగిన హృదయముతో తిరుగు

5. కల్వరిలో నీ కొరకేసు - రుధిరంబు చిందించినాడు
   జాలిగ పిలిచే నిను ప్రభువు - విలువైన రక్షణ నివ్వ
853 గుణాతిశయముల నే పాడెదనుgunaatishayamula ne paadedanu
పల్లవి:
గుణాతిశయముల నే పాడెదను (2)  స్తుతి ప్రశంస నే చేసెదను (2)
గుణాతిశయముల నే పాడెదను (2)

1. పాప సాగరములో నే మునుగు చుంటి
   నా కన్నీటిని నే త్రాగుచుంటి
   నాదు హృదయము బహు వ్యాకుల మొందె (2)
   ఆ సమయములో - ప్రభు నాకు దొరికె (2)
   నన్నాదరించి - తన యింట చేర్చెను (2)

2. హృదయ పాపములన్ని - కడిగె రక్తముతో
   నిత్య రాజ్యమునకు - పాలివానిగా జేసె
   శాంతి ఆనందముతో - ప్రభు నన్ను నింపెను
   నిత్య జీవ వరము - నాకనుగ్రహించెను
   తన చెంతకు నన్ను - చేర్చెను ప్రభువు

3. తిరిగి లేచి ప్రభు - వెళ్లెను పరముకు
   సిద్ధపరచుచుండె - నాకై స్థలమును
   నన్నుకొని పోవ - ప్రభు తిరిగి వచ్చును
   విడిపించును నన్ను - ప్రతి దుఃఖము నుండి
   ఈ నిరీక్షణతో - జీవించుచున్నాను
854 భూదిగంతముల నివాసులారాbhoodigantamula nivaasulaaraa
పల్లవి:
భూదిగంతముల నివాసులారా - నా వైపు చూచి రక్షణ పొందుడి
యిదియే దేవుని ఆహ్వానము - యిదియే దేవుని రక్షణ పిలుపు

1. వినిరి అనేకులు ఆ పిలుపును -
   లోబడిరి వారు ఆ పిలుపునకు (2)
   యేసుని వైపు చూచిరి వారు (2)
   రక్షణనొంది ఆనందించిరి

2. శతృవు దాడికి ఎదిరించి నిలిచిరి -
   ప్రార్ధన ద్వారా పోరాడి గెలిచిరి
   యేసుని వైపు చూచుచుసాగిరి
   ఆత్మతో సత్యముతో ఆరాధించిరి

3. సుళువుగా చిక్కులు బెట్టు పాపమును విడువుడి -
   సిలువను సహించి సాక్షులైయుండుడి
   విశ్వాసమునకు కర్తయు దాని
   కొనసాగించెడు యేసుని చూడుడి

4. పరిశుద్ధత మీద మీరు - మిమ్మును కట్టుకొనుడి -
   పరిశుద్ధాత్మతో ప్రార్ధన చేయుడి
   నిత్య జీవార్ధమైన కనికరమునకై
   యేసుని కొరకు కనిపెట్టు చుందుడి

5. దేవుడను నేనే యనె - వేరెవ్వరు లేరనెను -
   నీతిమంతుడును - రక్షించు వాడును
   యుగయుగములకు-మహిమ ఘనత
   ప్రభావమాయనకే కలుగును గాక
855 నమ్మదగిన మా దేవా పరిశుద్ధుడాnammadagina maa devaa parishuddhudaa
పల్లవి:
నమ్మదగిన మా దేవా -  పరిశుద్ధుడా, నీతిమంతుడా (2)
మహామహిమలో వసియించెడు - మహిమగల మహారాజా (2)

1. మా పాపములను మే మొప్పుకొనగా -
   క్షమియించితివి నమ్మదగినవాడవై (2)
   నీ రక్తముతో ప్రతిపాపమును (2) - కడిగి శుద్ధులుగా చేసిన దేవా (2)
   నిన్ను మేము పూజింతుము (2)

2. వాగ్దానములిచ్చి నెరవేర్చువాడు - నమ్మకమైన సత్యసాక్షినై
   ఆదియు అంతములేనివాడా - మృతుడై సజీవుడుగా లేచినవాడా
   నిన్ను మేము కీర్తింతుము

3. శత్రువు మాపై చెలరేగుచుండగా - అండగా నుండి మమ్మాదుకొంటివే
   నీ నమ్మకత్వము మేమెన్న తరమా - మాటతప్పని మహోపకారీ
   నిన్ను మేమారాధింతుము

4. గాలి తుఫానుల కల్లోలములతో- మా నావ అలలచే అల్లాడుచుండగా
   గాలి తుఫానులు గద్దించితివే - మము దరిచేర్చిన మహానుభావా
   నిన్ను మేము స్తుతియింతుము

5. పది దినములు శ్రమ కలుగునంటివి - నమ్మకముగ నుండు మరణము వరకని
   జీవకిరీటము నిచ్చెదననిన - మొదటివాడవు కడపటివాడా
   నిన్ను మేము ఘనపరతుము

6. పిలిచితివి మమ్ము నీ కుమారుని - సహవాసమునకు నమ్మదగినవాడవై
   పరిశుద్ధమైన పరలోక పిలుపుతో - నీ విశ్వాస్యత బుద్ధి కందదే
   వందనములు చెల్లింతుము

7. వచ్చుచున్నవాడు నమ్మకమైన - సత్యవంతుడను నామము గలవాడు
   దేవుని వాక్యమును నామము గలవాడు - రాజులరాజు ప్రభువుల ప్రభువు
   హల్లెలూయ (అమేన్ (2)
856 యేసు క్రీస్తు దేవుని శక్తియుyesu kreestu devuni shaktiyu
పల్లవి:
యేసు క్రీస్తు దేవుని శక్తియు - జ్ఞానమునైయున్నాడు (2)

1. సిలువ వార్త నశించువారికి - వెర్రితనము-గా నున్నది (2)
   రక్షింపబడువారికి - అది దేవుని శక్తి (2) నమ్మువారిని రక్షించుట (2)
   దేవుని దయా - సంకల్పమాయెను (2)

2. మనలా రక్షింప - అనాది నుండి - దేవుని సంకల్పమైయున్నది
   తన కుమారుని - అర్పించే దేవుడు - ఆయనే మనకు జ్ఞానము నీతి
   పరిశుద్ధత విమోచనమాయెను

3. మన విశ్వాసమునకు - దేవుని శక్తిని - ఆధారముగా చేసికొనుడి
   మానవ జ్ఞానము విడిచిపెట్టుడి - పరిశుద్ధాత్మతో - దేవుని శక్తిని
   దేవుని పనిలో వినియోగించుడి

4. దేవుడు మనలను - తన సంఘములో - జతపనివారుగాను చేసె
   పనివాడు కష్టము కొలది - జీతము పొందును
   మనము దేవుని వ్యవసాయమును
   దేవుని గృహమునై యున్నాము

5. దేహము దేవుని వలన - అనుగ్రహింపబడి - పరిశుద్ధాత్మకు ఆలయమాయెను
   మీరు మీ సొత్తుకారు - విలువపెట్టి కొనబడినారు
   మీ దేహములతో - దేవుని మహిమపర్చి
   రాకడ కొరకు కనిపెట్టుచుండుడి
857 విజయులం - ఘన విజయులంvijayulam - ghana vijayulam
పల్లవి:
విజయులం - ఘన విజయులం   (2)
క్రీస్తేసు ప్రభువులో అత్యధిక విజయులం (2)

1. పరమును వీడి ధరకేతెంచి - మరణించితివి కలువరి సిలువలో (2)
   నీతి మంతులుగా మము తీర్చితివి (2) నూతన జీవము మాకిచ్చినందున

2. మరణ బలము నుండి విడిపించితివి - మరణ భయములను తొలగించితివి
   మరణము గెల్చి తిరిగి లేచితివి - సమాధి నిన్ను గెలువకపోయెను

3. శత్రు సైతానును ఓడించి - నీ సంఘమును నిర్మించితివి
   పాతాళ ద్వారముల్ నిలువకుండా - నీ సంఘమును కాపాడుచుంటివి

4. గొల్యాతు లెందరో హేళన చేసిరి - బబులోను రాజులు పైపైకి లేచిరి
   కనానీయులు కత్తులు దూసిన - యెరూషలేమును కాయుచున్న దేవా

5. శ్రమయు బాధ హింస యైనను - కరువు వస్త్ర హీనత యైనను
   ఉపద్రవమైనను ఖడ్గమైనను - యెడ బాపునా మమ్ము యేసు ప్రేమ నుండి

6. లోకము శరీరము దాడి చేయుచుండగా - లోకమున్ జయించిన విజయశాలివి
   లోకస్థులపై విజయము నిచ్చి - విజయ విశ్వాసులుగా చేసిన దేవా

7. మహా గొప్ప మహిమతో మరల వచ్చెదవు - శత్రువు సేనలు కలవరపడగా
   నీ రాజ్యమును భువిపై నిలిపి - మమ్మేలు దేవా యుగా యుగములు
858 పొందుచున్నాము - అత్యధిక విజయముponduchunnaamu - atyadhika vijayamu
పల్లవి:
పొందుచున్నాము - అత్యధిక విజయము
మనలను ప్రేమించిన  - యేసుని ద్వారా

1. మనలను ప్రేమించి ప్రాణమిచ్చెను - మృతిని గెల్చి తిరిగిలేచెను -(2)
   శత్రువునోడించి విజయమిచ్చెను (2)
   పాపము క్షమించి రక్షించుటచే

2. వాక్యము ద్వారా బలపరచెను - విశ్వాసములో స్థిరపరచెను
   శరీరము పాపముపై జయముపొంది
   తన స్వరూపమునకు మార్చబడుటచే

3. పరిశుద్ధులగుటకు మనల పిలిచి - తన ఆత్మ ద్వారా నడిపించెను
   దేవుని పిల్లలమని సాక్షమిచ్చెను
   క్రీస్తులో మహిమ పరచబడుటకు

4. దేవుని ఇంటిగ కట్టబడుచున్నాము - సహవాసములో నిలిచి యుండి
   సోదర ప్రేమలో వినయ మనస్కులై
   ఆశీర్వాదమునకు వారసులమవుటకు

5. మన పతనములు పాపములబట్టి - యింటి గోడలు బీటలు వారెను
   మన అతిక్రమమును ఒప్పుకొందుము
   లోకము నుండి వేరైన వారమై

6. మన ప్రభు యేసు వచ్చుచుండగా - త్వరగా రమ్మని ఎదురు చూతము
   శత్రువును ధైర్యముతో ఎదుర్కొనెదము
   వినయ విధేయత కలిగియుండి

7. సిద్ధపడుడి దైవ జనమా - బుద్ధి కలిగిన కన్యకల వలె
   సిద్దెలలోన నూనెను గలిగి
   మెలకువ కలిగి సిద్ధపాటుతో
859 ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యముprabhu yesukreestu aishvaryamu
పల్లవి:
ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము - శోధింప శక్యముగానిది
యుగ యుగముల నుండి - తరతరములనుండి - (2)
మరుగైయున్నట్టి   మర్మము - (2)

1. దేవుని కృపామహాదైశ్వర్యమే - పాపక్షమాపణ మనకిచ్చెను
   ఆయన దయాసంకల్పమే - మనలను స్వాస్థ్యముగా చేసెను
   హల్లెలూయా - హల్లెలూయా- హల్లెలూయా - హల్లెలూయా

2. ఐశ్వర్య వంతుడు మనయేసు - దరిద్రుడాయెను మనకొరకే
   రిక్తునిగా తన్ను చేసికొనన్ - పరమును వీడి నరుడాయెను
   హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా

3. అల్పులము మనలను ప్రేమించెను - సంఘములో అంగములగాజేసెను
   నీ ప్రేమ ఐశ్వర్యమంత గొప్పది - వివరింప మాకు బుద్ధిచాలదే
   హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా

4. ఒక్కప్రభువే అందరికి ప్రభువై - తనను ప్రార్ధించు వారందరికీ
   యూదులని గ్రీకులని భేదములేక - ఐశ్వర్యవంతుడు కృపచూపను
   హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా

5. దరిద్రులముగా నెంచబడితిమి - లోకమునకైశ్వర్యమిచ్చు చుంటిమి
   యేమియులేని వారమైనను - సమస్తమును కలిగియున్న వారము
   హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా

6. చిక్కులన్ని తొలగించి దరిచేర్చి - ఒక్కటిగా సంఘమును సమకూర్చి
   దిక్కుగా నుండి కాపాడుచుంటివి - మ్రొక్కుబడి చెల్లించి ఆరాధింతుము
   హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా

7. వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు - ఐశ్వర్యజ్ఞాన బలములాయనకే
   మహిమ ఘనత స్తుతిస్తోత్రముల్ - యుగయుగములాయనకే హల్లెలూయ
   హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
860 ఇదిగో ఈ మనుష్యుడుidigo ee manushyudu
పల్లవి:
ఇదిగో ఈ మనుష్యుడు - దేవుని కుమారుడు
పరము నుండి ధరణికి - నరుడై అరుదెంచిన
పరిశుద్ధ దేవుడు - హల్లెలూయ - శ్రీయేసునాధుడు

1. ఆద్యంత రహితుడు అల్ఫా ..... ఓమేగా తానే
   ఆదిసంభూతుడు - అసమానుండైన క్రీస్తు -
   సర్వలోకమునకై గొర్రెపిల్లగ బలియై -
   మృతుల నుండి లేచిన సజీవుడు

2. భూమ్యాకాశముల కర్త - భూజనుల రక్షణకర్త
   సర్వసృష్టి కర్త - సమాధాన కర్త -
   పాపవిముక్తికై - రక్తము చిందింప
   అభిషిక్తుడైన క్రీస్తేసుడు

3. ఈ ప్రభువే స్తోత్రార్హుడు - ఆరాధనకు పాత్రుడు
   రాజుల రాజు యేసు - ఎబినేజరై యున్నాడు
   నజరేయుండగు యేసు - విజయుండైలేచెను
   నిజరక్షకుండని భజియింతుము

4. తండ్రి మహిమను విడచెను - మరణ పధమున నడిచెను
   శ్రీమంతుడైన ప్రభువు - మనకై దరిద్రుడాయెన్
   మారుమనస్సు పొంద - కనికరమున మన్నించి
   నీతిగతీర్చిన ప్రేమామయుడు

5. రారాజై రానున్నాడు - యుగయుగముల రాజ్యమేలన్
   న్యాయాధిపతిగ వచ్చున్ - అందరికీ తీర్పు తీర్చన్
   ఇహపరములకు - ఘనతమహిమలకు
   ప్రభువుల ప్రభువనుచు ప్రణుతింతుము
861 ఆర్భాటముతోను ప్రభావముతోనుaarbhaatamutonu prabhaavamutonu
పల్లవి:
ఆర్భాటముతోను ప్రభావముతోను -  మేఘారూడుడై యేసు వేగమే రానుండే

అను పల్లవి:
మేల్కొనుమా ప్రియ సంఘమా - సిద్ధపడుమా పరిశుద్ధ జనమా (2)

1. పాపముల క్షమియించి శుద్ధి చేసెను - పరలోక పౌరులుగా మనల జేసెను (2)
   సువార్తను ప్రకటింప ఆజ్ఞ యిచ్చెను -
   సంఘమును కట్టుమని సెలవిచ్చెను (2)

2. స్థలమును సిద్ధపరచ వెళ్లెను యేసు - తానుండు స్థలములో మనముండునట్లుగా
   హృదయమును కలవరపడనియ్యకు
   యేసునియందు విశ్వాసముంచుమా

3. పడిపోయిరి మా బలాఢ్యు లెందరో - ఇశ్రాయేలు నీ సుందర పర్వతముపై
   మంచైననూ, వానైన కురువదింకనూ
   పర్వతములన్నియూ పాడైపోయెను

4. యెట్లు వెళ్ళేనో యేసు అట్లే వచ్చును - ప్రతి నేత్రము ఆయనను చూచును
   భూజనంబులెల్ల రొమ్ము కొట్టుకొందురు -
   సిగ్గుతో ముఖములెల్ల తెల్లబారును

5. ఆయన ప్రత్యక్షత నపేక్షించుమా - పానార్పణముగా పోయబడుదుమా
   నిందలను శ్రమలను సహియింతుమా -
   నీతికిరీటము పొంద పోరాడుదమా
863 పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలముparishuddha sthalamu ati parishuddha sthalamu
పల్లవి:
పరిశుద్ధ స్థలము - అతి పరిశుద్ధ స్థలము (2) దేవాదిదేవుడున్నట్టి  స్థలము (2)
అతి పరిశుద్ధంబైన పరలోకము (2)

1. ప్రభు యేసు వచ్చెను ఆ స్థలమునుండియే -
   స్థలము లేనివాడుగా ఈ భువిపై నుండెను (2)
   ప్రాణము నర్పించెను కలువరి కొండపై (2)
   శత్రు గర్వమణచను సజీవుడై లేచెను (2)

2. ప్రభుయేసు వెళ్లెనటకు స్థలము సిద్ధపరచను -
   ఆయనుండు స్థలములో మనముండవలెనని
   శోధన వేదన భాద లేని స్థలమది
   ఆ స్థలమునకెళ్లుటకు ప్రయాసపడుదమా

3. అబ్రహాము చూచెను ఆ స్థలమును -
   మోషే చూచి వచ్చెను దాని వైభవంబును
   హానోకు ఏలీయాలు వెళ్లిరి అటకు
   పౌలు చూచి వచ్చెనా మహిమకర స్థలమును

4. సూర్యచంద్రులక్కర లేని స్థలము అది -
   పాపము చీకటి చొరని శుద్ధ స్థలమది
   గొర్రెపిల్ల దీపమై వెలుగునిచ్చు నచట
   జయశాలులెల్లరూ సంచరింతురచట

5. జీవవృక్షఫలములు దొరకునట్టి స్థలమది -
   జీవనది పారుచుండు నెల్లవేళలా
   నిశేధించ బడినవారు చొరని స్థలమది
   నిత్యజీవమొందువారే ప్రవేశింతురందున

6. పండ్రెండు పునాదుల పట్టణము అది -
   పండ్రెండు ముత్యములతో కట్టబడినది
   పండ్రెండు గుమ్మముల ప్రాంగణమది
   హల్లెలూయ పాడుచూ ఆరాధింతుమచట
864 క్రీస్తేసు ప్రభుని విశ్వాసులముగాkreestesu prabhuni vishvaasulamugaa
పల్లవి:
క్రీస్తేసు ప్రభుని విశ్వాసులముగా -
కడముట్టించెదము ఈ జీవితయాత్ర (2)
తానుండు చోటనే మనముండెదము (2)
ఇదియే మన మహిమ నిరీక్షణ (2)

1. తానే మార్గం, సత్యం జీవమును -
   తన ద్వారానే పరదైసును చేరెదము (2)
   పరమునకు వెళ్లినాడు మన స్థలము సిద్ధపరచ
   రానైయున్నాడు మరల మనల కొనిపోవుటకు (2)

2. విడువడు మనల అనాథలనుగ నెప్పుడు -
   మనలో ఉండి మనతో నివసించును
   పాటింతుము ఆజ్ఞలు ప్రేమింతుము తండ్రిని
   ప్రభువును ఎదుర్కొన సిద్ధముగా నుండెదం

3. ప్రభురాకడ సమయం సమీపించుచున్నది
   ప్రొద్దుగ్రుంకు వేళనో అర్థరాత్రి వేళనో
   తెల్లవారు జామునో ఎరుగరు ఎవ్వరు
   జాగురుకులమైయుండి మేల్కోని ప్రార్థింతుము

4. ప్రభువేతెంచును ప్రభావముతో మహిమతో
   మేఘారూఢుడై వచ్చుట చూచెదము
   తన ప్రత్యక్షత అపేక్షించు వారికి
   అనుగ్రహించును నీతికీరీటము

5. ఎంత గొప్ప భాగ్యము ఆ పరమ నివాసము-
   నిత్యమైన మహిమలో దైవ సహవాసము
   వెలలేని క్రయమిచ్చి వారసులుగా జేసితివి
   చెల్లింతుము ప్రభు కృతజ్ఞతాస్తోత్రములు
865 అర్పింతు ప్రభువా నా జీవితంarpintu prabhuvaa naa jeevitam
పల్లవి:
అర్పింతు ప్రభువా నా జీవితం - సామర్థ్యము గల నీ చేతిలో
నిన్ను మహిమ పరచ అర్హపాత్రగా చేయుము నన్ (2)

1. నే మట్టిని నీవు కుమ్మరివి - నీ సామర్థ్య హస్తముతో లేపు (2)
   అయోగ్యతలన్నీ తొలగించి - నీ కోర్కె చొప్పున నన్ను చేయు
   నిన్ను మహిమపరచ గోరితిన్ ప్రభువా,
   యోగ్య పాత్రగ చేయుము నన్ (2)

2. నే నిష్ఫల అంజూరపు చెట్టున్ - నా చుట్టూ కంచెను కోల్పోతిన్
   కానరాలేదు ఫలమేమి నాలో - వ్యర్థపరచితిని భూమిన్
   నా చుట్టూ త్రవ్వి ఎరువేయుము ప్రభువా,
   ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము

3. నే అణచబడిన చిన్న చెట్టున్ - ముండ్ల పొదల మధ్య పడితిన్
   ధనసుఖ ఆశల ద్వారా - అణచబడితిని నేను
   నానుండి ముండ్లను తీయుము ప్రభువా,
   నూరంతలుగా నే ఫలియింప

4. నా యెడల శాంతము చూపితివి - మరి యొక్క వత్సరమిచ్చితివి
   తోట మాలిగా నాకై వేడితివి - తప్పించితివి తీర్పునుండి
   వ్యర్థతీగెలను నరికి వేయు ప్రభువా,
   నే ఫలియించి నిను ఘనపరచ
866 నమ్మదగిన దేవా - నిన్న నేడు నిరతముnammadagina devaa - ninna nedu niratamu
పల్లవి:
నమ్మదగిన దేవా - నిన్న నేడు నిరతము (2)
ఏకరీతిగ నున్న నిన్ను నేను కొలుతును (2)
స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా (2)

1. వ్యాధి బాధలు కలిగిన - విడువవు నన్నెన్నడు
   శ్రమయు శోధన వచ్చిన - విడువవు నన్నెన్నడు
   ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు
   ఎన్నడు విడువవు

2. నా తల్లిదండ్రులు విడచిన - విడువవు నన్నెన్నడు
   బంధుమిత్రులు ద్వేషించిన - విడువవు నన్నెన్నడు
   శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించి నా ప్రభు
   విడువక కృప చూపెదవు

3. నా కొరకై తిరిగి వచ్చెదవు - అనాధగా నన్ను విడువవు
   నేను నీతో వుండుటకై మహిమ రాజ్యములో చేర్చెదవు
   రాజుగా చేసెదవు
867 దేవుని ఆశ్చర్యకార్యములను అందరు చూడరండిdevuni aashcharyakaaryamulanu andaru choodarandi
పల్లవి:
దేవుని ఆశ్చర్యకార్యములను అందరు చూడరండి - కీర్తింతుము రండి (2)

1. ఆశ్చర్యపడిరి ఎంతో - లేచిన ప్రభువున్ చూచి
   ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి

2. ఆశ్చర్య మాటలు పల్కెన్ - అనేకుల కాశ్చర్యమాయెన్
   ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి

3. ఆశర్య జ్ఞానమునిచ్చున్ - ఆలోచన శక్తియునిచ్చున్
   ఆయనన్ ఘనపరిచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి

4. ఆశ్చర్యపడిరి ఎంతో - లేచిన ప్రభువున్ చూచి
   ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి

5. శ్రమనొంది సిలువపై - మౌనము వహించెనేసు
   ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి

6. క్రీస్తుకై శ్రమనొందుచు - సహించుము అన్నిటిని
   ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి

7. ఆశ్చర్యకరుడు పిల్చెన్ - ఆలకించి రమ్ము వేగమే
   అద్భుతములను - అనుభవించి పాడుము హల్లెలూయా